NTR national award
-
ఇద్దరూ ఉద్ధండులే.!
కమల్‌హాసన్..రజనీకాంత్.. ఎంజీఆర్, శివాజీ గణేశన్ తరువాత తమిళ సినిమాకు రెండు మూలస్తంభాలుగా నిలిచిన దిగ్గజాలు. ఈ ఇద్దరి నటనలో ఎవరి స్టైల్ వారిదే. వీరిద్దరికీ గురువు ప్రఖ్యాత నటుడు కే.బాలచందర్ కావడం విశేషం. సినీరంగంలో వీరి విశేషసేవలను గుర్తించి 2014 వ ఏడాదికి కమలహాసన్‌కు, 2016వ ఏడాదికి రజనీకాంత్‌కు ఎన్టీఆర్ జాతీయ అవార్డులను అందించనున్నట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తమిళసినిమా: దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన మహానటులు కమలహాసన్, రజనీకాంత్‌లను తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో సత్కరించనుంది. ఈ మేరకు మంగళవారం ఆ రాష్ట్రం తరఫున ప్రకటన వెలువడింది. దివంగత మహా నటులు ఎంజీఆర్, శివాజీగణేశన్ తరువాత తమిళసినిమాకు రెండు స్థంభాలుగా నిలిచిన దిగ్గజ నటులు కమలహాసన్, రజనీకాంత్. వీరిలో కమలహాసన్ ఐదో ఏట నుంచే సునాయాసంగా కళామతల్లి సేవకు సిద్ధం అయితే, రజనీకాంత్ అష్టకష్టాలు అనుభవించి 25 ఏళ్ల వయసులో నటుడవ్వాలన్న తన కలను నిజం చేసుకున్నారు. అయితే అంతకు ముందే ఈయన రంగస్థల అనుభవాన్ని పొందారన్నది గమనార్హం. కమల్, రజనీ ఇద్దరిది నటనలో ఎవరి స్టైల్ వారిదే. కమలహాసన్ తను తండ్రిగా భావించే శివాజీగణేశన్ స్ఫూర్తితో తన నటనా చాతుర్యాన్ని చాటు కుంటే, రజనీకాంత్ ఎంజీఆర్ స్టైల్లో స్టైల్ కింగ్‌గా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరికి గురువు ప్రఖ్యాత నటుడు కే.బాలచందర్ కావడం విశేషం. కమలహాసన్ బాల్యం నుంచి నటిస్తూ మధ్యలో డాన్స్ వైపు మొగ్గు చూపి ఆ తరువాత మళ్లీ నటున వైపు పయనించారు. అయితే కమల్, రజనీకు పూర్తి స్థాయి హీరోలుగా పేరు తెచ్చి పెట్టిన చిత్రం అపూర్య రాగంళ్. 1975లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తమిళ భాషలోనే కాకుండా తెలుగులో అనువాదం అయ్యి వివేష ఆదరణను చూరగొంది. ఆ తరువాత ఇద్దరు కలిసి కొన్ని చిత్రాల్లో నటించి సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా గుర్తింపు పొందారు. ఆ తరువాత ఇద్దరికీ విడి విడిగా ఇమేజ్ రావడంతో ఎవరి బాణీలో వారు తమ నట పయనానికి బాటలు వేసుకుని నటనలో మాత్రమే పోటీ పడి, వ్యక్తిగతంగా మంచి మిత్రులుగా, తమిళసినిమాకు రెండు ధ్రువాలుగా బాసిల్లుతున్నారు. కమల్, రజనీలకు తమిళనాడులో ఎంత ప్రాచుర్యం ఉందో అంతే ఆంధ్ర ప్రేక్షకుల మధ్య ఉండడం విశేషం. కమల్ పలు రాష్ట్ర అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి జాతీయ అవార్డులతో పాటు ఏవాలియర్ శివాజీగణేశన్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించబడ్డారు. అదే విధంగా రజనీకాంత్‌ను పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి జాతీయ అవార్డులు వరించాయి. రాజకీయ రంగప్రవేశంలోనూ పోటీనే.. కమల్, రజనీల మధ్య అవినాభావ సంబంధం రాజకీయాల్లోనూ కొనసాగుతోంది. తమ రాజకీయరంగ ప్రవేశానికి ఏక కాలంలో శ్రీకారం చుట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రస్తుత పరిస్థి«తులను గమనిస్తే అర్థం అవుతోంది.అలా ఇద్దరూ ఉద్దండులుగా వాసికెక్కిన కమలహాసన్, రజనీకాంత్‌లను తాజాగా ఆధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో సత్కరించనుండడం విశేషం. సినీరంగంలో వీరి విశేష సేవలకు గానూ 2014వ ఏడాదికి గానూ నటుడు కమలహాసన్‌కు, 2016వ ఏడాదికి గానూ నటుడు రజనీకాంత్‌కు ఎన్టీఆర్ జాతీయ అవార్డులను అందించనున్నట్లు ఆంధ్ర రాష్ట్ర పభుత్వం మంగళవారం ప్రకటించింది. -
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎన్టీఆర్ అవార్డు
హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2012-13 సంవత్సరానికి గానూ ఈ అవార్డులు ప్రకటించగా, సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు పురస్కారంగా లభించే నటరత్న నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు (2012)కు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ఇక 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన చలనచిత్ర అవార్డులను త్వరలో ప్రకటిస్తామని నటుడు మురళీమోహన్ తెలిపారు. అలాగే ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ఘనంగా ప్రదానం చేస్తామన్నారు. ఈ అవార్డులను ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ప్రకటించారు. 2012 జాతీయ అవార్డులు బీఎన్ రెడ్డి అవార్డు-సింగీతం శ్రీనివాసరావు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు-దగ్గుబాటి సురేష్ రఘుపతి వెంకయ్య అవార్డు- కోడి రామకృష్ణ 2013 జాతీయ అవార్డులు ఎన్టీఆర్ అవార్డు-హేమమాలిని బీఎన్ రెడ్డి అవార్డు-కోదండరామిరెడ్డి నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు- దిల్ రాజు రఘుపతి వెంకయ్య అవార్డు- వాణిశ్రీ -
కారా మాస్టారికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 2015 - ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అందజేస్తారు. అవార్డుతో పాటు రూ.లక్ష ప్రైజ్ మనీ కూడా ప్రదానం చేస్తారు. కారా మాస్టారుగా పేరొందిన 'కాళీపట్నం రామారావు' 1924, నవంబరు 9న శ్రీకాకుళం లో జన్మించారు. శ్రీకాకుళంలోనే తొలి విద్యాభ్యాసం, భీమిలిలో సెకండరీ గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1948 నుంచి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. కాళీపట్నం రామారావు ఎలిమెంటరీ స్కూలు ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందారు. కారా మాస్టారు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఆయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేశారు. 1966లో కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఆయన ఎక్కువగా శ్రమిస్తున్నారు. ఈ కథానిలయంలో 2,000 పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన మరో రెండు వేల పుస్తకాలు ఉన్నాయి. రచనలు: * యజ్ఞం (నవల) * అభిమానాలు * రాగమయి * జీవధార * రుతుపవనాలు (కథా సంకలనం) * కారా కథలు