k viswanath
-
చంద్రమోహన్, కె విశ్వనాథ్‌కు రిలేషన్.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
తెలుగు సినిమారంగంలో కళాతపస్విగా గుర్తింపు తెచ్చుకున్న కె.విశ్వనాథ్ చేసిన సేవలు ఎనలేనివి. ఆయన చివరి శ్వాస వరకు కళామతల్లికి సేవలందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన కన్నుమూశారు. తాజాగా మరో సినీ దిగ్గజాన్ని టాలీవుడ్ కోల్పోయింది. దాదాపు 932 సినిమాల్లో నటించిన మరో కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఓకే ఏడాదిలో రెండు సినీ దిగ్గజాలను కోల్పోవడాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కె. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య రిలేషన్ ఏంటి? అసలు వీరిద్దరికీ ఉన్న బంధుత్వమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం. అదే విధంగా ఎస్పీబాలుకు, వీరిద్దరికి బంధుత్వం ఎలా వచ్చిందో చూద్దాం. (ఇది చదవండి: Chandra Mohan Death: విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) కె విశ్వనాథ్‌కి, సీనియర్ నటుడు చంద్రమోహన్‌తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. శంకరాభరణం చిత్రానికి విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించగా.. చంద్రమోహన్ కీలపాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే సూపర్ హిట్‌గా నిలిచి..జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎస్పీ బాల సుబ్రమణ్యం పాటలు పాడారు. అయితే కె విశ్వనాథ్ 1966లో ఆత్మ గౌరవం అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయం కాగా.. అదే ఏడాది రంగులరాట్నం చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) పెదనాన్న కుమారుడే విశ్వనాథ్! ఇదిలా ఉండగా మా పెదనాన్న కుమారుడే కె.విశ్వనాథ్ అని చంద్రమోహన్ చెప్పారు. తన అన్నయ్య విశ్వనాథ్ చనిపోయినప్పుడు పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. చంద్రమోహన్ పెదనాన్న రెండో భార్య కొడుకు కె.విశ్వనాథ్ కాగా.. చంద్రమోహన్ తల్లి, కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య అక్కా చెల్లెల్లు కావడంతో వీరద్దరు అన్నదమ్ములు అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సీతకథ చిత్రాలు వచ్చాయి. నాలో ఉన్న ప్రతిభను బయటికి తీసి అద్భుతమైన నటుడిగా తీర్చిదిద్దింది ఆయనేనని చంద్రమోహన్ గతంలో వెల్లడించారు. గతంలో కె. విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ..'సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బాంధవ్యమే ఎక్కువ. అందరికంటే నేను ఆయనకు చాలా దగ్గరివాడిని. మద్రాసులో ఉన్నప్పుడు ఒకేచోట స్థలం కొనుకున్నాం. పక్క పక్కనే ఇళ్లు కూడా కట్టుకుని 25 ఏళ్ల ఉన్నాం. అంతటి అనుబంధం మాది' అని అన్నారు. ఎస్పీ బాలుతోనూ బంధుత్వం సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యంతోనూ వీరిద్దరి బంధుత్వం ఉంది. చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అనుకోకుండా ముగ్గురికి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. చివరికీ వరుసకు ముగ్గురు అన్నదమ్ములు కావడం మరో విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన శంకరాభరణం సినిమా ఇండస్ట్రీలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మా మావయ్య, విశ్వనాధ్ గారు గ్రేట్ ఫ్రెండ్స్
-
అశ్రునయనాల మధ్య ముగిసిన జయలక్ష్మి అంత్యక్రియలు
దివంగత దర్శకుడు కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. విశ్వనాథ్ రెండో కొడుకు రవీంద్ర నాథ్ జయలక్ష్మీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట స్మశాన వాటిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కె.విశ్వనాథ్‌తో 75 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు జయలక్ష్మి. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె తీవ్ర మనో వేదనకు గురై, ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడం గమనార్హం. -
కే. విశ్వనాథ్ సతీమణి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. దివంగత డైరెక్టర్ ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ సతీమణి కాశీనాథుని జయలక్ష్మి(88) ఇకలేరు. ఆదివారం సాయంత్రం 5:45 గంటలపైన ఆమె తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంచానికే పరిమితమయ్యారు. భర్త విశ్వనాథ్ మరణం తర్వాత మరింత అనారోగ్యానికి గురయ్యారు జయలక్ష్మి. ఈ క్రమంలోనే ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు జయలక్ష్మి స్వస్థలం. 1935లో వినాయక చవితి రోజున జన్మించారామె. ఆమె అన్నయ్య చదువు కోసం వారి కుటుంబం బందరుకి మారింది. అక్కడి లేడీ యాంథల్ మిషనరీ స్కూల్లో చదివారు జయలక్ష్మి. ఆమె పదో తరగతి చదువుతున్నప్పుడే పద్నాలుగేళ్లకే కె.విశ్వనాథ్‌తో 1948 అక్టోబర్ 2న వివాహం జరిగింది. ఆ తర్వాత మద్రాసులో కాపురం పెట్టారు విశ్వనాథ్–జయలక్ష్మి దంపతులు. వారికి ముగ్గురు సంతానం. పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్ర నాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయనతో 75 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు జయలక్ష్మి. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె తీవ్ర మనో వేదనకు గురై, ఆరోగ్యం మరింత క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి ఫిలింనగర్‌లోని ఇంటికి తరలించారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జయలక్ష్మి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన వార్డులోనే జయలక్ష్మి కూడా కన్నుమూయటం దురదృష్టకరమని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం పంజాగుట్ట స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. వైఎస్ జగన్ సంతాపం జయలక్ష్మి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ
దివంగత దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19న ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కళాంజలి పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి, సహజ నటి జయసుధతో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయసుధ విశ్వానాథ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఎంతోమంది హీరోయిన్లు విశ్వనాథ్ దర్శకత్వంలో మంచి మంచి సినిమాలు చేశారు. కానీ జయసుధ మాత్రం ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించలేదు అని అందరికి అనిపించి ఉంటుంది. ఎన్నో క్లాసికల్ సినిమాలు తీసిన ఆయనకు ఎందుకో ఆయన కమర్షియల్ సినిమా చేయాలనుకున్నారు. దానికి నన్ను అడిగారు. అలా ఆయన దర్శకత్వంలో నేను కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం వంటి కమర్షియల్ చిత్రాలు చేశాను. అయితే ఆయన తీసిన సాగర సంగమం సినిమా నేను చేయాలి. ఏడిద నాగేశ్వరావు గారు ముందు నన్ను అడిగారు. అలాగే అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కమల్ హాసన్ గారు బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అదే సమయంలో నేను ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో డేట్స్ కుదరకపోవడంతో నేను ఈ సినిమా నుంచి తప్పుకున్నా’ అని చెప్పారు. అయితే సాగర సంగమం సినిమా కోసం నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాను. దాంతో విశ్వనాథ్ గారు నాపై చిన్నగా అలిగారు. చాలా రోజులు నాతో మాట్లాడలేదు. నేను ఎక్కడ కనిపించిన ఆయన హూమ్ అన్నట్టుగా చూసేవారు. అది అలాగే చాలా రోజులు కొనసాగింది. ఆ తర్వాత నేను ఆయనతో ఇక సినిమాలు చేయలేకపోయా. కానీ నిజం చెప్పాలంటే సాగర సంగమంలో ఆ పాత్రకు జయప్రదే కరెక్ట్ అనిపించింది. ఆమె చాలా గొప్పగా చేసింది. అనిపించింది’ అని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత చాల కాలం తర్వాత ఓసారి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ‘నాతో నటిస్తావా?’ అని అడిగారు. అదే ఆయనతో తన చివరి మాటలు అని జయసుధ ఎమోషనల్ అయ్యారు. చదవండి: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ -
హైదరాబాద్‌లో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం (ఫొటోలు)
-
కె విశ్వనాథ్ సేవలు వెలకట్టలేనివి: మంత్రి రోజా
దివంగత టాలీవుడ్ కళాతపస్వి కె విశ్వనాథ్ కుటుంబాన్ని ఏపీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని ఆమె కొనియాడారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కె విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..' విశ్వనాథ్ లేరంటే ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఆయన సినిమా పరిశ్రమకు చేసిన సేవలు వెలకట్టలేనివి. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి చేసిన సేవ ఇంకెవరూ చేయలేరు. ఆయన సినిమాల్లో తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు. ఆయన సినిమాలు ఓ మెసేజ్ అందిస్తాయి. ఒక దర్శకుడిగా, నటుడిగా ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. అందరూ ఆదర్శవంతంగా ఆయనను చూసి నేర్చుకునేలా జీవించారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' ఆయనని చూసిన వెంటనే గురువును చూసినట్టే భయం వేస్తుంది. నిజంగా ఆయన జీవితం పరిపూర్ణం. ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకోవాలి. తెలుగు నెల ఉన్నంత వరకు తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవను గుర్తించి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. -
కె.విశ్వనాథ్‌కు అది చాలా సెంటిమెంట్.. కానీ ఆ సినిమాతో!
దిగ్గజ దర్శకులు, నటుడు కె.విశ్వనాథ్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినీ ప్రేక్షకుల కోసం ఎన్నో అద్భుత కళాఖండాలు అందించిన ఆయన శంకరాభరణం రిలీజైన రోజే శివైక్యమయ్యారు. తన సినిమాలతో వినోదాన్ని పంచడమే కాకుండా అంతర్లీనంగా సందేశాలు కూడా ఇచ్చేవారు. ఆయన తీసిన అద్భుత చిత్రాల్లో స్వర్ణకమలం కూడా ఒకటి. ఈ సినిమా గురించి గతంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విశ్వనాథం. ఓసారి ఆ విశేషాలేంటో గుర్తు చేసుకుందాం.. 'శాస్త్రీయ కళలను నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదన్న గట్టి అభిప్రాయంతో ఉన్న పాత్ర మీనాక్షి. దానికితోడు హడావుడి,నిర్లక్ష్యం, అవసరానికి చిన్నాపెద్ద అబద్ధాలాడే క్యారెక్టర్ ఆమెది. సినిమా చూసి ఇంటికొచ్చి హాస్పిటల్.. ఫ్రెండ్ పురుడు అని కట్టుకథలల్లి ‘వాళ్లంతిదిగా అడుగుతుంటే ఎలా నాన్నా కాదనేది?’ అని దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడే స్వీట్లయర్ ఆమె. ఇదిలా ఉండగా ఆమె స్వాతంత్య్రానికి అడుగడుగునా పార్క్ నుంచి మొదలై గజ్జెలు తీసేదాకా వచ్చి, చివరికి హోటల్లో ఇష్టమైన ఉద్యోగం పోయేదాకా ఆమెను విసిగించే క్యారెక్టర్ వెంకటేష్‌ది. ఒకటేమిటి... మిడిల్ క్లాస్ఫ్యామిలీస్లో మనం నిత్యం చూసే స్టేషన్‌మాస్టర్, టీచర్... అలా అందరి క్యారెక్టర్లు వేటికవే నిలిచిపోయాయి. ‘స్వయంకృషి’లో విజయశాంతి ‘అట్టసూడమాకయ్యా’ అన్నట్టు ఈ సినిమాలో కూడా ఏదయినా మెలిక పెడితే బాగుంటుందని అనిపించి అర్థం చేసుకోరూ.. అని డైలాగ్ పెట్టాం'. ‘హారతుల’ ట్రాక్ గురించి మాట్లాడుతూ... దాని జన్మ చాలా గమ్మత్తుగా జరిగింది.ఆ ట్రాక్ ముందే అనుకున్నాం, రాశాం, డిస్కస్చేశాం. అయితే నాకెందుకో అది తృప్తిగా అనిపించలేదు. ఓరోజు మధ్యాహ్నం రెండింటి నుంచి షూటింగ్ అనగా, పదకొండు గంటలకు భగవంతుడు చిన్న ఫ్లాష్ ఇచ్చాడు. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ‘పక్కింటి డాబాలో వాళ్ళని వెళ్ళి అడుగు... మొత్తం గోడలకంతాదేవుళ్ళ పటాలు పెడతాం, పొగ పెట్టినట్టు చేస్తాం, షూటింగ్ అయ్యాక మళ్ళీ బాగుచేసి ఇస్తాం... వాళ్ళకి ఓకేనా’ అని చెప్పాను. వాళ్ళు ఓకే అనగానే వెంటనే సిటీకి పంపించి పటాలు తెప్పించి, సీన్లు, డైలాగ్‌లు అప్పటికప్పుడు మార్చి షూట్చేశాం. అతిభక్తితో అస్తమానం హారతులు ఇచ్చే శ్రీలక్ష్మి క్యారెక్టర్ – కుంపటి కమ్ము వంకాయలా కందిపోయిన సాక్షి రంగారావు క్యారెక్టర్.. అలా పుట్టాయి. తన సెంటిమెంట్ గురించి చెప్తూ.. దాదాపు ప్రతి సినిమాలో శివుడి మీద ఏదో ఒకపాట ఉంటుంది. ఈ సినిమాలో కూడా రెండున్నాయి. అది భగవదేచ్ఛ. నేను కావాలని ప్రయత్నించను. ‘ఉండమ్మా బొట్టుపెడతా’ సినిమాలో మొట్టమొదటి పాటను ‘శ్రీ’తో మొదలుపెట్టమని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అడిగాను. (సాధారణంగా ఏ కవిత్వమైనా, కావ్యమైనా శ్రీకారంతో మొదలవుతుందని) దానికాయన ‘శ్రీశైలం మల్లన్న, శిరసొంచెనా, చేనంతా గంగమ్మ వాన’ అని రాశారు. నేను ఆయన్ని ‘శ్రీ’తో రాయమని అడిగానే తప్ప శివుడు మీద రాయమని అడగలేదు! ఇంకా చెప్పాలంటే నాకు‘ఎస్’ సెంటిమెంట్ ఉంది. సినిమా వాళ్ళం పిరికివాళ్ళమండీ! కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తాం కదా...భయాలు, సెంటిమెంట్లు ఎక్కువ! ‘ఎస్’తో పెట్టిన 2–3 సినిమాలు వరుసగా హిట్ కావడంతో అలా పెట్టుకుంటూ వచ్చాను. కానీ ఆపద్బాంధవుడుకు మాత్రం అది కుదరలేదు. క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ‘ఆపద్బాంధవుడు’ బాగుంటుందన్నాను. అందరూ సరేనన్నారు. మరి ఎందుకని ఆ రోజు ఆ ‘ఎస్’ సెంటిమెంట్ మైండ్ నుంచి స్లిప్ అయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని తన జ్ఞాపకాలను పంచుకున్నారు విశ్వనాథం. చదవండి: వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు, అసలేం జరిగింది -
కళాతపస్వి కె. విశ్వనాథ్.. ఆ సినిమా విషయంలో చిత్రవధ అనుభవించారట
కళాతపస్వి కె. విశ్వనాథ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో 'సిరివెన్నెల' ఒకటి. తెలుగుతెరపై మరో కళాఖండముగా నిలిచిపోయిందీ చిత్రం. అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా విశ్వనాథ్ కీర్తిని ఆకాశాన్ని తాకేలా చేసింది.కానీ ఇదే సినిమా తనను మానసికంగా చిత్రవధకు గురిచేసిందని స్వయంగా విశ్వనాథ్ గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అలా ఎందుకు అన్నారు? ఇంతకీ విశ్వనాథ్‌ను ఈ చిత్రం ఎందుకు అంతలా బాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 'సిరివెన్నెల' సినిమాలో ఒక గుడ్డివాడిని, మూగ అమ్మాయిని కలపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందన్నదాని గురించి విశ్వనాథ్ ప్రస్తావిస్తూ.. ''ఆ సంవత్సరం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన ఇయర్ ఏదో అయింది. అప్పుడు అనిపించింది... అదే నేపథ్యంలో సినిమా తీస్తే ఎలా ఉంటుందని... అలా ఒక గుడ్డివాడిని, ఒక మూగ అమ్మాయిని తీసుకుని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ బిహేవియర్‌ని తెరకెక్కించాలనిపించింది. అంతేకాక, నాకు ఎప్పుడూ అనిపించే విషయం. దేవుడు ఒకచోట ఎవరికయినా తగ్గించి ఇస్తే దాన్ని వేరేచోట భర్తీ చేస్తారని.మనం కూడా వాళ్ళ మీద సానుభూతి చూపించకుండా నార్మల్ పర్సన్స్‌లా ట్రీట్ చేయాలని. సిరివెన్నెల ప్రాజెక్ట్ నా మనసుకు దగ్గరైన సినిమా. ఎందుకంటే, దాన్ని పిక్చరైజ్ చేయడానికి, బయటికి తేవడానికి నేను మానసికంగా ఎంత వ్యధ అనుభవించానో నాకు తెలుసు. ప్రతి సీన్‌కీ కష్టపడ్డాను. ఉదాహరణకు సుహాసిని, బెనర్జీ కోటలో కలిసినప్పుడు అతన్ని (మూగ భాషలో) అడుగుతుంది – ‘మీరు ఇంతకుముందు ఇక్కడే వాయించే వారటగా?’ అని... ‘అవును, ఎవరికి తోచింది వారిచ్చేవారు... మరి మీరేమిస్తారు?’ అంటాడు. తగినంత డబ్బు లేకపోవడంతో తన బ్రేస్లెట్ తీసిస్తుంది. అప్పుడు ఒక పాటను చిత్రీకరించి ఆ సీన్‌ను ఎండ్ చేయచ్చుకదా? లేదు, అలా చేయాలనిపించలేదు. నేనే కాంప్లికేట్ చేసుకుంటాను... తగిన సమాధానం కోసం వెతుక్కుంటాను. వెంటనే అతను ‘ఇది వెండా? బంగారమా?’ అంటాడు. దానికి సమాధానం ఆ అమ్మాయి ఎలా చెప్పగలదు? అప్పటికీ ‘మీ మనసు లాంటిది’ అని చూపిస్తుంది. అప్పుడయినా ఊరుకోవచ్చు కదా! లేదు... ‘నా మనసు అయితే మట్టి’ అంటాడు... ‘పోనీ, నా మనసు అనుకోండి’ అన్నట్లు చూపిస్తుంది సుహాసిని... అలా మొత్తం సినిమాలో నాకై నేను కాంప్లికేట్ చేసుకున్న సీన్లు ఎన్నో! తన బొమ్మ గీసేటప్పుడు కళ్ళు బాగా రావాలంటాడు బెనర్జీ సుహాసినితో ఓసారి... సరే... బొమ్మ ఉన్నదున్నట్టుగా గీస్తే కాంప్లికేషనే లేదుగా? అలా తీయకూడదనుకున్నాను. చివరికి ఆ అమ్మాయి మంచి కళాఖండం ... సూర్యచంద్రుల్ని రెండు కళ్ళుగా, వేణువును ముక్కుగా, దానినుంచీ వెలువడే ఉచ్ఛ్వాస – నిశ్వాసల ఓంకారం పెదవులుగా, త్రినేత్రం అతని జ్ఞాననేత్రంగా... గీస్తుంది. గీసింది సరే, కానీ దాన్ని తనేమో చెప్పలేదు, అతనేమో చూడలేడు. సిచ్యుయేషన్ ఎంత కాంప్లికేటెడో ఆలోచించండి! నమ్ముతారో లేదో ఆ బొమ్మ గీయడానికి నంది హిల్స్‌లో నేను, మా ఆర్ట్ డైరెక్టర్ ఎన్ని రోజులు స్పెండ్ చేశామో చెప్పలేము. రోజూ వచ్చి అడిగేవాడు ‘ఏం గీయాలి సార్!’ అని... ‘నువ్వు ఏదయినా యాబ్స్ట్రాక్ట్తో రా, నేను దాన్ని ఇంటర్పెట్ చేయగలనో లేదో చూస్తాను’ అని చెప్పి పంపేవాడిని. సింపుల్‌గా చెప్పాలంటే.. రివర్స్‌లో వర్క్ చేయడం అన్నమాట. అతనికీ అర్థం కావట్లేదు, నాకూ క్లారిటీ లేదు... అలా రోజులు గడిచాయి... సడెన్‌గా ఓరోజుతెల్లవారుజామున ఐడియా వచ్చి అతన్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంత కష్టం దాగుంది ఆ సీన్ వెనుక! అయితే, పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అది వేరే విషయం. ఇందులో ‘సూర్యోదయం’ సీన్ ఒకటుంది. ఒక గుడ్డివాడికి సూర్యోదయాన్ని ఎలా చూపించాలని. నేను ఎంతో రిసెర్చ్ చేశాను, ఎందరో మేధావులని కలిశాను, ఎన్నో రోజులు ఆలోచించాను. ఆ సీన్లో మూన్‌మూన్‌సేన్ అతన్ని అడుగుతుంది...‘నువ్వు ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ప్రేమించావా?’ అని. లేదంటాడతను. ‘పోనీ ఎప్పుడయినా, ఏ అమ్మాయినైనా ముట్టుకున్నావా?’ అని అడుగుతుంది... ‘అయ్యయ్యో!’అంటాడతను. ‘అయితే నీకు చెప్పడం చాలా తేలిక’ అంటుంది తను. అంటే... మొదటిసారి ఓ అమ్మాయిని ముట్టుకున్నప్పుడు కలిగే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్‌ల ఆధారంగా ప్రకృతిని చాలా ఈజీగా చూపించవచ్చని అనుకున్నాను. అసలు ఈ థాట్ వెనకాల చాలా గమ్మత్తైన విషయం దాగుంది. ఇంతవరకూ ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు. మేము విజయవాడలో ఉన్నప్పుడు... మా ఇంట్లో అద్దెకుండే అమ్మాయి కాఫీ పౌడర్ అప్పు తీసుకెళ్ళింది. తిరిగి గ్లాస్ ఇవ్వడానికొచ్చినప్పుడు ఇంట్లో అమ్మ లేకపోవడంతో నాకిచ్చింది. అలా ఇవ్వడంలో, అనుకోకుండా ఆమె చేయి నాకు తగిలింది... అంతే! ఏదో జరిగిందినాలో! 50–60 ఏళ్ళ క్రితం కలిగిన ఆ ఫీలింగ్ నాకిప్పటికీ అలానే గుర్తుంది.అదే సినిమాలోఎందుకు పెట్టకూడదని అనుకుని పెట్టాను. ఇక సాహిత్యం విషయానికి వస్తే.. అప్పటిదాకా వేటూరి గారితో ఎన్నో పాటలు రాయించిన నేను ఈ సినిమాకు మాత్రం సిరివెన్నెల గారితో రాయించాను. అప్పట్లో వేటూరి గారు నామీద ఎందుకో తెలీదు, అలిగారు (కారణం తెలీదు). వారికి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంచేయకూడదు కదా అని, వేరెవరితోనైనా రాయించాలనుకున్నాను. ఈలోపల నేను ఓరోజు ‘గంగావతరణం’ పాటలు విన్నాను. వినగానే నచ్చేశాయి. రాసిందెవరని వాకబు చేస్తే తెలిసింది ‘సీతారామశాస్త్రి’ అని. అప్పుడతన్ని పిలిపించి, అతనికి సిరివెన్నెల కథ మొత్తం వినిపించి, రాయించుకున్నాను. మొదటిసారి ‘విధాత తలపున’రాశాడు. చాలా అద్భుతం అనిపించింది. అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో శివుడ్ని స్తుతించాను. మహా అయితే ప్రశ్నించాను. కానీ ఎన్నడూ నిందించలేదు. ఈ సినిమాలో మాత్రం ‘ఆదిభిక్షువు’ పాటలో నిందాస్తుతి కనిపిస్తుంది. షూటింగ్ టైంలో లిరిక్ రైటర్, డైలాగ్‌రైటర్ ఎప్పుడూ నాతోనే ఉండేవారు. అందులోశాస్త్రికి ఇది ఫస్ట్ ఫిల్మ్ కదా, ఉద్యోగానికి సెలవుపెట్టుకొచ్చాడు, బోలెడు ఖాళీ ఉండేది. షూటింగ్ అవ్వగానే ఈవెనింగ్ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అలా ఓరోజు నేను అతనిని అడిగాను...‘ఏమయ్యా, ఏమయినా కొత్తగా రాశావా?’ అని. అప్పుడు... ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది?’ అని నాలుగు లైన్లు వినిపించాడు. ‘ఏదేది మళ్ళీ చెప్పు’ అన్నాను. థాట్బాగా నచ్చింది! వెంటనే నేను ‘అదే లైన్లో చరణాలు కూడా రాసెయ్. సినిమాలో దానికి తగ్గసిట్యుయేషన్ నేను క్రియేట్ చేస్తాను’' అన్నాను. -
‘స్వయం కృషి’ తర్వాత చిరంజీవి గురించి కళాతపస్వి ఏమన్నారంటే!
‘చిన్నప్పుడు... వేసవి రాత్రుల్లో మిద్దె మీద పడుకునేవాళ్ళం. ఆకాశంలో ఉన్న చుక్కలను చూసే వాళ్ళం. చుక్కలను మన ఊహకు తోచినట్టు గీతలతో కలుపుకుని చిత్రాలను వేసుకునేవాళ్ళం. నా సృజనకు కనబడ్డ చిత్రం మరొకరికి కనబడేది కాదు. వాళ్ళ చిత్రాలు నాకు కనబడేవి కావు. చిత్రం విచిత్రమైనది.చూసిన ప్రతి ఒక్కరికి ఓ కొత్త కోణం కనబడుతుంది’ ప్రేక్షకులు చూసే కోణం, చిత్రం తీసిన వారి కోణం ఒక్కటే కానక్కర్లేదు. సినిమా చూశాక ఎవరి ఇంటికి వారు, వారికి బోధపడ్డ విచిత్రాన్ని మూట కట్టుకుని తీసుకెళ్తారు. సృష్టికర్త పెట్టిన చుక్కలకు ఎన్ని అనంత అర్థాలు ఉంటాయో... కె.విశ్వనాథ్ సినిమాకు కూడా అన్నే పరమార్థాలు ఉండవచ్చు. మనం ఎంతెత్తు ఎదిగినా మనమూలాల్ని మర్చిపోకూడదని చూపించారు స్వయం కృషితో. అప్పటి వరకు ఆర్ట్స్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించిన ఆయన తొలిసారి మెసేజ్ ఓరియెంట్ మూవీ తీశారు. మరి ఈ కథ ఆయనకు ఎలా తొలచింది, ఈ సినిమా తియడానికి కారణాలను గతంలో ఆయన సాక్షితో పంచుకున్నారు. మరి స్వయం కృషి గురించి, ఆయన పంచుకున్న విశేషాలను మరోసారి గుర్తు చేసుకుందాం! స్వయం కృషిలో తనకు నచ్చిన సన్నివేశం కోర్టు సీన్ అని చెప్పారు. అప్పటిదాకా విజయశాంతిని కసురుకునేవాడు కాస్తా,పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందని తెలిశాక లోపలికి వచ్చి ఆమెవంక అభిమానంగా చూడడం, అప్పుడామె ‘అట్టసూడమాకయ్యా!’ అనే సీన్ పెంచుకున్న కొడుకుని అసలు తండ్రి (చరణ్‌రాజ్) కరప్ట్ చేస్తున్న క్యాసెట్ చూస్తున్నప్పుడు... తట్టుకోలేక తల్లిఏడవడం.. తండ్రి నిబ్బరంగా కూర్చునే కోర్టు సీన్... కొడుకు ఎవరి దగ్గర ఉండాలని కోరుకుంటాడో (పెంచిన తండ్రి దగ్గరా? అసలుతండ్రి దగ్గరా?) అని వేచి చూస్తున్న పేరెంట్స్... షాట్ అది. ఈ సీన్‌కి ముందు చిరంజీవితో ఒకటే చెప్పాను. ‘జీవితంలో చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టుకుంటూ బ్రతికిన వాడివి... ఇప్పటిదాకా జరిగినవన్నీ చాలా నిబ్బరంగా తీసుకున్నవాడివి... ఈ సమయంలో నువ్వు బ్యాలెన్స్ కోల్పోవద్దు! జరగబోయే పరిణామాల గురించి చింతపడకుండా కేవలం ఒక ప్రేక్షకుడిలా ఏం జరగబోతోందో! చూడు’ అని చెప్పాను. తర్వాత ఆ సీన్ చేసేటప్పుడు చిరంజీవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అత్యద్భుతం, అలా చేయడానికి యోగసిద్ధి ఉండాలనిపించేతలా చేశాడంటూ విశ్వానథ్ చిరునుప్రశంసించారు. ఇక చిరంజీవి మూడు సినిమాలు చేసిన అనుభవం గురించి ఆయన మాట్లాడుతూ.. చిరంజీవికి తన వృత్తిపట్ల ఉన్న డెడికేషన్ అయోఘమైనదన్నారు. ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ తర్వాత ‘ఆపద్బాంధవుడు’... ఈ మధ్య గ్యాప్‌లో అతడు స్టార్‌గా అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ తను అది ఏమాత్రం చూపించలేదు. ప్రతి పిక్చర్ ఇదే తన మొదటి సినిమా అన్నట్లుగా తపనపడేవాడు. దానికో ఉదాహరణ చెప్తాను.. ‘ఆపద్బాంధవుడు’లో... మెంటల్ హాస్పిటల్లో షాక్ థెరపీ ఇచ్చాక హీరోకి మాట పెగలదు. అలాంటి సీన్ యాక్ట్ చేయడం ఏ యాక్టర్‌కైనా పండగ. ఓన్లీ స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దట్! అది తనకు తెలుసు కాబట్టి ఏమాత్రం ఖాళీ లేకపోయినా, తనంత పీక్ స్టార్డమ్లో ఉన్నా... ముందు రోజు తనంతట తాను నా రూమ్ కొచ్చి, ఎక్కడేం చేయాలో తెలుసుకుని, రిహార్సల్స్ చేసుకుని వెళ్ళాడు. అదే సినిమాలో దక్షుడిగా క్లాసికల్ డ్యాన్స్ చేయాల్సి వచ్చినప్పుడు... తనకసలు అవసరం లేకపోయినా (మంచి డ్యాన్సర్ కదా!), రెండు రోజులపాటు డ్యాన్స్ డైరెక్టర్‌తో రిహార్సల్స్ చేసుకుని వెళ్ళాడు’ అంటూ చెప్పుకొచ్చారు. తన ప్రతి సినిమాలో శివుడి ప్రస్తావన తీసుకొచ్చే విశ్వనాథ్ స్వయం కృషిలో పెద్దగా పెట్టలేదనేది ప్రేక్షకులు అభిప్రాయం. దీనికి ఆయన స్పందిస్తూ.. ఈ సినిమాలో శివుని ప్రస్తావన పెట్టానని, బ్రహ్మానందం తన కొడుకుతో ఒకమాటంటాడు కదా.. ‘గుళ్ళో శివుడు, నంది ఇద్దరూ ఉంటారు; అలా అని నంది వెళ్ళి శివుని పక్కనకూర్చోవాలనుకోవడం తప్పుకదా? అని ఉంది కదా అన్నారు. ఆ తర్వాత మీకు శివుడి సెంటిమెంట్ ఉందాని హోస్ట్ అడగ్గా.. తన పేరులోనే శివుడు ఉన్నాడంటూ నవ్వుతూ ఆయన సమాధానం ఇచ్చారు. -
సినిమా రంగంలోకి రాని విశ్వనాథ్ వారసులు.. ఎందుకంటే
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడిన శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన ఆ మహా దర్శకుడు తరలి వెళ్లిపోయారు. మావి చిగురు తినగానే పలికే కోయిలను కోయిల గొంతు వినగానే తొడిగే మావిచిగురును చూపిన కళాహృదయుడు తన శకాన్ని ముగించారు. కళాతపస్వి కె విశ్వనాథ్ గురువారం(ఫిబ్రవరి 2న) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయనతో ఉన్న అనుబంధాలను నెమరువేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తన సినిమాల గురించి ఈ కళాతపస్వి వివిధ సందర్భాల్లో ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూల్లోని కొన్ని పదనిసలు ఈ విధంగా... సినిమా టైటిల్స్‌లో ‘ఎస్’ సెంటిమెంట్ ఎందుకు? విశ్వనాథ్: సినిమా వాళ్ళం పిరికివాళ్ళమండీ! కోట్ల రూపాయలతో వ్యాపారం చేస్తాం కదా... భయాలు, సెంటిమెంట్లు ఎక్కువ! ‘ఎస్’తో పెట్టిన రెండు సినిమాలు వరుసగా హిట్ కావడంతో అలా పెట్టుకుంటూ వచ్చాను. మరి ‘ఆపద్బాంధవుడు’ దగ్గర ఆ రిస్క్ ఎందుకు తీసుకున్నారు? బాగా గుర్తు... ఓరోజు ‘ఏ టైటిల్ అయితే బావుంటుంది ఈ సినిమాకు?’ అనుకుంటుండగా... క్యారెక్టర్‌కి తగ్గట్టుగా అయితే ‘ఆపద్బాంధవుడు’ బాగుంటుందన్నాను. అందరూ ఓకే అన్నారు. మరి ఎందుకని ఆ రోజు ఆ ‘ఎస్’ సెంటిమెంట్ మైండ్ నుంచీ స్లిప్ అయిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. మీరు పాటలు కూడా రాసేవారట... సందర్భం వచ్చింది కాబట్టి చెబితే తప్పులేదేమో! నేను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే సిట్యుయేషన్‌కి తగ్గ పాట-లిరిక్ రాసుకుంటాను. దానికి నేను ‘అబద్ధపు సాహిత్యం’ అని పేరుపెట్టాను. అలా ఫ్లోలో రాసి, తర్వాత సినిమాలో ఉంచేసిన పల్లవులెన్నో – ‘స్వాతిముత్యం’లో ‘వటపత్రసాయికి...’, ‘శ్రుతిలయలు’లో ‘తెలవారదేమో స్వామీ...’, ‘స్వాతికిరణం’లో ‘తెలిమంచు కరిగింది...’ – అలా... చాలానే ఉన్నాయి. మరి పాటంతా మీరే రాయొచ్చుగా? కొన్ని రాశాను... ‘స్వరాభిషేకం’లో ‘కుడి కన్ను అదిరెను...’ పాట పూర్తిగా నేనే రాశాను. అయితే పేరు వేసుకోలేదు. రాసింది చెప్పుకోవడంలో తప్పేముందండీ ఏమో, చెప్తే నమ్ముతారో లేదో జనాలు! మిమ్మల్ని నమ్మకపోవడమా! అలా అని కాదు... నాకసలు పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఇష్టం ఉండదు. (నవ్వుతూ) ఏదోపెళ్ళిచూపులకెళ్తే ‘ఆయన పెట్టుకున్న ఉంగరం కూడా నాదే!’ అని ఎవరో అన్నట్టు... ‘ఫలానా సినిమాలో ఫలానా పాటకు పల్లవి నేనే రాశాను’ అని ఏం చెప్పుకుంటాను చెప్పండి? మీ కుటుంబం నుంచి ఎవ్వరూ సినిమా ఫీల్డ్కి రాకపోవడానికి కారణం? నేనే ప్రోత్సహించలేదు. వాళ్లు ఇక్కడ రాణిస్తారనే నమ్మకం నాకు లేదు. ఈ రోజుల్లో పైకి రావడమంటే చాలా కష్టం. మా రోజులు వేరు. ప్రతిభను గుర్తించే మనుషులు అప్పుడు చాలామంది ఉండేవారు. డబ్బుల విషయంలోనూ, పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఇక్కడో అనిశ్చితి ఉంది. అందుకే మా పిల్లల్ని బాగా చదివించి వేరే రంగాల్లో స్థిరపడేలా చేశాను. విశ్వనాథ్ వారసులుగానైనా ఓ గుర్తింపు వచ్చేదేమో? నా గౌరవ మర్యాదలన్నీ నా బిడ్డలకు ట్రాన్స్ఫర్ కావాలనే రూలేమీ లేదిక్కడ. ఎవరికి వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి. నాలాగా మా పిల్లల్ని కూడా డైరెక్టర్లు చేయాలనుకుని నేను సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు తీయలేను కదా. అంత డబ్బు కూడా నేను సంపాదించలేదు. మా పిల్లలు ఫలానా కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్నారని నేను గర్వంగానే చెప్పుకోగలను. మ్యారేజ్ డే లాంటివి జరుపుకుంటారా? భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా ఉండాల్సింది పరస్పర నమ్మకం. ప్రేమ, గౌరవం మన హృదయాంతరాళంలో నుంచి రావాలి. అంతేకాని, ప్రత్యేకించి ఫాదర్స్ డే, మదర్స్ డే, ప్రేమికులదినం, వైవాహిక దినం – అని ఏడాదికి ఒకరోజే మొక్కుబడిగా చేసుకోవడంలో అర్థం లేదు. ఒక్కోసారి భోజనం కూడా మరచిపోయేవారట కదా? సినిమా రూపకల్పనలో ఉండగా ఒక్కొక్కప్పుడు గాఢంగా సంగీత, సాహిత్య చర్చల్లో మునిగిపోతే – అసలు టైమే తెలిసేది కాదు. భోజనవేళ దాటిపోతోందని ఎవరైనా గుర్తు చేస్తే కానీ గుర్తొచ్చేది కాదు. సినిమా ఇండస్ట్రీ అంతా ఓ పోకడలో కొట్టుకుపోతూ, ప్రవాహంలో వెళ్తున్న టైమ్‌లో అడ్డుకట్ట వేసి మళ్లీ మీరు దాన్నివెనక్కి తెచ్చారనే భావన మీ అభిమానుల్లో ఉంది... నిజమే. ‘పాశ్చాత్య సంగీతపు పెను తుఫానులో రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతపుజ్యోతిని కాపు కాయడానికి తన చేతులు అడ్డు పెట్టినవారందరికీ పాదాభివందనం చేస్తున్నా’ అని ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి డైలాగ్ చెబుతాడు. నేను అలా చేశానని నాకు పాదాభివందనం చేయమని కాదు. అభిమానుల అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటాను. ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేను మూగవాణ్ణి అయిపోతా. నా బుద్ధి మేరకు నేను నిజంగానే చేశాను. క్లాసికల్ మ్యూజిక్, డ్యాన్స్ పెట్టి సినిమాలు చేస్తే ఎవరు ఆదరిస్తారు? ఇది కమర్షియల్ ఆర్ట్ కదా? మీ సినిమాలకు డబ్బు వస్తుందా? నిర్మాత ఏమవుతాడు? అన్నదానికి విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దాని ఫలితమే నాకు వచ్చిన అవార్డులు... ఈ రోజు (దాదా ఫాల్కే వచ్చిన సందర్భంగా..) వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా! -
కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్‌కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో జరిగాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. బంజారాహిల్స్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (92)కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా జరిగాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విశ్వనాథ్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి ఒంటి గంటకు ఫిలింనగర్‌లోని స్వగృహానికి తరలించారు. రాత్రి నుంచే విశ్వనాథ్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు భారీగా విచ్చేయడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శ్మశాన వాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. కన్నీరుమున్నీరైన చంద్రమోహన్ విశ్వనాథ్ భౌతికకాయాన్ని శుక్రవారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ సంతోష్ కుమార్, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కల్యాణ్, శరత్‌కుమార్, రాధిక, రాజశేఖర్, జీవిత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, శేఖర్ కమ్ముల, ఆది శేషగిరిరావు, దగ్గుబాటి సురేష్‌బాబు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ దర్శకత్వంలో సిరిసిరిమువ్వ సినిమాలో హీరోగా నటించిన చంద్రమోహన్ కన్నీరుమున్నీరయ్యారు. విశ్వనాథ్ భౌతికకాయాన్ని చూడటంతోనే ఆయన విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ మృతి బాధాకరం: మంత్రి తలసాని కళాతపస్వి విశ్వనాథ్ మృతి బాధాకరమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తలసాని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళల విశిష్టతను చాటేలా అనేక చిత్రాలు నిర్మించిన గొప్ప దర్శకులంటూ కొనియాడారు. ఏపీ ప్రభుత్వం తరపున.. విశ్వనాథ్ అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను సృజనాత్మక శైలిలో ప్రేక్షకులకు అందించిన కళాతపస్వి మరణించడం సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ్: ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ ప్రపంచంలో కె.విశ్వనాథ్ ఒక దిగ్గజం. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి’.. అని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అసమాన ప్రతిభావంతుడు: గవర్నర్ తమిళిసై కె.విశ్వనాథ్ మృతిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక దిగ్గజ దర్శకుడు, నటుడిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన తన అసమాన ప్రతిభతో సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అరుదైన దర్శక దిగ్గజం: కేసీఆర్ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సా మాన్యమైన కథను ఎంచుకొని.. తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శ కుడు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో.. సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు: జగన్ సాక్షి, అమరావతి: సినీ దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాల్లో ట్వీట్ చేశా రు. ‘విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, బారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వం రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి’ అని పేర్కొన్నారు. స్పీకర్, మంత్రుల సంతాపం కె.విశ్వనాథ్ మరణంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా తీయాలనుకున్నా విశ్వనాథ్‌తో సినిమా తీయాలన్న తన ఆశ కలగానే మిగిలిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కె.విశ్వనాథ్ మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపం తెలిపారు. -
కె విశ్వనాథ్.. ఆయన సృష్టించిన అద్భుత స్త్రీ పాత్రలివే..!
పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు అరచేతులు అడ్డుపెడుతుంది ఒక స్త్రీ. ఒక గొప్ప నాట్యకారుడి అంతిమ రోజులను అర్థమంతం చేస్తుంది మరో స్త్రీ. తనలోని కళను తాను కనుగొనడానికి గొప్ప సంఘర్షణ చేస్తుంది ఒక స్త్రీ. వ్యసనపరుడైన భర్తను సంస్కరించడానికి ఎడబాటు నిరసనను ఆశ్రయిస్తుంది మరో స్త్రీ. ప్రేమకు కులం లేదు అనే స్త్రీ... వరకట్నం వద్దు అనే స్త్రీ.. మందమతితో జీవితాన్ని పునర్నిర్మించుకునే స్త్రీ. అతడు చూపిన స్త్రీలు ఆత్మాభిమానం కలిగిన స్త్రీలు. ఆత్మవిశ్వాసాన్ని కలిగిన స్త్రీలు. భారతీయ సంస్కృతిని గౌరవించాలనుకునే స్త్రీలు. అలాంటి వారి పాత్రలను తీర్చిదిద్దిన కె.విశ్వనాథ్ సినిమాలను ఓసారి గుర్తు చేసుకుందాం. ‘శంకరాభరణం’లో మంజుభార్గవి ఆమెకు సంగీతం, నృత్యం అంటే ప్రాణం. కాని తల్లి ఆమెను ఒక వేశ్యను చేయాలనుకుంటుంది. బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిగేలా చూస్తుంది. ఆమె కడుపున నలుసు పడుతుంది. కాని అది ఇష్టం లేని సంతానం. ఒక పాము కాటేస్తే వచ్చిన గర్భం. పుట్టబోయేది కూడా పామే. ఆమె అబార్షన్ చేయించుకోదు. ఆత్మహత్య చేసుకోదు. ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు సంగీతం నేర్పిస్తుంది. తరువాత తను దేవుడిగా భావించే శంకరశాస్త్రి దగ్గరకు పంపి ఆయన శిష్యుడిగా మారుస్తుంది. బయట దారిలో కనిపిస్తే ‘పాము’ పామే అవుతుంది. కాని శివుని మెడలో ఉండి కనిపిస్తే ‘శంకరాభరణం’ అవుతుంది. అథోముఖమైన తన జీవితాన్ని ఊర్థ్వంలోకి మార్చుకుని సంతృప్తి పొందిన ఆ స్త్రీ ‘శంకరాభరణం’లో మంజుభార్గవి. ఆ పాత్రను అంత తీక్షణంగా, ఔన్నత్యంగా తీర్చిదిద్దినవారు దర్శకడు కె.విశ్వనాథ్. ఒక కళాకారున్ని తెలుసుకోవాలంటే అతడు పుట్టించిన పాత్రలను చూడాలి. మహిళల పట్ల అతడి దృక్పథం తెలియాలంటే అతడు సృష్టించిన మహిళా పాత్రలను చూడాలి. కె.విశ్వనాథ్ సృష్టించిన మహిళా పాత్రలు ప్రేక్షకులకు నచ్చిన పాత్రలు. ప్రేక్షకులు మెచ్చిన పాత్రలు. అంతేకాదు పరోక్షంగా తమ ప్రభావాన్ని వేసే పాత్రలు. ‘శుభలేఖ’ సినిమాలో సుమలత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత లెక్చరర్. ఎంతో చక్కని అమ్మాయి. ఆమెతో జీవితం ఏ పురుషుడికైనా అపురూపంగా ఉండగలదు. కాని ఆమెను కోడలిగా తెచ్చుకోవడానికి బోలెడంత కట్నం అడుగుతాడు ఆ సినిమాలో పెద్దమనిషి సత్యనారాయణ. డబ్బు, కానుకలు, కార్లు... ఒకటేమిటి అడగనిది లేదు. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఊరుకుంటుందా? సుమలత తిరగబడుతుంది. సంతలో పశువును కొన్నట్టు వరుణ్ణి కొననని చెప్పి సంస్కారం ఉన్న వ్యక్తి హోటల్లో వెయిటర్ అయినా సరే అతణ్ణే చేసుకుంటానని చిరంజీవిని చేసుకుంటుంది. మనిషికి ఉండాల్సిన సంస్కార సంపదను గుర్తు చేస్తుంది ఈ సినిమాలో సుమలత. ‘సాగర సంగమం’లో జయప్రద ‘సాగర సంగమం’లో జయప్రద ఫీచర్ జర్నలిస్ట్. చదువుకున్న అమ్మాయి. భారతీయ కళలు ఎంత గొప్పవో తెలుసు. అందుకే కమల హాసన్‌లోని ఆర్టిస్ట్‌ను గుర్తించింది. అతన్ని ఇష్టపడటం, కోరుకోవడం జరక్కపోవచ్చు. అతడి కళను ఇష్టపడటం ఆపాల్సిన అవసరం లేదని గ్రహిస్తుంది. విఫల కళాకారుడిగా ఉన్న కమల హాసన్ చివరి రోజులను అర్థవంతం చేయడానికి అతడిలోని కళాకారుణ్ణి లోకం గుర్తించేలా చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. తన కుమార్తెనే అతని శిష్యురాలిగా చేస్తుంది. ఆమె రాకముందు అతడు తాగుబోతు. కాని మరణించే సమయానికి గొప్ప కళాకారుడు. స్త్రీ కాదు లత. ఒక్కోసారి పురుషుడే లత. ఆ లతకు ఒక దన్ను కావాలి. ఆ దన్ను జయప్రదలాంటి స్త్రీ అని ఆ సినిమాలో విశ్వనాథ్ చూపిస్తారు. ‘సప్తపది’లో ఆ అమ్మాయి అతడి కులాన్ని చూడదు. అతడి చేతిలోని వేణువునే చూస్తుంది. ఆ వేణునాదాన్నే వింటుంది. ఏడడుగుల బంధంలోకి నడవాలంటే కావాలసింది స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడే పరస్పర ప్రేమ, గౌరవం. అంతే తప్ప కులం, అంతస్తు కాదు. సంప్రదాయాల కట్టుబాట్లు ఉన్న ఇంట పుట్టినా హృదయం చెప్పిందే చేసిందా అమ్మాయి. ఆమె ప్రేమను లోకం హర్షించింది. స్వర్ణకమలం’లో భానుప్రియ యువతకు లక్ష్యం ఉందా? కళ పట్ల అనురక్తి ఉందా? తమలోని కళను కాకుండా కాసులను వెతికే వేటను కొనసాగిస్తే అందులో ఏదైనా సంతృప్తి ఉందా? ‘స్వర్ణకమలం’లో గొప్ప నాట్యగత్తె భానుప్రియ. కాని ఆ నాట్యాన్ని ఆమె గుర్తించదు. ఆ కళను గుర్తించదు. ఒక కూచిపూడి నృత్యకళాకారిణిగా ఉండటం కన్నా హోటల్లో హౌస్‌కీపింగ్‌లో పని చేయడమే గొప్ప అని భావిస్తుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఉంది. తెగువ ఉంది. చురుకుదనం ఉంది. టాలెంట్ ఉంది. స్వీయజ్ఞానమే కావాల్సింది. కాని చివరలో ఆత్మసాక్షాత్కారం అవుతుంది. తను గొప్ప డ్యాన్సర్ అవుతుంది. మూసలో పడేవాళ్లు మూసలో పడుతూనే ఉంటారు. కొత్తదారి వెతికినవారు భానుప్రియ అవుతారు. మీరు మాత్రమే నడిచే దారిలో నడవండి అని చెప్పిందా పాత్ర. ‘స్వాతిముత్యం’లో రాధిక లైఫ్‌లో ఒక్కోసారి ఆప్షన్ ఉండదు. మనం టిక్ పెట్టేలోపలే విధి టిక్ పెట్టేస్తుంది. ‘స్వాతిముత్యం’లో రాధికకు భర్త చనిపోతాడు. ఒక కొడుకు. ఆ కష్టం అలా ఉండగానే మందమతి అయిన కమల హాసన్ తాళి కట్టేస్తాడు. అంతవరకూ ఆమె జీవితం ఏమిటో ఆమెకు తెలియదు. ఇప్పుడు ఒక మీసాలు లేని, ఒక మీసాలు ఉన్న పిల్లాడితో కొత్త జీవితం నిర్మించుకోవాలి. ఆమె నిర్మించుకుంటుంది. అతణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. అడ్డంకులను జయించుకుంటూ అతడి ద్వారా తన జీవితాన్ని జయిస్తుంది. స్థిర సంకల్పం ఉంటే కష్టాలను దాటొచ్చని చెబుతుంది. కె.విశ్వనాథ్ మహిళా పాత్రలలో స్వాతిముత్యంలో రాధిక పాత్ర మర్చిపోలేము. 'శృతిలయలు' లో సుమలత ‘శృతిలయలు’లో సుమలత భర్త రాజశేఖర్. కళకారుడు. కాని స్త్రీలోలుడు అవుతాడు. వ్యసనపరుడవుతాడు. లక్ష్యరహితుడవుతాడు. అతన్ని సరిచేయాలి. దానికి ఇంట్లో ఉండి రాద్ధాంతం పెట్టుకోదు ఆమె. కొడుకును తీసుకుని దూరం జరుగుతుంది. హుందాగా ఉండిపోతుంది. ఎదురు చూస్తుంది. ఏ మనిషైనా బురదలో ఎక్కువసేపు ఉండలేరు. రాజశేఖర్ కూడా ఉండలేకపోతాడు. మగాడికి గౌరవం కుటుంబంతోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం భార్య సమక్షంలోనే అని గ్రహిస్తాడు. మగాడికి గౌరవం ఒక లక్ష్యంతో పని చేయడమే అని గ్రహిస్తాడు. ఆమె పాదాల దగ్గరకు తిరిగి వస్తాడు. విశ్వనాథ్ సృష్టించిన స్త్రీలు లౌడ్‌గా ఉండరు. కాని వారు స్పష్టంగా ఉంటారు. సౌమ్యంగా ఉంటారు. స్థిరంగా సాధించుకునే వ్యక్తులుగా ఉంటారు. సమాజంలో స్త్రీలకు ఉండే పరిమితులు వారికి తెలుసు. కాని వాటిని సవాలు చేయడం పనిగా పెట్టుకోకుండా ఆ ఇచ్చిన బరిలోనే ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటారు. విశ్వనాథ్ స్త్రీలు తెలుగుదనం చూపిన స్త్రీలు. మేలిమిదనం చూపిన స్త్రీలు. అందమైన స్త్రీలు... రూపానికి కాని... వ్యక్తిత్వానికి కాని! -
కె విశ్వనాథ్ మృతికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి ఘన నివాళి
వెండితెర కళాతపస్వి కె విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం(ఫిబ్రవరి 3న) మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశాన వాటికలో ముగిశాయి. ఫిలిం నగర్ నుంచి పంజాగుట్ట వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి ఆయన ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దర్శక దిగ్గజంగా ఎదిగిన కె. విశ్వనాథ్ తన మొదటి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకున్నారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటనతో కూడా అందరిని మెప్పించే పాత్రలు చేసి సినీ ప్రేక్షక హృదయాల్లో చిరస్మరణీయడుగా నిలిచారు. ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి సినిమాలతో దేశ సినిచరిత్రలో కె.విశ్వనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు, రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ వంటి అత్యున్నతమైన అవార్డులను కె.విశ్వనాథ్ అందుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను కోల్పోవడం తెలుగు సినీ రంగానికి తీరని లోటు’ అని మంత్రి పేర్కొన్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
కళాతపస్వికి తెలుగులో నివాళులు అర్పించిన ఇళయరాజా, వీడియో రిలీజ్..
కళాతపస్వి కె విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గురువారం రాత్రి అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడాచారు. దీంతో ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలనాటి హీరో, సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆయన పార్థివ దేహం వద్ద బోరున విలపించిన దృశ్యం అందరిని కలిచివేసింది. ఇక ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వాపోయారు. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అలా సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోల నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు సోషల్ మీడియాలో కళాతపస్వికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మ్యూజికల్ మ్యాస్ట్రో, ఎంపీ ఇళయరాజా తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఇళయరాజా తెలుగులో మాట్లాడుతూ విశ్వనాథ్‌కు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో వీడియో పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా ముఖ్యమైన, ప్రధాన స్థానంలో ఉన్న, చాలా ముఖ్యమైన దర్శకుడు కె విశ్వనాథ్ గారు దేవుడు పాదాల వద్దకు వెళ్లారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని కోరుకుంటున్నా’ అంటూ నివాళులు అర్పించారు. చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! pic.twitter.com/blfTwMxHWW — Ilaiyaraaja (@ilaiyaraaja) February 3, 2023 -
K Viswanath Funeral Photos: కళాతపస్వి కె విశ్వనాథ్ అంత్యక్రియలు.. ఫొటోలు
-
'అలా అయితే.. కె విశ్వనాథ్ సగం హైదరాబాద్ కొనేసేవారు'
కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రతి సినిమా ఆణిముత్యమే. అంతా దర్శక ప్రతిభతో సినిమాలు తెరకెక్కించారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. మరి ఆయన తన సినిమాలకు తీసుకున్న పారితోషికం తీసుకునేవారు. అప్పట్లో ఆయన సినిమాలకు ఎంత పారితోషికం ఇచ్చేవారో ఓసారి పరిశీలిద్దాం. అలా అయితే కోట్ల బంగ్లా ఉండాల్సింది కె విశ్వనాథ్ మొదటి నుంచీ కొన్ని సిద్ధాంతాలకు పరిమితమైపోయారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకోకుండా ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమానే చేసేవారు. 'శంకరాభరణం' తర్వాతవచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని ఉంటే.. అప్పటికే సగం హైదరాబాద్ కొనేసేవాడినని ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. ఆయన చేసినవన్నీ దాదాపు రిస్కీ ప్రాజెక్టులే. అందుకే ఏనాడూ భారీ పారితోషికాలు కావాలని డిమాండ్ చేసేవారు కాదట. వాళ్లు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకునేవారట. ఆయన జీవితం మొత్తం అలానే సాగిపోయింది. ఆయన సక్సెస్ రేటు, చేసిన సినిమాల సంఖ్యను బట్టి చూస్తే కచ్చితంగా ఫిల్మ్ నగర్లో కోట్లు విలువ చేసే బంగ్లా ఉండాల్సిందే. ఆ విషయంలో చాలా బాధ పడేవారు ఎందుకంటే ఇప్పుడున్నవాళ్లతో పోల్చు కుంటే చాలా బాధగా ఉంటుందని అనేవారు. అది మానవ నైజమని.. ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు కూడా ఎందుకు తీసుకోలేదు? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటూందని చెప్పేవారు. మళ్లీ వెంటనే మనసుకు సర్ది చెప్పుకునేవారు. ఒక్కసారి ఆ డబ్బు మాయలో పడిపోతే సృజతనాత్మకత పక్కకు వెళ్లిపోతుందని ఆయన అభిప్రాయం. అందుకే ఓసారి చిరంజీవి ఆయనతో ఇలా అన్నారట. మేమంతా అండగా ఉంటాం. సొంతంగా సినిమా చేసుకోండి అన్నారట. అప్పుడు కె విశ్వనాథ్ తన వల్ల కాదని చెప్పేశారు. ఆయన అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా? అప్పట్లో కె.విశ్వనాధ్ తీసుకున్న పారితోషికంపై అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. ఈ విషయంపై ఆయనను ప్రశ్నిస్తే.. అది మీరడగకూడదు. నేను చెప్పకూడదని నవ్వుతూ సమాధానమిచ్చేవారు. నిజంగానే ఆయన పారితోషికం ఎప్పుడే గానీ ఎక్కువగా తీసుకునేవారు కాదట. ఒక్కోసారి ఆయన సినిమాల్లో పాటలకు ఆయనే నృత్య దర్శకత్వం చేయాల్సి వచ్చేది. దానికి అదనంగా పారితోషికం తీసుకోవచ్చు కానీ ఎప్పుడే కానీ అలా చేయలేదట. అయితే అప్పుడు అడిగి ఉండాల్సిందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుందని ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. ఆయన తన అనుభవాలతో పరిశ్రమలో అడగకపోతే అడగనట్టే ఉంటుంది. తొమ్మిది గంటలకు రావాల్సిన కారు రాకపోతే వెంటనే ఆటోలో వెళ్లేవారట. నాతో పాటు ఉన్న దర్శకులు ఎంత తీసుకుంటున్నారో కూడా ఎప్పుడేగానీ ఆరా తీసేవారు కాదట. మనకు భగవంతుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడని గట్టిగా నమ్మేవారు కె విశ్వనాథ్. అందుకే ఆయన కళామతల్లి బిడ్డగా కళాతపస్వి బిరుదు పొందారని అనిపిస్తోంది. -
అర్ధరాత్రి లేచి మా గురించి ఆరా తీసేవారు: విశ్వనాథ్ పర్సనల్ బాయ్
కళాతపస్వి కె విశ్వనాథ్ గురువారం రాత్రి శివైక్యమయ్యారు. అభిమానులను పుట్టెడు దుఃఖంలో వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ పలువురు సెలబ్రిటీలు ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా విశ్వనాథ్ పర్సనల్ బాయ్ కిరణ్ కుమార్ దర్శకుడి గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'రెండు సంవత్సరాలుగా విశ్వనాథ్ సార్ దగ్గర పని చేస్తున్నా. ఆయన మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు. మాకు ఒంట్లో బాగోలేకపోయినా వెంటనే మెడికల్ షాప్ నుంచి మెడిసిన్ తెప్పిస్తారు. అర్ధరాత్రిళ్లు లేచి మరీ ఎలా ఉందని అడుగుతారు. అందరితో చాలా చనువుగా ఉంటారు. కుటుంబంతో కలిసి భోజనం చేయడానికే ప్రాముఖ్యతనిస్తారు. పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తే తనకు కనిపించి వెళ్లమనేవారు. ఆయన భార్య జయ లక్ష్మి మేడమ్‌కు గుడ్‌నైట్ చెప్పందే విశ్వనాథ్ సర్ నిద్రపోరు. నిన్న ఉదయం నుంచే ఆయన నీరసంగా ఉన్నాడు. రాత్రిపూట చివరగా నాగేంద్ర సార్‌తో మాట్లాడారు. సార్ మన మధ్య లేడంటే చాలా బాధగా ఉంది' అని విచారం వ్యక్తం చేశాడు కిరణ్. చదవండి: శంకరాభరణం గురించి ఈ విశేషాలు తెలుసా? -
కె.విశ్వనాథ్‌కు అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
గర్భగుళ్లో అభిషేకం చేస్తున్నంత పవిత్రంగా.. అమ్మ ఒళ్లో పసిపాపను లాలిస్తున్నంత ప్రేమగా.. సముద్రంలో కలిసిపోతున్న నదీమతల్లంత పరవశంగా.. వెండితెరపై సినిమాను సాకాడాయన.. అందుకే మనకిన్ని కళాఖండాలు.. కలకండలు.. పనినే తపస్సుగా ఆచరించిన ఈ కళాతపస్వి ప్రతి ప్రయత్నం సుందరం.. సుమధురం.. సున్నితం.. సమున్నతం.. సముద్రం.. ఇంతటి కీర్తి గడించిన ఆయన కెరీర్ ఎలా మొదలైందో ఓసారి చూద్దాం. కళా తపస్వి కె విశ్వనాథ్‌కు సంగీతమంటే చాలా ఇష్టం. అది నేర్చుకోవాలనుకున్నా కానీ కుదరలేదు. ఆయన ఇంట్లో వాళ్లు ఇంజినీర్ చేయాలనుకున్నారే కానీ.. ఆయనలోని సంగీత తపనను మాత్రం గుర్తించలేకపోయారు. అప్పట్లో బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి ప్రారంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి జనరల్ మేనేజర్‌గా విశ్వనాథ్ తండ్రి పనిచేసేవారు. కానీ ఆయన సినిమాల్లో రావడానికి అది కారణం కాదు. అప్పట్లోనే మద్రాసులో కొత్తగా వాహినీ స్టూడియోస్ ప్రారంభించారు. అందులో యంగ్ గ్రాడ్యుయేట్స్‌ని ట్రైనింగ్ ఇచ్చి టెక్నీషియన్స్‌గా తీసుకునేవారు. ఆ విషయం గురించి తెలిసిన అంకుల్ ఒకరు.. మనవాడిని ఎందుకు చేర్చకూడదని విశ్వనాథ్ తండ్రితో చెప్పారట. ఆ తర్వాత విశ్వనాథ్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నాన్న చెప్పగానే సౌండ్ డిపార్ట్మెంట్లో చేరారు కె. విశ్వనాథ్ ఆ రోజుల్లో ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్లకు చాలా గౌరవం ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా ఆర్టిస్ట్ డైలాగ్స్ చెప్పలేకపోతే సౌండ్ రికార్డిస్ట్ సాయం తీసుకునేవాళ్లని చెప్పేవారు. నీకేం తెలుసు.. నువ్వెవరు చెప్పడానికి అని గర్వం ఉండేది కాదు. అందుకని అప్పట్లో ఎదైనా చెప్పడానికి చాలా స్వేచ్ఛ ఉండేదని.. రకరకాల సన్నివేశాలు, వ్యక్తులు, వారి మనస్తత్వాలు లాంటి అనుభవం పొందడానికి మంచి అవకాశం దొరికేదని విశ్వనాథ్ చెప్పేవారు. సినీరంగంలో మొదట కె.విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్గానే ప్రారంభమైంది. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతిభ, ఆసక్తిని గమనించి అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావులు సౌండ్ రికార్డింగ్కే ఎందుకు పరిమితం అవుతారు. క్రియేటివ్ సైడ్ ఎందుకు రాకూడదు అడిగారట. ఆ తర్వాతే మూగమనసులుతో పాటు కొన్ని చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సౌండ్ రికార్డిస్ట్‌గా చేరినప్పుడు డైరెక్టర్ అవుతానని ఎప్పుడు కూడా అనుకోలేదనట విశ్వనాథ్. -
K Viswanath Funeral: ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు
సినీ దిగ్గజం కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్(92)మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Director K Viswanath Photos: కళాతపస్వి కే. విశ్వనాథ్ ఫొటోగ్యాలరీ
-
థియేటర్ బయట చెప్పులు విడిచి చూసిన చిత్రమిది!
మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుపులు సరిసరి నటనలు సిరిసిరి మువ్వలు కాబోలు.. అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరుకు ప్రేక్షకులు పరవంశించిపోయారు. శంకరాభరణంలో ప్రతి ఫ్రేమూ, ప్రతి మాటా, ప్రతి పాటా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. ఒకసారి చూస్తే తనివి తీరదన్నట్లుగా ప్రేక్షకులు థియేటర్లలోనే ఐదారుసార్లు చూశారు. పైగా చాలాచోట్ల థియేటర్ బయటే చెప్పులు విడిచిపెట్టి శంకరాభరణం చూడటం విశేషం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు(1980, ఫిబ్రవరి 3న) శంకరాభరణం రిలీజైంది. తన సినిమా రిలీజైన రోజే తనువు చాలించారు కె.విశ్వనాథ్. ఈ సందర్భంగా శంకరాభరణం కథ, ప్రత్యేకతలేంటో చూద్దాం.. గంజాయివనంలో తులసి పుట్టింది. ఆ తులసికి డబ్బంటే మోజు లేదు. నగలంటే మోహం లేదు. తన తల్లిలా ఐశ్వర్యం అంటే పిచ్చి లేదు. మగవాళ్ల విలాసవస్తువుగా మారి విలువలు లేని జీవితం గడపాలన్న తాపత్రయం లేదు. తులసి నిజంగా తులసి మొక్క అంత పవిత్రమైనది. స్త్రీ దేహానికి విలువ కట్టి వలువ ఊడదీసే ఇంట్లో పుట్టిన తులసికి సంగీతం అంటే ఇష్టం. గానం అంటే ప్రాణం. నృత్యం అంటే అభిమానం. ముఖ్యంగా ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి అంటే ఆర్తి. ఎలాంటి ఆర్తి అది? ఆయన శివుడు అయితే తను నందిలా ప్రణమిల్లాలని, ఆయన విష్ణువైతే తను పారిజాతంలా పాదం వద్ద పడి ఉండాలని, ఆయన బ్రహ్మ అయితే విశ్వసృజనలో తానొక సింధువులా మారాలని.. అంత భక్తి. ఈ భక్తిలో ఆత్మకు తప్ప శరీరానికి విలువ లేదు. ఉనికి లేదు. కన్న తల్లే తనను అమ్మేయాలనుకున్న సమయంలో తులసిని ఆదుకుంటాడు శంకరశాస్త్రి. కానీ ఊరు వేరేలా అర్థం చేసుకుంది. తనను అభిమానించి చేరదీసిన శంకరశాస్త్రిని తప్పు బట్టింది. ఊరు వెలేసే ‘కులట’ను చేరదీసినందుకు శంకరశాస్త్రిని బహిష్కరించింది. ఆయనను బహిష్కరిస్తే తప్పు లేదు. ఆయన సంగీతాన్ని కూడా బహిష్కరించింది. ఇది తట్టుకోలేని తులసి ఆయన కోసం ఆయనను దూరంగా వదిలిపోతుంది. శంకర శాస్త్రి– తులసి.. ఒక పాము వీధిన కనబడితే కేవలం అది పాము, విషపురుగు. అదే శివుని మెడలో కనబడితే ఆభరణం. శివుని ఆభరణం.. శంకరాభరణం. పూజలు అందుకుంటుంది. శంకరశాస్త్రి తానొక శంకరాభరణం అని లోకానికి తెలియచేయాలి. తులసి తానొక శంకరాభరణం అని నిరూపించుకోవాలి. సంగీతం కోసం జీవించి, సంగీతాన్ని శోధించి, సంగీతాన్ని ఆరాధించి, సంగీతంలో ఐక్యమై శంకరాభరణంలా గౌరవం పొందిన ఆ ఇద్దరి కథే శంకరాభరణం. మాసిపోయిన వైభవం.. ఒకప్పుడు గజారోహణం, గండపెండేరం బహూకరణ, సన్మానం, సత్కారం, కచేరి అంటే విరగబడే జనాలు... ఆ వైభవం కాలం గడిచే కొద్దీ మాసిపోయింది. శాస్త్రీయ సంగీతం అరుపులు కేకల సినీ సంగీతంలో మూల్గుల నిట్టూర్పుల పాశ్చాత్య సంగీతంలో పడి కొట్టుకుపోయింది. ఎవరూ శంకరశాస్త్రిని పిలిచేవారు లేరు. పలుకరించేవారు కూడా లేరు. ఆయన కూతురు పెళ్లికి ఎదిగి వచ్చింది. కాని పెళ్లి చేసే డబ్బు లేదు. శరీరాన ఉన్న వస్త్రాలు జీర్ణమయ్యాయి. కొత్త వస్త్రాలు కొనుక్కునే స్థోమత లేదు. మిగిలిందల్లా కంఠాన కొలువున్న సంగీతం. దివారాత్రాలు తోడుండే స్వరాలు. తిరిగొచ్చిన తులసి.. ఇలాంటి స్థితిలో ఆనాడు వదిలి వెళ్లిన తులసి తిరిగి వస్తుంది. తల్లి చనిపోగా బోలెడంత ఆస్తి కలిసి రాగా ఆ ఆస్తితో ఏదైనా సత్కార్యం చేయాలని శంకరశాస్త్రిని వెతుక్కుంటూ వస్తుంది. అందుకు మాత్రమే కాదు. తనను ఒక మగవాడు కాటేశాడు. అందువల్ల తాను గర్భవతి అయ్యింది. తన కడుపున కూడా కొడుకు రూపంలో ఒక పాము పుట్టింది. ఆ పామును శంకరశాస్త్రి పాదాల చెంత చేర్చి, సంగీతం నేర్చుకునేలా చేసి, ఆ పామును శంకరాభరణం చేయాలన్న లక్ష్యంతో వచ్చింది. దొరకునా ఇటువంటి సేవా... తులసి కొడుకు శంకరశాస్త్రి శిష్యుడవుతాడు.ప్రభ కోల్పోయిన శంకరశాస్త్రి పూర్వపు వెలుగును సంతరించుకుంటూ తన చివరి కచ్చేరి ఇస్తాడు. సభికులు కిక్కిరిసిన ఆ సభలో ‘దొరకునా ఇటువంటి సేవా’ అంటూ సంగీతాన్ని అర్చించడానికి మించిన సేవ లేదంటూ పాడుతూ పాట సగంలో వుండగా ప్రాణం విడుస్తాడు. కాని సంగీతం అంతమాత్రాన ఆగిపోతుందా? అది జీవనది. శంకరశాస్త్రి శిష్యుడు, తులసి కొడుకు అయిన పిల్లవాడు మిగిలిన పాటను అందుకుంటాడు. గొప్ప సంగీతం, మరెంతో గొప్ప సంస్కారం, సంస్కృతి ఎక్కడికీ పోవు. మనం చేయవలసిందల్లా పూనిక చేయడమే. ఆదరించడమే. కొత్తతరాలకు అందించడమే. ఇవన్నీ సమర్థంగా సక్రమంగా చెప్పడం వల్ల శంకరాభరణం క్లాసిక్ అయ్యింది. కలెక్షన్ల శివ తాండవం ఆడింది. సినిమాలలో కైలాస కొండలా అంత ఎత్తున బంగారువర్ణంలో నిలిచింది. శంకరాభరణంకు ఊహించని రెస్పాన్స్ 1980లో విడుదలైన ‘శంకరాభరణం’ తెలుగువారి కీర్తి కారణాలలో ఒకటిగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని బీడువారిన నేల ఎదురు చూస్తున్న కుంభవృష్టి అదేనని సినిమా విడుదలయ్యాక తెలిసివచ్చింది. ఈ నేలలో, ఈ ప్రజల రక్తంలో నిబిడీకృతమైన పురా సంస్కృతిని తట్టి లేపడం వల్ల ఆ సినిమా ప్రజల ఆనందభాష్పాలతో తడిసి ముద్దయింది. అవుతూనే ఉంది. దర్శకుడు కె.విశ్వనాథ్ మలినం లేని ఉద్దేశ్యంతో తెరకెక్కించడం వల్ల ఆ స్వచ్ఛత సినిమా అంతా కనిపిస్తుంది. ఈ సినిమా సంగీతాన్ని సంస్కరించడం మాత్రమే కాదు మన సంస్కారాన్ని సంస్కరించే పని చేయడం వల్ల కూడా ఆకట్టుకుంది. నాటు సారా తాగినా అవే పాటలు.. శంకరశాస్త్రిగా జె.వి.సోమయాజులు, తులసిగా మంజుభార్గవి జన్మలు ధన్యమయ్యాయి. సంగీతం అందించిన కె.వి.మహదేవన్, పాటలు రాసిన వేటూరి సుందరరామమూర్తి, పాడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చరితార్థులయ్యారు. ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ’ అంటూ ఈ సినిమా రిలీజైన రోజుల్లో రిక్షావాళ్లు కూడా గొంతు కలిపారు. నాటుసారా తాగి ‘శంకరా’ అని పాట ఎత్తుకున్నారు. చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, నిర్మలమ్మ వీళ్లంతా ఒకెత్తయితే శంకరశాస్త్రి స్నేహితుడిగా నటించిన అల్లు రామలింగయ్య ఒక్కడే ఒకెత్తు. కథను సూత్రధారిలా నడిపిస్తాడు. పొంగే శంకరశాస్త్రిపై చిలకరింపులా పడి అతడిని పాలుగా మిగులుస్తుంటాడు. అతడే శంకరశాస్త్రికి స్నేహితుడు, కొడుకు, కన్నతండ్రి. చదవండి: సిరివెన్నెల సినిమా కోసం చిత్రవధ పడ్డ విశ్వనాథ్ -
కళాతపస్వి కె. విశ్వనాథ్ తీసిన ప్రతీ సినిమా ఓ ఆణిముత్యమే
కళాతపస్వి కె. విశ్వనాథ్..కళామతల్లి ముద్దుబిడ్డ అనే పేరుకు అసలైన రూపం. తెలుగు సినిమాకు గౌరవం, గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. సౌండ్ రికార్డిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా, దర్శకుడిగా ఎన్నో అత్యున్నత చిత్రాలను తెరకెక్కించారు. సినిమా అంటే కేవలం కమర్షియల్ హంగులు,డ్యాన్సులు మాత్రమే కాదని, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, కళలకు ప్రతిరూపం అని తన ప్రతి సినిమాల్లో నిరూపించిన మహారిషి కె. విశ్వనాథ్. స్టార్ హీరోలు లేకపోయినా, సినిమా మొత్తం పాటలు ఉన్నా సామాజిక అంశాలను కథలుగా మార్చుకొని సినిమా హిట్స్ కొట్టారు. తెలుగుదనాన్ని సమున్నతంగా నిలబెట్టారు. ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు వారికి అందించారు. సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ఆయన తీసిన సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ఆలోచింపజేశాయి. ఇలా ఆయన సినిమాల కోసం ప్రేక్షకులే కాదు అవార్డులు, రివార్డులు ఎదురు చూసేవి. సంగీతం, సంస్కృతి, సంప్రదాయలకు అత్యంత విలువనిచ్చే కె. విశ్వనాథ్ కమర్షియల్ హంగులు లేకపోయినా కేవలం కళలతో హిట్స్ కొట్టొచ్చని నిరూపించిన డైరెక్టర్. తన సినీ ప్రస్థానంలో సుమారు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గానే కాకుండా, నటుడిగానూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరించారు. కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఎన్నో సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. తెలుగులో చివరగా హైపర్ సినిమాలో కనిపించారు. -
K Viswanath : కళాతపస్వి పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
కె.విశ్వనాథ్ చివరి క్షణాల్లో జరిగిందిదే..
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలను అందించిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ శంకరాభరణం రిలీజ్ రోజే శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన చివరి క్షణాల వరకూ కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి ముందు ఓ పాట రాయడానికి పూనుకున్నారు. సాంగ్ రాస్తూ.. కాసేపటికి దాన్ని రాయలేక కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమన్నారు. ఆయన పాట రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా కె.విశ్వనాథ్.. సాగరసంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శుభసంకల్పం, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం వంటి ఎన్నో అద్భుత దృశ్యకావ్యాలను చిత్రపరిశ్రమకు అందించారు. ఎందరో అగ్రహీరోలకు దర్శకత్వం వహించిన ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీరంగంలో ఆయన చేసిన కృషికి గానూ 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. చదవండి: కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇక లేరు -
తెలుగు సినిమా గొప్పదనం మీరు.. కె.విశ్వనాథ్‌కు ప్రముఖుల నివాళులు
మరో సినీ దిగ్గజం నేలకొరిగింది. కళా తపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయిందంటూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. Deeply grieved to hear of the demise of renowned film director, Sri K. Viswanath. As a film-maker he brought depth & dignity to the medium earning global recognition for his movies with a message. May his atma attain sadgati! Om shanti! pic.twitter.com/snX4RVsIVJ — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 3, 2023 Shocked beyond words! Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z — Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023 ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. Your signature on Telugu Cinema &art in general will shine brightly forever. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాము sir🙏🏻 — rajamouli ss (@ssrajamouli) February 3, 2023 Rest in peace Vishwanath garu … thank u for everything🙏🏻🙏🏻🙏🏻.. u Continue to live in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #RipLegend pic.twitter.com/QfjPIYAfsx — Anushka Shetty (@MsAnushkaShetty) February 3, 2023 Sad to hear about the passing of India’s 1st auteur director #KVishwanath ..He is gone , but his films will live forever 💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2023 Deeply saddened by the passing of legendary director K. Vishwanath Garu. His urge n passion for storytelling and his commitment to excellence have inspired many filmmakers like me to strive for the best in our own work. We all will miss him dearly... #RIPVishwanathGaru 🙏🏻 pic.twitter.com/PFvbOEuaFd — Krish Jagarlamudi (@DirKrish) February 3, 2023 Disheartening to know about the tragic news of #KVishwanath garu. Words may not suffice to express his loss. His contribution to Telugu Cinema will live on in our memories forever. My sincere condolences to his entire family & dear ones. OM SHANTI 🙏 — Ravi Teja (@RaviTeja_offl) February 3, 2023 We have lost another gem! What a legend! #KVishwanath gaaru will be remembered forever for his art, his passion and understanding of films. Never got an opportunity to work with him, but been a great admirer of his work. Will be missed. RIP #KVishwanathgaru Om Shanti 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/HNxvrELJnt — KhushbuSundar (@khushsundar) February 3, 2023 Rest in peace the legendary #KVishwanath sir .. You will remembered forever in our hearts , you always live through ur great films 🙏 Om shanti#RipLegend #RIPVishwanathGaru pic.twitter.com/XZE6aYUvP8 — Director Maruthi (@DirectorMaruthi) February 3, 2023 Ulaganayagan @ikamalhaasan posted a hand-written letter bidding goodbye to the Legendary director #KVishwanath garu. 💔#KViswanathGaru pic.twitter.com/5IMs70O8Hu — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 3, 2023 తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88 — Jr NTR (@tarak9999) February 2, 2023 Cinema is above Boxoffice. Cinema is above Stars. Cinema is above any individual. Who taught us this ? The greatest of greatest #KViswanathGaaru మీ రుణం …వీడుకోలు 🙏🏼🙏🏼🙏🏼 — Nani (@NameisNani) February 3, 2023 నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి 🙏🙏🙏 వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ ! — mmkeeravaani (@mmkeeravaani) February 2, 2023 -
అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్: సీఎం కేసీఆర్
హైదరాబాద్: కళా తపస్వి కె. విశ్వనాథ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశ్వనాథ్ మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్...అరుదైన దర్శకుడు కె. విశ్వనాథ్ అని కొనియాడారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారన్న సీఎం కేసీఆర్.. ఆయన తన సినిమాల్లో విలువలకు పెద్దపీట వేశారన్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీఎం కేసీఆర్. -
కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ అరుదైన ఫొటోలు
-
ఆ కథ.. తీరని వ్యథ.. ‘సిరివెన్నెల’పై కళాతపస్వి మానసిక సంఘర్షణ
భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకుని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కె. విశ్వనాథ్ కళాతపస్వి అనిపించుకున్నారు అయన ఆవిష్కరించిన శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకుని తెలుగుతెరపై ఒక కళాఖండంగా మిగిలిపోయింది. అలాగే, స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల.. ఇలా ఆయన ప్రతి చిత్రం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇంతటి గొప్ప చిత్రాలు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే తదితర అవార్డులతో సత్కరించింది. కానీ, తన సినిమాలతో ప్రేక్షకుల మనసుని తేలికపరిచే విశ్వనాథ్ మనసుని మాత్రం ఒక సినిమా చిత్రవధ చేసిందట. అదే ‘సిరివెన్నెల’ సినిమా. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మిమ్మల్ని బాగా తృప్తిపరిచిన సినిమా ఏది’ అని ప్రశ్నించగా.. విశ్వనాథ్ బదులిస్తూ, ‘కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందడు. ఇంకా ఏదో చేయాలి, సాధించాలనే అసంతృప్తితోనే బతుకుతాడు. నేను అంతే. కానీ, నన్ను మానసికంగా చాలా సంఘర్షణకు గురిచేసిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి.. కళ్లు కనబడని అబ్బాయి ఏంటి.. వారిద్దరి మధ్య సన్నివేశాలు సృష్టించడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు? ఆ కథ ఎందుకు మొదలుపెట్టానా అని ఎంతో బాధపడ్డా. చిత్రీకరణ మధ్యలో సినిమాను ముగించలేను, ఆపేయలేను.. ఆ సమయంలో మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించా’.. అంటూ విశ్వనాథ్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కట్ చేస్తే.. సిరివెన్నెల సినిమా తెలుగుతెరపై మరో కళాఖండమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కే. విశ్వనాథ్: ఇనుమడించిన పల్లెటూరు ప్రతిష్ట.. ‘సూపర్ స్టార్’కు శిక్షణ
తెనాలి: కల్మషం లేని పల్లె జీవితాలు.. పాడి పంటలతో భాసిల్లుతుండే పల్లెటూళ్లకు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ తన సినిమాల్లో పెద్దపీట వేశారు. మనవైన సంస్కృతీ సంప్రదాయాల ప్రస్తావన తప్పనిసరి. వీటన్నిటి మేళవింపుతో వినోదాత్మకమైన సినిమాతో చక్కని సందేశాన్ని ఇచ్చారు. అదికూడా కళాత్మకంగా, షడ్రుచుల సమ్మేళన విందు భోజనం అనిపించిన సంతృప్తితో ప్రేక్షకులు తెరబాట నుంచి ఇంటిబాట పట్టేలా ఉంటుంది. జనం మెచ్చిన ఈ సినీపరి‘శ్రమ’ను గుర్తించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఎస్సార్ జీవితకాల పురస్కారంతో ఇటీవలే సత్కరించింది. అంతలోనే ఆయన ఇకలేరన్న వార్త వినాల్సి రావటం దురదృష్టకరం. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో భట్టిప్రోలు మండలంలోని పెదపులివర్రు కె.విశ్వనాథ్ స్వస్థలం. కృష్ణాతీరంలో ఒకప్పుడు వాఘ్రపురంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం చోళరాజులు, విజయనగర రాజులు, జమీందారుల పాలనలో విలసిల్లింది. 19వ శతాబ్ది మొదటిపాదం వరకు లలిత కళాకారులు, వేద, ఆగమశాస్త్ర పండితులు, సాహిత్య కోవిదులు, సంగీత విద్వాంసులు, ఆయుర్వేద వైద్యులు, భరతనాట్య కోవిదులు, చిత్రకారులు, శిల్పులు, మంత్రద్రష్టలు, స్వాతంత్య్ర యోధులకు నిలయం ఈ గ్రామం. సినీ సంభాషణలు, పాటల రచనలో వెండితెరను ఏలిన సముద్రాల రాఘవాచారి (సీనియర్ సముద్రాల), సముద్రాల రామానుజాచారి (జూనియర్ సముద్రాల), సినీతార హలం ఈ ఊరి బిడ్దలు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు బాల్యం ఇక్కడే గడచింది. ఇదే ఊరి బిడ్డ, సినీదర్శకుడు కె.విశ్వనాథ్ తన సృజనతో ప్రతిష్టాత్మక గౌరవాలను పొందటం ద్వారా మాతృభూమి పెదపులివర్రును పులకరింపజేశారు. ‘సూపర్ స్టార్’కు శిక్షణ అప్పట్లో అంటే 53 ఏళ్ల క్రితం బాబూ మూవీస్ కొత్త తారలతో ప్రయోగాత్మకంగా తీసిన తొలి సాంఘిక ఈస్ట్‌మన్ కలర్ చిత్రం ‘తేనె మనసులు’. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. కె.విశ్వనాథ్ సహ దర్శకుడు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం యువకుడు ఘట్టమనేని కృష్ణ తొలి సినిమా అది. సినిమా కోసమని కృష్ణకు నడకలో, వాచకంలో శిక్షణ ఇచ్చింది విశ్వనాథ్ కావటం విశేషం. ఆ అనుబంధం తర్వాత కూడా కొనసాగింది. కృష్ణతో ‘కన్నె మనసులు’ తీశారు. మళ్లీ ‘ప్రైవేట్ మాస్టర్’లో కృష్ణను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు ఉపయోగించారు. ‘ఉండమ్మా బొట్టుపెడతా’, ‘నేరము–శిక్ష’ సినిమాలను కృష్ణతో చేశారాయన. ఆ తర్వాత దర్శకత్వ రంగంలో విశ్వనాథ్ తనదైన ‘కళాతపస్వి’గా చరిత్రను సృష్టించుకొంటే, కృష్ణ సూపర్‌స్టార్‌గా ఎదగడం తెలిసిందే. తెనాలితో అనుబంధం హీరో కృష్ణతోనే కాదు. ఊర్వశి శారద హీరోయిన్గా తీసిన అవార్డు సినిమా ‘శారద’కు దర్శకుడు విశ్వనాథే. ఇదే సినిమాకు తెనాలికి చెందిన అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ సంభాషణలు సమకూర్చారు. బొల్లిముంత కన్నుమూశాక, ఏటా ఆయన పేరుతో ఇస్తున్న పురస్కారాన్ని 2012లో కె.విశ్వనాథ్ తెనాలిలో అందుకున్నారు. ఈ సందర్భంగా సమీపంలోని అంగలకుదురులో కళాకారుడు, రచయిత రావినూతల శ్రీరామమూర్తి, విశ్వనాథ్‌కు స్వర్ణ కంకణ ధారణ చేశారు. అంతకు ముందు 1974లో తెనాలిలో కల్చరల్ ఫిలిం సొసైటి తరపున విశ్వనాథ్‌ను సత్కరించారు. సినిమాల మంచి చెడ్డలను బేరీజు వేస్తూ, ఉత్తమ చిత్రాలను ప్రోత్సహిస్తున్న ఫిలిం సొసైటి నిర్వాహకుడు డాక్టర్ పి.దక్షిణామూర్తి అంటే ఆపేక్షగా ఉండేవారు. సొంతూరుపై తరగని మమకారం ఎంతగా ఎదిగినా, నగరంతో జీవితం ముడిపడినా.. విశ్వనాథ్‌కు సొంతూరు అంటే అమితమైన మమకారం. ఇక్కడి ప్రజలన్నా ప్రేమ. గ్రామంలోని శివాలయం అంటే ఎంతో ఇష్టం. తాను తీసిన ప్రతి సినిమాలో భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పేరు వినిపిస్తుంది. సొంత గ్రామంలో నిర్వహించే దసరా, మహాశివరాత్రి ఉత్పవాలకు ఆలయాల్లో పూజలు నిర్వహించేవారు. పండగ వస్తే చిన్ననాటి స్నేహితుడు కొడమంచిలి వెంకట సుబ్బారావుకు పట్టువస్త్రాలు పంపేవారు. ఇప్పుడు విశ్వనాథ్ కన్ను మూశారని తెలిసి ఆయనతో పరిచయం ఉన్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. స్వాతంత్య్రయోధుని కుటుంబం విశ్వనాథ్ తాత కాళహస్తిలింగం స్వాతంత్య్రయోధుడు, పండితుడు. 1930లో కాంగ్రెస్ కార్యకర్తకు ఆతిథ్యం ఇచ్చినందుకు ఆరునెలలు జైలుశిక్ష అనుభవించారు. జైలు భోజనం నిరాకరించినందుకు ఆలీపురం క్యాంపు జైలుకు పంపారు. అక్కడ కూడా భోజనం లేకుండా నిత్యసంధ్యానుష్టానాలు జరుపుకున్నారు. జైలు డాక్టర్ వీరి గురించి తెలుసుకుని గోధుమపిండి, పాలు, నూనె వంటివి ఏర్పాటు చేశారు. విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం పెదపులివర్రు శివాలయంలో ప్రధాన అర్చకులుగా 1956 వరకు పని చేశారు. తల్లి సరస్వతి. సినీ నిర్మాణ సంస్థ వాహినిలో ఉద్యోగం రావటంతో సుబ్రహ్మణ్యం మకాం చెన్నైకి మారింది. విశ్వనాథ్ నాలుగో తరగతి వరకు గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత గుంటూరులో హిందూ, ఏసీ కాలేజీల్లో చదివారు. బీఎస్సీ పూర్తి చేశారు. చెన్నైలోని వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజినీరుగా కెరీర్ ఆరంభించారు. -
తెలుగు సినిమా ‘ఆత్మగౌరవం’!
‘మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు.. ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..’ అంటూ శంకరుడిని ప్రార్థించిన తీరు ప్రేక్షకుల ఆనంద వృష్టిని తడిపింది. ‘పంచ భూతములు ముఖ పంచకమై.. ఆరు రుతువులు ఆహార్యములై.. నీ దృక్కులే అటు అష్ట దిక్కులై.. నీ వాక్కులే నవరసమ్ములై..’ అంటూ ఉర్రూతలూగించిన తీరు అజరామరం. ‘కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..’ చూపడంలో మీ శైలికి సెల్యూట్. తెలుగు సినిమా ఉత్తుంగ తరంగంలా ఎగిసి పడేలా చేయడంలో మీ తర్వాతే ఎవరైనా. మీ గురించి మేమెంత చెప్పినా, అవి మీకు కొత్తగా కిరీటాలేమీ పెట్టవు. ఆకాశమంత మీ నిబద్ధతకు అరచెయ్యంత అద్దం ఈ మాటలు. మీరు నింగికెగిసినా మా కళ్లముందుంచిన ఆ అపురూప దృశ్య కావ్యాల్లో అనునిత్యం మీరు కనిపిస్తూనే ఉంటారన్నది అక్షర సత్యం. ఎంతటి గంగా ప్రవాహమైనా గంగోత్రి లాంటి ఓ పవిత్ర స్థానంలో చిన్నగా, ఓ పాయలా మొదలవుతుంది. వెండితెరపై శంకరాభరణం, సాగర సంగమం వంటి ఎన్నో కళాఖండాలను సృజించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రయాణం కూడా అలాగే ఓ చిన్న పాయలా మొదలైంది. సౌండ్ రికార్డిస్టుగా మొదలై.. దర్శకత్వ శాఖకు విస్తరించిన విశ్వనాథ్ 1965లో తొలిసారిగా ‘ఆత్మగౌరవం’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. నాటి నుంచి ఐదున్నర దశాబ్దాలకుపైగా వెండితెర అద్భుతాలను అందించారు. తొలితరంలో గూడవల్లి రామబ్రహ్మం, బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, మలితరంలో ఆదుర్తి సుబ్బారావు తదితరుల తర్వాత మూడో తరంలో తెలుగు సినిమాకు ‘ఆత్మగౌరవం’ తెచ్చిన దర్శక కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించి బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు వంటి వారి పనితీరును దగ్గరగా పరిశీలిస్తూ వచ్చిన కె.విశ్వనాథ్ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఈ క్రమంలో ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఇచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను గుర్తించి తమ అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థలో దర్శకత్వ శాఖలోకి రమ్మని హీరో అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సహించారు. మొదట తటపటాయించినా, తర్వాత అన్నపూర్ణా పిక్చర్స్‌లో చేరారు. ఇలా కె.విశ్వనాథ్ సినీ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అవకాశం కోసం వేచి చూస్తూ.. స్వతహాగా సృజనశీలి అయిన విశ్వనాథ్.. ఆదుర్తి శిష్యరికంలో మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. కథ, స్క్రీన్‌ప్లే రచన, సెకండ్ యూనిట్ డైరెక్షన్.. ఇలా విశ్వనాథ్ చేయనిది లేదు. నిజానికి ‘‘అన్నపూర్ణాలో రెండు సినిమాలకు ఆదుర్తి గారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన తర్వాత నాకు రెండు సినిమాలకు డైరెక్షన్ చాన్స్ ఇస్తామని మాటిచ్చారు. కానీ నాలుగు చిత్రాలకు (వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు –1961; ‘చదువుకున్న అమ్మాయిలు – 63; ‘డాక్టర్ చక్రవర్తి’–64) వర్క్ చేశాకే ఐదో సినిమా దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ నా చేతికిచ్చారు. ‘పూలరంగడు’ సినిమాకూ నేనే దర్శకత్వం వహించాల్సింది. మొదట నాతో స్క్రిప్టు వర్క్ వగైరా చేయించారు. అనుకోని కారణాల వల్ల మా గురువు ఆదుర్తి గారే డైరెక్ట్ చేస్తున్నారన్నారు. ఏమైతేనేం ‘ఆత్మగౌరవం’తో దర్శకుడినయ్యా’’ అని కె.విశ్వనాథ్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ‘ఆత్మగౌరవం’కి డైరెక్షన్ చాన్స్ ఇచ్చే ముందు.. దుక్కిపాటి గట్టిగా పట్టుబట్టడంతో కె.విశ్వనాథ్ కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర గగన్ మహల్ కాలనీలో రెండేళ్లు చిన్న అద్దె ఇంట్లో గడిపారు. 1. తేనెమనసులు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కె. విశ్వనాథ్, 2. ‘స్వాతిముత్యం’ సినిమా షూటింగ్లో కమల్‌హాసన్‌కు సూచనలిస్తూ.., 3. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణంలోని ఓ సన్నివేశం పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడలో.. ఖాళీ అద్దం షాట్లో.. అన్నపూర్ణా వారి అన్ని సినిమాలలానే ‘ఆత్మగౌరవం’ సినిమా కథ కోసం పలువురు రచయితలతో కలసి దర్శక, నిర్మాతలు మేధోమథనం జరిపారు. నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు, నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి, మరికొందరు కలసి హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ చెట్ల నీడల్లో పచ్చిక బయళ్లలో కూర్చొని కథా చర్చలు, ఆలోచనలు చేశారు. సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్ మద్రాసు వర్క్ బిజీకి దూరంగా రచయితలు, సంగీత దర్శకుడిని హైదరాబాద్ రప్పించి, ఇక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. హైదరాబాద్ సారథీ స్టూడియోలో షూటింగ్ ముహూర్తం. తొలి షాట్ చిత్రీకరణ తమాషాగా సాగింది. సంప్రదాయ శైవ కుటుంబంలో పుట్టిన విశ్వనాథ్ ఇంట్లో అంతా పరమ దైవభక్తులు. నిర్మాత దుక్కిపాటి నాస్తికుడు. తొలి షాట్ దేవుడి పటాల మీద తీసే అవకాశం లేదు. చివరకు అద్దం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపమని విశ్వనాథ్ తెలివిగా ఫస్ట్ షాట్ ఖాళీగా ఉన్న అద్దం మీద పెట్టారు. క్షణమాగి అద్దంలో ప్రతిబింబంగా అక్కినేని ఫ్రేములోకి వచ్చి డ్రెస్ సర్దుకుంటారు. ఇలా అద్దం మీద నుంచి హీరో అక్కినేని మీదకు వచ్చేలా కెమెరామ్యాన్ సెల్వరాజ్‌తో కలసి విశ్వనాథ్ వేసిన ప్లాన్ అద్భుతంగా ఫలించింది. విశ్వనాథ్ సెంటిమెంట్ నిలిచింది. నిర్మాతకూ ఇబ్బంది లేకుండా పోయింది. అద్దం మీద మొదలైన విశ్వనాథ్ దర్శకత్వ ప్రస్థానం అపూర్వంగా ముందుకు సాగింది. తొలి చిత్రంతోనే అవార్డుల వేట కె.విశ్వనాథ్ నిర్మించిన తొలి చిత్రం ‘ఆత్మ గౌరవం’ 1965లో ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది అవార్డును గెల్చుకుంది. ఇదే చిత్రానికి ఉత్తమ నటుడిగా అక్కినేది నాగేశ్వరరావు, ఉత్తమ కథా రచయితలుగా గొల్లపూడి, యద్ధనపూడి నంది అవార్డులు అందుకున్నారు. ఇలా తొలి చిత్రంతోనే విశ్వనాథ్ అవార్డు చిత్రాల దర్శకుడిగా తన అప్రతిహత ప్రయాణానికి నాంది పలికారు. అప్పటి అగ్ర హీరోలు ఎన్టీఆర్‌తో నాలుగు, ఏఎన్నార్‌తో రెండు సినిమాలు తీశారు. ‘శంకరాభరణం’ సినిమాతో శిఖరాగ్రానికి చేరుకున్నారు. తెలుగులో తొలి మహిళా కొరియోగ్రాఫర్‌గా సుమతీ కౌశల్‌కు కె.విశ్వనాథ్ అవకాశం ఇచ్చారు. ఆ పాటల పల్లవులు విశ్వనాథ్‌వే విశ్వనాథ్‌లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ అద్భుత సినీ గీత రచయిత ఉన్నారు. ఆదుర్తి దగ్గర సహాయకుడిగా ఉన్న రోజుల్లో గీత రచయితలతో పాటలు రాయించుకుంటున్నప్పుడు సైతం వారికి తన ఇన్‌పుట్స్‌గా పాటల పల్లవులు అందించేవారు. ‘డమ్మీ లిరిక్స్.. అబద్ధపు సాహిత్యం’ అంటూ ఆయన ఇచ్చిన పల్లవులే.. తలమానికమైన ఎన్నో సినీ గీతాలకు కిరీటాలయ్యాయి. ‘ఆత్మగౌరవం’లో ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు విశ్వనాథ్ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్ది రచయితలు మిగతా పాటంతా అద్భుతంగా అల్లడం విశేషం. సాగర సంగమం షూటింగ్లో..., స్వయంకృషి చిత్రీకరణ సమయంలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, చిరంజీవితో.. అవార్డులకు కేరాఫ్ అడ్రస్ మునుపెన్నడూ రామప్ప గుడికి వెళ్ళకపోయినా, ఆ పరిసరాలు బాగుంటాయని దుక్కిపాటి, గొల్లపూడి, సెవన్ స్టార్స్ సిండికేట్ సాంస్కృతిక సంస్థ శాండిల్య బృందం చూసొచ్చి చెప్పడంతో, అక్కడకు వెళ్ళి మరీ షూటింగ్ చేసినట్టు విశ్వనాథ్ చెప్పారు. రామప్ప గుడిలోనే దాశరథి రాసిన ‘ఒక పూలబాణం..’ చిత్రీకరించారు. 1965 చివరలో సెన్సార్ జరుపుకొన్న ‘ఆత్మగౌరవం’ ఆ మరుసటేడు రిలీజైంది. ప్రజాదరణ పొంది, విజయవాడ లాంటి చోట్ల శతదినోత్సవం చేసుకుంది. దర్శకుడిగా విశ్వనాథ్ ప్రతిభా సామర్థ్యాలు ధ్రువపడిపోయాయి. తొలి చిత్రం నుంచి ఇప్పటి దాకా ఓ నాలుగైదు మినహా విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలన్నీ నందులో, జాతీయ అవార్డులో ఏవో ఒకటి అందుకున్నవే! స్వయంగా కె. విశ్వనాథ్ సైతం కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, సినీరంగంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఈ 55 ఏళ్ళ దర్శకత్వ ప్రస్థానంలో తెలుగుతెరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అమితమైన ఆత్మగౌరవం తెచ్చారు. -
సినీ రంగానికి తీరని లోటు
సాక్షి, అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మహాభినిష్క్రమణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ దర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడని కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తెచ్చాయని చెప్పారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్ చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ పేరుపై రాష్ట్ర ప్రభుత్వం లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డును విశ్వనాథ్‌కి ఇచ్చిన అంశాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు గురువారం రాత్రి సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో కళారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురష్కారాలు అందిస్తున్నట్లు చెప్పారు. పద్మభూషణ్ సుశీల, పద్మభూషణ్ సరోజా దేవి, పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాధ్, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు కృష్ణవేణి, జమున, లక్ష్మి, మురళీ మోహన్, గిరిబాబు ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తదితరులను తానా పురస్కారాలతో సన్మానిస్తున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ పాంత్రా సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ శోభారాజు అన్నమాచార్య భవన వాహిని, గురు రామాచారి లిటిల్ మ్యూజిషియన్స్, సిద్ధేంద్ర కూచిపూడి అకాడమీ, అమెరికాకు చెందిన 300కు పైగా విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. -
కళాతపస్వి విశ్వనాథ్ బర్త్ డే స్పెషల్
-
ఇప్పుడు నా ఎడమ భుజం పోయింది: కే. విశ్వనాథ్
Director K Viswanath Emotional About Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక సీతారామా శాస్త్రిని సిరివెన్నెలగా మార్చిన వ్యక్తి దర్శకుడు కే. విశ్వనాథ్. వారిద్దరి మధ్య ఎంతో గాఢ అనుబంధం ఉండేది. సిరివెన్నెలను తమ్ముడిగా భావిస్తారు విశ్వనాథ్. అలాంటిది సీతారామాశాస్త్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయారు విశ్వనాథ్. సిరివెన్నెల మృతి తనకు తీరని లోటన్నారు. (చదవండి: టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల మృతి నాకు తీరని లోటు. బాల సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం పోయినట్లు అనిపించింది. సిరివెన్నెల మృతితో నా ఎడమ భుజం కోల్పోయిన భావన కలుగుతుంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.. మాట్లాడలేకుండా ఉన్నాను. సిరివెన్నెల కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ విశ్వనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్ -
తెలుగు సినిమాకు దక్కిన ఆత్మగౌరవం కె.విశ్వనాథ్
ఎంతటి నిర్ఝర గంగా ప్రవాహమైనా గంగోత్రి లాంటి ఓ పవిత్ర స్థానంలో చిన్నగా, ఓ పాయలా మొదలవుతుంది. వెండితెరపై ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ లాంటి ఎన్నో కళాఖండాలను సృజించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రయాణం కూడా అలాగే ఓ చిన్న పాయలా మొదలైనదే! సౌండ్ రికార్డిస్టుగా మొదలై, దర్శకత్వ శాఖకు విస్తరించిన విశ్వనాథ్ సరిగ్గా 55 ఏళ్ళ క్రితం ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ పట్టుకున్నారు. ఈ అయిదున్నర దశాబ్దాల కాలంలో తెలుగు, హిందీల్లో అర్ధశతం దాకా వెండితెర అద్భుతాలు అందించారు. తొలితరం గూడవల్లి రామబ్రహ్మం, బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి, మలితరం ఆదుర్తి సుబ్బారావు తదితరుల తరువాత మూడో తరంలో తెలుగు సినిమాకు ఆత్మగౌరవం తెచ్చిన దర్శక కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్. ఆయన నిర్దేశకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, కాలేజీ అమ్మాయిలుగా కాంచన, రాజశ్రీ, జీవిత సత్యాలు పలికే పిచ్చి అమ్మాయిగా అతిథి పాత్రలో వాసంతి నటించగా, దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘ఆత్మగౌరవం’కి ఈ మార్చి 11తో అయిదున్నర దశాబ్దాలు నిండాయి. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ ఉంటుంది. ఎదుటివారిలోని ఆ ప్రతిభను గుర్తించి, తగిన రీతిలో ప్రోత్సహించి, సరైన సమయంలో అవకాశం ఇవ్వడమే ఎప్పుడైనా గొప్పతనం. వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో కెరీర్ ను ప్రారంభించి, బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళ పనితీరును సన్నిహితం గా పరిశీలిస్తూ వచ్చిన కె. విశ్వనాథ్ స్క్రిప్టులో తోచిన సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసే అవకాశం ఆయనకిచ్చారు. అలా కథా విస్తరణ, స్క్రీన్ ప్లే రచనలో విశ్వనాథ్‌కు ఉన్న ప్రతిభను ఆదుర్తి దగ్గర గుర్తించి, ఆయన ను వాహినీ వదిలేసి, తమ అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థలోకి, పూర్తిగా దర్శకత్వశాఖలోకి రమ్మని ప్రోత్సహించింది – హీరో అక్కినేని నాగేశ్వరరావే. మొదట తటపటాయించినా, చివరకు గురుతుల్యులు ఆదుర్తి వద్ద అక్కినేని – దుక్కిపాటి మధుసూదనరావుల అన్నపూర్ణా పిక్చర్స్‌లో దర్శకత్వ శాఖలోకి వచ్చారు విశ్వనాథ్. అలా ఆయన సినీ జీవితం ఓ ఊహించని మలుపు తిరిగింది. ఆలస్యమైన అవకాశం... స్వతహాగా సృజనశీలి అయిన విశ్వనాథ్ ఆదుర్తి శిష్యరికంలో సానబెట్టిన వజ్రంలా మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే రచన, ఆదుర్తి ప్రోత్సాహంతో సెకండ్ యూనిట్ డైరెక్షన్ – ఇలా విశ్వనాథ్ చేయనిది లేదు. నిజానికి ‘‘అన్నపూర్ణాలో రెండు సినిమాలకు ఆదుర్తి గారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేశాక, నాకు రెండు సినిమాలకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామని మాట ఇచ్చారు. తీరా నాలుగు చిత్రాలకు (‘వెలుగు నీడలు’, ‘ఇద్దరు మిత్రులు’–1961, ‘చదువుకున్న అమ్మాయిలు’– ’63, ‘డాక్టర్ చక్రవర్తి’– ’64) వర్క్ చేశాకనే అయిదో సినిమాకు ‘ఆత్మగౌరవం’తో మెగాఫోన్ నా చేతికిచ్చారు. ‘పూలరంగడు’కూ నేనే దర్శకత్వం వహించాల్సింది. మొదట నా పేరే చెప్పారు. నాతో వర్క్ చేయించారు. అయితే, స్క్రిప్టు వర్కు వగైరా చేశాక, అనుకోని కారణాల వల్ల మా గురువు ఆదుర్తి గారే డైరెక్ట్ చేస్తున్నారన్నారు. ఏమైతేనేం, ‘ఆత్మగౌరవం’తో దర్శకుడినయ్యా’’ అని కె. విశ్వనాథ్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో మద్రాసులో అన్నపూర్ణా ఆఫీసు – భగీరథ అమ్మాళ్ స్ట్రీట్‌లో! ఆ పక్కనే కృష్ణారావు నాయుడు స్ట్రీట్‌లో దుక్కిపాటి గారిల్లు. ఇది కాక హైదరాబాద్‌లో లక్డీకాపూల్ దగ్గర శాంతి నగర్ లో దుక్కిపాటి గారికి గెస్ట్ హౌస్ ఉండేది. ‘ఆత్మగౌరవం’కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే ముందే దుక్కిపాటి గట్టిగా పట్టుబట్టడంతో కొన్నేళ్ళుగా మద్రాసులో స్థిరపడ్డ విశ్వనాథ్ సైతం కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర గగన్ మహల్ కాలనీలో ఒకటి రెండేళ్ళు చిన్న అద్దె ఇంట్లో గడిపిన ఆ రోజులు, ఉత్తమ కథా చిత్రాలను అందించడం కోసం రాత్రీ పగలూ, పండగ పబ్బం తేడా లేకుండా పనిలో నిమగ్నమైన క్షణాలు విశ్వనాథ్ దంపతులకు ఇప్పటికీ గుర్తే. దర్శకుడిగా విశ్వనాథ్ పేరు వేయడం ‘ఆత్మగౌరవం’తోనే తొలిసారి అయినా, అప్పటికే ఆదుర్తి గారి బాబూ మూవీస్ ‘మూగమనసులు’ (1964) సహా అనేక చిత్రాల్లో స్వతంత్రంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనది. పచ్చికలో రచన! అప్పటి దాకా ఫ్యామిలీ డ్రామా నిండిన సెంటిమెంట్, సీరియస్ సినిమాలు ఎక్కువ తీసింది అన్నపూర్ణా పిక్చర్స్. ఈసారి యువకులను ఆకర్షించేలా, కొత్తదనంతో కాలేజీ స్టూడెంట్స్ పాత్రలు ఉండేలా ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కామెడీ విత్ సెంటిమెంట్ తీస్తే బాగుంటుందని అనుకున్నారు. ‘పూలరంగడు’ ఇతివృత్తం ఆదుర్తి చేస్తే బాగుంటుందనీ, యువతరాన్ని ఆకర్షించే కొత్త ఇతివృత్తాన్ని విశ్వనాథ్ చేస్తే బాగుంటుందని నిర్మాతల భావన. అదే ‘ఆత్మగౌరవం’ సినిమా. అన్నపూర్ణా వారి అన్ని సినిమాల లానే ఈ సినిమా కథకూ పలువురు రచయితలతో కలసి దర్శక, నిర్మాతలు మేధామథనం జరిపారు. అలా ఈ ‘ఆత్మగౌరవం’ రచనకు ఒకరికి ముగ్గురి పేర్లు తెరపై కనిపిస్తాయి. విశ్వనాథ్, దుక్కిపాటి సహా అందరి భాగస్వామ్యం ఉన్నా – టైటిల్స్‌లో ప్రముఖ నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కలసి ఈ కథను అల్లారు. ఇక, సినిమా అనుసరణ నిర్మాత దుక్కిపాటి చేశారు. సంభాషణలేమో మరో ప్రముఖ నాటక రచయిత భమిడిపాటి రాధాకృష్ణతో కలసి గొల్లపూడి రాశారు. అప్పటికి గొల్లపూడి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నారు. ఆయనలోని ప్రతిభను గుర్తించి, ‘డాక్టర్ చక్రవర్తి’ (1964) ద్వారా దుక్కిపాటి సినిమాల్లోకి లాగారు. దానికి ఆత్రేయతో కలసి మాటలు రాశారు గొల్లపూడి. అయితే, గొల్లపూడి సినిమా కథంటూ రాసింది విశ్వనాథ్ దర్శకత్వంలోని తొలి చిత్రమైన ‘ఆత్మగౌరవం’కి! అలా విశ్వనాథ్ దర్శకత్వంలోని తొలి చిత్రం... గొల్లపూడి కథారచన చేసిన తొలి చిత్రమైంది. అప్పట్లో గొల్లపూడి సహా అన్నపూర్ణా బృందం ఆకాశవాణి కేంద్రానికి ఎదురుగా ఉన్న పబ్లిక్ గార్డెన్స్ చెట్లనీడల్లో, పచ్చికబయళ్ళలో కూర్చొని, కథాచర్చలు, ఆలోచనలు సాగిస్తూ, ఈ సినీ రచన చేశారు. డైలాగుల్లో కామెడీ పార్ట్ భమిడిపాటి, మిగతాది గొల్లపూడి రాశారు. ఆస్తుల కన్నా అనుబంధాలే మిన్న! రక్తసంబంధం ఎన్నటికీ విడదీయరానిది అనేది ఈ చిత్ర కథాంశం. అందులోనూ కథానాయిక (కాంచన) ఆత్మగౌరవం ప్రధానాంశం. అటు కన్నవారికీ, ఇటు పెంచినవారికీ మధ్య నలిగిపోయే హీరో మీదుగా కథ నడుస్తుంది. సొంత అన్నయ్య, వదినలకు దూరమై, పిల్లలు లేని జమీందారు దంపతుల (రేలంగి, సూర్యకాంతం) ఇంటికి దత్తత వెళ్ళి, పట్నంలో హాస్టలులో పెరుగుతాడు కౌలు రైతు రామయ్య (గుమ్మడి) తమ్ముడైన హీరో (అక్కినేని). అయితే, హీరోకు చిన్నప్పుడే నిశ్చయమైన కన్నవారింటి మేనరికం సంబంధం కాకుండా, గొప్పింటి జడ్జి (రమణారెడ్డి) గారి కూతురి (రాజశ్రీ) బయటి సంబంధం చేయాలని చూస్తుంది జమీందారీ పెంపుడు తల్లి. పెంచినవాళ్ళను ఎదిరించి, ఆస్తి వదులుకొనైనా సరే మేనరికం చేసుకోవాలనుకుంటాడు హీరో. ఈ సమస్యలన్నిటినీ హీరో ఎంత ఆహ్లాదంగా పరిష్కరించాడన్నది సుఖాంతం అయ్యే ఈ కుటుంబకథా చిత్రంలో చూడవచ్చు. అద్దం మీద తొలి షాట్ తమాషా... సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్ మద్రాసు వర్క్ బిజీకి దూరంగా రచయితలు, సంగీత దర్శకుడిని హైదరాబాద్ రప్పించి, ఇక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. పాటల రికార్డింగ్ ముహూర్తం మాత్రం మద్రాసు భరణీ స్టూడియో లో ఘంటసాల, సుశీల తదితరుల నడుమ చేశారు. ఇక, హైదరాబాద్ సారథీ స్టూడియోలో షూటింగ్ ముహూర్తం. తొలి షాట్ చిత్రీకరణ తమాషాగా సాగింది. సంప్రదాయ శైవ కుటుంబంలో పుట్టిన విశ్వనాథ్ ఇంట్లో అంతా పరమ దైవభక్తులు. నిర్మాత దుక్కిపాటి ఏమో బహిరంగ నాస్తికులు. తొలిషాట్ దేవుడి పటాల మీద తీసే సావకాశం లేదు. చివరకు అద్దం సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం గనక, విశ్వనాథ్ తెలివిగా ఫస్ట్ షాట్ ఖాళీగా ఉన్న అద్దం మీద పెట్టారు. క్షణమాగి, అద్దంలో ప్రతిబింబంగా అక్కినేని ఫ్రేములోకి వచ్చి, డ్రెస్ సర్దుకుంటారు. అద్దం మీద నుంచి హీరో అక్కినేని మీదకు వచ్చేలా కెమేరామ్యాన్ సెల్వరాజ్ తో కలసి విశ్వనాథ్ వేసిన ప్లాన్ అద్భుతంగా ఫలించింది. విశ్వనాథ్ సెంటిమెంట్ నిలిచింది. నిర్మాతకూ ఇబ్బంది లేకుండా పోయింది. అద్దం మీద మొదలైన విశ్వనాథ్ దర్శకత్వ ప్రస్థానం అపూర్వంగా ముందుకు సాగింది. శ్రీశ్రీతో సాలూరి తమాషా సౌండ్ రికార్డిస్ట్ రోజుల నుంచి సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుతో విశ్వనాథ్‌కు మంచి అనుబంధం. సాలూరి ఎంత అద్భుతమైన సంగీత దర్శకులు, గాయకులో, అంత పసి మనస్తత్త్వం. ఆయనలో భలే చిలిపితనం ఉండేది! అది అర్థం చేసుకోకపోతే గొడవ. ఒక్కోసారి ఆయన కావాలని ఆటపట్టించేందుకు గమ్మత్తు చేసేవారు. ఈ సినిమా లో ఓ పాట కోసం శ్రీశ్రీ గారికి అన్నీ లఘువులతో (హ్రస్వాక్షరాలు వచ్చేలా) ఓ క్లిష్టమైన బాణీ ఇచ్చారు. శ్రీశ్రీ కూడా విషయం గ్రహించి, చిరునవ్వుతో దాన్ని ఓ సవాలుగా తీసుకొని, ‘వలపులు విరిసిన పూవులే...’ అంటూ పాట రాసిచ్చారు. ఇదే సినిమా కోసం సి. నారాయణరెడ్డి రాసిన ‘మా రాజులొచ్చారు...’ పాట అంటే కె. విశ్వనాథ్‌కు ఇప్పటికీ భలే ఇష్టం. దాశరథి రాసిన ‘అందెను నేడే అందని జాబిల్లి..’, డ్యూయట్ ‘ఒక పూలబాణం..’, ఆరుద్ర రచన ‘రానని రాలేనని..’ పాటలు ఇప్పటికీ పాపులర్. ఆ నంది బొమ్మతోనే అవార్డులు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964 నుంచే ఉత్తమ తెలుగు చిత్రాలకు నంది అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ఇవ్వడం మొదలుపెట్టిన ఆ నందీ అవార్డుల చిహ్నం కూడా మరేదో కాదు – రామప్ప గుడిలోని నంది ఏకశిలా విగ్రహం. ఇంకా విచిత్రం ఏమిటంటే, అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టిన ఏడాదే ప్రభుత్వం నుంచి 1964లో అన్నపూర్ణా వారి ‘డాక్టర్ చక్రవర్తి’ ఉత్తమ కథాచిత్రంగా బంగారు నందిని గెలిస్తే, 1965లో అన్నపూర్ణా వారిదే ‘ఆత్మగౌరవం’ చిత్రం నంది ఉత్తమ తతీయ చిత్రంగా కాస్యనందిని గెలిచింది. ఆ రెండు చిత్రాల రచన, రూపకల్పన, దర్శకత్వాల్లో విశ్వనాథ్ గణనీయమైన భాగస్వామ్యం ఉండడం విశేషం. అలా ‘ఆత్మగౌరవం’ చిత్రం తమ షూటింగ్ జరిగిన అదే రామప్ప గుడి ఏకశిలా విగ్రహం తాలూకు చిహ్నమైన నంది అవార్డును అందుకుంది. ఇక, ఉత్తమ కథారచయితలకు నంది అవార్డులివ్వడం 1965 నుంచి మొదలుపెట్టారు. ఆ తొలి నంది అవార్డు కూడా ‘ఆత్మగౌరవం’దే! అలా గొల్లపూడి, యద్దనపూడి – ఇద్దరూ ఆ ఏటి ఉత్తమ కథా రచయితలుగా నంది అందుకున్నారు. గాంధీభవన్ ఎగ్జిబిషన్ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం. అక్కినేని, కాంచన, రేలంగి, దుక్కిపాటి, విశ్వనాథ్ లాంటి సినీ ప్రముఖులతో పాటు రాష్ట్ర గవర్నర్ పట్టం థానూ పిళ్ళై దంపతులు, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దంపతులు – ఇలా వేదికపై అతిరథ మహారథులతో హైదరాబాద్‌లో గొప్ప గ్లామరస్ సభగా ఆ నంది ఉత్సవం సాగింది. అలాగే, ‘మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్’ నుంచి అక్కినేని ఉత్తమ నటుడిగా, గొల్లపూడి ఉత్తమ రచయితగా అవార్డులు పొందారు. తొలి చిత్రంతోనే కె. విశ్వనాథ్ అవార్డు చిత్రాల దర్శకుడిగా తన అప్రతిహత ప్రయాణానికి నాంది పలికారు. న్టీఆర్ తో నాలుగు... ఏయన్నార్ తో రెండు... ‘ఆత్మగౌరవం’ తరువాత దర్శకుడిగా రెండో సినిమా కూడా అన్నపూర్ణా పిక్చర్స్‌లోనే కె. విశ్వనాథ్ చేయాల్సింది. ఆయన కూడా అలాగే అనుకొని, తనను సంప్రతించిన బయట నిర్మాతలతో ఆ కమిట్మెంటే చెబుతూ వచ్చారు. కానీ, ఎందుకనో ఆ తరువాత అన్నపూర్ణా అధినేత దుక్కిపాటి తన మాట నిలబెట్టుకోలేదు. ‘ఆత్మగౌరవం’ తర్వాత విశ్వనాథ్ మళ్ళీ సకుటుంబంగా మద్రాసుకు షిఫ్టయి, మరో నిర్మాత డి.బి. నారాయణ ఇంట్లో అద్దెకు చేరారు. చివరకు రెండో సినిమాగా తాను తీర్చిదిద్దిన హీరోలు రామ్మోహన్, కృష్ణలతోనే బయట నిర్మాతలకు ‘ప్రైవేటు మాష్టారు’ (1967 సెప్టెంబర్ 14) తీశారు. అయితేనేం, దర్శకుడిగా ఆయన ప్రస్థానం క్రమక్రమంగా పైపైకి దూసుకుపోయింది. చివరకు ‘శంకరాభరణం’ లాంటి కళాఖండాలతో దర్శకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నాక తొమ్మిదేళ్ళకు మళ్ళీ అక్కినేనితో రెండోచిత్రం ‘సూత్రధారులు’ (’89) రూపొందించారు విశ్వనాథ్. అప్పటి మరో స్టార్హీరో ఎన్టీఆర్ తో తన కెరీర్ లో ఏకంగా 4 సినిమాలు చేసిన ఆయన, ఏయన్నార్‌తో 2 చిత్రాలే తీయడం ఓ విచిత్రం. ఫస్ట్ లేడీ కొరియోగ్రాఫర్‌కు ఛాన్స్! ప్రఖ్యాత కూచిపూడి నృత్యగురువు సుమతీ కౌశల్ (ప్రముఖ నాట్యాచారిణి ఉమా కె. రామారావుకు సోదరి) అప్పట్లో హైదరాబాద్ లోని విశ్వనాథ్ ఇంటికి దగ్గరలోనే బషీర్‌బాగ్‌లో డ్యాన్స్ స్కూల్ ‘నృత్యశిఖర’ నడుపుతుండేవారు. రవీంద్రభారతిలో ఆమె నృత్యప్రతిభ చూసి, ఈ చిత్రంలో ఆమెకు నృత్య దర్శకురాలిగా అవకాశమిచ్చారు. ‘ముందటి వలె నాపై నెనరున్నదా సామి...’ అనే క్షేత్రయ్య పదానికి, హీరోయిన్లు రాజశ్రీ, కాంచనలతో శ్రీకృష్ణుడు, రాధ పాత్రలు వేయించి, కూచిపూడి నృత్యగీతాన్ని చిత్రీకరించారు. అలా సుమతి తెలుగుతెరపై తొలి మహిళా కొరియోగ్రాఫరయ్యారు. ‘ఆత్మగౌరవం’ కు మరో కొరియోగ్రాఫర్‌గా హీరాలాల్ పనిచేశారు. సినిమా ఔట్‌డోర్ దృశ్యాల్ని రామప్ప గుడి, సరస్సు పరిసరాల్లో, డిండి ప్రాజెక్ట్ ప్రాంతంలో తీశారు. ఆ పాటల పల్లవులు విశ్వనాథ్‌వే! విశ్వనాథ్ లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ అద్భుత సినీ గీతరచయిత ఉన్నారు. ఆదుర్తి దగ్గర సహాయకుడిగా ఉన్నరోజుల్లో గీత రచయితలతో పాటలు రాయించుకుంటున్నప్పుడు సైతం వారికి తనదైన ఇన్ పుట్స్‌తో పాటల పల్లవులు అందించడం విశ్వనాథ్‌కు అలవాటు. డమ్మీ లిరిక్స్... ‘‘అబద్ధపు సాహిత్యం’’ అని ముద్దుగా పిలుస్తూ అలా ఆయన ఇచ్చిన పల్లవులే ఇవాళ తలమానికమైన ఎన్నో సినీగీతాలకు కిరీటాలయ్యాయి. ‘ఆత్మగౌరవం’లోనూ ‘మా రాజులొచ్చారు..’, ‘అందెను నేడే..’ పాటల పల్లవులు అలా విశ్వనాథ్ రాసినవే. ఆ పదాలకు మరింత సొబగులద్ది, రచయితలు మిగతా పాటంతా అద్భుతంగా అల్లడం విశేషం. ‘ఆత్మగౌరవం’ నుంచి లేటెస్ట్ ‘శుభప్రదం’ దాకా తన సినిమాలన్నిటిలో విశ్వనాథ్ ఇలా అందించిన పల్లవులు ఎన్నెన్నో! అవార్డులకు కేరాఫ్ అడ్రస్! మునుపెన్నడూ రామప్ప గుడికి వెళ్ళకపోయినా, ఆ పరిసరాలు బాగుంటాయని దుక్కిపాటి, గొల్లపూడి, సెవన్ స్టార్స్ సిండికేట్ సాంస్కృతిక సంస్థ శాండిల్య బృందం చూసొచ్చి చెప్పడంతో, అక్కడకు వెళ్ళి మరీ షూటింగ్ చేసినట్టు విశ్వనాథ్ ఆ సంగతులు చెప్పారు. అంతకు మునుపెవ్వరూ షూటింగ్ చేసిన రామప్ప గుడిలోనే దాశరథి రాసిన ‘ఒక పూలబాణం..’ చిత్రీకరించారు. 1965 చివరలో సెన్సార్ జరుపుకొన్న ‘ఆత్మగౌరవం’ ఆ మరుసటేడు రిలీజైంది. ప్రజాదరణ పొంది, విజయవాడ లాంటి చోట్ల శతదినోత్సవం చేసుకుంది. దర్శకుడిగా విశ్వనాథ్ ప్రతిభా సామర్థ్యాలు ధ్రువపడిపోయాయి. తొలి చిత్రం నుంచి ఇప్పటి దాకా ఓ నాలుగైదు మినహా విశ్వనాథ్ రూపొందించిన చిత్రాలన్నీ నందులో, జాతీయ అవార్డులో ఏవో ఒకటి అందుకున్నవే! స్వయంగా కె. విశ్వనాథ్ సైతం కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారం, సినీరంగంలో ఇచ్చే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు – ఇలా ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఈ 55 ఏళ్ళ దర్శకత్వ ప్రస్థానంలో తెలుగుతెరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అమితమైన ఆత్మగౌరవం తెచ్చారు. – రెంటాల జయదేవ -
‘శంకరాభరణం’కు వచ్చిన జాతీయ అవార్డులు ఎన్ని?
తెలుగు సినిమా అందించిన అత్యత్తమ దర్శకుల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒకరు. ఎన్నో గొప్ప సినిమాలను, గొప్ప పాటలను, గొప్ప నిపుణులను తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించారాయన. నేడు (ఫిబ్రవరి 19) విశ్వనాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీపై స్పెషల్ క్విజ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1641344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1651344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ కె విశ్వనాథ్
-
‘ఇచ్చిన మాట కోసమే మహాసభలకు వెళ్లలేదు..’
సాక్షి, తెనాలి : సినిమా దర్శకుడిగా భగవంతుడు నిర్దేశించిన సేవను భక్తిప్రవత్తులతో ఆచరించానని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్ పేర్కొన్నారు. భగవంతుడు తననొక దర్శకుడిని చేసి, సినిమా మీడియా అనే బస్సులోని భక్తులను జాగ్రత్తగా సినిమా అనే పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లమని చెప్పగా దానిని పాటించానన్నారు. ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తెనాలిలోని నాజరుపేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డు స్వీకరించి మాట్లాడారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ విశ్వనాథ్‌కు అవార్డు అందజేశారు. తల్లి బిడ్డకు అన్నం పెట్టేటప్పుడు విషం పెట్టదని, పాల బువ్వ పెడుతుందన్నారు. తానూ కూడా అదే పని చేస్తున్నానన్నారు. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. కులమత కుడ్యాలను ఛేదించాలని విశ్వనాథ్ తన చిత్రాల్లో చూపించారన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా మాట్లాడారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎల్‌ఆర్‌ఎం క్లబ్ సభ్యులు ఆర్థికసాయం అందజేశారు. ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, ట్రస్ట్ కార్యదర్శి మారౌతు సీతారామయ్య, నన్నపనేని భాగ్యలక్ష్మి, సూర్యకుమారి, సుగుణ తదితరులు పర్యవేక్షించారు. ఇచ్చిన మాట కోసమే తెలుగు మహాసభలకు వెళ్లలేదు.. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తెలుగువారి ధర్మం.. అందుకే హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లలేకపోయా..’నని ప్రముఖ సినీ దర్శకుడు, కె.విశ్వనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి సోషలిస్టు ఉద్యమనేత నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డును రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా స్వీకరించి మాట్లాడారు. హైదరాబాద్ రావాలంటూ ఆదివారం సాయంత్రం తనకు ఆహ్వానం అందిందని, కొన్ని నెలలముందే తెనాలి ఎన్వీఆర్ ట్రస్ట్‌కు మాట ఇచ్చినందున రాలేకపోతున్నట్లు నిర్వాహకులకు చెప్పానన్నారు. -
అద్భుతం.. అభినందనీయం
-
అద్భుతం.. అభినందనీయం
‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డులపై ప్రముఖ టీవీ జర్నలిస్ట్ బర్ఖాదత్ ∙అంగరంగ వైభవంగా పురస్కారాల ప్రదానోత్సవం కళాతపస్వి కె విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి తదితర అతిరథ మహారథులతో కళకళలాడిన వేదిక దర్శకరత్న దాసరికి తెలుగు శిఖరం అవార్డు ∙కైకాల సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కారం మొత్తం 29 మందికి పురస్కారాల ప్రదానం సాక్షి, హైదరాబాద్: ‘‘సామాజిక సేవారంగం, కళలు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అద్భుత ప్రతిభాపాటవాలున్న విశిష్ట వ్యక్తులను గుర్తించి సత్కరించేందుకు ‘సాక్షి’ చేసిన ప్రయత్నం అద్భుతం.. అభినందనీయం.. తొలిసారి ఇంత మంది గొప్ప వ్యక్తులను ఒకే వేదికపై కలుసు కున్నందుకు గర్వపడుతున్నాను. వారిని కలుసు కోవడం ఎంతగానో సంతృప్తినిచ్చింది’’ అని ప్రముఖ టీవీ జర్నలిస్ట్ బర్ఖాదత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘సాక్షి’ ఎక్సలెన్స్ మూడో వార్షిక అవార్డుల ప్రదానోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాతపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్, మెగాస్టార్ చిరం జీవి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తదితరులు హాజరయ్యారు. తొలుత ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, బర్కాదత్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బర్ఖాదత్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం న్యూస్ మీడియా సంక్షోభం ఎదుర్కొంటోంది. కొన్ని జాతీయ చానళ్లలో న్యూస్ యాంకర్స్ టీవీ స్టూడియోల్లోకి ప్రవేశించి రాబోయే రోజుల్లో చోటుచేసుకునే పలు కీలక పరిణామాలపై సొంత వ్యాఖ్యానాలు చేయడం శోచనీయం. మీడియా సామాన్యుల గొంతుకలా నిలవాలి. ‘సాక్షి’ మీడియా అవార్డులకు ఎంపికైన వారి ప్రస్థానంపై ప్రదర్శించిన వీడియో క్లిప్పింగులు చూసిన తర్వాత నేను క్షేత్రస్థాయికి వెళ్లి రిపోర్టింగ్ చేసిన అనుభూతిని తలపించింది’ అని అన్నారు. వివిధ రంగాల్లో ఎంపికైన వారికి బర్ఖాదత్, చిరంజీవి, వైఎస్ భారతీరెడ్డి, కె.విశ్వనాథ్, అల్లు అరవింద్ తదితరుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజేతలతోపాటు ముఖ్య అతి థులను ఘనంగా సన్మానించారు. తెలుగు శిఖరం అవార్డుకు ఎంపికైన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోగ్యకారణాల రీత్యా అవా ర్డును అందుకోవడానికి రాలేకపోయారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు కె.విశ్వనాథ్ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ.. విలన్ పాత్రలకే పరిమితమైన సత్యనారాయణను శారద సినిమా ద్వారా గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూపామన్నారు. ఆయన విలక్షణ నటుడని కొనియాడారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవిని సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, డైరెక్టర్లు రాణీరెడ్డి, రామచంద్రమూర్తి, కేఆర్పీ రెడ్డి, పీవీకే ప్రసాద్ ఘనంగా సన్మానించారు. 29 మందికి అవార్డులు.. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 29 మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు అందుకోలేకపోయిన వారి తరఫున వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. ఈ అవార్డులకు ఎంపికైన విజేతలు ఆయా రంగాల్లో చేసిన కృషిని గుర్తుచేస్తూ ప్రదర్శించిన స్వల్ప నిడివి వీడియో వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమ ప్రారంభంలో దీపికారెడ్డి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాయని మాళవిక ఆలపించిన ‘ఉంటాలే..ఉంటాలే.. నీతో ఉంటాలే..’ పాట వీక్షకులను అలరించింది. నటి లావణ్య త్రిపాఠి హిందీ సినీ గీతం ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వినోద్ అగర్వాల్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సమాచార శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) అంజనీకుమార్, డాక్టర్ ప్రణతీరెడ్డి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, హీరో నిఖిల్, నటుడు రాజా రవీంద్ర, దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, హీరోయిన్ రీచాపనయ్, శాలిని, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ నిర్మాత రవికిరణ్, దర్శకుడు అరుణ్ పవార్, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, బిగ్‌సి డైరెక్టర్ స్వప్నకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యావేత్త చుక్కారామయ్య, జ్యూరీ మెంబర్స్ జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫాల్కే అవార్డు అందుకున్న కళాతపస్వి
-
ఫాల్కే అవార్డు అందుకున్న కళాతపస్వి
64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సాక్షి, న్యూడిల్లీ: భారతదేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కళాతపస్వి కె. విశ్వనాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను గ్రహీతలకు రాష్ట్రపతి ప్రదానం చేశారు. కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, స్వర్ణ కమలం, ప్రశంసాపత్రం అందుకున్నారు. ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్, ఉత్తమ నటిగా సురభి అవార్డులు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘పెళ్లిచూపులు’ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు తరుణ్ భాస్కర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రజత కమలం, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్తమ సంభాషణల కేటగిరీ అవార్డును తరుణ్ భాస్కర్, ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును జనతా గ్యారేజ్ సినిమాకు రాజు సుందరం అందుకున్నారు. ఉత్తమ ప్రజాదరణ చిత్రం కేటగిరీ కింద ‘శతమానం భవతి’ సినిమాకు గాను దర్శకుడు సతీష్, నిర్మాత వి. వెంకటరమణారెడ్డి(దిల్‌రాజు)లకు స్వర్ణ కమలం, ప్రశంసాపత్రాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. నాన్ ఫీచర్ చిత్రాల విభాగంలో ఉత్తమ సాహసోపేతమైన అం«శాలపై ‘మతిత్లి కుస్తి’ నిర్మాత మాధవి రెడ్డి రజత కమలం, ప్రశంసా పత్రం.. ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రంగా ‘ఫైర్ ఫ్లైస్ ఇన్ ది ఎబిసిస్’ చిత్ర నిర్మాత, దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి స్వర్ణకమలం, ప్రశంసాపత్రాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు కె.విశ్వనాథ్‌పై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఫాల్కే అవార్డు అందుకున్న అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడారు. ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న ఈ శుభ సందర్భంగా పైన ఉన్న నా తల్లిదండ్రులకు, అంతటా ఉన్న భగవంతుడికి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, జ్యూరీ సభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినోభవంతు’ అంటూ సంక్షిప్తంగా ముగించారు. విశ్వనాథ్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. విలువలు, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చిత్రాలను రూపొందించారని కొనియాడారు. అనుమానాల్లో నిజం లేకపోలేదు.. గతంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు జాతీయ అవార్డులు లభించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు కలిగేవని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. కొన్ని మంచి చిత్రాలకు అవార్డులు రానప్పుడు తమ చిత్ర పరిశ్రమను చిన్న చూపు చూస్తున్నారన్న అనుమానాలు వచ్చేవని, ఇందులో నిజం లేకపోలేదని చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బుధవారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సైకిల్ కూడా ఊహించని వాడికి రోల్స్æరాయిస్ ఇస్తే ఎలా ఉంటుందో... ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ఈ పురస్కారాన్ని తనకు ప్రదానం చేస్తుండడం పట్ల ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఇకపై జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాల హవా కొనసాగుతుందని జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోని జ్యూరీ సభ్యులు సీవీ రెడ్డి, పీసీ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ గుర్తింపు భవిష్యతులో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైన శతమానం భవతి, పెళ్లిచూపులు, జనతాగ్యారేజ్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయన్నారు. మంచి చిత్రాన్ని తీస్తే ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలు ఆదరిస్తారని శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న పేర్కొన్నారు. చిన్న చిత్రంగా తెరకెక్కిన తమ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపును సొంతం చేసుకుందని ‘పెళ్లిచూపులు’ నిర్మాతలు రాజ్ కందుకూరి, యష్ రాగినేని పేర్కొన్నారు. -
అనుమానాల్లో నిజం లేకపోలేదు..
