
ఎస్పీ బాలుకు కేంద్రం లేఖ
మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం కోరింది.
హైదరాబాద్: మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆదివారం ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు లేఖ రాసింది. గత ఏడాది ఆక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని పలువురు ప్రముఖులకు మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు.