
కళాతపస్వి కె విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గురువారం రాత్రి అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడాచారు. దీంతో ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలనాటి హీరో, సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆయన పార్థివ దేహం వద్ద బోరున విలపించిన దృశ్యం అందరిని కలిచివేసింది. ఇక ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వాపోయారు.
చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..
అలా సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోల నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు సోషల్ మీడియాలో కళాతపస్వికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా మ్యూజికల్ మ్యాస్ట్రో, ఎంపీ ఇళయరాజా తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో ఇళయరాజా తెలుగులో మాట్లాడుతూ విశ్వనాథ్‌కు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్ ఫిలిం హిస్టరీలో చాలా ముఖ్యమైన, ప్రధాన స్థానంలో ఉన్న, చాలా ముఖ్యమైన దర్శకుడు కె విశ్వనాథ్ గారు దేవుడు పాదాల వద్దకు వెళ్లారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని కోరుకుంటున్నా’ అంటూ నివాళులు అర్పించారు.
చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం!
— Ilaiyaraaja (@ilaiyaraaja) February 3, 2023
Comments
Please login to add a commentAdd a comment