ఈ పాటకు ట్యూన్ తెలుసా? | krishnam raju birth day special song | Sakshi
Sakshi News home page

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

Published Mon, Jan 20 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

 పల్లవి :
 అతడు: ఎందుకో నీవు నాతో ఉన్నవేళ
   ఇంత హాయి
 ఆమె: ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన
   నిలువలేనోయి
 అ: ఎందుకో నీవు నాతో ఉన్నవేళ
   ఇంత హాయి
 ఆ: ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన
   నిలువలేనోయి
 చరణం : 1
 అ: మనసులోని మమతలన్నీ
   మల్లెపూలై విరిసె నీకై     (2)
 ఆ: వలపులన్నీ పూలమాలై
   కురులలోన కొలిచె నీకై
 అ: ఎన్ని జన్మలకైనా... నీవు నాదానివేనే
 ఇద్దరు: ఇందుకు సాక్ష్యము గిరులు తరులు
   గిరులు తరులు...
 ॥
 చరణం : 2
 ఆ: నీలికన్నుల ఆలయాన
   నిన్ను స్వామిగ నిలుపుకోనా     (2)
 అ: ఎల్లవేళలా జీవితాన
    నిన్ను దేవిగా కొలుచుకోనా
 ఆ: గౌరీశంకరుల చందం
   మనది విడిపోని బంధం
 ఇద్దరు: ఇందుకు సాక్ష్యము సూర్యుడు చంద్రుడు
   సూర్యుడు చంద్రుడు...
 ॥
 చిత్రం : కృష్ణవేణి (1974)
 రచన : దాశరథి, సంగీతం : విజయభాస్కర్
 గానం : వి.రామకృష్ణ, పి.సుశీల
 
 ఈరోజు కృష్ణంరాజు పుట్టినరోజు
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement