sp balasubramaniam
-
ఎస్పీ బాలు చనిపోయినప్పుడు రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లాను: సింగర్
'నీదారి పూలదారి.. పోవోయి బాటసారి..', 'రేపటి పౌరులం..', 'ఆకతాయి చిన్నోడు..' ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు గాయని బి.రమణ. తెలుగులోనే కాదు దక్షిణాదిలోనూ పలు భాషల్లో పాటలు ఆలపించారు. తన అద్భుత గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఆమె అన్నమయ్య కీర్తనలు, భక్తి పాటలు సైతం పాడేవారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మాది విజయవాడ. చిన్నప్పటి నుంచే పాటలు పాడేదాన్ని. ఎక్కడికి వెళ్లినా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. రెండో బహుమతికి ఒప్పుకునేదాన్ని కాదు. చాలా ఎంకరేజ్ చేసేవారు నా గొంతు బాగుండటంతో సినిమాల్లో పాడే అవకాశాలు వచ్చాయి. ఘంటసాల గారు ఓ సారి నా పాట విని మెచ్చుకుని నాకు ఎక్కువ పారితోషికం ఇవ్వమని సూచించారు. అంతేకాక తనతోపాటు బెంగళూరులో కచేరీకి తీసుకెళ్లారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఎంతో ఎంకరేజ్ చేసేవారు. చాలా మర్యాద ఇచ్చేవారు. బాలు చనిపోయినప్పుడు నన్ను వెళ్లవద్దని సూచించారు. ఎందుకంటే అది కరోనా సమయం.. పరిస్థితులు బాలేవని బయటకు వెళ్లొద్దన్నారు. కానీ ఆయనను చూడాలని ధృడంగా నిశ్చయించుకున్నాను. ఏ అవార్డూ రాలేదు అక్కడికి వెళ్లేసరికి పుట్టెడుమంది జనాలున్నారు. వాళ్లంతా సినిమావాళ్లు కాదు. తమిళులు. నేను రోడ్డుపైనే ఏడ్చుకుంటూ వెళ్లాను. ఎంత నడిచినా ఇంకా దారి అర్థం కాకపోవడంతో నేను కూడా లైన్ కట్టి వెళ్లాను. అయ్యో పెద్దావిడ, ఏడ్చి సొమ్మసిల్లేలా ఉందని కొందరు నన్ను ముందుకు పంపించారు. బాలును చూశాక దుఃఖం ఆగలేదు. ఆయనతో కలిసి ఎన్నో డ్యూయెట్ సాంగ్స్ పాడాను. ఆ గొంతు ఇక మూగబోయిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆ కాలంలో అందరూ నన్ను గౌరవించారు, వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి వల్లే వేల పాటలు పాడాను. కానీ ఇంతవరకు నాకు ఏ అవార్డు రాలేదని ఎప్పుడూ ఫీలవలేదు. సుశీల, జానకి, ఘంటసాల.. ఇలా ఎందరినో కళ్లారా చూస్తే చాలనుకున్నాను, అలాంటిది వారితో కలిసి పాడాను, అదే నాకు దక్కిన పెద్ద గౌరవం, తృప్తి' అని చెప్పుకొచ్చారు గాయని రమణ. చదవండి: ధర్మవరపు సుబ్రహ్మణ్యంను కడసారి చూసేందుకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదా? -
స్వరార్చన
-
ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు: రజనీ కాంత్
దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబరు 4న రిలీజ్ కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ పరిచయ పాటను రిలీజ్ చేశారు. రజనీ నటించిన ఈ పాటను ఎస్పీబీ పాడారు. ఈ సందర్భంగా ఆయన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘‘నలభైఅయిదేళ్లు నా గాత్రంలా జీవించారు ఎస్పీబీ గారు. నా ‘అన్నాత్తే’ సినిమా కోసం ఆయన పాడిన పాటలో నటిస్తున్నప్పుడు నాకు ఆయన పాడే చివరి పాట ఇదే అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనెంతగానో అభిమానించే ఎస్పీబీ తన మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు’’ అని రజనీకాంత్ తమిళంలో ట్వీట్ చేశారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే 45 வருடங்கள் என் குரலாக வாழ்ந்த எஸ்பிபி அவர்கள் அண்ணாத்தே படத்தில் எனக்காகப் பாடிய பாடலின் படப்பிடிப்பின் போது, இதுதான் அவர் எனக்குப் பாடும் கடைசிப் பாடலாக இருக்கும் என்று நான் கனவில் கூட நினைக்கவில்லை. என் அன்பு எஸ்பிபி தன் இனிய குரலின் வழியாக என்றும் வாழ்ந்து கொண்டே இருப்பார். — Rajinikanth (@rajinikanth) October 4, 2021 -
బాలు తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి..
మొత్తం 40 వేల పాటలు, 16 భారతీయ భాషలు, అన్ని భాషల టాప్ హీరోలకు గాత్రదానం చేసి పుణ్యం కట్టుకున్నారు. పద్మభూషణ్ సన్మానితులు. ప్రతిభ, ఓర్పు, సహనం కలబోసుకున్న త్రివేణి యస్పీ బాలు. తల్లిదండ్రులకు వరపుత్రుడు, భార్యకి పూర్వజన్మ సుకృతం, పిల్లలకి ఆదర్శప్రాయుడైన తండ్రి, జన్మజన్మలకి ఈ అన్నే కావాలనుకునే చెల్లెమ్మలు, ‘మావాడు’ అని విర్రవీగే నెల్లూరు సీమవాసులు, భూమధ్యరేఖ ఎగువన దిగువన బాలు పాట కోసం కలవరించే పిచ్చి అభిమానుల పొగరు, గర్వం నిన్న మధ్యాన్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు (25.9.2020) ఒక్కసారిగా అణిగాయి. తెలుగువాళ్లం ఇంకా ఏం చూసుకు గర్వపడాలి? మాకోసం ఎన్ని విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు కొల్లగొట్టుకు తెచ్చారు? ఒక మంద నందుల్ని (21) ఎక్కడెక్కడ నుంచో తోలుకొచ్చి మాకు కైవసం చేశారు. ఎన్ని దేశాలు తిరిగారు, ఎన్ని టీవీ షోలని పండించారు? మీరు కనిపించ కుండా ఒక్కపూట గడుస్తుందా? మాకు మీ పాట వినిపించకుండా ఒక గంట గడుస్తుందా? మీ వయసెంతని ఎవరైనా ఎపుడైనా అడిగారా? ఎన్నేళ్లనుంచి ఈ రేయింబవళ్ల కోలాహలం జనం కోసం సాగిస్తారని అడిగామా? బాలూ! నువ్వంటేనే పాటల జాతర. నెల్లూరు సీమలో ఎన్నడో కోయిలలు స్వరాలు మర్చిపోయాయి. బహుశా 1966లో మహా గానగంధర్వుడు గళం విప్పాడని చెవులారా విని, పిక సముదాయం ఒక్క పలుకుమీద నిలిచి సృష్టికి కొరత లేదని కూతలు కట్టుకున్నాయ్. (పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి... ) వానలో తడియనివారు, ఎండ పొడ సోకని వారు, బాలు మా బంగారు నాయనతో జ్ఞాపకాలు అనుభవాలు లేని వారు ఎవరూ ఉండరు. ఎన్ని భాషల అనుభవాలు, ఎన్నేసి జ్ఞాపకాలు, అనుభవాలు లేని జ్ఞాపకాలు. పాడిన పాటల గురించి కాదు, ఆయన పాడని పాటల గురించి కలలు కంటూ ఉండే వారు. వృత్తిమీద గౌరవం, భయభక్తులు బాలుకి పుటకతో అబ్బిన సుగుణాలు. బాపు రమణలు ‘త్యాగయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు బాలుని సంప్రదించారు. ‘నా భాగ్యం’ అన్నారు నమస్కరిస్తూ. తర్వాత రెండో రోజో, మూడో రోజో బాలసుబ్రహ్మణ్యంగారి తండ్రి సాంబమూర్తి బాపు రమణలని కలవడానికి మా ఆఫీస్‌కి వచ్చారు. పెద్దలు, మీకో మాట చెప్పాలని వచ్చాను. మా వాడికి శాస్త్రీయం తెలియదు. తెలిసి తెలిసి మీరు పెట్టుకున్నారు. ‘అయ్యా, ఒకటికి రెండుసార్లు మూడుసార్లు పాడించండి. కొంచెం దగ్గరగా జరిగి, అవసరమైతే ఒక దెబ్బ వేసైనా సరే, సరిగ్గా పాడించండి’ అని హితవు పలికారు. బాపుగారు ఆ మాటకి పడీపడీ నవ్వారు. ఎందుకంటే అప్పటికే శంకరాభరణం పాటలు గ్లోబ్ మొత్తం మార్మోగుతున్నాయ్. బాపు రమణలకి బాలు అంటే ప్రాణం. 1967 బాపు రమణలు సాక్షి తొలి చిత్రం తీశాక, వెంటనే ‘బంగారు పిచిక’ సినిమా ప్లాన్ చేశారు. మొదట్లో దాని పేరు ‘స్వయంవరం’ ఫొటోకార్డ్స్ కూడా వచ్చాక దానిపేరు మార్చారు. అయితే బంగారుపిచుకలో బాలుని హీరోగా ఎన్నుకున్నారు. అప్పుడు బాలు సుకుమారం అంతటిది. ఆయన సరసన నాయికగా యుద్ధనపూడి సులోచనా రాణిని ఖాయం చేశారు. అయితే, కారణం ఏదైతేనేం ఈ బంగారు పిచిక రెక్కలు విదిల్చి ఎగరనే లేదు. బాపు రమణలకు బాలు సమర్పించిన అపురూప జంట మహదేవన్, పుహళేంది. కడదాకా ఈ స్నేహాలు సాగాయి. నేటి ప్రఖ్యాత చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ దృష్టి ఆరుద్రపై తొలిసారి పడింది. ఒక టోర్నీకి యస్పీతో ఆరుద్ర స్పాన్సర్ చేయించారు. ఇలాంటి సందర్భాలు బాలు జీవితంలో కోకొల్లలు. హైదరా బాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్టకి బాలు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. బాలుగారి జీవితంలో తీరిన కోరికలు కోటానుకోట్లు. తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి. అదేమంటే నవంబర్ నెల తేట నీటిపై గోదావరి మీద పున్నమి వెన్నెలపై పాపికొండలు దాటి శబరి కలిసేదాకా మూడు లాంచీలు, ఆరు పంట్లు (పంట్ అంటే లాంచీకి టగ్ చేసే ఫ్లాట్‌ఫాం) కట్టుకుని అలా పాడుకుంటూ వెళ్లాలని. అందులో బాలు, బాపురమణ, వేటూరి, ఎ.ఆర్. రెహ్మాన్ (అప్పట్లో దులీప్ ఆయన పేరు) ఇంకా శివమణి (డ్రమ్స్), ఫ్లూట్ మాస్టర్ గుణ ఉంటారు. చిన్న సరంజామాతో బాలు పాటలు పాడతారు. వేటూరి వెన్నెట్లో గోదారి అందాలమీద, దేవిపట్నం రంపచోడవరం అల్లూరి పౌరుషాగ్ని మీద మూడు పల్లవులు, ఆరు చరణాలు చెబుతారు. బాపు ఆ వెన్నెల వెలుగులో లాంచీ తూగులో భద్రాచలంపై కొలువుతీరిన రాముణ్ణి పిచ్చి పిచ్చిగా గీసుకుంటారు. ఇదీ యాత్రా విశేషం. బాలూ గారూ! పోనీ ఒక్కసారి రాకూడదూ? మన గోదారి యాత్ర పండించుకుందాం. ఎందరో ఎన్నేళ్లుగానో మమ్మల్ని చూసి ఈర్ష్య పడుతున్నారు. ఆఖరికి ఇలా జరిగింది. ఏమివ్వగలం ఈ గుప్పెడు అక్షరాలు తప్ప. పైగా మీరు నాకు మరీ ప్రత్యేకం. మీరు నా హీరో... మిథునం ఫేమ్. వ్యాసకర్త: శ్రీరమణ ప్రముఖ కథకుడు -
నాకు మాటలు రావట్లేదు: భారతీరాజా
సాక్షి, చెన్నై: కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ నేపథ్యంలో తమిళదర్శకుడు భారతీరాజా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ.. కరోనాతో పోరాడి బాలు తిరిగి వస్తారని ఆశించా. కరోనాతో కోలుకుంటున్నారని అనుకున్నా.. ఆ పరిస్థితి లేదు. నా చిరకాల మిత్రుడిని ఈ పరిస్థితిలో చూసి బాధేసింది. బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావడం లేదు అంటూ భారతీరాజా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దురదృష్టవశాత్తు బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. -
ఆయన పిలిచారు.. నేను వెళ్లాను
‘‘నేను, అన్నయ్య ఏసుదాస్, చిత్ర ముగ్గురం కలిపి అన్ని భాషల్లో దాదాపు లక్ష పాటల వరకు పాడితే అందులో తెలుగు పాటలే 35,000 వరకూ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అలేఖ్య హోమ్స్ సమర్పణలో ఎలెవన్ పాయింట్ టూ ప్రొడక్షన్స్ వారు ‘లెజెండ్స్’ సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 30న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌లో పాటలు ఎక్కువ, మాటలు తక్కువగా ఉంటాయి. గతంలో ఇలాంటి ప్రోగ్రామ్ జరగలేదు. మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్లు ఎక్కడా కలిసి ప్రోగ్రామ్‌లు చేయలేదు. వాళ్లతో పోల్చుకునేంత పెద్దవాళ్లం కాకపోవచ్చు కానీ, స్కేల్ కోసం చెప్తున్నాను. మూడు గంటల్లో ముగ్గురం 30 లేదా 35 పాటలు పాడతాం. మన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే టాలెంటెడ్ మ్యుజీషియన్స్‌తో పాటు రెహమాన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి సన్‌షైన్ ఆర్కెస్ట్రా పిల్లలు కూడా మా బృందంలో ఉంటారు. రెహమాన్ దగ్గర ఉన్న శ్రీనివాసమూర్తి కూడా భాగమవుతున్నారు’’ అన్నారు. పాటలపై రాయల్టీ విషయంలో మీరు, ఇళయరాజా కొంత కాలం మాట్లాడుకోలేదు. ఇప్పుడు కలుసుకున్నారు. మీరు మళ్లీ ఎలా కలుసుకున్నారు? అని అడిగితే – ‘‘నేనెప్పుడూ ఆయన సంగీతంలో పాడనని చెప్పలేదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లటానికి తయారుగా ఉన్నాను. ఆయన పిలిచారు, నేను వెళ్లాను. రిహార్సల్స్‌కి వెళ్లినప్పుడు ఏరా.. ఎలా ఉన్నావు? అంటే బావున్నాను, అంటే బావున్నాను అని ఇద్దరం అనుకున్నాం. ‘ఒకసారి ఇలా రా. చాలా రోజులైంది కౌగిలించుకొని’ అన్నారు. ఇద్దరం కౌగిలించుకున్నాం. అంతటితో అయిపోయింది. గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. ఈ మధ్య రెండు ప్రోగ్రామ్‌లు కలిసి చేశాం. కోయంబత్తుర్‌లో ఓ ప్రోగ్రామ్, వచ్చే ఆదివారం తిరుచునాపల్లిలో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే వచ్చే ఏడాది మార్చిలో 6 వారాల పాటు అమెరికాలో ప్రోగ్రామ్‌లు ఇవ్వనున్నాం. ఆయన అయితే నాతో ప్రోగ్రామ్‌లు చేయటానికి ఫిబ్రవరి వరకు డేట్స్ అడుగుతున్నారు కానీ, ఖాళీగా లేవు. ఇంట్లో వాళ్ల మధ్య ఎప్పుడైనా పొరపొచ్ఛాలు రావచ్చు. ఇద్దరి మనస్తత్వాలను బట్టి ఆ సమస్యను పరిష్కరించుకోవటం చాలా ఈజీ. పట్టుదలలు, పంతాలు ఉంటే చాలా కష్టం. తెగేదాకా ఏదీ లాగకూడదు. ఇద్దరికీ కలిసి పని చేయాలని కోరిక ఉంది కాబట్టి మాకు ఈజీ అయింది. అయినా ఇది వేరే ఒక ఇష్యూ మీద వచ్చిన సమస్య తప్ప వ్యక్తిగతమైనది కాదు. ఎందుకంటే నా పాట అంటే ఆయనకి ఇష్టం, ఆయన సంగీతమంటే నాకు బహు ఇష్టం. ఆ కాంబినేషన్ కావాలని సంగీత ప్రియులంతా ఎదురు చూస్తుంటే అది జరిగింది. అంతకంటే ఏం కావాలి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలు తనయుడు, గాయకుడు ఎస్.పి చరణ్ పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా నా పాటలు పాడొద్దు
నా అనుమతి లేకుండా నా పాటలు పాడారంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నోటీసులు జారీ చేసిన విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇళయరాజా. ‘‘నేను కంపోజ్ చేసిన పాటలు పాడుతున్న గాయకులందరకీ ఇదే నా విన్నపం. నా పాటలు పాడొద్దని మీకు చెప్పడం లేదు. కానీ, పాడే ముందు నా అనుమతి తీసుకోండి.. తీసుకోకపోతే మాత్రం నేరం. నా అనుమతి లేకుండా నా పాటలు పాడితే మ్యుజీషియన్స్‌తో పాటు బ్యాండ్ సభ్యులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాదు.. నేను ఐపీఆర్‌ఎస్(ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో సభ్యుడిని కాకున్నా నా పాటలు పాడుతున్న వారి నుంచి రాయల్టీ ఫీజును ఐపీఆర్‌ఎస్ వసూలు చేస్తోంది. ఇకపై అలా జరగకూడదు. ఆ ఫీజు ‘దక్షిణ సినిమా సంగీత కళాకారుల సంఘం’ సేకరిస్తుంది. మీరు పాటలు పాడటానికి డబ్బులు తీసుకుంటారు? ఉచితంగా పాడటం లేదు కదా? మరి నా పాటలు పాడుతూ మీరు డబ్బులు తీసుకోవడం కరెక్టేనా? నాకూ వాటా రావాల్సిన అవసరం లేదా? నేను అడుగుతోంది కొంచెం డబ్బు మాత్రమే. భవిష్యత్ తరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
ఘనంగా.. అన్న అవార్డులు
బెంగళూరు : వారిద్దరూ వారి రంగాల్లో లబ్ధప్రతిష్టులు. చంద్రునికో నూలుపోగన్నట్లు మరో అవార్డు ఖాతాలో జమైంది. 2017 సంవత్సరానికి డాక్టర్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నటి, ఎమ్మెల్సీ జయమాలకు శనివారం సాయంత్రం బెంగళూరు టౌన్హాల్లో కర్ణాటక తెలుగు అకాడెమి అందజేసింది. అకాడెమి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ.రాధకృష్ణరాజు, అధ్యక్షుడు ఆర్.వి.హరిష్ తదితరులు వారికి పురస్కారాలను బహూకరించారు. అకాడమి నేతలు ఆర్.ఉమాపతి నాయుడు, సి.వి.శ్రీనివాసయ్య పాల్గొన్నారు. -
ఇళయరాజాతో భేదాభిప్రాయాలు లేవు
చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజాతో తనకెలాంటి బేధాభిప్రాయాలు లేవని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గాయకుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న ఆయన తన గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకుని తన సంగీత కళాకారుల బృందంతో కలిసి విదేశాల్లో సంగీత విభావరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంగీత కచేరిల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను పాడకూడదని ఇళయరాజా అనూహ్యంగా నిషేధం విధించడం, అందుకు నోటీసులు పంపడం వివాదంగా మారడం, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారడం తెలిసిందే. అయితే ఎస్పీబీ కూడా ఇకపై ఇళయరాజా పాటలను తాను పాడనని వెల్లడించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఇళయరాజాకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే ఆయన చర్యలు తనను చాలానే బాధించాయన్నారు. అయినా తన సంగీత కచేరిలకు ఎలాంటి బాధింపు కలగలేదని పేర్కొన్నారు. అదే విధంగా రారా.. పోరా.. అని మాట్లాడుకునేంత స్నేహమే తమదని, అలాంటిది ప్రస్తుత సమస్యను కాలమే తీర్చాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇళయరాజాతో ఫోన్లో మాట్లాడమని కొందరు హితవు పలికారన్నారు. అయితే తనకూ కొంచెం ఆత్మాభిమానం ఉందని బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. -
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎన్టీఆర్ అవార్డు
హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2012-13 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు ప్రకటించగా, సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు పురస్కారంగా లభించే నటరత్న నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు (2012)కు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ఇక 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన చలనచిత్ర అవార్డులను త్వరలో ప్రకటిస్తామని నటుడు మురళీమోహన్ తెలిపారు. అలాగే ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ఘనంగా ప్రదానం చేస్తామన్నారు. ఈ అవార్డులను ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ప్రకటించారు. 2012 జాతీయ అవార్డులు బీఎన్ రెడ్డి అవార్డు-సింగీతం శ్రీనివాసరావు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు-దగ్గుబాటి సురేష్ రఘుపతి వెంకయ్య అవార్డు- కోడి రామకృష్ణ 2013 జాతీయ అవార్డులు ఎన్టీఆర్ అవార్డు-హేమమాలిని బీఎన్ రెడ్డి అవార్డు-కోదండరామిరెడ్డి నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు- దిల్ రాజు రఘుపతి వెంకయ్య అవార్డు- వాణిశ్రీ -
ఇద్దరూ మాట్లాడుకుంటే సరిపోతుంది
► చట్టపరంగా ఇళయరాజా నోటీసు సమంజసమే ► బాలసుబ్రహ్మణ్యానికి ఐపీఆర్‌ఎస్ నిబంధనలు తెలియవా? ► సినీ సమీక్షకుడు వీఏకే రంగారావు బొబ్బిలి రూరల్: సినీ పరిశ్రమలోనే కాదు.. సంగీతాభిమానుల్లోనూ ఇళయరాజా.. బాలు మధ్య ఏర్పడిన అగాధంపై తీవ్ర చర్చ నడుస్తోంది. తన అనుమతి లేకుండా తాను స్వరపరచిన గీతాలు ఆలపించడం సరికాదంటూ ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యానికి నోటీసులు పంపడం సినీవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వీరి వివాదం నోటీసుల వరకు ఎందుకు? ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే వివాదం ముదిరేది కాదేమో.. అని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ప్రముఖ నృత్యకారుడు, సినీ విశ్లేషకుడు, సమీక్షకుడు, లిమ్కాబుక్ రికార్డు నెలకొల్పిన పాటల సేకరణకర్త వీఏకే రంగారావు అభిప్రాయపడ్డారు. మంగళవారం బొబ్బిలిలో ‘సాక్షి’ పలకరించినపుడు ఆయన అభిప్రాయాలను వెల్లడించారు. చట్టపరంగా ఇళయరాజా నోటీసు సమంజసమేనన్నారు. ఆయన ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు ఇవ్వడమే విచిత్రమని పేర్కొన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి ఐపీఆర్‌ఎస్ నిబంధనలు తెలియవా.. అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... (చదవండి: పాడకు తీయగా) ‘రాయల్టీ కోరే హక్కు గాయకులు, రచయితలు, స్వరకర్తలు, నిర్మాతలు.. అందరికీ ఉంది. టికెట్లు వసూలు చేసే కార్యక్రమాల నిర్వాహకులు రాయల్టీ చెల్లించాలి. దీనిపై వారధిగా 1969లో ది ఇండియన్ పెర్ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ (ఐపీఆర్‌ఎస్) ఏర్పడింది. దీని నిబంధనల ప్రకారం టికెట్ వసూలుచేసే ప్రోగ్రామ్స్‌లో ఎవరి పాటలైనా పాడితే, ఏర్పాటుచేస్తే రాయల్టీ చెల్లించాలి. ఎవరైనా అభ్యంతరపెడితే వారి పాటలు పాడకూడదు. ఇది ప్రైవేటు రిజిస్టర్డ్ సంస్థ. దీని నిబంధనలకు అందరూ కట్టుబడాలి. గతంలో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లలో ప్రోగ్రామ్స్‌కు రాయల్టీలు ఇచ్చేవారు. గతంలో లతామంగేష్కర్ తన పాటలకు రాయల్టీ కోరారు.’ ‘చట్టప్రకారం ఇళయరాజాకు నోటీసు ఇచ్చే అధికారం ఉంది. కానీ బాలు యూఎస్‌లో పాడే సమయంలోనే ఎందుకు ఇచ్చారో? అర్థంకావడం లేదు. 50 ఏళ్లకుపైగా పాటలు పాడుతున్న బాలసుబ్రహ్మణ్యానికి ఐపీఆర్‌ఎస్ గురించి తెలీదా? చారిటీతో పాటలు పాడినా.. డబ్బులు తీసుకుని కచేరీలు నిర్వహించేటప్పుడు రాయల్టీ చెల్లించాల్సిందే. ఈ వివాదంపై ఐపీఆర్‌ఎస్ స్పందించాలి. దీనిపై పలువురు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పారు. అనంతశ్రీరామ్ ఐపీఆర్‌ఎస్‌పై బాగా చెప్పారు. 25 శాతం వాటాలో ఎంతో నాకు తెలీదు కానీ.. ఆయన గాయకుల విషయం చెప్పలేదు. వారిద్దరూ స్నేహితులే కాబట్టి.. మధ్యవర్తులు లేకుండా వారిద్దరే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది.’ -
జాతులు, కులాలతో చండాలంగా చిత్ర పరిశ్రమ
-
చండాలంగా కళారంగం
