Swachch Bharat
-
అలాంటి వాళ్లకు అదే సరైన శిక్ష: గడ్కరీ
గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మన దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. చాక్లెట్లు తిని దాని రేపర్లు రోడ్లపైనే పడేస్తుంటారు. ఇదే వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు చాక్లెట్ కాగితాలు జేబులో పెట్టుకుని హుందాగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మాత్రం రోడ్లపై పడేస్తుంటారు అని చురకలంటించారాయన. అలాగే.. గుట్కాలు తిని రోడ్ల మీద ఉమ్మేసే వాళ్లను కట్టబడి చేయడానికి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ ఓ చక్కటి ఐడియా ఇచ్చారు. పాన్ మసాలా, గుట్కాలు తిని రోడ్లమీద ఉమ్ములు వేసే వాళ్ల ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో ప్రచురించాలి అని సూచించారాయన. ఇది సోషల్ మీడియాకు ఎక్కడంతో సూపర్ ఐడియా కేంద్ర మంత్రిగారూ అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. నేను మారిపోయాను అప్పట్లో తాను కూడా చాక్లెట్ పేపర్లు బయటకు విసిరేసే వాడినని, అయితే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నానని గడ్కరీ చెప్పారు. ఇప్పుడు తాను చాక్లెట్లు తింటే గనుక ఆ రేపర్‌ను ఇంటికి వచ్చాక పారేస్తుంటానని చెప్పారు. -
ఏపీ ‘స్వచ్ఛ భారత్’.. టాటా మోటార్స్ ఫైనాన్స్ తోడ్పాటు
విజయవాడ: స్వచ్ఛ భారత్ మిషన్‌ను విజయవంతం చేసేందుకు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ టాటా మోటార్స్ ఫైనాన్స్ తెలిపింది. వ్యర్ధాల నిర్వహణ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునిస్తున్నామని పేర్కొంది. ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 792 టాటా ఏస్ వాహనాలకు సంబంధించి రూ. 36.62 కోట్ల రుణాలు అందించినట్లు కంపెనీ రీజనల్ బిజినెస్ హెడ్ టి. ప్రభు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (సీఎల్ఏపీ) కింద వ్యర్ధాల నిర్వహణ కోసం ఈ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. భారీ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను తమ సిబ్బంది త్వరితగతిన ప్రాసెస్ చేసి, రుణాల ప్రక్రియను వేగవంతం చేశారని ఆయన పేర్కొన్నారు. -
సెట్లో చెత్త ఎత్తిన సీనియర్ యాక్టర్
సినిమాల్లో తెరపై నీతులు చెప్పే స్టార్లు.. రియల్ లైఫ్‌లో అది పాటించటం చాలా అరుదు. అయితే విలక్షణ నటుడు నాజర్ మాత్రం అలా కాదు. స్వయంగా తానే సెట్లో చెత్త ఎత్తి చూపించారు. పంచె ఎగ్గట్టి స్పాట్లో టీ కప్పులు, చెత్త కవర్లను ఏరి డస్ట్ బిన్లో పడేశారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు అది పట్టించుకోకపోయినా.. ఓ వ్యక్తి మాత్రం ఆ ఘటనను తన మొబైల్లో షూట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్లో ఓ వ్యక్తి తెలుగు మాట్లాడటం గమనించొచ్చు. ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? వీడియో పాతదా? కొత్తదా? స్పష్టతలేదుగానీ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సీనియర్ నటుడు, పైగా నడిగర్ సంఘం ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి కూడా ఆయన అలా చేయటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం లో నాజర్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కల్వకుంట్ల నాగేశ్వర్రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. -
చెత్త కవర్లను ఏరి డస్ట్ బిన్లో పడేసిన యాక్టర్
-
‘స్వచ్ఛ’ రాయబారిగా పాక్ చిన్నారి.. దుమారం
పట్నా: స్వచ్ఛ భారత్‌లో భాగంగా బిహార్‌లో అధికారులు రూపొందించిన ఓ బుక్లెట్ వివాదాస్పదంగా మారింది. జముయి జిల్లాలో ‘స్వచ్ఛ జముయి స్వస్త్ జముయి’ నినాదంతో కార్యక్రమాలను అధికారులు కొనసాగిస్తున్నారు. ఇందు కోసం రూపకల్పన చేసిన బుక్లెట్ కవర్ పేజీపై బ్రాండ్ అంబాసిడర్‌గా పాకిస్థాన్‌కు చెందిన బాలిక ఫోటోను ముద్రించారు. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి రాగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో చిత్రంలో ఆ చిన్నారి పాక్ జెండాను గీసినట్లు ఉండటంతో వివాదం మరింత ముదిరింది. పైగా ఆ బాలిక పాక్ తరపున యూనిసెఫ్‌కు ప్రచారకర్త అని తెలిసింది. దీంతో స్థానికులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అయితే ముద్రణ సంస్థ పొరపాటు మూలంగానే ఇది జరిగిందని అధికారులు చెప్పారు. బుక్లెట్లను వెనక్కి రప్పించి తప్పు సరిదిద్దుకుంటామని వారంటున్నారు. -
ఉమ్మినా, మూత్రం పోసినా భారీ ఫైన్
స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు ప్రకటించింది. ఇక మీదట బహిరంగ స్థలాల్లో మూత్రవిసర్జన చేసినా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉమ్మినా భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అలాగే రోడ్ల మీద చెత్త వేయడం, నిర్మాణ సామగ్రిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం లాంటి వాటికి కూడా జరిమానాలు తప్పవు. ఈ విషయాన్ని అన్ని మంత్రివర్గ కార్యాలయాలకు పంపారు. ముఖ్యంగా ఆఫీసులు స్వచ్ఛంగా ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులే తీసుకోవాలని తెలిపారు. ప్రతి శాఖలోను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో పారిశుధ్య కమిటీని నియమించుకోవాలని, వాళ్లు ఈ వ్యవహారాలను పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే కాంట్రాక్టర్లు కూడా భవనాలను కూల్చినప్పుడు, నిర్మాణ సమయంలోను మిగిలే వ్యర్థాలను పని పూర్తికాగానే తొలగించాలని, లేకపోతే వారికి కూడా జరిమానా విధించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా, పాన్ మసాలా మరకలు ఎక్కడపడితే అక్కడ కనిపించడం ఇక మీదట కుదరదని, అందుకోసం సిబ్బందికి కావల్సినన్ని చెత్తబుట్టలు, సిబ్బంది సంఖ్యను బట్టి తగినన్ని యూరినల్స్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
స్వచ్ఛమేవ జయతే
స్వచ్ఛభారత్.. ఇప్పుడు ఊపు మీదున్న క్యాంపెయిన్! ఈ ప్రచారానికి మద్దతు తెలుపుతూ చీపుర్లు పట్టుకున్న సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారో.. అసలైన స్వచ్ఛ భారత్ అంటే ఏంటో అర్థం చెప్పడానికి కుంచెలు పట్టుకున్న ఆర్టిస్టులూ అంతేమంది ఉన్నారు! వాళ్లలో ఈ వాల్ మీద గ్రాఫిటీని ఆవిష్కరించిన స్వాతి, విజయ్ అనే కళాకారుల జంటా ఉంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ప్రాంతం.. ఫిలింనగర్ దర్గా దగ్గర్లోని ఓ గోడ. పార్లమెంట్ భవనం.. దాని ముందు ఝాడు పట్టుకుని ఓ యువకుడు.. ఈ బొమ్మను ఆ జంట సోమవారం అర్ధరాత్రి మొదలు పెట్టి మంగళవారం మధ్యాహ్నానికల్లా పూర్తిచేశారు. ‘స్వచ్ఛభారత్ మొదలవ్వాల్సింది ఎక్కడెక్కడి రోడ్ల మీద నుంచో కాదు. ప్రజాప్రతినిధుల కుళ్లు రాజకీయాలతో నిండిపోయిన వ్యవస్థ నుంచే. ఆ కంపును ప్రక్షాళన చేయాల్సిందే యువకులే’ అని ఈ గ్రాఫిటీ అర్థం. స్వచ్ఛభారత్ పార్లల్ క్యాంపెయిన్‌లో స్వాతి, విజయ్‌లు చేసిన రెండో గ్రాఫిటీ ఇది. మొదటిసారి గచ్చిబౌలిలోని ఓ వాల్ మీద వేశారు. ‘ప్రతి పౌరుడు వంద గంటలు స్వచ్ఛభారత్ కోసం కేటాయిస్తే ఏడాది లోపు స్వచ్ఛభారత్‌ను సాధిస్తాం’ అన్న మోదీ మాటకు... ‘ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి కనీసం వంద గంటలైనా ఏకాగ్రతతో పనిచేస్తే పేరుకున్న ఫైళ్లన్నీ కదిలి.. అందులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’ అంటూ కామన్‌మ్యాన్ ఆఫ్ ఇండియా కౌంటర్ ఇస్తున్నట్టుగా ఓ బొమ్మను వేసి క్యాప్షన్ రాశారు. స్వాతి, విజయ్‌లు మొదలుపెట్టిన స్వచ్ఛభారత్ పార్లల్ క్యాంపెయిన్‌లో ఈ ఫస్ట్ గ్రాఫిటీకి పురజనుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ముందుకు సాగుతున్నారు. అయితే వాల్స్ మీద గ్రాఫిటీ అండ్ స్ట్రీట్ ఆర్ట్ వేయడానికి చాలామంది అనుమతివ్వక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే సామాజిక ప్రయోజనం కోసం వేస్తున్న ఈ పెయింటింగ్ పదిమందిలోకీ వెళ్లాలంటే మెట్రో రైల్ పిల్లర్స్ అయితే మంచి వేదికలవుతాయని వీరు ఆకాంక్షిస్తున్నారు. ఆలోచన ఇలా... ‘గ్రాఫిటీ అండ్ స్ట్రీట్ ఆర్ట్ మా స్పెషలైజేషన్. ఈ ఆర్ట్ ఉన్నదే సోషల్ కాజ్ కోసం. సో.. మేమూ అదే దారిలో వెళ్తున్నాం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియాలో జరిగిన గొడవల నేపథ్యంలో ‘వయోలెన్స్ నీడ్ నాట్ టు బీ వయెలెంట్’ అనే గ్రాఫిటీ వేశాం. ఉస్మానియా యూనివర్శిటీ వాల్ మీదే. స్టూడెంట్స్ చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అప్పటి నుంచి ఏదో ఒక సోషల్ కాజ్ తీసుకొని వేస్తూ ఉన్నాం. స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ మమ్మల్ని ఎట్రాక్ట్ చేసింది... పార్లర్ క్యాంపెయిన్ చేయడానికి! ‘ఆత్మను పరిశుద్ధం చేసుకుంటే చాలు శరీరం దానంతటదే పరిశుద్ధం అవుతుంది’ అని మన యోగా చెబుతుంది. కాబట్టి స్వచ్ఛ భారత్ అంటే చీపుర్లు పట్టడం కాదు... మన ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రక్షాళన చేయాలి. పేదరికం, అవిద్య, అనారోగ్యాన్ని తరిమేయాలి. ఈ అంతఃశుద్ధి జరిగితే భారతదేశ భౌతిక రూపం స్వచ్ఛంగా, పచ్చగా ఉంటుంది. దీన్ని తెలియజెప్పడానికే స్వచ్ఛ భారత్‌కి పార్లర్ క్యాంపెయిన్ స్టార్ చేశాం’ అంటారు స్వాతి, విజయ్‌లు. సరస్వతి రమ -
స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమ ప్రచారకర్తలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలు రంగాల ప్రముఖులను ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు ప్రచారకర్తలు పాల్గొన్నారు. అందరూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ అంబాసిడర్లుగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంపీలు కవిత, గల్లా జయదేవ్, క్రీడా రంగ ప్రముఖులు వీవీఎస్ లక్ష్మణ్, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, సినీ హీరో నితిన్, రచయిత సుద్దాల అశోక్‌తేజ, పారిశ్రామిక రంగం నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, జేఏ చౌదరి, జె రామేశ్వర్రావు, వైద్య రంగం నుంచి డాక్టర్ గోపీచంద్, డాక్టర్ జీఎస్‌రావుతోపాటు మీడియా రంగం నుంచి వేమూరి రాధాకృష్ణ పేర్లను ప్రకటించారు. -
రాజకీయాల్లోకి రాను: గంగూలీ
కోల్‌కతా: స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ప్రధాని ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్ లో పాల్గొంటానని చెప్పారు. అయితే రాజకీయాల్లోకి మాత్రం రానని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్న గంగూలీ ఓ టీవీ చానల్ తో ఫోన్ లో మాట్లాడారు. స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ లో పాల్గొంటానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని గతంలో చెప్పానని, దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. స్వచ్ఛభారత్ లో పాల్గొనాలని గంగూలీ సహా ముంబై డబ్బావాలాలు, కామెడీ నైట్స్ వ్యాఖ్యాత కపిల్ శర్మ, కిరణ్ బేడీ తదితరులను మోదీ ఆహ్వానించారు. -
స్వచ్ఛభారత్‌కు కపిల్, గంగూలీని నామినేట్ చేసిన మోదీ
గాంధీ జయంతి రోజున తాను ప్రారంభించిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. వారణాసి పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ ఈసారి మరింతమందిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేశారు. ప్రధానంగా ముంబై డబ్బావాలాలను, క్రికెట్ యువరాజు సౌరవ్ గంగూలీని కామెడీ నైట్స్ వ్యాఖ్యాత కపిల్ శర్మను, కిరణ్ బేడీని ఆయన ఈసారి ప్రస్తావించారు. వాళ్లతో పాటు నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య, సోనాల్ మాన్సింగ్, రామోజీరావు, ఆరోన్ పూరీ, ఐసీఏఐ.. ఇలా వ్యక్తులతో పాటు సంస్థలు, సమూహాలను కూడా ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నామినేట్ చేశారు. అంతకుముందు వారణాసి శివార్లలోని బాబత్‌పూర్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగారు. అక్కడ ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్ర మంత్రి అహ్మద్ హసన్ తదితరులు స్వాగతం పలికారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు, హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ, రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి తదితరులు కూడా ప్రధాని పర్యటనలో ఉన్నారు. -
'స్వచ్ఛభారత్' లో బోయపాటి శ్రీను
-
స్వచ్ఛ భారత్ లో రామ్!
-
స్వచ్ఛ భారత్ లో సినీ నటుడు రామ్!
హైదరాబాద్: పరిశుభ్ర భారత్ కోసం ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు సినీనటుడు రామ్ గురువారం స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన ఛాలెంజ్ ను రామ్ స్వీకరించారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఈ రోజు ఉదయం పది గంటలకు చెత్తను ఎత్తివేసి.. రోడ్లను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో యువతీ, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన తర్వాత రామ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సినీతారలు సమంత, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక మోత్వానీ లను రామ్ నామినేట్ చేశారు. సామాజిక కార్యక్రమాల్లో సమంత, ఇతర హీరోయిన్లు పాలుపంచుకుంటునందున తాను వారిని నామినేట్ చేశానని రామ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. Follow @sakshinews