ఫోర్బ్స్ శక్తివంత మహిళా వ్యాపారవేత్తల్లో ఆరుగురు భారతీయులు
న్యూయార్క్: ఫోర్బ్స్ 50 ‘శక్తివంతమైన వ్యాపార మహిళ’ జాబితాలో ఆరు మంది భారతీయ మహిళలు చోటుద క్కించుకున్నారు. దీనిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితోపాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ వ్యవస్థాపకులు మజుందార్ షా, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా ఎండీ ఆషా సంగ్వాన్‌లు జాబితాలో స్థానం సంపాదించారు.
ఒక ఏడాది కాలంలో వ్యాపార రంగంలో మహిళలు సాధించిన విజయాలను ఆధారంగా చేసుకొని ఈ జాబితాను రూపొందించామని ఫోర్బ్స్ తెలిపింది.
శక్తివంత మహిళా వారసుల్లో ఇషా, రాధిక
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, వీఐపీ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దిలీప్ పిరమల్ కుమార్తె రాధిక పిరమల్ ఫోర్బ్స్ 12 ‘శక్తివంతమైన వ్యాపార మహిళా వారసులు’ జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వెంచర్లలో డెరైక్టర్‌గా ఉన్నారు. రాధిక పిరమల్ వీఐపీ ఇండస్ట్రీస్ (లగేజ్) ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తన కంపెనీ ఉత్పత్తుల విక్రయాల కోసం బాలీవుడ్ స్టార్లను అంబాసిడర్లుగా నియమించుకోవటం ప్రారంభించించారు.