జాతులు, కులాలు, వర్గాల ఆధిపత్యపోరు పెరిగింది భాషపై అంకిత భావం లేనివారు తెలుగువారే: ఎస్పీ బాలు లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రస్తుతం కళారంగం (సినిమా) జాతులు, కులాలు, వర్గాలు ఆధిపత్య పోరుతో చండాలంగా మారిందని ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఫ్యాన్స్ మాత్రమే సినిమాలను చూస్తే కలెక్షన్లు రావని, అందరు అన్ని సినిమాలను ఆదరిం చాలని కోరారు. తాను 15 భాషల్లో పాటలు పాడుతున్నానని, భాషపై అంకితభావం లేనివారు తెలుగువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యానికి ఆదివారం విజయవాడలో జీవిత సాఫల్య పురస్కా రాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా స్థాయిని ప్రజలే నిర్ణయించాల్సి ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను సైతం విస్మరిస్తూ చిత్రాలు రావడం దురదృష్టకరమ ని చెప్పారు. అలాంటి వాటిని విమర్శించే ధైర్యం తనకు లేదన్నారు. ఒకపాట విజయవంతం కావాలంటే గాయకుడితో పాటు రచయిత, సంగీత దర్శకుడు, నటుల కృషి ఉంటుందని చెప్పారు. శంకరాభర ణంలో పాట పాడేందుకు తాను అర్హుడిని కాదని భావించి చాలాకాలం తప్పుకొని తిరిగానని, వచ్చిన అవకాశాన్ని వదులుకో కూడదని భావించి పాడానని గుర్తుచేసుకు న్నారు. మనకు అక్షరశిల్పులు చాలామంది ఉన్నారని, మల్లాది, సముద్రాల, ఆరుద్ర, జాలాది వంటి వారు గొప్పపాటలు అందిం చారని చెప్పారు. వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి గొప్పరచయితలు మనకు ఉన్నారన్నారు. మహ్మద్ రఫీ మంచి గాయకుడని, ఆయన ప్రభావం తనపై ఉందని చెప్పారు. -
శ్రీవారి సేవలో ఎస్పీ బాలు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోమవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలసి వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. రంగనాయకుల మండపంలో బాలు దంపతులకు అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఇదో కమర్షియల్ ప్రపంచం..
రాజమహేంద్రవరం :‘భావవ్యక్తీకరణకు అక్షరం సాధనం. సినిమా పాటలకైనా, సాంప్రదాయ సంగీతానికైనా సాహిత్యం చాలా ముఖ్యం’ విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం జరిగే ఘంటసాల స్వరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆయన.. శుక్రవారం రాత్రి బస చేసిన హోటల్లో ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. బాపు, రమణల ‘బంగారుపిచిక’లో నన్ను నటించమంటే వద్దన్నాను. గాయకుడిగా నిలదొక్కుకోవడమే నా ప్రాధాన్యత. తరువాత కాలంలో నేను కొన్ని సినిమాల్లో నటించిన మాట వాస్తవమే. నటన, సంగీతం ఏది ముఖ్యమని కొందరు అడుగుతూంటారు. ఏదైనా ఇష్టపడితేనే చేస్తాను. ‘మిథునం’ నాకు నచ్చిన సినిమా. నేటి సినిమాల్లో మంచి పాటలు రావడం లేదా అంటే- చెట్టుముందా, విత్తు ముందా అన్న ప్రశ్న లాంటిది. నేను రెండు సంవత్సరాల నుంచి సినిమాలు చూడటం లేదు. ఇదో కమర్షియల్ ప్రపంచం.. ఇప్పటి సినిమాల్లో పాటలకు జనం కేరింతలు కొడుతున్నారని నిర్మాతలు చెబుతున్నారు. భాషరాని వారు పాటలు పాడుతున్నారు, జనం చూస్తున్నారు. ఉచ్చారణ ఎవరికి కావాలి? నేటి పరిస్థితికి ఎవరినీ నిందించలేము. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు సినిమాలు ఎందుకులేవు? ‘మిథునం’ ఎందుకు వంద రోజులు ఆడలేదు? ఈ సినిమా విడుదలకు థియేటర్లు దొరకడం కష్టమైంది. ఇదో కమర్షియల్ ప్రపంచం. మంచీ చెడూ అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. సినిమాలను కేవలం ఒక వినోదప్రక్రియగా చూస్తే గొడవ లేదు. మనం ఏమీ మార్చలేం. ప్రస్తుతం నాకు నచ్చితే పాడుతున్నాను. కుక్క ఎటు వెడితే మంచిది అంటే, మనల్ని కరవకుండా ఎటు వెళ్ళినా మంచిదే అనుకోవాలి. మన పని మనం చూసుకోవడమే. జీవితంలో సినిమా ఒక అంశం మాత్రమే. సినిమాయే ప్రపంచం కాదు. -
అర్దశతాబ్దపు 'బాలు'డు
-
ఆ సినిమాలో పాత్ర ఎంతో సంతృప్తి నిచ్చింది
భీమవరం : సినీ గాయని ఎస్.జానకి సూచనతోనే గాయకుడినయ్యానని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. చైతన్యభారతి సంగీత నృత్య నాటక పరిషత్ ప్రారంభ సభలో జీవిత సౌఫల్య పురస్కారాన్ని అందుకునేందుకు ఆయన భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా శనివారం చైతన్య భారతి, కాస్మోపాలిటిన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ‘మాటాడుతా తీయగా’ పరిచయ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. 1962లో గుడివాడలో కాళిదాసు కళానికేతన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాటలు పాడిన సందర్భంలో ముఖ్య అతిథిగా వచ్చిన జానకి తనను పిలిచి సినిమాల్లో ప్రయత్నించాలని సూచించారన్నారు. ఇంజినీర్ కావాలని ఇంజినీరింగ్ చదివిన తాను జానకి సూచనతో గాయకుడిగా మారానని చెప్పారు. చిత్ర పరిశ్రమ తనకు అందించిన సహకారం మరువలేనన్నారు. పాటలకు న్యాయం చేయలేనని అనిపించినప్పుడు పాడటం మానేస్తానన్నారు. పాటలతోపాటు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాటలు, నాటకాలు రాయడం, ఫొటోలు తీయడం, ట్రావెలింగ్ తనకెంతో ఇష్టమన్నారు. మహ్మద్ రఫీ అంటే తనకెంతో ఇష్టమని, పాటల రచరుుత ఆత్రేయ తనకు తండ్రిలాంటి వారని అన్నారు. 40 వేల పాటలు పాడా.. మిధునం సినిమాలో పోషించిన పాత్ర తనకెంతో సంతృప్తినిచ్చిందని బాలు తెలిపారు. ఇప్పటివరకు 40 వేల వరకు పాటలు పాడానని, వీటిలో నాలుగు వేల గీతాలు తనకెంతో ఇష్టమని చెప్పారు. బాల్యంలో ఆటపాటలు ముఖ్యమని చదువు కూడా అంతే అవసరమన్నారు. ర్యాంకుల కోసం పిల్లలను వేధించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పటివరకు 66 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించానని చెప్పారు. జూనియర్ గాయకులను ఎందుకు ఎదగనివ్వడం లేదని ఒకరు ప్రశ్నించగా వారి ఎదుగుదలను ఆపడానికి తానెవరినని ముక్తసరిగా సమాధానమిచ్చారు. నిర్వాహకులు బాలసుబ్రహ్మణ్యంను గజమాలతో సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు గోకరాజు రామరాజు, గజల్ శ్రీనివాస్, రాయప్రోలు భగవాన్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమ ప్రచారకర్తలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలు రంగాల ప్రముఖులను ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు ప్రచారకర్తలు పాల్గొన్నారు. అందరూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ అంబాసిడర్లుగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంపీలు కవిత, గల్లా జయదేవ్, క్రీడా రంగ ప్రముఖులు వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, సినీ హీరో నితిన్, రచయిత సుద్దాల అశోక్‌తేజ, పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, జేఏ చౌదరి, జె రామేశ్వర్రావు, వైద్య రంగం నుంచి డాక్టర్ గోపీచంద్, డాక్టర్ జీఎస్‌రావుతోపాటు మీడియా రంగం నుంచి వేమూరి రాధాకృష్ణ పేర్లను ప్రకటించారు. -
‘స్వచ్ఛ్ భారత్’ దూతలుగా బాలు, పవన్!
ఎంపీ కవిత, హీరో నితిన్, అమల, వీవీఎస్ లక్ష్మణ్ కూడా.. సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 9 మంది చొప్పున పలు రంగాల ప్రముఖులు దూతలు(అంబాసిడర్లు)గా ఎంపికయ్యారు. ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(బాలు) సహా పలువురికి ఈ జాబితాలో చోటు కల్పించారు. స్వచ్ఛ్ భారత్ దూతలుగా ఎంపీలు కవిత, గల్లా జయదేవ్, సినీ హీరో నితిన్, రచయిత సుద్దాల అశోక్‌తేజ, అమల, క్రీడా రంగం నుంచి వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, జేఏ చౌదరి, జె రామేశ్వర్రావు, జీవీకే రెడ్డి, వైద్య రంగం నుంచి డాక్టర్ గోపీచంద్, డాక్టర్ జీఎస్‌రావుతోపాటు మీడియా రంగం నుంచి వేమూరి రాధాకృష్ణ పేర్లను ప్రకటించనున్నారు. అదేవిధంగా లక్ష జానాభాకు మించిన అన్ని దక్షిణాది నగరాల మున్సిపల్ కమిషనర్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమావేశాలు నిర్వహించి స్వచ్ఛ్ భారత్ సహా పలు కార్యక్రమాలపై చర్చించనున్నారు. -
ఎస్పీ బాలుకు కేంద్రం లేఖ
హైదరాబాద్: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆదివారం ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు లేఖ రాసింది. గత ఏడాది ఆక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని పలువురు ప్రముఖులకు మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. -
శంకరాభరణంలో పాడనన్నాను
