Kota Srinivasa Rao
-
అహ! నా పెళ్ళంట!
అహ! నా పెళ్ళంట! హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శ కత్వంలో సురేష్ ప్రోడక్షన్స్ 1987లో నిర్మించిందీ చిత్రాన్ని. పిసినారితనాన్ని ఆధారంగా చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ సినిమాల విషయంలో టాలీవుడ్లో ఓ చరిత్ర సృష్టించింది. మొదట్నుంచి చివరి వరకూ హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రాజేంద్రప్రసాద్ ఇందులో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆయన సినీ కెరీర్లో ‘అహ! నా పెళ్ళంట!’ ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్‌కు వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదంటే అతిశయోక్తి కాదేమే. కోట శ్రీనివాసరావు పిసినారిగా కీలకమైన పాత్ర పోషించారు. హీరోయిన్ గా రజని, ఇంకా నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి వంటి సీనియర్ నటులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.పిసినారులకే పిసినారిసినిమాలో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హీరో రాజేంద్రప్రసాద్. తాను ప్రేమించిన అమ్మాయి కోసం పరమ పిసినారిగా నటించాల్సి వస్తుంది. హీరోయిన్ రజని తండ్రి కోట శ్రీనివాస రావు పిసినారులకే పిసినారి. అటువంటి వ్యక్తిని మెప్పించి అతని కూతుర్ని పెళ్లి చేసుకునేందుకు పిసినారిగా మారిన రాజేంద్రప్రసాద్ పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. అందులో భాగంగా హీరో తాను ఇంకా వెయ్యి రెట్లు పిసినారినని నిరూపించుకోడానికి నానా తంటాలు పడుతుంటాడు.అలా కొంత కాలానికి హీరో ఆ పిసినారి మామకు బాగా దగ్గరవుతాడు. ఇదే సమయంలో.. తన కొడుకు పిసినారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీరో తండ్రి నూతన్ ప్రసాద్ కూడా ఆ ఊరొచ్చి ఆ ఇంట్లోనే దిగి తన కొడుకు ప్లాన్లను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతో ఆరంభం నుంచి ముగింపు వరకూ పగలబడి నవ్విస్తాడు డైరక్టర్. చివరికి పిసినారి భార్య, కూతురు కలసి తిరగబడి కోటకు బుద్ధి చెప్పి ఈ పెళ్ళికి ఒప్పిస్తారు.కళ్ళజోడుని రాయితో కొట్టి మరీ...‘అహ! నా పెళ్ళంట!’ సినిమా కథను ప్రముఖ కథా రచయిత ఆది విష్ణు రాసిన ‘సత్యం గారి ఇల్లు’ నవల ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇక కాస్టింగ్ విషయానికొస్తే... కథలో కీలకమైన పాత్ర పిసినారి, హీరోయిన్ తండ్రి లక్ష్మీపతిది. ఈ పాత్రను తొలుత రావు గోపాలరావు పోషిస్తే బావుంటుందని భావించారు. కానీ పాత్ర స్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరి కాదని ఎవరో సూచిస్తే ఆయన్ను కాదనుకుని కోట శ్రీనివాసరావును అనుకున్నారు. అప్పటికి కేవలం రెండంటే రెండే సినిమాల్లో నటించిన కోటను ఈ పాత్రకు తీసుకున్నారు. అందుకు తగ్గట్టే కోట అద్భుతమైన నటనతో కట్టిపడేశారు.రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావులు పోటీపడి నటించారు. లక్ష్మీపతి పాత్ర కోసం కోట తన జుట్టు చాలా వరకూ తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాఫ్ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినిమాల్లో నటిస్తుండడంతో ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత, విశిష్టత దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర సినిమాల దర్శక–నిర్మాతలను ఒప్పించి మరీ ‘అహ! నా పెళ్ళంట!’లో ఆ పాత్ర చేశారు. ముతక పంచె, చిరిగిన బనీను, పగిలిన కళ్ళద్దాలతో కనిపించే ఈ రోల్ ఆహార్యాన్ని జంధ్యాలే స్వయంగా తీర్చిదిద్దారు. పంచె, బట్టలు మాసిపోయి ఉండాలని, పనిగట్టుకుని దుమ్ములో దొర్లించి మరీ ఇచ్చేవారట. కళ్ళజోడు మామూలుదే తెప్పించి తర్వాత జంధ్యాల రాయిపెట్టి పగలగొట్టి మరీ పగిలిన కళ్ళద్దాలతో నటింపజేశారు.అరగుండు బ్రహ్మానందంగా...బ్రహ్మానందంకు ఈ సినిమాతో అరగుండు బ్రహ్మానందంగా బాగా పేరు వచ్చింది. తన జీతాన్ని కోసేసినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాస రావును తిట్టే తిట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమాను హైదరాబాద్, దేవర, యామి జాల గ్రామాల్లో తీశారు. ఈ గ్రామాల్లో ఉన్న కొన్ని ఇళ్ళలో వేరే సెట్లు వెయ్యకుండానే తియ్యడం ఈ సినిమా మరో ప్రత్యేకత. దాదాపు రూ. 16 లక్షలతో రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ. 5 కోట్లు వసూలు సాధించడం విశేషం. సినిమా కథలో ‘పిసినారితనం’ కీలకం... కానీ కలెక్షన్ల విషయంలో ప్రేక్షకులు చాలా ధారాళం చూపించారు. ఈ స్థాయి పిసినారితనం ఉన్న సినిమాలు ‘అహ! నా పెళ్ళంట!’ తర్వాత ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి. భవిష్యత్తులో వస్తాయా? అంటే ప్రశ్నార్థకమే. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
విలన్ పాత్రలకు ట్రేడ్ మార్క్ యాక్టర్.. కోటా శ్రీనివాసరావు బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
అటు ఇటు కానీ క్యారెక్టర్ చేయడానికి కొంచెం కష్టం ఉండేది
-
త్రివిక్రమ్ పెద్ద డైరెక్టర్ అంటే నేను ఒప్పుకోను..!
-
నా తమ్ముడిని అందుకే సపోర్ట్ చేయలేదు: కోట శ్రీనివాసరావు
-
తెలుగు సినిమాలకు అవార్డులు ఎందుకు రావంటే..!
-
పెద్ద హీరోలపై కోట శ్రీనివాస్ ఫన్నీ సెటైర్లు
-
ఆ రూల్స్ లేకపోవడం వల్లే మనకు ఈ దౌర్భాగ్యం: కోట శ్రీనివాసరావు
-
కొడుకే లేనప్పుడు ఆస్తి ఎంత ఉంటే ఏంటి..?
-
పద్మశ్రీ అవార్డుతో నా జన్మ ధన్యం అయింది
-
సినిమాలో ఆ క్యారెక్టర్ నా జీవితాన్ని మార్చేసింది..!
-
YSR నన్ను చూసినప్పుడల్లా ఒక మాట అనేవారు..!
-
ఆరోజు రైల్వేస్టేషన్ లో చచ్చిపోయేవాడిని కానీ..!
-
మా ఇద్దరి కామెడీ అందరికీ చాలా నచ్చుతుంది...!
-
ఒకే ఫొటోలో ఐదుగురు స్టార్ కమెడియన్స్.. అరుదైన దృశ్యం చూశారా?
సినిమాకు కామెడీ అనేది ప్రధానం. ఎంత పెద్దసినిమా అయినా సరే కాసింతైనా కామెడీ లేకపోతే అభిమానులు నిరాశ చెందడం ఖాయం. కథ ఎంత బలంగా ఉన్నప్పటికీ.. కామెడీ కనిపించకపోతే అబ్బే ఏదో సినిమాలో లోపించందండి అంటుంటారు. పెద్ద హీరోల సినిమాలైనా సరే కామెడీకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అలా తెలుగు సినిమాలో 1990ల్లో కడుపుబ్బా నవ్వించిన వారిలో ఠక్కున వినిపించే పేర్లు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు జోడీ. వీరిద్దరు చేసిన కామెడీ తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఎంఎస్ సత్యనారాయణ, బ్రహ్మనందం లాంటి వాళ్లు తెలుగు సినిమా కామెడీని ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పట్లో కమెడియన్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు బ్రహ్మనందమే. ఆయన లేకుండా సినిమా లేదంటే ఓ వెలితి ఉన్నట్లే అనిపిస్తుంది. అలా తన కామెడీతో సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) అయితే ఒక్క కమెడియన్ సినిమాలో ఉంటేనే కడుపు చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. అలా ఏకంగా ఐదుగురు స్టార్ కమెడియన్స్ ఓకే ఫోటోలో కనిపిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది. ఇక నవ్వులే నవ్వులు. అలాంటి అరుదైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితమే తెలుగులో స్టార్ కమెడియన్స్‌గా పేరొందిన ఆ ఐదుగురి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అప్పటి ఐదుగురు తెలుగు స్టార్ కమెడియన్స్ ఫోటోను నెటిజన్ ట్వీట్ చేయగా.. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది మా పాతికేళ్ల కామెడీ కుటుంబం అంటూ నెటిజన్‌కు రిప్లై ఇచ్చాడు. ఓకే ఫోటోలో బ్రహ్మనందం, బాబు మోహన్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, చలపతిరావు నవ్వుతూ కనిపించారు. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం తెలుగు సినిమా కామెడీ కుటుంబం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆ జోక్ ఏంటో మాకు కూడా చెప్పండి సార్ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా కమెడియన్ సినిమాకు ప్రాణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!) పాతికేళ్ల క్రితం మా కామెడీ కుటుంబం! 🥰 https://t.co/WW2dmgePOl — Tanikella Bharani (@TanikellaBharni) August 7, 2023 -
టమాటా చిత్ర కథ: అహ నా టమాటంట
‘చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే తిననక్కర్లేదు. గాల్లో వేలాడుతున్న కోడిని చూస్తూ, ఊహించుకుంటూ బ్రహ్మాండంగా తినవచ్చు’ అనే గొప్ప సత్యాన్ని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) జనులకు చెప్పకనే చెప్పారు. ‘ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే గాలిలో వేలాడుతున్న కోడికి బదులు టమాటాలు ఉంటాయి’ అని నెటిజనులు ఒకటే జోకులు! ఒక మహిళ దుబాయ్‌కి వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే ముందు...‘నీ కోసం ఏం తీసుకురమ్మంటావు?’ అని తల్లిని అడిగింది. ‘బంగారు నగలో, లగ్జరీ గిఫ్టో అడిగి ఉంటుంది’ అని అనుకుంటారు చాలామంది. కానీ ఆ తల్లి బంగారం కంటే విలువైన టమాటాలను అడిగింది. ఒకటి కాదు రెండు కాదు...‘పది కిలోల టమాటాలు తీసుకురామ్మా’ అని కూతురిని అడిగింది. పదికిలోల టమాటాలను పెరల్పెట్ స్టోరేజ్ జార్లలో ప్యాక్ చేసి ఇండియాకు తీసుకువచ్చింది కూతురు. ఈవిడ సోదరి ట్విట్టర్లో షేర్ చేసిన దుబాయ్ టమాటాల స్టోరీ వైరల్ అయింది. ∙∙ బంగారు నగలు అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు? అయితే టమాటాలేమో బంగారం కంటే విలువైపోయాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ‘యూరేకా... టమాటాలతో ఆభరణాలు’ అని అరిచింది. టమాటాలను చెవిరింగులుగా ధరిస్తూ ‘న్యూ గోల్డ్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది. ∙∙ శిల్పాశెట్టి షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వీడియో విషయానికి వస్తే... టమాటాల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళుతుంది శెట్టి. టమాటాలన్నీ కూడబలుక్కొని ‘టచ్‌మీ నాట్’ అన్నట్లుగా చూస్తుంటాయి. టమాటాలను చేతిలో తీసుకున్న ప్రతిసారీ ఆమె నటించిన ‘దడ్కన్’ సినిమాలోని ‘ఖబడ్దార్. హౌ డేర్ యూ’ అనే డైలాగ్ ప్లే అవుతుంటుంది! -
షూటింగ్ గ్యాప్‌లో మందు తాగినందుకు చిరంజీవి తిట్టాడు: కోట
కామెడీ, విలనిజం.. వేర్వేరుగా, అవసరమైతే రెండింటినీ ఏకకాలంలో పండించగల సమర్థుడు కోట శ్రీనివాసరావు. వైవిధ్యమైన పాత్రలు ఎన్నో పోషించిన ఆయన నటప్రస్థానం ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వందలకొద్దీ చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి కొన్ని ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకున్నారు. 'ఒకసారి ఏమైందంటే సెట్‌కు వెళ్లాక మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదన్నారు. ఎమ్మెస్ నారాయణ.. ఏంటి అన్నాయ్, ఇంకా చాలా టైముందిగా అని బయటకు వెళ్దాం అన్నాడు. ఇద్దరం కలిసి మందు తాగాం. అనుకోకుండా షూటింగ్‌కు రమ్మని కబురొచ్చింది. సెట్‌కు వెళ్తే అక్కడ చిరంజీవి ఉన్నాడు. నన్ను చూడగానే నాపై కేకలేశాడు. ఏమయ్యా, బుద్ధుందా? మంచి కెరీర్ ఉన్నవాడివి పట్టపగలు తాగి రావడమేంటి? పది మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది? అని తిట్టాడు. కానీ నా మంచి కోసం, నా బాగోగులు కోరే అతడు నన్ను హెచ్చరించాడు. ఇకపోతే మండలాధీశుడులో ఎన్టీఆర్ పాత్ర ఆఫర్ చేశారు. అప్పటికే ఈ రోల్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణగారు చేయమని ప్రోత్సాహించారు. నాకేమో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారోనని భయంగా ఉంది. అప్పుడు నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఉందాం, లేదంటే ఉద్యోగంలో చేరిపోదాం అనుకున్నా. మండలాధీశుడు మంచి విజయం సాధించింది. కానీ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓసారి నా కూతుర్ని చూసేందుకు విజయవాడ వెళ్లాను. అక్కడ రైలు దిగగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ, కొట్టారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను' అని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు. చదవండి: సుమతో విబేధాలు? రాజీవ్ కనకాల ఏమన్నాడంటే? సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ -
చిన్న ఆర్టిస్టులను బతికించండి: కోటా శ్రీనివాసరావు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్, ప్రభ, శివకృష్ణ, రోజా రమని, కవిత, తనికెళ్ల భరణి, బాబు మోహన్, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయి మాధవ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బా సురేశ్ కుమార్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. గారపాటి లోకేశ్వరి,నందమూరి మోహనకృష్ణ,నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్,నందమూరి యశ్వంత్, రిటైర్డ్ ఐ జి మాగంటి కాంతారావు, అంబికా కృష్ణ,తుమ్మల ప్రసన్నకుమార్,అనంతపురం జగన్,‘మా’ ఈ సీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. సన్మానం అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఇవాళ్ల రేపు సినిమా అనేది లేదు.. అంతా సర్కస్. విషాదకర పాటకు కూడా డాన్స్‌లు వేస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు కానీ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు. ఇది మంచి పద్థతి కాదు. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవితో డాన్స్ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి’’ అని అన్నారు. అలాగే ‘మా’ అసోసియేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘ఎంతమంది ఆర్టిస్ట్ రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దృష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని కోరారు. పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతో ‘పది కోట్లతో సినిమా తీస్తే.. డబ్బు ఇవ్వద్దు.. రాయితీలు ఇవ్వద్దు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా లొకేషన్ ఉచితంగా ఇస్తుంది అని ప్రకటించమని ప్రభుత్వానికి ఓ లెటర్ రాయండి’అని అన్నారు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో ప్రకటనలో నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండి’అని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.ఈవెంట్ ఆర్గనైజర్ మరియు మా ఈ సీ మెంబర్ విష్ణుబొప్పన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు. -
రోజుకు 2 కోట్లు అని పబ్లిక్‌గా చెప్పడం ఏంటి? పవన్‌కు కోటా చురకలు!
స్టార్ హీరోల రెమ్యునరేషన్, వాణిజ్య ప్రకటనలపై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో ఏ హీరో తన రెమ్యునరేషన్ అంతా, ఇంతా అని ఎక్కడా చెప్పేవాడు కాదని, ఇప్పటి హీరోలు మాత్రం నాకు రోజుకు 2 కోట్లు, 6 కోట్లు తీసుకుంటున్నానని పబ్లిక్‌గా చెబుతున్నారని విమర్శించాడు. అలా పబ్లిక్‌గా రెమ్యునరేషన్ గురించి హీరోలు చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకల్లో కోటా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఇప్పుడు సినిమా అనేది లేదు. అంతా సర్కసే. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు’ అంటూ కోటా సెటైర్లు వేశారు. (చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ఆ పని చేయాలంటూ ఫ్యాన్స్‌కి చిరు విజ్ఞప్తి) అలాగే హీరోల వాణిజ్య ప్రకటనల గురించి మాట్లాడుతూ.. ‘ఈ రోజు సినీ ఆర్టిస్టులు రెండు పూటలా భోజనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా అసోసియేషన్ గుర్తించాలి. చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో అడ్వర్టైజ్మెంట్లో అయినా నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి చిన్న ఆర్టిస్టులను బతికించండి’ అని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశాడు. అయితే హీరోల రెమ్యునరేషన్ విషయంలో కోటా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో తాను రోజుకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని తెలిపిన సంగతి తెలిసిందే. కోటా వ్యాఖ్యలను కొంతమంది నెటిజన్స్ సమర్థిస్తుంటే..పవన్ ఫ్యాన్స్ మాత్రం విమర్శిస్తున్నారు. -
డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు
-
డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు
సోషల్ మీడియాలో తాను చనిపోయినట్లు వార్తలు రావడం బాధాకరం అని ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. రేపటి ఉగాది పండుగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న తనకు వరుస ఫోన్ కాల్స్ రావడం ఆందోళన కలిగించిందని, ఏకంగా 10 మంది పోలీసులు భద్రత కోసం తన నివాసానికే వచ్చారని కోటా ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలుంటాయని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకోవద్దని హెచ్చరించారు. ప్రజలు అర్థం చేసుకొని తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. -
తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో కళారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురష్కారాలు అందిస్తున్నట్లు చెప్పారు. పద్మభూషణ్ సుశీల, పద్మభూషణ్ సరోజా దేవి, పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాధ్, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు కృష్ణవేణి, జమున, లక్ష్మి, మురళీ మోహన్, గిరిబాబు ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తదితరులను తానా పురస్కారాలతో సన్మానిస్తున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ పాంత్రా సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ శోభారాజు అన్నమాచార్య భవన వాహిని, గురు రామాచారి లిటిల్ మ్యూజిషియన్స్, సిద్ధేంద్ర కూచిపూడి అకాడమీ, అమెరికాకు చెందిన 300కు పైగా విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. -
ఓవైపు విలనిజం.. మరోవైపు హాస్యం.. వీళ్ల స్టైలే సెపరేటు
