గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మన దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. చాక్లెట్లు తిని దాని రేపర్లు రోడ్లపైనే పడేస్తుంటారు. ఇదే వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు చాక్లెట్ కాగితాలు జేబులో పెట్టుకుని హుందాగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మాత్రం రోడ్లపై పడేస్తుంటారు అని చురకలంటించారాయన. అలాగే..
గుట్కాలు తిని రోడ్ల మీద ఉమ్మేసే వాళ్లను కట్టబడి చేయడానికి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ ఓ చక్కటి ఐడియా ఇచ్చారు. పాన్ మసాలా, గుట్కాలు తిని రోడ్లమీద ఉమ్ములు వేసే వాళ్ల ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో ప్రచురించాలి అని సూచించారాయన. ఇది సోషల్ మీడియాకు ఎక్కడంతో సూపర్ ఐడియా కేంద్ర మంత్రిగారూ అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు.
నేను మారిపోయాను
అప్పట్లో తాను కూడా చాక్లెట్ పేపర్లు బయటకు విసిరేసే వాడినని, అయితే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నానని గడ్కరీ చెప్పారు. ఇప్పుడు తాను చాక్లెట్లు తింటే గనుక ఆ రేపర్‌ను ఇంటికి వచ్చాక పారేస్తుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment