DGP JV Ramudu
-
ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలీసు కానిస్టేబుళ్ల పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ జేవీ రాముడు నోటిఫికేషన్ విడుదల చేశారు. 4,548 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని చెప్పారు. మొత్తం ఉద్యోగాల్లో మూడో వంతు మహిళలకు రిజర్వ్ చేసినట్టు వెల్లడించారు. పారదర్శకంగా పోస్టులను భర్తీ చేశామని ప్రకటించారు. -
ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
-
ప్రశాంత 'విశాఖ' చిరునామా చెరిగిపోనుందా?
తూర్పు తీరంలో కీలకమైన ఉక్కు నగరం విశాఖ ఇప్పటివరకు ప్రశాంతతకు మారుపేరు. అయితే కేంద్ర నిఘావర్గాల హెచ్చరికలు చూస్తే.. ఈ నగరాన్ని ఉగ్రపీడ పట్టుకుందా?.. అన్న అనుమానాలు..ఆందోళన రేగుతున్నాయి. తూర్పు కోస్తాపై ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల కన్నుపడిందని.. ముఖ్యంగా తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం, సబ్‌మెరైన్ కేంద్రం, పోర్టులు.. తదితర కీలకమైన వ్యవస్థలకు కేంద్రంగా ఉన్న విశాఖపై ఉగ్రనీడ పడిందని.. ఇప్పటికే స్లీపర్ సెల్స్ కార్యకలాపాలు మొదలయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగినట్లే మంగళవారం రాష్ట్ర డీజీపీ నగరానికి వచ్చి పర్యటించడం.. ఆ వివరాలు బయటకు పొక్కకపోవడం అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఐఎస్ఐఎస్ కదలికలతో హై అలర్ట్ స్లీపర్ సెల్స్ ఉన్నట్లు గుర్తించిన కేంద్రం రాష్ట్రానికి హెచ్చరికలు జారీచేసిన ఐబీ అప్రమత్తమైన జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. విశాఖపట్నం : ప్రశాంత విశాఖ నగరంపై ఉగ్రవాదుల కన్ను పడింది. అంతకంటే ఆందోళనకర విషయమేమిటంటే ఇప్పటికే ఐఎస్ఐఎస్కు చెందిన స్లీపర్ సెల్స్ సిటీలో విస్తరించాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయంతో రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన జిల్లా యంతాంగం ప్రత్యేక తనిఖీలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లో భద్రత కట్టుదిట్టం చేశారు. స్పెషల్ బ్రాంచ్ విభాగానికి పదును పెడుతున్నారు. కొందరు అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ముఖ్యంగా స్లీపర్‌సెల్స్‌ను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించారు. మంగళవారం డీజీపీ రాముడు విశాఖ వచ్చి అధికారులతో సమావేశం కావడం వెనక ప్రధాన కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇక విశాఖ నగరం ఇప్పటికే హై సెన్సిబుల్ ఏరియాగా గుర్తింపుపొందింది. ఉగ్రవాదులు తీర ప్రాంతం గుండా నగరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌తో పాటు కోస్ట్‌గార్డ్‌లను అప్రమత్తం చేశారు. ముంబయి దాడులకు సముద్ర మార్గాన్నే ఎంచుకున్న ఉగ్రవాదులు విశాఖలోనూ అదే అవకాశాన్ని వినియోగించుకోవచ్చనే హెచ్చరికలతో తీరం వెంబడి రక్షణను పటిష్టం చేశారు. బయటి నుంచి ముష్కర మూకలు నగరంలోకి రాకుండా అడ్డుకోవడం ఒకెత్తయితే ఇప్పటికే ఉన్న స్లీపర్ సెల్స్‌ను గుర్తించి మట్టుబెట్టడం మరో ఎత్తు. ఈ రెండూ కత్తిమీద సాములాంటివే. దీంతో విశాఖ పోలీసింగ్‌లో పలు కీలక మార్పులు చేయాల్సి ఉంది. డీజీపీ సమీక్షలోనూ ఇదే అంశాన్ని పలువురు ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్లు సమాచారం. కలవరపరుస్తున్న పరిస్థితులు నగరంపై ఉగ్రనీడ పడిందని తెలియగానే అధికారులతో పాటు, నగరవాసులూ ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి పరిస్థితులు కలవరపరుస్తున్నాయి. నగరంలో ఎక్కడా చెప్పుకోదగ్గ రక్షణ ఏర్పాట్లు లేవు. అన్నీ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందే. ఎదైనా జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప అధికారులు చేపడుతున్న శాశ్వత చర్యలు ఏమీ కనిపించడం లేదు. ఉగ్రవాదులను గుర్తించే ఏర్పాట్లు కూడా లేవు. నగరమంతటా సీసీ కెమెరాలతో అత్యంత భద్రత వలయం ఏర్పాటు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. నగరంలో వందకు పైగా పెద్ద హోటళ్లు, 60కి పైగా షాపింగ్ మాల్స్, 30కి పైగా సినిమా హాళ్లు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి సీసీ కెమెరాలు లేవు. కొన్నిటికి ఉన్నా సక్రమంగా పనిచేయడం లేదు. ఇక నగరంలో 128 జంక్షన్లు ఉండగా అన్ని జంక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికి 47 జంక్షన్లల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఉగ్రవాదులు వచ్చినా, నగరంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉన్నాయి. ఐబీ హెచ్చరికలతోనైనా నగర పోలీసింగ్‌లో మార్పులు జరుగుతాయేమో చూడాలి. గుంభనంగా డీజీపీ పర్యటన రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు మంగళవారం విశాఖ వచ్చారు. ఉదయం 8.30 గంటలకు ఎయిర్ కోస్టా విమానంలో విశాఖ చేరుకున్న ఆయన కాసేపు ఇక్కడ ఉన్న అనంతరం విజయనగరం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. జాయింట్ పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి డీజీపీకి స్వాగతం పలికారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు బయటకు వెల్లడించడం లేదు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం విశాఖ వచ్చిన డీజీపీ ఇక్కడి పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన 11 మంది కేంద్ర హోంశాఖ అధికారులతోనూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులతోనూ గ్రేహౌండ్స్ జిల్లా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన హెచ్చరికల దృష్ట్యా డీజీపీ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. కోస్టల్ సెక్యూరిటీతో పాటు ఉగ్రవాదుల కదలికలపైనా, మన్యంలో నక్సల్స్ సమస్యపైనా ఈ సమీక్షలో డీజీపీ చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు పలు సూచనలు అందించారని, కమాండ్ కంట్రోల్ ద్వారా తీర ప్రాంత భద్రతపై సమీక్షించారని, పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారని సమాచారం. కానీ అధికారులు ఇవేవీ జరగలేదని చెబుతున్నారు. డీజీపీ విశాఖ వచ్చినా ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదని నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ తెలిపారు. -
ప్రశాంత విశాఖకు ఉగ్రపీడ పట్టుకుందా?
-
ముగ్గురు డీఎస్పీల సస్పెన్షన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ర్టంలో ముగ్గురు డీఎస్పీలను సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ జె.వి.రాముడు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఎం.కృష్ణమూర్తి నాయుడు, సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు, ఏసీబీ డీఎస్పీ ఎస్.వి.వి.ప్రసాదరావులపై డీజీపీ వేటు వేశారు. 2010లో విశాఖలో ఒక సివిల్ కేసుకు సంబంధించిన సుమారు 70 ఫైళ్లు రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో అదృశ్యమయ్యాయి. దీనిపై బెంచ్ క్లర్క్ ఎన్వీఎస్ దుర్గాప్రసాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు క్రైం నంబర్.89/2010 యు/ఎస్ 457 అండ్ 380 ప్రకారం కేసు నమోదైంది. ఆ సమయంలో కృష్ణమూర్తి విశాఖ సిటీ ఏసీపీగా, ప్రసాదరావు, వైవి నాయుడులు టూ టౌన్ సీఐలుగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఇంత వరకూ ఎలాంటి పురోగతి లేదు. ఇటీవల నగర సీపీగా బాధ్యతలు చేపట్టిన టి.యోగానంద్ పెండింగ్ కేసులపై దృష్టి సారించారు. ఫైళ్ల మాయం కేసు దర్యాప్తు బాధ్యతను క్రైం డీసీపీ టి.రవికుమార్‌మూర్తికి అప్పగించారు. ఆయన ఇచ్చిన నివేదికను సీపీ యోగానంద్ డీజీపీకి పంపించారు. ఆ నివేదిక ప్రకారం ఈ ముగ్గురు డీఎస్పీలు అప్పట్లో ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని భావించిన డీజీపీ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ కేసును ఈ ముగ్గురిలో ఒకరైన వై.వి.నాయుడు దర్యాప్తు చేస్తున్నారు. -
'ఎర్రస్మగ్లర్ల ఆస్తుల్ని జప్తు చేస్తాం'
-డీజీపీ జెవి రాముడు తిరుపతి (చిత్తూరు జిల్లా) : ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ కోట్లకు పడగలెత్తిన స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ జెవి రాముడు తెలిపారు. ఎంతటివారైనా ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. సోమవారం మహానాడు ప్రాంగణ భద్రతను పరిశీలించేందుకు వచ్చిన రాముడు విలేకరులతో మాట్లాడుతూ.. కొత్త చట్టం ప్రకారం ఎర్రచందనం నిందితులపై పోలీసులు కఠినమైన కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా చేయవచ్చునన్నారు. మునుపటిలాగా వెంటనే బెయిల్ రాకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నవారి సంపద ఏ రూపంలో ఉన్నా వదిలేదని లేదన్నారు. ఇకపై ఎర్రచందనం కేసులు ప్రూవ్ అయితే సుమారు ఐదు సంవత్సరాలు జైలు శిక్షపడుతుందన్నారు. మహానాడుకు అతిరథమహారాథులు విచ్చేయనున్నారని వీరిలో జడ్ క్యాటగిరి కలిగినవారు కూడా ఉన్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. -
శ్రీవారి సేవలో ఎస్పీ బాలు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోమవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలసి వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. రంగనాయకుల మండపంలో బాలు దంపతులకు అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
పోలీస్ శాఖలో 14 వేల పోస్టులు ఖాళీ
అమలాపురం టౌన్ : రాష్ట్ర పోలీసు శాఖలో 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నివాసంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజనానంతరం పోలీసు శాఖకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. పోలీసు శిక్షణ కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉండడంతో పోలీసు శిక్షణ, రిక్రూట్మెంట్కు సాంకేతికపరమైన అవరోధాలు తలెత్తుతున్నాయని తెలిపారు. అందువల్లనే పోస్టుల భర్తీ త్వరితగతిన జరగడం లేదన్నారు. ఖాళీ పోస్టులను దశలవారీగా భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. తొలి విడతగా 4 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి కొత్తగా పోలీసు శిక్షణ కేంద్రాలు, వివిధ సదుపాయాలకు సంబంధించిన భవనాలు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రంలో హోం గార్డు పోస్టులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాముడు తెలిపారు. అంతకుముందు మంత్రి చినరాజప్ప, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్లో రూ.22 లక్షలతో నిర్మించిన రిసెప్షన్ కౌంటర్ భవనాన్ని రాజప్పతో కలిసి డీజీపీ ప్రారంభించారు. ఏలూరు రేంజ్ డీఐజీ హరికుమార్, నార్త్ కోస్టల్ ఐజీ విశ్వజిత్, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
'సీరియస్ గా తీసుకుంటాం, ఎవరినీ వదలం'
-
'సీరియస్ గా తీసుకుంటాం, ఎవరినీ వదలం'
విజయవాడ: 'కాల్ మనీ' సెక్సె రాకెట్ వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టబోమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. బెదిరింపులకు పాల్పడితే పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రుణాలు చెల్లించకపోతే మహిళలను చెరబట్టడం దారుణమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. 'కాల్ మనీ'పై వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని, సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో బుద్ద నాగేశ్వరరావు, సముద్రాల నాగేశ్వరరావు, లంకలపల్లి సతీష్ లను అరెస్ట్ చేసి రూ. 7 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు, బైకులు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. 'కాల్ మనీ' వ్యవహారం నేపథ్యంలోనే విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆయన నెలరోజుల క్రితమే సెలవుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. -
'ర్యాగింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం'
అనంత:యూనివర్శిటీలు, కళాశాలల్లో చోటు చేసుకుంటున్న ర్యాగింగ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. గుంటూరు, కడప ఘటనలపై విచారణ జరుపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డిని వీలైనంత త్వరగా ఏపీకి తీసుకొస్తామని డీజీపీ తెలిపారు. నకిలీ పట్టా పాస్ పుస్తకాలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
భద్రత దృష్ట్యానే పలు ఆంక్షలు: డీజీపీ రాముడు
గుంటూరు(మంగళగిరి): గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఫైరింగ్రేంజ్, సీఎం గెస్ట్ హౌస్‌లను రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భద్రతా కారణాల దృష్ట్యానే గెస్ట్‌హౌస్ ప్రాంతంలో పలు ఆంక్షలు విధించినట్టు చెప్పారు. స్థానికులు అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోనే ఏకైక ఫైరింగ్ రేంజ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని చెప్పారు. ఫైరింగ్ రేంజ్‌ను తరలించనున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. ఫైరింగ్ రేంజ్ దెబ్బతినకుండా వాహనాల పార్కింగ్, పరిపాలన బ్లాక్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. -
ఐ క్లిక్ కేంద్రాలు ప్రారంభించిన డీజీపీ
నగరంలో రెండు ప్రాంతాల్లో ఏర్పాటు పోలీసు అధికారులతో సమావేశం గుంటూరు క్రైం : రాష్ర్ట డీజీపీ జేవీ రాముడు బుధవారం నగరంలో ఏర్పాటుచేసిన రెండు ఐ క్లిక్ కేంద్రాలను ప్రారంభించారు. తొలుత ఉదయం 11.30 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన ఐ క్లిక్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అనంతరం కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో నూతనంగా ఏర్పటు చేసిన ఈ-కౌంటర్‌ను ప్రారంబించారు. తదనంతరం శంకర్‌విలాస్ సెంటర్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన ఐక్లిక్ కేంద్రాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఐజీ ఎన్.సంజయ్,ఎస్పీలు కె.నారాయణ నాయక్, సర్వశ్రేష్ట త్రిపాఠి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసు అధికారులతో సమావేశం అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ఐజీ, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో నేరాలు జరుగుతున్న తీరు, చేపడుతున్న చర్యలు, పోలీస్ స్టేషన్ల పెంపు, తదితర అంశాల గురించి డీజీపీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాజధాని ఏర్పాటు క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వుండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. సమావేశం అనంతరం కలెక్టర్ కాంతిలాల్ దండే నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో డీజీపీతో పాటు ఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీలు హాజరయ్యారు. విందు అనంతరం జిల్లా పరిస్థితులు, శాంతి భద్రతల సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. 4 గంటలకు డీజీపీ బయలుదేరి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లారు. -
మారిషస్ కోర్టులో గంగిరెడ్డిపై విచారణ
అనంతపురం: ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అడిగినట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. ఏప్రిల్ 7న మారిషస్ కోర్టులో గంగిరెడ్డిపై విచారణ జరుగనున్నట్లు ఆయన చెప్పారు. చాలా మంది నిందితులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పకడ్బంధీగా కేసులు విచారణ కోసమే మానిటరింగ్ సెట్ ఉపయోగపడుతుందని డీజీపీ రాముడు చెప్పారు. ఇదిలా ఉండగా, ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఇంటర్‌పోల్ అధికారులు మారిషస్‌లో గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. చాలా కాలంగా ఈ ఎర్రచందనం స్మగ్లర్ని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అతను గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. విదేశాల్లో వున్న గంగిరెడ్డిని పట్టుకునేందుకు సీఐడీ అధికారులు, ఇంటర్‌పోల్ సహాయం కోరారు. చివరకు అతనిని మారిషస్‌లో ఇంటర్‌పోల్ అధికారులు అరెస్ట్ చేశారు. గంగిరెడ్డి బెయిల్ కోసం మారిషస్ కోర్టులో పిటిషన్ వేశాడు. దానిని కోర్టు కొట్టివేసింది. అయితే న్యాయస్థానం విధించిన షరతులన్నీ పాటిస్తానని, దేశం విడిచి ఎక్కడికి వెళ్ళనని, భారత దేశానికి తనను అప్పగించవద్దని గంగిరెడ్డి మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపధ్యంలో స్మగ్లర్ గంగిరెడ్డి పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ అధికారులు సికింద్రాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి లేఖ రాశారు. గంగిరెడ్డిని మారిషస్ పోలీసులు అరెస్టు చేశారని, ఆయనపై అనేక ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని ఏపీ సీఐడీ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో పాస్‌పోర్టు అధికారులు గంగిరెడ్డి పాస్‌పోర్టును రద్దు చేశారు. ఇదిలా ఉండగా, మారిషస్ నుంచి గంగిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి ఏపీ సిఐడీ విభాగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక బృందం మారిషస్ కూడా వెళ్లింది.