చాలా సినిమాల్లో శాడిస్ట్ విలన్లను చూశాం. భీభత్సానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే విలన్లను కూడా అనేక మూవీస్‌లో చూశాం. చాలా సినిమాల్లో కాకపోయినాకొన్ని చిత్రాల్లో ఇంటిలిజెంట్ విలన్లను చూశాం. కానీ అతి భయంకరమైన విలనీజాన్ని ప్రదర్శిస్తూ, అదే సమయంలో నవ్వించే విలన్లను చూశారా మీరు ? ఆ క్యారెక్టర్ మీద ప్రేక్షకుల్లో భయం పోకుండా చూసు కుంటూ మళ్లీ అదే ప్రేక్షకులను నవ్వించాలి. ఇది చాలా క్లిష్టమైన టాస్క్. సిల్వర్ స్క్రీన్ మీద ఈ టాస్క్‌ని వండర్స్‌లా పండించిన వాళ్లపై ఒక లుక్ వేద్దామా… ►సినిమాలో హీరో ఎంత కామనో విలన్ కూడా అంతే కామన్. విలన్ క్యారెక్టర్ ఎంత భయంకరంగా, బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత స్ట్రాంగ్‌గా ఎలివేట్ అవుతుంది. అలా కాకుండావిలన్ కామెడీ చేస్తే ఏమౌతుంది ? అది కామెడీ సినిమా అవుతుంది. కానీఒకే సినిమాలో ఒకే క్యారెక్టర్‌తో ఇటు విలనీజాన్ని, అటు కామెడీని పండిస్తూ మూవీలోని సీరియస్‌నెస్‌ని దెబ్బ తీయకుండా నటించడం సాధారణ విషయం కాదు. అలాంటి ఛాలెంజ్‌ని తమ అసాధారణ నటనతో అధిగమించిన కొద్ది మంది నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. శత్రువు సినిమాలో వెంకటరత్నం పాత్రలో కోటా శ్రీనివాసరావు జీవించారు. వెంకటరత్నం అత్యంత దుర్మార్గుడు. తన అక్రమాలకు ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాడు. అలాంటి పాత్రకే కామెడీ టచ్ ఇచ్చారు దర్శకుడు కోడి రామకృష్ణ.సినిమా అంతా ఇలాంటి మేనరిజంతోనే కామెడీ టచ్‌తోనే వెంకటరత్నం క్యారెక్టర్ సాగుతుంది. కానీ విలన్ తాలుకూ దుర్మార్గాలకు ఆ కామెడీ అంటకుండా కోటా అద్భుతంగా నటించారు.కొంచెం నవ్వించగానే కామెడీ విలన్ అన్న భావన వస్తుంది. కానీ నవ్వించే చోట నవ్విస్తూ అదే సమయంలో అత్యంత దుర్మార్గుడుగా విలనీజం పండిస్తూ అద్భుతంగా నటించారు కోటా. ►తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయే విలన్ క్యారెక్టర్లలో ఒకటి ముత్యాల ముగ్గు చిత్రంలో కొంపలు కూల్చే కాంట్రాక్టర్. ఈ పాత్రలో రావుగోపాలరావు జీవించేశారు. సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో రావుగోపాలరావు క్యారెక్టర్ కూడా ఆ స్థాయిలో సక్సెస్ అయింది. హత్యలు చేయడం దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి వారిని విడదీయడం దాకా దగుల్బాజీ పనులను కాంట్రాక్ట్ పద్దతిలో చేసే కాంట్రాక్టర్ పాత్ర రావుగోపాలరావుది. సినినమా మొత్తంలోనూ అత్యంత క్రూరమైన పనులను చాలా సౌమ్యంగా చేస్తుంది కాంట్రాక్టర్ పాత్ర. మడిసన్నాక కాస్తంత కళాపోసనుండాలయ్యా…ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటుంది అంటూ గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన డైలాగ్స్ ఒక రేంజ్లో పేలాయి. ఈ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్స్‌తో విడుదలైన ఎల్.పి.రికార్డులు, ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. ఇంతగా అలరించిన అదే క్యారెక్టర్లో విలన్‌గా ప్రేక్షకులను భయ పెట్టారు రావుగోపాలరావు. ఒకే పాత్రలో రెండు షేడ్స్‌ని అద్భుతంగా ప్రదర్శించారు. విలన్ కూడా మనిషే. అతనికి సెంటిమెంట్లు ఉంటాయి. అతనికి బాధ వేస్తుంది. భయం వేస్తుంది. ఇంత వరకు ఓకే. కానీ…విలన్ పదే పదే నవ్వేసి, ప్రేక్షకులను నవ్వించాడు అంటే…ఆ విలనిజం తాలుకూ భయం పోతుంది. విలన్ అనగానే సహజంగా ఆడియన్స్‌లో కలిగే గగుర్పాటు మాయమవుతుంది. అది మిస్ కానివ్వకుండా తన పాత్రని కాసేపు కామెడీ ట్రాక్ మీద, కాసేపు కుతంత్రాల ట్రాక్ మీద నడిపించడం నటుడుకి నిజంగా ఛాలెంజే. ►తెలుగు ప్రేక్షకులకు విలనిజాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన నటుల్లో పరేష్ రావెల్ ఒకరు. క్షణక్షణం చిత్రంలో నాయర్ క్యారెక్టర్ దశాబ్దాలు గడిచినా ప్రేక్షకులకు గుర్తిండిపోయింది. అత్యంత దుర్మారుడుగా ఒక వైపు కనిపిస్తూనే అదే సమయంలో ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్వించాడు రావెల్. ఆ పాత్రని రాంగోపాల్ వర్మ డిజైన్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. డెన్లు గట్రా లేకుండా… చిన్న మఫ్లర్ కట్టుకొని కామన్ మ్యాన్ లా కనిపిస్తూనే అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంది నాయర్ క్యారెక్టర్. ►ఒకవైపు సీరియస్ విలన్‌గా ఎక్స్‌ఫోజ్ అవుతూ…తన మీద ఉన్న క్రూయల్ ఫీల్ అలానే మెయిన్‌టెన్ అయ్యేలా చూసుకుంటూ అదే సమయంలో కామెడీ చేయడం చాలా కష్టం. దాన్ని చాలా ఈజీగా చేసేశాడు పరేష్ రావెల్. దొంగలకు కూడా వెర్రి డౌట్స్ ఉంటాయని ,రౌడీలలో కూడా క్యూరియాసిటీ ఉంటుందని నాయర్ క్యారెక్టర్‌తో చెప్పాడు డైరెక్టర్. పాములు పగ పడతాయంటావా? అడవిలో ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టుంటారు లాంటి నార్మల్ డౌట్స్‌తో మొదలు పెడితే…చాలా రకాలుగా నవ్వించాడు పరేష్ రావెల్. ►భయంకరమైన విలన్‌గా, కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్‌గా ప్రేక్షకులను జయప్రకాష్ రెడ్డి ఏ రేంజ్లో భయపెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలానే…పక్కా కమెడియన్‌గా కూడా చాలా సిని మాల్లో మెప్పించారు. అయితే…ఒకే సినిమాలో ఇటు సీరియస్ విలన్‌గా, మరి కాసేపు కామెడీ టచ్‌తో వావ్ అనిపించింది కృష్ణ మూవీలో కృష్ణ సినిమాలో ప్రధాన విలన్ బాబాయ్, అతను చేసే ప్రతి దుర్మార్గంలోనూ పాలు పంచు కునే క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డిది. మెయిన్ విలన్ జగ్గా చేసే ప్రతి పాపపు పనికి స్కెచ్ గీసే పాత్రలో కూడా ఆయన హాస్యం పండించారు. రవితేజ, జయప్రకాష్ రెడ్డి…ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి కాంబినేషన్లలో వచ్చే సీన్లు ఒక రేంజ్లో పేలాయి. -
నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao Comments On Mega Brother Nagababu: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య పలువురు నటీనటులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ యుట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్ అనసూయ డ్రెస్పింగ్పై కోట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతకుముందు ‘మా’ ఎన్నికల నేపథ్యంలో విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట అదే సమయంలో ప్రకాశ్ రాజ్‌పై చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబును ఆయన టార్గెట్ చేశారు. గతంలో తనపై చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ ఈ ఇంటర్య్వూలో మెగా బ్రదర్‌కు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ.. ‘చిరంజీవి ఒక పక్క, పవన్ కల్యాణ్ మరో పక్క వీరిద్దరు లేకపోతే ఈ నాగబాబు ఎవరు?. వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. ఆయనకేందుకు అసలు. గతంలో నాగబాబు ప్రకాశ్ రాజ్‌ను తిట్టారు. అది అందరికి తెలుసు. నేను ప్రకాశ్ రాజ్‌ను అన్నానని ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు. అపుడు ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన కామెంట్స్‌కు అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో డిబెట్లు అంటూ రచ్చ జరిగేది’ అంటూ కోట మండిపడ్డారు. అనంతరం ఇప్పటికి తాను అదే చెబుతానని, చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబుకు గుర్తింపు లేదన్నారు. ఒక్క మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్పా అంటూ కోట సంచలన కామెంట్స్ చేశారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! కాగా ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రకాశ్ రాజ్ కలిసి 15 సినిమాలకు పైగా నటించానని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్‌కు సమయానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ కోట సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోట వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబుశాడు కోట శ్రీనివాసరావు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు కూడా నాగబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు -
కోట కామెంట్లపై అనసూయ ఫైర్, నీచమంటూ ఘాటు రిప్లై
అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. యాంకరింగ్ చేస్తూ ఇటు బుల్లితెర వీక్షకులను, నటిగా, డ్యాన్సర్‌గా రాణిస్తూ అటు వెండితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అందాల ఆరబోతలో హీరోయిన్లకే పోటీనిచ్చే ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే! అనసూయ వేసుకునే బట్టలు నచ్చవని, అసలు ఆమె అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదని పేర్కొన్నాడు. వీలైతే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని కామెంట్ చేశాడు. తాజాగా ఈ కామెంట్స్‌పై అనసూయ ఘాటుగా స్పందించింది. కోట శ్రీనివాసరావు పేరు ప్రస్తావించకుడా ఆయనను ట్విటర్ వేదికగా విమర్శించింది. ''ఈ మధ్యే ఓ సీనియర్ నటుడు నాపై కొన్ని కామెంట్స్ చేశారు. నా వస్త్రధారణ గురించి మాట్లాడారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అంత నీచంగా మాట్లాడటం నన్ను తీవ్రంగా బాధించింది. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వారి వ్యక్తిగతం, వృత్తిపరమైన పరిస్థితులను బట్టి కూడా అలా ధరించాల్సి రావచ్చు. ఏదేమైనా ఒకరు ధరించే దుస్తులు వారి వ్యక్తిగతం. కానీ నేడు సోషల్ మీడియా ఇలాంటివాటినే హైలెట్ చేస్తోంది. ఆ సీనియర్ నటుడు మందు తాగుతూ, అధ్వాన్నమైన దుస్తులను ధరించినప్పుడు, సినిమాల్లో మహిళలను కించపరిచినప్పుడు ఎందుకీ సోషల్ మీడియా పట్టించుకోదనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరైతే పెళ్లి చేసుకున్నారో, పిల్లలను కలిగి ఉన్నారో, సినిమాల్లో నటీమణులతో రొమాన్స్‌తో చేస్తున్నారో, చొక్కాలిప్పేసి దేహాన్ని చూపిస్తున్నారో.. అలాంటి తారలనెందుకు ఎవరూ ప్రశ్నించరు? నేను పెళ్లైన స్త్రీని, ఇద్దరు పిల్లల తల్లిని. పితృస్వామ్య విధానాలను ప్రశ్నిస్తూ పని చేస్తున్న నేను`నా వృత్తిలో విజయం సాధించేందుకు కష్టపడుతున్నా.. ప్రజలకు మీ అభిప్రాయాలను చెప్పేముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి'' అని లేఖ పోస్ట్ చేసింది. పెద్దరికం చిన్నరికం అనేవి వయసుతో కాదండి, అనుభవంతో కండక్ట్ చేసుకునే విధానంలో ఉంటుంది. ఒక నటుడిగా ఆయనంటే నాకు చాలా గౌరవం. విభిన్నమైన పాత్రలు చాలా అద్భుతంగా అభినయించారు. కానీ ఒక వ్యక్తిగా ఆయన కామెంట్స్ చాలా నీచంగా ఉన్నాయి, అవి అనవసరం కూడా! అని కుండ బద్ధలు కొట్టేసింది అనసూయ. 🙏🏻 pic.twitter.com/lQxqm0ZF01 — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021 Ante pedda vaallu chinna vaallu evvaru padite vaallu edi padite adi nannu anochu.. nenu okamate tirigu jaeabu iste maatram “papam musalayana.. papam peddayana.. papam chinnavadu.. papam edo telika.. scene cheyakandi” lanti reactions aa andi na pai?? enta anyayam andi idi?! 😒 — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021 So let me just clear the mist for you guys..all those who’ve been talking about what women should wear in the past or now..are only so weak & polluted in their heads that rather than teaching themselves to guide/control their sexual feelings or (1/2).. — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021 ..(2/2) not fuelling their male chauvinism.. they imposed/impose these mindless dress codes on women.. they slut shame women to cover their himbo thoughts.. I want to believe today’s men are much more logical and brave and sensible and righteous .. please prove me right 🙏🏻 — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 18, 2021 -
అనసూయ డ్రెస్సింగ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao Comments On Anasuya Dressing : ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తూనే ఇటూ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గ్లామర్ విషయంలో హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోయే అనసూయ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ తనదైన స్టైల్లో అలరిస్తుంది. అంతా బాగానే ఉన్నా ఆమె డ్రెస్సింగ్‌పై మాత్రం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి నేటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి ఆ బట్టలేంటి అంటూ కొందరు నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ను ఇప్పటికీ ఎదుర్కుంటున్నారు. తాజాగా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు వివాదాస్పద కామెంట్స్ చేశారు. అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్ చేశారు. ఇటీవలె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్ నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని అంటున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు
Kota Srinivasa Rao Comments On Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. అదే క్రమంలో పలువురు తమకు నచ్చినవారికి మద్ధతు ప్రకటిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు మద్ధతు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్‌కు క్రమశిక్షణ లేదంటూ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టో ఇదే -
బాలకృష్ణ ఆనాడు దారుణంగా అవమానించాడు : కోట
Kota Srinivasa Rao Sensational Comments: నటుడు కోట శ్రీనివాస రావు సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టాడు. తాను నటించిన మండలాధీశుడు సినిమా చాలా బాగా చేశావంటూ దివంగత నటుడు ఎన్టీఆర్ మెచ్చుకుంటే, ఆయన తనయుడు బాలకృష్ణ మాత్రం తన ముఖం మీద ఉమ్మేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పుడు బాలకృష్ణ.. కోటగారు చాలా మంచి నటుడు అని అంటుంటారు. కానీ గతంలో రాజమండ్రిలో ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఓరోజు బాలకృష్ణ కనిపించారు. గౌరవంగా నేనే నమస్కారం బాబు అని అన్నాను. కాండ్రించి ముఖంపై ఉమ్మేశాడు. ఇది ఆయన సంస్కారం మరి. ఏం చేస్తాం? ఇలాంటి చేదు ఘటనలు మర్చిపోలేను' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కోట శ్రీనివాస రావు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: Chiru154 : పూనకాలు లోడింగ్.. అదిరిపోయిన పోస్టర్ సినిమాల్లోకి రాకముందు నటి నివేదా ఏం చేసేదో తెలుసా? -
Happy Birthday Kota: వారీ.. ఏం యాక్ట్ జేసినవ్వొయ్
ఆయన ఏ వేషం వేసినా.. దానికో ప్రత్యేక గుర్తింపు. ‘కోటన్నా..’ అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు ‘తంబీ, వారీ..’ అని ఆయన తెరపై పిలిచే పిలుపు.. ఆడియొన్స్కి వినసొంపు. నైజాం యాస అయినా.. మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్లుగా మార్చుకోవడం ఆయన తరీఖా. కడుపుబ్బా నవ్వించడంలో.. క్రూరత్వంతో భయపెట్టించడంలో ఆయనదో ప్రత్యేకమైన మార్క్. నటనకు పెట్టని ‘కోట’గా తెలుగు సినీ పరిశ్రమలో వెలుగొందుతున్న కోటా శ్రీనివాసరావు పుట్టినరోజు ఇవాళ! సాక్షి, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయులు సంతానమే కోటా శ్రీనివాసరావు. కోట 1945, జులై 10న జన్మించాడు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయాడు.నటనపై ఇష్టంతో బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నాడు. ‘ప్రాణం ఖరీదు’తో మొదలైన ఆయన నటన.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహితంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా దాదాపు ఎనిమిది వందల సినిమాల దాకా నటించిన(అంతకు మించి) కోట.. ప్రతీ సినిమాలో వేరియేషన్ కనబరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నారు. . విలన్ మాత్రమే కాదు.. తొలినాళ్లలో సైడ్‌కిక్ వేషాలేసిన కోట.. క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లాడు. ప్రతిఘటన ‘యాదగిరి’ కోట నటనను ఆడియెన్స్‌కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని ‘కామెడీ’ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని.. తర్వాతి కాలంలో కోట్లమందిని కోటకు అభిమానులు చేసింది. ఆ సినిమా పేరు ‘ఆహానా పెళ్లంట’. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రల్లోనే మెప్పించిన ఆయన.. మధ్యమధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ‘గణేశ్’ హోం మినిస్టర్ సాంబ శివుడు లాంటి పాత్రల్లోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే!. అన్నాయ్.. తొంభై దశకంలో కోట సినీ ప్రయాణం ప్రయాణం జెట్ స్పీడ్‌తో సాగింది. మెయిన్ విలన్, కామెడీ విలన్‌గానే కాకుండా.. విలన్ పక్కన ఉంటూ ‘గోడ మీద పిల్లి’ తరహా క్యారెక్టర్లతో అలరించారాయన. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్-కోట శ్రీనివాసరావు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అన్న.. అన్నాయ్..’ అంటూ కోటను బాబు మోహన్ బురిడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు.. సన్నివేశాల్ని రిపీట్ మోడ్‌లో చూసి నవ్వుకునే వాళ్లూ ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమోగానీ.. కోటలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఇవీవీ వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మీ, ఎమ్మెస్ నారాయణ కాంబోలోనూ కోట నుంచి హెల్తీ హ్యూమరే జనాలకు అందింది. మందు పడితేనే ఆ సీన్ పండిందట కోటకు వివాదాలు కొత్తేం కాదు. పరభాష నటులను విలన్లుగా తీసుకోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఆయన కూడా ఇతర భాషల్లో నటించిన ప్రస్తావనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే నటన రానీ వాళ్లను తీసుకోవడం గురించే తాను మాట్లాడానని తర్వాత క్లారిటీ ఇచ్చారు కోట. ఇక కోటకు మద్యం బలహీనత ఉందని, తాగి సెట్‌కి వస్తారని, దీంతో కొందరు ఆర్టిస్టులు ఇబ్బందిగా ఫీలయ్యేవారన్న అపవాదు కోట మీద ఉంది. అయితే సిచ్యుయేషన్‌కి తగ్గట్లు కొన్నిసార్లు అది తప్పదనే కోట సమర్థనను బలపరిచిన వాళ్లూ లేకపోలేదు. అందుకు ఉదాహరణగా శుత్రువు టైంలో జరిగిన ఓ ఘటను గుర్తు చేస్తారు. విలన్ క్యారెక్టర్ కోసం.. అప్పటికే ఇద్దరు యాక్టర్లను మార్చేసిన కోడిరామకృష్ణ చివరికి కోట దగ్గర ఆగిపోయాడు. అయితే ఒక సీన్ తీస్తున్న టైంలో కోట పదే పదే టేకులు తీసుకుంటుండడంతో అంతా విసిగిపోయారట. చివరికి పక్కకు వెళ్లి మందేసి వచ్చిన కోట.. తర్వాత ఆ సీన్లో చెలరేగిపోయాడు. ఆ సీన్‌కు ఆడియొన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చిందని దర్శకుడు కోడిరామకృష్ణ సైతం కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం విశేషం. గదైతే ఖండిస్తం కోట నుంచి వెలువడే డైలాగులు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాజకీయ నేపథ్యాల్లోని సినిమాల్లో కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పకోవాలి. పొలిటీషియన్‌గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తుంటుంది. ప్రతిఘటన నుంచి మొదలై శత్రువు, గాయం, గణేశ్, లీడర్, ఛత్రపతి, మున్నా, ప్రతినిధి, తమిళ్ సామి, కో(రంగం), సర్కార్(హిందీ) సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. గొంతుతోనూ మ్యాజిక్ 90 దశకంలో, 2000 సంవత్సరాల్లోనూ తన డబ్బింగ్ వాయిస్‌తో కోట అలరించాడు. ముఖ్యంగా తమిళ కమెడియన్ గౌండ్రమణి(అవతల సెంథిల్‌కు బాబు మోహన్)కి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులకు మైమరిపించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివణ్ణన్‌కు సైతం ఆయన కోట కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. -
‘అహా నా పెళ్ళంట’ మూవీలో కోట పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా!
రాజేంద్ర ప్రసాద్ తొలి కామెడీ చిత్రం ఆహా నా పెళ్లంట. ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా 1987 వచ్చిన ఈ మూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ట్రెండ్‌కు రెడ్ కార్పెట్ పరిచిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా అన్నివర్గాల ప్రేక్షకుల అలరించాడు. అంతేగకా హాస్య బ్రహ్మ బ్రహ్మనందంను నటుడిగా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. ఇందులో బ్రహ్మి నత్తివాడిగా.. అరగుండు పాత్రలో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ మూవీలో ఇప్పటికి ప్రత్యేకంగా గుర్తు చేసుకునే పాత్ర పిసినారి లక్ష్మీపతి. ఈ పాత్రలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒదిగిపోయారు. చెప్పాలంటే ఆహా నా పెళ్లంట మూవీ గుర్తు వస్తే చాలు ముందుగా గుర్తోచ్చే పాత్ర కోట శ్రీనివాస్‌దే. ఇంటి దూలానికి బతికి ఉన్న కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చికెన్ కూరతో అన్నం తింటున్నట్టుగా ఆస్వాధించిన సన్నివేశం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక చూట్టాలు ఇంటికి వస్తే ఇలా చేయాలంటూ ఆ సన్నివేశాన్నే ఉదహరణగా తీసుకుంటూ చమత్కరిస్తుంటారు. అంతేగాక బట్టలను పొదుపు చేసేందుకు పేపర్ చుట్టుకుని పడుకోవడం ఇలా ఎన్నో సీన్లలో పిసినారి లక్ష్మిపతిగా కోట తన నటనతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇప్పటికీ ఆ సీన్లు గుర్తోస్తే నవ్వని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ పాత్రను తాను తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా కోట పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఒదిగిపోయాడు. అంతలా ఆ పాత్రను పండించిన కోట శ్రీనివాస్‌ను మొదట తీసుకునేందుకు నిర్మాత రామానాయుడు ఒప్పుకొలేదట. ఈ విషయాన్ని స్వయంగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. ఎందుకంటే ఈ మూవీకి పిసినారి లక్ష్మిపతి పాత్రే కీలకం. అది పండితేనే ఈ సినిమా హిట్ లేదంటే పరాజయం చూడాల్సిందే. అంతటి ఈ ప్రధాన పాత్రకు కోట శ్రీనివాస రావును తీసుకోవాలని డైరెక్టర్ జంధ్యాల రామానాయుడికి సూచించాడట. అయితే ఈ పాత్ర కోటతో వద్దని ప్రముఖ నటుడు రావుగోపాలరావుతో చేయించాలని ఆయన అనుకున్నట్లు కోట వివరించాడు. అయితే జంధ్యాల మాత్రం ఆయనను తప్ప ఇంకేవరిని లక్ష్మీపతి పాత్రకు ఒప్పుకోలేదట. ఈ విషయంపై రామానాయుడు, జంధ్యాల దాదాపు 20 రోజుల పాటు వాదించుకున్నారని ఆయన అన్నాడు. అయితే కోట నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల తర్వాత జంధ్యాల ఈ పాత్రకు కోటను ఫిక్స్ అయ్యారట, దీంతో ఆ మూవీలో పిసినారి పాత్రకు కోటను తప్ప ఇంకేవరిని తీసుకున్న పరాజయం తప్పదని తెల్చి చెప్పాడట. దీంతో రామానాయుడు చివరకు ఈ పాత్రకు కోట శ్రీనివాసరావును ఓకే చేశారట. కాగా ఒక రోజు చెన్నై వెళ్లడానికి కోట శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండా అక్కడ ఆయనకు రామానాయుడు కనిపించారట. కోటను చూసిన ఆయన ఇక్కడకు రావయ్యా నీతో ఓ విషయం చెప్పాలని పిలిచాడట. జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశా అని, అందులో లక్ష్మీపతి పాత్ర గురించి కోటకు చెప్పి. జంధ్యాలతో జరుగుతున్న వాదన గురించి కూడా వివరించాడట. వాదన ఎందుకండీ ఈ క్యారెక్టర్‌కు రావు గోపాలరావే న్యాయం చేస్తాడని ఆయన బదులిచ్చినట్లు తెలిపారు. కానీ రావుగోపాలరావుకు ఎంత మేకప్ వేసినా ఆయన ముఖంలో ప్యూర్‌నెస్ రాదని జంధ్యాల అంటున్నారని రామానాయుడు ఆయనతో అన్నారని, ఏం చెప్పాలో అర్థంకాక సందిగ్ధంలో ఉన్న కోటకు ఆ పాత్రను నువ్వే చేయాలని బంపర్ ఆఫర్ ఇచ్చేశాడట రామానాయుడు. -
ముఖ్యమంత్రి పాత్రలో...
ప్రముఖ క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు జూలై 10న. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం ‘రొరి’లోని లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. సీటీఎస్ స్టూడియోస్, ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా చరణ్ రొరి నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో కోట అనేకసార్లు ముఖ్యమంత్రిగా, అపోజిషన్ లీడర్ పాత్రల్లో నటించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన నటించలేదు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్. రామన్నచౌదరి పాత్ర చేస్తున్నారు. -
కోటా శ్రీనివాస రావు సినీ ప్రయాణం
-
తెలుగు సినిమాకు పెట్టని ‘కోట’
ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక నిస్సహాయుడిగా, ఒక క్రూరుడిగా ఇలా విభిన్న రకాల పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం. క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకొని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. వెండితెరపై ఆయన పోషించని పాత్ర, పండించని రసం లేదంటే అతిశయోక్తి కాదేమో. సిల్వర్ స్క్రీన్‌ను విభిన్న పాత్రలతో సుసంపన్నం చేసిన కోటా శ్రీనివాస రావు జన్మదినం సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం. -
‘ఎక్కువ పని చేశాననే పశ్చాత్తాపం లేదు’
ఇల్లు వదిలి రచ్చ గెలిచేవాడు కళాకారుడు. రంగస్థలాన్ని నివాసం చేసుకునేవాడు కళాకారుడు. పూటకొక వేషం కట్టి, రోజుకొక ఊరు చేరి జనాన్ని రంజింప చేసేందుకు పరిశ్రమ చేసేవాడు కళాకారుడు. సంపాదించినదానితో అతడు తన కుటుంబం కోసం ప్రేమగా కోట కట్టించవచ్చు. కాని అతడు ఉండేది మాత్రం జనం గుండెల్లోనే. ఉండిపోయేది అక్కడి కోటలోనే. ఈ నెల 10న మీ పుట్టినరోజు. నటుడిగా దాదాపు 40 ఏళ్ల కెరీర్. మీ ఏజ్ ఎంత? 75 నిండి 76వ ఏట అడుగు పెడతాను. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. కొంచెం మోకాళ్ల నొప్పులు... అంతే. వయసును బట్టి వస్తాయని డాక్టర్లు చెబుతుంటారు. ఇక మనం చేసే శ్రమని బట్టి కూడా ఉంటాయి. నడవడానికి ఇబ్బంది లేదు కానీ మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు కొంచెం కష్టం. వయసు పెరుగుతోంది కదా.. ఇలాంటివన్నీ సాధారణమే. లైఫ్ అంటే ఏంటి? ఎంట్రీ అయింతర్వాత ఎగ్జిట్ కూడా కామనే కదా (నవ్వుతూ). 750 సినిమాల వరకూ చేశారు? శరీరానికి ఎక్కువ శ్రమ ఇచ్చామనే ఆలోచన ఉందా? ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు కానీ శరీరానికి ఎక్కువ శ్రమ ఇచ్చానని ఇప్పుడిప్పుడు తెలుస్తోంది. ఎవరికైనా సరే ‘టైమ్ వస్తే టైమ్ ఉండదు’. కనీసం భోజనం చేయడానికి కూడా టైమ్ ఉండదు. దానికి తోడు మన లైఫ్ మన చేతుల్లో ఉండదు. దాదాపు 38 ఏళ్లు రోజుకు 20 గంటలు పనిచేశా. నెలకి, రెండు నెలలకోసారి భార్యాపిల్లల్ని చూసేవాడ్ని. ఫ్యామిలీ లైఫ్‌ని మిస్సయ్యాం అని ఇప్పుడు బాధగా ఉంది. ఇప్పుడు సినిమాలు తగ్గించాక ఎలా ఉంది? నాకు పని తగ్గించుకోవాలని ఎప్పుడూ లేదు. ఇప్పుడూ ఎవరైనా కనిపిస్తే ‘నాయనా ఓ వేషం ఇవ్వరా.. ఇంట్లో కూర్చొని పిచ్చెక్కిపోతోంది’ అంటుంటా. ఎందుకంటే గడిచిన 40ఏళ్లల్లో రేయింబవళ్లు దాదాపు 100–150 మంది మధ్యలో జీవితం గడిపా. పొద్దునే 7 గంటలకు ముఖానికి రంగు వేసుకుంటే రాత్రి మినిమం రెండు గంటలయ్యేది. అప్పుడొచ్చి ఏదో రెండు మెతుకులు తిని పడుకుంటే పొద్దున్నే మళ్లీ 5:30 గంటలకు లేవాలి. అప్పుడన్నీ రైళ్లే కదా. ఇప్పుడైతే విమానంలో వెళ్లిపోతాం. అప్పట్లో జర్నీలోనే సగం గంటలు పోయేవి. అయినా ఎక్కువ పని చేశాననే పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే ప్రజల్లో నటుడిగా నాకు మంచి గుర్తింపు ఉంది. నాకు ఆరేళ్ల కుర్రాళ్ల నుంచి 60 ఏళ్ల ముసలోళ్లవరకూ అభిమానులున్నారు. నాకు ఏ కష్టమొచ్చినా, సుఖమొచ్చినా వాళ్ల సొంత మనిషిలా భావిస్తారు. ఫ్యామిలీ లైఫ్‌ని మిస్ కావడంతో పాటు నేను కోల్పోయిన ఇంకో విషయం ప్రపంచ జ్ఞానం. బయట ఏం జరుగుతోందో తెలిసేది కాదు. ఇప్పటిలాగా ఫోన్లు, సౌకర్యాలు అప్పుడు లేవు కదా. అటు కుటుంబంతో గడపకపోవడం ఇటు బయటి ప్రపంచ జ్ఞానం తెలుసుకోకపోవడం నేను కోల్పోయాను. సినిమా రంగమే కాదు.. ఏ రంగంలోనైనా బిజీగా ఉన్నవారందరికీ అలాగే ఉంటుందనుకోండి. తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ చాన్స్ గురించి? ‘ప్రాణం ఖరీదు’ (1978) సినిమాలో రావు గోపాలరావుగారు ప్రధాన పాత్ర. ‘ప్రాణం ఖరీదు’ నాటకంలో ఆ పాత్రను నేను స్టేజ్‌పై వేసేవాణ్ణి. ఆ నాటకాన్ని నిర్మాత వాసుగారు, దర్శకుడు క్రాంతి కుమార్‌గారు చూసి సినిమా తీయాలనుకున్నారు. ఆ నాటిక రాసిన సీ.ఎస్.రావుగారే సినిమాకి కూడా రచయిత. ఆయన సెంటిమెంట్‌గా చిన్న వేషం ఉంది.. చేయాలని నన్ను తీసుకెళ్లడం, ఓ చిన్న పాత్ర చేయడంతో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఓ ఐదేళ్లు మీరు సినిమాలు చేయలేదేం? జంధ్యాలగారితో పరిచయం ఉండటం వల్ల, ఆయనెప్పుడైనా హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తుంటే సరదాగా వెళ్లి రెండు మూడు సీన్లు చేసేవాణ్ణి. అలా దాదాపు ఎనిమిది సినిమాలు చేశాను. నిజం చెబుతున్నా.. నేనెప్పుడూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించలేదు. నాకెప్పుడూ నాటకాల గోలే. అయితే సినిమా అవకాశం వస్తే చేయకుండా ఎవరూ ఉండరు కదా? కానీ, చాన్స్‌ల కోసం ప్రయత్నించలేదు. ఎందుకంటే అప్పుడు సినిమా యాక్టర్ అంటే ఒడ్డూ పొడుగు ఉండాలి, ఎర్రగా, అందంగా ఉండాలనుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అప్పుడు నేను బాగా నల్లగా ఉండేవాణ్ణి. అవకాశం అడిగితే, ‘నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావేంట్రా?’ అంటారేమో అని భయం. పైగా స్టేట్‌బ్యాంకులో మంచి ఉద్యోగం ఉంది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎందుకు రిస్క్ తీసుకోవడం అనే భయం ఉండేది. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను, ఆ జర్నీ ఇంతదాకా వచ్చింది. నటుడిగా ‘ప్రతిఘటన’ మీ కెరీర్‌కి మంచి టర్నింగ్ పాయింట్ అయింది కదా? అవును. ఆ సినిమా 1985లో విడుదలైంది. ఆ రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాను. అప్పుడు మా బ్యాంక్ హైదరాబాద్‌లోని నారాయణగూడ బ్రాంచ్‌లో ఉండేది. బయటకు వస్తే జనం గోల. నన్ను చూడ్డానికి ఉత్సాహంగా వచ్చేవారు. దాంతో మా బ్రాంచ్ మ్యానేజర్ ఇలా ముందు గదిలో వద్దు... లోపల కూర్చోండి అన్నారు. మరి.. ఉద్యోగం ఎప్పుడు మానేశారు? సినిమాల్లో యాక్ట్ చేయడానికి మా బ్యాంక్ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. ‘ప్రతిఘటన’ తర్వాత చాన్సులు వచ్చినా సర్వీస్‌లో ఎన్ని సెలవులుంటాయో అవే వాడుకోవాలి. అయితే నటుడిగా బాగా క్రేజ్ రావడంతో ఐదువేలు, పదివేలు.. ఇలా నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. ఇండస్ట్రీలో టైమ్ వస్తే టైమ్ ఉండదు. ఇక, 86 ఎండింగ్లో రిజైన్ లెటర్ ఇచ్చాను. అసలు అంతకుముందే ఫలానా డేట్లో చేరాలి. లేకపోతే ఈ ఉద్యోగం మీద మీకు ఆసక్తి లేదని అనుకుంటాం అని ఫైనల్ లెటర్ పంపారు. అది నా చేతికి వచ్చేసరికి ఆ డేట్ దాటి 7–8 రోజులు అయిపోయింది. బెంగుళూరులో ఎక్కడో ఉన్నాను. ఉద్యోగం పోయింది. రంగస్థలం నుంచి సినిమాలకు వచ్చారు... ఇప్పుడు నాటక రంగం కనుమరుగవడం గురించి? నాటకం వల్ల మనకో కాన్ఫిడెన్స్ వస్తుంది. డిక్షన్ అన్నీ తెలుస్తాయి. ఎక్కడ కామా ఉండాలి ఫుల్స్టాప్ పెట్టాలో తెలుస్తుంది. అది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే సినిమాలో పెద్ద పెద్ద వాళ్లతో యాక్ట్ చేసే సమయంలో బెరుకు ఉండదు. నేను అమితాబ్‌గారితో యాక్ట్ చేశాను. అమితాబ్ అంటే ప్రపంచంలో గుర్తింపబడ్డ నటుడు. అతనితో నటించేటప్పుడు ఎలా ఉంటుంది? అదేమీ లేకుండా నేను చేయగలిగానంటే అది నాకు నాటకాల వల్ల వచ్చింది. ఇప్పుడు నాటకాలు వేస్తే ఎవరు చూస్తారు? అంటున్నారు. ఓ పది మంది కలసి నాటకం వేసి, చూపించండి. మీకూ (నటీనటులు) ప్రాక్టీస్ అవుతుంది. మీ నాన్నగారు మిమ్మల్ని డాక్టర్ చేయాలనుకున్నారట? మేం ముగ్గురు అన్నదమ్ములం. అన్నయ్య, నేను, తమ్ముడు శంకర్రావు. అన్నయ్యను డాక్టర్ చేయాలనుకున్నారు. శంకర్రావు కూడా మంచి నటుడే. సినిమాలు, సీరియల్స్ చేస్తున్నాడు. నాకు చదువుపై ఆసక్తి లేదని అన్నయ్యగారు నాన్నగారికి చెప్పారు. ‘ఏం డాక్టరుగారూ.. మీ తర్వాత మీ అబ్బాయిలు ఎవరూ లేరా?’ అనే ఊళ్లో అడిగేవారు. అందుకని డాక్టర్ చదివించాలనుకున్నారు. మెడికల్ సీటు కోసం ఏడాది పాటు బాగా ట్రై చేశాను. అప్పుడప్పుడే డొనేషన్ పద్ధతి ప్రారంభమైంది. నాకు ఫస్ట్క్లాస్కి కెమిస్ట్రీలో ఒక శాతం తక్కువ వచ్చింది. మద్రాసు వెళ్లాను. మాకు తెలిసిన డాక్టరుగారు వైద్యసీటు కోసం ప్రయత్నించగా డొనేషన్ పద్ధతిలో ఇస్తామన్నారు. అప్పుడు ఐదు వేలు కడితే చాలు. అయితే నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చదువు.. చదివిస్తాను కానీ డొనేషన్ మాత్రం కట్టను అన్నారు నాన్నగారు. దాంతో సీటుకోసం ఓ ఏడాది వృథా చేశాను. ఏదీ కుదరక బీఎస్సీలో చేరాను. మొదటి నుంచి మీది బాగా ఉన్న కుటుంబమేనా? మా నాన్నగారు డాక్టర్ అని చెప్పాను కదా. ఆయన ప్రాక్టీస్ చాలా బాగుండేది. ఆ రోజుల్లోనే రోజుకు 200–300 మంది రోగులు వచ్చేవారు. మా నాన్నగారి గురించి గొప్పగా చెప్పటం కాదు కానీ, రోగులు డబ్బులిస్తుంటే తన చేత్తో తీసుకునేవారు కాదు.. ఈ రోజు కలెక్షన్ ఇది అని కాంపౌండర్ ఇచ్చేవారు. ఆ రోజుల్లో నాన్నగారు రెండు నెలలకోసారి 100, 115 రూపాయలు ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేవారు. 74 ఏళ్ల క్రితం 100 రూపాయలంటే చాలా ఎక్కువ. త్వరగానే ఇల్లు కట్టుకున్నాం. మా తల్లిదండ్రులకు మేం 12మంది సంతానం.. ముగ్గురు అబ్బాయిలు, 9 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఏడుగురు ఉన్నాం. సీరియస్ విలన్, కామెడీ విలన్, కమెడియన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్, స్త్రీ పాత్రలు కూడా చేశారు. బాగా హోమ్‌వర్క్ చేసేవారా? గొప్ప విశేషం ఏంటంటే.. నేను చేసిన ఏ పాత్ర కూడా నాకు ముందు చెప్పింది కాదు. షూటింగ్ స్పాట్‌కి వెళ్లినప్పుడు ‘మీ పాత్ర ఇది’ అని డైరెక్టర్ చెప్పేవారు. ముందు చెప్పడం , హోమ్ వర్క్ చేయడం లాంటివి ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన గెటప్ అనుకోండి.. అంటే బట్టతల, బోడిగుండు.. వంటి వాటికి మాత్రం ముందు వర్క్ చేసేవాళ్లు. ఇలా చేయాలనుకుంటున్నాం చేతిలో ఉన్న సినిమాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అని అడిగేవారు. నేను బాగా నమ్మేది.. అందరికీ చెప్పేది కూడా ఒక్కటే. మనకు పెద్ద గుమ్మడికాయ అంత ప్రతిభ ఉంటే సరిపోదు. చిన్న ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నవాడే కోట శ్రీనివాసరావు. మీరెక్కువగా నెగటివ్ రోల్స్ చేశారు. పాత్ర తాలూకు ప్రభావం ఆర్టిస్టుల మీద పడుతుందా? మీరు కొంచెం కటువుగా, ముక్కుసూటితనంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది? ఏమో.. ఆ ప్రభావం ఉందేమో. ఎప్పుడైనా అరవడం, టక్కున తిట్టడం వంటివి చేశానేమో? ఏదైనా సహించలేనిది జరిగినప్పుడే అలా రియాక్ట్ అయ్యుంటాను తప్ప కారణం లేకుండా ఎవర్నీ ఏమీ అనలేదు. నాకు ముక్కుసూటిగా మాట్లాడటమే వచ్చు. వెనక మాట్లాడటం కన్నా ముఖం మీద అనడం కరెక్ట్ అనుకుంటాను. దానివల్ల మిమ్మల్ని నిందించేవారు ఎక్కువ ఉంటారేమో? ఉండొచ్చేమో. నాలుగు మంచి మాటలు చెప్పాలను కున్నప్పుడు నిందల గురించి పట్టించుకోకూడదు. ఇప్పుడున్నవాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే సాధన తక్కువ వాదన ఎక్కువ.. టెక్నాలజీ పెరుగుతోంది. పెరగాలి కూడా. దాంతో ఇవాళ వయసుకి మించిన విజ్ఞానం అయిపోయింది. అది పెద్ద ప్రమాదం. వయసుతో పాటే తెలివి కూడా పెరగాలి. మనకు ‘ఏ వయసులో జరగాల్సినది ఆ వయసులో జరగాలి’ అనే సామెత ఉంది. మన చదువును కూడా మన జీవితంతో జోడించి సృష్టించారు. జీవితంలో నాలుగు స్టేజీలు. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. చదువు కూడా ఎలిమెంటరీ, హై స్కూల్, కాలేజ్, యూనివర్శిటీ. ఈ నాలుగింటినీ జీవితంతో లింక్ చేశారు. ఓ పాతిక మంది పిల్లల్ని ఒకేచోట ఓ గంటసేపు కూర్చోబెట్టడం కష్టం. అది ఎలిమెంటరీ స్కూల్. ఆ తర్వాత హైస్కూల్. పద్యాలు నేర్పుతారు. పదోతరగతి రాయాలంటే 16 ఏళ్లు కంపల్సరీగా ఉండాలి. అప్పుడు అంతకుముందు క్లాసుల్లో చెప్పిన పద్యాలకు తాత్పర్యం చెబుతారు. అప్పుడు అర్థం చేసుకోవడం అలవడుతుంది. కాలేజీలు ఇప్పటిలాగా గల్లీగల్లీకి లేవు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో మాత్రమే ఉండేవి. వేరే ఊరు వెళ్లి చదవాలి. అప్పుడు నీకు ఎవరూ తోడు రారు. సొంతంగా నేర్చుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పంపేవారు. లైఫ్‌ని డీల్ చేయడం అలవాటు అవుతుంది. మన జీవితాలతో లింక్ చేసిన చదువుని విస్మరించేశాం. కార్పొరేట్ స్కూల్లో చేరతారు. 3 లక్షలు అంటారు. అంతా అంటే? ఫారిన్ నుంచి వచ్చారు టీచర్లు అంటారు. పీజీ వాడు కేజీకి చెప్పాలి. పీజీ వాడు కేజీకి దిగలేడు, కేజీ వాడు పీజీకి ఎదగలేడు. మరి వీళ్లు చెప్పేది ఎవరికి చెప్పండి? మాతృభాషను ఖూనీ చేయడం, పెద్దలను ఎదిరించడం.. ఇలా ఇప్పటి తరంలో ఎక్కువ శాతం మంది ఉన్నారు.. దాని మీద మీ అభిప్రాయం? బిడ్డ ఎదుగుదలకు మాతృ స్తన్యం ఎంత అవసరమో... పిల్లాడి మానసిక ఎదుగుదలకు మాతృభాష అంతే అవసరం. పుట్టిన బిడ్డకు అన్ని ‘ఇంగ్స్’ నేర్పేది తల్లే. టాకింగ్, వాకింగ్, ఈటింగ్, రీడింగ్, రైటింగ్.. ఇలా అన్నీ నేర్పుతుంది. తల్లిలో అంత ఇది ఉంది. పై చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటూ ఫారిన్ పోవడం, అక్కడే స్థిరపడిపోవడం, తల్లిదండ్రులను ఇక్కడే వదిలేయడం. అప్పట్లో పిల్లలకు క్రమశిక్షణ ఉండేది. ‘మీ అబ్బాయి సిగిరెట్ తాగుతున్నాడు’ అని ఎవరైనా ఇంట్లో చెబితే ఇంటికి వెళ్లిన తర్వాత మన పరిస్థితి ఏంటి? కొడితే చర్మం ఊడిపోయేది. అదే ఇప్పటి పిల్లలైతే ‘ఏం నువ్వు తాగడంలేదా?’ అని తండ్రిని నిలదీస్తారు. అయితే పెద్దవాళ్ల ఉద్దేశం ఏంటంటే ‘నీ వయసు ఏంటి? నువ్వు చేసే పనేంటి’ అని. ఇప్పుడు పాఠం చెప్పే సమయంలో సరిగ్గా వినడం లేదనో, సరిగ్గా చదవడం లేదనో టీచర్ ఓ దెబ్బ వేస్తారు. దాన్ని కొట్టడం అనుకుంటే ఎలా? కొందరు డాక్టర్లు పిల్లల్ని కొడితే వాళ్ల తెలివితేటలు పోతాయి అంటారు. అదో బిజినెస్. ఆ విషయం గురించి పెద్ద చర్చ. వీటికి చర్చ ఎందుకు? కోటగారు నీతులు చెబుతున్నారు? అని ఎవరైనా అంటే? ఈ మాట డైరెక్ట్‌గా నాతో ఒకరు అన్నారు. నాది మార్పు రావాలని చెప్పే వయసు. ఈ మధ్య కోటగారు నీతులు చెబుతున్నారు అని ఎవరో అంటే... నాకు చెడు ఎక్కువగా తెలుసయ్యా... అందుకే మంచి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను అన్నాను. మరి.. తెలియనివాడు ఏం మాట్లాడతాడు? ఏదో నా అనుభవంతో నలుగురికీ ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది. చెప్పాను. అయితే ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఫైనల్లీ... ఇంతకు ముందున్నంత ఉత్సాహంగా సినిమాలు చేయగలరా? చేయలేను అనుకోవడం తప్పు. దర్శకులకు కావాల్సింది వారికి ఇవ్వడమే కదా. అయితే ‘బాబూ కాస్త మెట్లు ఎక్కలేను. దిగలేను. ఆలోచించి వేషం ఇవ్వండి’ అంటాను. అలా చెబితే తప్పేంటి? నాకున్న అనుభవానికి, నాకున్న వయసుకి చెప్పాలి కూడా. ఎందుకంటే షూటింగ్ లొకేషన్‌కి వెళ్లాక ‘చేయలేను’ అన్నాననుకోండి.. ఈ కుర్రాళ్లు ఒక మాట అంటే సిగ్గుగా ఉంటుంది. నేను మాట పడలేను. – డి.జి. భవాని -
కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత విష్ణు బొప్పన మూడేళ్లుగా బుల్లితెర అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి వెండితెర అవార్డులు అందించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ఈ వేడుక జరిగింది. సీనియర్ దర్శకులు ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డు తనకెంతో సంతృప్తి ఇచ్చిందని విశ్వనాథ్ అన్నారు. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుకు లెజెండ్రీ అవార్డును, మరో సీనియర్ నటుడు గిరిబాబుకు ఆల్‌రౌండర్ పురస్కారం అందించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు ఇచ్చారు. బాల తారల్లో అవార్డు అందుకున్నవారిలో ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, ‘అప్పూ’ ఫేమ్ డి. సాయి శ్రీవంత్ తదితరులు ఉన్నారు. ఈ వేదికపై పేద కళాకారులకు ఆర్థికసాయం చేశారు. ‘‘ఈ వేడుక విజయవంతం కావడానికి స్పాన్లర్లే కీలకం.. వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు విష్ణు బొప్పన. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఐజీ మాగంటి కాంతారావు, ఐఏఎస్ మాగంటి ఉషారాణి ముఖ్య అతిథులుగా హాజరవగా, నటి జయప్రద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటీనటులు సుమన్, భానుచందర్, సత్యప్రకాష్, ఏడిద శ్రీరామ్, కవిత, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. -
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
-
మనిషి ఆరోగ్యంతో వ్యాపారమా?
‘‘ఎవరో హాస్పటల్లో ఉంటే నాలుగైదుసార్లు చూడ్డానికి వెళ్లితే చాలు.. నేనేదో హాస్పటల్ చూట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు కదా! మనిషి ఆరోగ్యంతో వ్యాపారం ఏంటి? అలా చేయకూడదు. ఎవరికైనా డౌట్ ఉంటే ‘శ్రీనివాసరావుగారూ... హెల్త్ ఎలా ఉంది’ అని నన్నే అడగండి! అసత్య ప్రచారాల వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ప్రచారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం సహకరించాలి’’ అని కోట శ్రీనివాసరావు అన్నారు. సోషల్ మీడియాలో ఆయనకు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందనీ, ఊపిరితిత్తులు సరిగా లేవనీ, డాక్టర్లు వద్దంటున్నా నడుస్తున్నారనీ జరుగుతున్న ప్రచారాలపై శుక్రవారం హైదరాబాద్‌లో కోట స్పందించారు. ఆయన మాట్లాడుతూ– ‘‘కొందరు పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడుతున్నారు. వాళ్లకి ఎవరు చెప్పారు? ఇప్పుడు నాకు 74 ఏళ్లు. ఈ వయసులో కాళ్ల నొప్పులు, చేతి నొప్పులు ఉండవా? అది రోగమనుకుంటే ఎలా? డయాబెటిస్ వచ్చింది. ఈ వయసులో నాకు రాకూడదా? అంతే తప్ప... సాధారణంగా నా ఆరోగ్యం చాలా బాగుంది. ఈరోజు ఉదయం నుంచి సుమారు 50 ఫోన్లు... ఫ్యాన్స్, మీడియా నా హెల్త్ ఎలా ఉందోనని ఎంక్వయిరీలు. ఇటీవలే సుశీలగారిపై, అంతకు ముందు కొందరిపై ఇలాంటి వదంతులే వచ్చాయి. ‘70 ఏళ్లొచ్చినా పాడగలగడం నా అదృష్టం’ అని బాలుగారు అప్పుడప్పుడు చెప్తుంటారు. 74 ఏళ్లొచ్చినా ఇంకా నటించే ఓపిక ఇచ్చాడని నేను దేవుడికి దండం పెట్టుకుంటుంటా. ఇప్పుడు సినిమా వాతావరణంలో మార్పు వచ్చింది. ఓ ఐదారుగురు హీరోలు మినహాయిస్తే మిగతా వాళ్లందరూ పాతికేళ్లలోపు వారే. వాళ్లకు తండ్రిగా నటించడానికి నేను సరిపోను. అప్పుడెప్పుడో చేసిన విలన్ పాత్రలు ఇప్పుడు ఎలా ఇస్తారు? అందువల్ల, నాకు తగ్గ పాత్రలు వచ్చినప్పుడు చేస్తున్నా. ఇప్పుడు తెలుగులో ‘బాలకృష్ణుడు, ఆచారి అమెరికా యాత్ర’, తమిళంలో ‘సామి 2’ వంటి చిత్రాల్లో నటిస్తున్నా. డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నా. ఎవరైనా సినిమా చేయమని నా దగ్గరకు వస్తే కాళ్ల నొప్పుల గురించి చెబుతున్నా. కానీ, నిజం తెలుసుకోకుండా కొందరు అసత్యాలు ప్రచారం చేసినప్పుడు కోపం వస్తోంది. బాధగా ఉంటోంది. ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన చెందుతున్నారని ఈ వివరణ ఇస్తున్నా. నా మీద జోక్లేసినా పట్టించుకోను. దయచేసి చెడు ప్రచారాలు చేయడం మానుకోండి’’ అన్నారు. -
మా ఆవిడ పాత పేపర్లు
ఆ పాత పేపర్లవాడికి ఉస్మాన్ పేట్ బస్తీలో చిన్న రేకుల ఇల్లు ఉంది. దానిని రాసివ్వమని కూచునింది మా ఆవిడ. వాడు లబోదిబోమంటున్నాడు. ‘మరెంతిస్తావో చెప్పు’ అంటోందావిడ. ‘నూటాబై ఇస్తాను. ఇక మీ మాట నా మాట కాకుండా నూట డెబ్బై ఇస్తాను’ అంటున్నాడతను. ‘నూట డెబ్బై. ఏ మూలకు? మీ పాత పేపర్ల వాళ్ల సంగతి నాకు తెలియదా? పేపర్లలో పెద్దపెద్ద అక్షరాల్లో వేశార్లే. మీరు పాత పేపర్లే అమ్మి లక్షలు లక్షలు సంపాదిస్తున్నారట కదా. అప్పుడప్పుడు గోవా, బ్యాంకాక్ కూడా వెళ్లొస్తుంటారట గదా షికారుకి’ ‘ఏంటమ్మా ఈ అన్యాయం’ అంటున్నాడు పాత పేపర్లవాడు. ఇంటికి రెండు తెలుగు పేపర్లు, ఒక ఇంగ్లిష్ పేపరు వస్తాయన్న మాట నిజం. అవి నెలా రెండు నెలలు తిరిగే సరికల్లా ఇంతెత్తున అవుతాయన్నది కూడా నిజం. తూకం వేసినా టోకున కొన్నా అవి గట్టిగా 200 రూపాయల బరువు కూడా రావన్నది నిజన్నిజం. కాని మా ఆవిడ మాత్రం నమ్మదు. అదేదో బిగ్ బజార్ యాడ్‌లో కిలో పది రూపాయలకు కొంటాం అని చూసినప్పటి నుంచి పాత పేపర్లు అమ్మి ఒక పది గ్రాములు బంగారు గొలుసన్నా కొనుక్కోవాలని పంతం పట్టి ఉంది. ‘ఇంతకూ ఏమంటావయ్యా. సరే. మూడొందలు ఇవ్వు’ అంది. ఇక వాడి సహనం వెంటిలేటర్‌ను పీకేసుకుంది. మాట మాట్లాడకుండా టప్పున తక్కెడ, గోతాం పట్టా తీసుకొని మెట్లు దిగి పోబోయాడు. ‘సరే సరే... ఏం చేస్తాం. ఇలా వాళ్లను వీళ్లను పోషించడమే సరిపోయింది. ఎంతిస్తావో ఇచ్చి తీసుకెళ్లు. ఈసారికి కాబట్టి ఇస్తున్నాను వచ్చేసారి మాత్రం మూడొందలు పైసా తక్కువైనా ఇవ్వను’ అని వాడిచ్చిన ఒక వంద నోటు నలిగిన యాభై, ఇరవై నోట్లు తీసుకుంటూ లోపలికి వచ్చింది మా ఆవిడ. ‘ఇలా కదా వెలగపండు కాస్తా ఇంట్లో నువ్వు గింజంత అవుతున్నది. అరె.. ఇంట్లో మగ మనిషి ఉన్నాడే ఏం లాభం. లేచి ఆ పేపరువాణ్ణి నాలుగు అదిలించి నాలుగు డబ్బులు లాగాలని చూడకుండా కాలు మీద కాలేసుకుని టీవీ చూస్తుంటే ఇక ఈ సంసారం అయినట్టే. నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు. ఇన్నాళ్లు లాక్కొచ్చాను. ఏదో రోజు విసుగొచ్చి చిలుకూరి బాలాజీ టెంపుల్ వాళ్ల ఆశ్రమంలో చేరిపోతాను’ ఉరుమురిమి సీలింగ్ మీద పడినట్టు అర్థమైంది. ‘చిలుకూరి బాలాజీ టెంపుల్ వాళ్లకు ఆశ్రమం ఉందా? అది కనుక్కో ముందు’ ‘కనుక్కుంటాను. చిలుకూరులో లేకపోతే హరిద్వార్‌కు వెళ్లి రామ్‌దేవ్ బాబా ఆశ్రమంలో చేరుతాను. టికెట్టు డబ్బులు లేవనుకుంటున్నారేమో. పాత పేపర్లు అమ్మినవన్నీ ఒక డబ్బాలో వేసి పెడుతున్నానులెండి’ ‘ఎందుకు ఎప్పుడూ ఏదో ఒక ఆరాటంలో ఉంటావ్. డబ్బే అన్నింటికీ పరిష్కారం కాదు గుర్తుపెట్టుకో’ అన్నాను గంభీరంగా. ‘ఆహా. అలాగా. మరి కట్నం డబ్బులు పదివేలు తగ్గాయని, ఉంగరానికి వేసిన బంగారం నాసిరకందని, వాచీ సీకోది కొనిపెట్టమంటే హెచ్ఎంటిది కొనిపెట్టారనీ ఆడపడుచు లాంఛనం ఇంతివ్వాల్సింది అంతిచ్చారని పెళ్లిలో నన్నూ మా నాన్నను ఎందుకు పీక్కు తిన్నారు? బుద్ధ పరమాత్ముడికి మల్లే మెల్లగా నవ్వుతూ రూపాయి అడక్కుండా తాళి కట్టకపోయారా?’ ‘అదంటే... అది వేరు’ ‘ఇదంటే ఇది వేరా? హూ. మా నాన్న రోజుకి శేరు బియ్యం అన్నం తిని మాటవరసకైనా తేన్చకుండా దిలాసాగా బజారుకెళ్లేవాడు. అలాంటి మనిషి మీ దెబ్బకు చిక్కి చీపురుపుల్ల \ అయిపోయాడు కదండీ’ ‘ఆయనకు షుగరొస్తే నా మీదకు తోస్తున్నావ్’ ‘తోస్తున్నాను. తోసి తోసే సంసారాన్ని జాగ్రత్తగా లాక్కు వస్తున్నాను. పెళ్లప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతిదానికీ దుబారే. శోభనం రోజు తెల్లారి టీ పట్టుకు వచ్చే లోపల ఏం కొంపలంటుకుపోయాయని మీరు బజారుకు వెళ్లి కాఫీ హోటల్లో కాఫీ తాగొచ్చారు. రెండు రూపాయలు వృథా. అప్పుడే అనుకున్నాను మీరుత్త వృథా చేసే మనిషని’ ‘మీ వంటింట్లో జెమిని టీ పౌడర్ చూశాను. అదంటే నాకు పడదు. నా బ్రాండ్ త్రీ రోజెస్. అందుకే బజారుకెళ్లాను. తాగింది కాఫీ కాదు. టీయే’ ‘టీయో కిరసనాయిలో. కాపురం పెట్టాక పనులు నేనే చేసుకుంటానంటే పని మనిషిని పెట్టేదాకా ఊరుకున్నారా? అదేమంటే నా మీద ప్రేమ. ఎందుకండీ ప్రేమ... అన్నం పెడుతుంటా ఐస్‌క్రీమ్ తెచ్చిస్తుందా? అంట్లు కడిగి బట్టలుతికి ఇల్లు ఊడ్చి బాత్రూమ్లు కడిగి వారానికోసారి దుప్పట్లు మార్చి నెలకు రెండుసార్లు బూజులు దులిపితే చేతికి ఎముక లేకుండా మూడొందల యాభై ఇద్దామని నేనంటే ఐదొందలు ఇచ్చేదాకా ఊరుకున్నారా? ఎలాగండీ ఇలాగైతే. విజయ్ మాల్యా కూడా ఇలా ఉండడు తెలుసా?’ దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ‘బాధ పడకు అర్ధాంగీ. నేనేం చేసినా నీ సుఖం కోసం నీ సంతోషం కోసం నీ అనురాగ వాత్సల్య అనుషంగిక’... ఆ తర్వాత భాష రాక ఊరుకున్నాను. ‘నా సంతోషం. ఏమిటండీ సంతోషం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఏటిఎం కార్డు నా చేతికిచ్చి చోద్యం చూస్తున్నారు. ప్రతి పైసా నేను చూసి చూసి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎంత ఖర్చవుతుందో ఎంత మిగులుతుందో ఆ తలనొప్పి నాదే అయ్యింది. అరె.. మగవాళ్లు ఇలా బయటికెళ్తారు అలా లక్షలు తెస్తారు... ఇలా బైటికెళ్తారు అలా కోట్లు కుమ్మరిస్తారు. మీరూ ఉన్నారు. ఉత్త జీతం డబ్బు కాకుండా’... లేచి చెప్పులు తొడుక్కున్నాను. ‘ఎక్కడికెళ్తున్నారు?’ ‘బైటికెళ్లొస్తాను. ఒక లక్ష రూపాయలు దొరుకుతాయేమో చూసొస్తాను’ ‘చాల్లెండి జోకులు.’ ‘మరి కుండలో అన్నం కుండలోనే ఉండాలి పిల్లలేమో బాహుబలిలాగా కండలు పెంచాలి అంటే కుదురుతుందా? మనం హాయిగా బతికేంత జీతం వస్తున్నది కదా. నీకేం కావాలో డ్రా చేసుకుని ఖర్చు పెట్టుకో. నువ్వూ నీ పిసినారి బుద్ధులూనూ’ ‘హూ. నేను పిసినారిని కాబట్టే పిల్లలను అంత మంచి స్కూల్లో చదివిస్తున్నారు. నేను పిసినారిని కాబట్టే మీరు కొత్త బండిలో ఆఫీసుకు వెళుతున్నారు. నేను పిసినారిని కాబట్టే మొన్న ఐమాక్స్ చికెన్ ఫ్రాంకీ నములుతూ హాయిగా సినిమా చూడగలిగారు. నేను పొదుపు చేయకపోతే ఇదంతా అవుతుందా. మీలాగా నేనూ ఉండుంటే ఈసరికి బతుకు అమరావతి రాజధానిలా అట్టర్ కన్ఫ్యూజన్లో ఉండుండేది’ ‘సరే. ఆపు. నీకో సంగతి చెప్పాలి. ఆఫీసులో ఓటీ చేస్తే రెండు వేలొచ్చాయి. చీర కొందామని ప్లాన్. ఏమంటావు’ ‘రెండు వేలొచ్చాయా?’ ‘ఉత్త పుణ్యానికే వచ్చాయి’‘ఎంతనుకున్నా నా మొగుడులాంటి మొగుడు లేడనేదే వాస్తవం. ఏ నోము ఫలితమో ఏ వ్రతం మహత్యమో మా నాన్న మంచితనమో లేదంటే నా అదృష్టమో ఇలాంటి మొగుడు దొరికాడు. ఉండండి. నూనె తక్కువేసి చిటికెలో ఉప్మా చేస్తాను. తినేసి చెన్నై సిల్క్స్‌కు వెళదాం’... చెంగు చెంగున ఎగురుతూ వంటింట్లోకి వెళ్లింది. పక్క సీటు ఉళగనాథంకు మళ్లీ రెండు వేలు బాకీ అని నిట్టూరుస్తూ లేచి నిలబడ్డాను. సినిమాలో సంసారం పేపర్ చీర గురించి ఆలోచిస్తున్నా... లక్ష్మీపతి(కోట శ్రీనివాసరావు) పరమ పిసినారి. ఆయన పిసినారి తనం నాలుగు జిల్లాలకు ఎరుకైంది. లక్ష్మీపతి కూతురు పద్మ(రజని), కోటీశ్వరుడి కొడుకైన కృష్ణమూర్తి(రాజేంద్రప్రసాద్) ప్రేమించుకుంటారు. లక్ష్మీపతిని మెప్పించి, పద్మని పెళ్లి చేసుకునేందుకు ఆయనకంటే పిసినారిగా నటిస్తుంటాడు కృష్ణమూర్తి. ఓ సందర్భంలో ‘ఈ వెధవ దేహాన్ని కప్పుకోవడానికి బట్టలు కట్టుకోవాలా చెప్పండి. రాత్రిళ్లు న్యూస్‌పేపర్‌ని లుంగీలా చుట్టుకుని పడుకుంటానంతే’ అని లక్ష్మీపతికి చెబుతాడు. దీంతో లక్ష్మీపతి కూడా న్యూస్‌పేపర్‌ని లుంగీలా కట్టుకుంటాడు. ‘హవ్వ. ఏవండీ.. ఏమిటీ పిచ్చిపని. మీకు మతి పోతోందా?’ అని కోప్పడుతుంది భార్య. ‘నువ్వు నోర్ముయ్.. లుంగీలు కట్టడం తడపడం ఆరేయడం నీళ్ల ఖర్చు.. సబ్బు ఖర్చు డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగీ ఓ అద్భుతమైన ఆలోచన. అస్సలు పేపర్ చీర ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా’ అంటాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్లంట’ సినిమాలోనిదీ సీన్. సినిమా కాబట్టి పిసినారి తనాన్ని ఇంత పరాకాష్టగా చిత్రీకరించారు. కానీ, నిజ జీవితంలోనూ పాత పేపర్‌కు కక్కుర్తి పడే జనం ఉంటారు. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com - నిష్ఠల -
నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది!
సాంబశివుడికి నాన్చడం ఇష్టం ఉండదు. డొంక తిరుగుడుగా మాట్లాడడం ఇష్టం ఉండదు. సూటిగా విషయంలోకి వస్తాడు. ‘తమ్మీ... ఇస్టేటుగా పాయింట్లకు వస్తున్న. నీ ఫైళ్ల ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కరెక్టే. నేను యాభై కోట్ల కుంభకోణం చేసిన... కాదంటలే! మరి నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది’. హీరో డైలాగులు కొడితే చప్పట్లు కొట్టడం అనేది సాధారణమే కావచ్చుగానీ, తమ డైలాగులతో కూడా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోగలిగే విలన్లలో కోట శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. ‘గణేష్’ సినిమాలో హెల్త్ మినిస్టర్ సాంబశివుడిగా ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. విలనిజంలో అసలు సిసలు ‘స్థానికత’ను తీసుకువచ్చారు కోట. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు వేసి తనదైన గుర్తింపు తెచ్చుకొని ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు.నవ్వించే నటుడిని తీసుకువచ్చి విలన్ క్యారెక్టర్ ఇస్తే... భయం కలగకపోగా నవ్వొస్తుంది. అయితే దీనికి కోట మినహాయింపు. నిన్నటి సినిమాలో కమెడియన్‌గా తెగ నవ్వించిన కోట, ఈరోజు వచ్చిన సినిమాలో విలన్‌గా విశ్వరూపం చూపి భయపెట్టించగలరు! ∙∙ కాలేజీ రోజుల నుంచి నాటకాల్లో నటించడం అంటే కోటకు తెగ ఇష్టం. అయితే సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా రంగం అంటే భయం కూడా! ఎందుకంటే... ‘సినిమాల్లో నటించే వాళ్లు ఆషామాషీ వ్యక్తులు కాదు... పొడుగ్గా ఉంటారు. తెల్లగా ఉంటారు. ఉంగరాల జుట్టుతో ఉంటారు... అందుకే నేను సినిమాలకు పనికిరాను’ అనుకునేవారు కోట. ‘ప్రాణం ఖరీదు’ అనే నాటకంతో కోటకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ నాటకాన్ని సినిమాగా తీసినప్పుడు అందులో నటించే అవకాశం వచ్చింది. హైదరాబాద్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాటకాలు విరివిగా ఆడేవారు కోట. హైదరాబాద్ దాటి వెళ్లాల్సి వస్తే నాటకాలు ఆడే అవకాశం కోల్పోతానని, నాటకాల కోసం ప్రమోషన్స్ కూడా వదులుకునేవారు.ఎప్పుడైనా జంధ్యాల హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ చేస్తే సరదాగా ఆ సినిమాలో చిన్న వేషం వేసేవారు తప్ప సినిమాల్లోకి వెళ్లాలని, పెద్ద నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు కోట. అనుకోవడం, అనుకోకపోవడంతో విధికేం పని! టి.కృష్ణ, ముత్యాలసుబ్బయ్య ఒక నాటకం చూశారు. అందులో కోట నటన వారికి బాగా నచ్చింది. ‘సినిమాలకు పనికొస్తాడు’ అనుకున్నారు. అలా కోటతో ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’ సినిమాలలో నటింపచేశారు. అయితే ‘ప్రతిఘటన’ సినిమాలో పోషించిన గుండు కాశయ్య పాత్ర కోట శ్రీనివాసరావును ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ‘ఆర్టిస్ట్‌కు టైం వస్తే టైమే ఉండదు’ అని కోట చెప్పే మాట ఆయన విషయంలోనే అక్షరాలా రుజువైంది! -
మామగారు... ఊరుకోరు...
సమ్సారం సంసారంలో సినిమా దుర్గాప్రసాద్ బీకామ్‌లో ఫిజిక్స్ చదువుకోలేదు. ఒకవేళ అలాంటి ఆడ్ చదువు చదివి ఉంటే అతడికి మనుషుల్ని మడత పేచీలని చదవడం తెలిసేదేమో. ముఖ్యంగా మామగారిని చదవడం తెలిసేదేమో. దుర్గాప్రసాద్‌కు అతని మామగారు అర్థం కాడు. ఈ సమస్య ఇప్పుడల్లా పోదు. దుర్గా ప్రసాద్ మంచి భర్త. అతడు చిన్నప్పుడు చీమలకు చక్కెర పోసేవాడు కాబట్టి దేవుడు మెచ్చి అతడికి మంచి భార్యను ఇచ్చాడు. అయితే అతడే ఒకసారి తన క్లాస్మేటు అంజిగాడు జామెట్రీ బాక్సులో దాచుకున్న జీడిముక్కలు కాజేశాడు కనుక దేవుడు కోపగించి అతడికి చెడ్డ మామగారిని కూడా ఇచ్చాడు. చెడ్డ మామగారంటే సినిమాల్లో విలన్లా రావుగోపాలరావులా ఉంటాడని అనుకోవడానికి వీల్లేదు. దుర్గా ప్రసాద్ మామగారిది పాము పొట్ట. కనుక ఎంత తిన్నా పొట్ట కనపడదు. వెదురు పుటక. కనుక ఏం చేసినా లావు పెరగడు. ముళ్లపంది అనువంశీకం. కనుక ఎంత దువ్వినా జుట్టు రాలదు. చక్కగా చల్ మోహన్ రంగా అనుకుంటూ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసినా తాళి కడతాను అన్నట్టుగా ఉంటాడు. టీచర్‌గా క్లాసులను పొదుపుగా చెప్పి ఎనర్జీని బాగా సేవ్ చేసుకున్నాడు. ఇప్పుడు రిటైరయ్యి ఏం చేయాలో తోచక ఒక్కగానొక్క కుమార్తె దగ్గరకు వచ్చి చేరాడు. ‘పాపం... నాన్న కదండీ’ అంటుంది భార్య. ‘నాకు నరకం కదటే’ అంటాడు భర్త. పుణ్యం కొద్దీ పురుషుడు అనేది పాతమాట. ప్రాప్తం కొద్దీ మామగారు అనేది కొత్తమాట. మగాడనేవాడు గుడికి వెళ్లి మంచి భార్య కోసం మొక్కుకోవడానికి ఒక గజం ముందే మంచి మామగారి కోసం మొక్కుకోవాలని సెంటర్లో బండ్లాపి చాయ్‌లు తాగే పెళ్లి కాని కుర్రాళ్లకు చెబుతూ ఉంటాడు. టార్చర్‌కు కత్తులు కటార్లు అక్కర్లేదు. న్యూస్ పేపర్ చాలు. దుర్గాప్రసాద్ ఏడున్నరకు– అంటే ఎర్లీ కిందనే లెక్క– లేస్తాడు. కాని మామగారు అంతకు హాఫెనవర్ ముందు లేచి ఇంటికి వచ్చే హిందు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి న్యూస్పేపర్లన్నింటినీ చదివి ఫ్రీగా మడత పెట్టి ఉంటాడు. మడత నలిగిన న్యూస్ పేపర్ చదవడం దుర్గాప్రసాద్‌కు నచ్చదు. అలాంటి న్యూస్‌పేపర్ అతడికి చితికిన కమలాపండులా అనిపిస్తుంది. మామగారు రాకమునుపు కరకరలాడే న్యూస్‌పేపర్ తెరిచి కాఫీ తాగుతూ వార్తలు చదవడాన్ని ఎంజాయ్ చేసేవాడు. మామగారు వచ్చాక పేపర్ ఇక్కట్లే కాదు, కాఫీ కష్టాలూ వచ్చాయి. అప్పటికి ఆయన రెండుసార్లు ఫిల్టర్ కాఫీని జుర్రేస్తుండేసరికి తనకు డికాషన్ తక్కువ పలుచటి కాఫీయే గతి అవుతూ ఉంది. మామగారికి పౌడరు పిచ్చి. అల్లుడుగారికి వాసనలు పడవు. మామగారు బజారు నుంచి రోజ్, జాస్మిన్, కాలిఫ్లవర్ వంటి ఫ్లేవర్స్ ఉన్న పౌడర్లు తెచ్చి మెడకు అద్దుకుని కాలర్ వెనక్కు నెట్టి ఫ్రెష్ ఫీలవుతుంటాడు. అంతటితో ఆగితే మేలే. స్కూలు నుంచి వచ్చిన పిల్లలకి స్నానం చేయించి వారి వొళ్లంతా కూడా జల్లుతాడు. దుర్గాప్రసాద్‌కు ఆఫీసు నుంచి రాగానే పిల్లలను దగ్గరకు తీసుకోవడం అలవాటు. ఈ పౌడరు వాసన పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఉంటే ఊపిరాడక అలర్జీతో ఒకటే తుమ్ములు. మామగారి మూడ్స్ కూడా చాలా తీవ్రంగా మారిపోతుంటాయి. ఉదాహరణకు ‘కొంగు బంగారం’ సీరియల్లో వినిత అనే పాత్రధారిని ఆమె భర్త చెంపకు పట్టించి కొట్టిన రోజు ఆయన అగ్గిరాముడే అయ్యాడు. ‘ఆడదాని మీద చెయ్యేస్తాడా. అదే నా కూతురైతేనా వాడి పేగులు తీసి మేకులు దించేవాణ్ణి’ అని ఊగిపోయాడు. దుర్గాప్రసాద్ ఎందుకైనా మంచిదని ఆ రోజు నుంచి ఆయన ఎదుట భార్య భుజం మీద కూడా చేయి వేయడం మానేశాడు. మామగారికి పొట్లకాయ, పనసకాయ, పొటాటో వంటి ‘ప’ అక్షరం కూరగాయలంటేనే ఇష్టం. దుర్గాప్రసాద్‌కు కొంచెం మటన్ ముక్కో చికెన్ తునకో తగలాలి. ‘ఒక మనిషిని సుపారీ ఇచ్చి చంపడం, ఒక కోడిని తరాజులో పెట్టి తూయడం రెండూ పాపాలే’ అంటాడు మామగారు. పైగా మటన్ వండిన రోజు తన నిరసనలో భాగంగా గ్లాసు పాలు మాత్రమే తాగి పడుకుంటాడు. ‘ఇది పరోక్ష హింస కాదా’ అని దుర్గా ప్రసాద్ భార్య దగ్గర వెచ్చటి వెక్కిళ్లు పెట్టేవాడు. అయితే దేవుడు కూడా ఒక మగవాడే కనుక అతడికి సాటి మగవాడంటే జాలి కనుక దుర్గా ప్రసాద్ దృష్టి ఒక న్యూస్ పేపర్ కటింగ్ మీద పడేలా చేశాడు.ఈ సీజన్లో అమర్నాథ్ యాత్ర చేయడం పుణ్యదాయకమనీ సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీసుకుపోతున్నామని కనీసం నెలరోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని ఆ ప్రకటన సారాంశం. అయితే దాని కంటే ముఖ్యం – ఆ యాత్రలో ప్రమాదాలు పొంచి ఉంటాయన్న హెచ్చరిక అతణ్ణి ఆకర్షించింది. దుర్గాప్రసాద్ స్వతహాగా పొదుపరి. అయినప్పటికీ మామగారి కోసం ఆ యాత్రను బుక్ చేశాడు. ‘మీరొక్కరే క్షేమంగా వెళ్లి లాభంగా రండి మామగారు’ అని ఎంతో భక్తి శ్రద్ధలు ప్రదర్శించాడు.మామగారు ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. దుర్గాప్రసాద్ చాలా రోజుల తర్వాత తృప్తిగా న్యూస్ పేపర్ చదివాడు. తృప్తిగా కాఫీ తాగాడు. ఆ రాత్రి తృప్తిగా కోడికూరతో భోం చేశాడు. అంతే కాదు సుమా. ధైర్యంగా భార్య భుజం మీద చేయి కూడా వేశాడు.మామగారు వచ్చాక మామగారికి ఈ సంగతి తెలిస్తే ఊరుకుంటారో... కోరో. సినిమాలో సంసారం పనిమానేసి కబుర్లేంట్రా సత్తెయ్య(దాసరి నారాయణరావు) సంతలో పశువులు అమ్మడం, కొనడం చేస్తుంటాడు. పశువులు అమ్మిన డబ్బుతో ఇంటికొస్తుండగా ఓ సారి దొంగలు డబ్బు కోసం ఆయన్ను చంపాలని చూస్తారు. వారి బారి నుంచి దుర్గసముద్రం ప్రెసిడెంట్ విజయ్‌బాబు(వినోద్ కుమార్) సత్తెయ్యను కాపాడుతాడు. విజయ్ అక్క (అన్నపూర్ణ), బావ పోతురాజు(కోట శ్రీనివాసరావు) తమ కూతురు రాణిని(ఐశ్వర్య) విజయ్‌కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. సత్తెయ్య కూతురు లక్ష్మిని (యమున) ఇష్టపడిన విజయ్‌బాబు ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ఒంటరి అయిన మామగారిని ఇక కష్టపడకుండా తమతో పాటే ఉండి హాయిగా విశ్రాంతి తీసుకోమని చెబుతాడు విజయ్‌బాబు. కష్టానికి అలవాటు పడ్డ సత్తెయ్య అల్లుడి పొలంలో పని చేస్తూ, ఇతర కూలీలతో పనులు చేయిస్తుంటాడు. ఓ రోజు... పొలంలో పని మానేసి కబుర్లు చెప్పుకుంటుంటారు కూలీలు. వారి వద్దకు వచ్చిన సత్తెయ్య కూలీలతో ‘‘పనిమానేసి కబుర్లేంట్రా. కలుపు తీయడం పూర్తయితే ఎరువులు చల్లాలి. త్వరగా పని కానివ్వండి’’ అంటూ దబాయిస్తుంటాడు. ఈ ముసలాడేంట్రా మన పైన పెత్తనం చెలాయిస్తున్నాడంటూ మాట్లాడుకుంటారు కూలీలు ‘మామగారు’ చిత్రంలో. సత్తెయ్య చేసే కొన్ని పనులు అల్లుడు వినోద్‌కుమార్‌కి ఇబ్బందిగానే ఉంటాయి. అయినా సరే... మామగారు ఎక్కడ నొచ్చుకుంటారోనని ఏమీ అనలేక, అన్నింటినీ భరిస్తుంటాడు. – శేఖర్ వెనిగళ్ల -
క్యారక్టర్ ఉన్న నటుడిని..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అలనాటి చిత్రపరిశ్రమలో కీర్తిప్రతిష్టలే నటీనటుల బ్రాండ్‌గా ఉండేవని, వ్యక్తిత్వం కలిగిన.. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్ష కలిగిన నటీనటులు అప్పట్లో ఉండేవారని టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చెప్పారు. క్యారెక్టర్ యాక్టర్లుగా కాకుండా యాక్టర్ విత్ క్యారెక్టర్‌గా అప్పటి చిత్రపరిశ్రమ సాగేదని. ఇప్పుడు సినీ పరిశ్రమకు ఆ క్యారెక్టరే లోపిస్తున్నట్లుందని పేర్కొన్నారు. మంచితోపాటు చెడు కూడా సినిమారంగలో కొనసాగడం నిజమే కానీ వ్యక్తిగతంగా చెడిపోతున్నవారితో పాటు చిత్రరంగంలో కెరీర్‌ను జాగ్రత్తగా రూపొందించుకుంటున్న వారు కూడా నాడూ నేడూ చిత్రసీమలో చాలామందే ఉండేవారని, అలాంటివాళ్లను ఇప్పటి సినీ జనం ఆదర్శంగా ఎందుకు తీసుకోరంటూ ప్రశ్నించారు.పర్సనల్‌గా పాడైపోయిన క్యారక్టర్లను చూస్తూ మన ప్రవర్తనను జాగ్రత్తగా మల్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పుడెవరూ అలా అనుకోవడం లేదు కాబట్టే డ్రగ్స్ వంటి వ్యవహారాలు చిత్రసీమలో రాజ్యమేలుతున్నాయని చెబుతున్న కోటా శ్రీనివాసరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... నటుడిగా గొప్ప రాజకీయ పాత్రలు పోషించారు. వాటికీ, వాస్తవానికి తేడా ఉందా? 1999లో ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు వాతావరణం వేరు. అప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేది. మంచి పని చేశాడు అనిపించుకోవాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే పది కోట్లు కావాలి. 20 కోట్లు ఖర్చుపెట్టాలి అనే మాటలు వినబడుతున్నాయి. నా ప్రశ్న ఒక్కటే. అంత మొత్తం ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అందుకే రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించే నా తత్వానికి ఇక పడవు అనుకుని రాజకీయాలు వదిలేశాను. మీరు నటించిన మండలాధీశుడు సినిమాతో వివాదం రేగింది కదా? ఒకరకంగా దెబ్బతిన్నాను. విజయవాడ రైల్వేస్టేషన్లో నన్ను కిందపడేసి కొట్టారు. ఆ సినిమా చూసినవాళ్లెవరూ పెద్దగా మనసును కష్టపెట్టుకోలేదు. ఎన్టీరామారావుకు వ్యతిరేకంగా తీశారని తెలిస్తే ఆయన అభిమానులు తట్టుకోవడం కష్టమే కదా. కానీ అంత వ్యతిరేకత వస్తుందను కోలేదు. నిజానికి ఆ సినిమాలో ఎన్టీఆర్‌ని తిట్టలేదు, కించపర్చలేదు. ఆయన ప్రవర్తనను మాత్రమే సినిమాలో చూపించాము. కానీ ఆ పాత్ర పోషణలో నటనలో నా వైపు నుంచి ఏమీ లోపం లేదు. కుర్రాళ్లు ఏదో ఆవేశంలో అలా చేశారు కానీ ప్రజలు ఆ పాత్రతో పెద్దగా మనసు కష్టపెట్టుకోలేదు. మీపై దాడి ఎలా జరిగింది? ఎన్టీఆర్ విజయవాడలో ఒక కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలోనే నేను పనిమీద స్టేషన్‌కు వచ్చాను. అక్కడ పెద్దసంఖ్యలో తెలుగుదేశం జెండాలు కనిపించాయి. అయ్యో ఈ సమయంలో వచ్చి ఇరుక్కున్నానే అనుకుంటూ ఒక పక్కకు వెళుతుండగానే నన్ను చూసి గుర్తుపట్టారు. కోటా గాడు వచ్చాడురా అంటూనే మీద పడి దాడిచేసి కొట్టారు. చాలా బాధపడిన సన్నివేశం. ఎన్టీఆర్‌తో మీకు విభేదాలు ఏమీ లేవుకదా? నా దురదృష్టం ఏమిటంటే నేను అందరితో నటించాను. ఆయనతో కలసి నటించే అవకాశం లేకుండా పోయింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. తేదీలు కూడా ఇచ్చారు. కాని ఎందుకో అది తప్పిపోయింది. మండలాధీశుడు సినిమా తర్వాత మద్రాస్ విమానాశ్రయంలో ఆయన్ని నేను కలిశాను. బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ చెప్పి వస్తున్నారు. అదే మంచి సమయం అనిపించింది. చూసి నమస్కారం పెట్టాను. సీరియస్‌గా చూశారు. ‘‘మీరు మంచి కళాకారులని విన్నాను బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఆరోగ్యం జాగ్రత్త. బీ కేర్ ఫుల్’’ అంటూ భుజం తట్టి.. వెళ్లి రండి అన్నారాయన. ఠక్కున ఆయన పాదాలకు దండం పెట్టి వచ్చేశాను. ఏంట్రా అంత ధైర్యంగా ఆయన ముందుకెళ్లావు. సాచిపెట్టి నిన్ను ఒకటి పీకి ఉంటే ఏమయ్యేది అని మావాళ్లంతా తర్వాత అడిగారు. నేననుకోవడం ఆయనకు అలాంటి కోపాలు ఏమీ లేవు. చుట్టూ ఉన్నవారంతా నామీద ఏవేవో చెప్పి ఎక్కించారు. నేను మా వాళ్లకు ఒకే మాట చెప్పాను. ఇలాంటి దిక్కుమాలిన వాళ్లందరి దగ్గర రోజూ తిట్లు తినే బదులు ఆయన్ను పలకరించి ఒక దెబ్బ తింటే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదా అన్నాను. నాటకాల్లో విశేషానుభవం ఉంది కదా. నాటకానికి, సినిమాకు తేడా ఏంటి? సినిమాకు, నాటకానికి పెద్ద తేడా ఉంది. నాటకంలో మీరు రంగేసుకుని, మీసాలు పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత చేసినా ఒకటి, రెండు, మూడు, నాలుగు అలా రోల్ వెనక్కు వెళ్లే కొద్దీ నటుడిగా మీరు ఫేడ్ అయిపోతుంటారు. అంటే తెరపై మీరు కనబడటం తగ్గిపోతుంది. అందుకే నాటకాల్లో చేతులు అటూ ఇటూ ఆట్టహాసంగా ఊపి, వాయిస్ పెంచి జిమ్మిక్కులు చేస్తుంటారు. దాన్నే నాటకీయత ఎక్కువైందిరా అంటుంటారు. అంటే తెరపై కనబడ్డం కోసం పాట్లు అన్నమాట అవి. అదే సినిమా విషయంలో.. ఒక కన్ను ఉందనుకోండి. అది రెండంగుళాలు. దాన్ని క్లోజ్ చేస్తే 35 ఎమ్ఎమ్లో కనబడుతుంది అంటే కన్ను చాలా చిన్నది కాని సినిమాలో అదే పెద్దసైజులో కనబడుతుంది. తేడా ఏమిటంటే సినిమాలో చిన్నదాన్ని పెద్దదిగా చూపిస్తారు. నాటకంలో పెద్దది చిన్నదిగా కనబడుతుంది. అదే సినిమాకు, నాటకానికీ తేడా. ఆనాటి సినిమా, ఈనాటి సినిమా మధ్య తేడా ఏంటి? ఆ రోజుల్లోనూ నిర్మాతలు, దర్శకులు, హీరోలు సినిమాను వ్యాపారపరంగానే తీసినప్పటికీ సంఘంలో మనకు ఒక బాధ్యత ఉందనే భావన ఉండేది. భాషలో కానీ, సీన్లు తీసేదాంట్లో కాని ఒక సభ్యత ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయిందనే పేరుతో ఈ యూత్ అంతా ఇష్టమొచ్చినట్లుగా సినిమాలు తీస్తున్నారు అని మనం అన్నామనుకోండి.. పాత చింతకాయపచ్చడి నువ్వేంట్రా అంటారు. అందుకే దాదాపు అయిదేళ్లుగా చూస్తున్నాను. సినిమా ఇవ్వాళ తన సారాన్ని బాగా కోల్పోయింది. ఒకప్పటి సినిమా ఇప్పుడు లేదు. Výæతంలో సినిమా అంటే వ్యాపారంతో కూడుకున్న బాధ్యత. ఇప్పుడు సినిమా అంటే కేవలం వ్యాపారం. కానీ సినిమాలు ఆడటం ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది కదా? ఉదాహరణకు.. బాహుబలి సినిమా ఉంది. వాళ్లు ఇంత ఖర్చయింది అని చెప్పుకున్నారంటే అర్థముంది. ఎంత రిచ్‌గా తీశారో చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది. అలా ఎవరినయినా తీయమనండి చూద్దాం. టెక్నికల్‌గా ఖర్చు పెరిగింది అంటున్నారు. ఏం పెరిగింది టెక్నికల్‌గా. విఠలాచార్య కంటే గొప్పవారా వీళ్లంతా. ఆయన వద్ద ఉన్న ఎక్విప్మెంట్ చాలా చిన్నదిగా ఉండేది కానీ దాంతోనే అంత పెద్ద సినిమాలు చూపిం చారు. మాయాబజార్ చూడండి. ఈ రోజుల్లో కూడా ఆ సినిమాను విడుదల చేస్తే జనంలో ఎంత స్పందనో మరి. ఇప్పుడు కొత్త సినిమా విడుదలైతే మహా అంటే నెల రోజులు చెప్పుకుంటారు. తర్వాత మర్చిపోతున్నారు. కానీ పాత సినిమాలు టీవీల్లో చూస్తుంటే ఎంత గొప్పగా ఉంటాయో కదా. మాయాబజార్లో భోజనానికి కూర్చుంటే తివాచీ మడత పడటం, వీళ్లు వెనక్కు తోయడం, మళ్లా మడతపడటం అవే దృశ్యాలను ఇప్పుడు తీయమనండి చూద్దాం. టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లోనే అంత గొప్ప షాట్లు చేశారు కదా? వాళ్లంతా మహానుభావులండీ.. ఎందుకు వారంత గొప్పవారయ్యారంటే సినిమాను సినిమాగా అర్థం చేసుకున్నారు. సినిమా అంటే మేకింగ్ బిలీవ్స్.. నమ్మించడమే సినిమా. అంతేగాని రోడ్లమీద పడి గంతులేసి ఆడమని కాదు. సినిమాల్లో కొందరు డ్రగ్స్ బానిసలు అయిపోయారు. ఇది సమాజానికి నష్టం కాదా? సినిమా అంటేనే చెడు ఎక్కువ. అయితే వ్యక్తిగతంగా చెడిపోయేవాళ్లు అప్పుడూ ఉండేవారు. ఇప్పుడూ ఉంటున్నారు. అప్పట్లోనూ పెద్దపెద్దవాళ్లు కొంతమంది తాగి చెడిపోలా? ఈ రోజు కోట శ్రీనివాసరావు జాగ్రత్తగా ఉండటానికి కారణం ఏమిటి? నాకెవరూ చెప్పక్కర్లా. చెడిపోయిన వారు ఎదురుగుండానే కనబడుతున్నారు. పర్సనల్‌గా పాడైపోయిన క్యారక్టర్లు మన కళ్లముందే ఉన్నారు. అలాంటి వాళ్లను చూస్తూ మన ప్రవర్తనను జాగ్రత్తగా మల్చుకునే అవకాశం ఉంది. కానీ అలా అనుకోవడం లేదిప్పుడు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తీసిన మండలాధీశుడు సినిమాలో ఎలా నటిస్తావంటూ ఆయన అభిమానులు విజయవాడ రైల్వేస్టేషన్లో నన్ను కింద పడేసి కొట్టారు. కోటాగాడు వచ్చాడురా అంటూనే మీదపడి దాడిచేసి కొట్టారు. కానీ తర్వాత ఎన్టీఆర్‌ని స్వయంగా కలిసినప్పుడు ‘మీరు మంచి కళాకారులని విన్నాను బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ఆరోగ్యం జాగ్రత్త. బీ కేర్ ఫుల్’ అంటూ భుజం తట్టి... వెళ్లిరండి అన్నారాయన. ఠక్కున ఆయన పాదాలకు దండం పెట్టి వచ్చేశాను. (కోటా శ్రీనివాసరావుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/Q5SgXR https://goo.gl/Vp24aB -
విజయవాడలో స్టేషన్లో నన్ను కొట్టారు
-
జరిగేవన్నీ మంచికనీ...
నేను నా దైవం కొడుకు జారిపడితే.. మనకు నొప్పేస్తుంది. కొడుకు చేయిజారిపోతే.. కడుపు తరుక్కుపోతుంది. కొడుకే లేకపోతే... వాడి బదులు మనం పోతే బాగుండనిపిస్తుంది. తుపాన్‌ను భరించిన చెట్టు.. ఇంకా నిలబడే ఉందంటే దాని వేళ్ళలో దైవబలం ఉన్నట్టే! చెట్టంత కొడుకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తోటలో మిగిలిన మొక్కలతో గడుపుతున్న కోటశ్రీనివాసరావు కన్నీళ్లలో జీవనవేదన కనిపించింది. ఆయన మాటల్లో.. ‘జరిగేవన్నీ మంచికనీ...’ అన్న స్పృహ ధ్వనించింది. నా కొడుకు పెద్ద దెబ్బ కొట్టాడండీ. ఏమిటో అంతా.. ఆత్రేయగారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ...’ అనుకోవడమే మన పని. సర్, ఈ విశ్రాంత సమయం దైవాన్ని తలచుకోవడానికి, జీవితాన్ని విశ్లేషించుకోవడానికి అవకాశంగా భావిస్తున్నారా? అంతేకదమ్మా! ఇంక మిగిలింది అదే కదా! దేవుడు ఓ వైపేమో పేరు ప్రఖ్యాతులు బోలెడన్ని ఇచ్చాడు. మరో వైపు జీవితకాలం భరించు.. అనే కష్టం ఇచ్చాడు. (కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు) దేవుడి గొప్పతనం ఏంటంటే ఈ రెండింటినీ తట్టుకునేంత (చేతిని చాతీ మీద పెట్టుకుంటూ) గుండెను ఇచ్చాడు. ఇంకొకరైతే ఏమైపోయేవారో... ఆ కుర్చీలో కూర్చుని (ఇంటి హాల్లో గోడ మీద కోట చేసిన సినిమా పాత్రల ఫొటోలు అతికించి ఉన్నాయి) ఆ ఫొటోల వంక చూస్తుంటాను. జీవితంలో చేసిన తప్పులు, ఒప్పులు అన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. కాకపోతే నమ్మేదొకటే.. తప్పొప్పులు ఎక్కడికీ పోవు. ఇక్కడే ఆ ఫలితాన్ని చూస్తాం. మంచి చేస్తే మంచే చూస్తాం, చెడు చేస్తే చెడూ చూస్తాం. కొడుకును దూరం చేశాడని దేవుడి మీద కోపం తెచ్చుకుంటున్నారా? కోపమా?! ఆయన ముందు మనమెంతటి వారం. అయినా మన ఖర్మకు ఆయన మీద కోపం తెచ్చుకోవడం ఎందుకు? అలా ఎప్పుడూ జరగలేదు. కానీ, దుఃఖం. ఇలా రాసిపెట్టి ఉంది. ఏం చేస్తాం...? దైవం గురించి బాగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది.. వృత్తే దైవంగా భావించాను. ఆ వృత్తిని అర్థం చేసుకుంటూ ఎదిగాను. అందులోని మంచి చెడులను ఇప్పుడు విశ్లేషించుకుం టున్నాను. మొదట్లో నేనీ రంగానికి వచ్చినప్పుడు ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడూ సినిమాల కోసం ప్రయత్నించింది లేదు. నాటకాలు వేసేవాడిని. యాదృచ్చికంగా టి.కృష్ణ గారు నా నాటకం చూసి, ‘వందేమాతం’ సినిమాలో చిన్న అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నటనే నా జీవితం అయిపోయింది. బ్యాంకులోనే ఉండి ఉంటే ఓ అధికారిని అయ్యేవాడినేమో. ఆ జీవితానికి ఈ జీవితానికీ ఎక్కడా పోలిక లేదు. ఇదంతా భగవంతుని దయ కాకపోతే మరేముంటుంది. నలుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములం. అన్నగారు పోయారు. మిగతా అందరం ఎప్పుడైనా కలుస్తుంటాం. ఎవరి ప్రాప్తం వారిది. ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు? వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాను. ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఆయన్ని తలుచుకొని ఓ దణ్ణం పెట్టుకుంటాను. అంతకు మించి పూజలు ఏమీ చేయను. గుళ్లకు వెళుతుంటాను. దైవం అంటే నా ఒక్కడికే కాదు అందరికీ ఉన్నాడని గట్టిగా నమ్ముతాను. మనసుకు అలసటగా అనిపించినప్పుడు ఓ అరగంట మౌనంగా కూర్చుంటాను. దైవాన్ని తలుచుకుంటూ మౌనంగానే ప్రార్థిస్తుంటాను. మీ పిల్లలు సరే, మనవలకు దైవం గురించి ఎలాంటి విషయాలు చెబుతుంటారు? అప్పుడు పిల్లలకు చెప్పడానికి నాకు టైమ్ లేదు. ఇప్పటి పిల్లలు చాలా బిజీ! నేర్పడానికి, చెప్పడానికేమీ లేదు. పొద్దున ఏడింటికి వెళితే తిరిగి రాత్రి ఏడు దాటాకే వస్తారు. వాళ్ల పుస్తకాలు, వ్యాపకాలతోనే వారికి సరిపోతుంది. మనం ఏదైనా చెబితే చికాకు పడతారు. మార్పు ఎందుకొచ్చింది అని చెప్పలేం. అలా వచ్చిందంతే! వాళ్లకు సమయం దొరికినప్పుడు ‘ఏదో ఒకటి తెలుసుకోండిరా!’ అని అంటుంటాను. వింటే వింటారు, లేకపోతే లేదు. ఈ రోజు ఒకరో ఇద్దరో కాదు ప్రపంచమే అలా ఉంది. ఈ తరాన్ని మార్చండి అని చెప్పలేం. సమాజపరిస్థితులు అలా ఉన్నాయి. భగవంతుడే మార్పు తేవాలి. మీ జ్ఞాపకాలలో దైవం మీకిచ్చిన అదృష్టం గురించి తలుచుకుంటుంటారా? అదే ఇప్పుడు చేస్తున్నది. పుస్తకాలు చదివే అలవాటు లేదు. నా జీవితమే నాకు పెద్ద పుస్తకం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకోవడం అంటే సాధారణ విషయంకాదు. నా కంటే ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. కానీ, ఆ అదృష్టం నన్ను వరించింది. ఇది భగవంతుడిచ్చిందే కదా! మంచైనా చెడైనా నేను చేసిన పాత్రలలో కనీసం 50 క్యారెక్టర్లయినా గుర్తుకు వస్తుంటాయి. అప్పటికీ ఇప్పటికీ నిలిచిపోయే క్యారెక్టర్ ‘అహ నా పెళ్లంట’ సినిమాలోనిది. మహానుభావుడు జంధ్యాలగారి ద్వారా ఆ అదృష్టాన్ని దక్కించాడు దేవుడు. ఎప్పుడైనా ఒక సినిమా గురించి బాధపడతాను. ‘పంజరం’ సినిమాలో యవ్వనంలో ఉన్న హీరోయిన్ని పెళ్లి చేసుకొని, అనుమానంతో ఆ పిల్లను పీడించే స్వభావమున్న పాత్ర అది. 102, 103 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా ఆ సీన్ చేశాను. కానీ, ఆ సినిమా రెండు, మూడు రోజుల కన్నా మించి ఆడలేదు. ఇలా మంచి చెడులను తలుచుకుంటూ ఉంటాను. నేనిది కోల్పోయాను స్వామీ.. అని దేవుని ముందు చెప్పుకున్న సందర్భం? రెండున్నాయి. ఒకటి సరైన సమయంలో కుటుంబంతో గడపలేకపోయాను. షూటింగ్స్ ఉండి నెలకి, రెండు నెలలకు ఓసారి ఇంటికి వచ్చిన రోజులున్నాయి. నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పిల్లల చిన్నతనంలో వారి అచ్చటా ముచ్చట పెద్దగా చూసుకుంది లేదు. వారి వెనకాల ఉండి సెట్ చేసింది లేదు. నా అదృష్టం ఏంటంటే పిల్లలు చదువుకుని, బుద్ధిమంతులుయ్యారు. రెండోది– జనరల్ నాలెడ్జి లేకుండా పోయింది. పొద్దున్న ఐదింటికో, ఆరింటికో వెళ్లిపోయేవాడిని. తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి దాటి ఏ రెండో అయ్యేది. ప్రపంచంలో ఏం జరుగుతుంది అని కూడా పట్టించుకోలేదు. ఈ రెండింటి గురించి తలుచుకొని నాలో నేను ఏడుస్తూ ఉంటాను. ఎట్లా అయిపోయిందంటే అప్పుడు తినడానికి టైమ్ లేదు. ఇప్పుడు తిందామంటే తినలేను. అప్పట్లో ఎవరు ఏం చేసేవారో కూడా తెలిసేది కాదు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు.. ఏవీ పట్టేవి కావు. ఎవరికైనా టైమ్ వస్తే టైమ్ ఉండదని అర్థమైంది. ఆ రోజులు అలా గడిచిపోయాయి.నా కొడుకు పెద్ద దెబ్బ కొట్టాడండీ. ఏమిటో అంతా.. ఆత్రేయగారు అన్నట్టు.. ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికనీ...’ అనుకోవడమే మన పని. జీవితం వెళ్లిపోయింది. వెళుతోంది. ఈ వయసులో పితృశోకం భరించవచ్చు. పుత్ర శోకం భరించలేం. తండ్రిగా ఆ బా«దను అనుభవిస్తున్నాను. ఈ దుఃఖాన్ని ఎవరూ పూడ్చలేరు. తెలిసినతను రోగంతో బాధపడుతూ ఇంకో రెండు నెలలో పోతాడనగా వెళ్లి చూసొచ్చాను. ఆయన్ను చూస్తూ ఒకాయన అన్నాడు ‘ఏంటయ్యా! ఇది.. ఇలా అయిపోయావు’ అన్నాడు. అప్పుడు అన్నాను ‘అనుభవించాడు కదా! ఇప్పుడు అనుభవిస్తున్నాడు’ అని. నేనూ అంతేగా! అన్నీ చూశాను. అర్థం చేసుకున్నాను. దేవుడు ఈ కష్టం ఇచ్చాడని ఏడుస్తూ కూర్చుంటే నన్ను నమ్ముకున్నవారు ఉన్నారు. వాళ్లేమై పోతారు. ఎలాగూ తప్పదు కాబట్టి.. నడిపించాలి అంతే! ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవడా నికి ఆశ్రమాలకు వెళ్ళాలనుకోవడం లేదా? ఇంతవరకు చేయలేదు. జనరేషన్ మార్పు కారణంగా ఇప్పుడు చాలా మటుకు పిల్లలు ఫారిన్లో ఉంటున్నారు. అక్కణ్ణుంచి డబ్బులు పంపిస్తుంటారు. ఇక్కడ అమ్మానాన్న ఏదో ఉన్నామంటూ దిక్కులేకుండా ఉంటారు. అదంతా విని, చూసి తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. రోజంతా ఎలా గడుపుతుంటారు? మనవలు, మనవరాలు ఉన్నారు. వారి బాగోగులు గమనించడం. కాసేపు టీవీ చూడడం, భోజనం చేయడం, నిద్రపోవడం.. తప్పదు. అంత తీరికలేకుండా ఉండి ఇప్పుడు ఇలా కూర్చోవడం అంటే ఏం చేయగలం... భగవంతుడు అలా రాసిపెట్టాడు. మనుషుల్లో దైవత్వాన్ని చూశారా? ఎదుటివాడికి సాయపడటం అంటే అక్కడ దైవం ఉన్నట్టే! కాలే కడుపుకి ఒక ముద్ద పెట్టినా చాలు కదా. అలాంటివారిని చూస్తూనే ఉంటుంటాం. మీరే దేవుడు అని ఎవరైనా అన్న సందర్భం...? ఎంతమాట. అలా అని మనం చెప్పుకోకూడదు. కొందరు అంటుంటారు కానీ అది నాకు నచ్చదు. నా దగ్గర పనిచేసేవాళ్లు, తెలిసినవాళ్లు కష్టం లేకుండా ఉన్నారా, లేరా! అని చూస్తాను. ఎవరైనా కష్టం ఉంది బాబూ అని వస్తే.. సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో పది, పదిహేను లక్షలదాకా ఖర్చు పెట్టి ఉంటాను. అదంతా చెప్పుకోవడం నాకిష్టం లేదు. కష్టం ఉన్నదని వాళ్లు పది అడిగితే నేను పది ఇవ్వలేకపోవచ్చు. కానీ, మూడో నాలుగో ఇచ్చి ఉంటాను. ఈ రోజుకు కూడా ఒకరి ముందు చెయ్యి చాపే అవకాశం రానివ్వలేదు దేవుడు. అంతకు మించి ఏమున్నది. పిల్లలకూ అదే చెబుతుంటాను. మనం బతకాలి. పదిమందిని బతికించేలా ఎదగాలి అని. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఉక్కపోత
సమ్సారం సంసారంలో సినిమా కొత్త క్యాలెండర్ వచ్చిన మూడో నెలలో ఉగాది పండగొచ్చింది, పిల్లలకు పరీక్షలూ వచ్చాయి. నాలుగో నెలలో శ్రీరామనవమి వచ్చింది, పానకంతోపాటు ఎండలొచ్చాయి. వేసవి సెలవులూ వచ్చేశాయి. ‘‘చింటూ! ఇంకా బ్రష్ చేయలేదా? త్వరగా బ్రష్ చేసి పాలు తాగు’’ అంటూ పాలగ్లాసు టేబుల్ మీద పెట్టింది గాయత్రి. క్యాలెండర్లో హాలిడేస్ మొదలైన రోజును మార్క్ చేశాడు చింటూ. వెంటనే మరో రెండు పేజీలు తిప్పి... జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయ్యే రోజును మార్క్ చేశాడు.‘‘నాన్నా! ఈ రోజులన్నీ సన్డేలేనా... స్కూల్‌కి వెళ్లడమే ఉండదా నిజంగా’’ క్యాలెండర్లో ఏప్రిల్, మే నెల పేజీలను చూపిస్తూ సందేహంగా అడిగాడు. మా వాడి భాషలో సన్డే అంటే సెలవు. వాడి యుకెజి బుర్రకు స్కూలుకెళ్లని రోజులన్నీ ఆదివారాలే. ‘‘అన్నీ సన్డేలు కాదు. కానీ హాలిడేసే కన్నా’’ అని ఇంకా వివరించబోయా.ఇంక చాల్లే అన్నట్లు అడ్డుపడి ‘‘హాలిడేస్‌కు ఎక్కడికెళ్దాం నాన్నా’’హాలిడే – పదాన్ని చటుక్కున క్యాచ్ చేశాడు మా హీరో... ఎంత షార్పో... నేనింకా మురిపెంలోనే ఉన్నా. చింటూ నా వీపు మీదెక్కి... చేతులు మెడలో వేసి ఊగుతూ ‘‘హాలిడేస్ ఎక్కడికెళ్దాం’’ అని గదిమాడు. ఈ సారి నాన్నా అనే సంబోధన మిస్సింగ్.‘ఊటీకెళ్దామా’’ అని ఊరించాను... నా డ్రామా అంతా చింటూ దగ్గర వేస్తున్నాను కానీ అసలు స్కెచ్ కిచెన్‌లో ఉన్న గాయత్రి కోసమే.‘‘చింటూ! పాలు తాగనే లేదా? మీరు వాడి చేత బ్రష్ చేయించకుండా ఆటలాడుతున్నారా?’’ ఫ్రిజ్‌లో కూరగాయలు తీసుకోవడానికి వచ్చిన గాయత్రి కరిచినట్లు అరిచింది. ఏకకాలంలో ఇద్దరికీ డోస్.‘ఊటీ’ ఊరింపు తను విన్నదా లేదా? రిపీట్ చేయాలా వద్దా? ‘‘బ్రష్ చేద్దువురా’’ చింటూ ఎత్తుకుని సింక్ దగ్గర స్టూల్ మీద నిలబెట్టాను. వాడు బ్రష్ మీద పేస్టును పిండబోతుంటే లాక్కుని కొద్దిగా వేసిచ్చి ట్యూబ్‌ను వాడికందకుండా పైన పెట్టాను.‘‘ఊటీకి ట్రైన్లో వెళ్దామా, ఫ్లయిట్లో వెళ్దామా నాన్నా’’ ఊటీలో విహరిస్తున్నాడు చింటూ. ‘‘ఊటీకి ఫ్లయిటెళ్లదు. రైల్లో పోదాం’’ హమ్మయ్య జాగ్రత్తగానే మాట్లాడాను. ఫ్లయిట్లో చాలా డబ్బులవుతాయని నాలుక దాకా వచ్చిన మాటను లౌక్యంగా మార్చేశాను. నా భుజాన్ని నేనే తట్టుకున్నాను గాయత్రి కంటపడకుండా.‘‘ఫ్లయిట్ వెళ్లే ఊర్లకేమైనా ఫ్లయిట్లో తీసుకెళ్లారా? ట్రైన్లో స్లీపర్ తప్ప. అయినా ఎప్పుడెళ్తాం? మనకు టూర్ ఊటీ అయితే... మండపేటలో ఉన్న మీ కజిన్‌కి, పిల్లలకు మనూరే టూరిస్ట్ ప్లేస్ కదా’’ పెనం మీద దోశె పోస్తూ అంది గాయత్రి. మధ్యలో వినిపించిన చిటపటలు దోశెపెనానివా? గాయత్రివా? అంతా ఫాలో అవుతూనే ఉందన్నమాట. తెలివిగా టాపిక్ మార్చాలి. ∙ ∙ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాను. పిన్ని కూతురు పద్మ, బావ, వాళ్ల పిల్లలు నిన్ననే వచ్చారు. బహుశా వాళ్లు బయటికెళ్లారేమో! ఇంట్లో సందడి తక్కువగా ఉంది, రిఫ్రెష్ అయ్యి టీవీ ముందు కూర్చున్నాను. యానిమల్ ప్లానెట్ నుంచి బయటకు వచ్చి మనుషుల ముఖాలు చూద్దామని రిమోట్ అందుకున్నాను. ఎంతకీ చానల్ మారట్లేదు. బ్యాటరీ వీక్ అయిందేమోనని రిమోట్‌ని టీవీ ముఖం మీద పెట్టి నొక్కాను. సెట్‌టాప్ బాక్స్ ఎదురుగా వెళ్లి నొక్కాను. ఉహూ... చానల్ మారట్లేదు. పద్మ పిల్లలే ఏదో చేసి ఉంటారు. చానల్ మార్చడానికి కుదరని టెక్నాలజీ మా టీవీలో ఉన్నట్లు నాకే తెలీదు. ఈ పిడుగులకెలా తెలిసిందో. రిమోట్‌తో లాభం లేదనుకుని టీవీ దగ్గరకెళ్లాను. ఆల్రెడీ చైల్డ్లాక్లో ఉంది. ఏ బటన్ నొక్కినా టీవీ స్పందించడం లేదు. ఇక నాకు రిమోటే గతి. ఫ్లాష్‌లాంటి ఐడియా... ఎన్నిసార్లు టార్చ్‌లైట్‌లో బ్యాటరీలను నేలకేసి రుద్ది వెలిగించలేదు. టీవీని పలికించలేనా... నా తెలివికి నాకే ముచ్చటేసింది. నా టాలెంట్ గుర్తించి ఎవరూ దేశానికి ఆర్థిక మంత్రిని చేయడం లేదు. కానీ లేకపోతేనా... అమెరికాకి అప్పిచ్చే స్థాయికి తీసుకురానూ... నాలో ఉన్న నా మనిషి నన్ను మెచ్చుకుంటూ ఉంటే... నేను పెదవుల మీద చిరునవ్వును ధైర్యంగా ప్రకటిస్తూ రిమోట్ ఓపెన్ చేశాను. మైగాడ్... బ్యాటరీలే లేవు.నా రాక గమనించి శ్రీమతి టీ తెచ్చి టీపాయ్ మీద ఠంగున పెట్టింది. ‘‘బ్యాటరీల్లేవేంటి గాయత్రీ...’’ నా మాట పెదవి దాటే లోపు గాయత్రి వచ్చినంత వేగంగా కిచెన్‌లోకి వెళ్లిపోయింది. బంధువులు వచ్చి పని ఎక్కువైందేమో కోపంగా ఉన్నట్లుంది. మంచివాడిని కాబట్టి ఆ ‘ఠంగు’కు నేనే ఓ భాష్యం చెప్పుకున్నా. చింటూ పరుగెత్తుకొచ్చాడు. ఏదైనా మ్యాటర్ రాబట్టాలంటే వాడిని ఒళ్లో కూర్చోబెట్టుకోవాలి. వాడు చెప్పే కబుర్లు వినాలి. మాటల్లో మాటగా అడగాలి, తప్ప నేరుగా అడిగితే సూటిగా చెప్పడు.‘‘బిట్టూ, బన్నీలతో బాగా ఆడుకున్నావా?’’‘‘స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడుకున్నాం. ఈవెనింగ్ అత్త, మామయ్య, బిట్టూ, బన్నీ శిల్పారామానికెళ్లారు నాన్నా. నేను ఆల్రెడీ చూసేశాగా. రేపు వాళ్లతో లుంబినీ పార్క్కెళ్తా’’ అన్నాడు సెల్‌ఫోన్ కోసం నా జేబులో చెయ్యి పెడుతూ. ‘‘రిమోట్లో బ్యాటరీలు ఏమయ్యాయి నాన్నా’’ అన్నాను ముద్దుముద్దుగా.‘‘మరి... ఏసీ రిమోట్లో బ్యాటరీలు పోయాయి. అందుకే అమ్మ టీవీ రిమోట్ బ్యాటరీలు వేసింది’’ అప్పటికే ఫోన్ లాక్కుని యాంగ్రీబర్డ్ గేమ్ స్టార్ట్ చేశాడు చింటూ.గాయత్రి టీ కప్పు టీ పాయ్ మీద పెట్టేటప్పుడు అంతగా ‘ఠంగు’మనడం ఎందుకో ఇప్పుడర్థమైంది. ∙ ∙ ‘‘బావా! మీరున్న వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. మళ్లీ ఎప్పుడొస్తారు హైదరాబాద్‌కి’’ ముందుగదిలో ఉన్న వాళ్ల సామాను కారిడార్‌లో పెడుతూ అప్యాయంగా అన్నాను.‘‘ఇక ఇప్పట్లో హైదరాబాద్ రావాల్సిన పనేమీ లేదులే అన్నయ్యా... అన్నీ చూసేశాంగా’’ అన్నది పద్మ మా ఆవిడ బొట్టు పెట్టి ఇచ్చిన చీరను బ్యాగ్‌లో పెట్టుకుంటూ.‘‘వదినా! చింటూకి సెలవులిచ్చినప్పుడు మా ఊరికి రండి. అన్నయ్యకు ఆఫీసు సెలవు కుదరకపోతే నువ్వు రైలెక్కి ఫోన్ చెయ్యి మేము రిసీవ్ చేసుకుంటాం’’ భారీ ఆఫర్ ఇచ్చేసింది. కానీ... ఎక్కడో ఏదో కొడుతోంది. పద్మ కొన్ని పదాలు ఒత్తి పలుకుతోంది. మాటల్లో శ్లేష ఉందా?బావ వైపు వెర్రి నవ్వుతో చూసి వెంటనే గాయత్రిని చూశాను. వాళ్ల అమ్మానాన్న తనకు గాయత్రి అనే పవర్ఫుల్ పేరు ఎందుకు పెట్టారో గానీ ఆ చూపులకు శక్తి ఉంటే నేను మాడిపోయేవాడిని. చింటూ నిద్రలేవగానే వచ్చి ఒళ్లో కూర్చున్నాడు. నా చేతిలో ఉన్న పేపర్లో ట్రావెల్ యాడ్ దగ్గర వాడి కళ్లు ఆగిపోయాయి. ‘‘నాన్నా ఊటీకెళ్దామన్నావ్గా... ఎప్పుడెళ్దాం?’’‘‘చింటూ! బ్రష్ చేసిరా’’ గాయత్రి గొంతులో తల్లి ప్రేమ వినిపించలేదు.ఆ సంగతి చింటూకీ అర్థమైంది. కామ్‌గా వెళ్లి బ్రష్ అందుకున్నాడు. వాడి బ్రష్ మీద పేస్టు వేస్తూ ‘నెక్ట్స్ మంత్ వెళ్దాంలే’’ అన్నాను.‘‘పోనీ... పెద్దనాన్న వాళ్లను రమ్మను నాన్నా. అక్క, అన్నయ్యతో ఆడుకోవచ్చు’’ అన్నాడు. పాపం ఒక్కడికీ బోర్ కొడుతున్నట్లుంది.గాయత్రి ఎప్పుడు వచ్చిందో తెలియదు.చింటూ చేతిలో బ్రష్ తీసుకుని తానే వాడి పళ్లు తోముతూ ‘‘కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇంటికి వచ్చిన చెల్లెలు, బావ, పిల్లలు ఏసీ వేసుకుంటే కరెంటు బిల్లు పెరుగుతుందని లెక్కలేసే వాళ్లకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎందుకు? ఈ దరిద్రపు తెలివితేటలు ప్రొఫెషన్లో చూపిస్తే ఎన్ని ప్రమోషన్లు వచ్చేవో’’ అంటూ ‘‘చింటూ! సరిగ్గా పుక్కిలించు’’ అని విసవిసా వాడి నోట్లో నీళ్లు పోసింది. గాయత్రి బాడీ లాంగ్వేజ్‌లో ఎక్కడో తేడా. ఏసీ రిమోట్లో బ్యాటరీలు దాచేశానని కన్ఫర్మ్ చేసుకున్నట్లుంది. ఇంట్లో ఈ ఉక్కపోత తగ్గేదెప్పటికో?!. పండ్ల బుట్ట ఇక్కడే ఉంచు! లక్ష్మీపతి ( )కి వెంకట్రావు (సుత్తి వీరభద్రరావు) బావమరిది. లక్ష్మీపతి పరమ పిసినారి. అక్క, బావలను చూద్దామని వస్తూ పండ్లు తెస్తాడు వెంకట్రావు. లక్ష్మీపతి ‘ఈ పండ్లన్నీ మాకే... నీ చాదస్తం... మీ ఇల్లూ మా ఇల్లూ ఒక్కటి కాదేమిటి... అంటూ బుట్ట లాగేసుకుంటాడు లక్ష్మీపతి. లక్ష్మీపతి భార్య కాఫీ తీసుకొస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతుంటే.. ‘ఎండలు మండిపోతుంటే కాఫీ అంటావేంటే? చల్లటి మంచి నీళ్లు తీసుకురా’ అంటాడు.అందరూ మాటల్లో ఉండగా... ‘అరగంట్లో వడ్డించేస్తాను’ అంటుంది లక్ష్మీపతి భార్య తమ్ముడితో. ‘ఇదిగో! తీరిగ్గా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవ్. ఐదు నిమిషాలకు ఆఖరి బస్సుంది’ అని, ఏదో చెప్పబోతున్న భార్య నోరు మూసేస్తాడు లక్ష్మీపతి. ‘‘ఇందిగో వెంకట్రావ్. తర్వాత స్టాపులో చంద్రభవన్ అని హోటల్ ఉంది. అక్కడ నా పేరు చెప్పి స్పెషల్ భోజనం చేసి, ఏడో ఎనిమిదో ఇచ్చేయ్. టైమవుతోంది బయలుదేరు’’ అంటూ సూట్‌కేసు తీసి వెంకట్రావుకిస్తాడు లక్ష్మీపతి ‘అహనా పెళ్లంట’ చిత్రంలో. పండ్ల బుట్ట ఇక్కడే ఉంచు! లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు)కి వెంకట్రావు (సుత్తి వీరభద్రరావు) బావమరిది. లక్ష్మీపతి పరమ పిసినారి. అక్క, బావలను చూద్దామని వస్తూ పండ్లు తెస్తాడు వెంకట్రావు. లక్ష్మీపతి ‘ఈ పండ్లన్నీ మాకే... నీ చాదస్తం... మీ ఇల్లూ మా ఇల్లూ ఒక్కటి కాదేమిటి... అంటూ బుట్ట లాగేసుకుంటాడు లక్ష్మీపతి. లక్ష్మీపతి భార్య కాఫీ తీసుకొస్తానంటూ ఇంట్లోకి వెళ్లబోతుంటే.. ‘ఎండలు మండిపోతుంటే కాఫీ అంటావేంటే? చల్లటి మంచి నీళ్లు తీసుకురా’ అంటాడు.అందరూ మాటల్లో ఉండగా... ‘అరగంట్లో వడ్డించేస్తాను’ అంటుంది లక్ష్మీపతి భార్య తమ్ముడితో. ‘ఇదిగో! తీరిగ్గా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవ్. ఐదు నిమిషాలకు ఆఖరి బస్సుంది’ అని, ఏదో చెప్పబోతున్న భార్య నోరు మూసేస్తాడు లక్ష్మీపతి. ‘‘ఇందిగో వెంకట్రావ్. తర్వాత స్టాపులో చంద్రభవన్ అని హోటల్ ఉంది. అక్కడ నా పేరు చెప్పి స్పెషల్ భోజనం చేసి, ఏడో ఎనిమిదో ఇచ్చేయ్. టైమవుతోంది బయలుదేరు’’ అంటూ సూట్‌కేసు తీసి వెంకట్రావుకిస్తాడు లక్ష్మీపతి ‘అహనా పెళ్లంట’ చిత్రంలో. – మంజీర -
ప్రముఖుల ఇంట విషాదాలు!
►కుమారుల్ని కోల్పోయిన వారే ఎక్కువ ►మితిమీరిన వేగమే ప్రధాన కారణం ►చాలా ప్రమాదాలు ఓఆర్ఆర్ పైనే.. సిటీబ్యూరో: సిటీ కేంద్రంగా తరచుగా ప్రముఖుల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు అనేక మంది వీఐపీల వారసుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అత్యధికం మితిమీరిన వేగం వల్ల జరిగినవే. ఈ దుర్ఘటనల్లో కుమారుల్ని కోల్పోయిన ప్రముఖులే ఎక్కువగా ఉంటున్నారు. వీటిలో ఎక్కువగా ఓఆర్ఆర్పై జరిగినవే ఉన్నాయి. ప్రమాదానికి కారణమైన వాహనాలు సైతం హైస్పీడ్, ఇంపోర్టెడ్వి కావడం గమనార్హం. ►2003 అక్టోబర్ 12న అప్పటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాబూమోహన్ పెద్ద కుమారుడు పి.పవన్‌కుమార్ రసూల్‌పుర నుంచి జూబ్లీహిల్స్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్ డివైడర్‌ను ఢీకొనడంతో చనిపోయారు. ►2010 జూన్ 20న ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్ హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హైస్పీడ్ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ►2011 సెప్టెంబర్ 11న హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్రోడ్పైన పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. ఆ సమయంలో ఈయన ప్రయాణిస్తున్న హైఎండ్ బైక్ ప్రమాదానికి గురైంది. ►2011 డిసెంబర్ 20న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. దీంతో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. ►2012 ఆగస్టు 21న మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ ఓఆర్ఆర్పై దుర్మరణం చెందారు. ఈయన ప్రయాణిస్తున్న కారు టర్నింగ్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది. ►2015 నవంబర్ 25న మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనుమడు వరుణ్ పవార్, బంధువు రాహుల్ పవార్ సహా ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను బలంగా ఢీ కొంది. ►2016 మే 17న మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను (క్రాష్ బ్యారియర్) బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి (52), డ్రైవర్ స్వామిదాసు (52) అక్కడిక్కడే కన్నుమూశారు. -
డై..లాగి కొడితే....
సినిమా : ఛత్రపతి రచన: ఎం. రత్నం, దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి శ్రీలంక నుంచి వలస వచ్చిన వారితో వైజాగ్ పోర్ట్ ఏరియాను బేస్ చేసుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయిస్తుంటాడు బీహార్ నుంచి వచ్చి స్థిరపడ్డ రౌడీ బాజీరావ్ (నరేంద్ర ఝా). ఓ సందర్భంలో బాజీరావ్ అనుచరుణ్ణి చంపేస్తాడు శివాజి (ప్రభాస్). దాంతో స్వయంగా బాజీరావ్ రంగంలోకి దిగితే, అతణ్ణి కూడా చంపేస్తాడు శివాజి. పోర్ట్ ఏరియాలో ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్న మంత్రి అప్పలనాయుడు (కోటా శ్రీనివాసరావు) వద్దకు బాజీరావ్ శవంతో వెళతాడు. ‘వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే...?’ నా ఏరియాలో ఇంక ఎవ్వడూ అడుగు పెట్టకూడదు’ అంటూ అప్పలనాయుడికి వార్నింగ్ ఇస్తాడు శివాజి. ఈ డైలాగ్ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కోట శ్రీనివాస రావు
-
హోల్ ఆంధ్రాలో సోలో అందగాడు
హిట్ క్యారెక్టర్ సినిమా పేరు : మామగారు (1991) డెరైక్ట్ చేసింది : ముత్యాల సుబ్బయ్య సినిమా తీసింది : ‘ఎడిటర్’ మోహన్ మాటలు రాసింది : తోటపల్లి మధు ‘హోల్ ఆంధ్రాలో సోలో అందగాడు’ ఎవరో తెలుసా? ఇంకెవరు మన బాబూమోహనే. ‘ఈ ప్రశ్నకి బదులేది?’ సినిమాలో రెండు సీన్ల రిక్షావాడి వేషంతో ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యింది. ‘అంకుశం’లో ‘పాయే పాయే’ అంటూ ఓ మెరుపులా మెరిశాడు. ‘మామగారు’లో ముష్టివాడి వేషంతో గవర్నమెంట్ ఉద్యోగం మానేసేంత బిజీ అయిపోయాడాయన. కోట శ్రీనివాసరావు-బాబూమోహన్‌ల కాంబినేషన్ అంటే అప్పట్లో బాక్సాఫీస్‌కి ఓ మంచి కిక్. ‘మామగారు’ తర్వాత కోట-బాబూ మోహన్ కలిసి చాలా చాలా సినిమాలు చేశారు. బాబూమోహన్‌ను కోట కాలితో తన్నే సీన్లు, బాబూమోహన్ కౌంటర్లు... ఇవన్నీ ‘మామగారు’ విజయంలో మసాలా దినుసులు. ఆ ఊళ్లో మోస్ట్ బిజీయెస్ట్ ఖాళీగా ఉండే పర్సన్ అంటే ఒకే ఒక్కడు. పేరు పోతురాజు. పైన పటారం లోన లొటారం టైపు. సిల్కు చొక్కా మడత నలగకుండా తెగ బిల్డప్పులిచ్చేస్తుంటాడు. ఇస్త్రీ లేకుండా చెడ్డీ కూడా వేసుకోనని తెగ కోతలు కూడా కోస్తుంటాడు. ఇలా ఎన్ని చేసినా ఊళ్లో ఒక్కడంటే ఒక్కడు కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. వీధి అరుగు మీద కూర్చుని దారిన పోయే వాళ్లని పేకాట ఆడదాం రారండోయ్ అంటూ ఇన్వైటింగ్ చేసేస్తుంటాడు. అందరూ ఛీకొట్టి పోతుంటారు. దాంతో పోతురాజుకి ఎక్కడో కాలుతుంది. ఎవడో ఒకణ్ణి తన వెంట బంటులాగా తిప్పుకోవాలని ట్రయ్యింగ్ చేస్తుంటాడు. చివరకు ఒక బకరా దొరుకుతాడు. ఆ ఊరికి హోల్ అండ్ సోలో ముష్టివాడు. ఇతగాడికి నలుపు రంగెక్కువ. పొట్ట ఎక్కువ. దానికి ఆకలెక్కువ. ఫైనల్‌గా వీడికి టెక్కు కూడా ఎక్కువే. ఫర్ ఎగ్జాంపుల్... ఓ ఇంటి ముందు నిలబడి ‘అంబే’ అని అరుస్తూ అడుక్కుంటుంటాడు. ఆ ఇంటావిడ పోన్లే పాపం అని ప్లేట్ నిండా ఫుడ్ ఐటమ్స్ తీసుకుని బయటికొస్తుంది.‘‘ఆ పిలుపేంట్రా..! ‘అంబే’ అని అరిచేది నువ్వో, గేదో తెలీక చస్తున్నాం’’ అంది కోపంగా.‘‘మా తాతల కాలం నుంచి ‘అమ్మా’ అని అడుక్కోవడం మామూలైపోయింది. అందుకే వెరైటీగా ఉంటుందని ‘అంబే’ అంటున్నా. ఏమ్మా! గొంతు బాలేదా?’’ అని గోరోజనంగా అడిగాడు వాడు. ఆవిడకు తిక్కరేగి, ‘‘నీది పెద్ద ఘంటసాల గొంతు మరీ’’ అని విసుక్కుని తాను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అతని ప్లేట్లోకి వంపింది. వాడు చాలా చిరాగ్గా ఈ ఐటమ్స్ వంక చూసి ‘‘ఏంటమ్మా ఇది... చారా? ఈ చారులు, పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత చేపల కూరో, చికెన్ కూర్మానో వండొచ్చు కదా’’ అని గొణిగాడు.‘‘నిన్ను కాష్ఠంలో పెట్టా! నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగర్రా. పోరా పో’’ అని కోపంగా గుడ్లురిమిందామె. ‘‘పోతాం లేమ్మా! పోకపోతే నీతో కాపురం చేస్తామా... నీ ఇల్లు కాకపోతే వంద ఇళ్ళు’’ అని విసురుగా పోయాడు వాడు. పోతురాజు అరుగు మీద దర్జాగా కూర్చుని ముష్టివాణ్ణి పిలిచాడు. ‘‘ఏంటన్నా’’ అంటూ వచ్చి సరాసరి పోతురాజు పక్కనే సెటిలయ్యాడు వాడు.పోతురాజు వాడివైపు ఎగాదిగా చూసి ‘‘ఏంట్రా నల్లపెంకు... నా పక్కన కూర్చున్నావ్. నీకూ నాకూ ఎంత తేడా ఉందో తెలుసా?’’ అని హూంకరించాడు. వాడు ఏ మాత్రం తగ్గలేదు. ‘‘తెలుసన్నా... కనీసం నేను అడుక్కుంటున్నాను. నువ్వు అది కూడా చేయడం లేదు కదా’’ చెప్పాడు వాడు టెక్కుగా. ‘‘ఏంట్రోయ్... పది కొంపల పులుసు తినేసరికి ఒళ్లు బలిసిందిరా నాయాలా... వెళ్లు... కింద కూర్చో’’ అని గట్టిగా అరిచాడు పోతురాజు. దాంతో వాడు కింద కూర్చున్నాడు. ‘‘ఒరేయ్ సీమపంది... చిల్లర ఎంతుందిరా?’’ అడిగాడు పోతురాజు. వాడు ఏ మాత్రం తడుముకోకుండా ‘‘జేబులోనా? బ్యాంకులోనా?’’ అన్నాడు.‘‘ఆ... నీ మొహానికి బ్యాంకు ఎకౌంటు ఒకటా?’’ ‘‘ఏం నీకు లేదా?’’‘‘ముయ్... ఎదవ ప్రశ్నలేశావంటే నరుకుతా. తొందరగా తినడం పూర్తి చేసిరా. ఒక ఆట వేసుకుందాం. చేయి గులగుల్లాడిపోతోంది.’’ ‘‘ఉండన్నా! ముందు అన్నం తినాలి. ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది.’’ ‘‘ఏం కూరల్రా?’’ ‘‘ఏం ఉందిలే అన్నా... చేపల పులుసు.. చింత చిగురు పప్పు.. కోడిగుడ్ల ఫ్రై... రెండు పచ్చళ్లు... మీ ఇంట్లోంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది.’’‘‘తమరు తినే భోజనం ప్రైమ్‌మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేడు. అదృష్టవంతుడివి.’’‘‘గొంతు సవరించి గట్టిగా ‘అబ్బా’ అని అరువ్. నా అదృష్టం నీక్కూడా పట్టుద్ది.’’ ‘‘అంటే నన్ను కూడా అడుక్కోమంటావా’’ అంటూ వాడి మీద ఇంతెత్తున లేచి కాలితో ఒక్క తన్ను తన్నాడు పోతురాజు. పొలం గట్ల మీద పోతురాజు దొరబాబులాగా నడుస్తుంటే, వెనుక గొడుగు పట్టుకుని ముష్టివాడు. ఒకడెవడో తనను చూసి దణ్ణం పెట్టలేదని చాచి ఒక్క లెంపకాయ ఇచ్చాడు పోతురాజు. ఇంకొకడు నడుముకు తుండుగుడ్డ కట్టుకున్నాడని వాడికీ క్లాస్ పీకాడు. ఆ ఊరి ప్రెసిడెంట్‌కి సొంత బావనైన తనను అందరూ రెస్పెక్టింగ్ చేసెయ్యాలన్నది పోతురాజుగారి ఉద్దేశం. ఇది ముష్టివాడు కనిపెట్టేశాడు. నీ అజమాయిషీ గురించి నువ్వే చెప్పుకుంటుంటే చీపుగా ఉంది. నీ లెవెల్‌ని నేను ఎడల్పు చేస్తా పదా’’ అన్నాడు ముష్టివాడు. పోతురాజు ముందు నడుస్తున్నాడు. వెనుక ముష్టివాడు.ఒకడు కాల్వలో ఎద్దును కడుగుతున్నాడు. వాడి ఒంటి మీద గోచి గుడ్డ మినహా ఇంకేం లేదు. ‘‘రేయ్ రా... అలా తుమ్మమొద్దులా నిలబడి చూస్తున్నావ్... రారా’’ అని పిలిచాడు ముష్టివాడు. వాడు దండాలు పెట్టుకుంటూ వచ్చాడు. ‘‘ఈయనెవర్రా? ప్రెసిడెంట్‌గారికి బావగారు. అంటే ఓసీగా తిని తిరిగే ఎదవ కాదుగా. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోచీ కట్టుకుని నిలబడతావా? ముందా గోచీ తియ్యి’’ అని ముష్టివాడు మీద పడి రక్కినంత పని చేసేసరికి, వాడు విప్పేసి దీనంగా... నగ్నంగా పోతురాజు ముందు నిలబడ్డాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని రెండు కళ్లతో చూడలేక కెవ్మని అరిచి, కయ్‌మని ముష్టివాడు మీద కాలెత్తాడు పోతురాజు. పాపం పరిస్థితులు అనుకూలించక పోతురాజు కూడా వీధి అరుగు మీద పడుకోవాల్సిన పరిస్థితి. ఆ పక్క బెడ్ - ముష్టివాడిది. పొద్దునే ఒకడొచ్చి ముష్టివాణ్ణి నిద్రలేపి ‘‘అన్నా... నీకు టీ’’ అని ఇచ్చాడు. పక్కనే ఉన్న పోతురాజు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ‘‘ఈడు నా అసిస్టెంట్’’ అని పరిచయం చేసి ‘‘ఏరా పేపర్ తెచ్చావా?’’ అనడిగాడు ముష్టివాడు. ‘‘ఇంగ్లీషు పేపర్ రాలేదన్నా. తెలుగు పేపర్ తెచ్చా’’ చెప్పాడు వాడు వినయంగా. ముష్టివాడు విసుగ్గా ‘‘ఊ... తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటాయ్’’ అనుకుంటూ ఆ పేపర్ తిరగేస్తుంటే పోతురాజు షాక్. ‘‘రేయ్... నువ్వెళ్లి కాకా హోటల్లో నా కోసం చికెన్ కూర్మా, పరోటాలు రాత్రివి ఉంటాయి. తీసుకొచ్చేశేయ్’’ అని అసిస్టెంటుకి పురమాయించి, ముష్టివాడు మళ్లీ పేపర్లో మునిగిపోయాడు. ఇదంతా చూసి పోతురాజుకు నోట మాట రాలేదు. రేడియోలో న్యూస్ వింటూ గుడి బయట దర్జాగా అడుక్కుంటున్నాడు ముష్టివాడు. ఒకతను వచ్చి 10 పైసలు దానం చేసి వెళ్లబోయాడు. ఈ ముష్టివాడు అతణ్ణి పిలిచాడు. ‘‘ఇదిగో పెద్దాయినా... పది పైసలు ముష్టి వేసి తార్రోడ్డు మీద డెరైక్ట్‌గా స్వర్గానికి వెళ్లిపోదామనే. చేయి చాపు... దీనికి యాభై పైసలు కలిపి ఇస్తున్నా. నా పేరు చెప్పి టీ తాగు పో..’’ అనేసి, అతణ్ణి పంపించేశాడు. పక్కకు తిరిగి చూస్తే పోతురాజు దేభ్యం మొహం వేసుకుని కూర్చున్నాడు.‘‘అన్నా! నీ వాటం చూస్తే తేడా కొడుతోంది. నీ మావ పోస్టు పాయే. నాన్న పోస్టు పాయే. పోన్లే... నా పోస్టు ఇస్తా... తీస్కో’’ అంటూ ముష్టివాడు తన అమ్ములపొదిలో అస్త్రం లాంటి బొచ్చెను పోతురాజుకు బహూకరించేసి వెళ్లిపోయాడు. ఆ బొచ్చెనూ, వాణ్ణీ అలాగే చూస్తూ శిలా విగ్రహంలా ఉండిపోయాడు పోతురాజు. అంతకు మించి ఏం చేయగలడు? ఎదుటోణ్ణి బకరా చేద్దామనుకుంటే మనమే బకరా అయిపోతాం మరి! - పులగం చిన్నారాయణ ఈ పాత్రకు ముందు బ్రహ్మానందాన్ని అనుకున్నారు! తమిళంలో సూపర్ హిట్ అయిన ‘నాన్ పుడిచ్చ మాపిళ్లయ్’ని తెలుగులో ‘మామగారు’గా రీమేక్ చేశారు ‘ఎడిటర్’ మోహన్. ఒరిజినల్ వెర్షన్లో గౌండ్రమణి-సెంథిల్‌పై చిన్న కామెడీ ట్రాక్ ఉంది. దాన్ని ‘అహ నా పెళ్లంట’ తరహాలో కోట-బ్రహ్మానందంపై చేద్దామన్నారు ‘ఎడిటర్’ మోహన్. నాకేమో ఆ పాత్రకు బ్రహ్మానందం కంటే బాబూమోహన్ అయితే కరెక్ట్ అనిపించింది. అంతకు ముందే ‘అంకుశం’లో అతని యాక్టింగ్ చూసి ఇంప్రెసయ్యా. ‘ఎడిటర్’ మోహన్ కూడా కోట-బాబూమోహన్ కాంబినేషన్‌కు ఓకే చెప్పారు. తమిళ వెర్షన్ కన్నా బ్రహ్మాండంగా ట్రాక్ పెంచి రాశా. షూటింగ్ టైమ్‌లోనే అందరూ తెగ ఎంజాయ్ చేశారు. ఎక్స్ట్రార్డినరీగా వర్కవుట్ అయ్యిందీ ఎపిసోడ్. ఈ సినిమా తర్వాత కోట-బాబూమోహన్ కాంబినేషన్ లేకుండా దాదాపుగా ఎవ్వరూ సినిమాలు చేయలేదు. అంతలా సూపర్హిట్టయ్యిందీ కాంబినేషన్. ‘ఏ ముహూర్తాన రాశారో కానీ అదిరిపోయిందయ్యా’ అంటూ కోట-బాబూమోహన్ ఎప్పుడు కనిపించినా నన్ను అభినందిస్తుంటారు. - తోటపల్లి మధు, రచయిత -
పరమ పీనాసి ప్రభువు..
పీనాసితనానికి పరాకాష్ట అంటే మనకు వెంటనే జంధ్యాల సృష్టించిన లక్ష్మీపతి పాత్రలో కోట శ్రీనివాసరావు నటనే గుర్తుకొస్తుంది. అంతకు మించిన పీనాసి ఒకడు బ్రిటన్‌లో ఉండేవాడు. అతగాడి పేరు జాన్ ఎల్విస్. అతగాడేమీ సామాన్యుడు కాదు. బెర్క్‌షైర్ నియోజకవర్గానికి ఎంపీగా దాదాపు ఒక పుష్కరకాలం (1772-84) వెలగబెట్టాడు. ఎల్విస్‌కు నాలుగేళ్ల వయసులోనే అతడి తండ్రి పోయాడు. పోతూ పోతూ లక్ష పౌండ్ల (ఇప్పటి విలువ ప్రకారం 1.30 కోట్ల పౌండ్లు) ఆస్తి, బెర్క్‌షైర్ (ఇప్పటి ఆక్స్ఫర్డ్షైర్) ప్రాంతంలో సువిశాలమైన ఎస్టేట్‌ను విడిచిపెట్టాడు. ఎల్విస్ తల్లి అమీ పరమ పీనాసి. ఆమె పెంపకంలో చిన్నప్పటి నుంచే అతగాడి పీనాసి లక్షణాలన్నీ వంటబట్టాయి. కొన్నాళ్లకు తల్లి చనిపోయాక మేనమామ సర్ హార్వే ఎల్విస్ పంచన చేరాడు. అప్పటికి హార్వే ఎంపీగా ఉండేవాడు. అతగాడు మరింత పీనాసి. హార్వే 1763లో బాల్చీ తన్నేయడంతో ఎల్విస్‌కు అతగాడి ఆస్తి 2.5 లక్షల పౌండ్లు (ఇప్పటి విలువ ప్రకారం 2.4 కోట్ల పౌండ్లు) కలిసొచ్చింది. ఇంత ఆస్తి అప్పనంగా కలిసొచ్చినా జాన్ ఎల్విస్ ఏనాడూ కులాసాలకు కాదు కదా, కనీస అవసరాలకు సైతం ఖర్చు చేసేవాడు కాదు. తిండి కోసం ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడేవాడు. పారవేసే పరిస్థితిలో ఉన్న పదార్థాలను కూడా తినేవాడు. కొవ్వొత్తులకు ఖర్చెందుకని చీకటిపడే వేళకు ముసుగు తన్నేసేవాడు. బిచ్చగాళ్లను తలపించే వస్త్రధారణతో రోడ్ల మీద తిరుగుతుంటే జనాలు అతడిని చూసి జాలిపడి, చేతిలో చిల్లర వేసేవారు. ఆ చిల్లరను కూడా కాదనకుండా తీసుకొని, నిక్షేపంగా జేబులో వేసుకొనేవాడు. పీనాసితనం వల్ల సరైన తిండి తినక శుష్కించిపోయి, 75 ఏళ్ల వయసులో మంచానపడి మరణించాడు. ఇతగాడి ప్రభావంతోనే చార్లెస్ డికెన్స్ తన నవల ‘ఎ క్రిస్మస్ కారోల్’లో ఒక పాత్రను సృష్టించాడు. కూర్పు: పన్యాల జగన్నాథదాసు -
జూలై 10 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కోట శ్రీనివాసరావు (నటుడు); సునీల్ గవాస్కర్ (క్రికెటర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతుగ్రహానికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై మొగ్గు చూపుతారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆలయ సందర్శన కోరిక నెరవేరుతుంది. మానసిక పరిపక్వత, ఆధ్యాత్మికత బాగా పెంపొందుతాయి. విదేశాలలో విద్య, ఉద్యోగావకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు పుట్టిన తేదీ 10. అంటే 1 (1+0=1) ఇది రవికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల స్వాభావికంగానే మీకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. దేవాలయాలను నిర్మించటం, ట్రస్ట్‌లను నిర్వహించడం, పదవులను చేపట్టడం వంటి వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులను చేపట్టకుండా పాతవాటినే కొనసాగించడం మంచిది. హాస్పిటల్, బ్యాంకింగ్, పెట్రోల్, ఎగుమతి- దిగుమతుల రంగాలలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల బాధ్యతలు తీరతాయి. మెడిటేషన్ చేయడం మంచిది. లక్కీ నంబర్స్: 1, 2, 5, 6, 7; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గ్రే, గోల్డెన్; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్ర వారాలు. సూచనలు: అమ్మవారిని పూజించడం, సర్పదోష నివారణ పూజలు చేయించడం, వికలాంగులకు, అనాథలకు సహకరించడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది. - డా. ముహమ్మద్ దావూద్ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ : కోట శ్రీనివాస రావు
-
హన్నన్న... నాకేంటి? నాకేంటని?
‘‘గయ్యాళితనం అంటే సూర్యకాంతం గుర్తొస్తారు. అలాగే పిసినారితనం అంటే ఈ పాత్ర గుర్తుకు రావాల్సిందే. ఒక సామెతలా మిగిలిపోయిన పాత్ర ఇది. పిసినారి పాత్రలు ఎన్నొచ్చినా దీన్ని కొట్టేదే లేదు’’ - కోట శ్రీనివాసరావు ఆ పాత్రతో కెమిస్ట్రీ బాగా కుదిరింది ‘‘నటుడిగా నాకది ఏడవ సినిమా. అప్పటివరకూ చేసినవన్నీ చిరు పాత్రలే. దీనిలో పాత్రతో నాకు బ్రేక్ వచ్చింది. కోట చేసిన లక్ష్మీపతి పాత్రకు నేను అసిస్టెంట్‌ని. ఆయన పిసినారితనానికి ప్రతి క్షణం బలయిపోతుంటానన్నమాట. ఈ రెండు పాత్రల మధ్యా మంచి కెమిస్ట్రీ కుదిరింది. లక్ష్మీపతి పాత్రలో కోట శ్రీనివాసరావును తప్ప ఇంకెవరినీ ఊహించలేం. అంత బాగా జీవించారాయన.’’ - బ్రహ్మానందం హూ ఈజ్... వాష్ బేసిన్లో చేపలు పట్టేవాడు? పోనీ... శవం మీద మరమరాలేరుకునేవాణ్ణి ఎక్కడైనా చూశారా? ఎర్రటి ఎండలో వేణ్ణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకుని తిరిగేవాడు... శవం మీద కప్పిన గుడ్డ ఎత్తుకెళ్లిపోయి చొక్కా కుట్టించుకునేవాడు... ఇలాంటివాళ్లు ఎక్కడైనా కనబడ్డారా? అయితే మీకు ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న ఒక వ్యక్తిని పరిచయం చేయాల్సిందే. అర్జంట్‌గా ‘అహ నా పెళ్లంట’ (1987) మూవీ డీవీడీ ప్లే చేయండి. సరిగ్గా 63వ నిమిషంలో ఎంటర్ ది డ్రాగన్. నిజంగానే అతను డ్రాగన్ కన్నా పదునైనవాడు. పదునంటే పిసినారితనంలోనేనండోయ్..! పేరు లక్ష్మీపతి. లక్ష్మీదేవిని తన ఇంటి బీరువాలోనే బంధించేద్దామనుకునే డబ్బు వెర్రి పిచ్చివాడు. ఇతని గురించి మనకంటే... గోవిందం బాగా చెబుతాడు. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు ఎవ్వడూ ఉండడని మొహం మీద తిట్టేశాడు. ఆఫ్ట్రాల్ అతని అసిస్టెంటు అన్నేసి మాటలన్నాడంటే ఎన్ని తిప్పలు పెట్టుంటాడో ఇమేజిన్ చేసుకోండి. ఇమాజిన్ అంటే గుర్తొచ్చిందండోయ్... మీకు చికెన్ కర్రీ తినాలని ఉందనుకోండి.. ఏం చేస్తారు? కోడి కొనుక్కుని... దానికి మసాలా దట్టించి కిచెన్‌లో కూరొండేస్తారు. అదే లక్ష్మీపతి అయితే ఏం చేస్తాడో తెలుసా? ఎదురుగా బతికున్న కోడిని వేలాడదీసుకుని వట్టి అన్నం తింటూ కోడికూర తిన్నట్టుగానే లొట్టలేసుకుంటుంటాడు. ఇమాజినేషన్‌కి పరాకాష్ఠ అంటే ఇదేనేమో! నిజంగా పిసినారి సంఘం అనేది ఉంటే కనుక కచ్చితంగా లక్ష్మీపతి ప్రెసిడెంట్‌గా యునానిమస్‌గా ఎలక్ట్ అయిపోతాడు. అబ్బబ్బా... ఇతగాడి చేష్టలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. సొంత బామ్మర్దికే బస్టాప్‌లో టీ అమ్ముతూ కనబడి పిచ్చెక్కించేశాడు. అమ్మో అమ్మో... ఇంకా నయం. కొంచెం ఉంటే భార్యతో పేపర్ శారీ కట్టించినా కట్టించేసేవాడు. ఈ పిసినారి లక్ష్మీపతి కూతుర్నే మన హీరో లవ్వాడతాడు. ఈ లక్ష్మీపతిని ఒప్పిస్తే తప్ప, ఆ పద్మకు పతి కాలేడు. అందుకే నానా తిప్పలు పడతాడు. సీత కోసం రాముడు చాలా ఈజీగా విల్లు విరిచేశాడు కానీ, ఈ డబ్బు జబ్బున్న లక్ష్మీపతి మనసు మార్చడం చాలా కష్టం. ఆ తంటాలూ తిప్పలే ‘అహ నా పెళ్లంట’ సినిమా. కోట శ్రీనివాసరావుని సూపర్ స్టార్‌ని చేసిన పాత్ర లక్ష్మీపతి. పిసినారి అనగానే టకీమని లక్ష్మీపతి గుర్తుకు రావాల్సిందే. ‘‘హన్నన్నా... నాకేంటి? నాకేంటని’’ అంటూ అరచేతులతో తప్పెట కొడుతూ అడగడాన్ని మనం ఎన్నిసార్లు సరదాగా ఫాలో అయ్యుంటాం కదా. మొదట రావు గోపాలరావుతో వేయిద్దామనుకున్నారీ పాత్ర. కానీ కోటకు రాసిపెట్టి ఉంది. అసలు గెటప్పే సూపర్. ముతక పంచె - బనీను...పగిలిన కళ్లద్దాలతో కోట ఇచ్చే ఎక్స్‌ప్రెషన్సు, చెప్పే డైలాగులు, బాడీ లాంగ్వేజ్ ఇప్పటికీ గుర్తున్నాయంటే ఎంత ముద్రేసినట్టు! షూటింగ్ టైమ్‌లోనే నిర్మాత రామానాయుడు ‘‘ఈ పాత్ర హిట్టయితే... సినిమా సూపర్ హిట్టు’’ అనేశారు. అదే జరిగింది కూడా. ముక్తాయింపు లక్ష్మీపతి గురించి ఇంకా పేజీల కొద్దీ రాయొచ్చు. కానీ ఈ పిసినారితనం ఉంది చూశారూ... అందుకే సింగిల్ పేజీలోనే హిస్టరీ అంతా చెప్పేశాం. పిసినారితనం... జిందాబాద్! - పులగం చిన్నారాయణ దటీజ్ జంధ్యాల! ఒక వేదిక మీద ఒక డెరైక్టర్ జంధ్యాలను పలకరిస్తూ-‘‘మీరు తీసే కామెడీ సినిమాల గురించి అందరూ గొప్పగా చెబుతుంటారు... నాకేమో నవ్వేరాదు’’ అన్నాడట.ఈ కామెంట్‌కు జంధ్యాల ఇలా ఫన్పంచ్ ఇచ్చారట-‘‘మీ హారర్ సినిమాలు చూస్తే మాత్రం నాకు భలే నవ్వొస్తుందండీ’’ దటీజ్ జంధ్యాల! ఆయన సృష్టించిన లక్ష్మీపతి క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా!! -జోష్ రవి, నటుడు కొత్త అంశాలతో ఈ పిసినారిని డిజైన్ చేశాం! ‘‘‘పల్లకి’ వారపత్రికలో నేను రాసిన ‘సత్యంగారి ఇల్లు’ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. అయితే నవలలో లక్ష్మీపతి పాత్ర పిసినారే కానీ ఇంత కామెడీగా ఉండదు. సినిమా కోసం ఈ పాత్ర నిండా కామెడీ చేర్చాం. పిసినారి పాత్రలు వెండితెరపై బాగా పాపులర్. వాటన్నిటికన్నా పూర్తి భిన్నంగా ఉండే ఉద్దేశంతో ఎన్నో కసరత్తులు చేసి చాలా కొత్త అంశాలతో లక్ష్మీపతి పాత్రను తీర్చిదిద్దాం. ’ - ఆదివిష్ణు, రచయిత లక్ష్మీపతి హిట్ డైలాగ్ ‘‘ఆ శరీరాలు చూశావా...! వాటిని తోమాలి అంటే తొంబై బావుల నీళ్లు కావాలి. ఏనుగులు, అవీ జలకాడినట్టు చెరువులు, సరస్సులే తప్ప చెంబులు, చేదలు పనికి రావు ఆ దేహాలకు. ఇక భోజనం అన్నావో...అంతే! కుంభాలకు కుంభాలు లాగించేస్తారు శుంఠలు. వంద ఎకరాల పంట వండిపెట్టాలి వాళ్లకు.’’ -
పద్మశ్రీ అందుకున్న కోటా శ్రీనివాసరావు
-
'చాలా ఆనందంగా ఉంది'
న్యూఢిల్లీ: తన ఇనేళ్ల సినీ ప్రస్థానం సంతృప్తికరంగా ఉందని ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించి గౌరవించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా ఎన్నికల్లో వివాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో కోటా శ్రీనివాసరావుతో పాటు ప్రముఖ కేన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలిరాజ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. -
కోట, ప్రకాష్‌రాజ్ పాత్రలే ఆదర్శం
విలక్షణ నటులు కోట శ్రీనివాస్‌రావు, ప్రకాష్‌రాజ్‌ల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని, వారి నటనే తనకు ఆదర్శమని సినీ ఆర్టిస్ట్ శ్రావణ్ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఆయన తమ సమీప బంధువుల గృహప్రవేశానికి శనివారం సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రావణ్ తన మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. -సిద్దిపేట అర్బన్ సాక్షి: ప్రస్తుతం మీరు ఎన్ని సినిమాలలో నటిస్తున్నారు. శ్రావణ్: ప్రస్తుతం నేను ఆరు సినిమాల్లో నటిస్తున్నాను. పండగ చేసుకో సినిమాలో హీరో రామ్‌కు మామయ్యగా, హీరో బాలకృష్ణ నటిస్తున్న లయన్ సినిమాలో ప్రకాష్ రాజ్‌కు తమ్ముడిగా నెగెటివ్ రోల్ పోషిస్తున్నాను. సాయికిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న అల్లరి నరేష్ సినిమా లో విలన్ పాత్ర, కొరటాల శివ డెరైక్షన్‌లో మహేష్‌బాబు నటిస్తున్న శ్రీమంతుడు సినిమాలో విలన్‌గా నటిస్తున్నా. తమిళంలో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వైశాలి హీరో ఆది సరసన సెకండ్ హీరో రోల్ చేస్తున్నాను. కన్నడంలో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సజ్జు చేస్తున్న సినిమాలో విలన్‌గా చేస్తున్నాను. వైజాక్ డిస్ట్రిబ్యూటర్ రాజు తనయుడు కార్తిక్ ‘టిప్పు’ సినిమాలోనూ విలన్ పాత్ర పోషిస్తున్నాను. సాక్షి: మీరు నటించిన గోల్డెన్ ఛాన్స్ సినిమా విశేషాలు? శ్రావణ్: గోల్డెన్ ఛాన్స్ సినిమాలో హీరో హీరోయిన్ను, హీరోయిన్ హీరోను మైండ్‌గేమ్, మనిగేమ్ ఆడుతూ సినిమా ఆధ్యంతం ఆసక్తి కరంగా సాగుతుంది. సాక్షి: ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు..? శ్రావణ్: ఇప్పటి వరకు సుమారు 60కి పైగా సినిమాల్లో నటించాను. అందులో ఓ పది సినిమాల్లో పాజిటీవ్ రోల్స్ చేశాను. మిగితావన్ని నెగెటివ్ రోల్సే చేశాను. సాక్షి : మీకు గుర్తింపు, సంతృప్తినిచ్చిన పాత్రలు? శ్రావణ్ : నేను నటించిన తులసి, లెజెండ్, నమో వెంకటేష, బిందాస్, సై సినిమాలలో నటించిన పాత్రలు గుర్తింపు తేవడంతో పాటు సంతృప్తినిచ్చాయి. సైలో చోటు పాత్ర ఎంతో సంతృప్తిని కలిగించింది. సాక్షి : మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? శ్రావణ్ : అపరిచితుడు సినిమాలో విక్రమ్ చేసిన పాత్ర చేయాలని ఉంది. సాక్షి: విలన్ పాత్ర కోసం ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు..? శ్రావణ్ : కోట శ్రీనివాస్ స్ఫూర్తితో విలన్ పాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం ప్రకాష్‌రాజ్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకెళుతున్నాను. సాక్షి : హిందీలో ఏదైనా సినిమా చేశారా..? శ్రావణ్ : రాకేష్ శ్రావణ్ దర్శకత్వంలో హిందీలో అమావాస్య్ సినిమాను చేశాను. అందులో పోలీస్ అధికారి పాత్ర పోషించాను. తెలుగులో డెడ్ ఐస్‌గా రూపొందుతుంది. త్వరలోనే హిందీ, తెలుగులో రిలీజ్ కానుంది. సాక్షి: ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి..? శ్రావణ్ : ప్రేక్షకులు సినిమాను వినోదంగా మాత్రమే చూడాలి. సమాజానికి పనికి వచ్చే సినిమాలను ఆదరించాలి. సినిమాలకు ప్రాంతీయ, భాష తారతమ్యం ఉండవని భావించాలి. -
కోట శ్రీనివాసరావుతో సాక్షి ముఖాముఖి
-
నట కోట
-
నట కోట!
-
ఆరుగురు తెలుగువారికి పద్మశ్రీ అవార్డులు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఆరుగురు తెలుగు వారు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు ఒక్క తెలుగు ప్రముఖుడు కూడా ఎంపికకాలేదు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనవారిలో కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెట్ మహిళా క్రీడాకారిని మిథాలిరాజ్, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు ఉన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న కోట శ్రీనివాసరావు,అర్జున్
-
కోట శ్రీనివాసరావు బర్త్‌డే
ఇక్కడ సంతృప్తి వెతుక్కోవడం అమాయకత్వం..! విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ కోట శ్రీనివాసరావు. 36 ఏళ్ల నట ప్రస్థానంలో ఆయన చేసిన వైవిధ్యమైన పాత్రలు ఎన్నో. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా కోటతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ఆరోగ్యం ఎలా ఉంటోందండీ... బాగానే ఉంటుంది. అయితే... వయసు మీద పడుతోంది కదా... కీళ్ల నొప్పులు. ఇదివరకు చేసినంత ఉత్సాహంగా సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా? కొంతవరకు కరెక్టే. అయినా... ఈ వయసులో నాకు పరుగెత్తే వేషాలు ఇవ్వరు కదా. ఇప్పుడు స్టార్లుగా చలామణీ అవుతున్న కుర్రహీరోలకు తాతయ్యగానో, లేక బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్లకు బాబాయిగానో, తండ్రిగానో వేషాలు ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఓ అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి. అయితే... వాటి పేర్లు మాత్రం అడక్కండి. ఎందుకంటే... నాకు గుర్తుండవు. మీ స్థాయికి తగ్గ పాత్రలు ఇప్పుడు వస్తున్నాయంటారా? నాకు తెలిసి ఈ తరంలో నాకు దక్కిన అదృష్టం ఎవరికీ దక్కలేదు. నా 36 ఏళ్ల సినీ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ ఎన్నో మంచి పాత్రలు పోషించాను. ఇక ఇప్పుడు చేస్తున్న పాత్రలు అంటారా! వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే... కథల్ని ఎంచుకునే తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నేటివిటీతో పనిలేదు. సంస్కృతి, సంప్రదాయాలతో నిమిత్తం లేదు. ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్రలు. ఇలాంటి సందర్భంలో సంతృప్తి కోసం వెతుక్కోవడం అమాయకత్వం. అందుకే భుక్తి కోసం నటిస్తున్నా. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు కదా. ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమైనా ఉన్నాయా? సమకాలీన సమాజం నుంచి రోజుకొక కొత్త పాత్ర పుట్టుకొస్తోంది. ఆ రకంగా చూస్తే చేయాల్సిన పాత్రలు కోకొల్లలు. ఇదివరకు పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం, కౌబాయ్ ఇలా అయిదు రకాల సినిమాలుండేవి. ఇప్పుడలా కాదు. సాధ్యమైనంతవరకూ అన్నీ సమకాలీన కథాంశాలే. ఇలాంటి సందర్భాల్లోనే నటునికి పరిశీలనాత్మక దృష్టి అవసరం. రోడ్డు మీదకెళ్లి నిలబడితే... రకరకాల పాత్రలు కనిపిస్తాయి. అంతెందుకు కాసేపు అసెంబ్లీని చూడండి.. మీకు భిన్నమైన మేనరిజాలు వినిపిస్తాయి. ఇవన్నీ కొత్త కొత్త పాత్రలే. నా దృష్టిలో ప్రపంచంలో పాత్రలకు కొరత లేదు. మహానటుడు ఎస్వీఆర్ కూడా అన్ని పాత్రలూ చేయలేదు. చేయగలిగినన్ని చేసి నిష్ర్కమించారు. నేనూ అంతే. తెలుగు నేలపై ఉన్న యాసలన్నీ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఎలా నేర్చుకున్నారు? నాకు ప్రతిదీ అబ్జర్వ్ చేయడం అలవాటు. అలాగే యాసలన్నీ నేర్చుకున్నాను. రాయలసీమకు చెందిన పాత్ర చేశాననుకోండి. డబ్బింగ్ థియేటర్లో, రాయలసీమకు సంబంధించిన వాళ్లను పక్కన పెట్టుకొని డబ్బింగ్ చెబుతా. అలాగే తెలంగాణ... శ్రీకాకుళం... గోదావరి.. ఇలా అన్ని మాండలికాలే. కానీ, మీరలా మాట్లాడుతుంటే మా యాసను, భాషను గేలి చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయిగా? చూడండీ... ‘ఇది నా భుక్తి’ అనుకుంటే ఫర్లేదు. కానీ.. ‘ఇది నా బిజినెస్’ అనుకుంటేనే సమస్యలన్నీ. ఈ విషయంలో నటీనటులకు వచ్చిన భయమేం లేదు. కథను బట్టి, పాత్ర చిత్రణను బట్టి మా నటన ఉంటుంది. నా వరకు నేను మాట్లాడే ఏ యాస అయినా... వినోదభరితంగా ఉంటుంది తప్ప, అవమానకరంగా ఉండదు. మెగాఫోన్ పట్టుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా? ఎవడు చేసే పని వాడు చేయాలి. అనవసరపు రిస్క్ ఎందుకు? నాకు తెలిసింది నటన. అంతే. మనవళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? వాళ్లు చిన్న పిల్లలు. ఒకడు ఏడు, ఇంకొకడు మూడు చదువుతున్నారు. రావుగోపాలరావు వారసుడు కోట అంటారు చాలామంది. మరి మీ వారసుడు ఎవరంటే? మీరే చెప్పండి? మేం చెప్పలేం సార్... నేనెలా చెప్పగలను. గోపాలరావుగారి తరహా పాత్రలు నేనూ చాలా చేశాను. కానీ.. నా తరహా పాత్రలు చేసి మెప్పించే నటులు కనిపించడం లేదే! అదే నా బాధ. రావుగోపాలరావుగారితో మీ అనుబంధం ఎలా ఉండేది? అయనతో ఓ పది సినిమాల దాకా పనిచేశాను. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. ‘నీ డైలాగ్ ఫైరింజన్ గంట మోతలా ఉంటుందయ్యా..’ అనేవారు. నిజానికి ఆయన డైలాగ్ ఓ అద్భుతం. నన్ను అలా మెచ్చుకోవడం గోపాలరావుగారి సంస్కారం. ఓ సందర్భంలో ‘నాగభూషణం, రావుగోపాలరావు కలిస్తే కోట’ అని కాంప్లిమెంట్ ఇచ్చారాయన. ‘మండలాధీశుడు’లో ఎన్టీఆర్ పాత్ర చేశారు కదా. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అదో చేదు అనుభవం. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. అయితే... ఎన్టీఆర్‌గారు మహానుభావుడు. ‘బాగా నటించారు బ్రదర్’ అని అభినందించారు. ఎన్టీఆర్ గారితో నటించలేకపోవడం నా జీవితంలో ఒకే ఒక్క లోటు. ‘మేజర్ చంద్రకాంత్’లో చేయాల్సింది. కానీ.. చివరి నిమిషంలో ఆ పాత్ర పరుచూరి గోపాలకృష్ణ చేశారు. మీరు చాలామందికి ఇష్టమైన నటుడు, మరి మీకు ఇష్టమైన నటుడు? ఎస్వీరంగారావు గారు. ఆయన పేద వేషాలేసినా... ఆయనలో రాజసం కనిపిస్తుంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు జనాలు. తర్వాత తరానికి దొరికిన గొప్ప నట గ్రంథాలయం ఆయన. -
'ఆ పాత్రే నా కెరీయర్ని మలుపు తిప్పింది’
ఏపాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి పాత్రకు న్యాయం చేసే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. తనకు హాస్యంతో కూడిన విలన్ పాత్రలంటే ఇష్టమని ఆయన అన్నారు. కోట శ్రీనివాసరావు శుక్రవారం రాయవరంలోని సాయితేజా విద్యానికేతన్ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చారు.ఆ సందర్భంగా తన సినీ జీవిత విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... నాటకరంగమే పునాది నాకు నాటకాలు వేయడమంటే ఇష్టం. రంగస్థలంపై 20 ఏళ్లపాటు నటించాక అనుకోకుండా సినీరంగంలోకివచ్చాను. 1978-79లో ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన తిలకించిన దర్శక, నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా మలచారు. అందులో నటించిన నటులనే సినిమాలోకి తీసుకున్నారు. అలా తొలిసారిగా ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో నటించాను. ప్రతిఘటన మలుపు తిప్పింది.. ‘ప్రతిఘటన’ సినిమాలో ‘కాశయ్య’ పాత్ర నా సినిమా కెరీర్‌నే మలుపు తిప్పింది. పూర్తిగా సినిమాల్లో స్థిరపడ్డాక ఎస్బీఐలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను. 800 సినిమాల్లో నటించా ఇప్పటి వరకు సుమారు 800 సినిమాల్లో నటించాను. రక్షణ, గణేష్, గాయం, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, ఆమె, హలో బ్రదర్, మామగారు నటనపరంగా సంతృప్తినిచ్చాయి. క్రమశిక్షణ అవసరం నేటి యువతరంసాధన తక్కువ..వాదన ఎక్కువ అన్న చందంగా ఉంది. కఠోర సాధన, క్రమశిక్షణ, ఓర్పు నటులకు చాలా అవసరం. -
సినిమా రివ్యూ: ప్రతినిధి
నటీనటులు: నారా రోహిత్, విష్ణు, శుభ్ర అయ్యప్ప, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, గిరిబాబు, రంగనాథ్ సాంకేతిక వర్గం: సంగీతం: సాయి కార్తీక్ సినిమాటోగ్రఫి: చిట్టిబాబు ఎడిటింగ్: నందమూరి హరి దర్శకత్వం: ప్రశాంత్ మండవ ప్లస్ పాయింట్స్: నారా రోహిత్ యాక్టింగ్ డైలాగ్స్ సెకాండాఫ్ మైనస్ పాయింట్స్: ఫస్టాఫ్ బాణం, సోలో చిత్రాలతో ఆకట్టుకున్న నారా రోహిత్ ఆతర్వాత టాలీవుడ్ రేసులో వెనకపడిపోయాడు. ఆతర్వాత వచ్చిన చిత్రాలల్ఓ అనుకున్నంత మేరకు ప్రభావం చూపలేకపోయారు. అతిధి పాత్రలో 'సారొచ్చారు', 'ఒక్కడినే' చిత్రాల తర్వాత నారా రోహిత్ కు టాలీవుడ్ లో పెద్ద గ్యాప్ వచ్చింది. టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న నారా రోహిత్... పొలిటికల్ డ్రామాగా రూపొందిన 'ప్రతినిధి' చిత్రంతో 2004, ఏప్రిల్ 24 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో టీజర్ తో ఆకట్టుకున్న'ప్రతినిధి' చిత్రం ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. శ్రీను(నారా రోహిత్) ఓ జర్నలిస్ట్. కొన్ని పరిస్థితుల కారణంగా శ్రీను 'మంచోడు శ్రీను'గా మారి ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తాడు. ముఖ్యమంత్రి విడుదలకు కొన్ని షరతుల్ని విధిస్తాడు. మంచోడు శ్రీను విధించిన షరతులను ప్రభుత్వం నెరవేర్చిందా? మంచోడు శ్రీను విధించిన షరతులెంటీ? అసలు జర్నలిస్ట్ శ్రీను ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడానికి కారణాలేంటి? జర్నలిస్ట్ శ్రీను ప్రతినిధిగా మారాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'ప్రతినిధి' చిత్రం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించే శ్రీను పాత్రలో నారా రోహిత్ నటించారు. బాధ్యత కలిగిన పౌరుడిగా నటించిన నారా రోహిత్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే విపరీతంగా లావెక్కడంతో నారా రోహిత్ ను క్లోజప్ ష్టాట్స్ తోనే మేనేజ్ చేయాల్సి వచ్చింది. హీరో పాత్రలకు తగినట్టుగా నారా రోహిత్ తన శరీరాకృతిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరూ సిక్స్ ప్యాక్ తో ఆలరిస్తుంటే నారా రోహిత్ మాత్రం అందుకు భిన్నంగా కనిపించాడు. హీరోయిన్ శుభ్ర అయ్యప్ప అంతగా గుర్తింపులేని పాత్రనే దక్కింది. హీరో ఫ్రెండ్ పాత్రలో వేణు పర్వాలేదనిపించారు. ఇక ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కోటా శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి పాత్రలు. పోలీస్ ఆఫీసర్ గా పోసాని కామెడితోపాటు, మంచి టైమింగ్ తో డైలాగ్స్ ను పేల్చారు. అయితే పోసాని డైలాగ్స్ లో ఎక్కువ శాతం బీప్ లతో విసిగెత్తించారు. కోట శ్రీనివాసరావును డైలాగ్స్ కే పరిమితం చేశారు. కోటాలోని నటుడిని పూర్తిగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. కీలక సన్నివేశాల్లో వచ్చే పాటలకు సాయి కార్తీక్ మంచి సంగీతాన్ని అందించారు. కొన్ని పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రానికి కథ అందించిన ఆనంద్ రవి.. పవర్ పుల్ డైలాగ్స్ ను అందించారు. ప్రేక్షకులను ఆలోచించే విధంగా డైలాగ్స్ ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రతినిధి చితంతో ప్రశాంత్ మండవ మంచి ప్రయత్నమే చేశాడు కాని.. పక్కాగా కథను, కథనాన్ని అందించడంలో తడబాటుకు గురయ్యాడు. సెకండాఫ్ లో తన ఆలోచనలను ప్రేక్షకులకు చేరవేయడంలో తికమక పడ్డారనే చెప్పవచ్చు. పెట్రోల్ ధర, ఇతర ధరల విషయంలో ప్రేక్షకులను చైతన్యపరచడంలో దర్శకుడిగా కొంత మేరకు సఫలమయ్యారు. కథపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి ఉంటే.. ప్రస్తుత వాతావరణానికి కనెక్ట్ అయ్యేది. తాను చెప్పాలనకున్న అంశాలపై క్లారిటీ మిస్ కావడం ప్రధాన లోపం. ప్రస్తుత రాజకీయ పార్టీలలో ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉండే విధంగా సన్నివేశాలు రూపొందించడం, ముఖ్యమంత్రుల ఫోటోలలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఫోటోను చూపించకపోవడం వారి ఎజెండాను ప్రతినిధి చిత్రం ద్వారా స్పష్టంగా చెప్పారు. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల కోసం కష్టంగా ఓసారి చూడవచ్చు ట్యాగ్: సాదాసీదా 'ప్రతినిధి' -
సినిమా రివ్యూ: లడ్డుబాబు
నటీనటులు: అల్లరి నరేశ్,భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, మాస్టర్ అతుల్, గిరిబాబు నిర్మాత: రాజేంద్ర త్రిపురనేని సంగీతం చక్రి దర్శకత్వం: రవిబాబు సినిమా రివ్యూ: లడ్డుబాబు ప్లస్ పాయింట్స్: ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఏమి లేవు మైనస్ పాయింట్స్: స్టోరీ, స్క్రీన్ ప్లే డైరక్షన్ ముష్టి కిష్టయ్య (కోట శ్రీనివాసరావు) కుమారుడు లడ్డుబాబు (అల్లరి నరేశ్). ఆఫ్రికాకు చెందిన ఓ దోమ కుట్టడం వల్ల సన్నగా ఉండే లడ్డుబాబు లావుగా తయారవుతాడు. ఆస్థి అంతా అమ్మేసి పిసినారి కిష్టయ్య గోవాలో స్థిరపడాలనుకుంటాడు. అయితే ఆస్తి అమ్మడానికి లడ్డుబాబు పెళ్లికి ఓ లింక్ ఉంటుంది. దాంతో కొడుకుకు పెళ్లి చేయాలని చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టడంతో విసిగిపోయిన కిష్ణయ్య.. లడ్డూని ఇంట్లోంచి తరిమివేస్తాడు. ఇంట్లోంచి వీధిలోకి వచ్చిన లడ్డుబాబుని మూర్తి (అతుల్) అనే పది పన్నెండేళ్ల మధ్య వయస్సు ఉన్న కుర్రాడు చేరదీసి.. తన ఇంటికి తీసుకుపోతాడు. లడ్డుబాబుని మూర్తి ఇంట్లోకి తీసుకురావడాన్ని తల్లి మాధురి (భూమిక) ఒప్పుకోదు. అయితే లడ్డూని ఇంట్లో ఉండేలా తన తల్లిని మూర్తి బలవంతంగా ఒప్పిస్తాడు. ఇంట్లోకి వచ్చిన లడ్డూబాబుని పెళ్లాడాలని ఓ సమయంలో తన తల్లికి మూర్తి సూచిస్తాడు. మూర్తి చేసిన ప్రపోజల్ ను తల్లి అంగీకరించిందా? ఒకవేళ అంగీకరిస్తే ఎందుకు లడ్డుని పెళ్లాడాలనుకుంది? లడ్డూబాబుని తన ఇంటికి తీసుకురావడం వెనక మూర్తి ప్లాన్ ఏంటీ? కిష్ణయ్య ఇళ్లు అమ్మి గోవాలో సెటిల్ అయ్యాడా? ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానమే లడ్డూబాబు కథ. విశ్లేషణ: లడ్డుబాబుగా కష్టమైన మేకప్ చేసుకుని అల్లరి నరేశ్ చేసిన ఓ విభిన్న ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అల్లరి నరేశ్ లోని కమెడియన్, హీరో అంశాలను మేకప్ డామినేట్ చేసింది. అది అల్లరి నరేశ్ లోపమని చెప్పడానికి వీల్లేదు. గతంలో రాజేంద్ర ప్రసాద్ కొబ్బరి బోండాం చిత్రంలో ఇదే మాదిరి పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆ చిత్రంలో శరీరం చాలా లావుగా ఉన్నా.. ముఖంలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ కు నవ్వించడానికి వీలు కలిగింది. అయితే ఈ సినిమాలో ముఖం కనిపించకుండా మేకప్ తో సీల్ చేయడంతో నరేశ్ హావభావాలు ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయాయి. దాంతో నరేశ్ నవ్వించడానికి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. చాలా కష్టపడి నరేశ్ చేసిన ప్రయత్నం మేకప్ మాటున వృధాగానే మిగిలి పోయింది. ముష్టి కిష్ణయ్య పాత్రలో కోట శ్రీనివాసరావు అహనా పెళ్లంట చిత్రంలో పిసినారి పాత్రను గుర్తుకు తెచ్చింది. అహనా పెళ్లంట చిత్రానికి కిష్టయ్య పాత్ర ఎక్స్ టెన్షన్ గా ఉంది. కోట కామెడీ అంతో ఇంతో ఊరట కలిగించే అంశం. ఈ చిత్రంలో భూమికకు ఇంపార్టెన్స్ ఉన్నా.. క్యారెక్టర్ డిజైన్ చేయడంలో అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దాంతో భూమిక క్యారెక్టర్ కూడా రిజిస్టర్ కాలేకపోయింది. మూర్తి పాత్రను పోషించిన అతుల్ పర్వాలేదనిపించాడు. మరో హీరోయిన్ పూర్ణ కూడా ఆకట్టుకోలేకపోయింది. కథలో బలం లేకపోవడం, కథనం పేలవంగా ఉండటంతో మంచి సంగీతాన్ని అందించడానికి చక్రీకి పెద్దగా పని లేకపోయింది. చక్రీ పాడిన ఓ పాట విసుగు తెప్పించేలా ఉంది. సిరిమల్లే పాట పిక్చరైజన్ ఆకట్టుకుంది. ఫోటోగ్రఫి ఓకే. ఇక డైరెక్టర్ రవిబాబు కథను ఎంచుకోవడంలోనే విఫలయ్యాడని చెప్పవచ్చు. సాదాసీదా కథను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలోనూ తడబాటుకు గురయ్యాడు. క్లైమాక్స్ కోసమే కథను సాగదీసి నడిపించాడా అనే సందేహం సహజంగానే వస్తుంది. ఇక బ్రహ్మనందం, ఆలీ, వేణుమాదవ్ తదితర కమెడియన్ల గెస్ట్ అప్పీయరెన్స్ తో షాక్ ఇచ్చిన రవిబాబు.. వారితో కూడా ప్రేక్షకులకు ఓ మాదిరి సంతృప్తిని ఇవ్వలేకపోయారు. లడ్డుబాబుని చూసి నవ్వుకుందామని థియేటర్ కు వెళ్లిన కామెడికి బదులు ఎక్కువ మోతాదులో విషాదానే పంచాడని చెప్పవచ్చు. ట్యాగ్: లడ్డుబాబు కాదు.. ప్రేక్షకులకు లడ్డుబాంబు! -
హ్యాపీ బర్త్‌డే కోట