
ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విజయవాడ: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలీసు కానిస్టేబుళ్ల పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ జేవీ రాముడు నోటిఫికేషన్ విడుదల చేశారు.
4,548 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని చెప్పారు. మొత్తం ఉద్యోగాల్లో మూడో వంతు మహిళలకు రిజర్వ్ చేసినట్టు వెల్లడించారు. పారదర్శకంగా పోస్టులను భర్తీ చేశామని ప్రకటించారు.