
శ్రీవారి సేవలో ఎస్పీ బాలు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోమవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలసి వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
రంగనాయకుల మండపంలో బాలు దంపతులకు అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.