Viral: Anchor Anasuya Shocking Reply To Kota Srinivasa Rao Comments - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: అనుభ‌వమున్న వ్య‌క్తి అలా నీచంగా మాట్లాడ‌టం బాధించింది

Published Mon, Oct 18 2021 10:28 PM | Last Updated on Tue, Oct 19 2021 9:22 AM

Anasuya Bharadwaj Strong Counter To Kota Srinivasa Rao Comments - Sakshi

అనసూయ భ‌ర‌ద్వాజ్.. ఈ పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు లేరంటే అతిశ‌యోక్తి కాదు. యాంక‌రింగ్ చేస్తూ ఇటు బుల్లితెర వీక్ష‌కుల‌ను, న‌టిగా, డ్యాన్స‌ర్‌గా రాణిస్తూ అటు వెండితెర ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్ధుల‌ను చేస్తోంది. అందాల ఆరబోత‌లో హీరోయిన్ల‌కే పోటీనిచ్చే ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై సీనియ‌ర్ న‌టుడు కోటా శ్రీనివాస‌రావు వివాదాస్పద కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే! అన‌సూయ వేసుకునే బ‌ట్ట‌లు న‌చ్చ‌వ‌ని, అస‌లు ఆమె అలాంటి బ‌ట్ట‌లు వేసుకోవాల్సిన ప‌నిలేద‌ని పేర్కొన్నాడు. వీలైతే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుంద‌ని కామెంట్ చేశాడు. తాజాగా ఈ కామెంట్స్‌పై అన‌సూయ ఘాటుగా స్పందించింది. కోట శ్రీనివాస‌రావు పేరు ప్ర‌స్తావించ‌కుడా ఆయ‌న‌ను ట్విట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించింది.

''ఈ మ‌ధ్యే ఓ సీనియ‌ర్ న‌టుడు నాపై కొన్ని కామెంట్స్ చేశారు. నా వ‌స్త్రధార‌ణ గురించి మాట్లాడారు. ఎంతో అనుభ‌వం ఉన్న వ్య‌క్తి అంత నీచంగా మాట్లాడ‌టం న‌న్ను తీవ్రంగా బాధించింది. ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకోవాల‌నేది వారి వ్య‌క్తిగ‌తం, వృత్తిప‌ర‌మైన ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కూడా అలా ధ‌రించాల్సి రావ‌చ్చు. ఏదేమైనా ఒక‌రు ధ‌రించే దుస్తులు వారి వ్య‌క్తిగ‌తం. కానీ నేడు సోష‌ల్ మీడియా ఇలాంటివాటినే హైలెట్ చేస్తోంది. ఆ సీనియ‌ర్ న‌టుడు మందు తాగుతూ, అధ్వాన్న‌మైన దుస్తుల‌ను ధ‌రించిన‌ప్పుడు, సినిమాల్లో మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచిన‌ప్పుడు ఎందుకీ సోష‌ల్ మీడియా ప‌ట్టించుకోద‌నేది ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది.

ఎవ‌రైతే పెళ్లి చేసుకున్నారో, పిల్ల‌లను క‌లిగి ఉన్నారో, సినిమాల్లో న‌టీమ‌ణుల‌తో రొమాన్స్‌తో చేస్తున్నారో, చొక్కాలిప్పేసి దేహాన్ని చూపిస్తున్నారో.. అలాంటి తార‌ల‌నెందుకు ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రు? నేను పెళ్లైన స్త్రీని, ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని. పితృస్వామ్య విధానాల‌ను ప్ర‌శ్నిస్తూ ప‌ని చేస్తున్న నేను`నా వృత్తిలో విజ‌యం సాధించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నా.. ప్ర‌జ‌ల‌కు మీ అభిప్రాయాల‌ను చెప్పేముందు మిమ్మ‌ల్ని మీరు సంస్క‌రించుకోండి'' అని లేఖ పోస్ట్ చేసింది.

పెద్ద‌రికం చిన్న‌రికం అనేవి వ‌య‌సుతో కాదండి, అనుభ‌వంతో కండ‌క్ట్ చేసుకునే విధానంలో ఉంటుంది. ఒక న‌టుడిగా ఆయ‌నంటే నాకు చాలా గౌర‌వం. విభిన్న‌మైన పాత్ర‌లు చాలా అద్భుతంగా అభిన‌యించారు. కానీ ఒక వ్య‌క్తిగా ఆయ‌న కామెంట్స్ చాలా నీచంగా ఉన్నాయి, అవి అన‌వ‌స‌రం కూడా! అని కుండ బ‌ద్ధ‌లు కొట్టేసింది అన‌సూయ‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement