
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yetigattu ). రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి దుర్గతేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఇప్పటికే విడుదలైన "కార్నేజ్" టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి గ్రిప్పింగ్ విజన్ తో సాయి తేజ్ పాత్రను లార్జర్ దెన్ లైఫ్ మేనర్ లో ప్రజెంట్ చేశారు. కార్నేజ్ వీడియో సాయి దుర్గ తేజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని తెలియజేస్తుంది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీ టీం ఇటీవలే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ సెట్ లో పూర్తి చేశారు. చాలా రిస్క్ తో కూడుకున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ని హీరో సాయి దుర్గ తేజ్ చాలా అద్భుతం చేశాడని మేకర్స్ చెబుతున్నారు.
ప్రస్తుతం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఎంట్రీ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారట. ఈ పాటలో 1,000 మంది డ్యాన్సర్స్ కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమాకు ఈ పాట హైలెట్‌గా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment