
'చాలా ఆనందంగా ఉంది'
న్యూఢిల్లీ: తన ఇనేళ్ల సినీ ప్రస్థానం సంతృప్తికరంగా ఉందని ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించి గౌరవించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మా ఎన్నికల్లో వివాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో కోటా శ్రీనివాసరావుతో పాటు ప్రముఖ కేన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలిరాజ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.