Senior Actor Kota Srinivasa Rao Sensational Comments On Star Heroes Remunerations, Deets Inside - Sakshi
Sakshi News home page

రోజుకు 2 కోట్లు అని పబ్లిక్‌గా చెప్పడం ఏంటి? పవన్‌కు కోటా చురకలు!

Published Sat, Jun 3 2023 12:41 PM | Last Updated on Sat, Jun 3 2023 1:21 PM

Senior Actor Kota Srinivasa Rao Sensational Comments Star Heroes Remuneration - Sakshi

స్టార్‌ హీరోల రెమ్యునరేషన్‌, వాణిజ్య ప్రకటనలపై సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. గతంలో ఏ హీరో తన రెమ్యునరేషన్‌ అంతా, ఇంతా అని ఎక్కడా చెప్పేవాడు కాదని, ఇప్పటి హీరోలు మాత్రం నాకు రోజుకు 2 కోట్లు, 6 కోట్లు తీసుకుంటున్నానని పబ్లిక్‌గా చెబుతున్నారని విమర్శించాడు. అలా పబ్లిక్‌గా రెమ్యునరేషన్‌ గురించి హీరోలు చెప్పడం మంచి పద్దతి కాదన్నారు.

తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకల్లో కోటా శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు.  కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఇప్పుడు సినిమా అనేది లేదు. అంతా సర్కసే. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు’ అంటూ కోటా  సెటైర్లు వేశారు.

(చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: ఆ పని చేయాలంటూ ఫ్యాన్స్‌కి చిరు విజ్ఞప్తి)

అలాగే హీరోల వాణిజ్య ప్రకటనల గురించి మాట్లాడుతూ.. ‘ఈ రోజు సినీ ఆర్టిస్టులు రెండు పూటలా భోజనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా అసోసియేషన్ గుర్తించాలి. చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో అడ్వర్టైజ్‌మెంట్‌లో అయినా నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్‌ క్లీన్‌ చేసే బ్రష్‌ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్‌ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి చిన్న ఆర్టిస్టులను బతికించండి’ అని కోటా  శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశాడు. 

అయితే హీరోల రెమ్యునరేషన్‌ విషయంలో కోటా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించినవే అని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో తాను రోజుకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని తెలిపిన సంగతి తెలిసిందే. కోటా వ్యాఖ్యలను కొంతమంది నెటిజన్స్‌ సమర్థిస్తుంటే..పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం విమర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement