Kalatapasvi K Viswanath Funeral Live Updates - Sakshi
Sakshi News home page

K Viswanath Funeral Updates : పంజాగుట్ట స్మశానవాటికలో కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు

Published Fri, Feb 3 2023 2:39 PM | Last Updated on Fri, Feb 3 2023 5:45 PM

Kalatapasvi K Viswanath Funeral Live Updates - Sakshi

సినీ దిగ్గజం​ కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్‌ కె. విశ్వనాథ్‌(92)మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్‌ నుంచి పంజాగుట్ట వర​కు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement