కామెడీ, విలనిజం.. వేర్వేరుగా, అవసరమైతే రెండింటినీ ఏకకాలంలో పండించగల సమర్థుడు కోట శ్రీనివాసరావు. వైవిధ్యమైన పాత్రలు ఎన్నో పోషించిన ఆయన నటప్రస్థానం ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వందలకొద్దీ చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి కొన్ని ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
'ఒకసారి ఏమైందంటే సెట్‌కు వెళ్లాక మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదన్నారు. ఎమ్మెస్ నారాయణ.. ఏంటి అన్నాయ్, ఇంకా చాలా టైముందిగా అని బయటకు వెళ్దాం అన్నాడు. ఇద్దరం కలిసి మందు తాగాం. అనుకోకుండా షూటింగ్‌కు రమ్మని కబురొచ్చింది. సెట్‌కు వెళ్తే అక్కడ చిరంజీవి ఉన్నాడు. నన్ను చూడగానే నాపై కేకలేశాడు. ఏమయ్యా, బుద్ధుందా? మంచి కెరీర్ ఉన్నవాడివి పట్టపగలు తాగి రావడమేంటి? పది మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది? అని తిట్టాడు. కానీ నా మంచి కోసం, నా బాగోగులు కోరే అతడు నన్ను హెచ్చరించాడు.
ఇకపోతే మండలాధీశుడులో ఎన్టీఆర్ పాత్ర ఆఫర్ చేశారు. అప్పటికే ఈ రోల్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణగారు చేయమని ప్రోత్సాహించారు. నాకేమో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారోనని భయంగా ఉంది. అప్పుడు నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఉందాం, లేదంటే ఉద్యోగంలో చేరిపోదాం అనుకున్నా. మండలాధీశుడు మంచి విజయం సాధించింది. కానీ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓసారి నా కూతుర్ని చూసేందుకు విజయవాడ వెళ్లాను. అక్కడ రైలు దిగగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ, కొట్టారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను' అని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.
చదవండి: సుమతో విబేధాలు? రాజీవ్ కనకాల ఏమన్నాడంటే?
సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ
Comments
Please login to add a commentAdd a comment