మంచి చిత్రాలను అవార్డులు రాకపోవడంపై కళాతపస్వి కె. విశ్వనాథ్ దాదా సాహెబ్ పురస్కారాన్ని అందుకోవడం అశ్యర్యం ఉంది సాక్షి, న్యూఢిల్లీ : గతంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు జాతీయ అవార్డులు లభించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు కలిగేవని కళాతపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహిత కె. విశ్వనాథ్ పేర్కొన్నారు. పలు చిత్ర పరిశ్రమలను జాతీయ అవార్డు కమిటీ సభ్యులు చిన్నచూపు చూస్తారన్న భావన ప్రజల్లో ఉండేదన్నారు. కొన్ని పరిశ్రమలకు చెందిన చిత్రాలు బాగా లేకున్నా జ్యూరీ సభ్యులు ఎంపిక సందర్భంగా వాటిని చివరి వరకూ వీక్షించి అవార్డులకు ఎంపిక చేస్తున్నారని, మంచి చిత్రాలను సగం రీలే చూసి వాటిని పక్కనపెట్టేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. కొన్ని పరిశ్రమలకు చెందిన మంచి చిత్రాలకు అవార్డులు రానప్పుడు తమ చిత్ర పరిశ్రమను చిన్న చూపు చూస్తున్నారన్న అనుమానాలు తప్పవన్నారు. ఇందులో నిజం లేకపోలేదని ఆయన చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బుధవారం చిత్ర పరిశ్రమలో అత్యున్నత పుస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సైకిల్ కూడా ఊహించని వాడికి రోల్స్‌రాయిస్ ఇస్తే ఎలా భ్రమలో ఉంటాడో.. ప్రస్తుతం తన పరిస్థితి కూడా అలాగే ఉందని ఆయన అన్నారు. ఈ పుస్కారాన్ని తనకు ప్రదానం చేస్తుండడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా తన తల్లిదండ్రులను స్మరించుకుంటున్నట్టు చెప్పారు. ఈ పురస్కారాన్ని తనకే అంకితం ఇచ్చుకుంటున్నట్టు చెప్పారు. తాను ఏ నిబద్ధతతో దర్శకత్వం ప్రారంభించానో.. అదే నిబద్ధతతో అందరూ మెచ్చే ఆరోగ్యకరమైన చిత్రాలు తీసిన దర్శకునిగా మాత్రమే వైదొలుగుతానని చెప్పారు. తన తీరుకు అనుగుణంగా చిత్రాలు తీయండలో నిర్మాతలు ఎంతగానో సహకరించారని, తప్పులేవైనా ఉంటే అది తన బాధ్యతేనని ఆయన చెప్పారు. తెలుగు చిత్రాల హవా కొనసాగుతుంది ఇక నుంచి జాతీయ స్థాయిలో తెలుగు చిత్రాల హవా కొనసాగుతుందని జాతీయ చలనచిత్ర అవార్డు కమిటీలోని జ్యూరీ సభ్యులు సీవీ రెడ్డి, పీసీ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ గుర్తింపు భవిష్యతులో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డులకు ఎంపికైన శతమానం భవతి, పెళ్లిచూపులు, జనతాగ్యారేజ్ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయన్నారు. తెలుగు చిత్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కేలా బాహుబలి కృషి చేసిందన్నారు. మంచి చిత్రాన్ని ప్రాంతీయ భేదం లేకుండా ఆదరిస్తారు మంచి చిత్రాన్ని తీస్తే ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలు ఆదరిస్తారని శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీస్ వేగ్నేష్ పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం శుభపరిణామమన్నారు. ప్రేక్షకులు కూడా మంచి చిత్రాలు వస్తే ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అవార్డు వచ్చే చిత్రాలకు డబ్బురావు, డబ్బులు వచ్చే చిత్రానికి అవార్డు రావు అన్న అభిప్రాయానికి ప్రస్తుతం కాలం చెల్లిందన్నారు. ప్రస్తుత తరుణంలో మంచి చిత్రాలు తీస్తే అవార్డులతో పాటు కలెక్షన్లు కూడా వస్తాయని పేర్కొన్నారు. చిన్న చిత్రం.. పెద్ద గుర్తింపు చిన్న చిత్రంగా తెరకెక్కిన తమ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపును సొంతం చేసుకుందని పెళ్లిచూపుల నిర్మాతలు రాజ్ కందుకూరి, యష్ రాగినేని పేర్కొన్నారు. తమ మొదటి చిత్రానికి జాతీయ అవార్డు అందుకోనుండడంపై వారు అనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యతులో మరిన్ని మంచి చిత్రాలు నిర్మిస్తామని వారు తెలిపారు. -
కె.విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డు ప్రదానం
న్యూఢిల్లీ: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్టు’ను దర్శకుడు కె.విశ్వనాథ్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ఈ అవార్డును విశ్వనాథ్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్...‘ఎందరో మహానుభావులు..అందరికీ ధన్యవాదాలు అంటూ’ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడ అభిమానులు ఉన్నా వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు... విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఆయన చిత్రాలలో హింస, అశ్లీలత ఉండదని ప్రశంసించారు. గతంలో విశ్వనాథ్ రూపొందించిన 'శంఖరాభరణం' సినిమాకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అలాగే పది ఫిల్మ్‌ఫేర్, అయిదు నేషనల్ ఫిల్మ్‌పేర్, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. కాగా దేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తారు. దీన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం,శాలువా, రూ. పది లక్షలు ఇస్తారు. -
కె.విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డు ప్రదానం
-
విశ్వనాధ్‌కు శుభాకాంక్షలు తెలిపిన సాక్షి ED
-
కళాతపస్వికి ‘ఫాల్కే’ అవార్డు
⇔ రాష్ట్రపతి చేతుల మీదుగా 3న పురస్కారం ప్రదానం ⇔ విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మైమరపించిన కె.విశ్వనాథ్ ⇔ కథ, కథనం, సాంస్కృతిక అంశాలకు పెద్దపీట ప్రముఖ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్‌కు 2016వ సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అపారమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందిస్తోంది. ఫాల్కే అవార్డు కమిటీ సిఫారసులను కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఆమోదించారు. మే 3న ఇక్కడి విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. దాదాసాహెబ్ ఫాల్కే 48వ పురస్కారాన్ని విశ్వనాథ్‌కు అంద జేస్తారు. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు, శాలువాతో సత్కరిస్తారు. శాస్త్రీయ, సంప్రదాయ కళలు, సంగీతం, నృత్యాన్ని తన సినిమాలతో అందిస్తూ భారత సినీ పరిశ్రమకు విశ్వనాథ్ మార్గదర్శిగా నిలిచారు. బలమైన కథ, మనోహరమైన కథనం, ప్రామాణికమైన సాంస్కృతిక అంశాలకు పేరొందిన దర్శకుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1965 నుంచి ఇప్పటి వరకు 50 సినిమాలు రూపొందించారు. సామాజిక, మానవీయ అంశాలపై విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. 1930లో గుడివాడలో జన్మించిన ఆయన కళా ప్రేమికుడు. కళలు, సంగీతం, నృత్యం తదితర విభిన్న నేపథ్యాలతో సినిమాలు రూపొందించారు. 1992లోనే ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఐదు జాతీయ అవార్డులు, 20 నంది అవార్డులు, 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా దక్కింది. ‘స్వాతి ముత్యం’చిత్రం 59వ అకాడమి ఆవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరీలో భారత అధికార ఎంట్రీ చిత్రంగా నిలిచింది. సిరివెన్నెల, స్వాతిముత్యం, శంకరాభరణం తదితర చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డుల పరంపరలో భాగంగా 2016లో విశ్వనాథ్‌ను లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించింది. తనదైన శైలిలో ప్రేక్షకులను మైమరపించిన ఈ కళాతపస్వికి అరుదైన గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు శుభాకాంక్షలు కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వ నాథ్‌కు ఈ అవార్డు వరించడంతో తెలుగువారి కీర్తి మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగిం దని సంతోషం వ్యక్తం చేశారు. శంకరాభ రణం, శృతిలయలు, సిరివెన్నెల, సాగరసం గమం, స్వర్ణకమలం, తదితర ఎన్నో చిత్రా లను ఆయన అందించారని తెలిపారు. ఆ రోజుల్లోనే తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా రూపొందించిన ఘనత విశ్వనాథ్‌దేనని, ఆయన భావితరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. విశ్వనాథ్‌కు వైఎస్ జగన్ అభినందనలు.. ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు 2016 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పురస్కారం అందుకున్న విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఆయనకు ఈ అవార్డు రావడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే గర్వకారణమని కీర్తించారు. ఇది తెలుగు సినిమా రంగానికి దక్కిన గౌరవమని, తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో మరచిపోలేని సినిమాలను విశ్వనాథ్ అందించారని జగన్ ఈ సందర్భంగా ప్రస్తుతించారు. -
తెలుగు దర్శకుడికి అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: భారతీయ సినీ రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" మరోసారి తెలుగువారిని వరించింది. ప్రముఖ దర్శకుడు 'కళాతపస్వి' కె. విశ్వనాథ్‌కు 2016 సంవత్సరానికిగానూ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో మే 3న జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రణభ్‌ముఖర్జీ.. విశ్వనాథ్‌కు అవార్డును అందజేస్తారు. ఫాల్కే అవార్డు దక్కడంపై కళాతపస్వి విశ్వనాథ్ స్పందిస్తూ.. 'నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు'అని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి.. కె.విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కళాతపస్వికి అభినందనలు తెలుపుతున్నారు. గతంలో విశ్వనాథ్ రూపొందించిన 'శంఖరాభరణం' సినిమాకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఏమిటీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు? భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం. దేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు. దీన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం,శాలువా, రూ. పది లక్షలు ఇస్తారు. 1969లో తొలి అవార్డును దేవికా రాణికి ప్రదానం చేశారు. ఇప్పటివరకు పురస్కారాన్ని 45 మందికి అందజేశారు.భారత చలన చిత్ర పితామహుడైన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరిట ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన్నే దాదా సాహెబ్ ఫాల్కే అంటారు. భారతదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను ఆయన 1913లో నిర్మించారు. ఆరుగురు తెలుగు వారికి: దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఇప్పటి వరకు ఆరు గురు(విశ్వనాథ్‌తో కలిపి) తెలుగువారికి దక్కింది. 1. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974) 2. ఎల్.వి.ప్రసాద్ (1982) 3. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986) 4. అక్కినేని నాగేశ్వరరావు (1990) 5. డి.రామానాయుడు (2009) 6. కె. విశ్వనాథ్ (2016) -
కె.విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
-
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - కె.విశ్వనాథ్
-
చరణ్ సినిమా తీస్తే నేనూ బాలూ నటిస్తాం : కె. విశ్వనాథ్
‘‘చరణ్ నన్ను పెదనాన్నా అని పిలిచినప్పుడు పొందిన ఆనందంకన్నా, తను నిర్మాతగా మారడం ఇంకా ఆనందంగా అనిపించింది. తమిళంలో మంచి చిత్రాలు నిర్మించిన తను తెలుగులో కూడా నిర్మాతగా అడుగుపెట్టడం మరింత ఆనందమనిపించింది. మధుమిత దర్శకత్వంలో చరణ్ నిర్మించిన ఈ చిత్రం పాటలు చూశాను. అద్భుతంగా ఉన్నాయి. నేను, నా తమ్ముడు బాలూ కాంబినేషన్లో చరణ్ ఓ సినిమా నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని కళాతపస్వి కె. విశ్వనాథ్ అన్నారు. క్యాపిటల్ ఫిలిమ్ వర్క్స్ సమర్పణలో మధుమిత దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే’. ప్రముఖ రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి, వెంకీ, అదితీ చెంగప్ప హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ కీలక పాత్రలు పోషించారు. కార్తికేయ మూర్తి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని కె. విశ్వనాథ్ ఆవిష్కరించి, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకి ఇచ్చారు. ఈ వేడుకలో చంద్రమోహన్, తనికెళ్ల భరణి, శివలెంక కృష్ణప్రసాద్, కోటి, వెన్నెలకంటి, శశాంక్ వెన్నెలకంటి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ -‘‘తమిళంలో ప్రస్తుతం అగ్రదర్శకులుగా ఉన్న వెంకట్ ప్రభు, సముద్రఖని వంటివారికి ముందు అవకాశం ఇచ్చింది చరణే. ఇప్పుడో మంచి కథాంశంతో ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. తమిళంలోలానే తెలుగులో కూడా సక్సెస్ఫుల్ నిర్మాత అనిపించుకుంటాడనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. చంద్రమోహన్ మాట్లాడుతూ -‘‘విశ్వనాథ్, బాలూ మాదంతా ఓ కుటుంబం. చరణ్ నాకు కొడుకులాంటివాడు. అందుకే ఇది నాకు సొంత సినిమాలాంటిది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చరణ్ తెలిపారు. -
సరికొత్త ఫార్మాట్ లో తెలుగు చిత్రరాజం
తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన సినిమా ‘శంకరాభరణం’ సినిమా 35 ఏళ్ల తర్వాత తమిళంలో విడుదలవుతోంది. డిజిటలైజ్ చేసి మళ్లీ ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టమ్ హంగులద్దారు. కలర్ కరెక్షన్ చేసి సినిమాను స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా పాత నోట్స్ తోనే కొత్త ఫార్మాట్ లో అందిస్తున్నారు. ఈ చిత్రరాజాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దాదాపు ఏడాది కష్టపడి ఈ చిత్రానికి సరికొత్త వన్నెలు అద్దారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో నాలుగు జాతీయ అవార్డులు గెల్చుకుంది. గతంలో ‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాట సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈ తమిళ వెర్షన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారు ఏడిద నాగేశ్వరరావు. -
సినీ కళా పూర్ణోదయ కర్తకు ఎనిమిది పదులు
ఎనభై రెండేళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో కొన్ని వందల మంది నిర్మాతలు, వేలకొద్దీ సినిమాలు వచ్చాయి. కానీ, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమా కీర్తిని వ్యాపింపజేసిన నిబద్ధత గల నిర్మాతలు, సినిమాల సంఖ్య మాత్రం కొద్దే. ముఖ్యంగా, తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా బాట పట్టిన 1970, ’80లలో అలాంటి అరుదైన మంచి చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకోవడం ఆషామాషీ విషయం కాదు. ‘శంకరాభరణం’ లాంటి ఆణిముత్యాలతో ఆ ఘనతను అందుకున్న అరుదైన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. కాకినాడ కాలేజీ రోజుల్లోనే ‘ఇన్స్పెక్టర్ జనరల్’ లాంటి నాటకాలు ప్రదర్శించి, హీరో అవుదామని సినీ రంగానికి వచ్చిన కళాప్రియుడు ఏడిద. డబ్బింగ్ కళాకారుడిగా, తరువాత చిన్నాచితకా వేషాల ఆర్టిస్టుగా ప్రయత్నించిన ఆయన నిర్మాతగా స్థిరపడినప్పుడూ ఆ కళాభిరుచిని వదులుకోకపోవడం విశేషం. నిర్మాతగా ఆయన తీసినవి పట్టుమని పది చిత్రాలే. ‘పూర్ణోదయా మూవీ క్రియేషన్స్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు సినిమా తల్లికి పదికాలాలు నిలిచే పట్టు చీరల్లాంటి సినిమాలు కట్టబెట్టారు. ఏ దేశం వెళ్ళినా, ఇవాళ తెలుగువారు సగర్వంగా చెప్పుకొనే ‘శంకరాభరణం’ (’80), ‘సాగర సంగమం’ (’83), ‘స్వాతిముత్యం’ (’86) లాంటి కళాఖండాలు నిర్మాతగా ఆయన అభిరుచిని పదుగురికీ పంచాయి. ప్రేక్షకుల అభిరుచిని పెంచాయి. మన సినిమాకు ప్రశంసలు, పురస్కారాలు తెచ్చాయి. నిర్మాతగా తాను ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించడానికి దర్శకుడు కె. విశ్వనాథ్, రచయిత జంధ్యాల లాంటి ఎంతోమంది సృజనశీలురు కారణమని ఆయన ఎప్పుడూ నిజాయితీగా నమ్రతతో చెబుతుంటారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సినీ అవార్డుల కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి దూరంగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారాయన. వయోభారం ఇబ్బంది పెడుతున్నా, చెన్నై, హైదరాబాద్‌ల మధ్య తిరుగుతూ, ఇప్పటికీ ముఖ్యమైన సినీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సినిమా పట్ల తరగని ఆయన ప్రేమకు దర్పణం. ఇవాళ్టితో 80 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ సినీ కళాపూర్ణోదయ కర్తకు శుభాకాంక్షలు. -
తమిళంలో డిజిటల్ శంకరాభరణం
తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించిన సినిమా ‘శంకరాభరణం’ (1979). కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై 34 ఏళ్లవుతున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదు. అందుకు నిదర్శనం ఏంటంటే - ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టమ్ హంగులతో, సినిమా స్కోప్‌లోకి మార్చి తమిళంలో విడుదల చేయబోతున్నారు. తమిళ నాట ప్రస్తుతం పాత సినిమాలను డిజిటలైజ్ చేసి మళ్లీ విడుదల చేసే ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాత ఒకరు ‘శంకరాభరణం’ అనువాద హక్కులు తీసుకుని డిజిటలైజ్ చేసి, ఈ నెలాఖరున విడుదల చేయబోతున్నారు. గతంలో ‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాట సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈ తమిళ వెర్షన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారు ఏడిద నాగేశ్వరరావు. ఈ ట్రెండ్ ఫలితంగా... శిథిలావస్థకు చేరుకున్న సినిమాల ప్రింట్లు కొత్త హంగులు అద్దుకుంటే సినీ ప్రియులకు అంతకన్నా ఆనందం ఏముంటుంది! -
25 వసంతాల స్వర్ణకమలం