స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక | ambassadors of Swachh Bharat campaign from ap, telangana nominated | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక

Published Mon, Jan 5 2015 1:01 PM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక

స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమ ప్రచారకర్తలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలు రంగాల ప్రముఖులను ఎంపికయ్యారు. హైదరాబాద్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు ప్రచారకర్తలు పాల్గొన్నారు. అందరూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

స్వచ్ఛ భారత్ అంబాసిడర్లుగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంపీలు  కవిత, గల్లా జయదేవ్, క్రీడా రంగ ప్రముఖులు వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, సినీ హీరో నితిన్, రచయిత సుద్దాల అశోక్‌తేజ, పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, జేఏ చౌదరి, జె రామేశ్వర్‌రావు, వైద్య రంగం నుంచి డాక్టర్ గోపీచంద్, డాక్టర్ జీఎస్‌రావుతోపాటు మీడియా రంగం నుంచి వేమూరి రాధాకృష్ణ పేర్లను ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement