
దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబరు 4న రిలీజ్ కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ పరిచయ పాటను రిలీజ్ చేశారు. రజనీ నటించిన ఈ పాటను ఎస్పీబీ పాడారు. ఈ సందర్భంగా ఆయన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
‘‘నలభైఅయిదేళ్లు నా గాత్రంలా జీవించారు ఎస్పీబీ గారు. నా ‘అన్నాత్తే’ సినిమా కోసం ఆయన పాడిన పాటలో నటిస్తున్నప్పుడు నాకు ఆయన పాడే చివరి పాట ఇదే అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనెంతగానో అభిమానించే ఎస్పీబీ తన మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు’’ అని రజనీకాంత్ తమిళంలో ట్వీట్ చేశారు.
చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే
45 வருடங்கள் என் குரலாக வாழ்ந்த எஸ்பிபி அவர்கள் அண்ணாத்தே படத்தில் எனக்காகப் பாடிய பாடலின் படப்பிடிப்பின் போது, இதுதான் அவர் எனக்குப் பாடும் கடைசிப் பாடலாக இருக்கும் என்று நான் கனவில் கூட நினைக்கவில்லை. என் அன்பு எஸ்பிபி தன் இனிய குரலின் வழியாக என்றும் வாழ்ந்து கொண்டே இருப்பார்.
— Rajinikanth (@rajinikanth) October 4, 2021