గాన సరస్వతి పద్మభూషణ్ పి.సుశీల ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో సరిగమల వీణ మోగిస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ తదితర భాషల్లో తన గానామృతాన్ని పంచిన గాయనీమణి పి.సుశీల. ఘంటసాల, బాల సుబ్రమణ్యం లాంటి లెజెండరి సింగర్స్‌తో కలిసి ఎన్నో పాటలు పాడిని ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా దివంగత లెజెండరి సింగర్ బాలుని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. బాలుగారి మరణంతో మొత్తం చీకటి అయ్యిందని ఆమె వాపోయారు.
‘బాలు లాంటి గాయకుడు ఎవరు ఉండరు. ఇక రారు కూడా. ప్రస్తుతం ఉన్నవాళ్లు ఆయనలా పాడటానికి ట్రై చేస్తున్నారు. కానీ ఆయన లేని లోటు ఎవరి తీర్చలేనిది. ఎంతో గొప్ప స్వరం ఆయనది. ఆయన పాటలు వింటుంటే ఇంకో పదేళ్లు బాలు గారు ఉండకూడదా అని దేవుడితో పోట్లాడుతుంటాను’ అన్నారు. ఆయన చనిపోయినప్పుడు కనీసం చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదని, తనని రానివ్వలేదన్నారు. మీకు వయసైపోయింది. కరోనా ఉంది రావద్దన్నారు.. ఇక ఏం చేయలేక టీవీల్లో చూసి ఏడ్చానంటూ ఆమె వాపోయారు. ‘అసలు ఏం లేదు సినిమా లోకమంతా చీకటి అయిపోయింది. అంత పైకి తీసుకువచ్చారు.
ఆ క్యారెక్టర్ తగినట్లు పాట పాడటం అంటే సాధారణ విషయం కాదు . ఒక్క పాటలే కాదు డబ్బింగ్, డైరెక్షన్ అంటే మామూలు విషయం కాదు. అది చాలా గొప్పవరం’ అంటూ బాలుని గుర్తు చేసుకున్నారు. ఇక బాలుతో ఉన్న జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఒకసారి మేం అమెరికా వెళ్లాం. అప్పుడు ఆయన కుర్రాడు. నిర్మాతలమో ఆయనతో పాట పాడించద్దు అంటారు. అలాంటి బాలు గారు ఇంగ్లీష్‌లు పాటలు. లతా మంగేష్కర్ వంటి గొప్ప గాయనీతో కలిసి పాడి స్టార్ సింగర్ అనిపించుకున్నారు. అందుకేనేమో ఆయన గొప్ప గాయకుడు అవుతాడని దేవుడు కుళ్లు కున్నట్లు ఉన్నాడు. ఆయన గాత్రం దేవుడు ఇచ్చిన వరం. ఆయన మరణంతో మొత్తం చీకట అయిపోయింది’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment