p susheela
-
50 వేల పాటలు పాడిన సుశీలకు ఇప్పటికీ ఆ పాట విషయంలో బాధే (ఫొటోలు)
-
ఘంటసాలది మా ఊరే అని నాకు తెలియదు
-
వరల్డ్ మ్యూజిక్ డే.. టాప్ 10 పాటల్ని గుర్తుచేసుకుందామా
ఎండలు మండితే పాటలు ఓదార్పు. తొలకరి కురిస్తే పాటలు కాఫీకి తోడు.చలి చక్కిలిగిలి పెడితే పాటే కదా వెచ్చటి రగ్గు.సంగీతమూ సినిమా పాట లేకుండా జీవితం సాగేది ఎలా. నేడు వరల్డ్ మ్యూజిక్ డే. రావు బాల సరస్వతి, పి.లీల, జిక్కి,భానుమతి రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి,ఎల్.ఆర్.ఈశ్వరి, వాణి జయరాం, శైలజ, చిత్ర...వీరంతా మన సినీ కోయిలలుగా మన జీవన సందర్భాలను సంగీతమయం చేశారు.నేడు వీరి పాటలను తలుచుకోవడం మన విధి.వీరికి చేరేలా కృతజ్ఞత ప్రకటించడం మన సంతోషం. నేడు వరల్డ్ మ్యూజిక్ డే తానే మారెనా గుణమ్మే మారెనా దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా... రావు బాలసరస్వతి గొంతు మంచురాలిన దారిలో హంస నడకలా ఉంటుంది. నటీనటులే పాటలు పాడుకోవాలి అనుకునే రోజుల్లో ఆమె దాదాపుగా మన తొలి ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్. సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఆమె పాటలు రెక్కలు విప్పాయి. సువాసనలు చిమ్మాయి. ఆమె తన సినిమా కెరీర్‌ను కొనసాగించి ఉంటే లతా అంతటి గాయనిగా గుర్తింపు పొందేది. ఆమె మనకు పంచిన అమృతం తక్కువ. కాని దాని రుచి ఎంతో మక్కువ. తెల్లవార వచ్చె తెలియక నాసామీ మళ్లీ పరుండేవు లేరా... అప్రయత్నంగా వీచే గాలిలా, అనాయాసంగా తాకే ‘మళయ’మారుతంలా ఉంటుంది పి.లీల గొంతు. తెలుగు ఆమె మాతృభాష కాదు. కాని ప్రతి తెలుగు గృహిణి నాలుక మీద ఆమె పాట చర్విత చరణం అయ్యింది.‘సడిచేయకోగాలి సడి చేయబోకే’, ‘ఓహో మేఘమాల.. నీలాల మేఘ మాల’, ‘కలనైనా నీ వలపే... కలవరమందైన నీ తలపే’... పి.లీల సంగీతలీల అద్భుతం. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న తెలుగు పాటల్లో తన ఏరువాకతో కొత్త నారును వేసి సమృద్ధికర పైరును శ్రోతలకు అందించిన గాయని జిక్కి. పిట్ట కొంచమే. కూత పది వర్ణాల పింఛమే. అల్లరి పాటైనా ఆర్ద్ర గీతమైనా జిక్కి చేత చిక్కిందంటే హిట్. ‘ఛాంగురే బంగారు రాజా’, ‘పులకించని మది పులకించు’... ఆమెకు శ్రీలంకలో కూడా ఫ్యాన్స్ ఉండేవారు. అందమైన పాటలు పాడి ‘జీవితమే సఫలము’ చేసుకున్న ప్రియమైన గాయని జిక్కి. ఓహోహోహో పావురమా ఓ... ఓహోహో పావురమా వెరపేలే పావురమా ఓహోహో ఓహో పావురమా ఈ పావురం డేగల్ని కూడా వేటాడగలదు. భానుమతి రామకృష్ణ సకల కళావల్లభురాలు. నాటి తెలుగు మహిళలకు పెద్ద ధైర్యం. ఇండస్ట్రీలో గొప్ప తెగువ. అలాంటి గొంతు, ఆ పాట తీరు రిపీట్ కాలేవు. కాబోవు. ‘ఎందుకే నీకింత తొందర’, ‘నేనే రాధనోయి’, ‘సావిరహే తవదీన’... ఎన్ని పాటలని. ఇక ‘మల్లీశ్వరి’ ఆమె ప్రతి పాట గండుమల్లె, రెక్కమల్లె. ‘మనసున మల్లెల మాలలూగెనే’.. ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ ముత్తయిదు కుంకుమ బతుకెంతొ ఛాయ తెలుగు పాటకు వంద సంవత్సరాల ఛాయను తెచ్చింది సుశీల. ఆమె రాకతో నటిని, గాయనిని దృష్టిలో పెట్టుకోకుండా ΄ాటకు అవసరమైన రేంజ్‌తో బాణీ కట్టడం మొదలెట్టారు సంగీత దర్శకులు. సుశీల ΄ాటలో నిష్ఠ ఉంటుంది. క్రమశిక్షణ ఉంటుంది. శ్రేష్టమైన ఉచ్చారణ. నూరుశాతం కచ్చితత్వం. ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’, ‘జోరుమీదున్నావు తుమ్మెదా’, ‘ఇది మల్లెల వేళయనీ’... ఈ కెరటాలకు అంతులేదు. ఈ గాన సముద్రానికి ఉప్పదనం లేదు. అమృత సాగరం. నీలిమేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునేవేళా నూనె రాసి గట్టిగా బిగించి కట్టిన జడది అందమే. అది సుశీలమ్మ పౠటది. తల స్నానం చేసి వదులుగా వదిలన ముంగురులదీ అందమే. అది జానకమ్మ పౠటది. తెలుగు ΄ాట ఊపిరి పీల్చుకోవడానికి తెరిచిన పెద్ద గవాక్షం జానకి. తల్లిదండ్రులను చనువుగా ఒకమాటనగల చిన్న కూతురిలా ఉంటుందామె పాట. సరదా. హుషారు. అద్దంలో ఇమడగల కొండంత ప్రతిభ. ‘పగలే వెన్నెల’, ‘మనసా తుళ్లి పడకే’, ‘అందమైన లోకమని రంగురంగులున్నాయనీ’... ఇక నాదస్వరం ఎదుట పడగ ఎత్తి నిలిచిన పాట ‘నీలీల పాడెద దేవా’... మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాగమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు ఆగేదెట్టాగ అందాక ఏగేదెట్టాగ గజ్జె కట్టి, బిగుతు దుస్తులు ధరించి, స్టేజ్ ఎక్కి జానపద శృంగారం ఒలికించిన ΄ాట ఎల్.ఆర్. ఈశ్వరిది. ఊరంటే గుళ్లు, ఇళ్లు మాత్రమే కాదు.. పొలాలుంటాయి.. మంచెలూ ఉంటాయి. ‘మసక మసక చీకటిలో’, ‘నందామయా గురుడ నందామయా’, ‘తీస్కో కోకకోలా’... ప్రతి పాటా సంపెంగ పొదలో పూసిన పువ్వు.అది మగాళ్లని ‘బలేబలే మగాడివోయ్’ చేసింది. విధి చేయు వింతలన్ని మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో వాణి జయరామ్‌ది పక్కింట్లో నుంచి వినిపించే పరిచిత గీతంలా ఉంటుంది. అదే సమయంలో దానికో వ్యక్తిత్వం ఉంటుంది. వాణి జయరామ్ పాటల మీద జోకులేయలేం. గౌరవించడం ప్రేమించడం తప్ప. ‘పూజలు సేయ పూలు తెచ్చాను’, ‘నేనా పాడనా పాట... మీరా అన్నదా మాట’, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’... అద్భుతం. లాలు దర్వాజ్ లష్కర్ బోనాల్కొస్తనని రాకపోతివి లక్డీకాపూలు పోరికి రబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి ఎస్.పి.శైలజ పాటను ఒక పల్లవి ఒక చరణం వరకే అనుమతించింది తెలుగు పరిశ్రమ. ప్రతిసారి మైక్ అందలేదు. అందినప్పుడు ఆమె గొంతులో అందం దాగలేదు. ‘మాటే మంత్రము’, ‘నాంపల్లి టేషన్కాడి’, ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’... ఆమె పాట, మాట రెండూ మృదురమే. రానేల వసంతాలె శృతి కానెల సరాగాలే నీవే జీవన రాగం... స్వరాల బంధం చిత్ర రాకతో మళ్లీ తెలుగు పాటకు టీనేజ్ వచ్చింది. కొత్త తరానికి ΄ాటను అందించింది చిత్ర. కాలేజీకెళ్లే అమ్మాయిలు ‘తెలుసా మనసా’ అని... ‘కన్నానులే కలలు’ అని... ‘ఎన్నెన్నో అందాలు’ అని పాడుకున్నారు. ‘మనసున ఉన్నది చె΄్పాలనున్నది’ అని కూనిరాగం తీసుకున్నారు. మన గాయనులు మనకు బుట్టల కొద్ది పాటలు పంచినందుకు కృతజ్ఞతలు. -
విశాఖ : సుశీల, ఉషా ఉతుప్‌లకు మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమన్ అవార్డు (ఫొటోలు)
-
బాలుని చూడటానికి వెళ్లలేదు.. నన్ను రావద్దన్నారు: పి సుశీల
గాన సరస్వతి పద్మభూషణ్ పి.సుశీల ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో సరిగమల వీణ మోగిస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ తదితర భాషల్లో తన గానామృతాన్ని పంచిన గాయనీమణి పి.సుశీల. ఘంటసాల, బాల సుబ్రమణ్యం లాంటి లెజెండరి సింగర్స్‌తో కలిసి ఎన్నో పాటలు పాడిని ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానల్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా దివంగత లెజెండరి సింగర్ బాలుని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. బాలుగారి మరణంతో మొత్తం చీకటి అయ్యిందని ఆమె వాపోయారు. ‘బాలు లాంటి గాయకుడు ఎవరు ఉండరు. ఇక రారు కూడా. ప్రస్తుతం ఉన్నవాళ్లు ఆయనలా పాడటానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆయన లేని లోటు ఎవరి తీర్చలేనిది. ఎంతో గొప్ప స్వరం ఆయనది. ఆయన పాటలు వింటుంటే ఇంకో పదేళ్లు బాలు గారు ఉండకూడదా అని దేవుడితో పోట్లాడుతుంటాను’ అన్నారు. ఆయన చనిపోయినప్పుడు కనీసం చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదని, తనని రానివ్వలేదన్నారు. మీకు వయసైపోయింది. కరోనా ఉంది రావద్దన్నారు.. ఇక ఏం చేయలేక టీవీల్లో చూసి ఏడ్చానంటూ ఆమె వాపోయారు. ‘అసలు ఏం లేదు సినిమా లోకమంతా చీకటి అయిపోయింది. అంత పైకి తీసుకువచ్చారు. ఆ క్యారెక్టర్ తగినట్లు పాట పాడటం అంటే సాధారణ విషయం కాదు . ఒక్క పాటలే కాదు డబ్బింగ్, డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదు. అది చాలా గొప్పవరం’ అంటూ బాలుని గుర్తు చేసుకున్నారు. ఇక బాలుతో ఉన్న జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఒకసారి మేం అమెరికా వెళ్లాం. అప్పుడు ఆయన కుర్రాడు. నిర్మాతలమో ఆయనతో పాట పాడించద్దు అంటారు. అలాంటి బాలు గారు ఇంగ్లీష్లు పాటలు. లతా మంగేష్కర్ వంటి గొప్ప గాయనీతో కలిసి పాడి స్టార్ సింగర్ అనిపించుకున్నారు. అందుకేనేమో ఆయన గొప్ప గాయకుడు అవుతాడని దేవుడు కుళ్లు కున్నట్లు ఉన్నాడు. ఆయన గాత్రం దేవుడు ఇచ్చిన వరం. ఆయన మరణంతో మొత్తం చీకట అయిపోయింది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో కళారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురష్కారాలు అందిస్తున్నట్లు చెప్పారు. పద్మభూషణ్ సుశీల, పద్మభూషణ్ సరోజా దేవి, పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాధ్, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు కృష్ణవేణి, జమున, లక్ష్మి, మురళీ మోహన్, గిరిబాబు ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తదితరులను తానా పురస్కారాలతో సన్మానిస్తున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ పాంత్రా సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ శోభారాజు అన్నమాచార్య భవన వాహిని, గురు రామాచారి లిటిల్ మ్యూజిషియన్స్, సిద్ధేంద్ర కూచిపూడి అకాడమీ, అమెరికాకు చెందిన 300కు పైగా విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. -
భారతరత్న నాకు అవసరం లేదు: పి సుశీల ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళ సినిమా: గాన సరస్వతి పద్మభూషణ్ పి.సుశీల ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో సరిగమల వీణ మోగిస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ తదితర భాషల్లో తన గానామృతాన్ని పంచిన గాయనీమణి పి.సుశీల. ఈమె 70వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్‌బుక్ రికార్డు, ఏ షియన్ బుక్‌లో చోటు సంపాదించారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పత్రికా సంఘం శనివారం సాయంత్రం నిర్వహించిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి.సుశీల, ని ర్మాత కలైపులి ఎస్.థాను, దర్శకుడు మోహన్‌రాజా, నటుడు సతీష్ తదితరులు దీపావళి సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేది పాత్రికేయులేనన్నారు. అప్పట్లో సినిమా సమాచారం ఆల్ ఇండియా రేడియో కంటే ముందే పత్రికల్లో వచ్చేవన్నారు. తాను పెద్ద గాయని కావాలన్నది తన తండ్రి కోరికని, అది తాను నెరవేర్చాననే అనుకుంటున్నానన్నారు. తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే గాయనిగా భిక్ష పెట్టింది సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథ్ అని పేర్కొన్నారు. జనరేషన్ మారుతున్న సంగీతం ఎప్పటికీ మరవలేనిదన్నారు. అయితే తమ కాలంలో పరిశుద్ధంగా ఉండేదని, ఈ జనరేషన్లో ...అంటూ నవ్వేశారు. తనకు పద్మభూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేసింది అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి అని తెలిపారు. చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా? ఇక భారతరత్న అంటారా? అది తనకు అవసరం లేదని, గాయనిగా ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయానన్న సంతృప్తి చాలన్నారు. తాను పి.సుశీల పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా పేద సంగీత కళాకారులకు నెలనెలా పింఛన్ అందిస్తున్నానని చెప్పారు. అలాగే ఈ ట్రస్టు ద్వారా ఏటా ఒక ఉత్తమ సంగీత కళాకారులను ఎంపిక చేసి అవార్డు, రూ.లక్ష నగదును అందిస్తున్నట్లు చెప్పారు. అయితే తన పాటలకు రాయల్టీ రావడం లేదని, అది వస్తే మరికొందరికీ సాయం చేసే అవకాశం ఉంటుందని గాయని పి.సుశీల అన్నారు. కాగా ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న నటుడు బోండామణికి పత్రికల సంఘం కార్యవర్గం ఆర్థిక సాయం అందజేసింది. -
ప్రముఖ గాయని పి.సుశీల మనవరాలి నిశ్చితార్థ వేడుక
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ గాయని పద్మభూషణ్ డాక్టర్ పి.సుశీల మనవరాలి వివాహ నిశ్చితార్థ వేడుక మంగళవారం శంషాబాద్‌లోని సియారా రిట్రీట్‌లో ఘనంగా జరిగింది. గాయని పి.సుశీల కుమారుడు జయకృష్ణ, సంధ్య దంపతులు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె శుభశ్రీకి బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్, రాధిక దంపతుల కుమారుడు వినీత్‌తో నిశ్చాతార్థం జరిగింది. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. చదవండి: Bappi Lahiri Death: ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూత -
మధుర గాయని సుశీలమ్మ బర్త్‌డే స్పెషల్
సాక్షి, హైదరాబాద్: అద్భుత గాయని గానకోకిల సుశీల.. అంతేనా.. గాన సరస్వతి, మధుర స్వరాల మహరాణి సుశీలమ్మ. పాటకు ప్రాణం పల్లవి అయితే.. ఆ పల్లవికే ఆరో ప్రాణం మన సుశీలమ్మ. విరహమైనా, వైరాగ్యమైనా, మోహమైనా, భక్తి పారవశ్యమైనా తన గంధర్వ గాన మాధుర్యంతో అఖిలాండ కోటి శ్రోతల హృదయాలను ఓలలాడించిన గాయనీమణి సుశీల. ఆమె ఈ నేలపై పుట్టడం మనకు గర్వ కారణం. తేనెలూరు ఆమె గాన ప్రతిభకు ఎన్ని పురస్కారాలు, అవార్డులిచ్చినా తక్కువే.. నవంబరు13 సుశీలమ్మ 86వ పుట్టినరోజు సందర్భంగా సాక్షి. కామ్ శుభాకాంక్షలందిస్తోంది. తెలుగు సీనీ రంగంలో 50 వేలకు పైగా పాటలు పాడి అందరినీ అలరించిన సంగీత సరస్వతి పి.సుశీల. సుదీర్ఘ తన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ భాషలలో పాడిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. అందుకే గాన సరస్వతి, కన్నడ కోగిలెగా శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సంగీతానికి పెట్టింది పేరైన విజయనగరంలో న్యాయవాది పి.ముకుందరావు, శేషావతారం దంపతులకు 1935 నవంబరు 13 జన్మించారు పులపాక సుశీల. 1950 సంత్సరంలో రేడియోలో నిర్వహించిన పోటీలో పాడిన పాట సుశీలమ్మ సంగీత ప్రస్థానానికి నాంది పలికింది. ఏ.ఎమ్.రాజాతో కలిసి తెలుగులో కన్నతల్లి అనే సినిమాలో పాటతో నేపథ్య గాయనిగా అరంగేట్రం చేశారు. అది మొదలు దశాబ్దాలు పాటు పలు భాషల్లో సినీ సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాణి ఆమె. శ్రీ లక్ష్మమ్మ కథ, పెళ్ళి చేసి చూడు, పిచ్చి పుల్లయ్య, కన్యాశుల్కం, అనార్కలి, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, ముద్దుబిడ్డ, బాలనాగమ్మ, ఇల్లరికం, కృష్ణ లీలలు, మా ఇంటి మహాలక్ష్మి, శభాష్ రాముడు, భూకైలాస్, మాంగల్యబలం, ముందడుగు, సువర్ణ సుందరి, మాయా బజార్, అల్లూరి సీతారామయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. సుశీలగారు పాడనంటే పాడను అని బాధపడిన సంగతి గురిచి స్వయంగా ఆమే ఒకసారి ప్రస్తావించారు. సీనియర్ NTR డ్రైవర్ రాముడులో చక్రవర్తి సంగీతంలో "గ్గుగ్గుగ్గగుడెసుందీ మ్మమ్మమ మంచముందీ'' అనే పాట పాడిన తరువాత చానళ్ళాపాటు ఆవిడ భాధపడ్డారట. -
మధురస్వరాల మహారాణి
-
SP balasubrahmanyam: మైమరపించే గీతాలు
చిన్నప్పుడు సుశీల పాడిన పాటలు పాడి గుర్తింపు పొందారు బాలూ. గూడూరులో ఆయన ప్రతిభ గమనించి ‘సినిమాల్లో పాడు’ అని ప్రోత్సహించారు జానకి. కలిసి పాడి హిట్స్ ఇచ్చారు వాణి జయరాం. అన్నయ్యకు దీటుగా గొంతు సవరించుకున్నారు ఎస్.పి.శైలజ . ఒక రికార్డింగ్ థియేటర్లో బాలూతో బ్రేక్‌ఫాస్ట్–పాట, మరో థియేటర్లో లంచ్–పాట, మరో థియేటర్లో డిన్నర్ –పాట... ఇలా జీవితం గడిపారు చిత్ర. బాలు మరణించాక వస్తున్న తొలి జయంతి ఇది. జీవించి ఉంటే పుట్టిన్రోజు అనుండేవాళ్లం. ఎందరో మహిళా గాయనులతో పాటలు పాడి శ్రోతలను సేదదీర్చాడు ఆయన. ప్రతి గాయనితో కనీసం ఒక్కో యుగళగీతాన్ని తలుచుకునే సందర్భం ఇది. మావిచిగురు తినగానే (పి.సుశీల) ‘మావిచిగురు తినగానే కోవిల పలుకుతుందట.. కోవిల గొంతు వినగానే మావి– చిగురు తొడుగుతుందట’... తెలుగువారికి మావిచిగురుకి, కోయిలకి, కృష్ణశాస్త్రి కవిత్వానికి, సుశీల–బాలసుబ్రహ్మణ్యంల గొంతులకు ఉన్న అనుబంధం అవిభాజ్యం. ‘సీతామాలక్ష్మి’లో కె.వి.మహదేవన్ బాణీకట్టిన ఈ పాట రైల్వేస్టేషన్లో మొదలయ్యి పచ్చటి దారుల వెంట పరుగుతీస్తుంది. ‘బింకాలు బిడియాలు.. పొంకాలు.. పోడుములు’ అని సుశీల అంటే ‘ఏమో ఎవ్వరిదోగాని ఈ విరి గడసరి’ అని బాలూ అంటూ ఒక చిరునవ్వు నవ్వుతారు. ఆ నవ్వు ఆయన సిగ్నేచర్. పాటల్లో ఆయన నవ్వుకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అలివేణి ఆణిముత్యమా (ఎస్.జానకి) ‘స్వాతివాన లేతఎండలో... జాలి నవ్వు జాజిదండలో’ అని రాశారు వేటూరి. ఆ స్వాతివాన జానకి అయితే ఆ జాజిదండ బాలూ అయి ఉండవచ్చు. తెలుగు పాటల్లో ఇంత లోగొంతుకతో లాలిత్యంతో సున్నితంగా పాడిన మరొక పాట లేదు. ‘ముద్దమందారం’ సినిమా కోసం రమేశ్ నాయుడు స్వరకల్పనకు జానకి తో కలిసి బాలూ ఇచ్చిన ఆవిరి చిగురు... ఊపిరి కబురు కలకాలం నిలిచి ఉన్నాయి. ‘కుదురైన బొమ్మకి కులుకుమల్లె రెమ్మకి నుదుటబొట్టు పెట్టనా... బొట్టుగా’ అని బాలూ అంటే దానికి జానకి ‘వద్దంటే ఒట్టుగా’ అని పరవశంగా చెప్పే జవాబు ఇక్కడ చదివితే తెలియవు. వినండి. ఎన్నెన్నో జన్మల బంధం (వాణీజయరాం) ఈ పాటలో పల్లవి, చరణాలు ఒకెత్తు. మొదటి చరణం తర్వాత వచ్చే ఆలాపనలు ఒకెత్తు. ‘హా’ అని బాలూ అంటే ‘హా’ అని వాణిజయరాం అంటే ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘ఆ..’ అని తీసే ఆలాపన అద్భుతం. బాలూ పాడిన ఉత్తమ పది డ్యూయెట్లు ఎవరు ఏవి ఎంచినా ఈ పాట ఉంటుంది. ‘నీవు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి చేరనా’ అని దాశరథి రాశారు. బాలూ–వాణి జయరాంల కాంబినేషన్లో వచ్చిన ఈ పాట అలా శ్రోతల హృదయజలధికి ఎప్పుడో చేరింది. మాటే మంత్రము (ఎస్పి.శైలజ) ‘నీవే నాలో స్పందించినా ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే’ అని బాలూ పాడితే వెంటనే శైలజ ‘నేనే నీవుగా పూవూ తావిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో’... అంటారు. ఏమి యుగళగీతం ఇది. ‘సీతాకోకచిలుక’కు వందల వర్ణాలు ఇచ్చిన యుగళగీతం. అన్నయ్య బాలూతో చెల్లెలు శైలజ ఎన్నో మంచి పాటలు పాడారు. కాని సంఖ్యా పరంగా చూస్తే పాడాల్సినన్ని పాడలేదు అనిపిస్తుంది. సొంత చెల్లెలైనా ఏనాడూ ఆమెను ప్రత్యేకంగా రికమండ్ చేయలేదు బాలూ. శైలజ తన ప్రతిభ తో రాణించారు. ‘పడమటి సంధ్యారాగం’లో ‘పిబరే రామరసం’, శుభసంకల్పంలో ‘సీతమ్మ అందాలూ’... ఈ అన్నాచెల్లెళ్లు కలిసి పంచిన తీపినిమ్మతొనలు ఎన్నని. సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ (ఎల్.ఆర్.ఈశ్వరి) ‘మరో చరిత్ర’లో ‘బలేబలే మగాడివోయ్’ పాటను ఎల్.ఆర్.ఈశ్వరి, బాలూ కలిసి పాడారు. ఎల్.ఆర్.ఈశ్వరి దూకుడు ముందు నిలవడం తోటి గాయకులకు కష్టమే. కాని ఆమె సై అంటే బాలూ సై అనడం వీరిద్దరి పాటల్లో కనిపిస్తుంది. ‘సింహబలుడు’ కోసం వేటూరి రాయగా ఎం.ఎస్.విశ్వనాథన్ చేసిన ‘సన్నజాజులోయ్’ పెద్ద హిట్. ‘ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో’ అని అచ్చు ఎన్.టి.ఆర్ అన్నట్టే బాలూ అని మనల్ని మెస్మరైజ్ చేస్తారు ఈ పాటలో. పూసింది పూసింది పున్నాగ (చిత్ర) గాత్రాన్ని వెనక్కు నెట్టి బీట్‌ను ముందుకు తెచ్చిన 1990ల కాలంలో కీరవాణి రంగప్రవేశం చేసి మళ్లీ మాటను ముందుకు తెచ్చారు. ‘పూసింది పూసింది పున్నాగ’ అందుకు అతి పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పచ్చటి చేలలో పిల్లగాలుల్లా మారడం ఈ పాటలో బాలూ, చిత్ర చేశారు. వేటూరి సాహిత్యం అందుకు తోడైంది. ‘సీతారామయ్య గారి మనవరాలు’ వేదికయ్యింది. చిత్ర, బాలూ వేల పాటలు పాడారు. కాని ఈ పాట ఎప్పుడూ ప్రత్యేకమే. తెల్లచీరకు తకధిమి తపనలు (లతా) లతా మంగేశ్కర్ తెలుగులో బాలూతో పాడిన ఏకైక డ్యూయెట్. కె.రాఘవేంద్రరావు, ఇళయరాజాల వల్ల ఇది సాధ్యమైంది. లతాతో బాలూ హిందీలో ఎన్నో పాటలు పాడినా తెలుగులో ఇద్దరూ కలిసి పాడటం పాట ప్రియులకు పసందైన జ్ఞాపకంగా నిలిచింది. తెల్లచీరకు తపనలు వేటూరి తప్ప ఇంకెవరు రప్పించగలరు. వైశాఖం, కార్తీకం, ఆషాఢం, హేమంతం.. ఇవన్నీ ఈ పాట చరణాల్లో ఉంటాయి. ఈ ప్రకృతి సౌందర్యాలే లతా మంగేష్కర్, బాలూ గళాలు కూడా. అందుకే ఆ అందం.. ఆ గంధం. ఓ వాలుజడా (సునీత) తెలుగువారికి వాలుజడ సత్యభామ కాలం నుంచి తెలుసు. దానిని ‘రాధాగోపాళం’లో పాటగా మలిచారు బాపురమణ. ‘అన్ని అందాలు స్త్రీలు ముందు ఉన్నా నువ్వొక్కదానివి వెనకెందుకున్నావు?’ అని కవి జొన్నవిత్తుల కొంటెగా వాలుజడను ప్రశ్నిస్తారు ఈ పాటలో. ఈ అచ్చతెనుగు పాటకు బాలూతో పాటు సునీత కాకుండా ఇంకెవరు గొంతు కలపగలరు. జీవితం సప్తసాగర గీతం (ఆశాభోంస్లే) ఈ పాటను ఆశా భోంస్లే మొదలెడతారు. మొదటి చరణం చివరలో బాలూ అందుకుంటారు. ‘హే... బ్రహ్మమానస గీతం.. మనిషి గీసిన చిత్రం.. చేతనాత్మక శిల్పం... మతి కృతి పల్లవించే చోట’... ఇలా పాడేవాళ్లు... ఇలా పాడగలిగినవాళ్లు ఎందరని? ‘చిన్నకృష్ణుడు’ కోసం ఆర్.డి. బర్మన్ చేసిన ఈ పాట వేటూరి మాటల్లో తాత్త్వికంగా ఉంటుంది. బాలూ, ఆశాభోంస్లే గొంతుల వల్ల లోతుగా ఉంటుంది. ‘జీవితం వెలుగు నీడల వేదం’ అని అంటారు వేటూరి. పాటకు ఒక వెలుగు బాలూ లేరు కదా. నీడగా ఆయన జ్ఞాపకమే ఉంది. జగదానందకారకా (శ్రేయా ఘోషాల్) బాలూ ఐదు దశాబ్దాలు పాడారు. పాతతరంతో ఎంత బాగా జోడీ కట్టారో కొత్తతరంలో కూడా అంతే దీటుగా గొంతు కలిపారు. శ్రేయా ఘోషాల్ దేశంలో ఒక ఉత్తమ యువ గాయని. కాని ఆమెతో ఈ డ్యూయెట్ లో బాలూ, శ్రేయా ఇళయరాజా గీతానికి ఎంత సౌందర్యం ఇచ్చారో... ఎలాంటి వాడని తోరణం కట్టారో... జొన్నవిత్తుల ఈ గీతం రాసి ప్రశంసనీయులయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భగవంతుని ఆశీస్సుల వల్లే అవార్డు: పి.సుశీల
చెన్నై: జీవిత సాఫల్య అవార్డు భగవంతుని ఆశీస్సుల వల్లే తనకు లభించిందని ప్రఖ్యాత గాయని పి.సుశీల పేర్కొన్నారు. గాయని పి.సుశీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంగ్లాండ్ మగళీర్ నెట్వర్క్ అనే సంస్థ జీవిత సాఫల్య అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రిటన్ దేశానికి చెందిన ఈ సంస్థ ప్రతి ఏడాది ఆ దేశానికి చెందిన వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలకు జీవిత సాఫల్య అవార్డు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పురస్కారం వేడుకల కార్యక్రమం బ్రిటన్ పార్లమెంట్ సభలో సభ్యుల సమక్షంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ దేశేతర ప్రముఖ మహిళలనూ ఈ అవార్డుతో సహకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మన దేశానికి చెందిన ప్రముఖ గాయని పి.సుశీల, ఏఆర్ రెహమాన్ సహోదరి, మహిళా సంగీత దర్శకురాలు ఏ.ఆర్ రెహానాలకు జీవిత సాఫల్య అవార్డు ప్రకటించారు. కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ మగళీర్ నెట్వర్క్ సంస్థకు చెందిన చెన్నై నిర్వాహకులు నజ్రిన్, అష్రఫ్ శుక్రవారం చెన్నైలో గాయని పి.సుశీలను కలిసి జీవిత సాఫల్య అవార్డు అందించారు. ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ బ్రిటన్‌కు చెందిన సంస్థ ఇతర దేశాలకు చెందిన ప్రముఖులను జీవిత సాఫల్య అవార్డుతో సత్కరించాలని నిర్ణయించిన తొలి ఏడాదిలోనే తనకి అవార్డు రావడం సైతం భగవంతుని ఆశీస్సులుగా భావిస్తున్నాను అన్నారు. చదవండి: ఇది వీరప్పన్ కథ కాదు! -
ప్రతి పాటా వెలుగుదివ్వే
ఉచ్చారణ దోషాలు, పర భాషా పదాల డాంబికాల నేటి పాటల నడుమ ఒక అచ్చ తెలుగు పాట పుట్టిన రోజు జరుపుకోనుంది. తెలుగు నుడికి, వెలుగు జడికి ఆలవాలంగా నిలిచిన సుశీల గళం తన 86వ పుట్టినరోజు కేక్ కట్ చేయనుంది. రేపు దీపావళి సందర్భంగా... పండుగ సందర్భాలను, ఆధ్యాత్మిక భావాలను గాన సంబరంతో నింపిన సుశీల గీతాల ప్రత్యేకం ఇది. ‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’ అని రేడియోలో పాట వస్తుంది ప్రతి దీపావళికి– సుశీల గొంతును మోసుకుని. తెలుగువారికి పండగ అంటే పెద్దలు, పిల్లలు, పిండి వంటలు మాత్రమే కాదు.. పాటలు కూడా. పి.సుశీల కూడా. ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని సుశీల పాట వినిపించకుండా దీపావళి రాదు. పోదు. తెలుగు నేపథ్య సంగీతంలో ఒక స్త్రీ గళం దీపంలా వెలిగింది. అది సుశీలది. హిందీ సినిమాలలో లతా మంగేష్కర్ ‘మహల్’ (1949) సినిమాతో స్టార్డమ్లోకి వస్తే పి.సుశీల ‘మిస్సమ్మ’ (1955) సినిమాతో స్టార్డమ్లోకి వచ్చారు. స్టార్డమ్ సమయానికి సరిగ్గా ఇద్దరికీ 20 ఏళ్లు. లతా తన పాటలతో దేశానికి వెలుతురూ ఇస్తే సుశీల గాత్ర ధారలతో దక్షిణ భారతదేశంలో ప్రమిదల వరుస పేర్చారు. సినీ సంగీతం వినోదానికే కావచ్చు. కాని సినీ సంగీతంలో ఉన్న అన్ని గొంతులూ అన్ని భావాలకూ సరిపోవు. సుశీలమ్మ గీతం ప్రభాతం అయ్యింది. పూజగదిలో ధూపం అయ్యింది. వెలుతురు అయ్యింది. గుడి గంటలా మోగింది. ఆమె తన గొంతుతో పవిత్ర భావన తెచ్చారు. పండగ వేళ తెలుగు పాట వినాలంటే తెలుగు వారు తెరవాల్సిన సందుక సుశీలదే. ‘పాల కడలిపై శేష తల్పమున పవళించేవా దేవా’ అని ఆమె పాడితే తెలుగు స్త్రీలు దేవుణ్ణి నోచడానికి ఆ పాటనే సాధనం చేసుకున్నారు. ‘నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై’ అని సుశీల భక్తితో భంగపడితే మా మనసులోని భావనా ఇదే స్వామి అని ఎందరో భక్తులు దేవుని పటాల ముందు దండం పెట్టుకున్నారు. దేవునికి సమర్పించడానికి శ్రీపారిజాతమైనా ఒకటే సుశీల పాటైనా ఒకటే కొందరికి. ఇవి మాత్రమే కాదు నారాయణుని దాసులు ఆమె స్తోత్రించిన ‘నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం’ (భక్త ప్రహ్లాద)లో ఎన్నోసార్లు మునిగి తేలారు. పార్వతి దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆమె పాడిన ‘జననీ శివకామిని’ (నర్తనశాల) మదిలో మననం చేసకున్నారు. శ్రీ వేంకటేశ్వరుని కోసం ఆమె ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము’ (కలియుగ దైవం) పాడి అన్నమయ్య పదానికి అనల్ప తాదాత్య ్మం తెచ్చారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే మహిళల కోసం సుశీల పాడిన ‘శ్రీసత్యనారాయణుని సేవకురాలమ్మా’ (గృహ ప్రవేశం) ఇంటింటి గీతమే అయ్యింది. ఇక సాయిబాబాను అర్చిస్తూ సుశీల పాడిన ‘దైవం మానవ రూపంలో’ (శ్రీ షిర్డీ సాయిబాబా మహత్య ్మం) సాయిభక్తులకు దివ్యకానుక. సినిమా రంగంలో నిలిచి దాదాపు యాభై ఏళ్లు సుశీల పాడటానికి కారణం ఆమె గళమే కాదు అది ప్రకటించిన భావం కూడా కారణం. తెలుగు భాషకు ఆమె తన పాట ద్వారా పరోక్ష సేవ చేశారు. తెలుగు భాష సౌందర్యం, ఉచ్చారణ ద్వారా వచ్చే సొగసు సుశీల పాటలో చూస్తాం. తెలుగువారు తమ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, తమ పర్వదినాలను కాంతిమంతం చేసుకోవాలనుకున్నప్పుడు అది సుశీల పాట ప్రమేయం లేకుండా అసంపూర్ణం అయిపోతుంది. సుశీలను తెలుగువారితో పాటు తమిళులు తమ ఆధ్యాత్మిక గళంగా తలుస్తారు. కన్నడిగులు ఆమె పాడిన భక్తి గీతాలకు చెవి వొగ్గుతారు. ఇంకా చెప్పాలంటే మలయాళీలు తమ గొప్ప డివోషనల్ గీతాల్లో సుశీలమ్మవి కూడా ఎంచుతారు. సుశీల దాదాపు 19 వేల పాటలను రికార్డుల్లో చూపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచారు. ఆమెతోపాటు పాడిన గాయకులు, గాయనీమణులు ఆమెకు శక్తినిచ్చారు. ఆమె నుంచి శక్తిని పొందారు. సుశీల, బాలూతో కలిసి పాడిన ఒక పాటను ఈ కరోనా చీకటి సమయాలలో దీపావళి దీపం లా తలుచుకోవాలి. ఆ పాట ‘గోరంత దీపం’లో ఉంది. ‘గోరంత దీపం కొండంత వెలుగు .. చిగురంత ఆశ బతుకంత వెలుగు’ ఈ దీపావళి ఎలా ఉన్నా నిజమైన పర్వదినం కరోనా వెళ్లాకే. అది నిర్మూలింపబడ్డాకే. ఆ రోజు వస్తుందన్న ఆశ కోసం సుశీల పాడిన పాటలు వినొచ్చు. ఆమె గానం చూపిన ఆధ్యాత్మిక దారిలో శక్తిని పుంజుకోవచ్చు. ఆమె అన్ని గీతాల నుంచి నిస్పృహను వదలగొట్టుకోవచ్చు. ఉత్సాహాన్ని నింపుకోవచ్చు. సుశీల గీతం సదా వెలుగుగాక. సుశీలమ్మ గొంతు ఏ దేవునికి చేరలేదని? ఏ కోవెలను తాకలేదని? ముఖ్యంగా ఆమె పాడిన రాముడి పాటలు అనేకం. రామనామాన్ని పానకం వలే స్వీకరించేవారు ఆమె పాడిన ‘శ్రీరామనామాలు బహుతీపి’ (మీనా) ఎన్నిసార్లు విని వుంటారు. ‘మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు’ (పంతులమ్మ) సుశీల స్పష్టభక్తిని ప్రతి మాటలో చాటుతుంది. ప్రయివేట్ ఆల్బమ్ కోసం ఆమె పాడిన ‘రామచంద్రుడితడు రఘువీరుడు’, ‘రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా’ పాటలు పల్లె పల్లెన ఉన్న రాముని కోవెలల్లో ప్రభాత గీతాలే కదా. ఇక ఆమె రామాయణం మొత్తాన్ని ఒక సులభ పాటగా చేసిన ‘వినుడు వినుడు రామాయణ గాధ’, ‘శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా’ (లవకుశ) మనసారా వినని వారు లేరు. – సాక్షి ఫ్యామిలీ -
స్వీట్ మెమోరీస్ విత్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
విజయంలో ఆయన పాట ఉంది.. అపజయంలోనూ ఆయన పాట ఉంది. ప్రేమలో ఆయన పాట ఉంది.. విరహంలోనూ ఆయన పాట ఉంది.. ఆనందంలో ఆయన పాట ఉంది.. విషాదంలోనూ ఆయన పాట ఉంది.. మనిషి తాలూకు ప్రతి భావోద్వేగంలో బాలు పాట ఉంది. అందుకే బాలు ఎప్పటికీ ఉంటారు... ఆయన పాట ద్వారా గుర్తుండిపోతారు. బాలూ ఎంతోమంది సీనియర్ గాయనీమణులతో పాడారు. బాలూతో పాడే అవకాశం దక్కించుకున్న యువ గాయనీమణులు ఉష, కౌసల్య ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే బాలు గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలు నేనేమన్నా రాక్షసుడినా అన్నారు – కౌసల్య ‘‘నా కెరీర్లో బాలూగారితో 15 పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది’’ అన్నారు గాయని కౌసల్య. బాలూతో తన అనుబంధం గురించి కౌసల్య మాట్లాడుతూ – ‘‘పాడుతా తీయగా’ సెలక్షన్స్‌కి వెళ్లాను. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నన్ను పాడమన్నారు. బాలూగారి ముందు పాడటానికి కొంచెం భయపడ్డాను. అప్పుడు స్టేజీ మీద ఉన్న బాలూగారు షూటింగ్ ఆపేశారు. నా దగ్గరకి వచ్చి ‘ఒక్కసారి నా వైపు చూడు, నేనేమన్నా రాక్షసుడిలా ఉన్నానా’ అని ఆయన స్టైల్లో జోకులు వేస్తే షూటింగ్లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. అప్పుడు ఆయన నాతో ‘మనందరం ఒక సంగీత కుటుంబం అమ్మా. నువ్వు పాడే పాటను ఎన్నో లక్షలమంది ప్రేక్షకులు వింటారు. నీకు అద్భుతమైన కెరీర్ వస్తుంది. అందుకని భయపడకుండా పాడు’ అని ధైర్యమిచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను రిలాక్స్ అయి, బాగా పాడగలిగాను. నేను ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఆయన ఆ రోజు అలా చెప్పబట్టే కదా, ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది అనుకుంటాను. ఆ తర్వాత బాలూగారు అనేక ప్రాంతాలకు షూటింగ్లకని, షోలకని తీసుకెళ్లారు. అప్పుడాయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఒక్కోసారి వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్కడి వాతావరణానికి నోరు ఎండిపోతుండేది. ఆయన మా సింగర్స్ అందరి దగ్గరికి వచ్చి ‘ఈ వాతావరణానికి ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే చక్కెరకేళి తినండి.. తొందరగా ఎనర్జీ వస్తుంది’ అని చెప్పేవారు. చిన్న సింగర్.. పెద్ద సింగర్ అనే తేడా లేకుండా అందరితో చక్కగా కలిసిపోయేవారు. మొదట్లో నాకు సినిమా పాటలకు తక్కువగా అవకాశాలు వస్తుండేవి. ఆ టైమ్‌లో పెద్ద వంశీ గారు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మేల్ సింగర్‌గా బాలూగారు, ఫిమేల్ సింగర్ ఎవరు? అని సంగీత దర్శకుడు చక్రిగారిని వంశీగారు అడిగారట. అప్పుడు చక్రిగారు కౌసల్య అని కొత్తమ్మాయి నా సినిమాలకు పాడుతుందని చెప్పారట. ‘బాలూగారంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు కొత్తమ్మాయితో అంటే ఎలా పాడుతుందో’ అని కంగారు పడ్డారట వంశీగారు. నేను పాడుతుంటే ఓసారి రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చూసుకుని ‘ఈ అమ్మాయి బాగా పాడుతుంది’ అని అప్పుడు బాలూగారితో పాడే అవకాశం ఇచ్చారు వంశీగారు. ఆ పాట (రారమ్మని.. రారా రమ్మని...) పెద్ద హిట్ అయింది. తర్వాత కూడా బాలూగారితో 15 పాటలు దాకా పాడే అదృష్టం దక్కింది. బాలూగారు తెలుగు మ్యుజీషియన్ అసోసియేషన్‌కి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో సాయం చేశారు. ‘చెన్నై యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగర్స్‌కి కష్టమొచ్చినప్పుడు వారికి సాయం చేయటానికి నిధులు లేకపోతే ఎలా చేస్తారు? మీరందరూ కలిసి ఓ ఫండ్‡రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఫ్రీగా పాడతాను. నేను వస్తే నాతో పాటు అందరూ వస్తారు’ అన్నారు. దానివల్ల చక్కని నిధి ఏర్పడింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాద్యకారులకు పనిలేకుండా పోయింది. వారికేమన్నా ఇబ్బంది కలిగి ఆసుపత్రులకు వెళితే ఆ ఖర్చులను మా యూనియన్ భరిస్తోంది. బాలూగారి దయవల్లే చేయగలుగుతున్నాం’’ అన్నారు. మా కోసం వంట చేశాడు – కేజే ఏసుదాస్ ‘‘నాతో పని చేసినవాళ్లలో బాలు నాకు సోదరుడితో సమానం. బాలు నన్నెంత ప్రేమించాడో నాకే తెలియదు. బహుశా మేమిద్దరం గత జన్మలో అన్నదమ్ములం అయ్యుంటాం’’ అన్నారు ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్. బాలు గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా బాలూకి సంగీతం మీద ఉన్న జ్ఞానం అపారమైనది. అద్భుతంగా పాడటమే కాదు, కంపోజ్ కూడా చేసేవాడు. ‘శంకరాభరణం’ చిత్రంలో బాలు పాడిన తీరు అచ్చు సంగీతాన్ని ఔపోసన పట్టినవాడు పాడినట్టే ఉంటుంది. బాలు ఎప్పుడూ ఎవర్నీ నొప్పించలేదు. ఆప్యాయంగా, ప్రేమతోనే మాట్లాడేవాడు. ప్యారిస్‌లో కన్సర్ట్కి వెళ్తే మాకు వంట చేశాడు ఓసారి. కరోనా వల్ల అమెరికా నుంచి ఇండియా రాలేకపోతున్నాను. బాలూని చివరిసారిగా చూడలేకపోయినందుకు బాధగా ఉంది’’ అన్నారు ఏసుదాస్. పెద్ద లోయలో పడినట్లనిపించింది – పి. సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ – ‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన బాలూను వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత సినిమా, టీవీ.. ఇలా రెండు రంగాల్లోనూ అందరూ బిజీగా ఉండేవారు. వీళ్లకు తీపి ఎక్కువైంది అని కన్ను కుట్టినట్టుంది ఆ మహమ్మారికి.. మనందర్నీ దుఃఖసముద్రంలో ముంచేయాలని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇక మీద పాటలు వస్తాయి. కానీ బాలూ లేడు. ఈ వార్త వినగానే ఒళ్లు గగుర్పొడిచింది. దేశ విదేశాల్లో ఆయన అభిమానులున్నారు. ఆయనతో మొట్టమొదటిసారి అమెరికా షోకి వెళ్లాను. ఇప్పటికీ అదే అభిమానంతో ఆదరణ లభిస్తోంది. ఆయన మరణవార్త వినగానే ఒకేసారి ఓ పెద్ద లోయలో పడినట్టు అయిపోయింది. అందరూ గుండె ధైర్యం చేసుకోని ఉండాలి. ఘంటసాలగారిని మెప్పించాడు. మరిపించాడు. ఆయన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం. నాతో ఫస్ట్‌సారి పాడినప్పుడు కొంచెం భయపడి, మెల్లిగా తేలికపడి పాడాడు. ఇప్పుడు అందర్నీ మెప్పించేశాడు. అలాంటి బాలు ఇక లేడా? తీసుకోలేకపోతున్నాను. దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఘంటసాలగారు వెళ్లిపోయారు. రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. ఇంకా ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. కానీ బాలు నిష్క్రమణాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఉందాం’’ అన్నారు. ఆయన నాకు తండ్రిలాంటివారు – ఉష ‘‘బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఆయన నాకు తండ్రి లాంటివారు. ‘పాడుతా తీయగా’ లాంటి పెద్ద ప్లాట్‌ఫాం మీద నన్ను అభినందించి, ప్రోత్సహించి ఇక్కడవరకు తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు గాయని ఉష. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘నాకే కాదు ఎంతోమందికి బాలూగారు ఇటాంటి వేదిక మీద అవకాశాలు ఇచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేసేవారు. ఆయన ఆయాచితంగా ఎవరినీ పొగడరు. ఆయనతో మెప్పు పొందటమంటే సామాన్యమైన విషయం కాదు. నేను ఆయనతో కలిసి చాలా స్టేజ్ షోలు చేశాను. శైలజగారు ఆ ప్రోగ్రామ్‌లో లేకపోతే ‘వేదం అనువణువున నాదం...’ పాటను నాతో పాడించేవారాయన. బాలూగారు అమెరికా వచ్చినప్పుడు ‘మావారితో ఇండియా వచ్చేయండయ్యా’ అని ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం, అనేక సినిమాల్లో ఆయనతో ఓ 15 పాటలదాకా పాడటం అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మొదట ఆరోగ్యం నుండి కోలుకోవటానికి ఆయన ఎంతో పోరాడారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుని, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనుకున్నారు. రెండోసారి సమస్య వచ్చినప్పుడు ఆయన గివ్‌అప్ చేసేశారు. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం’’ అన్నారు ఉష. ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అదే – ఏఆర్ రెహమాన్ ‘‘బాలూగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం దేనికీ ‘నో’ చెప్పకపోవడం. ఎలాంటి ప్రయోగానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారాయన. పాడటానికైనా, యాక్టింగ్‌కి అయినా, మ్యూజిక్ డైరెక్షన్‌కి అయినా దేనికైనా సిద్ధమే’’ అన్నారు రెహమాన్. యస్పీ బాలుతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో తెలిపారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ఓసారి యస్పీబీగారి పుట్టిన రోజు వేడుకలో పెర్ఫార్మ్ చేశాను. అదే నా తొలి పెర్ఫార్మెన్స్. 1982లో మేము మ్యూజిక్ అకాడమీలో ఉన్నప్పుడు ఆ వేడుక జరిగింది. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నన్ను ఆయనకు పరిచయం చేసింది సుహాసినీగారే. నేను వేరే సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసే సమయంలో యస్పీబీగారు 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని, 10 నిమిషాల్లో పాడేసి మరో పాటను రికార్డ్ చేయడం కోసం వెళ్లిపోయేవారు. అలాంటి గాయకుడిని నేనెక్కడా చూడలేదు. అంత ప్రొఫెషనల్, అంత వేగం, అంత మంచితనం. నా తొలి చిత్రం ‘రోజా’లో ‘నా చెలి రోజావే..’ పాట రికార్డ్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. ‘ఇలాంటి స్టూడియోలో సినిమాటిక్ సౌండ్‌ని సృష్టించగలమా?’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను నవ్వాను. సినిమా విడుదలైన తర్వాత ‘సినిమాటిక్ సౌండ్ ఎక్కడైనా సృష్టించొచ్చు అని నిరూపించావు’ అని అభినందించారు. జీవితాన్ని పూర్తిగా జీవించారు ఆయన. అందర్నీ ప్రేమించారు. అందరిచే ప్రేమించబడ్డారు. మన విజయాల్లో, విషాదాల్లో, వినోదాల్లో, ప్రేమలో, భక్తిలో ఆయన గాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆయనంత విభిన్నమైన సింగర్ మళ్లీ ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. ఆయన సంగీతాన్ని, జీవన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సౌతిండియా అందరిలో ఓ భాగం యస్పీబీ’’ అన్నారు రెహమాన్. -
సుశీలకు కొప్పరపు జాతీయ పురస్కారం
విశాఖపట్నం ,మద్దిలపాలెం : గానకోకిల, సినీ నేపధ్యగాయని పి.సుశీల ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవులు 2019 జాతీయ ప్రతిభ పురస్కారానికి ఎంపికయ్యారు. నగరంలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సోమవారం జరిగే కొప్పరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవంలో అతిరథ మహారథుల చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. అలాగే సంప్రదాయ ప్రకారం అవధాన విద్యలో సాహితీవేత్తలకు ఇచ్చే‘ అవధానాచార్య’ పురస్కారానికి డాక్టర్ అశావాది ప్రకాశరావును ఎంపిక చేశారు. కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి (పూర్వాశ్రమంలో) ప్రసాదరాయ కులపతికి‘గురుపూజోత్సవం ’నిర్వహించనున్నారు. కొప్పరపు కవులు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు మాచవరం వేంకట చెంచురామ మారుతీ సుబ్బరాయ శర్మ (మా శర్మ) ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేశారు. ముఖ్య అతిథులుగా మంత్రి ముత్తంశెట్టి, సీఎస్ ఎల్వీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు, సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పురస్కారాలు అందుకున్న ఉద్దండులు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి( 1885–1932), కొప్పరపు వేంకటరమణ(1887–1942) జంటకవుల పేరిట నెలకొల్పిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న ఉద్దండుల్లోపండిట్ శివకుమార్‌శర్మ, పండిట్ జస్రాత్, పద్మవిభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ, వేటూరి సుందరరామూర్తి, బేతవోలు రామబ్రహ్మం, మేడసాని మోహన్, మల్లాది చంద్రశేఖర్‌శాస్త్రి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కోట సచ్చిదానంద శాస్త్రి, గరికిపాటి నరసింహారావు కళాతపస్వి కె. విశ్వనా«థ్, డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి దిగ్గజాలున్నారు. -
ప్రజారంజకంగా పాలించండి : పి.సుశీల
సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ క్రమంలో గాన కోకిల పి. సుశీల ఆయనకు అభిందనలు తెలిపారు. ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్‌కు తన ఆశీస్సులు అని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో తమ ట్రస్టు ద్వారా ఎందరో కళాకారులకు ఆయన ప్రోత్సాహం అందించారని తెలిపారు. మహానేత ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్ కూడా ప్రజారంజక పాలన చేయాలని ఆకాంక్షించారు. -
శతవసంతాల కళాశాలకు మహారాజ వైభవం
విజయనగరం మహారాజా సంగీతసాహిత్య పోషణకు నిదర్శనాలు కోకొల్లలు. విజయనగరంలో ఆయన నిర్మించిన సంగీత కళాశాల నాటి కళావైభవాన్ని నేటికీ చాటుతోంది. ఒక చిన్న గాన సభగా మొదలైన ఈ కళాశాల నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో ఈ కళాశాల నుంచి ఎందరో కళాకారులు ఉద్భవించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరవాత 1957లో ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. విద్యార్థులంతా ఆంగ్ల విద్యవైపు మొగ్గు చూపుతుండటంతో ఒక దశాబ్ద కాలంగా ఇక్కడ చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రిన్సిపాల్, ఒక టీచర్, ఒక విద్యార్థి స్థాయికి పడిపోయింది. ఐదుసంవత్సరాల ఓరియెంటల్ బిఎ చదవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతుండడంతో. కాలేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది.దాంతో కళాశాల ప్రిన్సిపాల్ ఉద్యమదీక్ష పూని కాలేజీ గత వైభవాన్ని పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ‘‘సంస్కృతవిద్య కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అనే ఒక భ్రమ ఉంది చాలామందిలో. ఆ భ్రమను తొలగించేలా... కులమతాలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరికీ ప్రవేశం’’ అని కరపత్రాలు ప్రచురించి, కళాశాల చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాలలో పంచారు. ఈ ఒక్కమాటతో అనూహ్య స్పందన వచ్చింది. ఒకటి నుంచి నలభై రెండుకు... కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజులు కట్టడంతో విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి 42కు చేరింది. ఘన చరిత్ర... ఈ కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలో ఉద్యోగిగా పనిచేస్తున్న చాగంటి జోగారావుగారి కుమారుడు గంగబాబు అంధుడు. ఆ బాలుడి కోసం 1919, ఫిబ్రవరి 5వ తేదీన విజయరామ గజపతిరాజు విజయనగర గాన పాఠశాలను ఏర్పాటుచేశారు. ఆ రోజుల్లో ఆ పాఠశాలకు హరికథా పితామహుడు అజ్జాడ అదిభట్ల నారాయణదాసు అధ్యక్షులయ్యారు. అనంతరం ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు అధ్యక్షులయ్యారు. టౌన్ హాల్... విజయనగరం కోట వెనుక ప్రాంతంలోని నేటి ఈ కళాశాలను అప్పట్లో టౌన్‌హాల్ అని పిలిచేవారు. దక్షిణాదిన కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయొలిన్, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలలో శిక్షణ ఇచ్చేవారు. విచిత్రమేమిటంటే ఈకళాశాలలో నాటినుంచి నేటివరకు హరికథకు స్థానం కల్పించలేదు. ప్రముఖులు... ఘంటసాల, గాయని పి. సుశీల, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం వంటి వారంతా ఈ కళాశాల విద్యార్థులే. సినీరంగంలో సంగీత దర్శకులుగా ప్రసిద్ధులైన సాలూరి రాజేశ్వరరావు ఇక్కడ నుంచి వచ్చిన మాణిక్యమే. సంగీత చూడామణి నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం సత్యనారాయణ, ద్వారం దుర్గాప్రసాదరావు ఈ కళాశాల ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేశారు. వయొలిన్... పాశ్చాత్య తంత్రీ వాద్యమైన ఫిడేలును కర్ణాటక సంగీతం వాయించడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతం చేశారు ద్వారం వెంకట స్వామినాయుడు. ఈ కళాశాల నూరేళ్లు పూర్తి చేసుకుంది. నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం భావనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, బురిడి అనురాధా పరశురాం... వంటివారంతా ఈ కళాశాలకు అధ్యక్షులుగా పనిచేశారు. దూరం నుంచి వచ్చిన విద్యార్థులకు మేలు కలిగిస్తూ, ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా సంగీతోత్సవాలను అధ్యాపక, విద్యార్థి బృందాలు నిర్వహిస్తున్నాయి. సాంస్కృతిక శాఖ సహకరిస్తోంది. ఈ కళాశాలలోని సంగీత దర్బార్ ఎంతో విలక్షణమైనది. ఎందరో విద్వాంసులు ఈ కళాశాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. పదిసంవత్సరాలు నిండిన వారెవరైనా సంగీత, నృత్యాలలో ప్రవేశించడానికి అర్హులు. ప్రతి సంవత్సరం ఇక్కడ కళాపరిచయం ద్వారా శిక్షణ పొందినవారికి ఈ సంగీత, నృత్యకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు. పది సంవత్సరాలు నిండినవారు ఎవరైనా సంగీత, నృత్యాల్లో విద్యార్థులుగా చేరే అవకాశం ఉంది. ఒడిషా వాసులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వారికి ఇది అందుబాటులో ఉంది. ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు, ద్వారం భావనారాయణరావు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం దుర్గాప్రసాదరావు, పి.వి.యస్. శేషయ్యశాస్త్రి, బురిడి అనురాధ పరశురాం (ప్రస్తుతం) ఈ కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు. – జయంతి -
సంగీత దర్శకురాలిగా గానకోకిల
సాక్షి, చెన్నై : ప్రతిభకు వయసుతో పని ఉండదు. అలా సంగీతరంగంలో గాయనిగా ఎనలేని కీర్తికిరీటాలను అందుకున్నారు గానకోకిల పి.సుశీల. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హింది, సంస్కృతం, తుళు ఇలా 11 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డును సాధించారు. పద్మభూషణ్ అవార్డు వరించింది. 80వ వసంతంలో అడుగిడిన ఆమె సంగీతదర్శకురాలిగా కొత్త అవతారం ఎత్తుతున్నారనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. గాయనిగా 60 ఏళ్ల అనుభవం కారణంగానే ఆమెకు ఈ అవకాశం వచ్చినట్లు సమాచారం. నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా పోరాడి ఆత్యహత్య చేసుకున్న వైద్య విద్యార్ధిని అనిత జీవిత వృత్తాంతం సినిమాగా తెరకెక్కుతోంది. డాక్టరు ఎస్.అనిత ఎంబీబీఎస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనిత పాత్రను బిగ్‌బాస్ గేమ్ షో ఫేం జూలీ నటిస్తున్నారు. ఎస్.అజయ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిత తండ్రి పాత్రలో రాజ్దళపతి నటిస్తున్నారు. చిత్ర ఫస్ట్లక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయనీమణి పీ సుశీలను సంగీతం అందించాల్సిందిగా కోరగా ముందు తనకు ఆసక్తి లేదని చెప్పారట. తరువాత చిత్రవర్గాల ఒత్తిడి, కథ ఆకట్టుకోవడంతో సంగీతాన్ని అందించడానికి సమ్మతించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే నిజం అయితే డాక్టరు ఎస్.అనిత ఎంబీబీఎస్ చిత్రానికి పీ సుశీల సంగీతం బలంగా నిలుస్తుంది. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ఆమె: ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన నిలువలేనోయి అ: ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ఆ: ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన నిలువలేనోయి చరణం : 1 అ: మనసులోని మమతలన్నీ మల్లెపూలై విరిసె నీకై (2) ఆ: వలపులన్నీ పూలమాలై కురులలోన కొలిచె నీకై అ: ఎన్ని జన్మలకైనా... నీవు నాదానివేనే ఇద్దరు: ఇందుకు సాక్ష్యము గిరులు తరులు గిరులు తరులు... ॥ చరణం : 2 ఆ: నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోనా (2) అ: ఎల్లవేళలా జీవితాన నిన్ను దేవిగా కొలుచుకోనా ఆ: గౌరీశంకరుల చందం మనది విడిపోని బంధం ఇద్దరు: ఇందుకు సాక్ష్యము సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు... ॥ చిత్రం : కృష్ణవేణి (1974) రచన : దాశరథి, సంగీతం : విజయభాస్కర్ గానం : వి.రామకృష్ణ, పి.సుశీల ఈరోజు కృష్ణంరాజు పుట్టినరోజు