![Tana To Organise Chaitanya Sravanthi In Shilpakala Vedika - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/8/NRI-1.jpg.webp?itok=NM0YJifs)
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో కళారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురష్కారాలు అందిస్తున్నట్లు చెప్పారు.
పద్మభూషణ్ సుశీల, పద్మభూషణ్ సరోజా దేవి, పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాధ్, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు కృష్ణవేణి, జమున, లక్ష్మి, మురళీ మోహన్, గిరిబాబు ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తదితరులను తానా పురస్కారాలతో సన్మానిస్తున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ పాంత్రా సునీల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ శోభారాజు అన్నమాచార్య భవన వాహిని, గురు రామాచారి లిటిల్ మ్యూజిషియన్స్, సిద్ధేంద్ర కూచిపూడి అకాడమీ, అమెరికాకు చెందిన 300కు పైగా విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment