యూనివర్శిటీలు, కళాశాలల్లో చోటు చేసుకుంటున్న ర్యాగింగ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు.
అనంత:యూనివర్శిటీలు, కళాశాలల్లో చోటు చేసుకుంటున్న ర్యాగింగ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. గుంటూరు, కడప ఘటనలపై విచారణ జరుపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డిని వీలైనంత త్వరగా ఏపీకి తీసుకొస్తామని డీజీపీ తెలిపారు. నకిలీ పట్టా పాస్ పుస్తకాలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.