
దివంగత దర్శకుడు కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. విశ్వనాథ్ రెండో కొడుకు రవీంద్ర నాథ్ జయలక్ష్మీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట స్మశాన వాటిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
కాగా, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కె.విశ్వనాథ్‌తో 75 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు జయలక్ష్మి. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె తీవ్ర మనో వేదనకు గురై, ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment