సినిమా జయాపజయాలను బట్టి పారితోషికం విలువల్లో కూడా మార్పుచేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కసారి స్టార్ క్రేజ్ సంపాదించుకున్న తర్వాత సినిమా హిట్టయినా, ఫట్టయినా పారితోషికం పెరుగుతూ ఉంటుందే తప్ప తరుగుదల మాత్రం ఉండదు. పైగా మన టాలీవుడ్ హీరోలు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమవకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు విడుదల చేస్తూ వారి పాపులారిటీని పెంచుకుంటున్నారు. హిందీలో కూడా వారికంటూ ప్రత్యేకంగా మార్కెట్ బ్రాండ్ ఏర్పరుచుకుంటున్నారు. పరిధి విస్తరించే కొద్దీ రెమ్యూనరేషన్ కూడా పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోలెవరో చూసేద్దాం..
1. ప్రభాస్
బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్. బాహుబలి రెండు భాగాలు సంచలన విజయాలు నమోదు చేసుకోవడంతో భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ తెలుగు ఆడియన్స్‌కు ఆ సినిమా పెద్దగా నచ్చకపోయినప్పటికీ హిందీ ప్రేక్షకులు మాత్రం ఎగబడి మరీ చూశారు. ఇప్పుడాయన 'ఆదిపురుష్'గా మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్‌తో కలిసి అతి భారీ బడ్జెట్ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా కోసం బాహుబలి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని భోగట్టా. (చదవండి: ఓడిపోతానని కష్టపడేదాన్ని)
2. మహేశ్ బాబు
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఘనవిజయం నమోదు చేసుకున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. ఇప్పటికీ ఈ స్టార్ హీరోతో కలిసి సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మహేశ్ తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేశారు. 40 కోట్లు తీసుకునే ఆయన ఇప్పుడు ఒక్క సినిమాకు 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
3. పవన్ కల్యాణ్
రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన నటించిన చివరి చిత్రం 'అజ్ఞాత వాసి' అంతంత మాత్రమే వసూళ్లను రాబట్టింది. అయినప్పటికీ ఈ హీరో రెమ్యూనరేషన్‌ను 20 కోట్ల రూపాయల వరకు పెంచేశారు. ప్రస్తుతం నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రానికి 50 కోట్లు అందుకుంటున్నారని తెలిసింది. (చదవండి: రాధే శ్యామ్’ అక్టోబర్‌లో ఆరంభం)
4. అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' సంక్రాంతి పందెంలో నిలిచి గెలుపు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్‌ను కూడా ఆకర్షించింది. సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత పారితోషికం పెంచకపోతే 'చాలా బాగోదు' అనుకున్నారో ఏమో కానీ బన్నీ కూడా రేటు పెంచేశారు. 'పుష్ఫ' సినిమా కోసం 35 కోట్లు అందుకున్నట్లు వినికిడి.
5. జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సారి అభిమానులకు మరింత వినోదాన్నిపంచేందుకు మరో పవర్‌ఫుల్ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'బాహుబలి'ని చెక్కిన్న జక్కన్న దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ చిత్రంపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇచ్చేందుకు హీరో కూడా కృషి చేస్తున్నారు. దీంతో శ్రమకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్‌ను పెంచేసి 33 కోట్లు ఇవ్వమంటున్నారు. ఇందుకు ఆ సినిమా నిర్మాతలు కూడా అంగీకరించారు.
6. రామ్‌చరణ్
'రంగస్థలం' చిత్రం ముందు వరకు చేసిన సినిమాలు ఒకత్తైతే ఈ సినిమా మరో ఎత్తు. రామ్‌చరణ్ కెరీర్‌లోనే 200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా రంగస్థలం రికార్డుకెక్కింది. 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కాగా చెర్రీ చివరగా నటించిన 'వినయ విధేయ రామ' ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆర్ఆర్ఆర్ ద్వారా తిరిగి తన సత్తా ఏంటో చూపేందుకు ఆయన రెడీ అయ్యారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌తో సమానంగా 33 కోట్లు ఫీజుగా తీసుకుంటున్నారు. (చదవండి: వారందరికి ధన్యవాదాలు: పవన్ కళ్యాణ్)
Comments
Please login to add a commentAdd a comment