
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పచ్చ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.