
Kota Srinivasa Rao Comments On Anasuya Dressing : ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెర యాంకర్‌గా రాణిస్తూనే ఇటూ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గ్లామర్ విషయంలో హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తుంది. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోయే అనసూయ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ తనదైన స్టైల్‌లో అలరిస్తుంది.
అంతా బాగానే ఉన్నా ఆమె డ్రెస్సింగ్‌పై మాత్రం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి నేటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి ఆ బట్టలేంటి అంటూ కొందరు నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ను ఇప్పటికీ ఎదుర్కుంటున్నారు. తాజాగా అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు వివాదాస్పద కామెంట్స్ చేశారు. అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్ చేశారు.
ఇటీవలె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్ నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని అంటున్నాను అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.