సినిమా అనే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం శంకరాభరణం. ఈ చిత్రం ఎంత ఖ్యాతి పొందిందో అంత ప్రాచుర్యం ఆ చిత్రానికి పని చేసిన వారికి లభించింది. ఈ చిత్రంలోని పాటలు ఎవర్గ్రీన్. అలాంటి పాటల్ని పాడనన్నారట గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. అలాంటిది 35 ఏళ్ల తరువాత తమిళ భాషలోకి అనువాదమైన శంకరాభరణం చిత్రానికి ఆయనే పాడటం విశేషం. ఈ అనుభవం గురించి బాలు ఏమి చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. శంకరాభరణం తెరపైకి వచ్చి 35 ఏళ్లయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిత్రం గురించి ఎన్నిసార్లో, ఎన్ని ప్రాంతాల్లో వ్యాఖ్యానించానో, ఎన్నిసార్లు ఎన్ని కచేరీల్లో ఆ చిత్ర పాటలు ఆలపించానో చెప్పలేను. నా సినిమా చరిత్రలో శంకరాభరణం ఒక గొప్ప అధ్యాయం. ఆ చిత్రం ప్రారంభ సమయంలో నేను రోజుకు నాలుగైదు పాటల రికార్డింగ్ అంటూ బిజీగా ఉన్నాను. అలాంటి సమయంలో కేవీ మహదేవన్ మా ఇంటికొచ్చి నాన్నకు శంకరాభరణం కథ వినిపించారు. అప్పుడు నాన్న ఈ చిత్రంలో పాటలు పాడిన తరువాతే ఇతర చిత్రాల పాటలు పాడమని చెప్పారు. అంతే కాదు శంకరాభరణం చిత్రానికి సరిగా పాడకపోతే చెంప పగలగొట్టి పాడించండి. ఇలాంటి మంచి అవకాశం తనకు మళ్లీ వస్తుందా? అంటూ కే.వీ. మహదేవన్‌తో అన్నారు. ఆ తరువాత దర్శకుడు కె.విశ్వనాథ్ మరోసారి కథ గురించి వివరించారు. అప్పుడు నాకు నిజంగా భయం కలిగింది. అలాంటి చిత్రానికి నేను పాడగలనా అని. అందుకు కారణం నాకు సంప్రదాయ సంగీతం తెలియకపోవడమే. నేనా సంగీతాన్ని నేర్చుకోలేదు. అందుకే శంకరాభరణం చిత్రానికి నేను పాడలేనన్నాను. అయినా సంగీత దర్శకుడు కె.వి.మహాదేవన్ వదలలేదు. ఆయన కంటే కూడా ఆయన శిష్యుడు పుగళేంది మీరే పాడాలంటూ ఒత్తిడి చేశారు. అవసరం అయితే నేర్పించి అయినా పాడిస్తానంటూ ప్రోత్సహించారాయన. పుగళేందినే ట్రాక్ పాడి ఆ క్యాసెట్ నాకిచ్చారు. దాన్ని సమయం దొరికినప్పుడల్లా వింటూ కంఠస్థంగా వచ్చిన తరువాతనే రికార్డింగ్‌కు సిద్ధం అయ్యాను. పాట రికార్డింగ్ సమయంలో ఎస్.జానకి, వాణీజయరాం ఇచ్చిన ప్రోత్సాహం మరవలేను. చిన్నాకుట్టి మృదంగం, రాఘవన్ వీణ, సుదర్శన్ ఫ్లూట్ వాయించారు. తమిళ అనువాదం అవసరమా? అలాంటి చిత్రానికి ఇన్నేళ్ల తరువాత అనువాదం అవసరమా అనే ప్రశ్న రావచ్చు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో, మరింత మెరుగులు దిద్దుకుని మళీ వస్తున్న శంకరాభరణం చిత్రానికి తప్పకుండా ఆదరణ లభిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ చిత్రం గురించి చెప్పడానికి నా వద్ద చాలా విషయాలున్నాయి. చిత్రంలో శంకర శాస్త్రిగా నటించిన జె.వి.సోమయాజుల్ని దర్శకుడు కె.విశ్వనాథ్‌కు పరిచయం చేసింది నేనే. శంకరాభరణం చిత్రాన్ని ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్, శివజీగణేశన్తో కలిసి చూడటం మరపురాని అనుభవం. నాకు తొలి సారిగా 1990లో జాతీయ అవార్డును అందించిన చిత్రం శంకరాభరణం. నాకే కాదు, గాయని వాణీజయరాం, సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్, దర్శకుడు కె.విశ్వనాథ్‌లకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిందీ చిత్రం. బాలు మహేంద్ర చాయాగ్రహణం కూడా ప్రశంసలందుకుంది. సినిమా ప్రేక్షకుల్ని, సాధారణ ప్రజల్ని సులభంగా పాడుకునేలా చేసిన ఘనత కె.వి.మహాదేవన్దే. అలాంటి శంకరాభరణం పాటల్ని నేటికీ ఏ కచ్చేరిలోనయినా పాడకుండా ఉండలేను. ఆ పాటల్ని ఇప్పుడు తమిళంలో పాడే అవకాశం నాకిచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. శంకరాభరణం తమిళంలోను విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని బాలు అన్నారు. ఈ చిత్రం తమిళంలో అక్టోబర్ రెండో తేదీన విడుదలకానుంది. -
శనిదేవుణ్ణి స్తుతించిన ఎస్పీబాలు
శనీశ్వరుని మహిమల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘శనిదేవుడు’. ‘మహిమలు చూడండి’ అనేది ఉపశీర్షిక. జ్యోతిష పండితులు శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే పలు శనీశ్వరాలయాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అనిల్ నండూరి స్వర సారథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించడం విశేషం. కులమత రహితంగా అందరూ చూడదగ్గ సినిమా ఇదని శివ జొన్నలగడ్డ చెప్పారు. నరసింహరాజు, తెలంగాణ శకుంతల, రంగనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్, నిర్మాణం: సోని ఫిలింస్.