![Kota Srinivasa Rao Response On His Death Rumours - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/21/Kota%20srinivas_650x400.jpg.webp?itok=lPbnVY_X)
సోషల్ మీడియాలో తాను చనిపోయినట్లు వార్తలు రావడం బాధాకరం అని ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. రేపటి ఉగాది పండుగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న తనకు వరుస ఫోన్ కాల్స్ రావడం ఆందోళన కలిగించిందని, ఏకంగా 10 మంది పోలీసులు భద్రత కోసం తన నివాసానికే వచ్చారని కోటా ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలుంటాయని, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకోవద్దని హెచ్చరించారు. ప్రజలు అర్థం చేసుకొని తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment