స్వచ్ఛ భారత్ లో సినీ నటుడు రామ్! | Hero Ram participated in Swachch Bharat | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్ లో సినీ నటుడు రామ్!

Published Thu, Nov 6 2014 2:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

స్వచ్ఛ భారత్ లో సినీ నటుడు రామ్!

స్వచ్ఛ భారత్ లో సినీ నటుడు రామ్!

హైదరాబాద్: పరిశుభ్ర భారత్ కోసం ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు సినీనటుడు రామ్ గురువారం స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన ఛాలెంజ్ ను రామ్ స్వీకరించారు.  నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఈ రోజు ఉదయం పది గంటలకు చెత్తను ఎత్తివేసి.. రోడ్లను ఊడ్చారు. ఈ కార్యక్రమంలో యువతీ, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. 
 
స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన తర్వాత రామ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని సినీతారలు సమంత, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్, హన్సిక మోత్వానీ లను రామ్ నామినేట్ చేశారు. సామాజిక కార్యక్రమాల్లో సమంత, ఇతర హీరోయిన్లు పాలుపంచుకుంటునందున తాను వారిని నామినేట్ చేశానని రామ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement