ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎన్టీఆర్‌ అవార్డు | NTR National award to felicitate SP Balasubramaniam | Sakshi
Sakshi News home page

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎన్టీఆర్‌ అవార్డు

Published Tue, Apr 4 2017 6:07 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎన్టీఆర్‌ అవార్డు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎన్టీఆర్‌ అవార్డు

హైదరాబాద్‌ : తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2012-13 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు ప్రకటించగా, సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు పురస్కారంగా లభించే నటరత్న నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు (2012)కు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.

ఇక 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన చలనచిత్ర అవార్డులను త్వరలో ప్రకటిస్తామని నటుడు మురళీమోహన్‌ తెలిపారు. అలాగే ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ఘనంగా ప్రదానం చేస్తామన్నారు. ఈ అవార్డులను ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ప్రకటించారు.

2012 జాతీయ అవార్డులు
బీఎన్‌ రెడ్డి అవార్డు-సింగీతం శ్రీనివాసరావు
నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు-దగ్గుబాటి సురేష్‌
రఘుపతి వెంకయ్య అవార్డు- కోడి రామకృష్ణ
 
2013 జాతీయ అవార్డులు
ఎన్టీఆర్‌ అవార్డు-హేమమాలిని
బీఎన్‌ రెడ్డి అవార్డు-కోదండరామిరెడ్డి
నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు- దిల్‌ రాజు
రఘుపతి వెంకయ్య అవార్డు- వాణిశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement