Jaya Lakshmi
-
‘బస్తీ’... దొరసాని
చెత్తను సేకరించే అమ్మాయి అధికారిణి అయితే... కలలను నిజం చేసుకోవడానికి స్థాయి అక్కర్లేదు అని చూపుతోంది హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పిల్లిగుడిసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ హోదాలో ఇటీవల ఒక రోజు బాధ్యతలు నిర్వహించి, వివిధ శాఖలను సందర్శించి, అక్కడి పనితీరును అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా అందుకున్న గౌరవాన్నే కాదు, తెలుసుకున్న విశేషాల గురించీ పంచుకుంది.‘‘మూడు సంవత్సరాల నుంచి ఈ పోటీలో ఎంపిక కావడానికి ప్రయత్నిస్తున్నాను. 2021లో రన్నరప్ వచ్చింది. ఈ ఏడాది ఒక రోజు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌కి ఎంపికయ్యాను అని తెలిసి, చాలా ఆనందించాను.రోజంతా కార్యక్రమాలతో బిజీ...ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నేను సూట్ వేసుకొని అధికారిణిగా మా బస్తీ నుంచి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సర్‌తో కలిసి బయల్దేరాను. మొదటగా రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసును సందర్శించాం. అక్కడ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ నీరజ జొన్నలగడ్డ గారితో మాట్లాడాను. రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసు మొత్తం తిప్పి చూపించారు. అక్కడ జరిగే వర్క్ గురించి అంతా తెలుసుకున్నాను. అక్కణ్ణుంచి... మై ఛాయిస్ ఫౌండేషన్‌కు వెళ్లాం. గృహహింస, ట్రాఫికింగ్ పైన ఆ సంస్థ పనిచేస్తుంది. పది రాష్ట్రాల్లో వారు చేస్తున్న పని గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత వి–హబ్ కి వెళ్లాం. తెలంగాణ మహిళలు వ్యాపారులుగా ఎదిగేందుకు మద్దతునిస్తున్నారు. వాళ్లు ఏ విధంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకెళుతున్నారో చెప్పారు. నా గురించి, నా ఫ్యూచర్ ΄్లాన్స్ గురించి వాళ్లూ అడిగారు. ఉమెన్ స్టార్టప్స్ గురించి అడిగి తెలుసుకున్నాను. వారితో కలిసి లంచ్ చేశాం. మంచి ఇంటరాక్టివ్ సెషన్ మా మధ్య జరిగింది. అక్కణ్ణుంచి.. డజన్ ఫౌండేషన్‌కి వెళ్లి, మహిళా ఉద్యోగులతో చర్చలు జరిపాం. టెక్ రంగంలో మహిళల నైట్ షిప్ట్‌లు, పేమెంట్ విషయంలో జెండర్ బయాస్డ్ సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాను. ఆ తర్వాత సీనియర్ సిటిజెన్స్ కోసం పనిచేసే ఫాతిమా ఫౌండేషన్‌ను సందర్శించాం.చెత్త సేకరణ మా వృత్తిమా అమ్మానాన్నలతో పాటు కలిసి మేం హైదరాబాద్‌లో 400 ఇళ్లలో చెత్త సేకరిస్తుంటాం. ఉదయం 5 గంటలకు మా పని మొదలవుతుంది. 7–8 గంటల వరకు పని ముగించుకొని, కాలేజీకి వెళతాను. స్కూల్ రోజుల నుంచి అమ్మానాన్నలతో పాటు నేను, మా చెల్లెలు, అన్నయ్య కూడా ఇదే పనిలో ఉంటున్నాం. 8వ తరగతిలో ఉన్నప్పుడు మౌంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ చిల్డ్రన్ పార్లమెంట్ అనేప్రోగ్రామ్ పెట్టింది. పది బస్తీల నుంచి పిల్లలను తీసుకొని ఈప్రోగ్రామ్ చేసేది. నేను అందులో పాల్గొన్నాను. 9వ తరగతిలో హైదరాబాద్ చిల్డ్రన్ పార్లమెంట్‌కు పీఎమ్‌గా ఉన్నాను. మా బస్తీ పిల్లలందరం సమస్యల మీద మాట్లాడుకుని అధికారులను కలిసేవాళ్లం. టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు సాయంకాలాలు మా బస్తీలో ఉన్న ముప్పై మంది పిల్లలకు పాఠాలు చెబుతుండేదాన్ని. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్‌గా పనిచేశాను.ఆకలి విలువ.. నిద్ర విలువమా కమ్యూనిటీలో పిల్లలు ఉదయం టిఫిన్ చేయకుండానే స్కూళ్లకు వెళ్లిపోతుంటారు. మా చిన్నప్పటి నుంచి ఆకలి విలువ, నిద్ర విలువ మాకు తెలుసు. అందుకే, అధికారులను కలిసి విషయం చెబితే బస్తీల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఐఏఎస్ దివ్యా దేవరాజన్ మేడమ్ నాకు ఎన్నో విషయాల్లో అడ్వైజ్ చేస్తుంటారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గురించి అలాగే నాకు తెలిసింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు డిప్యూటీ హై కమిషన్ 2017 నుంచి ఏటా పోటీలు నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పోటీల్లో ఈ ఏడాది నేను విజేతగా నిలిచాను. అంతకు ముందు ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకున్నాను. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో నేనొకరిని. ఇందులో భాగంగా జూన్ 2023లో అమెరికా వెళ్లి వచ్చాను. ఈ ఏడాది మహిళా శక్తి పురస్కారం కూడా అందుకున్నాను. నేను పుట్టి పెరిగింది గార్బేజ్ కమ్యూనిటీలో. అలాంటిది ఉదయం నుంచి డిస్కవర్ వెహికల్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ ఓవెన్ సర్‌తో కలిసి ప్రయాణించడం సాధారణ విషయం కాదనిపించింది. యుపీఎస్సీ సాధించి, ఆఫీసర్ హోదాను పొందితే ఇంకా ఎన్నో మంచి పనులు చేయచ్చు. దానికి ముందు పై అధికారులు ఎలా ఉంటారు.. ఎలా వర్క్ చేస్తారు అనేవి స్వయంగా కలిసి తెలుసుకున్నాను అనిపించింది. మా కమ్యూనిటీని అభివృద్ధి చేసేంతగా ఎదగాలన్నది నా లక్ష్యం’’ అని వివరించింది జయలక్ష్మి. నా పనిని నేను ప్రేమిస్తాను..చెత్త సేకరిస్తామని ‘ఆ వాసన ను ఎలా భరిస్తావు’ అని మా క్లాస్మేట్స్ కొందరు అడిగేవారు. చాలా వరకు జాలి చూపేవారు. కానీ నేను మా పనిని ప్రేమిస్తాను. అమ్మా నాన్నా మా చిన్నప్పటి నుంచి అదే చెప్పేవారు. నాకు మద్దతుగా నిలిచే ఫ్రెండ్స్ ఉన్నారు. లెక్చరర్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. అమ్మకి నా పట్టుదల, నేను చేస్తున్న పనులంటే చాలా ఇష్టం. అన్నయ్య డిగ్రీ పూర్తయ్యింది, చెల్లి డిగ్రీ చేస్తోంది. అమ్మానాన్నలను చూసుకునేలా, మా కమ్యూనిటీని బాగు చేసేలా ఉన్నత జీవితాల్లో స్థిరపడాలన్నదే మా కల. – అరిపిన జయలక్ష్మిమాటల్లో వర్ణించలేనుమా కమ్యూనిటీ, నేనుండే బస్తీ వాతావరణం వేరు. అలాంటిది, ఒక రోజంతా ఆఫీసర్‌గా ఉండటం అనేది నాకు దక్కిన అరుదైన అవకాశం. ఉదయం నుంచి డిస్కవరీ వెహికిల్‌లో కూర్చొని రోజంతా పెద్ద పెద్ద అధికారులతో చర్చిస్తూ తిరగడం, నా జీవితంలో ఓ గొప్ప రోజు. మాటల్లో వర్ణించలేను. బ్రిటిష్ హై కమిషనర్ మా బస్తీకి వచ్చి, నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూశారు. మా బస్తీవాసులతో మాట్లాడారు. వాళ్లందరి సమక్షంలో నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అశ్రునయనాల మధ్య ముగిసిన జయలక్ష్మి అంత్యక్రియలు
దివంగత దర్శకుడు కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. విశ్వనాథ్ రెండో కొడుకు రవీంద్ర నాథ్ జయలక్ష్మీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట స్మశాన వాటిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కె.విశ్వనాథ్‌తో 75 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు జయలక్ష్మి. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె తీవ్ర మనో వేదనకు గురై, ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడం గమనార్హం. -
ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు.. నటి జయలక్ష్మిపై కేసు నమోదు
సాక్షి, చెన్నై: బీజేపీ రాష్ట్ర నిర్వాహకురాలు, నటి జయలక్ష్మిపై తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఇరుగంబాక్కం వెంకటేష్ నగర్లో నివసిస్తున్న ప్రముఖ గీత రచయిత స్నేహన్, 2015లో స్నేహం ఫౌండేషన పేరుతో స్వచ్ఛంద సేవ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టు తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా బీజేపీ నిర్వాహకురాలు నటి జయలక్ష్మి బయట స్నేహం ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు చేస్తూ రూ.కోట్ల మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసిందని ప్రముఖ గీత రచయిత స్నేహన్, నటి జై లక్ష్మీభాయి గత ఆగస్టు 5వ తేదీన చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్నేహన్ ఆరోపణలను ఖండిస్తూ నటి జయలక్ష్మి ఆగస్టు 8వ తేదీన చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆయనపై ఫిర్యాదు చేశా రు. ఈ విషయం తెలుసుకున్న గీత రచయిత స్నేహన్ చెన్నై హైకోర్టులో జయలక్ష్మిపై పిటీషన్ దాఖలు చేశారు. ఆయన పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం నటి జయలక్ష్మి మోసానికి పాల్పడినట్టు ఆధారాలుంటే ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన తిరుమంగళం పోలీసులు నటి జయలక్ష్మిపై 420, 465 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలని బుధవారం ఆమెకు సమన్లు జారీ చేశారు. -
నన్ను మారనివ్వండి ప్లీజ్!
*ఘరానా చోరీలు.. జల్సా జీవితం *చోరీ సొత్తులో కొంత పేదలకు పంపకం *ఆరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 110 నేరాలు *భూక్యానాయక్ నేరాల స్టైలే వేరు! *ఆటకట్టించిన కార్ఖానా పోలీసులు రాంగోపాల్‌పేట, న్యూస్‌లైన్: ఖరీదైన ప్రాంతాలే టార్గెట్.. చోరీ సొత్తులో కొంత బీదాబిక్కీకి పంపకం.. ఊరు దాటాలంటే ఫ్లైట్.. బస చేయాలంటే ఫైవ్‌స్టార్ హోటల్.. గజదొంగ భూక్యానాయక్ శైలి ఇది. అతని ఆటకట్టించిన కార్ఖానా పోలీసులు 85 తులాల బంగారు, రెండు కేజీల వెండి ఆభరణాలు, నగదు స్వాధీ నం చేసుకున్నారు. సోమవారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి వివరాలు వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో పంజా విసిరి... కృష్ణా జిల్లా ఎ.కొండూరుకి చెందిన భూక్యానాయక్ 2007 నుంచి చోరీలకు అలవాటుపడ్డాడు. హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు నేరాలు చేశాడు. పి.ఉమామహేశ్వరరావు, పి.సురేష్, ఎన్.సురేష్, ఎం.భాస్కర్ (చనిపోయాడు), కె.విజయకృష్ణతో ముఠాకట్టి ఆరేళ్లలో 110 కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లొచ్చాడు. ఇతనిపై పలు ఠాణాల్లో నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా... మేలో బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం కార్ఖానా ఠాణా పరిధిలో ఐదిళ్లలో దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నాడు. చోరీ సొత్తును చార్మినార్‌లో విక్రయించేందుకు సోమవారం సిటీకి వచ్చిన ఇతగాడు సికింద్రాబాద్‌లోని ఓ బస్టాప్ వద్ద వేచి ఉన్నాడు. సమాచారం అందుకున్న కార్ఖానా ఠాణా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వి.నాగయ్య బృందంతో దాడిచేసి అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి చోరీ సొత్తును కొన్న గుత్తికొండ పవన్కుమార్నూ పట్టుకున్నారు. పవన్ బీకాం (కంప్యూటర్స్) చదివాడు. భూక్యానాయక్ గురించి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిటికెలో చోరీ.. పగలూరాత్రి తేడా లేకుండా పంజా విసిరే భూక్యానాయక్కు ఖరీదైన ప్రాంతాల్లో నివసించే వారే టార్గెట్. తాను చేసిన చోరీలపై బాధితులు ఫిర్యాదు చేయడానికీ వెనుకాడే పరిస్థితి కల్పిస్తాడు. పట్టపగలు ఇంటి ముందు వాచ్మెన్ కాపలా ఉన్నా... కళ్లుగప్పి తాళం పగులగొట్టి ఊడ్చుకుపోతాడు. చోరీ సొత్తులోని కొంత భాగం యాచకులకు, రాత్రి వేళల్లో ఆస్పత్రుల వద్ద రోడ్డు పక్కనే నిద్రించే వారికి పంచుతాడు. పోలీసులకు దొరికినప్పుడు మాత్రం అప్పటికి ఏ సందర్భంలోనైనా తనను ఇబ్బంది పెట్టిన వాళ్లను ఇరికించడానికి యత్నిస్తాడు. నేరాల్లో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు చెప్పడం ద్వారా పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తాడు. బెయిల్‌పై వచ్చాక ‘నీ ఏరియాలో చోరీ చేస్తున్నా.. దమ్ముంటే కాచుకో’ అంటూ చాలెంజ్ చేయడం భూక్యా నైజం. 2010లో మచిలీపట్నం నుంచి విజయనగరం తరలిస్తుండగా పోలీసు ఎస్కార్ట్కు మస్కా కొట్టి జీపులో నుంచి దూకి తప్పించుకున్నాడు. ‘రియల్’ ముసుగులో జల్సాలు చోరీల ద్వారా భారీ మొత్తం మూటగట్టాక పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కర్ణాటక, తమిళనాడు, గోవాకు విమానాల్లో చెక్కేస్తాడు. రియల్ఎస్టేట్ వ్యాపారినంటూ బిల్డప్ ఇచ్చి ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తాడు. చిన్న వస్తువు కొనాలన్నా పెద్ద షాపింగ్ మాల్‌కు వెళ్లాల్సిందే. ఎక్కడా నిలకడగా ఉండకుండా తరచూ సెల్‌ఫోన్, సిమ్‌కార్డు మారుస్తూ నిఘా నుంచి తప్పించుకుంటాడు. స్టార్‌హోటళ్లలో బస చేసినప్పుడు మాత్రమే రెడ్‌వైన్ తాగుతాడు. ఏడో తరగతి మాత్రమే చదివిన భూక్యా.. తనకు సహకరించేందుకు ఇద్దరు ముగ్గురు సన్నిహితులను తీసుకువెళ్తుంటాడు. డ్యాన్సర్ కూడా కావడంతో పబ్‌లకు వెళ్లి చిందేస్తాడు. సినీ పరిశ్రమలోనూ పలువురితో పరిచయాలు ఉన్నట్లు సమాచారం. కోస్తా జిల్లాల పోలీసుల తొలి టార్గెట్‌లో ఎప్పుడూ భూక్యానాయక్ ఉంటాడు. బెయిల్ పిటిషన్ వేయడానికి పోటీ భూక్యానాయక్ నిరంతరం కొందరు అడ్వకేట్లతో టచ్‌లో ఉంటాడు. పోలీసులకు చిక్కినప్పుడు బెయిల్ పిటిషన్ వేయడానికి వారు పోటీపడతారని తెలుస్తోంది. ఈ ఖర్చులకే భూక్యా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ఖర్చు చేసి ఉంటాడని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇతడి స్నేహితుల్లో కొందరు ప్రస్తుతం బాగా ‘స్థిరపడినట్లు’ సమాచారం. ఇతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నన్ను మారనివ్వండి ప్లీజ్! 'నేను దొంగతనాలు మాని సాధారణ జీవితం గడపాలనుకున్నా, పోలీసులు నన్నలా ఉండనివ్వట్లేదు. నా ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి ఉన్నతస్థాయిలో చూడాలని ఉంది. పోలీసుల తీరుతోనే ఇలా మళ్లీ మళ్లీ దొంగగా మారాల్ని వస్తోంది. పోలీసులు, మీడియా నేను మారేందుకు సహకరించాలి' అంటూ పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో భూక్యా నాయక్ అన్నాడు.