
కళాతపస్వి కె విశ్వనాథ్ గురువారం రాత్రి శివైక్యమయ్యారు. అభిమానులను పుట్టెడు దుఃఖంలో వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ పలువురు సెలబ్రిటీలు ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా విశ్వనాథ్ పర్సనల్ బాయ్ కిరణ్ కుమార్ దర్శకుడి గురించి చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.
'రెండు సంవత్సరాలుగా విశ్వనాథ్ సార్ దగ్గర పని చేస్తున్నా. ఆయన మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు. మాకు ఒంట్లో బాగోలేకపోయినా వెంటనే మెడికల్ షాప్ నుంచి మెడిసిన్ తెప్పిస్తారు. అర్ధరాత్రిళ్లు లేచి మరీ ఎలా ఉందని అడుగుతారు. అందరితో చాలా చనువుగా ఉంటారు. కుటుంబంతో కలిసి భోజనం చేయడానికే ప్రాముఖ్యతనిస్తారు. పిల్లలు ఆలస్యంగా ఇంటికి వస్తే తనకు కనిపించి వెళ్లమనేవారు. ఆయన భార్య జయ లక్ష్మి మేడమ్‌కు గుడ్‌నైట్ చెప్పందే విశ్వనాథ్ సర్ నిద్రపోరు. నిన్న ఉదయం నుంచే ఆయన నీరసంగా ఉన్నాడు. రాత్రిపూట చివరగా నాగేంద్ర సార్‌తో మాట్లాడారు. సార్ మన మధ్య లేడంటే చాలా బాధగా ఉంది' అని విచారం వ్యక్తం చేశాడు కిరణ్.
Comments
Please login to add a commentAdd a comment