ambassadors
-
ఇండియా నుంచి ఈ ఇద్దరూ..
ప్రియాంకా చోప్రా గత ఏడాది సందడి చేసిన వేడుకల్లో టొరొంటో చలన చిత్రోత్సవాలు ఒకటి. ఆమె నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. దాంతో ఈ వేడుకకు హాజరై, ఎర్ర తివాచీపై ‘క్యాట్ వాక్’ చేసి, కనువిందు చేశారు. ఈసారి ప్రియాంక ఈ చిత్రోత్సవాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్ 10 నుంచి 19 వరకూ... కరోనా వల్ల ఆస్కార్ అవార్డు వేడుక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కి వాయిదా పడింది. మేలో ఫ్రాన్స్‌లో జరగాల్సిన కాన్స్ చలన చిత్రోత్సవాలు జరగలేదు. అయితే టొరొంటో చలన చిత్రోత్సవాలు మాత్రం ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ వేడుకలు డిజిటల్లో స్క్రీనింగ్ అవుతాయి. ‘‘ఇవి 45వ టొరొంటో చలన చిత్రోత్సవాలు. ఇన్నేళ్ల టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో డిజిటల్లో ప్రసారం కాబోతున్న తొలి వేడుక ఇదే’’ అని చిత్రోత్సవాల ప్రతినిధులు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా 50 చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించాలనుకుంటున్నామని, సామాజిక దూరాన్ని పాటించే దిశగా సీట్ల ఏర్పాటు ఉంటుందని, అయితే ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యపడుతుందని కూడా తెలిపారు. -
వియత్నాంలో కిమ్‌తో భేటీ: ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌తో ఈసారి వియత్నాం రాజధాని హనోయ్‌లో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల దౌత్యాధికారుల మధ్య ఇందుకు సంబంధించిన ముందస్తు చర్చలు ఫలప్రదంగా సాగాయని ఆయన శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ‘హనోయ్‌లో ఈనెల 27, 28 తేదీల్లో భేటీ ఉంటుంది. కిమ్‌ను కలిసి శాంతి చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ విషయంలో ఉత్తరకొరియా వైపు నుంచి ఎటువంటి స్పందనా వ్యక్తం కాలేదు. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే అందుకు బదులుగా కొరియా యుద్ధం ముగిసినట్లు ప్రకటించడంతోపాటు అమెరికా ఆంక్షలను ఎత్తి వేస్తుందా అనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ట్రంప్(72) సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు. అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌కు ఆరోగ్య పరీక్షలు చేపట్టడం ఇది రెండోసారి. శనివారం వాల్టర్‌రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లోని 11 మంది వైద్య నిపుణులు ఆయనకు నాలుగు గంటలపాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. -
ఈసీకి కొత్త అంబాసిడర్లు
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్తగా నలుగురు రాయబారులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ కుమార్ వారి పేర్లను వెల్లడించారు. రాష్ట్రంలోని సామాన్యులకు ఓటు విలువ తెలియజేస్తూ వారు ప్రచారం నిర్వహిస్తారు. టీవీ ప్రముఖ నటి రజిని, ఆర్బీ వైష్ణవి, బిగ్‌బాస్ విజేత చందన్ శెట్టి, ప్రముఖ నటుడు వశిష్ట ఎన్.సింహలు కొత్త రాయబారులుగా ఎంపికయ్యారు. 1) పేరు: వశిష్ట ఎన్.సింహ రంగం: నటుడు, గాయకుడు సోషల్ మీడియాలో రెండు లక్షల మంది ఫాలోవర్లు అవార్డ్స్: 2017 ఫిల్మ్‌ఫేర్ అవార్డు (ఉత్తమ సహాయ నటుడు), ఉత్తమ ప్రతినాయకుడిగా 2017లో ఐఫా అవార్డు ప్రొఫైల్: కన్నడ సినీరంగంలో పేరు మోసిన నటుడు. మైసూరుకు చెందిన వశిష్ట తొలుత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. సినిమా రంగంలో డబ్బింగ్ కళాకారుడు, గాయకుడిగా కూడా సుపరిచితుడు. 2) పేరు: చందన్ శెట్టి రంగం: గాయకుడు అవార్డులు: బిగ్‌బాస్ కన్నడ సీజన్ 5 విన్నర్ సోషల్ మీడియాలో 8 లక్షల మంది ఫాలోవర్లు ప్రొఫైల్: చందన్ శెట్టి కన్నడ ర్యాపర్‌గా చాలా మందికి సుపరిచితం. అతి తక్కువ సమయంలో సంగీతంలో చాలా పేరు సంపాదించారు. యువతలో చందన్ పాటలు చాలా ఫేమస్. 3) పేరు: ఆర్బీ వైష్ణవి రంగం: సినీ హీరోయిన్, టీవీ నటి ఫ్రొఫైల్: అతి తక్కువ సమయంలో తన నటన ద్వారా టీవీ ద్వారా చాలా మంది కన్నడిగులకు సురిచితమయ్యారు. 4) పేరు: రజిని రంగం: టీవీ నటి సోషల్ మీడియాలో 4 లక్షల ఫాలోవర్లు ప్రొఫైల్: గాయకురాలిగా కెరీర్‌ను ప్రారంభించిన రజిని ఆ తర్వాత టీవీ రంగంలో తన హవాను కొనసాగించింది. ఒక సీరియల్లోని క్యారెక్టర్ అమృత వర్షిణి పేరు వల్ల అమృతగా చాలా మందికి చిరస్థాయిగా గుర్తుండిపోయారు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నియామకం
పెనమలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు మండలంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిగా అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డిని నియమించారు. అనుబంధ విభాగాల్లో బీసీ సెల్ అధ్యక్షుడిగా మరీదు శ్రీనివాసరావు(యనమలకుదురు), మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా అబ్దుల్ రహీం(గంగూరు), ఎస్సీ సెల్ అధ్యక్షుడు దద్దల రాజేంద్రకుమార్(రాజా)(వణుకూరు), రైతు విభాగం అధ్యక్షుడిగా అంగిరేకుల సీతారామయ్య(కానూరు), వాణిజ్య విభాగం అధ్యక్షుడు శంకరరావు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వెలగపూడి వెంకటరామయ్య, ప్రచార విభాగం అధ్యక్షుడు కర్రా ఆదిశేషారావు(యనమలకుదురు), సాంస్కృతికి విభాగం పొనుగుమాటి సాంబ శివరావు(తాడిగడప), అధికార ప్రతినిధులు గుమ్మడి విజయ్‌కుమార్(యనమలకుదురు), వడుగు సర్వేశ్వరరావు(గోసాల)ను నియమించారు. -
ఫోర్బ్స్ శక్తివంత మహిళా వ్యాపారవేత్తల్లో ఆరుగురు భారతీయులు
న్యూయార్క్: ఫోర్బ్స్ 50 ‘శక్తివంతమైన వ్యాపార మహిళ’ జాబితాలో ఆరు మంది భారతీయ మహిళలు చోటుద క్కించుకున్నారు. దీనిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితోపాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ వ్యవస్థాపకులు మజుందార్ షా, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా ఎండీ ఆషా సంగ్వాన్‌లు జాబితాలో స్థానం సంపాదించారు. ఒక ఏడాది కాలంలో వ్యాపార రంగంలో మహిళలు సాధించిన విజయాలను ఆధారంగా చేసుకొని ఈ జాబితాను రూపొందించామని ఫోర్బ్స్ తెలిపింది. శక్తివంత మహిళా వారసుల్లో ఇషా, రాధిక రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, వీఐపీ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దిలీప్ పిరమల్ కుమార్తె రాధిక పిరమల్ ఫోర్బ్స్ 12 ‘శక్తివంతమైన వ్యాపార మహిళా వారసులు’ జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్లలో డెరైక్టర్‌గా ఉన్నారు. రాధిక పిరమల్ వీఐపీ ఇండస్ట్రీస్ (లగేజ్) ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తన కంపెనీ ఉత్పత్తుల విక్రయాల కోసం బాలీవుడ్ స్టార్లను అంబాసిడర్లుగా నియమించుకోవటం ప్రారంభించించారు. -
స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమ ప్రచారకర్తలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలు రంగాల ప్రముఖులను ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు ప్రచారకర్తలు పాల్గొన్నారు. అందరూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ అంబాసిడర్లుగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంపీలు కవిత, గల్లా జయదేవ్, క్రీడా రంగ ప్రముఖులు వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, సినీ హీరో నితిన్, రచయిత సుద్దాల అశోక్‌తేజ, పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, జేఏ చౌదరి, జె రామేశ్వర్రావు, వైద్య రంగం నుంచి డాక్టర్ గోపీచంద్, డాక్టర్ జీఎస్‌రావుతోపాటు మీడియా రంగం నుంచి వేమూరి రాధాకృష్ణ పేర్లను ప్రకటించారు. -
అన్ని బ్రాండ్లకూ అంబాసిడర్లు!
వస్త్ర దుకాణాల్లో మానిక్విన్ల హవా 30 శాతం కొనుగోళ్లు వీటి ఆధారంగానే! వీటికి తొడిగే వస్త్రాల అమ్మకాలు వేగవంతం రూ. వెయ్యి కోట్ల పరిశ్రమ; ఏటా 30% వృద్ధి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి ఫైబర్ బొమ్మలు అధిక శాతం మానిక్విన్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే... ఓ షాపుకెళతాం. అక్కడ మొదట కనిపించేది మనల్నే చూస్తున్నట్లుండే ముద్దుబొమ్మలు. నిజమే! అవి బొమ్మలే. ఆరడుగుల అబ్బాయిలు... అదిరిపోయే కొలతలుండే అమ్మాయిలు. చిన్నాపెద్దా తేడా లేకుండా దేశంలో ప్రతి వస్త్ర దుకాణానికీ ఈ బొమ్మలే బ్రాండ్ అంబాసిడర్లు. ఇంకో విశేషమేంటంటే దాదాపు 30 శాతం వస్త్రాల అమ్మకాలు ఈ బొమ్మల వల్లే జరుగుతున్నాయట! మానిక్విన్స్గా పేర్కొనే ఈ బొమ్మల్ని లే ఫిగర్, డమ్మీ, డ్రెస్ ఫామ్... ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఈ బ్రాండ్ అంబాసిడర్ల వెనకున్న బిజినెస్ కథాకమామిషు... ఇదిగో! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ బట్టల షాపు చూసినా అక్కడ వినియోగదారుల కళ్లు ముందుగా పడేది మానిక్విన్లపైనే. ఎందుకంటే లేటెస్ట్ ట్రెండ్‌ను ప్రతిబింబించే దుస్తుల్ని, తమ షాపులోకి కొత్తగా వచ్చిన స్టాకును ప్రదర్శించడానికి వ్యాపారి వాటినే వాడుతుంటాడు. ఆ దుకాణం ఆఫర్ చేస్తున్న వెరైటీలేంటో కస్టమర్లకు తెలియాలంటే మానిక్విన్లను చూస్తే చాలు. అందుకే దుకాణదారులు కూడా నిపుణులైన విజువల్ మర్చండైజర్లను నియమించుకుంటున్నారు. వీరు సీజన్నుబట్టి, ఫ్యాషన్‌ను బట్టి ప్రస్తుతం నడుస్తున్న రంగుల దుస్తులను బొ మ్మలపై ప్రదర్శిస్తారు. దుకాణంలో బొమ్మపైనున్న దుస్తులను పోలిన వెరైటీలను కస్టమర్ల సౌలభ్యం కోసం పక్కనే ఉంచుతారు కూడా. మానిక్విన్లపై వేసిన దుస్తులు ఇతర దుస్తులతో పోలిస్తే 43% వేగంగా అమ్ముడవుతాయని పాపులర్ బ్రాండ్ ‘అలెన్ సోలీ’ చెబుతోంది. కాంబినేషన్ ఇలా... చాలా మందికి రంగులు, కాంబినేషన్లు తెలియవు. ఏ రంగువారికి ఏ దుస్తులు బాగుంటాయనే అవగాహన ఉండదు. ఒక కస్టమర్‌కు ఒక కలర్, స్టైల్ సరితూగుతుందా లేదా అనే విషయాన్ని కొన్ని సందర్భాల్లో సేల్స్‌మెన్ చెప్పలేరు. అందుకే మానిక్విన్లపైనున్న వెరైటీలను చూసి కస్టమర్ ఒక అంచనాకు వస్తారు. భార్యాభర్త ఏదైనా శుభకార్యానికి వెళ్లాలంటే వారిరువురు ఎలాంటి కాంబినేషన్ వేసుకోవచ్చో కపుల్ మానిక్విన్లను చూస్తే చాలు. మానిక్విన్లు నిశ్శబ్దంగానే ఉంటాయి. కానీ 30% అమ్మకాలకు అవే ఆధారమని బిగ్‌బజార్ ఫ్యా మిలీ సెంటర్ హెడ్ సిలాస్ పాల్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. కస్టమర్ కొనుగోలు నిర్ణయానికి అవే కీలకమన్నారు. ఇప్పుడంతా వెస్టర్న్ ఫిగర్లే..: గతంలో మానిక్విన్ల సైజులో ప్రత్యేక ప్రమాణాలేవీ ఉండేవి కావు. ఇప్పుడు ట్రెండ్‌మారింది. మహిళ బొమ్మ అయితే 34-24-36 సైజులో 5 అడుగుల 10 అంగుళాలుంటుంది. పురుషుడి బొమ్మయితే 38-32-38 సైజులో 6 అడుగులు ఉంటోంది. బొమ్మ ఫీచర్స్ సాధారణ భారతీయుల్లా ఉండాలని గతంలో కోరేవారు. ఇప్పుడు వెస్టర్న్ మానిక్విన్స్ కావాలంటున్నారు. ఎటువంటి ముఖ ఫీచర్లు లేని బొమ్మలు, లేదా తల లేకుండా ఉన్నవి కూడా కొనుగోలు చేస్తున్నారు. తెలుపు, నలుపు, ఇతర రంగుల్లోనూ మానిక్విన్లు లభిస్తున్నాయి. మనిషి రూపానికి దగ్గరగా ఉండేలా చర్మం రంగులోనూ వీటిని తయారు చేస్తున్నారు. ప్రధానంగా చీరలు, చుడీదార్లు, లంగాఓణీల ప్రదర్శన కోసం వీటిని ఎక్కువగా వాడుతుంటారు. దేశంలో 70% మానిక్విన్ల అమ్మకాలు చర్మం రంగువే. ఇక రూ.1,200 లోపు ధరలో కలర్‌ఫుల్ విగ్గులు లభిస్తున్నాయి. ప్రత్యేకత కోసం దుకాణదారులు రోజుకో రకం విగ్‌ను ఎంచుకోవడమేగాక రోజూ దుస్తుల్ని కూడా మారుస్తున్నారు. కళ్లలో కెమెరాతో... త్వరలో చాలా కంపెనీలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన మానిక్విన్లను దేశంలో విక్రయిస్తున్నాయి. ఒకటిరెండేళ్లు దాటితే చాలు ఇవి పాడవుతాయి. వీటి ధర కూడా రూ.10 వేల వరకు ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఫైబర్ మానిక్విన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన 3ఎస్ మానిక్విన్స్ భారత్‌లో తొలిసారిగా విరగని ఫైబర్ మానిక్విన్లను పరిచయం చేసింది. అవతార్, రోబోటిక్ సిరీస్‌తోపాటు వాలెంటైన్ సిరీస్‌లో జంటగా ఉండే బొమ్మలను తీసుకొచ్చింది. ఈ బొమ్మల ధర రూ.5 వేల నుంచి మొదలై నాణ్యతను బట్టి రూ.50 వేల వరకు ఉంటుందని 3ఎస్ దక్షిణ భారత పంపిణీదారు శోభా అప్పారెల్స్ ప్రతినిధి చందేష్ బోరా చెప్పారు. కళ్లలో కెమెరా ఉండే మానిక్విన్లను త్వరలో తాము మార్కెట్లోకి తేబోతున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో 200కు పైగా పెద్ద ఔట్లెట్లకు తాము మానిక్విన్లను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ.1,000 కోట్లపైనే...: దేశవ్యాప్తంగా మానిక్విన్ల వ్యాపారం రూ.1,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. దేశీయ కంపెనీల ఉత్పత్తుల ధరలు రూ.2,500 నుంచి రూ.10 వేలుంటే, విదేశీవి రూ.8 వేల నుంచి రూ.50 వేల దాకా ఉన్నాయని ఢిల్లీకి చెందిన కాన్సెప్ట్ మానిక్విన్స్ భాగస్వామి రాజిందర్ సింగ్ భాటియా చెప్పారు. ఏటా ఈ పరిశ్రమ 30 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, తైవాన్, చైనాల నుంచి ఎక్కువగా బొమ్మలు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. ప్లాస్టిక్‌తో చేసిన చౌక ఉత్పత్తులు కూడా లభిస్తున్నాయి. రంగు, సైజు, రూపం, మెటీరియల్, ఫినిషింగ్ ఇలా చూసుకుంటే 1,000కి పైగా రకాలు దుకాణాల్లో హొయలు ఒలకబోస్తున్నాయి. ఆభరణాల దుకాణాల్లోనూ ఇవి తళుక్కుమంటున్నాయి. మొత్తం అమ్మకాల్లో 60 నుంచి 65 శాతం వాటా మహిళా మానిక్విన్లదే కావటం గమనార్హం. కొసమెరుపు: వస్త్ర ప్రపంచంలో ఒకపక్క షోరూమ్ బొమ్మల (మానిక్విన్ల) వినియోగం అంతకంతకూ పెరుగుతూ ఉంటే... ముంబైలో మాత్రం ఇటీవలే వీటికి షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. లింగరీ(మహిళల లోదుస్తులు)ని ప్రదర్శించే మానిక్విన్ల కారణంగా మహిళలపై లైంగిక దురాగతాలు పెరిగిపోతున్నాంటూ సామాజిక సంస్థలు గొంతెత్తడంతో వీటి వినియోగానికి అడ్డుకట్టపడింది. షోరూమ్‌లలో లింగరీ మానిక్విన్ల ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవడం విశేషం.