ముఖ్యమంత్రి పాత్రలో... | actor kota srinivasa rao plays telangana cm role in rory movie | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పాత్రలో...

Published Sat, Jul 11 2020 12:53 AM | Last Updated on Sat, Jul 11 2020 12:53 AM

actor kota srinivasa rao plays telangana cm role in rory movie - Sakshi

కోట శ్రీనివాసరావు

ప్రముఖ క్యారెక్టర్‌ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు జూలై 10న. ఆయన నటిస్తోన్న నూతన చిత్రం ‘రొరి’లోని లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. సీటీఎస్‌ స్టూడియోస్, ఎన్‌టీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా చరణ్‌ రొరి నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో కోట అనేకసార్లు ముఖ్యమంత్రిగా, అపోజిషన్‌ లీడర్‌ పాత్రల్లో నటించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన నటించలేదు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్‌. రామన్నచౌదరి పాత్ర చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement