gandhi jayanti
-
అలాంటి వాళ్లకు అదే సరైన శిక్ష: గడ్కరీ
గాంధీ జయంతి సందర్భంగా నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం నిర్వహించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మన దేశ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. చాక్లెట్లు తిని దాని రేపర్లు రోడ్లపైనే పడేస్తుంటారు. ఇదే వ్యక్తి విదేశాలకు వెళ్లినప్పుడు చాక్లెట్ కాగితాలు జేబులో పెట్టుకుని హుందాగా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ మాత్రం రోడ్లపై పడేస్తుంటారు అని చురకలంటించారాయన. అలాగే.. గుట్కాలు తిని రోడ్ల మీద ఉమ్మేసే వాళ్లను కట్టబడి చేయడానికి కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ ఓ చక్కటి ఐడియా ఇచ్చారు. పాన్ మసాలా, గుట్కాలు తిని రోడ్లమీద ఉమ్ములు వేసే వాళ్ల ఫోటోలు తీసి వార్తాపత్రికల్లో ప్రచురించాలి అని సూచించారాయన. ఇది సోషల్ మీడియాకు ఎక్కడంతో సూపర్ ఐడియా కేంద్ర మంత్రిగారూ అంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. నేను మారిపోయాను అప్పట్లో తాను కూడా చాక్లెట్ పేపర్లు బయటకు విసిరేసే వాడినని, అయితే ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నానని గడ్కరీ చెప్పారు. ఇప్పుడు తాను చాక్లెట్లు తింటే గనుక ఆ రేపర్‌ను ఇంటికి వచ్చాక పారేస్తుంటానని చెప్పారు. -
భార్య నుంచి వ్యతిరేకత ఎదురైనా.. బాపూజీ తగ్గలేదు!
స్వతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ జీవన విధానం క్రమ శిక్షణతో కూడిన విధంగా ఉంటుంది. ఆయన స్వాతంత్ర్య ఉద్యమం కోసం పాటుపడే క్రమంలో ఆయన అనుసరించిన విధానాలే ఖండాతరాలకు విస్తరించి విలక్షణమైన వ్యక్తిగా వేన్నోళ్ల కీర్తించాయి. మనిషి గాలి, నీరు లేకుండా ఎలా అయితే జీవించలేడో అలాగే ఆహారం కూడా అంతే ముఖ్యమని తన 'కీ టు హెల్త్ పుస్తకంలో' చెప్పాki. ఇవాళ గాంధీ జయంతి(అక్టోబర్ 02) సందర్భంగా ఆయన జీవనశైలి ఎలా ఉండేది? ఎలాంటి ఆహారం ఇష్టపడే వారు తదితరాల గురించి సవివరంగా చూద్దాం..!. గాంధీ గుజరాత్‌కి చెందిన శాకాహార కుటుంబంలో జన్మించాడు. అయితే శాకాహారం పట్ల ఆయన నిబద్ధత గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే..? న్యాయవాది విద్యార్థిగా ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో శాకాహారం దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు. అంతేగాదు శాకాహార రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందో కనుక్కుని మరీ అక్కడే భోజనం చేశారు. అలాగే హెన్నీ స్టీఫెన్స్ రాసిన 'సాల్ట్ ఎ ఫ్లీ ఫర్ వెజిటేరియనిజం' పుస్తకం గాంధీని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన ఉపవాసానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. అదే నిరసనలకు ఆయుధంగా దీన్ని ఉపయోగించే వారు. ఆ సమయంలో ఆయన దినచర్యలోని ఉపవాసం ఆయనకు ఎంతగానో ఉకరించేది. ఆయన కఠిన ఆహార నియమాలు అతిథులకు ఇబ్బంది కలిగిస్తోందని కాస్త మార్పులు చేర్పులు కూడా చేశారు. అహింసవాది అయిన గాంధీ శాకాహారానికి ఇవ్వడానిక ప్రాధాన్యత ఇవ్వడానికి మరో కారణం హింసకు వ్యతిరేకి కావడం కూడా అని చెబుతుంటారు కొందరూ. అలాగే సూర్యాస్తయానికి ముందు తన చివరి భోజనాన్ని ఐదింటితో పరిమితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఇష్టపడేవారు. అలాగే పప్పులకు దూరంగా ఉండేవారు. బలహీనమైన రాజ్యంగ ఉన్నవారికి పప్పులు సరిపడవని విశ్వసిస్తూ వాటిని దూరంగా ఉంచేవారట. తన భార్య కస్తూర్బా నుంచి వ్యతిరేకత ఎదురైనా కూడా తన నియమాన్ని ఆయన కచ్చితంగా అనుసరించేవారట గాంధీ. మానవులు మాంసాహారులుగా పుట్టలేదని, ప్రకృతి ప్రసాదంగానే జీవించాలని ఆయన వాదించేవారట. మొదట్లో పాలను కూడా తాగేవారు కాదట. పాలు అంటే అంతగా ఇష్టం లేని గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో అనారోగ్యం బారిన పడటంతో వైద్యుని సలహా మేరకు మేకపాలు తీసుకోవడం ప్రారంభించారట.ఆయన తన భోజనంలో బ్రౌన్రౌస్, వివిధ పప్పులు, స్థానిక కూరగాయాలు, మేకపాలు, బెల్లం తదితరాలను తీసుకునేవారు. తినడం అనేది శరీరాన్ని పోషించడం మాత్రమే కాదు, ఆత్మను పోషించడం అని చెప్పేవారట గాంధీ. సాత్వికమైన భోజనం తీసుకుని సక్రమమైన ఆలోచనలతో న్యాయం వైపు అడుగులు వేయమని కోరేవారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏదీఏమైన గొప్ప వ్యక్తులు ఆలోచనలే కాదు వారి వ్యక్తిగత జీవన విధానం కూడా అందర్నీ ప్రభావితం చేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కదూ..!(చదవండి: 'ఖాదీ'.. గాంధీ చూపిన దారే! అది నేడు ఫ్యాషన్ ఐకానిక్ ఫ్యాబ్రిక్‌గా..!) -
ఢిల్లీ రాజ్ ఘాట్ లో గాంధీ జయంతి వేడుకలు
-
బాపూ సమరం తెరపై చూపుదాం
‘రక్త మాంసాల దేహంతో అలా ఓ మనిషి ఈ నేలమీద నడయాడాడని చెబితే, ముందు తరాల వారు నమ్మరు’ అన్నాడు ఐన్‌స్టీన్. టాల్ స్టాయ్, జోసెఫ్ స్టాలిన్, విన్స్టన్ చర్చిల్, జె.ఎఫ్. కెన్నెడీ, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా దాకా... ఎందరో గాంధీజీ వల్ల ప్రభావితం అయ్యారు. గాంధీజీ ఆత్మకథ పిల్లలందరూ చదవాలి. లేదా కనీసం ఆయన పై వచ్చిన సినిమాలు చూడాలి. గాంధీపై వచ్చిన కొన్ని సినిమాలు. అలాగే గాంధీ గారి వల్ల వచ్చిన సినిమాలుమోడర్న్ టైమ్స్: 1936లో వచ్చిన ఈ సినిమా నేటికీ గొప్ప క్లాసిక్‌గా నిలిచి ఉంది. యంత్రం కంటే మానవుడే గొప్పవాడు అని చెప్పే సినిమా అది. చార్లి చాప్లిన్ ఈ సినిమా తీసి నటించడానికి కారణం గాంధీ మహాత్ముడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ లండన్ వెళ్లినప్పుడు అక్కడ చార్లీ చాప్లిన్‌ను కలిశాడు. అప్పటి వరకూ చార్లీ చాప్లిన్ యంత్రాలు మనుషులను శ్రమ నుంచి విముక్తి చేస్తాయని భావించాడు. కాని గాంధీజీ చెప్పిన మాటల వల్ల యంత్రాలు మనిషికి సహాయం చేయడం కంటే అతడికి పని కోల్పోయేలా చేయడమే గాక బానిసగా చేసుకుంటున్నాయని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రభావంతోనే చాప్లిన్ మోడర్న్ టైమ్స్ తీశాడు.ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ: భారతదేశంలో గాంధీ అడుగు పెట్టి బ్రిటిష్ వారిపై పోరాడక ముందు దక్షిణాఫ్రికాలో ఆయన వర్ణ వివక్షపై పోరాడాడు. గాంధీలోని పోరాటగుణం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలిచే సాహసం దక్షిణాఫ్రికాలోనే రూపుదిద్దుకున్నాయి. అక్కడ ఒక చలిరాత్రి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుంచి గాంధీని కిందకు దించి అవమానించారు, ఆయన దగ్గర టికెట్ ఉన్నా, నల్లవాళ్లు ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించకూడదని. ప్రతి వ్యక్తికీ ఆత్మగౌరవంతో, స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో, సమాన భావనతో జీవించే హక్కు ఉందని చాటడమే గాంధీజీ జీవన సందేశం. అది ‘ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా’లో చూడవచ్చు. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1996లో విడుదలైంది. రజత్ కపూర్ గాంధీగా నటించాడు.లగే రహో మున్నాభాయ్: గాంధీజీ అంటే చౌరస్తాలో కనిపించే ఒక విగ్రహం కాదు, గాంధీ జయంతి రోజు స్కూళ్ల సెలవుకు కారణమయ్యే ఒక వ్యక్తి కాదు... గాంధీజీ అంటే జీవన మార్గదర్శి. జీవితం నిర్భయంగా సాగాలంటే గాంధీజీ అనుసరించిన మార్గంలో నడిస్తే చాలు. ఆశ, దురాశ, అవినీతి, ఆడంబరం... ఇవన్నీ లేకపోతే జీవితం సులభంగా ఉంటుందని చెప్పే సినిమా ‘లగే రహో మున్నాభాయ్’. 2006లో వచ్చిన ఈ సినిమా గాంధీజీని కొత్త తరానికి మరోసారి పరిచయం చేసింది. అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను రాజ్ కుమార్ హిరాణి సాధించాడు. వీధి రౌడీగా ఉండే ఒక వ్యక్తి గాంధీ ప్రభావంతో ఎలా మారాడనేది కథ. సంజయ్ దత్ హీరో.గాంధీ మై ఫాదర్: ఇది మొదట తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. మహాత్ములు విశాల ప్రజానీకం కోసం ఎన్ని త్యాగాలు చేసినా కుటుంబం దృష్టికోణంలో వాళ్లేమిటి అనేది కూడా ముఖ్యమే. మహాత్మునిగా గాంధీజీ ఆరాధ్యనీయుడు. కాని సొంత కొడుకు దృష్టిలో ఆయన గొప్ప తండ్రిగా ఉన్నాడా? గాంధీ కుమారుడు హరిలాల్ తన తండ్రి గాంధీలా లేదా గాంధీ అనుయాయుల్లా ఏనాడూ వెలుగులోకి రాలేదు. తండ్రి మీద ఎన్నో ఫిర్యాదులు పెట్టుకున్నాడు. అతని ఆత్మకథ ఆధారంగా తీసిన సినిమా ‘గాంధీ మై ఫాదర్’. 2007లో వచ్చిన ఈ సినిమాలో గాంధీ కుమారుడు హరిలాల్గా అక్షయ్ ఖన్నా నటించాడు.గాంధీ: మన మహాత్ముని సినిమాను మన దర్శకులు తీయలేకపోయినా బ్రిటిష్ డైరెక్టర్ తీశాడు. ఏ బ్రిటిషర్ల మీద గాంధీజీ పోరాడారో ఆ బ్రిటిష్ జాతి నుంచి అటెన్ బరో వచ్చి ఈ సినిమా తీసిప్రాయశ్చిత్తం చేసుకున్నాడని భావించాలి. గాంధీ జీవితంపై సినిమా తీసేందుకు 1952 తర్వాత నుంచి ప్రయత్నాలు జరిగాయి. రిచర్డ్ అటెన్ బరోనే 1960ల్లోనే ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు 1980 నవంబర్‌లో అటెన్ బరో ఈ సినిమా షూటింగ్ప్రారంభించారు. 1981 మే నెలలో షూటింగ్ పూర్తి అయింది. గాంధీ పాత్రను బెన్ కింగ్స్లే పోషించారు. నెహ్రూ పాత్రలో రోషన్ సేథ్, గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే పాత్రలో హర్‡్ష నాయర్ నటించారు. 1982 నవంబర్ 30న ఢిల్లీలో విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమాను అమెరికా, బ్రిటన్ లలో కూడా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు గొప్ప స్పందన వచ్చింది. గొప్ప కలెక్షన్లు సాధించింది. ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. మహాత్మాగాంధీని తెరపై కళ్లకు కట్టినట్లు చూపిన బెన్ కింగ్స్లేకి ఆస్కార్ అవార్డు లభించింది. -
పెద్దల పండుగకు.. ‘గాంధీ’ గండం
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఓ విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ప్రతి ఏటా మహాలయ అమవాస్య రోజున పెద్దల పండుగ చేసుకుని శక్తికొద్దీ మాంసాహారాన్ని భుజించడం తరతరాల సంప్రదాయం. ఈసారి గాంధీ జయంతి అయిన అక్టోబరు 2వ తేదీన ఈ పర్వదినం రావడంతో ఆటంకం ఏర్పడింది. పెద్దల పండుగ అంటేనే మద్యం, మాంసం ఉంటాయి. స్వర్గస్తులైన పెద్దలకు అవి రెండూ నైవేద్యంగా సమరి్పంచి ఆపై తాము పుచ్చుకొంటారు. కానీ గాంధీ జయంతి రోజున మద్యం షాపులు, మాంసాహార విక్రయాలు నిషేధిస్తారు. అనుమతికి డిమాండ్ ఈ నేపథ్యంలో గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మనవి చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అనాదికాలంగా వస్తున్న సంప్రదాయానికి భంగపరచడం సబబు కాదని కొందరు పేర్కొన్నారు. ప్రజల డిమాండ్ల నేపథ్యంలో ఏం చేయాలా? అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. -
గాంధీగారు తప్పు చేస్తే?
‘‘ప్రపంచంలో సిగరెట్ల కోసం ఇంత మోజెందుకో నాకు అర్థం కాదు. పోగ త్రాగేవాళ్లతో రైలు ప్రయాణం నేను చేయలేను. నాకు ఊపిరాడదు. అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏండ్ల వయసులో మొదట సిగరెట్ల కోసం డబ్బులు దొంగిలించాను. తరువాత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మా అన్న చేతికి ఉండే బంగారు మురుగు నుంచి కొంచెం దొంగిలించాలని అతను అంటే నేను సరే అన్నాను. దానికి కారణం మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు మురుగు ఉంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం. ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పరవాలేదని భావించాను.చివరికి ఒక చీటీమీద చేసిన తప్పంతా రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్లి మా తండ్రిగారికి ఇచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగిన విధంగా శిక్షించమనీ, ఇక ముందు దొంగతనం చేయననీ శపథం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి ఇస్తున్నప్పుడు వణికిపోయాను. మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నారు. ఆయన బల్లమీద పడుకుని ఉన్నారు. చీటీ వారి చేతికి ఇచ్చి ఎదురుగా నిలబడ్డాను. వారు చీటీ అంతా చదివారు. వారి కండ్లనుండి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషం సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. నాకు కూడా ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈ రోజు కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశృవులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.’’ -
Fact Check: గాంధీ జయంతి రోజూ నిజాలకు పాతరేనా!?
సాక్షి, అమరావతి: తన మనిషి సీఎం కుర్చీలో లేడన్న అక్కసుతో నిత్యం అబద్ధాలనే అచ్చేస్తూ ప్రజలెనుకున్న ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును తీస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు పత్రిక గాంధీ జయంతి రోజున కూడా నిస్సిగ్గుగా నిజాలకు పాతరేసింది. ఫైబర్‌నెట్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు రామోజీరావు ‘‘వైర్లు పీకేశారు.. గుండెలు బాదుకుంటున్నారు’’ అంటూ విషం కక్కారు. ఉపయోగంలేని చోట్ల ఉన్న ఫైబర్ కేబుల్‌ను తొలగించి వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే అదో పెద్ద నేరం అంటూ గగ్గోలు పెడుతున్నారు. 2019 నవంబర్‌లో జరిగిన మెయిల్స్‌ను చూపిస్తూ వైర్లు పీకేశారంటూ అసత్యాలతో కూడిన కథనాన్ని ప్రచురించారు. ఇదంతా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా నియమించిన ఐఏఎస్ అధికారి ఎ. సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో టెరాసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేసిన నెటాప్స్ సంస్థలే ఈ తొలగింపు ప్రక్రియలో పాల్గొన్న విషయాన్ని వ్యూహాత్మకంగా ఎక్కడా పేర్కొనలేదు. చోరీ జరగక్కుండా ఉండేందుకు తొలగిస్తే.. ఫైబర్‌గ్రిడ్ ఫేజ్–1 ప్రాజెక్టు కింద అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ కేబుల్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 24,000 కి.మీ మేర 24ఎఫ్ ఫైబర్ కేబుల్, దానికి కావాల్సిన స్తంభాలు ఇతర పరికరాలతో సమకూర్చారు. అందులోని 524 కి.మీ పరిధిలో సబ్‌స్రై్కబర్స్ లేకపోవడంవల్ల అక్కడ కేబుల్‌ను చోరీచేసే అవకాశం ఉండటంతో వీటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని ఏపీఎస్ఎఫ్ఎల్ నిర్ణయించింది. 12 జిల్లాల్లో ఉపయోగంలేని చోట్ల మొత్తం 524 కి.మీ పరిధిలోని కేబుల్‌ను ఇతరచోట్ల బిగించుకునేందుకు వీలుగా తొలగించాలని ఏపీఎఎస్ఎఫ్ఎల్ ఉద్యోగి రాజేశ్‌రాయ్ తన ఈ–మెయిల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు.. అప్పటి ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ కేబుల్ బిగించడంలో పాలుపంచుకున్న నెటాప్స్ సంస్థకే ఈ తొలగింపు కాంట్రాకును ఇచ్చారు. దీంతో ఆ సంస్థ మీటరుకు రూ.12 ఇవ్వాలని కోరగా ఏపీఎస్ఎఫ్ఎల్ రూ.8 మాత్రమే చెల్లించింది. మొత్తం 1,25,677 మీటర్ల 24ఎఫ్ ఫైబర్ కేబుల్‌ను తొలగించినందుకు రూ.11,86,391 చెల్లించారు. ఈ తొలగించిన కేబుల్‌ను వైర్లు కట్ అయ్యి ప్రసారాలు ఆగిపోయిన చోట్ల తిరిగి బిగించడానికి వినియోగిస్తున్నారు. వక్రీకరించి విషప్రచారం.. ఇలా వృధాగా ఉన్న విలువైన వైరును తిరిగి ఉపయోగిస్తుంటే దాన్ని అభినందించాల్సిందిపోయి చంద్రబాబు తప్పేం చేయలేదు.. వీళ్లే కేబుల్స్ తొలగించి గుండెలు బాదేసుకుంటున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు వక్రీకరించి విషప్రచారం చేయడాన్ని అధికారులు ఖండిస్తున్నారు. అసలు ఫైబర్‌నెట్ కుంభకోణానికి ఈ వైర్ల తొలగింపునకు ఎలాంటి సంబంధం లేకపోయినా బోడిగుండుకు మోకాలుకు ముడిపెడుతూ చంద్రబాబుని ఈ కుంభకోణం నుంచి తప్పించడానికి రామోజీ పడుతున్న పాట్లు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
జైలులో చంద్రబాబు దీక్ష చేయడంపై సజ్జల ఫైర్
-
ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..!
ఇవాళ గాంధీ జయంతి మాత్రమే కాదు అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా. ఎప్పుడూ సత్యం, అహింస అంటూ ప్రతిధ్వనించే గాంధీజీ ఎంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వారు. ఆరోగ్యకరమైన జీవన విధానంపై 'కీ టు హెల్త్ బై ఎంకే గాంధీ' అనే పుస్తకంలో ఆనాడే ఎంతో చక్కగా వివరించిన మహాత్ముడు గాంధీజీ. మంచి జీవనశైలి, ఫిట్నెస్గా ఉండటం ఇవే ఆరోకరమైన జీవితానికి ప్రధానమైనవని బలంగా నమ్మేవారు. ఆయన జయంతి సందర్భంగా గాంధీజీ ఆరోగ్య సూత్రాలు, ఆయన జీవన విధానం గూర్చి తెలుసుకుందామా! నడక, తాజా కూరగాయాలు, పండ్లు తీసుకోవడం, పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం తోపాటు పర్యావరణ పరిశుభ్రత తదితరాలే ఆరోగ్య జీవనానికి వెనుముక అని విశ్వసించేవారు. చాలామంది ఆరోగ్య నిపుణులు గాంధీ ఆరోగ్య సూత్రలనే గట్టిగా విశ్వసించేవారు. ఆ రోజల్లో ప్రబలంగా ఉండే టీబీ, కుష్టువ్యాధి, కలరా, మలేరియా వంటి వ్యాధుల నిర్మూలనకు పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ గురించి గాంధీజీ నొక్కి చెప్పేవారు. ఆయన మరణాంతం వరకు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపటం తోపాటు ధ్యానం, ఫిట్ నెస్ని ఎప్పుడూ విస్మరించలేదని ఆయన సన్నిహితులు చెబుతుండేవారు. గాంధీజీ ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు గాంధీజీ తన జీవితంలోని తరువాత దశల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలతో భాధపడ్డారు. 1925 నుంచి 1944 వరకు మూడుసార్లు మలేరియా బారినపడ్డారు. 1919, 1924లో అపెండిసెటిస్, ఫైల్స్ కోసం ఆపరేషన్లు చేయించుకున్నారు. ఆయన కొంతకాలం ఊపిరితిత్తుల సమస్యతో కూడా బాధపడ్డారు. ఈ అనారోగ్య సమస్యలే ఆయన్ను ఆరోగ్యకరమైన జీవనన విధానంపై దృష్టిపెట్టేలా చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పోషకమైన ఆహారం, శారీరక ఆరోగ్యం, మంచి నిద్ర అలవాట్లు, సమతుల్య ఆహారం తదితరాలపై దృష్టి పెట్టడమే గాక దాని గురించి పుస్తకం రాసి మరీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. జీవన విధానం.. గాంధీజీ ఎప్పుడూ పొలం లేదా స్థానికంగా పండించే పండ్లు, కూరగాయాలే తీసుకునేవారు. అధిక నూనె, ఉప్పు వాడకానికి దూరంగా ఉండేవారు. పిండి పదార్థాలు అధికంగా ఉన్నవాటిని అస్సలు దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. ఆయన పాలిష్ చేసిన బియ్యం, శుద్ధి చేసిన గోధుమ పిండికి వ్యతిరేకి. ఆయన ఆరోజుల్లోనే తృణధాన్యాల గొప్పతనం, ఫైబర్ కంటెంట్ గురించి నొక్కొ చెప్పడం విశేషం. గాంధీజీ నుంచి నేర్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు.. వయస్సుకు తగ్గ విధంగా సమతుల్య ఆహారం తీసుకోవడం వీలైనంతగా తీపి పదార్థాలకు దూరంగా ఉండటం. అంతగా తీపి తినాలనుకుంటే కొద్దిగా బెల్లం ముక్కను తీసుకోవడం తప్పనిసరిగా నడక రోజువారి దినచర్యలో భాగంగా ఉండటం ఇక చివరిగా గాంధీజీ చాలా శక్తిమంతంగా నడిచేవారు. ఎంత దూరం అయినా నడిచే వెళ్లేవారు. ఆయన దాదాపు 40 ఏళ్లు.. రోజూ సుమారు 18 కి.మీ వాకింగ్ చేసేవారు. తన రాజకీయ ప్రచార సమయంలో 1913 నుంచి 1948 వరకు అంటే దాదాపు 35 ఏళ్లలో మొత్తం 79వేల కి.మీ నడిచారు. ఇది భూమిని రెండుసార్లు చుట్టి రావడంతో సమానం. కనీసం ఈ గాంధీ జయంతి రోజు నుంచి అయినా మనం ఆయనలాంటి చక్కటి ఆహారపు అలవాట్లను అనుసరిస్తూ.. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. (చదవండి: ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములే చాలట!) -
గాంధీ కలల్ని నిజం చేశాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎక్స్ అకౌంట్లో ఆయన నివాళి సందేశం ఉంచారు. ‘‘మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా... రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం.మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అని పేర్కొన్నారాయన. మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా…రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సంద… pic.twitter.com/9fEwN6KFf4 — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2023 -
Gandhi Jayanti 2022: మహాత్ముడికి సీఎం కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింస, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి విజయం సాధించి చూపటం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని సీఎం పేర్కొన్నారు. గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు అని కీర్తించారు. గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. -
మహాత్ముని మాట... స్ఫూర్తి బావుటా: ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు పర్యటన
సాక్షి, కర్నూలు: మహాత్ముడు కాలంతో ప్రయాణించే మహనీయుడు. తరాలు మారినా ఇప్పటికీ ఆయన నడిచిన మార్గాన్ని ప్రపంచం అనుసరిస్తోంది. ఆయన జీవితం పవిత్రతకు ప్రతి రూపం. ఆయన బాటే అనుసరణీయం. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన 1921, 1929 సంవత్సరాల్లో రెండుసార్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడయాడి స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు పాల్గొనేలా చైతన్య వంతం చేశారు. జాతీయ నిధికి విరాళాలు సేకరించడం కోసం మహాత్మా గాంధీ 1921 సెప్టెంబర్ 30న మొట్టమొదటి సారిగా జిల్లాలో అడుగు పెట్టారు. కర్నూలు పురవీధుల్లో ఓపెన్ టాప్ జీపులో తిరిగారు. ఆర్ఎస్ సర్కిల్, ఎస్టీబీసీ కళాశాల, స్టేట్ బ్యాంక్ సర్కిల్, పాత బస్టాండ్, గడియారం ఆస్పత్రి, పూలబజార్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ మీదుగా జాతీయ కాంగ్రెస్ నాయకులు మేడం వెంకయ్యశెట్టి ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా ఇసుకేస్తే రాలని జనం. మేడలపై, మిద్దెలపై బారులు తీరిన జనం. గాంధీని చూడటానికి రోడ్లపై గుమికూడారు. కర్నూలులో అప్పటి ప్రముఖ స్వాతంత్రయ సమరయోధులు మేడం వెంకయ్య శెట్టి, లక్ష్మణస్వామి, రంగనాథ మొదలియార్, పొలిమేర శేషయ్యశెట్టి, గొల్లపూడి సీతారామ శాస్త్రి, గాడిచెర్ల, ఆయన వెంట ఉన్నారు. తుంగభద్రా తీరంలో బహిరంగ సభ తుంగభద్రా నది తీరంలో ఇసుకతిన్నెలో గాంధీజీ బహిరంగ సభ జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ఎర్రటి మండుటెండలో జరిగిన ఈ సభకు అప్పట్లోనే దాదాపు 25వేల మంది దాకా జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యారని ఒక అంచనా. సభా ప్రాంగణమంతా వందేమాతరం నినాదం మార్మోగింది. గాంధీజీ హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని గాడిచెర్ల తెలుగులో అనువదించారు. 1929లో రెండవ పర్యటన మహాత్మా గాంధీ జిల్లాలో రెండవసారి అడుగు పెట్టింది 1929 మే 21న. ఈ సారి ఆయన పర్యటన పత్తికొండ ప్రాంతంలో జరిగింది. ఖద్దరు నిధికి విరాళాలు సేకరిస్తూ ప్రజల్లో జాతీయ చైతన్యం కలిగిస్తూ గాంధీజీ పర్యటన జరిగింది. జిల్లాలోని చాగల మర్రి, నల్లగట్ల, శిరువెళ్ల, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, నంద్యాల, అయ్యలూరు, పాణ్యం, కర్నూలు, కొనిదేడు, నాగలాపురం, ప్యాలకుర్తి, కోడుమూరు, దేవ నకొండ, జొన్నగిరి, తుగ్గలి పత్తికొండ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో మహాత్మా గాంధీతో పాటు వారి సతీమణి కస్తూరిబా కూడా పాల్గొన్నారు. మహాత్మా గాంధీతో పాటు దేశభక్త కొండా వెంకటప్పయ్య, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, పత్రికా సంపాదకులు వనం శంకరశర్మ, పత్తికొండ తాలుకా ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, ధరణీ రామచంద్రరావు, తొమ్మండ్రు వెంకట నరసయ్య, అగ్రహారం నరసింహారెడ్డి, హెచ్. మాణిక్యరావు, పెండేకల్ రెడ్డిలక్ష్మమ్మ, సి.బజార్రెడ్డి, కాదర్‌బాద్ నర్సింగరావు తదితరులు పత్తికొండ పంచాయతీ బోర్డు కార్యాలయం ముందున్న ఖాళీ స్థలంలో గొప్ప సభ జరిపారు. ఖద్దరు నిధికి విరాళాలు సేకరించి గాంధీజీకి అందించారు. వనం శంకరశర్మ ప్రజలు అందించిన విరాళం రూ.1116ను వేదిక మీద ఖద్దరు నిధికి అందించడం జరిగింది. -
Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్
సాక్షి, బెంగళూరు: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నేడు (అక్టోబర్ 2న) బెంగళూరు గ్రామీణ జిల్లాలో మాంసం, మద్యం విక్రయాలను నిషేధిస్తూ కలెక్టర్ లత ఆదేశాలు జారీ చేసారు. శనివారం రాత్రి 11 నుండి మరుసటిరోజు ఆదివారం రాత్రి 12 గంటల వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. ప్రజలు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ కోరారు. చదవండి: (పోలీసుల మాస్టర్‌ప్లాన్: మొబైల్ చోరీకి గురైతే పనికి రాకుండా ప్లాన్) -
సమగ్ర సమదర్శి... గాంధీజీ!
పుణ్యదంపతులు పుత్లీ బాయి, కరంచంద్ గాంధీలకు 1869 అక్టోబర్ 2న జన్మించిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడై మన దేశానికి ఖ్యాతి తెచ్చిన వారిలో అగ్రగణ్యుడుగా నిలి చాడు. మానవాళికి ఎన్నో కొత్త మార్గాలతో తనదైన సరళిలో వెలుగు చూపిన పుణ్యపురుషుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహాత్ముని జీవితం నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో. జాతిని ఏకతాటిపై నడిపించే నాయకులకు ఆర్థిక, సామాజిక, నైతిక విధా నాలపై ఎంతటి అవగాహన ఉండాలో గమనిద్దాం. మహాత్మా గాంధీ అనగానే మనకి స్వతంత్ర సమరం గుర్తుకొస్తుంది. స్వాతంత్య్రమనగానే గాంధీజీ గుర్తుకొస్తారు. అన్ని మత ధర్మాలను చదివి, మంచి విషయాలను ఏరుకొని తనదైన సరళిలో కొత్త కొత్త మార్గాలను సృష్టించారు. వారి విధానాలకు ఎంతో ప్రభావితులమైన మనకు ‘ఒక చెంప కొడితే మరో చెంప చూపడమ’నేది సనాతన ధర్మంలో లేని విషయం అంటే ఆశ్చర్యమేస్తుంది. మన ఆలోచనా విధానాలను ఆయన అంతగా ప్రభావితం చేశారు. ఒక్క మనల్నే మిటి సమస్త ప్రపంచాన్నీ ఎంతో ప్రభావితం చేశారు. అందుకే ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ‘గాంధీజీ లాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ నేలపై నడయాడారంటే ముందు తరాలవారు నమ్మలేకపోతారు’ అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయా లలో గాంధీజీపై ఏకంగా కోర్సులే నిర్వహిస్తున్నారు (ఉదాహరణకు వర్జీనియా, కొలంబో, ఎడింబరో విశ్వవిద్యాలయాలు). ‘సత్యమేవ జయతే’ అన్నది ఎన్నోతరాలుగా తెలి సిన సత్యం. కానీ ఆచరణలో చూపి అది అందరికీ సాధ్యమని, సత్యాగ్రహం ఒక గొప్ప ఆయుధం అని నిరూపించారు గాంధీజీ. జీవన మార్గాలపై ఎన్నో ప్రయోగాలు చేసిన గాంధీజీ తన ఆత్మకథకు ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’ అని పేరుపెట్టారు. దానికి అదే సరైన పేరు. అప్పటికే మహాత్ముడిగా పేరొందిన గాంధీజీ (ఆ బిరుదును రవీంద్రనాథ్ టాగోర్ ఇచ్చారు), తన ఆత్మకథలో తన తప్పిదాలను ఎన్నో ప్రస్తావించారు. చిన్నప్పుడు పొగతాగుతూ పట్టుబడి తండ్రి చేతిలో దెబ్బలుతిన్న విషయం ప్రస్తావించారు. పెళ్ళైన తరువాత విదేశాలకు వెళ్తు న్నప్పుడు తల్లితో మద్యం, మాంసం, మగువలను ముట్టనని ఒట్టువేసి వెళ్ళారు. మద్యం ఒకసారీ, మాంసం ఒకసారీ రుచి చూడడం చేశానని రాసు కొన్నారు. మగువ విషయంలోనూ ఒకానొకప్పుడు ఎంతో ఉద్వేగానికి గురై త్రుటిలో తప్పించుకొన్నాననీ రాసుకొన్నారు. మామూలు మనుషులైతే తప్పి పోయిన ఒట్టు గురించి ప్రస్తావనే చేసేవారు కాదేమో. అంతటి సత్యవాది కనుకనే ఆయన మహాత్ము డైనాడు. అహింస గురించి బుద్ధుడు, అశోకుడు ఎంతో ప్రచారం చేశారు. కానీ అహంస ఒక తిరుగులేని గొప్ప ఆయుధం అని నిరూపించడం గాంధీకే సాధ్యమైంది. ఆయన చూపిన అహింస సత్యాగ్రహాలను వాడి మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా మహోన్నత చరితులుగా నిలిచారు. కొద్ది సంవత్సరాల క్రితం మండేలా కనుమూసినప్పుడు ఆయనను, ఆయన అనుసరించిన అహింసామార్గాన్ని శ్లాఘించని ప్రపంచ పత్రిక లేదు. అసంఖ్యాకులు పాల్గొనే ఉద్యమంలో అహింసా మార్గాన్ని మొదటిసారిగా ప్రయోగించి దానికి వెలుగు తెచ్చిన మహాత్ముడు మన గాంధీజీ. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశ లింగం వంటి సంఘసంస్కర్తలు అంటరాని తనాన్ని ఖండించారు. ఐతే వారి ప్రభావం కేవలం విద్యా వంతుల మీద మాత్రమే వున్నది. కానీ గాంధీజీ అస్పృశ్యతా నివారణ చేపట్టిన తరువాత అంటరాని తనం అమానుషమని చాలామంది గమనించారు. బాల్యవివాహాలను ఖండించారు. బాలవితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించారు. బోధించిన ప్రతి విషయాన్ని ఆచరణలో చూపే గాంధీజీ తత్వం, ఆయన ఏ ఉద్యమం చేపట్టినా విజయవంతం చేసేది. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని నినదించి పల్లెసీమల బడుగు వర్గాల అభివృద్ధికి పాటుబడ్డారు. పదిమందికీ మేలుజరగని దేశాభివృద్ధి అర్థరహితమైన అభివృద్ధని కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి తన స్వహస్తాలతో రాట్నం తిప్పి నూలు వడికి ఖద్దరు ధరించి స్వాతంత్య్ర సమరానికి రాట్నాన్ని చిహ్నం చేశారు. దేశ ఆర్థిక, సామాజిక, నైతిక పరిస్థితుల గురించి ఆలోచించే సమగ్ర సమదర్శకులు ఆయన. అన్ని విషయాలనూ క్షుణ్ణంగా పరిశీలించే సంపూర్ణ మేధావిగా గాంధీజీ నిలిచారు. అనుక్షణం దైవస్మరణలో జీవితం గడిపే గాంధీజీకి తెలుగువారిలో ప్రముఖ నాస్తికవాదులుగా పేరొందిన గోరాకి సత్సంబంధాలుండేవి. మార్గాలు వేరైనా మానవతావాదులుగా ఒకటైన వారి స్నేహం ఎలాగుండేదంటే గోరా గారి పుత్రుడైన లవణంకు ప్రముఖ తెలుగుకవి గుర్రం జాషువా పుత్రిక హేమ లతతో వివాహం గాంధీ ఆశ్రమంలో వారి అభినం దనలతో జరిగింది. బాపూజీతో ఎన్నో అభిప్రాయ భేదాలున్న నేతాజీ గాంధీజీని అందరికన్నా ముందుగా జాతిపితగా అభివర్ణించారు. వ్యాసకర్త: ప్రొఫెసర్ ఎమ్ఆర్కే కృష్ణారావు, గాయత్రీ విద్యాపరిషత్, వైజాగ్, మొబైల్: 93924 81282 -
కన్యాకుమారి నుంచి కశ్మీర్.. భారత్ జోడో యాత్ర
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: వరుస ఓటములతో నీరసించిన కాంగ్రెస్‌లో పునరుత్తేజం తీసుకొచ్చి, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అధినేత్రి సోనియా గాంధీ ‘భారత్ జోడో’ నినాదం ఇచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా యాత్ర సాగుతుంది. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా నేతలు, కార్యకర్తలంతా భాగస్వాములు కావాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం చింతన్ శిబిర్‌లో ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ‘2024’ దృష్టితో సంస్కరణలు పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణలపై చింతన్ శిబిర్‌లో విస్తృతంగా చర్చించామని సోనియా అన్నారు. ‘‘2024 ఎన్నికలపై దృష్టి పెడుతూ పలు సంస్కరణలు అమలు చేయనున్నాం. అందుకు రెండు మూడు రోజుల్లో టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు. తన నేతృత్వంలో రానున్న అడ్వైజరీ కమిటీ వల్ల సీనియర్ సహచరుల అనుభవం నుంచి తాను నేర్చుకొనే అవకాశం ఉంటుందన్నారు. అది నిర్ణయాలు తీసుకొనే కమిటీ కాదని స్పష్టత ఇచ్చారు. అడ్వైజరీ కమిటీ భేటీలే కాకుండా సీడబ్ల్యూసీ సమావేశాలు యథాతథంగా కొనసాగుతాయని ఆమె వివరించారు. మేనిఫెస్టోలో ఈవీఎంల రద్దు: చవాన్ ఈవీఎంల విశ్వసనీయత, పనితీరుపై పార్టీల్లో, ప్రజల్లో అనుమానాలున్నందున వాటిని పక్కనపెట్టి, ఎన్నికల్లో మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానం తేవాలన్నది కాంగ్రెస్ ఉద్దేశమని పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇస్తామన్నారు. ఈవీఎంల వల్ల ఎన్నికల్లో జరిగే అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పేపర్ బ్యాలెట్ల అంశాన్ని చింతన్ శిబిర్‌లో లేవనెత్తానని అన్నారు. చాలామంది నేతలు తన వాదనకు మద్దతు పలికారని వెల్లడించారు. ఈవీఎంలను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినా ఫలితం ఉండదని, అందుకే తమ మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపర్చాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో నెగ్గడం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమని వివరించారు. తమ విజయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ పేపర్ బ్యాలెట్లను ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ పదేపదే కోరుతోంది. సవాళ్లను అధిగమిస్తాం ‘‘చింతన్ శిబిర్ చాలా ఉపయోగకరంగా, ఫలవంతంగా సాగింది. నా పెద్ద కుటుంబం (కాంగ్రెస్)తో గడిపే అవకాశం కలిగింది’’ అని సోనియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘సవాళ్లను కచ్చితంగా అధిగమిస్తాం. కాంగ్రెస్‌కు కొత్త శుభోదయం రానుంది. అదే మన అంకితభావం. అదే నూతన సంకల్పం’’ అన్నారు. భారత్ జోడోయాత్రలో తన లాంటి సీనియర్ నేతలు కూడా ఇబ్బందులు పడకుండా పాల్గొనే మార్గాలు వెతకాలంటూ చమత్కరించారు. సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని బలోపేతం చేయడానికి, లుప్తమైపోతున్న రాజ్యాంగ విలువలను కాపాడేందుకే ఈ యాత్ర అన్నారు. నిరుద్యోగం, ధరల భారం అంశాలను జన జాగరణ్ అభియాన్–2లో లేవనెత్తుతామన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సహా అనేక ప్రాంతీయ పార్టీలలో ఈ పరిస్థితి లేదు.. -
‘జన సురాజ్’ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్‌లో మా ర్పుతీసుకువచ్చేందుకు ‘జన్ సురాజ్’ వేదికను ఆరంభిస్తున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, భవిష్యత్‌లో జన్ సురాజ్ వేదికే పార్టీగా మారే అవకాశాలుండొచ్చని చెప్పారు. బిహార్‌లో మార్పుకోరుకునే తనలాంటి 18వేల మందితో టచ్‌లో ఉన్నానని చెప్పారు. వీరందరినీ తాను తలపెట్టిన పాదయాత్రకు ముందే వ్యక్తిగతంగా కలిసేందుకు యత్నిస్తానని చెప్పారు. గాంధీజీ చెప్పిన సరైన చర్యలే మంచి రాజకీయమన్న సూక్తి ఆధారంగా తానీ జన్ సురాజ్‌ను ఆరంభించానని తెలిపారు. సంవత్సరంలో 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని, రాష్ట్రం నలుమూలలా వీలైనంత మందిని కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. లాలూ, నితీశ్ సాధ్యమైనంత మేర సాధికారత తెచ్చేందుకు యత్నించారని, కానీ రాష్ట్రం అభివృద్ధి సూచీల్లో అట్టడుగునే ఉందని తెలిపారు. బిహార్‌కు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు. అదే సమయంలో బెంగాల్లో మమతతో పనిచేయడంపై జవాబిస్తూ అక్కడ టీఎంసీకి పూర్తి యంత్రాంగం ఉందని, బిహార్‌లో అంతా కొత్తగా ఆరంభించాలని చెప్పారు. బిహార్‌లో ఓబీసీల హవా అధికం, తాను బ్రాహ్మిణ్ కావడం వల్లనే భవిష్యత్ సీఎంగా ముందుకురాలేకపోయారన్న ప్రశ్నకు బదులిస్తూ బిహార్‌లో ప్రస్తుతం మోదీకి అత్యధిక ఓట్లు రాబట్టే సత్తా ఉందని, కానీ బిహార్‌లో ఆయన కులస్తులెందరున్నారని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో నీట్‌పై రగడ.. ఢిల్లీ తలుపు తట్టిన గవర్నర్ -
అంతా మీ ఇష్టమైపోయింది.. పిలవని కార్యక్రమానికి రాలేను..
సాక్షి,ఇల్లెందు( భద్రాద్రి): అంతా మీ ఇష్టమైపోయింది.. ఎంపీడీఓ కార్యాలయంలో ఏ కార్యక్రమానికీ సమాచారం ఇవ్వడం లేదు.. అలాంటప్పుడు గాంధీ జయంతికి నేను ఎందుకు రావాలి... మీరే చేసుకోండి’ అంటూ ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ అధికారులపై మండిపడ్డారు. ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంపీపీ నాగరత్నమ్మ హాజరయ్యారు. ఇదే సమయంలో గాంధీ జయంతి వేడుక నిర్వహిస్తుండగా రావాలని అధికారులు ఆహ్వానించారు. అయితే, ఇతర కార్యక్రమానికి వస్తే గాంధీ జయంతికి ఆహ్వానిస్తారా.. అసలు ఈ కార్యక్రమం ఉందని తనకు సమాచారమే ఇవ్వలేదని చెప్పారు. దీంతో ఎంపీడీఓ అప్పారావు ఆమెకు నచ్చజెప్పారు. సమాచారం ఇవ్వాలని యూడీసీకి చెప్పామని, ఆయన మరిచిపోయి ఉంటారని, ఈ విషయంలో యూడీసీకి మెమో ఇస్తామని చెప్పినా ససేమిరా అనడంతో.. చివరకు జెడ్పీటీసీ ఉమ, వైస్ ఎంపీపీ ప్రమోద్ తదితరులు నచ్చ జెప్పడంతో చివరకు ఎంపీపీ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకున్నా.. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా! -
గాంధీ, శాస్త్రి సిద్ధాంతాలను తుంగలో తొక్కారు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచానికి శాంతి సిద్ధాంతాన్ని పరిచయం చేసింది మహాత్మాగాంధీనేనని, నేడు ప్రపంచమంతా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తోంటే నేటి పాలకులు గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌లో ఇరువురి నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి రేవంత్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం భద్రంగా, సుభిక్షంగా ఉండాలంటే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ముఖ్యనేతలు జి.నిరంజన్, కుమార్‌రావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది..: హాలీవుడ్ నటుడు
మహాత్మా గాంధీ జీవితంపై వివిధ వెర్షన్లలో భారతీయ, అంతర్జాతీయ చిత్రాలు తెరకెక్కాయి. అందులో 1982లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘గాంధీ’ ఒకటి. ఈ మూవీలో బ్రిటీష్ నటుడు బెన్ కింగ్స్లే గాంధీజీ పాత్ర పోషించాడు. గతేడాది ఈ సినిమా మళ్లీ చూసిన యాక్టర్.. గాంధీ అంత్యక్రియల సీన్ చిత్రీకరణ సమయంలో 4 లక్షలకి పైగా భారతీయులు వచ్చినట్లు తెలిపాడు. ‘ఎవరైనా ఓ వ్యక్తిని అభిమానించడం సాధారణం. కానీ ఓ సినిమాలో ఆయన పాత్రని సైతం అంతే అభిమానించడం అద్భుతం. ‘గాంధీ’ సినిమా సమయంలో అది జరిగింది. అందులో బాపూజీ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షలకు పైగా భారతీయులు హాజరయ్యారు. నిజంగా భారతదేశంలో ప్రజలు చాలా ఉదారంగా ఉంటారు’ అని నటుడు బెన్ తెలిపాడు. కావాలంటే ఆ సీన్ మీరు చూడండి అంటూ.. సీజీఐ లేని పుటేజీని షేర్ చేశాడు. అయితే ఈ సీన్ గురించి ప్లానింగ్‌లో ఉన్నప్పుడు.. ‘దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో గాంధీ అంత్యక్రియల పుటేజీ చూపించాడు. అలాంటి సీన్ రిక్రియేట్ చేయడం కష్టం అనుకున్నా. కానీ రిచర్డ్ అసాధ్యాన్ని, సాధ్యం చేసి చూపించాడని’ బెన్ వివరించాడు. అయితే ఈ చిత్రం ఆ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో 11 నామినేషన్లకు పొందగా.. 8 ఆస్కార్ అవార్డులు అందుకుని సత్తా చాటింది. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి గొప్పతనాన్ని తెలిపే ఆ సినిమాలోని మొదటి 10 నిమిషాల వీడియోపై మీరు ఒకసారి లుక్కేయండి. చదవండి: జాతిపిత గొప్పదనం తెలిపే చిత్రాలివే.. -
గాంధీ జయంతి: మహాత్మునికి ప్రముఖుల ఘన నివాళులు
-
మహాత్మాగాంధీకి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, అమరావతి: నేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల కిందటే అడుగులు పడ్డాయని అన్నారు. నేటి నుంచి `క్లీన్ ఆంధ్రప్రదేశ్`కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అంటూ ట్వీట్ చేశారు. గాంధీగారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో రెండేళ్ల క్రితమే అడుగులు పడ్డాయి. నేటి నుంచి `క్లీన్ ఆంధ్రప్రదేశ్`కు శ్రీకారం చుడుతున్నాం. మహాత్ముడి జయంతి సందర్భంగా నివాళులు.#GandhiJayanti #CleanAndhraPradesh — YS Jagan Mohan Reddy (@ysjagan) October 2, 2021 -
నేడే జగనన్న స్వచ్ఛ సంకల్పం
-
గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు
న్యూఢిల్లీ: నేడు భారత జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి. అహింసే ఆయుధంగా దేశం కోసం, ధర్మం కోసం శాంతి కోసం పోరాడిన బాపూజీ జీవన మార్గం ప్రతీ భారతీయుడికి అనుసరణీయం. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ మనందరికి స్ఫూర్తిదాయకం. గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశ నేతలు, ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు. బాపు జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి మంచి మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని కొనియాడారు. ఆయనతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి అమిత్ షా గాంధీజీకి నివాళులు అర్పించారు. Congress interim president Sonia Gandhi pays floral tribute to Mahatma Gandhi at Rajghat #GandhiJayanti pic.twitter.com/S6hSTzPwHP — ANI (@ANI) October 2, 2021 కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాజ్‌ఘాట్ వద్ద జాతి పిత మహాత్మాగాంధీకి, విజయ్ ఘాట్ వద్ద ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పించారు. Delhi | Congress MP Rahul Gandhi pays tributes to father of the nation #MahatmaGandhi at Rajghat and former PM Lal Bahadur Shastri at Vijay Ghat on their birth anniversary pic.twitter.com/tcOoGkOzNK — ANI (@ANI) October 2, 2021 राष्ट्रपिता महात्मा गांधी को उनकी जन्म-जयंती पर विनम्र श्रद्धांजलि। पूज्य बापू का जीवन और आदर्श देश की हर पीढ़ी को कर्तव्य पथ पर चलने के लिए प्रेरित करता रहेगा। I bow to respected Bapu on Gandhi Jayanti. His noble principles are globally relevant and give strength to millions. — Narendra Modi (@narendramodi) October 2, 2021 #WATCH Prime Minister Narendra Modi pays floral tributes to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti pic.twitter.com/GE63jP2Nhe — ANI (@ANI) October 2, 2021 #WATCH President Ram Nath Kovind pays tribute to Mahatma Gandhi at Rajghat on his 152nd birth anniversary pic.twitter.com/kMA7U1JLAu — ANI (@ANI) October 2, 2021 -
Gandhi Jayanti: జాతిపిత ముచ్చట్లు
‘ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతో మొదలు కానీ’ అన్నారు గాంధీజీ. ఏవైతే ఎదుటివారిలో వద్దు అనుకుంటామో వాటిని ముందు మనం పరిహరించుకోవాలి. ‘చెడు అనవద్దు వినవద్దు కనవద్దు’ అన్నాడాయన. అసత్యం, అబద్ధం, ద్వేషం, మోసం, ద్రోహం, నేరం... ఇవి ఇప్పుడు పూర్తి చెడుకు కారణం అవుతున్నాయి. స్నేహం, త్యాగం, సమభావన, సహ జీవనం ఇవి విలువైనవిగా మారాయి. విలువలే మనుషుల్ని మహనీయులని చేస్తాయి. గాంధీజీని గౌరవించడం అంటే విలువల్ని కాపాడుకోవడమే. గాంధీ జయంతి వస్తే తెలిసిన విషయాలు మళ్లీ తెలుస్తూ ఉంటాయి. కాని అంతగా తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. గాంధీజీకి ప్రపంచ మహనీయులతో గాఢస్నేహం ఉండేది. రష్యన్ రచయిత టాల్‌స్టాయ్ రచనలతో గాంధీజీ ప్రభావితం అయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ‘టాల్‌స్టాయ్ ఫామ్’ పేరుతో వ్యవసాయ క్షేత్రాన్ని నడిపారు. చార్లిచాప్లిన్, గాంధీజీ ఉత్తరాలు రాసుకునేవారు. లండన్ వెళ్లినప్పుడు గాంధీజీని చార్లిచాప్లిన్ ప్రత్యేకంగా కలిశారు. గాంధీజీ ప్రభావంతో చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’ సినిమా తీశారని అంటారు. ఐన్‌స్టీన్ గాంధీజీ గురించి అన్నమాట తెలిసిందే– ‘ఈ భూమి మీద ఇలాంటి మానవుడు నడయాడాడని తెలుసుకుని భావితరాలు ఆశ్చర్యపోతాయి’. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్తో గాంధీకి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. గాంధీజీకి ‘మహాత్మ’ అనే సంబోధనా గౌరవం ఇచ్చింది టాగోర్ అంటారు. ఆ తర్వాత గాంధీ పేరు ముందు మహాత్మ ఒక ఇంటి పేరులా మారిపోయింది. ► గాంధీజీ ఫుట్‌బాల్ ప్రియుడు. ఆయన ఎప్పుడూ ఆ ఆట ఆడకపోయినా సౌత్ ఆఫ్రికాలో ఉండగా వర్ణవివక్ష వ్యతిరేక స్ఫూర్తిని కలిగించేలా జొహన్నాస్బర్గ్లో, ప్రెటోరియాలో రెండు ఫుట్‌బాల్ టీమ్‌లను స్థాపించాడు. ► గాంధీజీ ప్రకృతి వైద్యాన్ని విశ్వసించేవారు. ఒకసారి గోపాలకృష్ణ గోఖలే అనారోగ్యం పాలైతే గాంధీ ఆయనకు చాలా తేలికపాటి ఆహారం ఇవ్వసాగారు. గోఖలే దీనిని వ్యతిరేకించినా ఆయన వినలేదు. అంతేనా... ఇద్దరూ ఎక్కడికైనా ఆతిథ్యానికి వెళితే ‘గోఖలే ఏమీ తినడు’ అని ముందే ప్రకటించేసేవారు గాంధీజీ. అదే వరుసలో ఒక ఇంటికి ఆతిథ్యానికి వెళితే గోఖలే సత్యాగ్రహానికి కూచున్నారు. ‘నాకు నచ్చినవి తిననిస్తేనే కదులుతాను’ అన్నారు. గాంధీజీకి ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు గోఖలే నవ్వుతూ అన్నారట ‘చూశారా.. సత్యాగ్రాహిని సత్యాగ్రహంతోనే ఓడించాను’ అని. గాంధీజీ సుభాష్‌చంద్రబోస్‌కు కూడా డైట్ చార్ట్ ఇచ్చారు. ‘ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి రక్తపోటుకు మంచిది. ఖర్జూరాలు తిను. కాని ఎండు ద్రాక్షను మర్చిపోకు. టీ, కాఫీలు ఆరోగ్యానికి అవసరం అని నేను భావించను’ అని బోస్‌కు రాశాడాయన. ► గాంధీజీ ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం ప్రపంచాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా హక్కుల కోసం పోరాడాల్సిందేనన్న గాంధీజీ స్ఫూర్తితో 12 దేశాలలో కాలక్రమంలో హక్కుల ఉద్యమాలు జరిగాయి. ► గాంధీజీకి నివాళిగా చిన్న చిన్న బస్తీలకు, వీధులకు ఆయన పేరు పెట్టడం ఆనవాయితీ. వాటి లెక్కను మినహాయిస్తే మన మొత్తం దేశంలో 53 రోడ్లకు ఆయన పేరు ఉంది. అది విశేషం కాదు. విదేశాలలో 48 రోడ్లకు ఆయన పేరు ఉంది. ► అహింసను ఆయుధంగా స్వీకరించిన గాంధీజీకి నోబెల్ బహుమతి రాలేదు. ఆయన పేరు 1937, 1938, 1939, 1947లలో నామినేట్ అయ్యింది. చివరకు ఆయన మరణించిన 1948లో ఆఖరుసారి నామినేట్ అయ్యింది. అయినా సరే నోబెల్ బహుమతి ఆయనకు రాలేదు. అన్నట్టు గాంధీజీ అంతిమయాత్ర 8 కిలోమీటర్లు సాగింది. ► 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జవహర్లాల్ నెహ్రు దేశ స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా చేసిన చరిత్రాత్మక ప్రసంగ సమయంలో గాంధీజీ ఆయన పక్కన లేరు. ► ఒకసారి గాంధీజీ ఒక మీటింగ్‌లో ఉంటే ఒక పసివాడు ఆయనను చూడటానికి వచ్చాడు. ‘నీకు చొక్కా లేదా’ అని ఆశ్చర్యపోయాడు. ‘నా దగ్గర అన్ని డబ్బులు లేవు నాయనా’ అన్నాడు గాంధీజీ. పసివాడికి జాలి పుట్టింది. ‘మా అమ్మ నా బట్టలు కుడుతుంది. నీకు కుట్టి తెస్తాలే’ అన్నాడు. ‘మీ అమ్మ ఎన్ని కుడుతుంది. నువ్వు ఎన్ని తేగలవు. నాలా చొక్కాలు, ఒంటి నిండా బట్టలు లేనివారు 40 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. వారు తొడుక్కోకుండా నేను తొడుక్కుంటే ఏం బాగుంటుంది’ అన్నారు గాంధీజీ ఆ పసివాడితో. ► కంప్యూటర్ దిగ్గజం స్టీవ్‌జాబ్స్ గాంధీజీ అభిమాని. వృత్తాకార కళ్లద్దాలు గాంధీ కళ్లద్దాలుగా పేరు పొందడం తెలిసిందే. గాంధీజీ మీద గౌరవంతో స్టీవ్‌జాబ్స్ అలాంటి కళ్లద్దాలనే ధరించాడు. ► గాంధీజీ డార్జిలింగ్‌లో టాయ్‌ట్రైన్‌లో వెళుతున్నప్పుడు ఇంజన్లో సమస్య వచ్చింది. ట్రైన్ వెనక్కు నడవసాగింది. అందరూ భయభ్రాంతం అవుతుంటే గాంధీజీ తన సెక్రెట్రీకి ఉత్తరాలు డిక్టేట్ చేయసాగారు. అప్పుడు సెక్రెటరీ ‘బాపూ... మనం ఏ నిమిషం అయినా పోయేలా ఉన్నాం తెలుసా?’... దానికి గాంధీజీ జవాబు ‘పోతే పోతాం. కాని బతికితే పోతామేమో అని ఆందోళన పడిన సమయం అంతా వృధా చేసిన వాళ్లం అవుతాం. కనుక డిక్టేషన్ తీసుకో’. అన్నాడు. కాలం విలువ తెలియ చేసిన మహనీయుడు ఆయన. -
బాపూజీతో భాయీ భాయీ
భారత స్వాతంత్య్రోద్యమంలో హిందువులూ, ముస్లింలూ గాంధీజీతో కలిసి నడిచారు. అందులో కొందరు ముస్లింల గురించైనా తెలుసుకోవడం సముచితం. గాంధీజీ స్వగ్రామమైన పోరు బందర్‌కు చెందినవారు దాదా అబ్దుల్లా ఆందం జవేరీ. ఆయనకు దక్షిణాఫ్రికాలో వ్యాపారాలు న్నాయి. అక్కడి తన కంపెనీ న్యాయవాదు లకు సహకరించేందుకు గాంధీని దక్షిణాఫ్రికా పిలి పించుకున్నారు. భార తీయులు ఎదుర్కొం టున్న వివక్షను వివ రించి, పోరాడటానికి ‘నాటల్ ఇండియన్ కాంగ్రెస్’ స్థాపించారు. అధ్యక్షులుగా దాదా అబ్దుల్లా, కార్యదర్శిగా గాంధీజీ ఎంపికయ్యారు. ‘ప్రజాసేవ చేయాలనే కోరిక, దానికి కావలసిన శక్తి నాకు దాదా అబ్దుల్లా సాహచర్యంలోనే లభించాయి’ అని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత్‌కు వచ్చీరాగానే చంపారన్ రైతాంగ పోరాటాన్ని భుజానికెత్తుకున్నారు. చంపారన్ రైతాంగ పోరాట నాయకులు షేక్ గులాబ్, ముహమ్మద్ మోనిస్ అన్సారీ ఆయనకు కుడిభుజంగా సహకరించారు. చంపారన్ రైతుల్లో గాంధీజీకి ఉన్న ఆదరణను పసిగట్టిన ఆంగ్ల అధికారి ఇర్విన్ ఆయన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. ఆయన్ని భోజనానికి ఆహ్వానించి, విషమిచ్చి చంపే బాధ్యతను తన వంటమనిషి బతఖ్ మియా అన్సారీకి అప్పగించాడు. చంపితే ఊహకు అందని బహుమతులతో సత్కరిస్తాననీ, లేకపోతే నరకం చూపిస్తాననీ భయపెట్టాడు. కానీ బతఖ్ మియా తన ప్రాణాలకు తెగించి బాపూజీ ప్రాణాలు రక్షించాడు. భారత స్వాతంత్య్ర చరిత్రలో ‘అలీ బ్రదర్స్’గా ప్రసిధ్ధి గాంచిన ముహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ జౌహర్ అండ జాతీయోద్యమంలో గాంధీకి కొండంత బలాన్నిచ్చింది. వారితో ఆయన ఎంతగా కలిసిపొయ్యారంటే, ఆబాదీబానూకు తాను మూడో సంతానమని చెప్పుకుంటూ, ఆమెను అమ్మా అని పిలిచేవారు. ఉద్యమ అవసరాల కోసం గాంధీజీని ఆపద్బాంధవుడిలా ఆదుకున్న మరో సహచరుడు ఉమర్ సుభానీ. బొంబాయిలో ఏ మీటింగు జరిగినా అందులో సగానికి సగం ఉమర్ సుభానీ భరించేవారు. 1921లో ‘తిలక్ స్వరాజ్య నిధి’కి విరాళాలు సేకరించే సమయాన గాంధీజీకి బ్లాంక్ చెక్కు ఇచ్చి ‘ఎంత కావాలో రాసుకోండి’ అన్న ఉదార గుణ సంపన్నుడు సుభానీ. దక్షిణాఫ్రికా నుండి కుటుంబంతో సహా గాంధీ వెంట భారతదేశానికి వచ్చేసిన మిత్రుడు ఇమాం అబ్దుల్ ఖాదిర్ బావజీర్. గాంధీజీ ఆయన్ని ప్రేమగా ‘ఇమాం సాబ్’ అని పిలుచుకునేవారు. ఆయన సతీమణి, ఇద్దరు కుమార్తెలు కూడా ఆశ్ర మంలోని ప్రెస్‌లో పని చేసేవారు. ఇమాం సాహెబ్ కూతురు ఫాతిమా బేగం వివాహాన్ని గాంధీ దగ్గరుండి జరి పించారు. గాంధీతో కలిసి నడిచిన మరో సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్. సరిహద్దు గాంధీగా ప్రసిద్ధుడు. ‘ఆయుధం పట్టుకొని యుద్ధం చేసే పఠాన్ కన్నా, అహింసను ఆయుధంగా ధరించిన ఈ పఠాన్ చాలా ప్రమాదకారి’ అని బ్రిటిష్ పాలకులతో అనిపించుకున్న ధీరోదాత్తుడు. ‘ఖుదాయి ఖిద్మత్గార్’ పేరిట భారత స్వాతంత్య్ర పోరాటానికి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శాంతికాముకుడు. 1969లో గాంధీజీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఖాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ, ‘మీరు బుద్ధుడిని మరచిపోయినట్లుగానే గాంధీని మరచి పోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి దేశ పరిస్థితుల దృష్ట్యా స్వాతంత్య్రో ద్యమంలో ముస్లింల భాగస్వామ్యాన్ని ప్రజలకు పరిచయం చేయడం మన కర్తవ్యం. (నేడు గాంధీ జయంతి) ఎం.డి. ఉస్మాన్ ఖాన్ వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 99125 80645 -
మానవతా శిఖరం మహాత్ముడు
నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఘర్షణ వాతావర ణమే. కులాలు, మతాలు, జాతి వైరాలతో హింస తాండవిస్తోంది. గాంధీజీ భావాలను, సాధించిన విజయాల్ని తలచుకుంటే మానవజాతి భవితపై కమ్ముతున్న కారు చీకట్ల మధ్య జాతిపిత ఒక కాంతికిరణం అనిపిస్తుంది. గాంధీజీ పరిపూర్ణ వ్యక్తి. సత్యాన్వేషణలో తన జీవితాన్ని ప్రయోగశాలగా మలుచుకున్న గొప్ప శక్తి. స్వార్థం, అర్థంలేని వస్తు వ్యామోహం... ఇలా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్య లకు తన ఆత్మకథలో పరిష్కారాలు చూపారు. విద్యార్హతలు, హోదా మనిషిని గౌరవించడానికి కొలమానాలు కావంటారు. ఎదుటి మనిషిని ఆత్మ రూపంగా, సత్య రూపంగా చూడమంటారు. ఆ ఆధ్యాత్మిక, నైతిక దృష్టికోణాన్ని అలవర్చుకోగలి గితే మానవ సంబంధాలతో ముడిపడిన తొంభై శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని గాంధీ మార్గం సూచిస్తుంది. ఎంత చదివినా, ఎంత సంపాదించినా ఆధు నిక జీవితం సమస్యాత్మకమే అవుతోంది. ఏదో అసంతృప్తి, ఆవేదన కనిపిస్తున్నాయి. వాస్తవానికి గాంధీ సైతం ఒక దశలో అలాంటి ఆలోచనల్లో పడిన వారే. అప్పుడే సత్యశోధన అంకురించింది. తాను వెళుతున్న మార్గం ఎంత తప్పో గ్రహించారు. రెండు గదుల ఇంటి నుండి ఒక గదికి మారారు. హోటల్ భోజనం నుండి స్వయంపాకంలోకి వచ్చారు. సరళ జీవితం సమయాన్ని ఆదా చేసింది. అప్పుడే తన జీవితం సత్యమైనదన్న గ్రహింపు కలిగి ఆత్మ సంతృప్తి కలిగిందంటారు గాంధీ. ఆయన దృష్టిలో సత్యం అంటే మాటకు సంబం ధించింది మాత్రమే కాదు; అది ఆలోచన, ఆచరణ లతో ముడిపడింది కూడా. గాంధీ మార్గంలో మరో అడుగు పశ్చాత్తాపం. నీటితో బురదను కడుక్కున్నట్లు పశ్చాత్తాపంతో పాపాల్నీ, లోపాల్నీ శుభ్రపరచుకోవచ్చు అని నిరూపించారు. అపరాధం చేశానని భావించిన ప్రతిసారీ ఉత్తరాల రూపంలో క్షమాపణ కోరేవారు. అలాగే ఉపవాసాన్ని ఒక బలమైన ప్రాయశ్చిత్త మార్గంగా భావించారు. గాంధీ మార్గంలో మరో మజిలీ అహింస. సత్యం అనే గమ్యాన్ని చేరుకోవ డానికి అహింసే ప్రధాన మార్గం అని భావించారు మహాత్ముడు. సమస్యలు, సంక్షోభాలు ఎన్ని వచ్చినా ఆ మార్గాన్ని వీడలేదు. సత్యసంధత వల్ల క్రోధం, స్వార్థం, ద్వేషం సమసిపోతాయి. రాగ ద్వేషాలు ఉన్న వ్యక్తి ఎంత మంచివాడైనా శుద్ధ సత్యాన్ని దర్శించలేడని చెబుతారు. స్వాతంత్య్ర సమరం అహింసా మార్గంలో జరిగింది కాబట్టే శత్రువులుగా ఉండాల్సిన బ్రిటిష్‌వారు సైతం గాంధీజీని మహనీయుడిగా భావించారు. గాంధీజీ అన్ని మతాలకు సమాన స్థానం ఇచ్చారు. కేవలం మత పాండిత్యం వ్యర్థం అన్నారు. ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదు. అది భగవంతుడిపై ఆత్మకు ఉండే గాఢమైన అను రక్తి. తన సమస్తం దైవానిదేనని భావించి, ఆ భావం మీదే మనస్సు కేంద్రీకరించడం. దైవానికీ, మానవ రూపంలో కనిపించే మాధవుడికీ సేవ చేయడానికి తన జీవి తాన్ని అంకితం చేసిన దివ్య శక్తిమయుడు. విద్యా విధానం, అంట రాని తనం, హరిజనో ద్ధరణ, ఖద్దరు విని యోగం, ఉపవాస దీక్ష... ఇలా ప్రతి అంశంపైనా గాంధీజీకి స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. స్వతంత్ర భారతంలో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలన్న అంశం పైనా ప్రత్యేక అభిప్రాయాలు ఉండేవి. గాంధీజీ అంతర్జాతీయవాది. ప్రపంచ శ్రేయంలోనే దేశ శ్రేయం ఉందని భావించారు. గాంధీజీ సూచించిన విశ్వ మానవతా వాదనను ఆచరిస్తే – సరిహద్దు గొడవలు, జాతి వైషమ్యాలు, మతకలహాలు కనుమరుగవుతాయి. జగమంతా శాంతిమయం అవుతుంది. (నేడు గాంధీ జయంతి) డా. అశోక్ పరికిపండ్ల వ్యాసకర్త గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ తెలంగాణ కన్వీనర్ ‘ 99893 10141 -
గతమెరిగి ముందుకు నడుద్దాం
ఏ మహనీయుల జయంతి వేడుకలైనా జరుపుకోవడం కేవలం వారిని స్మరించుకోడానికా? వారి ఆశయాలను అనుసరిస్తూ, మనను మనం ఉన్నతీకరించుకునే ఒక స్ఫూర్తి అవకాశంగా మలచు కోవడానికా? జవాబు మొదటిదే అయితే చర్చే లేదు! రెండోదయితేనే.. ఆత్మపరిశీలన చేసుకోవాలి. యేటా అక్టోబరు 2న మనం జాతిపిత బాపూజీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. బాపూజీని ఎంతవరకు అనుసరిస్తున్నాము, ఆయన చేసిన కర్తవ్య బోధ, పాటించిన విలువలు, అనుసరించిన జీవనవిధానం మనను ఏ మేరకు ప్రభావితం చేసింది? అని ఎవరికి వారం ప్రశ్నించుకోవాలి. విశాల భారత దేశాన్ని ఏకతాటిపై నడిపి, మానవాళి చరిత్రలోనే అపురూపమైన మహోజ్వల స్వాతంత్య్రో ద్యమాన్ని శీర్షభాగాన నిలిచి నడిపించిన సమరశీలి! సత్యం, శాంతి, అహింస, సహాయ నిరాకరణ ఆయుధాలుగా నిరసనకు ఓ కొత్త సాంకేతిక నిర్వచనం ఇచ్చి, త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన యోగి! అప్పటికే దక్షిణాఫ్రికాలో సంచలనం సృష్టించి భారత్‌కు తిరిగి వస్తూ, ముంబాయిలో అడుగు పెట్టే నాటికే గాంధీజీ విశ్వనరుడు. ఇక్కడ ఆయనను ఉద్యమ నాయకుణ్ణి చేసినవి నాటి పరిస్థితులు, అంతకుమించి ఆయన నిరాడంబరత–నిబద్ధతలు! భూగోళమంతా విస్తరించి, రవి అస్తమించని సామ్రాజ్యమనే ఖ్యాతి గడించిన బ్రిటీష్ పాలకులను భారత భూభాగం నుంచి బేషరతుగా పంపిం చిన ఘన విజేత! ‘సత్యాగ్రహం’ అనే సరికొత్త బాటలో నడిపారాయన. ఒక పిలుపు ఇస్తే దేశమంతా కదిలి వచ్చేది. ప్రజలు విదేశీ వస్తుబహిష్కరణ చేశారు, స్వదేశీ బట్టగట్టారు, ఉపవాసమున్నారు, లాఠీదెబ్బలు తిన్నారు, నెలల తరబడి జైళ్లలో మగ్గారు. మధురై ప్రసంగంలో బీహార్ వరద బాధితుల ఆక్రందనల్ని ప్రస్తావించి, ‘వారూ మన సోదరులే... అన్నీ పోగొట్టుకొని నిరాశ్రయులయ్యారు, మనం చేతనైన సాయం చేద్దాం’ అని గాంధీజీ అంటే, అక్కడికక్కడ పౌరులు జేబుల్లో ఉన్న డబ్బుతో పాటు ఒంటిమీదున్న నగలూ, నట్రా కుప్పపోశారు. ఆ రోజుల్లో ఆయన మాట అలా ఒక సమ్మోహన శక్తి అయింది. స్వాతంత్య్రంతో పాటు ఆ క్రమంలో గాంధీజీ సాధించిన ఓ అసాధారణ ఫలితమే మంటే సగటు భారతీయుల వ్యక్తిత్వాన్ని మహోన్నత స్థాయికి పెంచడం! నిజమైన దేశభక్తి, జాతీయ వాదం, నిజాయితీ, మానవత్వం వంటి విలువల్ని ‘జీవన విధానం’ అనే లంకెతో గాంధీజీ సూత్ర బద్దం చేశారు. స్వాతంత్య్రానంతరం ఒకట్రెండు దశాబ్దాల పాటు దాదాపు అన్ని రంగాల్లోనూ అది ప్రతిఫలించింది. రాజకీయ నాయకుల నుంచి సామాజికవేత్తలు, వర్తకులు, వ్యాపారులు, పారి శ్రామికవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, వకీళ్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వోద్యోగులు... ఇలా సమాజంలోని సమస్త వర్గాలవారు విలువలతో పనిచేశారు. ‘మేం వెళ్లిన మరుక్షణం మీ దేశం నిలువదు, ముక్క చెక్కలవుతుంది’ అన్న బ్రిటిష్‌వాడి మాటల్ని వమ్ము చేసి, భారత్ ఎదగడమన్నది గాంధీజీ సాధించిన ఒంటిచేతి విజయఫలం! కానీ, ఇవాల్టి పరిస్థితి.. అందుకు పూర్తి భిన్నంగా, ఎంతో దయనీయంగా ఉంది. కారణం, మనం గాంధేయవాదానికి ఆచరణలో తిలోదకాలిచ్చాం. అందుకే, గాంధీజీ– ఆయన విధానాల అవసరం ఆయన కాలంలో కన్నా నేడే ఎక్కువ! స్వప్రయోజనాలకో, లోతైన అవగాహన లేకో... గాంధీజీని, ఆయన విధానాల్ని విమర్శిస్తూ, వివాదాస్పదం చేసే వ్యక్తులు, గుంపులు తర్వాత్తర్వాత మొదలయ్యాయి. ఏ విషయంపైనా ఇంచ్‌కి మించిన లోతు అవగాహన లేని అల్లరి, అజ్ఞానపు మూకల్ని మాత్రమే వారు ప్రభావితం చేయగలరు. ‘రక్తమాంసాలతో ఇలాంటి ఒక మనిషి నేలపై నడయాడాడు అంటే భవిష్యత్తరాలు నమ్మవు’ అని గాంధీజీ జీవన విధానాల్ని కీర్తించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటల ముందు ఈ పిల్లచేష్టలు చల్లబడతాయి. ‘గాంధీ జీయే నాకు స్ఫూర్తి’ అన్న మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) విశ్వాసం ముందు విమర్శలు వీగి పోతాయి. ‘ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీక గాంధీ, తరతరాల మానవాళికి మార్గదర్శి’ అన్న నెల్సన్ మండేలా ప్రశంస విమర్శకుల నోళ్లు మూయిస్తుంది. ఈ కాలపు అమెరికా ప్రొఫెసర్ జెనె షార్ప్ ‘డిక్టేటర్షిప్ టు డెమాక్రసీ’ అనే పుస్తక ప్రభావం పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలె న్నింట్లోనో ప్రజాస్వామ్య నవ వసంత వీచికలకు కారణమైంది. బలోపేతంగా కనిపించే నియంతృత్వ ప్రభుత్వాలు కూడా, సరైన పంథాలో ఉద్యమాలు నడిపితే... ‘ఒక ఇటుక లాగితే కుప్పకూలే భవ నాల్లా’ కూలి నేలమట్టమవుతాయని రాసిన జెనెషార్ప్, గాంధేయవాదంలో ఆ సత్తావుందని పుస్త కంలో పలుమార్లు ఉటంకించారు. గాంధీజీ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని, మనమంతా గాంధేయవాదాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా యువ రాజకీయ నాయకత్వం ఆయన బాటలో సాగితే అద్భుతమైన ఫలితాలుంటా యనడానికి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ కళ్లెదుటి సాక్ష్యం. గాంధీజీ కలలు కన్న ‘గ్రామస్వరాజ్యం’ సాకారమౌతున్న జాడలు రెండేళ్లలోనే మొదలయ్యాయి. ఏ ఏడు సామాజిక పాపాలు గాంధీజీ వద్దన్నాడో, అవే ఇపుడు దేశమంతా బలపడుతున్నాయి. శ్రమలేకుండా గడించే సంపద, అంతరాత్మ ఒప్పని విలాసాలు, వ్యక్తిత్వం ఇవ్వని జ్ఞానం, విలువల్లేని వ్యాపారం, మానవత చూపని విజ్ఞానం, త్యాగం లేని మతం, సిద్దాంతాలకు లోబడని రాజకీయాలు వద్దంటే వద్దన్నాడా యన. ఆ పాపాలే రాజ్యమేలుతున్న దుష్టకాలమిది. దీన్నుంచి బయటపడటానికి మళ్లీ గాంధీ, గాంధేయ విధానాలే మనకు మార్గం. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో అక్షరాలా గాంధేయ వాదముంది. వ్యక్తి క్రమశిక్షణ ప్రధానమని గాంధీ నొక్కి చెప్పారు. ఎవరి స్థాయిలో వారం పాటిం చాలి. ఆయనే చెప్పినట్టు ‘మనం ఆశించే మార్పు, మననుంచే మొదలవ్వాలి’! -
నేడు అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా మూడు రోజుల కింద వాయిదా పడిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 24న శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు మొదలుకాగా.. రెండు రోజులు మాత్రమే జరిగాయి. భారీ వర్షాల కారణంగా మూడు రోజులు వాయిదా వేస్తున్నట్టు 27వ తేదీన స్పీకర్ బులెటిన్ విడుదల చేశారు. కాగా.. శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక హరితహారంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ, శాసనమండలి భేటీలకు విరామం ఉంటుంది. తిరిగి 3వ తేదీ (ఆదివారం) నుంచి 5వ తేదీ వరకు ఉభయ సభల సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ సమావేశాలు పొడిగించే పక్షంలో 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. హరితహారంపై సీఎం సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక అధికారులు భూపాల్‌రెడ్డి, శాంతికుమారి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో హరితహారం ద్వారా సాధించిన ఫలితాలు, గణాంకాలు, ఇతర వివరాలను వారు సీఎంకు అందజేశారు. -
గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలు ప్రదానం
సాక్షి, హైదరాబాద్: గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జికాట్) ఆధ్వర్యంలో గాంధీజీ 151వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలో పలువురికి గ్రామోదయ బంధు మిత్ర పురస్కారాలు అందజేశారు. స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్‌వలీ, నాబార్డ్ విశ్రాంత సీజీఎం పాలాది మోహనయ్య, సాక్షి సాగుబడి ఇంచార్జి పంతంగి రాంబాబు తదితరులు అవార్డులను అందుకున్నారు. జికాట్ చైర్మన్ మేరెడ్డీ శ్యాంప్రసాద్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
ఆ ఏడాది గాంధీకే నోబెల్ పీస్ ప్రైజ్.. కానీ
(వెబ్ స్పెషల్): నోబెల్ శాంతి బహుమతి.. ప్రపంచ శాంతికి కృషి చేసిన ఎందరికో ఈ బహుమతిని ప్రదానం చేశారు. మరి భారత్, ఆఫ్రికా దేశాల్లో శాంతియుత పోరాటాలు చేసిన జాతిపిత, మహాత్మగాంధీని ఈ బహుమతిని ఎందుకు వరించలేదు. ఈ ప్రశ్నే గాంధీ జయంతి(అక్టోబర్ 2న) సందర్భంగా కోట్లాది మంది భారతీయులను తొలుస్తోంది. అందుకు గల కారణాలు తెలుసుకుందాం. నోబెల్ శాంతి పురస్కారంతో గౌరవించడం రెడ్ క్రాస్ స్థాపకులు జీన్ హెన్రీ డ్యూనెంట్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు 19 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. ఇక 27 సార్లు ఈ పురస్కారాన్ని వ్యక్తుల కంటే సంస్థలకు ఇవ్వడమే సబబని భావించారు. ఒక్కసారి నోబెల్ బహుమతిని ప్రదానం చేసిన తర్వాత తిరిగి వెనక్కు తీసుకోరు. అందుకే బహుమతికి ఎంపిక చేసే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇక జాతిపితకు ఈ పురస్కారం దక్కకపోవడం పట్ల పలు వివరణలు వినిపిస్తాయి. ముఖ్యంగా గాంధీజీకి ఈ పురస్కారం ఇచ్చి ఆంగ్లేయ పాలకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోకూడదని నోబెల్ కమిటీ భావించిందనే వాదన ఎక్కువగా ప్రచారంలో ఉంది.(చదవండి: నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్) నాలుగు సార్లు నామినేట్ అయిన గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ నాలుగు సార్లు నామినేట్ అయ్యారు. ఆయనను వరసగా 1937, 1939లో నామినేట్ చేశారు. 1947లో కూడా ఆయన నామినేట్ అయ్యారు. చివరగా 1948లో గాంధీని నామినేట్ చేశారు. కానీ తర్వాత రెండు రోజులకే ఆయన హత్యకు గురయ్యారు. మొదటిసారి ఒక నార్వే ఎంపీ గాంధీ పేరును సూచించారు. పురస్కారం ఇచ్చే సమయంలో కమిటీ ఆయనను పట్టించుకోలేదు. దీని గురించి నోబెల్ కమిటీలోని జాకబ్ వార్మూలర్ అనే సలహాదారు గాంధీకి నోబెల్ పురస్కారం ఇవ్వకపోవడం గురించి తన అభిప్రాయం రాశారు. ‘గాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తను చేస్తున్న అహింసా ఉద్యమం ఎప్పుడో ఒకప్పుడు హింసాత్మకంగా మారొచ్చని తెలిసినా దానిని వీడలేదు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘దక్షిణాఫ్రికాలో, భారత్‌లో ఆయన కేవలం తన దేశస్తుల కోసమే పోరాడారు. నల్లజాతి వారికోసం ఆయన ఏం చేయలేదు’ అని రాసుకొచ్చారు. (చదవండి: సరైన నేతకు ‘నోబెల్ శాంతి’) 1947లో మరోసారి.. 1947 లో నోబెల్ కోసం గాంధీని బీజీ ఖేర్, జీవీ మౌలాంకర్, జీపీ పంత్ నామినేట్ చేశారు. ఆ సమయంలో కమిటీ ఛైర్మన్ గున్నార్ జాన్ ఇద్దరు సభ్యులు, క్రిస్టియన్ కన్జర్వేటివ్ హర్మన్ స్మిట్ ఇంజిబ్రేట్సెన్, క్రిస్టియన్ లిబరల్ క్రిస్టియన్ ఒఫ్టెడల్ గాంధీ వైపు మొగ్గు చూపారు, కాని మిగతా ముగ్గురు - లేబర్ రాజకీయ నాయకుడు మార్టిన్ ట్రాన్మాల్, మాజీ విదేశాంగ మంత్రి బిర్గర్ బ్రాడ్ల్యాండ్లు వ్యతిరేకించారు. దేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు.. గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆయనకు ఆ ఏడాది పురస్కరం లభించలేదు. దేశ విభజన వల్ల భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పక వస్తుందని కమిటీ భావించింది. దాంతో గాంధీకి పురస్కారం దక్కలేదు. దాంతో అది మానవ హక్కుల ఉద్యమం ‘క్వేకర్’కు లభించింది. 1948లో మరోసారి.. ఒట్టిదే నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ చివరి తేదీకి రెండు రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ సమయానికే నోబెల్ కమిటీకి గాంధీ తరఫున ఆరు సిఫార్సులు అందాయి. వాటిలో 1946, 47 అవార్డు గ్రహీతలు ది క్వేకర్స్, ఎమిలీ గ్రీన్ బాల్చ్ ఉన్నారు. కానీ అదే ఏడాది గాంధీ మరణించారు. దాంతో కొత్త సమస్య తెరమీదకు వచ్చింది. అప్పటి వరకు మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇవ్వలేదు. దాంతో మరో సారి నోబెల్ ఆశ నిరాశ అయ్యింది. అయితే ప్రస్తుతం మరణించిన తర్వాత కూడా ఇస్తున్నారు. దీంతో పాటు మరో ప్రశ్న కూడా ఎదురయ్యింది. శాంతి పురస్కారం నగదు ఎవరికి చెల్లించాలి అని. ఎందుకంటే అప్పటికి గాంధీ పేరు మీద ట్రస్టుగానీ, సంఘం గానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు. దాంతో మరోసారి నోబెల్ చేజారింది. (చదవండి: గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!) ఇక ఆ ఏడాది ఎవరికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వలేదు. దీని గురించి కమిటీ ‘జీవించి ఉన్న ఏ అభ్యర్థినీ శాంతి పురస్కారానికి తగిన వారుగా భావించలేదు’ ప్రకటించింది. ఇక్కడ 'జీవించి ఉన్న' అనే మాట చాలా ముఖ్యమైనది. దానిని బట్టి, మరణానంతరం ఎవరికైనా పురస్కారం ఇచ్చే అవకాశం ఉండుంటే, అది కచ్చితంగా గాంధీకి తప్ప వేరే వారికి దక్కేది కాదనేది స్పష్టమవుతోంది. -
మహాత్మునికి మోదీ నివాళి
-
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, నల్గొండ : గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు నల్గొండ పట్టణంలో రామగిరిలో మహాత్మా గాంధీ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకుడు జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, దుబ్బాక నర్సింహా రెడ్డి సహా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా సంతకాల సేకరణను చేపట్టారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. 'వ్యవసాయ బిల్లులను పార్లమెంటరీ సంప్రదాయాన్ని అనుసరించకుండా మూజువాణి ఓటుతో తీసుకోచ్చారు. ఈ బిల్లులు వ్యవసాయదారులకి, వినియోగదారులకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీటి వల్ల మార్కెట్ వ్యవస్థ పోయి కార్పొరేట్ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా సంతకాలను సేకరించి కేంద్రానికి అందచేస్తాం' అని తెలిపారు. ప్రజాస్వామ్యంపై, మహిళలపై, దళితులపై, ప్రశ్నించే వారిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీపై పోలీసులు ప్రవరర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. -
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు ఆర్పించారు. దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యానారాయణ, బాలీనేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాపు కల నెరవేరిందిలా..
ఏపీలోని గ్రామ/వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మంది ప్రజలకు మేలు జరుగుతోంది. త్వరగా ప్రజలకు సేవలు అందుతున్నాయి. ఈ విధానాన్ని మిగతా రాష్ట్రాలు సైతం అమలు చేస్తాయని భావిస్తున్నా.. – ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒక్క కితాబు చాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏ స్థాయిలో విజయవంతం అయ్యిందో చెప్పడానికి.. ప్రభుత్వ పాలనను ప్రతి ఇంటి ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ వ్యవస్థను యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్లో ఒక పాఠ్యాంశంగా చేర్చారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ సచివాలయ వ్యవస్థను ప్రత్యేకంగా అభినందించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ వ్యవస్థతో జిల్లాలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ప్రభుత్వ సేవలు క్షణాల్లో ప్రజలకు అందుతున్నాయి. పాలనలో అచ్చమైన పారదర్శకత ప్రతిబింబిస్తోంది. సచివాలయం సేవల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో మహాత్ముడి స్వప్నం సాకారమైంది. ఏడాదిలో ఎన్నో విజయాలు అందుకున్న సచివాలయ వ్యవస్థ నేటి నుంచి రెండో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. సాక్షి, విశాఖపట్నం: గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకుని.. రెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రజా సంకల్ప యాత్రలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానన్న హామీని నెరవేర్చి.. ప్రజల ముంగిటకే సుపరిపాలనను తీసుకొచ్చారు. జిల్లాలో మొత్తం 1,341 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో సగటున మూడు వేల మందికి, ఏజెన్సీలో రెండు వేల మంది జనాభాకు ఒకటి చొప్పున 733 ఏర్పాటు చేశారు. జనాభా తక్కువగా ఉన్న చోట్ల సమీప గ్రామాలను కలిపారు. రెండు, మూడు గ్రామాలను కలిపేటప్పుడు ఆయా గ్రామాల ప్రజలకు సామీప్యత, రవాణా సదుపాయం ప్రాతిపదికగా తీసుకుని ఉమ్మడిగా, అన్నింటికీ అందుబాటులో ఉండే పెద్ద పంచాయతీని గ్రామ సచివాలయంగా ఎంపిక చేశారు. గిరిజన ప్రాంతాల్లో రెండు వేల పైబడి జనాభా ఉన్న అన్ని పంచాయతీలను గ్రామ సచివాలయాలుగా గుర్తించారు. తక్కువగా ఉన్నచోట్ల రెండు, మూడు చిన్న పంచాయతీలను కలిపి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. మిగతావి ఈ సచివాలయం పరిధిలోకి వచ్చినా.. పంచాయతీ స్థాయి గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ఆయా గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేనిచోట్ల కొత్తగా భవనాలు నిర్మిస్తున్నారు. విశాఖ నగరంతో పాటు నర్సీపట్నం, యలమంచిలి పట్టణ ప్రాంతాల్లో 608 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల్లో మంజూరు అయిన పోస్టులు 10,660. ప్రస్తుతం 9,075 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా ఖాళీగా ఉన్న 1,585 పోస్టుల భర్తీకి ఇటీవలే పరీక్షల ప్రక్రియ ముగిసింది. ఇక గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 22,938 మంది గ్రామ, వార్డు వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. గడప వద్దకే సేవలు గ్రామ సచివాలయాల్లో 13 శాఖల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో పది శాఖల ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలపై ఫిర్యాదులు, సంక్షేమ పథకాల కోసం ఆర్జీలు స్వీకరిస్తున్నారు. దాదాపు 592 రకాల ఎల్రక్టానిక్ (ఇ)–సేవలను అందించడంతో పాటు ‘స్పందన’కార్యక్రమం కూడా జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్నారు. అక్కడ అందే విజ్ఞాపనలు నిరీ్ణత కాలంలో పరిష్కారమవుతున్నాయో లేదోనని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డ్యాష్‌బోర్డు నుంచి పర్యవేక్షించడం విశేషం. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు ప్రజల గడప వద్దకే అందించాలన్న ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేయడంలో గ్రామ, వార్డు సచివాలయాలు సఫలమవుతున్నాయి. పారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, పేదలందరికీ ఇళ్లు, రజకులు–నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక సహాయం, జగనన్న ‘అమ్మ ఒడి’పథకం, బియ్యం కార్డు, వైఎస్సార్ పింఛను కానుక, వైఎస్సార్ కాపు నేస్తం, జగనన్న ‘విద్యాదీవెన’– జగనన్న ‘వసతి దీవెన’, వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్.. ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారంతో రూపొందించిన పోస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా తమకు ఏ పథకమైనా అందకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్న ‘స్పందన’లో ఫిర్యాదు చేయవచ్చు. దీన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి, దాన్ని పరిష్కరించే బాధ్యత సచివాలయ సిబ్బందికే ప్రభుత్వం అప్పగించింది. ఇలా ప్రజల నుంచి విజ్ఞాపనలు, దరఖాస్తులను స్వీకరించడం, పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేయడం వారి చెంతనే జరుగుతోంది. కేవలం ఎంపీడీవోలు, కలెక్టర్ పాత్ర ఆమోదముద్ర వేయడం వరకే! సచివాలయ సేవలకు నిదర్శనాలు.. ప్రజలకు సంబంధించిన ప్రతి డేటా ఆన్లైన్లో నిక్షిప్తం అయ్యింది. ప్రతి ఇంట్లో సభ్యుల ప్రతి సమాచారం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయంలో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు ఏదైనా డేటా కావాలంటే నెలలు గడిచిపోయేవి. ఇప్పుడు నిమిషాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో బాధితుల సంఖ్యను సంఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిర్ధారించగలగడమే దీనికి నిదర్శనం. అందుకనుగుణంగా విపత్తు నిర్వహణ వ్యవస్థ విజయవంతంగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రతి గ్రామ, వార్డు వలంటీర్‌కు ప్రభుత్వం అన్ని ఫీచర్లున్న అత్యాధునిక మొబైల్ ఫోను, 4జీ సిమ్ ఇచ్చింది. దీంతో ప్రతి డేటాను అప్డేట్ చేయడానికి, యాప్‌ల వినియోగానికి అవకాశం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. దీంతో ప్రజలకు సేవలు అందించడం సులభమైంది. క్షేత్రస్థాయిలో ఏ అంశంపై సర్వే అయినా సత్వరమే పూర్తవుతోంది. కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టడంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఒక్కరిలో రోగ లక్షణాలు కనిపించినా నిఘా ఉంచడానికి ఒక సాధనమైంది. వారిని వెంటనే క్వారంటైన్ చేయడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. ఇంటింటికీ ఆరోగ్య సర్వేను పక్కాగా నిర్వహించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే మధ్యాహా్ననికల్లా పింఛన్ల పంపిణీ ఠంచన్‌గా పూర్తవుతోంది. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు తీసుకెళ్లి అందజేస్తున్నారు. ‘ఉపాధి’ హామీ పథకంలో చేయదగిన పనుల్లో ప్రజలకు అవసరమైన పనులను గుర్తించడంలో సచివాలయ వ్యవస్థ సక్రమ పాత్ర పోషిస్తోంది. అద్భుత ఆలోచన ఇది.. నా పేరు మాడుగుల అప్పారావు. మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు. తగరపువలసలో ఉంటున్న మా అబ్బాయి వద్దకు కుటుంబంతో సహా వచ్చేశాం. అయినప్పటికీ రేషన్, పెన్షన్ ఇక్కడే అందిస్తున్నారు. వార్డు సచివాలయాల ద్వారా తెలవారక ముందే ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. గతంలో సచివాలయాలు లేకపోవడంతో తహసీల్దార్, మండల పరిషత్, జీవీఎంసీ ఇలా పలు కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లం. పింఛన్‌కోసం రోజుల తరబడి వేచి ఉండేవాళ్లం. ఇప్పుడు ఒకటో తేదీ వేకువజామునే పింఛన్ అందుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో మేలు జరుగుతోంది గంటలోనే కార్డు మంజూరైంది సచివాలయంలో దరఖాస్తు చేసిన గంటలోనే రైస్ కార్డు మంజూరైంది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేశాను. అయినా కార్డు మంజూరు కాలేదు. ఇప్పుడు వలంటీర్ ద్వారా 11వ వార్డు పరిధి 21వ నంబర్ సచివాలయంలో రైస్ కార్డు కోసం సెప్టెంబరు 18న ఉదయం 11 గంటలకు దరఖాస్తు చేశాను. అక్కడ సిబ్బంది వెంటనే కంప్యూటర్లో అప్లోడ్ చేశారు. చేసిన ఒక్క గంటలోనే ‘2801383138’ నంబర్‌తో రైస్ కార్డు మంజూరైంది. సచివాలయం వల్ల నా పని చాలా సులువుగా, తొందరగా జరిగింది. – డి.హేమలత, సుందరయ్యనగర్ ఒంటరి మహిళలకు రైస్‌కార్డులు కొమ్మాది(భీమిలి) : జీవీఎంసీ 4వ వార్డు కె.నగరపాలెం సచివాలయంలో అదే ప్రాంతానికి చెందిన ఒంటరి మహిళలు పోతిన సన్యాసమ్మ, పోతిన అప్పలనరసమ్మ గురువారం ఉదయం రైస్‌కార్డు కోసం దరఖాస్తు చేశారు. అర్హతలు పరిశీలించిన సచివాలయ అధికారులు మూడు గంటల్లోనే వారిద్దరికీ రైస్ కార్డులను మంజూరు చేశారు. వీరికి సచివాలయం వద్ద వీఆర్వో వీర్రాజు, కార్యదర్శి సాయికిరణ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో రేషన్ కార్డు కోసం ఏళ్ల తరబడి తిరిగేవాళ్లమని.. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న మూడు గంటల్లోనే కార్డులు చేతికొచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు నా పేరు పరశురామ్ త్యాగరాజన్ భాస్కర్. బుచ్చిరాజుపాలెం. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. ప్రతి నెలా వలంటీర్ ఇంటి వద్దకు వచ్చి.. రూ.10 వేల పింఛన్ అందిస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మా కుటుంబానికి రూ.18,750 లబ్ధి చేకూరింది. పిల్లలు విద్యా దీవెన పథకానికి అర్హత సాధించారు. ఇళ్ల పట్టా కూడా మంజూరైంది. పలు సరి్టఫికెట్లు కూడా సచివాలయం ద్వారా పొందాను. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ తప్పింది. సచివాలయ వ్యవస్థ ద్వారా చాలా ప్రయోజనాలు పొందాను. -
ఇప్పటికీ 'ఆమె' పోరాడుతూనే ఉంది
స్త్రీల శక్తిపై గాంధీజీకి నమ్మకం. ‘ఇన్ని సీట్లు ఇచ్చేయడం కాదు..అన్ని సీట్లలోకీ రానివ్వాలి’ అనేవారు! సీట్లతో పరిమితం చెయ్యొద్దని. పోటీకొస్తుంటే అడ్డు పడొద్దని..స్త్రీల పాలనా సామర్థ్యాలను తక్కువగా చూడనే చూడొద్దని.. ఇంకోమాట కూడా అనేవారు పురుషుల అనుగ్రహాలు స్త్రీలకు జరిగే న్యాయాలేం కావని. స్త్రీ సాధికారతకూ గాంధీమార్గం ఉంది. ఆ మార్గంలో నడవాల్సింది పురుషులే. అడిగింది ఇవ్వడం ఇష్టం లేకపోతే, ‘కూర్చొని మాట్లాడుకుందాం రండి’ అని పిలుస్తారు అధికారంలో ఉన్నవారు. గాంధీజీని అలాగే రౌండ్ టేబుల్ సమావేశానికి పిలిచారు బ్రిటిష్ వాళ్లు. సమావేశం లండన్‌లో. ‘మమ్మల్ని మేం పరిపాలించుకుంటాం’ అంటారు గాంధీజీ. అంటే, మీరు మీ దేశానికి వెళ్లిపోండని బ్రిటిష్ వాళ్లకు మృదువుగా చెప్పడం. 1930 నుంచి 32 వరకు మొత్తం మూడు ‘రౌండ్’ల సమావేశాలు జరిగాయి. రెండో రౌండ్‌కు మాత్రమే వెళ్లారు గాంధీజీ. మొదట , మూడవ రౌండ్లలో ఆయన గానీ, మనవాళ్లలో ముఖ్యులు గానీ ఎవరూ కూర్చోలేదు. రెండో రౌండ్ సమావేశానికి వెళ్లే ముందు 1931 సెప్టెంబర్ 17న గాంధీజీ ఒక మాట అన్నట్లు చెబుతుంటారు. ‘‘భారతదేశ చట్టసభలో కనుక మహిళలకు తగిన భాగస్వామ్యం లేకపోతే నేను ఆ సభలోకే అడుగు పెట్టను’’ అని గాంధీజీ అన్నట్లుగా చరిత్రలో ఉన్న ఆ మాట మన దగ్గర చివరిసారిగా వినిపించింది 2010 మార్చి 9న రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడు. ‘స్త్రీ పురుష సమానత్వం కోసం గాంధీజీ కనిన కల సాకారం అయింది’ అని కూడా ఆ బెంచీల లోంచి ఎవరో పెద్దగా అరిచారు. దేశానికి స్వాతంత్య్రాన్ని కోరుకున్నట్లే, దేశంలోని మహిళల స్వాతంత్య్రాన్నీ గాంధీజీ కోరుకున్న మాట నిజమే. అసమానతల నుంచి ఆ స్వాతంత్య్రం. అయితే రిజర్వేషన్లతోనే మాత్రమే దానిని మనం సాధించగలం అని గాంధీజీ చెప్పలేదు. మహిళలకు మనం ఏదైనా ఇస్తున్నామూ అంటే , అది ఏనాడో వారికి దక్కవలసి ఉండింది మాత్రమేనని గాంధీజీ అభిప్రాయపడేవారు. ‘‘సమానత్వం అంటే వాళ్లకు కొన్ని సీట్లు వేసి కూర్చోమనడం కాదు, పోటీ పడి పోరాడే అవకాశం ఉండటం. స్త్రీకి.. పురుషుడితో సమానమైన శక్తి ఉంది. అంతకన్నా ఎక్కువ శక్తి కూడానేమో. ఆ శక్తిని అడ్డుకునే పురుషాధిక్య ప్రదర్శనకు రాజకీయాల్లో గానీ, ఇంకెక్కడైనా కానీ తావు ఉండకూడదు’’ అనేవారు గాంధీజీ. దేశానికి స్వాతంత్య్రం రాకముందే దేశ స్వాతంత్య్రాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో గాంధీజీ స్పష్టమైన రూపురేఖలు గీసుకున్నారు. ఎవరూ ఎవరికీ బానిసలుగా ఉండకూడదు. ఎవరూ ఎవరిపై అధికారం చెలాయించకూడదు. పురుషులతో సమానంగా స్త్రీలూ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను అనుభవించాలి. పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి లభించినా, పురుషాధిపత్యాల నుంచి స్త్రీలకు విముక్తి లభించనిదే స్వాతంత్య్రం పరిపూర్ణమైనట్లు కాదు. ఇలా భావించారు గాంధీజీ. దేశ స్వాతంత్య్రం కోసం కలిసి తిరుగుబాట్లు, కలిసి ఉద్యమాలు, కలిసి పోరాటాలు చేసిన స్త్రీ పురుషులు.. స్వాతంత్య్రం తర్వాత ఎక్కువ తక్కువల పౌరులు అయేందుకు వీలే లేదని స్వాతంత్య్రానికి మునుపే ఆయన భారతీయ సమాజానికి హెచ్చరిక చేశారు. పరాయి పాలన నుంచి అహింస ద్వారా దేశానికి స్వతంత్రాన్ని సాధించడం ఎలా, సాధించిన స్వాతంత్య్రంతో సమాజంలోని అన్ని వర్గాల వారూ సమాన ఫలాలను పొందడం ఎలా అని గాంధీజీ 18 కీలకాంశాలతో కూడిన ఒక విప్లవాత్మక కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అందులోని ఒక అంశం.. దైనందిన, సామాజిక జీవితంలోని ప్రతి హక్కులోనూ స్త్రీలు సమ భాగస్వామ్యం కలిగి ఉండటం! అంత ముందుచూపు గాంధీజీది. ‘‘స్త్రీలు ఒక విధమైన బానిసత్వంలో ఉన్నారు. ఎప్పటికైనా ఆ బానిసత్వం నుంచి తాము బయట పడతామో లేదోనన్న భయంలోనూ ఉన్నారు’’ అనీ ఆయన వ్యాఖ్యానించారు! స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు అయ్యాయి. గాంధీజీ ఊహించినట్లు (భయపడినట్లు అనాలి) నేటికింకా మహిళలు స్వేచ్ఛా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పురుషులకు స్త్రీలు తోడున్నారు. స్వేచ్ఛ కోసం స్త్రీలు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. భారతదేశ స్వాతంత్య్ర ప్రకటనకు ఏడాది ముందు కూడా మహిళల విషయమై గాంధీజీ చింతాక్రాంతులై ఉన్నారని అంటారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులు అడ్డకోవడం ఆయన ఆవేదనకు కారణం అయింది. ‘‘ఎందుకు మీరింతగా స్త్రీ పురుష సమానత్వం కోసం ఆరాట పడుతున్నారు?’’ అని ఒక ప్రశ్న కూడా ఆయనకు ఎదురైంది. ‘‘ఇన్నాళ్లూ వాళ్లు పురుషుల వెనుక నడిచారు. సంగ్రామంలో పురుషుల పక్కన నడిచారు. ఇప్పుడు పురుషులకు ముందు నడవాల్సిన తరుణం వచ్చింది’’ అని గాంధీజీ సమాధానం. మహిళలు ముందు నడవడం అంటే దేశాన్ని ముందుకు నడిపించడం అని ఆయన ఉద్దేశం. ‘‘వాళ్లమీద కురుస్తున్న అనుగ్రహాలేమీ లేవు. వాళ్లకేదైనా మేలు జరుగుతోందంటే స్త్రీలు అయిన కారణంగా వాళ్లకు జరిగిన అన్యాయానికి ఆలస్యంగా న్యాయం లభించడం మాత్రమే ఆ మేలు’’ అని అంటారు గాంధీజీ. నేడు ఆ మహాత్ముని, మహిళాన్వితుని జయంతి. -
దండియాత్ర నుంచి ఆత్మనిర్భర్ వరకు
సముద్రం నుంచి కొన్ని ఉప్పురాళ్లను ఏరుతూ మహాత్ముడు సాగించిన దండియాత్రకు పేద ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉప్పు చట్టాన్ని ప్రశ్నిస్తూ... పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్య్రం అనే పదాలు అర్థమయ్యేలా వీధివీధినా ఉన్న సామాన్యులను సైతం గాంధీజీ చైతన్యపరిచారు. ప్రకృతిలో లభించే ఉప్పు వంటి సహజ సంపదపై బ్రిటిష్ పాలకులు సుంకాలు విధించడం, గుత్తాధిపత్యం ప్రదర్శించడంతో ఈ కదలిక భారతదేశమంతటా ప్రతిధ్వనించింది. ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ ఒక సామాన్య ఛాయ్ వాలాగా తన సొంత జీవిత అనుభవాలను గాంధీజీ బోధనలతో కలపగలిగారు. పేదల్లో సాధికారత, ఆత్మగౌరవ భావాల్ని కలిగించే ఒక శక్తిమంతమైన మేనిఫెస్టోని ఆత్మనిర్భర్ రూపంలో మోదీ రూపొందించగలిగారు. అది 1856 నాటి సంగతి... అప్పట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మన దేశం నుంచి వచ్చే ఆదాయం మూడు కోట్ల బ్రిటీష్ పౌండ్ల కంటే తక్కువగా ఉండేది. ఇందులో పది శాతం వరకు ఉప్పుపై విధించిన పన్నులు, సుంకాల నుంచే వచ్చేవి. ఇప్పటి విలువతో చూస్తే అది దాదాపు 3,000 కోట్ల రూపాయలతో సమానం. అయితే సగటు భారతీయుడు సంవత్సర ఉప్పు వినియోగానికి డబ్బులు చెల్లించాలంటే.. కనీసం రెండు నెలలు కష్టపడాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేది. అప్పటికే ఉప్పు వాడకాన్ని పూర్తిగా వదులుకున్న మహాత్మాగాంధీ... 1930 ఏప్రిల్‌లో ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దండికి దండయాత్ర చేశారు. సముద్రం నుంచి కొన్ని ఉప్పు రాళ్లను ఏరుతూ మహాత్ముడు సాగించిన యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. లక్షలాది మంది ప్రజలు మహాత్ముడి వెంట నడిచారు. ఉప్పు చట్టాన్ని ప్రశ్నిస్తూ... పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్య్రం అనే పదాలు అర్థమయ్యేలా వీధివీధినా ఉన్న సామాన్యులను సైతం గాంధీజీ చైతన్యపరిచారు. రాజకీయ స్వేచ్ఛ అనే ఆలోచనని ఆర్థిక స్వేచ్ఛతో అనుసంధానించడం కంటే అత్యుత్తమ మార్గం మరొకటి లేదని ఆయన వివరిం చారు. ప్రకృతిలో లభించే ఉప్పు వంటి సహజ సంపదపై బ్రిటిష్ పాలకులు సుంకాలు విధించడం, గుత్తాధిపత్యం ప్రదర్శించడంతో ఈ కదలిక భారతదేశమంతటా ప్రతిధ్వనించింది. ఆర్థిక స్వేచ్ఛ, స్వావలంబన కోసం 1915లో సబర్మతి ఆశ్రమంలో ఖాదీ వినియోగంతోనే గాంధీజీ పోరాటం ప్రారంభమైంది. గ్రామ స్వరాజ్యం, స్వయం సమృద్ధి, ఆర్థిక స్వేచ్ఛ అనే ఆలోచనలు, ఖాదీ వినియోగం, ఉప్పు పన్ను చట్టాల ఉల్లంఘన వంటివే స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ ఒక సామాన్య ఛాయ్ వాలాగా తన సొంత జీవిత అనుభవాలను గాంధీజీ బోధనలతో కలపగలిగారు. ఈ ప్రక్రియలో ప్రధాని, పేదల్లో సాధికారత, ఆత్మగౌరవ భావాల్ని కలిగించే ఒక శక్తిమంతమైన మేనిఫెస్టోని రూపొందించగలిగారు. మహాత్మా గాంధీ జీవితం, ఆయన బోధనల నుండి ప్రేరణ పొందిన నరేంద్రమోదీ, ప్రధానిగా తన తొలి విడతలో ప్రారంభిం చిన స్వచ్ఛ్ భారత్ పథకం, పరిశుభ్రతకు, పారిశుద్ధ్యానికి ప్రతీకగా నిలిచింది. దీనిని ప్రజల ఉద్యమంగా మార్చినందున యుద్ధ ప్రాతిపదికన అనేక లక్ష్యాలను చేరుకోగలిగింది. నేటి భారతంలో రాజ కీయ స్వేచ్ఛ అందరికీ ఉన్నా, ఆర్థిక స్వేచ్ఛ అనేది ఇంకా కొంతమంది పేదలకు, అణగారిన వారికి ఒక కలగానే మిగిలిపోయింది. స్వావలంబన, ఆర్థిక స్వేచ్ఛ అనే స్తంభాలపైన మాత్రమే పేదలను మనం ఉద్ధరించగలం అన్న నిజాన్ని గ్రహించిన ప్రధాని...ఆత్మ నిర్భర భారత్‌కి రూపకల్పన చేశారు. 1970లో వచ్చిన ‘గరీబీ హటావో’ దేశంలో పేదరికాన్ని శాశ్వతం చేసిన నినాదం అయితే, దానికి పూర్తి విరుద్ధంగా పేదరికాన్ని తరిమి కొడుతూ, పేదల్లో సాధికారత పెంపొందిస్తూ, తమ విధిని వారే రాసుకునే వీలు కల్పించింది ఇప్పటి ఆత్మ నిర్భరత, స్వావలంబన అనే ఈ కార్యక్రమం. దీనితోపాటుగా ఇటీవల ప్రవేశపెట్టిన రైతుల సంక్షేమ చట్టం, కార్మిక హక్కుల సవరణ చట్టం, నిత్యావసర వస్తువుల సవరణ చట్టాలు, రైతులకు ఆర్థిక స్వేచ్ఛని, ఉత్పత్తుల్ని అమ్ముకొనే అవకాశాలని కల్పించే చర్యలు. సూక్ష్మ వాగ్దానాలతో, నోటి మాటలతో రైతులని బలహీనపరిచే బదులు, ప్రధాని మన వ్యవసాయ రంగాన్ని పట్టి పీడుస్తున్న చట్టాల బంధాల నుండి విముక్తి చేసి, రైతులు తమ విధిని తామే సృష్టించుకునే స్వతంత్రతను, ప్రేరణని ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటికే అమలులో ఉన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, కనీస మద్దతు ధర వంటి పథకాలు, రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అన్ని ప్రాంతాలలో అందుబాటులో వుంచి, పంటను, ఉత్పత్తులను కనీస ధరకు అమ్ముకునేందుకు కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరిచే అనేక చర్యలు తీసుకుంటున్నారు. రైతు ఉత్పత్తులను లాభదాయక మార్గంలో విక్రయించే అవకాశం ఉన్న వ్యవస్థను సృష్టించడం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు ఉత్పత్తుల వాణిజ్య– వర్తక (ప్రోత్సాహం–సౌలభ్యం) చట్టం–2020 ప్రధాన లక్ష్యం. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ మార్కెట్ యార్డులలో మాత్రమే విక్రయించాల్సిన అవసరం ఉండదు. అంతర్–రాష్ట్ర లేదా తమ సొంత రాష్ట్రంలో జరిగే ఎటువంటి వాణిజ్య, వ్యాపారంలోనైనా వారు పాల్గొనవచ్చు. ప్రభుత్వాలు గుర్తించిన మార్కెట్ యార్డ్ లోపల లేదా బయట అమ్ముకోవడానికి సంసిద్ధుడైన ఏ రైతుపైనా లేదా సంబంధిత వ్యాపారిపైన ప్రభుత్వం మార్కెట్ రుసుము లేదా సెస్ విధించరాదని ఈ చట్టం చెబుతోంది. పంట ఎంపిక ఒక ముఖ్యమైన అంశం కాగా, ధరలను ముందుగానే ఊహిం చగలగడం, పంట వేసే సమయంలోనే రైతు ఉత్పత్తుల కొనుగోలును నిర్ధారించి ఆందోళనను తొలగించడం వంటి చర్యల ద్వారా మనం రైతుల భవి ష్యత్తును కాపాడవచ్చు. రైతులను రక్షిస్తూ, వారికి అధికారాన్ని కల్పిస్తూ, న్యాయమైన, పారదర్శకమైన పద్ధతితో భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం వ్యవసాయ–వ్యాపార సంస్థలు, ప్రక్రియదారులు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు లేదా పెద్ద రిటైలర్లతో పరస్పరం అంగీకరించిన పారితోషిక ధరల చట్రంలో పాల్గొనడానికి రైతుల (సాధికారత, రక్షణ) ధరల భరోసా–వ్యవసాయ సేవల బిలు–2020 వీలు కల్పిస్తుంది. ఒప్పంద వ్యవసాయం అనే ఈ వినూత్న ఆలోచన ద్వారా రైతులు డిమాండ్‌కి అనుగుణంగా పంటలు పండించి, మంచి ధరకు అమ్ముకునే అవకాశం కలుగుతుంది. చివరగా, అత్యవసర వస్తువుల (సవరణ) బిల్లు–2020, ఈ చట్టం మూడు లక్ష్యాలను సాధిస్తుంది. మొదటిది– రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధర పొందేలా చేస్తుంది. రెండవది– నిల్వలు, బ్లాక్–మార్కెటింగ్ సాకుతో రైతులను, వ్యాపారులను వేధిస్తూ రాష్ట్ర పరిపాలనను బలహీనపరుస్తున్న అధికారుల అజమాయిషీని తగ్గిస్తుంది. ఇక మూడవది– పెద్ద ఎత్తున పంట నష్టం లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ చట్టం వ్యవసాయ వస్తువుల రవాణాను, స్వేచ్చాయుతంగా అమ్మడాన్ని నియంత్రిస్తుంది. స్వావలంబన ఆత్మనిర్భర భారత్ నిర్మాణం దిశగా ప్రధాన మంత్రి తన ఆలోచనని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. మొదటగా స్వావలంబన, ఆత్మనిర్భరత అనే సూత్రాలను ప్రకటించి తర్వాత దాని అమలుకు కావలసిన నిధులు పెద్ద ఎత్తున కేటాయించారు. పార్లమెంట్ సమావేశాల్లో మన రైతుల అభివృద్ధి, సాధికారతకు చట్టాలను రూపొం దించారు. మోదీ ప్రభుత్వానికి ముందు చాలా ప్రభుత్వాలు గాంధీజీ నుండి ప్రేరణ పొందాయి కానీ మోదీలా ఆయన సందేశాన్ని స్వీకరించి నేటి కాలానుగుణంగా మాత్రం అమలు చేయలేకపోయాయి. వారు చేయలేకపోయిన దానిని చేసి చూపిస్తూ ప్రధాని మోదీ నిజమైన గాంధేయవాదిగా నిరూపించుకున్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ, గ్రామీణాభివృద్ధి–నిజమైన దేశాభివృద్ది అనే స్ఫూర్తిని తీసుకుని సంపూర్ణ దేశాభివృద్ధిని సాధించటమే, మన మహాత్మునికి మనం ఇచ్చే నిజమైన నివాళి. (నేడు గాంధీజీ 151వ జయంతి సందర్భంగా) జి. కిషన్‌రెడ్డి వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి -
మూడు రోజుల సెలవులు, భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వాహనాలతో కిటకిటలాడిపోతోంది. వేల సంఖ్యలో వాహనాలు రావటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరుసగా గాంధీ జయంతి, శనివారం, ఆదివారం మూడు రోజులు సెలవులు రావటంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు చాలా మంది ప్రయాణికులు తరలి వెళుతున్నారు. అధికంగా వాహనాలు రావడంతో కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. గంటలు తరబడి ట్రాఫిక్ స్థంభించిపోవటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చదవండి: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం -
గౌతమీ తీరాన మహాత్ముని అడుగుజాడలు
రాజమహేంద్రవరం కల్చరల్: స్వాతంత్య్ర ఉద్యమకాలంలో జాతిపిత, మహాత్మా గాంధీ పాదస్పర్శతో అఖండ గౌతమీ తీరం పునీతమైంది. 1921–46 మధ్య కాలంలో మహాత్ముడు రాజమహేంద్రవరానికి ఐదు సార్లు వచ్చారు. 1921 మార్చి 30న, అదే సంవత్సరం ఏప్రిల్ 4న, 1929 మే 6న, 1933 డిసెంబర్ 25న, 1946 జనవరి 20వ తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. 1929, 1933 పర్యటనల్లో సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమంలో బస చేశారు. నేటికీ బా–బాపు కుటీరం పేరున ఉన్న కుటీరంలో గాం«దీజీ ఉపయోగించిన రాటా్నన్ని పదిలపరిచారు. 1929 మే 6వ తేదీ కందుకూరి వీరేశలింగ పురమందిరంలో స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 1929 పర్యటనల్లో పాల్ చౌక్ వద్ద జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. (నేటి కోటిపల్లి బస్టాండు సమీపంలో). నాటి జ్ఞాపకాలు మహాత్ముని వంటి ఒక వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే, ముందు తరాలవారు నమ్మకపోవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నారు. మహాత్ముని చూసిన ఒకరిద్దరు వ్యక్తులు ఇంకా మన నడుమ ఉండటం మన అదృష్టం.. నాటి జ్ఞాపకాలను, వారి మాటల్లోనే తలుచుకుందాం.. ఆ ముఖ వర్చస్సు ఆ తరువాత చూడలేదు: వైఎస్ నరసింహారావు ‘అది 1946వ సంవత్సరం. జనవరి 20వ తేదీ సాయంత్రం 4 గంటల సమయం. రాజమహేంద్రవరం రైల్వేస్టేషను గూడ్సుయార్డ్ ప్రాంతం. అక్కడ మహాత్మాగాంధీ దర్శనం పొందాను. అప్పుడు నా వయసు పది సంవత్సరాలు. గాంధీజీ కలకత్తా నుంచి మద్రాసు వెళుతూ, సుమారు 40 నిమిషాలు స్టేషను గూడ్సు యార్డు వద్ద ఉన్న మైదానంలో ప్రసంగించారు. నాకు సరిగా కనపడటం లేదంటే, బలిష్ఠుడైన మా తాతగారు నన్ను ఎత్తుకున్నారు. మహాత్ముని వంటి ముఖ వర్చస్సుతో ఉన్న వ్యక్తిని ఆ తరువాత నేను ఎప్పుడూ చూడలేదు. మహాత్ముని హిందీ ప్రసంగాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు కళా వెంకట్రావు తెలుగులోకి అనువదించారు. అదే ఈ ప్రాంతంలో మహాత్ముని చివరి పర్యటన.. మరో విషాదకర సంఘటన.. అది 1948 ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం. మెయిన్ రోడ్డుమీద పెద్ద కోలాహలం.. కంభంవారి సత్రం చివరన ఉన్న మెయిన్ రోడ్డు మీదకు నేను పరిగెత్తాను. పూలరథంపైన వృద్ధుడైన ఒక గాంధేయవాది నిలబడి ఉన్నారు. తలపై అస్థికల పేటిని పెట్టుకున్నారు. రాజమహేంద్రవరం రైలు స్టేషను నుంచి కోటిలింగాల ఘాట్ వరకు ఊరేగింపు సాగింది. ఊరేగింపు అగ్రభాగాన బ్యాండు, సన్నా యి మేళాలు, తరువాత గాం«దీజీకి ఇష్టమైన భజనగీతాలను ఆలపిస్తూ కొన్ని వందల మందితో ఊరేగింపు సాగింది. ఆ క్షణాన నాలో తెలియని ఆవేశం వచ్చింది. ఆ మహనీయుని పట్ల భక్త్యావేశంలో మునిగాను. అప్రయత్నంగా ఆ ఊరేగింపులోకి చొరబడ్డాను. గాంధీటోపీలు ధరించినవారెందరో ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. కోటిలింగాల ఘాట్‌లో అస్థికలు కలిపారు. అందరూ స్నానాలు చేశారు. నేను అప్రయత్నంగా స్నానం చేసి, తడిబట్టలతో ఇంటికి తిరిగి వచ్చాను. మన పవిత్ర కర్తవ్యం మహాత్ముడు రాజమండ్రి వచ్చిన తేదీలతో ఒక శిలాఫలకాన్ని రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషను ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. విజయవాడ రైల్వేస్టేషను ప్రవేశ హాలు వద్ద మహాత్ముడు విజయవాడకు వచ్చిన తేదీలను వివరిస్తూ, ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. మనకు కావలసింది కాసింత శ్రద్ధ. ముందు తరాలవారికి చరిత్ర తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. -
గాంధేయ పథంలో ఆంధ్రా
గాంధీ తన జీవితాదర్శాలలో ఒకటిగా భావించి, ప్రచారం చేసిన ‘మద్యపాన నిషేధం’ గత 72 ఏళ్లలోనూ చిత్తశుద్ధితో అమలు జరపలేదు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టి అమలులోకి తెచ్చిన మద్యపాన నిషేధ ప్రక్రియ ముందుకు సాగుతూ ప్రజా బాహుళ్యం ఆచరణలో ఆమోదం పొందుతూన్న సమయంలోనే ఒక దిన పత్రికాధిపతి అండతో చంద్రబాబు మధ్యలోనే ఆ ప్రక్రియకు ‘సంధి’ కొట్టించాడు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన యువ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నూతన మద్య నిషేధ విధానం దశల వారీగా అమలు జరిపే పథకంలో భాగంగా, గ్రామాలలోని వేలాది బెల్టు షాపులు రద్దు అయ్యాయి. ప్రభుత్వమే క్రమంగా మద్యం ధరలను పెంచు కుంటూ ‘మధు మూర్తుల్ని’ సరుకుకు దూరం చేయడం, ఆపైన క్రమానుగతంగా మద్యం సేవించే వారిని వైద్యావసరాలకు మాత్రమే పరిమితం చేయడం అవసరం. ‘‘నా సంకెళ్లను ఛేదించుకుని మరీ ఎగిరిపోతా, నా కష్టాల కారడవిని చీల్చుకుని మరీ నింగికెగురుతా, ఓటమి పరంపరను దాటి అవలీలగా పరుగులు తీస్తా, కన్నీటి ధారల మధ్యనే వేగంగా దూసుకుపోతా, నన్ను సిలువ వేసినా మానవాళి హృదయ ద్వారాలు చేరుకుంటా, ఈ నా సుదీర్ఘ సంకల్పం ఇంతింతై విస్తరిస్తుంది’’! జాతిపిత గాంధీజీ సంకల్ప బలానికి తోడు నీడై నిలిచిన ఈ సందేశం ఎవరిదై ఉంటుంది? గాంధీ చిన్నప్పటి కుటుంబ స్నేహి తుడు, గాంధీ న్యాయశాస్త్ర విద్యను అభ్యసించడానికి ఇంగ్లండ్ వెళ్లేం దుకు ఆయనకి ఆర్థికంగా సాయపడిన వ్యక్తి రామ్చూదాస్. ఆ దరి మిలా గాంధీ కాలక్రమంలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతికి ఎదిగి నందుకు అమితానందం పొందిన రామ్చూదాస్ ఆ తరువాతి దశలో గాంధీకి రాసిన ఒక అభినందన లేఖలో.. ‘దేశానికి, ప్రజలకు సేవలం దించేందుకు మీ జీవితం సార్థకమయ్యేందుకు మీరు చిరకాలం ప్రయోజనకర జీవిగా వర్ధిల్లాలి’ అని ఆశీర్వదించాడు. దానికి గాంధీ సమాధానమిస్తూ ‘మీరు దీర్ఘాయుష్మంతులు అవుగాక. నాకు సంబం ధించినంతవరకు నేను ఎక్కువ కాలం జీవించి ఉండాలనుకోవటం లేదు. ఎందుకంటే, హైందవ ధర్మాన్ని హైందవులే చేజేతులా నాశనం చేయడం చూస్తూండటం నాకు దుర్భరంగా ఉంది. వారి దృష్టిలో నేను ‘మహాత్ముణ్ణి’, కానీ నేనిప్పుడు ‘అల్పాత్ముణ్ణి’ అని గాంధీ ప్రత్యుత్తరమిచ్చారు. ఇదిలా ఉండగానే గాంధీజీ మరొక మిత్రుడు గాంధీలో ఏర్పడిన ఈ నిరాశ, నిస్పృహను తొలగిస్తూ ఆయన (గాంధీ) 78వ జన్మ దినోత్సవం అక్టోబర్ 2వ తేదీని పురస్క రించుకుని, ఒక లేఖ రాస్తూ.. నిస్పృహను తుత్తునియలు చేయగల సుప్రసిద్ధ ఆంగ్లకవి జార్జి మాథిసన్ సుందర కవితా పంక్తుల్ని పేర్కొన్నాడు. ఆ పంక్తుల అనుకరణే ఈ వ్యాసం మొదట్లో ఉటం కించిన పాద పంక్తులు. ఆ లేఖను గాంధీ ఒకటికి పదిసార్లు చదువు కున్నారు. ఈ విషయాన్ని సుప్రసిద్ధ ‘హిందూ’ పత్రికా సంస్థ ‘మహా త్మాగాంధీ: ది లాస్ట్ 200 డేస్’ (మహాత్ముడు: ఆఖరి 200 రోజులు) అన్న గ్రంథంలో పేర్కొంది. కానీ, భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సంవ త్సరం కాలానికే సమ్మిళిత హైందవ ధర్మాన్ని నాశనం చేయ సంక ల్పించిన ఒక హిందూ మతోన్మాది చేతిలో మహాత్ముడు నేలకొరిగినా, కొంతమంది పాలకులకు ఏక కాలంలో గాంధీ మహాత్ముడూ, గాడ్సే మతోన్మాదీ ఆరాధ్యులే కావటం ఆశ్చర్యాలలో అనితరసాధ్యమైన ‘సూపర్’ ఆశ్చర్యం! అందుకే మన దేశంలో గాంధీ పుట్టిన గుజరాత్ సహా రాష్ట్రాలలో ఆయన జీవితాదర్శాలలో ఒకటిగా భావించి, ప్రచారం చేసిన ‘మద్యపాన నిషేధం’ కూడా గత 72 ఏళ్లలోనూ చిత్తశుద్ధితో అమలు జరపలేదు. ఈ వరసలో గడప దాటకపోయినా మాటలు కోటలు దాటించగల ప్రాంతీయ పార్టీలలో అగ్ర తాంబూ లం చంద్రబాబు హయాంలోని ‘తెలుగుదేశం పార్టీ’! ఆ పార్టీ వ్యవ స్థాపకుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టి అమలులోకి తెచ్చిన మద్యపాన నిషేధ ప్రక్రియ ముందుకు సాగుతూ ప్రజా బాహుళ్యం ఆచరణలో ఆమో దం పొందుతూన్న సమయంలోనే ఒక దిన పత్రికాధిపతి అండతో చంద్రబాబు మధ్యలోనే ఆ ప్రక్రియకు ‘సంధి’ కొట్టించాడు. ఆ చర్యపై రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన తిరుగుబాటుకు ఆద్యురాలు దూబ గుంట మహిళ. అయినా ఆమెను, ఆమె మద్యపాన వ్యతిరేకత మహో ద్యమాన్ని చెడిపోయిన టీడీపీ నాయకత్వం అణచివేసి, గ్రామానికొక బట్టీ, ఊరుకి వీధికొక ‘బెల్ట్‌షాపు’ల చొప్పున వెలిసిన ఫలితంగా ప్రభుత్వానికి ఎక్సైజ్ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సంగతి పెరు మాళ్లకెరుకేమోగానీ, మహిళలు సహా ప్రజా బాహుళ్యం జీవన విధా నం తారుమారై కకావికలమవుతూ అనేక సంసారాలు ఛిద్రమైపోతూ రావటం ప్రజల ప్రత్యక్షానుభవంగా మారింది. కాగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి ప్రజలు తెచ్చుకున్న వైఎస్సార్సీపీ, యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో వెంటనే ప్రవేశపెట్టిన నూతన మద్య నిషేధ విధానం దశల వారీగా అమలు జరిపే పథకంలో భాగంగా– ముందు గ్రామాలలో ఏర్పడిన వేలాది బెల్టు షాపులు రద్దు అయ్యాయి. ఇది రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా మంచి చేస్తుంది. ప్రభుత్వమే క్రమంగా మద్యం ధరలను పెంచుకుంటూ ‘మధు మూర్తుల్ని’ సరుకుకు దూరం చేయడం, ఆ పైన క్రమానుగతంగా ప్రజల సహకారంతో మద్యం సేవించే వారిని వైద్యావసరాలకు మాత్రమే పరిమితం చేయడం అవసరం. అందుకే గాంధీజీ తాగుడును ప్రోత్సహించుతూ మద్యం అమ్మ కాలమీద ప్రభుత్వాలు ఆదాయం గుంజాలనుకోవటం అభివృద్ధి నిరోధకర పన్నుల విధానమని ఖండించాల్సి వచ్చింది. అందుకే గాంధీ అన్నారు: ‘స్వతంత్ర భారతదేశంలో విధించే ఏ పన్నులయినా సరే పౌరులు ప్రయోజనం పొందేలా, వారికి అందించే సేవల ద్వారా ప్రజలు పదిరెట్లు లాభించగలగాలి, అదే ఆరోగ్యకరమైన పన్నుల విధానం.. అలా గాకుండా కేవలం తాగించడానికి మద్యంపై ఎక్సైజ్ పన్ను విధించడం అంటే– ప్రజల్ని నైతికంగా శారీరకంగా బలహీ నపరిచి అవినీతి పాలు చేయడమనే అర్థం. పైగా, మద్యం సేవించ డానికి వీలు కల్పించడం ద్వారా అందుకయ్యే ఖర్చును భరించలేని పేద ప్రజలనెత్తిపైన బండరాయిని పడేయడమే అవుతుంది. కాగా, మద్య నిషేధాన్ని అమలు పర్చడం ద్వారా కోల్పోయే ప్రభుత్వ ఆదాయం పైకి కనిపించేంత భారీ మొత్తం కాదు. ఎందుకంటే, మద్య నిషేధాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి దఖలుపడే అభి వృద్ధి నిరోధక పన్ను కాస్తా, తాగుడుకి అలవాటుపడ్డ వాడు ఆ అలవాటు నుంచి బయటపడి, ఆ డబ్బును మంచి పనికి ఉపయో గించడానికి తోడునీడవుతుంది’ అని గాంధీ ప్రబోధించారు. అంతేగాదు, కేవలం మద్య నిషేధాన్ని అమలు చేయడంతో పాటు సామాజిక ప్రగతికి అవసరమైన సంఘ సంస్కరణలకు అవస రమైన విధానాలను ఆటంకపరిచే ధనికవర్గ మోతుబరుల, కోట్లకు పడగలెత్తిన వర్గ ప్రయోజనాలకు కత్తెర పడటం కూడా అంతే అవ సరం. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ, పౌర సమాజంలోని వివిధ వర్గాలను (కుల, మత, వర్ణపరంగా) అవి నీతి పాలుచేయకుండా తన మనుగడను కొనసాగించుకోలేదు. కను కనే ‘అభివృద్ధి’ ముసుగులో గుజరాత్లో నడుస్తున్న ‘అభివృద్ధి (డెవ లప్మెంట్ పాటర్న్) నమూనా’తో పెక్కుమంది ఆర్థిక వేత్తల భ్రమలు తొలగిపోవలసి వచ్చింది. మరొక మాటలో చెప్పాలంటే–పెట్టుబడిదారీ వ్యవస్థలో సంస్థా గతమైన దోపిడీ అనివార్యం అవుతున్నందునే ఆ వ్యవస్థ లొసుగుల్ని, వాటివల్ల సమాజం పొందుతున్న కష్టనష్టాల్ని, వంచనను, బాధలను ప్రజా బాహుళ్యం గ్రహించి, ప్రశ్నించి నిలదీయకుండా ఉండేందుకు– మద్యానికి, ఇతర వ్యసనాలకు పేదసాదల్ని, భ్రమలలో ఉండే మధ్య తరగతి ‘మందహాసుల్ని’ వ్యవస్థ బలిచేస్తూంటుందని మరచిపో రాదు. దోపిడీ వ్యవస్థలు సామాన్యుల్ని గురిచూసి వ్యసనాలకు ‘ఎర’ బెట్టిన తరువాత కాయకష్టంతో పనిచేసుకుని బతకాల్సిన చోట ‘పూటబత్తెమే పుల్లా వెలుగ’యిన ఘడియలలో– సామాన్యుల బతు కులు ఎలా కడతేరతాయి?! అందుకే గాంధీజీ 1920లకే అఖిల భారత కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమాలలో మద్యపాన నిషేధ సమస్యను భావి ప్రభుత్వాలకు ఉల్లంఘించరాని విధాన ‘ఫర్మానా’గా విడుదల చేయాల్సి వచ్చింది. కనుకనే 1948లో హిందూ మతోన్మాది గాడ్సే గుండుకు బలికావ డానికి ముందు ప్రార్థనా మందిర సమావేశంలో మాట్లాడుతూ గాంధీజీ ఇచ్చిన సందేశంలో ఇలా స్పష్టం చేశాడు: ‘మద్యం అనేది విషంకన్నా ప్రమాదం. విషం శరీరాన్ని మాత్రమే చంపేస్తుంది. కానీ మద్యం మనిషి ఆత్మనే నాశనం చేస్తుంది. కనుక ప్రభుత్వాలకు నా సలహా– మద్యం దుకాణాలన్నింటినీ చుప్తాగా మూసి పారేయండి. వాటిస్థానే మంచి తినుబండారాల షాపులను, కల్తీలేని తేలికైన ఆహార పదార్థాలున్న కొట్లను తెరిపించండి. తాగుడు మాన్పిస్తే కాయకష్టం చేసి బతికే కష్టజీవుల శరీర ఆరోగ్య శక్తి పెరుగుతుంది, నాలుగు డబ్బులు చేసుకునే శక్తీ పెరుగుతుంది. ఇప్పుడు స్వాతంత్య్రం పొందాం కాబట్టి మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని ప్రజల కిచ్చిన హామీని మనం నెరవేర్చాలి. ప్రజల్ని తాగుడుకి అలవాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునే పాపకార్యం నుంచి వైదొలగాలి’ అయితే... అందుకే అన్నాడేమో ప్రవక్త ఖలీల్ జిబ్రాన్: ‘ఆలయం పునాదిలో అట్టడుగున ఉన్న రాయి కన్నా/ గోపురంపై ఉన్న రాయి ఉన్నతమైనది కాదు సుమా’!! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మద్యం విక్రయిస్తున్న ఉపాధ్యాయుడు అరెస్టు
చెన్నై,తిరువొత్తియూరు: పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి గాంధీ జయంతి రోజున విక్రయించిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అదే రోజు తూత్తుకుడి నగర్‌లోని ఓ వీధిలో మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అదే రోజున మధ్యాహ్నం 12.30 గంటలకు ఎక్సైజ్ పోలీసులు అన్నానగర్ 7వ వీధిలో తనిఖీ చేయగా కారులో మద్యం బాటిల్స్ విక్రయిస్తున్నట్టు తెలిసింది. దీంతో అతన్ని పోలీసుల అరెస్టు చేశారు. విచారణలో అతను తూత్తుకుడి అన్నానగర్ 7వ వీధికి చెందిన పూసైదురై (42) అని.. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడని తెలిసింది. అతని వద్ద నుంచి 45 క్వార్టర్స్ బాటిల్స్, 72 హాఫ్ బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. -
గాంధీ జయంతి రోజు మటన్ విక్రయం
సాక్షి, పాలమూరు: గాంధీ జయంతి రోజు హింస చేయరాదు..కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా మేక మాంసం అమ్ముతూ కన్పించాడు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి మటన్ విక్రయిస్తూ కన్పించాడు. ఈరోజు గాంధీ జయంతి.. మటన్ విక్రయించొద్దు కదా అని అతడిని ప్రశ్నిస్తే.. ఒక వ్యక్తి ఆర్డర్ ఇచ్చాడు..అతనికి ఇవ్వంగా మిగిలింది అమ్ముతున్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. -
గాంధీ కలలను సాకారం చేద్దాం
ఖైరతాబాద్: గాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఖైరతాబాద్ నుంచి గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభిం చారు. పలు సామాజిక సంస్థల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ యాత్ర ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి ప్రారంభమైంది. ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, మారుతీ నగర్, బీజేఆర్ నగర్, మహాభారత్ నగర్, చింతల్‌బస్తీ తదితర ప్రాంతాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు స్వాతంత్య్రం కావాలా? స్వచ్ఛ భారత్ కావాలా? అన్నప్పుడు స్వాతంత్య్రం ఎలాగూ వస్తుంది, స్వచ్ఛ భారత్ కావాలన్న గాంధీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదే స్పూర్తితోనే ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. -
గాంధీ అంటే ఒక ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: గాంధీ అంటే ఓ ఆదర్శమని, ఆయన జీవితం ఓ సిద్ధాంతమని ఏఐ సీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా టీపీసీసీ ఆధ్వ ర్యంలో చార్మినార్ నుంచి గాందీభవన్ వరకు బుధవారం శాంతి యాత్ర నిర్వహించారు. గాంధీభవన్ లో జరిగిన సభలో కుంతియా మాట్లాడుతూ శాంతి, అహింస ఆయుధాలతో స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీ అన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు పాల్గొన్నారు. -
పేరు మార్చుకున్న వర్మ..!
సాక్షి, హైదరాబాద్ : రామ్‌గోపాల్ వర్మ.. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు. సంచలన దర్శకుడు, నిత్యం ఏదో ఒక వివాదానికి పురుడు పోసే వ్యక్తి వర్మ. నచ్చిన, మెచ్చిన ఏ అంశాన్ని అయినా నిర్మొహమాటంగా ప్రకటించగల ధైర్య శీలి. ఏ అంశంపైనైనా.. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా స్పందిస్తాడు. అతనో మేధావి అని కొందరు.. తిక్కలోడు అని మరికొందరు అంటుంటారు. కానీ వర్మ మాత్రం ఇవేవి పట్టించుకోడు. ఆయనకు ఏం అనిపిస్తే అదే చెస్తాడు. తాజాగా గాంధీ జయంతి పురస్కరించుకొని ఆయనో ట్వీట్ చేశారు. గాంధీ గెటప్‌లో తన ఫోటోను మార్పింగ్ చేసుకొని ‘అతనిలో నేను దాగి ఉన్నానని నాకు తెలియదు. హ్యాపీ మై జయంతి’ అని మరో ట్విట్ చేశారు. WHAATTT??? Never knew I had him in me 🙄🙄🙄 Happy My Jayanthi💐💐💐 pic.twitter.com/VdnYT90Gfs — Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2019 ‘బ్రిటిష్ పాలనలో భారతీయుల బానిసత్వం పోవడానికి పోరాడి భాయతీయ పాలన రాబట్టి స్వాతంత్రం తెచ్చిపెట్టారు అలనాటి గాంధీ. సమరయోధులు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్త్రీ బానిసత్వం పోవడానికి, వాళ్ల విలువల కోసం నిరంతరం కృషి చేస్తున్నవాడు ఒక్క రామ్‌గోపాల్ వర్మ మాత్రమే’ అని వర్మముదురుని అనే వ్యక్తి చేసిన ట్విట్‌ను స్క్రీన్‌షాట్ తీసి తన పేరును ‘గోపాల్‌దాస్ వరంచంద్ రాంధీ’ చెబుతూ వర్మ మరో ట్వీట్ చేశాడు. Gopaldas Varmchand Ramdhi pic.twitter.com/EW5NjeFyCd — Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2019 -
‘గ్రామ పాలనలో నూతన శకం ప్రారంభమైంది’
సాక్షి, పశ్చిమ గోదావరి : మన జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన నాంది పలికిందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు గ్రామంలో నూతంనంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పాలనలో నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ 150వ జయంతి రోజే.. గ్రామ సచివాయాన్ని ప్రారంభించడం దేశ పౌరురాలిగా తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన మూడు నెలల కాలంలోనే సుమారుగా యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించడం అనేది ఒక చరిత్ర అని, ఇది జగనన్న తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. గత ప్రభుత్వా హయాంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాల స్థానంలో మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగేది కానీ.. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచలోనే మొదటిసారి అని..ఇది ఒక రికార్డు అని తానేటి వనిత హర్షం వ్యక్తం చేశారు. జగనన్న పాదయాత్రలో యువత కష్టాలను చూసి తమ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలలో భాగంగానే ఈ నియామకాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నియామకాలతో యువతకు చక్కని బంగారు భవిష్యత్తు ఏర్పడిందని చెప్పుకోవచ్చు అన్నారు. మడమతిప్పని... మాట మార్చని జగనన్నపై ఉద్యోగాలు పొందిన యువత, వారి కుటుంబాలు కూడా అభిమానం పెంచుకున్నట్లుగా.. వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే తెలుస్తోందని మంత్రి అన్నారు. -
బటర్‌ఫ్లై ఎఫెక్ట్
ఒక కుర్రవాడు బస్ దొరక్క ఇంటర్వూ్యకి ఆలస్యంగా వెళ్లాడు. ఉద్యోగం రాలేదు. నిస్త్రాణగా వెనక్కి వస్తున్నాడు. మే నెల. విపరీతమైన దాహం. కిలోమీటర్ నడిచినా ఒక్క నీళ్ల షాపు కూడా కనబడలేదు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చి ఆ వీధిలోనే చిన్న షాప్ పెట్టి నీళ్ల బాటిల్స్ అమ్మసాగాడు. మూడు నెలల్లో ఐదు వేల లాభం వచ్చింది. దాంతో కూల్‌డ్రింక్స్, ఆపై ఐస్‌క్రీమ్... అలా పెంచుకుంటూ పోయి, ఆ తర్వాత దాన్ని సూపర్ మార్కెట్ చేశాడు. పదేళ్లలో లక్షాధికారి అయ్యాడు. ఆ రోజు అతడికి గానీ బస్సు దొరికి ఉంటే ఇప్పటికీ రూ.10 వేలకు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఒక చిన్న సంఘటన జీవితాన్ని మార్చటం అంటే అదే! గాంధీ జీవితంలో కూడా ఇలాంటి ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ ఒకటి ఉంది. సౌత్ –ఆఫ్రికా రైలు నుంచి ఒక బ్రిటిష్ వాడు ఆయన సామాన్లు బయటికి విసిరేసినప్పుడు ‘మిమ్మల్ని కూడా భారతదేశం నుంచి ఇలాగే బయటకి విసిరేస్తా’అన్న ఆలోచన ఆయనకి బహుశా అప్పుడే వచ్చి ఉంటుంది. మా ఎనిమిదో తరగతి ఇంగ్లీష్‌లో ‘సెల్ఫ్ హెల్ప్’అన్న పాఠం ఉండేది. మహాత్మాగాంధీ ఆత్మకథ నుంచి ఒక భాగం. అందులో బాపూ, ‘తన క్షవరం తనే చేసుకునేవాడు’అని వ్రాశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మేము ఆ రోజుల్లో ప్రతి పైసా చూసుకోవలసి వచ్చేది. గాంధీగారి పాఠంతో ప్రభావితమైన నేను, మా తండ్రి గారి ప్రోత్సాహంతో నా క్షురకర్మ నేనే చేసుకోవటం ప్రారంభించాను. గత 60 సంవత్సరాల్లో ఆ రోజు నుంచి ఇప్పటివరకూ కేవలం పది, పదిహేను సార్లు తప్ప మళ్ళీ బార్బర్ షాప్‌కి వెళ్ళలేదు. ఒక చిన్ని వ్యాసం నా జీవితాన్ని అలా ప్రభావితం చేసింది. ఒక మంచి ఉపన్యాసం కూడా మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఈ తరం వాళ్లకి అంతగా పరిచయం లేని వ్యాపార దక్షులు, పత్రికా సంపాదకులు కె.ఎన్.కేసరి. మహాత్మా ఇచ్చిన ఉపన్యాసం తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో కేసరి మాటల్లో: ‘‘..పుట్టిన ఐదో నెలలోనే తండ్రిని పోగొట్టుకొని, నా కోసం తల్లి పడుతున్న అవస్థలు చూడలేక చెన్నపట్నం వెళ్లాలనుకున్నాను. డబ్బు లేదు. ఒంగోలు నుంచి కాలి నడకన మద్రాసు చేరాను. అక్కడ అష్ట కష్టాలు పడ్డాను. ఆ పై ‘కేసరి సంస్థ’ స్థాపించి, ఆయుర్వేద ఔషధాల ద్వారా స్త్రీల వ్యాధులకు ‘లోధ్ర’మందు తయారు చేసి అనతికాలంలోనే విశేష ధనార్జన చేశాను. నడమంత్రపు సిరి తలకెక్కినది. అంతులేని కోరికలు. పటాటోపమైన వేషము. చెవులకు ఒంటి రాయి వజ్రము. మొలకు బంగారు మొలత్రాడు. ఆ రోజు 1919 ఏప్రిల్ నెలలో మన మహాత్ముడు విజయవాడలో ఇచ్చిన ఉపన్యాసం విన్నప్పటి నుంచి నాలో క్రమక్రమముగా అనేక మార్పులు కలిగాయి. తల బోడిచేసి గాంధి టోపీని ధరించితిని. వేషము మారినది. పట్టుచొక్కాలు, దుకూలాంబరములు దూరములయినవి. సాత్వికాహారము మితముగ భుజించుటకు అలవడితని. కోరికలకు కళ్లెం వేయడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ నేర్చుకున్నాను’’ అంటారు కేసరి. ఆపై ఆయన గొప్ప వితరణశీలిగా మారి, సర్వస్వం సమాజానికి అర్పించి ప్రజాసేవకి అంకితమయ్యారు.గీత ఆధారంగా ‘విజయానికి ఆరో మెట్టు’పుస్తకం రాస్తున్నప్పుడు, మహాత్ముడి ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథం భగవద్గీత అని తెలిసింది. తన తల్లికి జైనులతో ఉన్న పరిచయాల వలన గాంధీకి జైన్ ఫిలాసఫీ కూడా ప్రియమైనదిగా మారింది. ‘‘గీతా పఠనం వల్ల ఆత్మజ్ఞానము, నిష్కామకర్మ ఒకవైపూ, జైనమత ఆలోచనలైన కరుణ, శాకాహారం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ప్రతిజ్ఞ యొక్క ప్రాముఖ్యత విలువల ప్రభావం మరోవైపూ నా జీవితంలో ప్రధానాంశాలయ్యాయి’’అంటారు బాపూ. బౌద్ధాన్ని నమ్మే మాలాంటి వారికి జైన్ ఫిలాసఫీ విరుద్ధంగా కనపడుతుంది. అయితే గౌతమ బుద్ధుడే ఒక చోట, ‘‘నీ మనసుకు సరి అయినది నమ్ము. సరి కాదనిపిస్తే, నేను చెప్పేది కూడా నమ్మే అవసరము లేదు’’అంటాడు. ప్రజలందరూ జైనిజం ఆచరిస్తే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుందని గాంధీ నమ్మారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గాంధీ గురించి ‘రక్తమాంసాలున్న ఇటువంటి ఒక మనిషి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు’ అంటాడు. బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడిన తరువాత, ఆయన వ్యక్తిత్వమూ, ఆలోచనాసరళీ మరింత నిర్దిష్టంగా రూపుదిద్దుకొన్నాయని కొందరు చరిత్రకారులు అంటారు. షా ప్రసక్తి వచ్చింది కాబట్టి అప్రస్తుతమైనా, నన్ను బాగా ప్రభావితం చేసిన ఒక కథ చెపుతాను. బాల్రూమ్లో బెర్నార్డ్‌షా ఓ మూల కూర్చుని ఉండగా, ఒకామె వచ్చి ‘డ్యాన్స్ చెయ్యకుండా ఇలా కూర్చున్నారేమిటి? రండి’అన్నదట. ‘వద్దులెండి. నేను కథ గురించి ఆలోచించుకుంటున్నాను’అన్నాడు షా. ‘డ్యాన్స్ చేస్తూ కూడా ఆలోచించుకోవచ్చుగా’అన్నది ఆమె. ‘ఒకేసారి రెండు పనులు చేయటం నాకు రాదు’అన్నాడు షా. ‘జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. డ్యాన్స్‌లో ఉండే కిక్ తెలిస్తే మీరు ఈ మాట అనరు’.‘డ్యాన్స్‌లో ఉండే కిక్ నాకు బాగా తెలుసు. అందుకే నేను దానికి దూరంగా ఉంటున్నాను. పుస్తకాలు వ్రాయటం వల్ల నాకు కిక్‌తో పాటూ డబ్బు, కీర్తి, సంతృప్తి వస్తాయి. ఈ కిక్ శాశ్వతమైనది, లోతైనది. డ్యాన్స్‌కి అలవాటు పడితే ఆ తాత్కాలికమైన కిక్‌లో నేను శాశ్వతమైన దాన్ని మర్చిపోతాను’ అన్నాడట. ‘మీరు చెప్పే ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు’అని చెప్పి ఆమె వెళ్లిపోయిందట. ఈ కాలపు విద్యార్థులకు ఈ కథ ఒక బట్టర్ఫ్లై ఎఫెక్ట్ కావాలి. బాపూ గురించి చాలా మందికి తెలియని వివరాలు ►ఆహార పంటలు వదిలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని బీహారు రైతులను తెల్లదొరలు నిర్బంధించినప్పుడు ఆ పరిస్థితులను వ్యతిరేకించి గాంధీ సత్యాగ్రహాలు నిర్వహించి అరెస్టు అయినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. అప్పటి నుంచే గాంధీని ప్రజలు ప్రేమతో ‘బాపూ’అనీ, ‘మహాత్మా’అనీ పిలుచుకోసాగారు. ►దేశాన్ని మతప్రాతిపదికన విభజించటాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. జిన్నాను ప్రధానమంత్రిగా చేసి అయినా సరే దేశాన్ని ఐక్యంగా నిలపాలని ఆయన వాంఛ. కానీ, ‘దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి’అని జిన్నా హెచ్చరించాడు. కలహాలు ఆపాలంటే విభజన కంటే గత్యంతరము లేదని హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రం చేస్తూ గడిపాడు. ►విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు ఇవ్వవలసిన 55 కోట్ల రూపాయలను (ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని) ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఈ విషయమై గాంధీ తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తాన్‌కు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పాకిస్తాన్‌కూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నాడని తీవ్రవాదులు ఉడికిపోయారు. గాంధీని గాడ్సే చంపాడని జనాలకి తెలుసుగానీ, 1934లోనే ఆయనపై మూడు హత్యా ప్రయత్నాలు జరిగాయి. ►నోబెల్ బహుమతికి మహాత్మాగాంధీ ఐదుసార్లు ప్రతిపాదించబడ్డాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి అసంతృప్తి కలుగుతుందని ఇవ్వలేదు. 1948 లో మళ్లీ ప్రతిపాదించబడినా మరణానంతరం ఇవ్వకూడదనే నియమం వల్ల ఇవ్వలేదట. 20వ శతాబ్దిలో అత్యధిక మానవాళిని ప్రభావితం చేసిన నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్వర్క్ (సీఎన్ఎన్) జరిపిన సర్వేలో ప్రజలు గాంధీజీని గుర్తించారు. నోబెల్ ప్రైజ్ కన్నా ప్రజాభిమానం ఎప్పుడూ గొప్పదే కదా. – యండమూరి వీరేంద్రనాథ్ -
మహాత్ముడిని మలిచిందెవరు?
గాంధీజీని తమ వ్యక్తిత్వం చేత, ఆలోచనల చేత ప్రభావితం చేసిన వ్యక్తులు కొందరున్నారు. అందులో రాయచంద్ ఒకరు. మహాత్ముడి ఆత్మకథలో రాయచంద్ పేరుతో ఒక ప్రకరణం ఉంటుంది. ఇంగ్లండులో బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కలిశారతన్ని. అప్పటికి రాయచంద్‌కి పాతికేళ్లు. గాంధీ కంటే సుమారు రెండేళ్లు పెద్ద. కవి. శతావధాని కూడానట. అతని ధారణ, అవధాన ప్రజ్ఞలు విశేషమైనవి. కానీ గాంధీని ఎక్కువగా ఆకట్టుకున్నవి మాత్రం అతని విశాల శాస్త్ర జ్ఞానం, నిర్మల ప్రవర్తన, ఆత్మజ్ఞానంపై అతనికున్న తీవ్రమైన తపన. రాయచంద్ రత్నాల వ్యాపారి. దుకాణంలో వ్యాపారం సాగుతూ ఉండగా అతను ధ్యాననిమగ్నుడై ఉండడం అనేకసార్లు చూశానని రాశారు గాంధీ. మన లౌకిక కార్యకలాపాలకు ఆధ్యాత్మిక సాధనకు మధ్య ఘర్షణ ఉండాల్సిన పని లేదనీ రెండింటినీ ఏక కాలంలో నడిపించుకోవచ్చుననీ, పైపెచ్చు ఆధ్యాత్మిక సాధనవల్ల లౌకిక కార్యక్రమాల నిర్వహణ సులువౌతుందని రాయచంద్ వల్ల గాంధీకి తట్టి ఉండొచ్చు. అందరినీ సమదృష్టితో చూసే అతని వైఖరి కూడా గాంధీకి ఒక ప్రేరణగా పనిచేసి ఉండొచ్చు. భగవంతుణ్ణి గురించి తెలిసీ తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు తనకు రాయచంద్ అండగా కనిపించే వాడన్నారు గాంధీ. ప్రత్యక్ష సాంగత్యంవల్ల మనస్సులో నాటుకుపోయిన వ్యక్తి అతను. గాంధీని ప్రభావితం చేసిన మరొక వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. స్ఫటికమంత స్వచ్ఛత, గొర్రెపిల్లంత సాత్వికత, సింహమంత ధైర్యం కల వ్యక్తి అన్నారు ఆయన గురించి చెబుతూ. దక్షిణాఫ్రికా నుంచి గాంధీని భారత రాజకీయ రంగంలోకి రప్పించింది గోఖలేనే. రాజకీయరంగంలో ‘అత్యంత పరిపూర్ణుడై’న మనిషిగా ఆయనను గుర్తించి తన రాజకీయ గురువుగా స్వీకరించారు గాంధీ. గాంధీజీపై ఎనలేని ప్రభావాన్ని చూపించిన పుస్తకం భగవద్గీత. చిత్రంగా దాన్ని ఆయన మొదట చదివింది ఇంగ్లండులో. ఇంగ్లి్లషులో. లా కోర్సు రెండవ సంవత్సరంలో ఉండగా ఎడ్విన్ ఆర్నాల్డ్ గీతకు రాసిన ఆంగ్లాను వాదం ‘ది సాంగ్ సెలెస్టియల్’ని చదివారు. తర్వాత దాన్ని జీవితాంతం విడిచిపెట్టలేదు. చదవడమే కాదు సంçస్కృతం నుంచి గుజరాతీ భాషలోకి అనువదించి తన వ్యాఖ్యలు జోడించుకుంటూ వెళ్లారు. యంగ్ ఇండియా పత్రికలో 1925లో ఒకసారి భగవద్గీతకు తనకు ఉన్న సంబంధాన్ని ఇలా చెప్పారు. ‘సందేహాలు నన్ను వెంటాడినప్పుడు, నిరాశ అలముకుని ఎక్కడా ఆశా కిరణం అన్నది కానరానప్పుడు నేను గీతను ఆశ్రయిస్తాను. ఒక శ్లోకం ఏదో కనిపిస్తుంది. నన్ను స్వస్థ పరుస్తుంది. ముంచెత్తే దుఃఖం మధ్య నాకు చిరునవ్వు మొలుస్తుంది. నా జీవితం నిండా ఎన్ని విషాద ఘట్టాలున్నాయో! అవి నన్ను ఏమీ చెయ్యలేకపోయాయంటే భగవద్గీత బోధ కారణం దానికి’ అన్నారు. గాంధీ కర్మయోగి. సంఘ సంస్కరణ నుంచి, రాజకీయ పోరాటం నుంచి, జాతీయ ఉజ్జీవన ఉద్యమం నుంచి ఎన్నడూ వైదొలగలేదు. ఏ బయటిప్రభావాలూ తనని అంటనివ్వ లేదు. ఏ ప్రలోభానికీ తగ్గలేదు. ‘కాంక్షా రాహిత్యం’అని తన భాషలో చెప్పిన గీతాసారానికి కట్టుబడి ఉన్నారు. ప్రేమతో కూడిన పోరాటాన్ని, ద్వేషంలేని యుద్ధాన్ని కొనసాగించారు. తమ రచనల ద్వారా గాంధీజీని ప్రభావితం చేసిన వ్యక్తులు కొందరున్నారు. వాళ్లలో ముఖ్యులు ముగ్గురు.హెన్రీ డేవిడ్ థోరో, టాల్‌స్టాయ్, రస్కిన్. థోరో (1817–1862) అమెరికన్. కవి, వ్యాసకర్త, ప్రధానంగా తాత్వికుడు. ఆయన రాసిన ‘వాల్డెన్’గ్రంథం, ‘రెసిస్టెన్స్ టు సివిల్ గవర్నమెంట్’అనే వ్యాసం గాంధీజీని బాగా ప్రభావితుణ్ణి చేశాయి. థోరో వాదనా పటిమ పదునైనది, అది మనల్ని నిరుత్తరుల్ని చేస్తుంది అంటారు గాంధీ. థోరో నైతికతకి ఆయన ముగ్ధులైపోయారు. 1906లో ఆయన ‘వాల్డెన్’ చదివారు. దాని నుంచి కొన్ని సూత్రాలను గ్రహించి, అమలు పరిచాను అని చెప్పారు. తన సహచరులచేత ఆ పుస్తకాన్ని చదివించారు కూడా. పన్నుల నిరాకరణను, సహాయ నిరాకరణను, ప్రకృతి ఒడిలో నిరాడంబర జీవితాన్ని, పర్యావరణ స్పృహని, ప్రత్యక్ష కార్యాచరణని, అంతరాత్మ ప్రబోధానుసరణ ఆవశ్యకతని బోధించాడు థోరో. వీటినన్నింటినీ మనం గాంధీ జీవితంలో చూస్తాం. గాంధీని బలంగా ప్రభావితం చేసిన మరో వ్యక్తి టాల్‌స్టాయ్ (1828–1910). ప్రపంచ ప్రఖ్యాత రచయిత. సంపన్న గృహస్థుడు. 57వ ఏట సంపదను వదులుకుని నిరాడంబర జీవితం గడిపాడు. గాంధీ జైలు నిర్బంధానికి గురైన సందర్భంగా వాటిని తీరిగ్గా చదవడం తటస్థించింది. ‘ది కింగ్‌డవ్‌ు ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు’ అనే పుస్తకం, ‘క్రిస్టియానిటీ పేట్రియాటిజం’అనే వ్యాసం గాంధీని బాగా ఆలోచింపజేశాయి. ఎంతగా ప్రభావితుడయ్యారంటే టాల్‌స్టాయ్ ఆశ్రమం అనే పేరుతో దక్షిణాఫ్రికాలో ఉండగా ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి కూడా. నేను మీ అనుచరుణ్ణి అని వినయ పూర్వకంగా రాశారు ఒక ఉత్తరంలో టాల్‌స్టాయ్‌కి. శారీరక శ్రమ, కనీస వసతులతో జీవించడం, ఆస్తిని కూడబెట్టకపోవడం, జీవహింసా వైముఖ్యం ఇవి టాల్‌స్టాయ్ ఆదర్శాలు. ఇవన్నీ గాంధీ ఆశ్రమంలో ఆచరణలు. జాన్ రస్కిన్ (1819–1900) రచన ‘అన్ టు ది లాస్ట్’.. పారిశ్రామికీకరణ నేపథ్యంలో శ్రామిక వర్గ దుస్థితిపై చేసిన రచన. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా పొలాక్ అనే స్నేహితుడు రైలు స్టేషనులో ఆయనకు ఈ పుస్తకాన్ని ఇచ్చాడు. రైలులోనే దాన్ని చదివేశారు గాంధీ. ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చివేసిన పుస్తకం అన్నారు. రక్తంతో కన్నీళ్లతో రాయబడ్డ పుస్తకం ఇది అన్నారు. గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతో అనువదించారు. గాంధీ సర్వోదయ సిద్ధాంతానికి తల్లివేరు రస్కిన్ రచనే. ఇటువంటి వ్యాసాలు చదువుతున్నప్పుడు గాంధీ తత్వం సర్వం ఇతరుల నుంచి గ్రహించబడినదే అనీ, ఆయన స్వయంగా రూపొందించినది ఏమీ లేదనీ అనిపించే అవకాశం ఉంది. కానీ అది నిజం కాదు. దేన్నయినా ఎవరు చెప్పినా సొంత వడపోతకు గురిచేసి కానీ మహాత్మాగాంధీ స్వీకరించరనేది ఆయన జీవితం నిరూపించే సత్యం. కొన్ని రచనలు, కొందరు వ్యక్తులు మనకు కొత్త ఆలోచనా బీజాలను అందిస్తారు. కొందరు అప్పటికే బీజ ప్రాయంగా ఉన్న మన ఆలోచనలకు స్పష్టతను, బలాన్ని సమకూరుస్తారు. మరిచిపోకూడని విషయం ఏమిటంటే మనం కాని దానిని మనకు ఎవరూ చేర్చలేరు. – డా.రెంటాల శ్రీవెంకటేశ్వర రావు డిఫరెంట్ క్లిక్స్ ఇందిరా.. గాంధీ : గాంధీజీతో ఎవరనుకున్నారు.. దేశ ఉక్కు మహిళ ఇందిర.. ►ఎండ దెబ్బకు తలగడ వైద్యం.. 1940లో ఓ ఎండాకాలం రోజున వేడిని తాళలేక తలగడ నెత్తిన పెట్టుకుని వెళ్తున్న బాపూ ►స్వచ్ఛ భారత్.. పితామహుడు.. శుభ్రత పరిశుభ్రత విషయంలో గాంధీజీ ముందుంటారు. దానికి నిదర్శనమే ఈ చిత్రం బ్రిటీషర్లపై హెవీ వెయిట్ గాంధీజీ మామూలుగా అయితే లైట్ వెయిట్.. మరి బ్రిటిషర్లకు హెవీ వెయిటేగా.. బిర్లా హౌస్‌లో బరువు చూసుకుంటున్నప్పుడు తీసినదీ చిత్రం -
గాంధీ మార్గంలో పల్లెను మళ్లిదాం..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గ్రామ ఆర్థిక వ్యవస్థ ఒక భాగం. ఒక గ్రామానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, అనేక గ్రామాలను జతపరిచే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాదిరాయిగా నిలుస్తుంది. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా, స్వతంత్రంగా ఉన్న రోజుల నుంచి క్రమేపి బాహ్య ఆర్థిక వ్యవస్థపై ఆధారపడడం వలన సామాజిక, పర్యావరణ, ఆర్థిక, పాలనాపర మార్పులొచ్చాయి. కొన్ని ఆహ్వానించదగినవే కాగా, అనేక మార్పులు గ్రామీణ పరిస్థితులను, మానవ సంబంధాలను మార్చేశాయి. వందేళ్ల క్రితం నాటితో పోలిస్తే గత 50 ఏళ్లలో పలు గ్రామాలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. సగటు ఆదాయం పెరిగింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెరిగాయి. ఇదే కాలంలో, గ్రామ వాతావరణం మారింది. గ్రామంలో పశువుల సంఖ్య తగ్గింది. వాహనాల సంఖ్య పెరిగింది. ఆత్మహత్యలు పెరిగాయి. పిల్లల్ని పోషకాహార లోపం పీడిస్తోంది. పచ్చటి పొలాల్లో విష రసాయనాల గత్తర కంపు ఊపిరి తీస్తోంది. భూగర్భ జలాలు అడుగంటాయి. నీటి కాలుష్యం పెరిగింది. ఉపాధి తగ్గింది. సంప్రదాయ వృత్తులు దెబ్బతిన్నాయి. వ్యవసాయం సంక్షోభంలో పడింది. భూమి లేని నిరుపేదలు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులపైనే ఆధారపడే దుర్భర పరిస్థితి.. పల్లెలలో ఆహార కొరత ఏర్పడింది. కొంటేనే కాని దొరకని ఆహార వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో వేళ్లూనింది. కొనే స్తోమత లేని కుటుంబాల సంఖ్య పెరిగింది. కూల్డ్రింకులు, చిప్స్ ప్యాకెట్లు దొరికినంత సులువుగా పల్లెల్లోనూ సహజ ఆహారం దొరకడం లేదు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం రక్తహీనత గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంది. ఇటీవల విడుదలైన లాన్సేట్ పత్రికలో ఒక అధ్యయనం ప్రకారం 1990–2017 మధ్య కాలంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న లేదా చనిపోతున్న చిన్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలలో 68.2 శాతం మంది పోషకాహార లోపంతో చనిపోతున్నారని ఈ అధ్యయనం తేల్చింది. మహాత్మాగాంధీ ఆలోచించిన గ్రామ స్వరాజ్యాన్ని విస్మరించిన ప్రభుత్వ విధానాలు ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించలేకపోయాయి. ఫలితంగా గ్రామీణులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మారిపోయారు. గ్రామస్తులకు తమ పరిధిలోని ప్రకృతి వనరులు ‘తమ సొంతం’అనే భావన పోయింది. ఒకప్పుడు, గ్రామ చెరువును, చెరువు పరీవాహక ప్రాంతాన్ని, సమీప అటవీ ప్రాంతాన్ని, నేలను, భూమిని, నీటిని క్రమబద్ధంగా, ఏటా పద్ధతి ప్రకారం నిర్వహించుకునే గ్రామస్తులు ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక గ్రామాలు పూర్తిగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద కునుకు తీస్తున్నాయి. ఒకప్పటి గ్రామాలు ఉత్పత్తి, సేవల కేంద్రాలుగా, స్వయం సమృద్ధితో, నైపుణ్యంతో, కళలతో విరాజిల్లాయి. గ్రామ వనరుల స్వయం నిర్వహణ నుంచి క్రమేపీ కేంద్ర నిధులు, కాంట్రాక్టర్లు, కాంట్రాక్టుల పద్ధతి వచ్చింది. దేశంలోని ఆరున్నర లక్షల గ్రామాల నీటి వనరుల నిరంతర నిర్వహణ కేంద్రీకృత పాలనలో అసాధ్యంగా మారింది. గ్రామాభివృద్ధి నిధులు పలు అంచెలు, అవాంతరాలు దాటుకుని వచ్చేసరికి కొండంత నిధులు బఠానీలుగా మారుతున్నాయి. గాంధీ గ్రామ స్వరాజ్యం పునాదులపై కాకుండా, దానికి వ్యతిరేక దిశలో ఆర్థిక వ్యవస్థ నిర్మితమైంది. ఫలితం..పల్లెల్లోనూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఉపాధి కోసం, ఉజ్వల భవిష్యత్తుపై ఆశతో ‘వలసలు’ పెరిగాయి. జనాభా లెక్కల ప్రకారం 2001లో 500లోపు జనాభా సంఖ్య ఉన్న గ్రామాలలో దేశ జనాభాలో 7.16 శాతం నివసిస్తుండగా, 2011 నాటికి అది 5.74 పడిపోయింది. 5,00,999 జనాభా ఉన్న గ్రామాల్లో నివాసితుల సంఖ్య 14.2 నుంచి 12.4 పడిపోయింది. ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు పట్టణీకరణకు దారితీస్తోంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఒకపక్క మనం పాశ్చాత్య దేశాల్ని అనుకరిస్తోంటే, మరో వైపు ఆ దేశాలు స్థానిక ఆర్థిక వ్యవస్థల్ని గట్టిపర్చుకుంటున్నాయి. అమెరికా వంటి దేశాల్లో వారాంతపు సంతలు పెరుగుతున్నాయి. ఆహారం, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే పర్యావరణం దెబ్బతింటుందని గుర్తించి, తమ స్థానిక ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణానికి పునాదులు వేసుకుంటున్నాయి. కరెన్సీ లావాదేవీల బదులు పురాతన బార్టర్ పద్ధతి మేలని భావిస్తు్తన్నాయి. మన గ్రామాలు స్వతంత్ర వ్యవస్థతో నడిచేలా ప్రభుత్వ విధానాలు రావాలి. మహాత్మాగాంధీ–కుమారప్ప జోడి అందించిన ఆర్థిక సూత్రాలు, విధానాలను నీతి ఆయోగ్ వంటి ప్రణాళిక సంస్థలు ఆచరణలోకి తేవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్య స్థాపనలో ఒక ముందడుగు. ఇప్పటి పరిస్థితులకు అది సరిపోయే ఆలోచన. కాకపోతే, గ్రామ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడేలా, ఉత్పత్తిని, ఉత్పాదకతను ప్రోత్సహించేలా దీనిని మలుచుకోవాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారమూ అవసరం. పల్లెలకు నిధులు కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు, ఒక దామాషా పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వస్తాయి. ఇది రాన్రాను రాజకీయమవుతోంది. ఏటా ప్రతి గ్రామానికి కేంద్రం సగటున రూ.10 లక్షల అభివృద్ధి, నిర్వహణ నిధులిస్తే, పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. అంటే, 6,40,000 గ్రామాలకు రూ.64 వేల కోట్లు. సాలీనా రూ.28 లక్షల కోట్ల బడ్జెట్లో ఇది 2 శాతం మాత్రమే. ఏటా క్రమం తప్పకుండా ఈ నిధులిస్తే, గ్రామాభివృద్ధి సాధ్యమే. గ్రామీణులు సహజ వనరులను తమ సొంతమనే భావనతో కాపాడుకుంటూ, సుస్థిరంగా నిర్వహించుకుంటే సమతుల్య అభివృద్ధి సాధించవచ్చు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు బలంగా, సుస్థిరంగా ఉంటే దేశం అభివృద్ధి చెందినట్లే. – దొంతు నర్సింహరెడ్డి -
‘స్వచ్ఛ’మేవ జయతే
స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో కేంద్రం తలపెట్టిన అత్యంత ప్రధానమైన పారిశుధ్య కార్యక్రమం స్వచ్ఛ భారత్ అభియాన్. దేశవ్యాప్తంగా 34 లక్షల మంది ప్రభుత్వోద్యోగుల సహకారంతో సాగుతున్న స్వచ్ఛభారత్, పారిశుధ్య కల్పన విషయంలో ప్రపంచంలోనే అత్యంత బృహత్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ‘స్వచ్ఛ, పరిశుభ్రమైన భారత్ గురించి మహాత్మాగాంధీ కన్న స్వప్నాన్ని పరిపూర్తి చేయడమే దీని లక్ష్యం’ అని మోదీ పేర్కొనడంతో స్వచ్ఛభారత్ అంతర్జాతీయ ప్రచారం పొందింది.మరి స్వచ్చభారత్ కార్యక్రమానికి మూలమైన మహాత్మాగాంధీ పరిశుద్ధ భారత్ భావన ఎలా ఉనికిలోకి వచ్చింది? దీన్ని తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఆచరణలోకి తీసుకొచి్చన గాంధీ భారత్‌లో మరింత విస్తృతస్థాయిలో పాటించారు. వందేళ్ల క్రితం మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశం తిరిగొచి్చనప్పుడు భారతీయ సమాజాన్ని పారిశుధ్యం తోటే అనుసంధానం చేశారు. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీ అశుద్ధాన్ని చూసి తక్షణం స్పందించిన తీరు పారిశుధ్యంపై ఆయన దృక్పథానికి స్పష్టమైన రుజువు. గాంధీ ఒక చీపురు తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. దేశంలో పారిశుధ్య కార్యక్రమానికి అదే నాంది.పారిశుధ్య కార్యక్రమం కులరహిత, స్వేచ్ఛా సమాజాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో ఒక అంతర్గత భాగంగా ఉంటుందనేది గాంధీ అభిప్రాయం. అంటరానితనాన్ని తొలగించాలంటే పారిశుధ్యంపై వ్యక్తిగత బాధ్యతను పెంచాలని గాంధీ నొక్కి చెప్పేవారు. గుజరాత్లో ఒక రాజకీయ సదస్సులో పాల్గొన్న గాంధీ, ‘మన ఇళ్లు, వీధులు, రోడ్లు అన్నీ అపరిశుభ్రంగా ఉం టున్నాయి. సాంక్రమిక వ్యాధులు ప్రబలడానికి అవే కారణమ’న్నారు.మద్రాసులో కొంతమంది కార్మికులతో మాట్లాడుతూ ‘మన డ్రాయింగ్ రూమ్‌తో సమానంగా మరుగుదొడ్డిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. పరిశుభ్రత, అం టరానితనం సమస్యలను గాంధీ ముడిపెడుతూ, మన సమాజంలో పాకీ పనిచేస్తున్న వారు ఎల్లప్పటికీ నిమ్నస్థాయిలోనే ఉండిపోవడం తీవ్రమైన అన్యాయమ న్నారు. గాంధీ పరిశుద్ధ భారత్ ఆశయం సాకారం కావాలంటే 130 కోట్లకుపైగా భారతీ యులు స్వచ్ఛభారత్‌ని తమదిగా భావిం చాలని మోదీ అన్నారు. గాంధీ 150వ జయంతి ముగింపు వేడుకల వేళ అదే ఆయనకు ఘనమైన నివాళి కూడా. కె.రాజశేఖరరాజు ►‘పరిశుభ్రత, పారిశుధ్యం అనేవి రాజకీయ స్వాతంత్య్రం కంటే ముఖ్యమైనవి. ఆదర్శ గ్రామం అంటే పరిపూర్ణ పారిశుధ్యం అని అర్థం. స్వరాజ్ భావన ముందుగా మన వీధుల నుంచే మొదలుకావాలి. మహాత్మాగాంధీ ►‘పరిశుద్ధ భారతదేశం మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా భారత్ ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళిగా ఉంటుంది.’ ప్రధాని నరేంద్రమోదీ (2014 అక్టోబర్ 2న స్వచ్చభారత్ మిషన్ ప్రారంభం సందర్భంగా) -
‘నాలుక’ను జయించి
’పారిస్‌లోని ఐఫిల్‌టవర్‌ను గాంధీజీ సందర్శించారు. కానీ ఆయనకు నచ్చలేదు. అందులో శిల్పం లేదనీ, కేవలం సంతలో ప్రదర్శన కోసం పెట్టబడిన బొమ్మ అనీ అన్నారు. మహాత్మాగాంధీ ఆహారం గురించి కూడా చాలా రకాలు పరిశోధనలు చేశారు. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది? దాన్ని ఎట్లా ప్రాసెస్ చేస్తున్నారు? ఎంత తింటున్నారు? ఎలా తింటున్నారు? అనే అంశాలపై దృష్టిపెట్టారు. ఉదాహరణకు బెల్లం మంచిదా, పంచదార మంచిదా అని ఆలోచించినప్పుడు ఆయనకు ఏమనిపించిందంటే.. బెల్లం తయారీ గ్రామస్తుల చేతుల్లో ఉంటుంది. పంచదార పూర్తిగా పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు గ్రామస్తులకు వాళ్ల ఆదాయం మీద, వాళ్ల పంట మీద నియంత్రణ లేకుండా పోతుంది. బెల్లం తినటం వల్ల పౌష్టికాంశాలు అందుతాయి. పంచదారతో అలాంటి అవకాశం లేదు. పైగా మళ్లీ మళ్లీ తినాలని అని పించేలా చేసే లక్షణం పంచదారకు ఉంది. కాబట్టి, పంచదార కన్నా బెల్లం తినటమే మంచిది. కావాలంటే పోషకాహార నిపుణులను అడిగి నిర్ధారించుకోండని తన ప్రసంగాల్లో, వ్యాసాల్లో గాంధీజీ చెబుతూ వచ్చారు. అట్లాగే నెయ్యికి, వనస్పతికి మధ్య జరిగిన చర్చలో ఆయన స్పష్టంగా చెప్పింది ఏమిటంటే మనిషి ఒక జంతువును ఎప్పటికీ తన అవసరాల కోసమే పీడించడం మంచి పద్ధతి కాదు. కాబట్టి, పశువు పాలను, ఆ పాల నుంచి తీసే నెయ్యి వాడకాన్ని తగ్గించుకోవాలన్నాడు. ఇక నెయ్యినే వద్దంటే దానిలా కనబడేలా తయారు చేసినది కాబట్టి వనస్పతి కూడా వద్దన్నాడు. వనస్పతి అనేది ప్రకృతిలో లేదు. ఇది తీసుకోవడం ఏ రకంగా కూడా మంచిది కాదని వ్యతిరేకించాడు. ఇక పాలపై ఆయనకు మొదటి నుంచీ వ్యతిరేకమే. జంతువు నుంచి తీసిన ఉత్పత్తి కాబట్టి వద్దన్నాడు. ప్రకృతి వైద్యాన్ని పాటించినప్పుడు ఆవు పాలు తీసుకోవడం సరికాదని మానుకున్నాడు. అయితే, ఆయనకు అనారోగ్యంతో బరువు తగ్గిపోయినప్పుడు వైద్యులు జంతువుల ప్రొటీన్లు తీసుకోవాలన్నారు. తాను వద్దనుకున్నది ఆవు పాలు కాబట్టి, మేక పాల గురించి లోతుగా ఆలోచించారు. రుచికి ప్రాధాన్యం ఇవ్వలేదన్నమాట. పైగా, మారుమూల గ్రామీణులకు కూడా అందుబాటులో ఉంటుందన్న దృష్టితో కూడా మేక పాలను డాక్టర్ల సూచన మేరకు తీసుకున్నాడు. టీ, కాఫీలు ఏవీ అవసరం లేదు. వాటిని అలవాటు చేసుకుంటే వాటి చుట్టూ ఇంకా కొన్ని కోరి కలు పుట్టుకొస్తాయి కాబట్టి వద్దన్నాడు. కాసేపటికి ఏదో ఒకటి నములుతూ ఉండే పట్టణవాసుల అలవాటును కూడా ఆయన నిరసించాడు. తిండి విషయానికొచ్చే సరికి కాస్త తక్కువ తినడమే మంచిది అని మహాత్మా గాంధీ సూత్రీకరించాడు. నాగరికత పెరుగుతున్నకొద్దీ ఎప్పుడూ ఆహారాన్ని అందుబాటులో ఉంచుకునే వ్యవస్థను తయారు చేసుకున్నాం. ఇక ఎప్పుడూ ఆహారం ఎదురుగా ఉంటుంది కాబట్టి అవసరాలకు మించే తింటున్నామన్నది గాంధీ గారు గమనించారు. అందుకని నాలుకను మనం జయించాలి అని ఆయన సూత్రీకరించాడు. ప్రకృతిలో జీవులన్నీ అవసరం కోసమే తింటాయి. మనిషి మాత్రమే నాలుక కోసం తింటున్నాడు. మనం తింటున్నది బతకడం కోసం మాత్రమే. తినటం కోసం బతకొద్దు అని చెప్పాడు. కాబట్టి, నాలుకను మనం జయించాలి. పాలిష్ బియ్యాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. మన ధాన్యాన్ని మనం దంచుకొని తినటం మంచిదని ఆయన అభిప్రాయం. దంపుడు బియ్యం తయారు చేసుకోవడం అనేది గ్రామీణుల వ్యాపకం. ఈ వ్యాపకం మిల్లర్ల చెప్పుచేతల్లోకి పోతుందని, తెల్లబియ్యాన్ని ఎరగా చూపి మిల్లర్లు మనల్ని ఆకర్షిస్తారని ఆయన తెలిపారు. ఆ విధంగా పూర్తిగా నిర్జీవమైన తెల్ల బియ్యానికి అలవాటుపడుతున్నామని 1940వ దశకంలోనే హెచ్చరించాడు. దంపుడు బియ్యమే తినాలని సూచించాడు. అట్లాగే, వీలైనన్ని పండ్లు, పచ్చి ఆకుకూరలు తినమని గాంధీజీ చెప్పాడు. అంటే, ఉడికించని ఆహారం ఆరోగ్యదాయకమని ఆయన చెప్పాడు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవటంలో మహిళల చాకిరీని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని భావించాడు. ఇంటి పనుల్లో పురుషులు కూడా మహిళలకు తోడ్పడాలని సూచించాడు. రోజుకు ఒకటి లేదా రెండు నిమ్మకాయలు తీసుకోమన్నాడు. శరీరంలో కలుషితాల క్లీనింగ్‌కు విటమిన్ సిని ఇవ్వటం ద్వారా ఉపయోగపడుతుందని చెప్పాడు. నిమ్మకాయ దొరకని సందర్భాల్లో చింతపండు వాడుకోమని చెప్పాడు. శాకా ‘హారం’ ప్రొటీన్ కోసం మాంసం తింటున్న వాళ్లు పప్పులు తినకుండా ఉండొచ్చు కదా అనేవాడు. అందరికీ కావాలి్సనటువంటి ప్రా«థమిక ఆహారం అందుబాటులో ఉండాలంటే దాని అవసరం లేని వారు త్యాగం చేయాలి కదా అనేవాడు. ఆయన దేని గురించి ఆలోచించినా గ్రామాల్లో ప్రజలందరికీ ఇది అందుబాటులో ఉంటుందా లేదా అని ఆలోచించేవాడు.ఆయన రోజూ ఉదయపు అల్పాహారంలో 10–12 వేరుశనగ గింజలు తినేవాడు. ఒక రోజు ప్లేటులో అంతకన్నా నాలుగు గింజలు ఎక్కువ పెడితే.. వద్దు అని గాంధీ గారు తిరస్కరించారు. ‘నేను ఎక్కువ తింటున్నాను అంటే ఇంకెవరికో తక్కువ అవుతుంద’ని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌తో అన్నాడు. ఆహారానికి సంబంధించిన ఎన్నో ప్రయోగాలు చేశాడు. ‘డైట్ అండ్ డైట్ రిఫార్మ్స్’పుస్తకంలో ఇటువంటి అనేక విషయాలు రాశారాయన. ఈ ఆహార నియమాలు ఎవరికి వాళ్లు ఆచరించి చూసిన తర్వాతే ఇతరులకు చెప్పండి అని చెబుతాడన్నమాట ఆయన. ఇవి చేయడం పెద్ద కష్టం కాదు. సులువు. మన చేతుల్లో ఉన్నది. ఎటొచ్చీ ఏమిటంటే వీటన్నిటినీ పాటించడానికి తగినంతటి మానసిక శక్తి ఉందా? అన్నది ప్రశ్న. అసలు ఆ ముడి సరుకే కష్టమవుతున్నది. మన పరిస్థితుల్లో ఎంత మార్పొచ్చిందంటే.. వేటి పట్లా మనకు కంట్రోల్ లేదనే ఫీలింగే ఉంది. అయ్యో ఇది లేకపోతే ఎట్లా.. అది లేకపోతే ఎట్లా.. దేన్నీ వదులుకోవడానికి మనం సిద్ధంగా లేం. అన్నీ ఉన్నతర్వాత తినకపోతే అది ఉపవాసం. లేకపోతే తినకపోతే అది కరువు. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటే గాంధీ బాగా అర్థమవుతాడు. ప్రొఫెసర్ (డా.) కె. సత్యలక్ష్మి, డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, పుణే, మహారాష్ ట్ర -
నయా నిజం..గాంధీయిజం
ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించాడు! బలహీనుడు కాక బలవంతుడా? సైన్స్ తెలీదు, ఆధునికుడు కాదు! గోచిగుడ్డ, చేతికర్ర, కళ్లజోడు, బోడిగుండు.. ఏముంది ఆకర్షణ? రాట్నం వడకమంటాడు. ఖాదీ అంటాడు. గ్రామాలకు వెళ్లమంటాడు. ఎలా? ఇలాంటి మాటలు నలభై, యాభై ఏళ్లుగా వినబడ్డాయి, కనబడ్డాయి, చర్చించబడ్డాయి, స్థిరపడ్డాయి! నిజానికి గాంధీ ఇంతేనా? మరేమీ కాదా? ‘‘రండి! మగటిమి చూపండి! ఈ పూజారులను తన్ని తరమండి. చచ్చినా మారలేరు కనుక, వీరు ప్రగతి విరోధులు! వీరికి హృదయ వికాసం లేదు. శతాబ్దాలుగా పేరుకుపోయిన గుడ్డి నమ్మకాల్లోంచి, ప్రజాహింస నుంచి వీరు పుట్టుకొచ్చారు. ముందుగా కూకటివేళ్లతో పెరికి పారవేయవలసింది వీరి పూజారితనాన్నే. మీ కలుగులలో నుంచి వెలికి రండి! నలుదిక్కులకు చూడండి! దేశదేశాలు ఎలా పురోగమిస్తున్నవో గమనించండి..’’ ఈ మాటలు ఎవరివో ఊహించగలమా? ప్రచండమైన ఉరుముల్లాంటి ఈ పలుకులు వివేకానంద అన్నారని ఆశ్చర్యం కలగదా? ఇందులో భావం ఎంత తీవ్రంగా ఉందో, భాష అంత పదునుగా ఉంది కనుకనే ఒళ్లు జలదరిస్తుంది. 1972లో సంపాదకీయం కోసం నార్ల వెంకటేశ్వరరావు చేసిన అనువాదమిది. గాంధీజీ వాదనను, వాదనా విధానాన్ని గమనిస్తే అంతటి ఆశ్చర్యం కలుగుతుంది. గాంధీని పోల్చగలిగితే మనకు బుద్ధుడు, ఏసు, వివేకానంద కనబడతారు. మరోరకంగా చెప్పాలంటే గాంధీ వీరందరికన్నా సార్వత్రికంగా, సహజంగా, సర్వతోముఖంగా కనబడతారు. అందుకే ఆయన ఐదు వేల సంవత్సరాల (అది ఎంతైనా కావచ్చు) మానవ చరిత్రలో అపురూపమైన వ్యక్తి. బలము, బలహీనత గాంధీ మానసికంగానే కాదు, శారీరకంగానూ బలవంతుడు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్ప చివరిదాకా ఆయన జనంలో ఉన్నారు. దేశమంతా స్వాతంత్య్ర సంబరాలలో మునిగి ఉంటే ఆయన నౌకాలిలో గాయపడిన హృదయాలను సముదాయించారు. ఆయన సగటున రోజుకు 18.22 కిలోమీటర్లు నడిచేవారు. బోయర్ యుద్ధ సమయంలో క్షతగాత్రులను మోసుకుంటూ 40 కిలోమీటర్లు నడిచిన దాఖలాలున్నాయి. చివరి దశలోనూ రోజుకు 18 గంటలు పనిచేశారు. వైద్యం, వైద్య దృష్టి ఆశ్రమంలోని ఆసుపత్రికి తెప్పించిన అస్థిపంజరాన్ని బీరువా తీసి పరిశీలనగా చూశాడు గాంధీ. దేహ నిర్మాణం మీకు తెలుసునా అని ఆయనను అడిగినపుడు దేహనిర్మాణం, ఏ అవయవంలో ఎన్ని ఎముకలుంటాయో ఏడెనిమిది నిమిషాలు వివరించాడు. చివరలో అస్థిపంజరం గడ్డం పట్టుకుని, ‘‘నాయనా! నేను కూడా ఏదో ఒకనాడు నీలాగే ఔతానులే’ అన్నాడు. (ఊట్ల కొండయ్య రచన ‘గాంధీపథం’1982 ప్రచురణ నుంచి) 1888 లోనే కాదు, 1908లో సైతం మెడికల్ డిగ్రీ సంపాదించి పూర్తిస్థాయి వైద్యుడిగా స్థిరపడాలని గాంధీ ప్రయత్నించాడు. కానీ, రెండుసార్లు రెండు ఆటంకాలు ఎదురయ్యాయి. ఆయన ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, హోమియోపతిని ఆదరించారని భావిస్తాం. అయితే ఆధునిక వైద్యరంగంలో పరిశోధకుల వినయాన్ని, చిత్తశుద్ధిని విశేషంగా శ్లాఘించి మన ఆయుర్వేద వైద్యులు మెరుగుపడాలని కోరారు. 1925లో ఆయుర్వేదంలో లైంగిక సామర్థ్యం పెంచుకోవచ్చనే ప్రకటనలను గట్టిగా వైద్యుల మధ్యనే ఖండించారు. అప్డేట్ అవడం: గాంధీ అనేక అంశాలపై చూపిన శ్రద్ధ ఆసక్తికరం. ఆయన ఒక అంశంపై ఆసక్తి చూపడం ఆరంభిస్తే, లోతుగా అధ్యయనం చేసేవారు. జీవితంలో చిన్న చిన్న అంశాలు అని మనం భావించే వాటిపై ఆయన చూపిన అమితమైన శ్రద్ధే ఆయన మానవతా వాదంలో విశిష్టత కావచ్చు. అది ఆయన వ్యక్తిత్వానికి మూలం అని ‘బహురూపి’ పుస్తకానికి 1964లో ముందుమాట రాస్తూ జవహర్ లాల్ అంటారు. ఏదైనా ఒక విషయం గురించి పలు అభిప్రాయాలుంటే తాజా అభిప్రాయాన్నే తన అభిప్రాయంగా, సవరించిన అభిప్రాయంగా పరిగణించమంటాడు. ఇది పూర్తి శాస్త్రాభివేశ దృక్పథం. నగరాల నిరంతర అహంకారం ఇవి ఆయన మాటలే. ఇందులో అహంకారం అనేది ఎంత తీవ్రంగా ఉందో, నిరంతరం అనేది అంతలోతుగా ఉంది. ఇందులో వనరుల దోపిడీ, కాలుష్య కారణ వ్యవస్థలు, వినియోగలాలసత, పటాటోపం, కల్లాకపటం.. ఇలా చాలా వర్తమాన కాలపు దుర్గుణాలు మనకు ద్యోతకమవుతాయి. ఈ విధానాలను ఇంత తీవ్రంగా వ్యతిరేకించిన గాంధీ మరెంతటి విప్లవవాది? స్త్రీ హృదయం–మాతృభావన If nonviolence is the law of our being, the future is with woman..ఈ మాటన్నది గాంధీ అని చాలామంది నమ్మకపోవచ్చు! సైనికబలంలో పురుషుల కంటే స్త్రీలు మెరుగని గాంధీ నిశ్చయం. అహింసా సమరంలో నైతిక బలమే ముఖ్యం.. ఇదీ గాంధీ మహిళాదృష్టి. దేవదాస్ గాంధీ 1900లో జన్మించినపుడు మిగతా పిల్లలను చూసుకుంటూ, కస్తూరిబాయి సుఖప్రసవానికి తనే ఏర్పాట్లు చేశారు. వైద్య పుస్తకాలు చదివి, మంత్రసానిగా మారిన స్త్రీ హృదయం ఆయనది. మాతృభాషలకు ఊతం ఇంగ్లండ్‌లో చదివి, దక్షిణాఫ్రికాలో ప్రజానాయకులై కూడా తన తొలి పుస్తకం ‘హింద్ స్వరాజ్’ను 1909లోనూ, తర్వాత 1925లో ఆత్మకథను గుజరాతీ భాషలో రాశారు. ఇంగ్లిష్ చదువుతోనే మన బానిస ధోరణి అలవడిందని ఆయన అంటారు. నౌకాలి ఉత్పాత సమయంలో పాత్రికేయులు అడిగిన దానికి ఆయన– ‘నా జీవితమే నా సందేశం’ అని బెంగాలీలో చెప్పారు (అప్పుడు కలకత్తాలో ఉన్నారు). సైన్స్ బోధన మాతృభాషలలో జరగాలని అంటారు. యంత్రాలను నిరాకరించలేదు సర్వేపల్లి రాధాకృష్ణ 1969లో రాసిన ‘మహాత్మాగాంధీ’అనే వ్యాసంలో– ‘నా శరీరమే అతి సూక్ష్మాంశాలతో కూడిన అతి సంకీర్ణమైన యంత్రమని నాకు, తెలిసినపుడు నేను యంత్రాల వ్యతిరేకిని ఎలా అవుతాను? చరఖా అనేది యంత్రం.పళ్లు కుట్టుకునే పుల్ల యంత్రం. యంత్రాలను గురించిన వ్యామోహానికి మాత్రం నేను వ్యతిరేకినే’.. ఇది గాంధీ విజన్. కలుపుకు పోవడం, సంభాషించడం 1941 జనవరి 26 ‘హరిజన్’పత్రికలో ఇలా రాశారు ‘‘కమ్యూనిస్టులందరూ చెడ్డవారు కాదు. కాంగ్రెస్ వారందరూ దేవతలూ కాదు. కాబట్టి కమ్యూనిస్టు అంటే నాకు దురభిప్రాయం లేదు. కానీ వారి సిద్ధాంతాలను మాత్రం ఆమోదించలేను’’(గాంధీ దర్శనం, ఆదర్శ గ్రంథమండలి ప్రచురణ, 1959, అనువాదం ఉప్పులూరి వెంకట సుబ్బారావు). ఆయన అభిప్రాయాలలో రాజీ లేదు. భాష, వ్యక్తీకరణ కడు సాత్వికం. – డా. నాగసూరి వేణుగోపాల్ -
నిన్నటి.. ఆ అడుగు జాడలు...
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాందీగాదక్షిణాఫ్రికా వెళ్లిన గాందీజీ... ఉద్యమకారుడిగా తిరిగి వచి్చన నాటి నుంచి వేసిన అడుగులు చరిత్ర గతినే మార్చేశాయి. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. చివరికి వారు ని్రష్కమించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. చంపారణ్లో రైతుల కోసం మొదలుపెట్టిన తొలి ఉద్యమం అనంతరకాలంలో ఎన్నో కీలక ఘట్టాలకు స్ఫూర్తినిచి్చంది. దేశానికి మహాత్ముణ్ణి అందించింది. బ్రిటిష్ పాలకులకు ఊపిరాడనీయకుండా చేసిన ఉద్యమాల పరంపర 1948 జనవరి 30న ఉన్మాది తూటాలకు గాంధీజీ నేలకొరిగే వరకూ సాగుతూనే ఉంది. ఆయన ప్రస్థానంలోని ముఖ్యమైన అడుగుల జాడలివి... జనవరి 9/1915 స్వదేశానికి మహాత్ముడు దక్షిణాఫ్రికాలో నాటల్ ఇండియన్ కాంగ్రెస్‌కు సారథ్యం వహించి వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాక భారత్‌కు తిరిగొచి్చన రోజు. ఏప్రిల్ 17/1917 చంపారణ్ సత్యాగ్రహం బిహార్‌లోని చంపారణ్లో బార్లీ బదులు నీలిమందు తోటల్ని పెంచాలన్న బ్రిటిష్ పాలకుల హుకుంను నిరసిస్తూ రైతులకు మద్దతుగా గాంధీ తొలి సత్యాగ్రహం. అనంతరకాల సత్యాగ్రహ ఉద్యమాలకు ఇదే స్ఫూర్తి. మార్చి 18/1918 ఖేడా ఉద్యమం ఒకపక్క ప్లేగు వ్యాధి, మరోపక్క కరువు పీడిస్తున్న గుజరాత్‌లోని ఖేడాలో అధిక పన్నులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం. లొంగివచ్చిన ప్రభుత్వం. ఏప్రిల్ 6 1919 రౌలట్ నిరసనోద్యమం జాతీయోద్యమంపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు. నిరసనగా సత్యాగ్రహం.జలియన్‌వాలాబాగ్ మారణకాండ. వెయ్యిమంది మృతి. మార్చి 12/1930 ఉప్పు సత్యాగ్రహం జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన కీలక సత్యాగ్రహం. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 384 కిలోమీటర్ల దూరంలోని దండికి గాం«దీజీ ప్రారంభించిన పాదయాత్ర. యాత్ర చివరిలో ఉప్పుపై ప్రభుత్వం విధించిన ఆంక్షల ఉల్లంఘన. గాందీజీ, ఇతర నేతల అరెస్టు. మార్చి 5/1931 గాంధీ–ఇర్విన్ ఒడంబడిక భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా కాంగ్రెస్ కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలు, కార్యకర్తలపై సాధారణ కేసుల ఉపసంహరణ. దండి యాత్రలో పాల్గొన్న వారి విడుదల. 1934 కాంగ్రెస్‌కు రాజీనామా కాంగ్రెస్‌లో సహచర నేతలతో విభేదాలు. పారీ్టకి గాంధీ రాజీనామా. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాంధీ దీక్ష చేపట్టాక పుణేలో దళితుల తరఫున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అగ్రవర్ణాల తరఫున మదన్మోహన్ మాలవీయల మధ్య ఒప్పందం. అనంతరకాలంలో అగ్రవర్ణాలకు అనుకూలమంటూ వచి్చన నిందల పర్యవసానంగా పారీ్టకి రాజీనామా. 1937లో పార్టీ నేతల వినతితో తిరిగి చేరిక. ఆగస్టు 8 1942 క్విట్ ఇండియా ఉద్యమం భారత్‌కు అధినివేశ ప్రతిపత్తి ఇస్తామంటూ క్రిప్స్ రాయబారం. కాంగ్రెస్ తిరస్కరణ. స్వాతంత్య్రం తప్ప మరేదీ సమ్మతం కాదని తేల్చిచెప్పాక గాంధీతోపాటు పలువురు నేతల అరెస్టు. బ్రిటిష్ పాలకులు దేశం వదిలిపోవాలంటూ ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం. ఆగస్టు 15/1947 స్వాతంత్య్ర భానూదయం దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విభజించి ఇరు దేశాలకూ స్వాతంత్య్రం ప్రకటిస్తూ ప్రకటన. జనవరి 30 /1948 మహాభి నిష్క్రమణం హిందువుల ప్రయోజనాలు దెబ్బతీస్తూ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రార్థనా సమావేశంలో ఉన్న గాం«దీజీని కాల్చి చంపిన దుండగుడు నాథూరాం వినాయక్ గాడ్సే. ►గాంధీజీకి తొలి సంతానంగా ఒక పాప పుట్టి మూడు నాలుగు రోజులకే చనిపోయింది. తాను చేసిన తప్పునకు దేవుడు విధించిన శిక్షగా భావించి దాన్ని అంగీకరించారు. ►నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న ఐదుగురు నేతలు– మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (అమెరికా), నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా), అడాల్ఫో పెరెజ్ ఎస్క్వవెల్(అర్జెంటీనా), దలైలామా (టిబెట్), ఆంగ్‌సాన్ సూకీ (మయన్మార్)– తమ మీద గాంధీజీ ప్రభావం ఉందని చెప్పుకున్నారు. ►రచయితలు, చింతనాపరులు జాన్ రస్కిన్ (బ్రిటన్), లియో టాల్‌స్టాయ్ (రష్యా), ఎడ్వర్డ్ కార్పెంటర్ (బ్రిటన్) రచనల వల్ల అమితంగా ప్రభావితం అయ్యారు గాంధీజీ. వాళ్లను తన గురుతుల్యులుగా పేర్కొన్నాడు. నేటికీ.. అవసరం ఆయన్ను జార్జి బెర్నార్డ్ షా హిమాలయాలతో సరిపోల్చాడు... మహామేధావి ఐన్స్టీన్కైతే ప్రపంచ రాజకీయవేత్తల్లో ఏకైక వివేకవంతుడిగా కనబడ్డాడు... మారి్టన్ లూథర్‌కింగ్‌కు ఆయన క్రీస్తు... బరాక్ ఒబామాకు నిజమైన హీరో... మొత్తంగా అందరికీ మహాత్ముడు! ఒక అమ్మ కడుపున జన్మించి మూడు యాభైలు గడిచినా ఇప్పటికీ దేశంలోనే కాదు ప్రపంచమంతటా ప్రభావం చూపుతున్నాడంటే ఆయన నిస్సందేహంగా అసాధారణ మానవుడు. అప్పుడు నెల్సన్ మండేలాకైనా, ఆ తర్వాత కాలంలో మారి్టన్ లూథర్కింగ్కైనా, పదేళ్ల కిందట అరబ్ ప్రపంచాన్ని చుట్టుముట్టి నియంతలను గడగడలాడించిన ‘జాస్మిన్ విప్లవానికైనా, ఇప్పుడు మనకళ్లముందు సాగుతున్న హాంకాంగ్ హక్కుల ఉద్యమానికైనా మహాత్ముడే వెలుగు కిరణాలు విరజిమ్మిన మార్తాండుడు. కాలావధులు దాటి నిరంతరాయంగా స్వేచ్ఛా పరిమళాలను వెదజల్లే బలమైన ప్రభావం. నిన్నమొన్న ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో ఒక పాఠశాల కుర్రాడు ఆయుష్ చతుర్వేది చేసిన ఉద్వేగభరిత ప్రసంగం గాందీజీ వర్తమాన అవసరాన్ని నొక్కిచెప్పింది. బక్కపలచగా, ఒంటిపై అంగవస్త్రం తప్ప మరేమీ లేకుండా సర్వసంగ పరిత్యాగిలా కనబడే మహాత్మాగాం«దీలో ఏమిటింత గొప్పతనం? ఆయనంటే ఈనాటికీ ఎందుకింత ఆరాధన? ఇదేమిటి... మనమధ్య నుంచి ని్రష్కమించి ఏడు పదులు గడుస్తున్నా ఇంకా ఆయనను భిన్న కోణాల్లో దర్శిస్తూ, కొత్తకొత్తగా విశ్లేíÙçస్తూ, ఆయన మూర్తిమత్వాన్ని కళ్లకు కడుతూ ఏడాదికో, రెండేళ్లకో పుస్తకాలు వెలువడటమేమిటి? వింతగా లేదూ...?! ఆయనకంటే నాలుగైదేళ్ల తర్వాతే కావొచ్చుగానీ మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించాక గాం«దీజీ రాజకీయాలను, ఆయన ఉద్యమ నిర్వహణ తీరును కమ్యూనిస్టు పార్టీ పలు సందర్భాల్లో నిశితంగా విమర్శించింది. ఆయన వేస్తున్న అడుగులు సరికాదని హెచ్చరించింది. ఆ ఎత్తుగడలన్నీ సామ్రాజ్యవాదులకే అంతిమంగా ఉపయోగపడతాయన్నది. కానీ అది రష్యా తరహాలో ఇక్కడొక లెనిన్‌ను సృష్టించుకోలేకపోయింది. చైనాలో మావోలా విప్లవోద్యమ సారథికి పురుడు పోయలేకపోయింది. వియత్నాంలో వలే ఇక్కడ హోచిమిన్ జాడలేదు. దశాబ్దం క్రితం మన పొరుగునున్న నేపాల్ మాదిరి రాచరికాన్ని కూలదోసిన ‘ప్రచండ’ కూడా లేడు. కానీ గాంధీజీ అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నాడు, ఉంటాడు. ఐదు దశాబ్దాల క్రితం మార్క్సిస్టు దిగ్గజం నంబూద్రిపాద్ ఓ మాటన్నారు. భారత రాజకీయాల్లో గాంధీజీ పాత్రను సరిగా విశ్లేషించుకొని, సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోవడమే కమ్యూనిస్టుల వైఫల్యానికి ప్రధాన కారణమని వివరించారు. గాం«దీజీ మూలాలు గ్రామీణ భారతంలో, అక్కడి జీవనంలో పెనవేసుకుపోయి ఉన్నాయన్నది నంబూద్రిపాద్ విశ్లేషణ. కనుకనే అప్పుడప్పుడూ వెనక్కి తగ్గినట్టు కనబడినా, ఎదురుదెబ్బలు తప్పకున్నా మొత్తంగా గాంధీజీ పురోగమనశీలిగా, లక్ష్య సాధకుడిగా రూపుదిద్దుకున్నాడని ఆయన వివరించారు.గాందీజీ ఉద్యమనాయకుడు మాత్రమే కాదు... ఆవిర్భవించబోయే రేపటి భారతానికి ముందే సిలబస్ తయారు చేసిన దార్శనికుడు. ఆయన ప్రవచించిన స్వదేశీ ఆర్థిక వ్యవస్థ, గ్రామ స్వరాజ్యం ఈనాటికీ శిరోధార్యాలు. ఆయన స్పృశించని అంశం లేదు. అందులో స్త్రీ, పురుష సమానత్వం, సంçస్కృతి చదువు, నిరాడంబరత, సత్యాహింసలు, ఆధ్యాత్మికత, నైతిక విలువలు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, కులమత వివక్షలు, భాష తదితరాలన్నీ ఉన్నాయి. ఆయన దృష్టికోణం నుంచి తప్పుకున్నదేదీ లేదు. సమస్త అంశాలూ ఆయన అధ్యయనం చేశాడు. సరైన దోవ ఏదో చెప్పాడు. అవతలివారి అభిప్రాయాలకు విలువనిచ్చాడు. ఒక్కోసారి వాటికి అనుగుణంగా తానూ మారాడు. అవతలివారి ఆచరణను చూశాడు. అందులో నేర్చుకోదగినవాటిని స్వీకరించాడు. స్వాతంత్య్రం సిద్ధించాక పాలకులు వాటిని విస్మరించి ఉండొచ్చు. కొన్నిటిని నామమాత్రంగా అమలు చేస్తూండొచ్చు. సమాజంలో చివరాఖరి సాధారణ మానవుడికి సైతం అభివృద్ధి ఫలాలు దక్కినప్పుడే అది నిజమైన స్వాతంత్య్రం అవుతుందని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు గాం«దీజీ. అన్నిటికన్నా పేదరికమే అత్యంత హీనమైన హింస అని చెప్పాడు. ‘మనకో, మనకు తెలిసినవారికో అనుకోనిది ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ అంతమాత్రాన మానవత్వంపై విశ్వాసం పోగొట్టుకోవద్దు’ అని హితవు చెప్పాడు. కొన్ని చుక్కల నీరు కల్మషమైతే సముద్రం చెడిపోయినట్టేనా అని ప్రశ్నించాడు. మన వ్యక్తిగత జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, ప్రవర్తనను, చదువులను, కొలువులను, పాలననూ, పద్ధతులను గాంధీ కొలమానంలో ఎప్పటికప్పుడు చూసుకుంటేనే... చూసి సరిచేసుకుంటేనే ఈ దేశం సవ్యంగా మనుగడ సాగించగలదని పదేపదే రుజువవుతోంది. – డా. నాగసూరి వేణుగోపాల్ -
గుండ్లపొట్లపల్లి సర్పంచ్‌కు అరుదైన గౌరవం
సాక్షి, జడ్చర్ల : సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామాభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేస్తూ.. వందశాతం ఓడీఎస్‌తోపాటు వందశాతం ఇంటింటికీ ఇంకుడు గుంతలు పూర్తి చేసినందుకు గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ 2019కి సందర్బంగా గుండ్లపొట్లపల్లి సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి ఈ నెల 30న, అక్టోబర్ 1, 2 తేదీల్లో అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోదీ చేతులమీదుగా అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. కార్యక్రమానికి దేశంలో గ్రామాభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న 240 మందికి ఆహ్వానం అందగా.. రాష్ట్ర నుంచి 12 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గుండ్లపొట్లపల్లి సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డికి అవకాశం ద క్కింది. అంతేకాకుండా ఈ నెల 25న ఢిల్లీలో డాక్టర్ శ్యాంప్రసాద్‌ముఖర్జీ జాతీయ ఎక్సలెన్సీ అవార్డును సైతం అందుకోవాలని సోమ వారం ఢిల్లీలోని చాణక్య ఫౌండేషన్ స్వ చ్ఛ భారత్ అభియాన్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆహ్వనం అందింది. -
గాంధీ జయంతి నుంచి.. గ్రామ సురాజ్యం
సాక్షి, అమరావతి: జన్మభూమి కమిటీల మాదిరిగా లంచాల వసూళ్లు, పైరవీలు, ప్రజా ప్రతినిధుల సిఫారసులకు ఇక ఏమాత్రం తావు లేకుండా అక్టోబర్ 2వతేదీ నుంచి గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు కలలకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట, ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో సీఎం వైఎస్ జగన్ గ్రామ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లనున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ప్రధానంగా పల్లె ప్రజానీకం జన్మభూమి కమిటీల కబంధ హస్తాల్లో నలిగిపోయారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు ఏవి కావాలన్నా జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. గ్రామ వలంటీర్ల నియామకంతో ఇలాంటి దారుణాలకు శాశ్వతంగా తెర పడనుంది. సంక్షేమ ఫలాలు నేరుగా ఇళ్ల వద్దకే.. గ్రామాల్లో ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు చేసి వాటికి అనుబంధంగా 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం ద్వారా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అర్హుల ఇళ్లకు నేరుగా చేరనున్నాయి. ఇక రేషన్‌కార్డు కావాలన్నా, పింఛన్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఇతర సర్టిఫికెట్లు అవసరమైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యమంత్రి లేదా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో పనిలేదు. టీడీపీ పాలనలో ఏవి కావాలన్నా జన్మభూమి కమిటీల సిఫార్సుతోపాటు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి ఆమోదిస్తేనేగానీ మంజూరయ్యేవి కావు. రేషన్ కార్డులు, పింఛన్ల కోసం ఏకంగా సచివాలయానికి రావాల్సిన దుస్థితిని గత పాలకులు కల్పించారు. వ్యయ ప్రయాసలకోర్చి అంతదూరం వచ్చినా మంజూరవుతాయనే నమ్మకం లేదు. అంతా 72 గంటల్లోనే... ఇలాంటివాటికి పూర్తి భిన్నంగా పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలను అర్హులకే నేరుగా వారి ఇళ్ల వద్దే అందచేసే వినూత్న కార్యక్రమానికి అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడానికి రాజకీయాలు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు చూడబోమని... అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలను అందిస్తామని, పైసా లంచం ఇవ్వకుండానే ప్రయోజనాలను నేరుగా ఇంటి వద్దకే పంపిస్తానని పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ప్రజా ప్రతినిధుల సిఫారసులు అవసరం లేని వ్యవస్థను గ్రామ సచివాలయాల ద్వారా ముఖ్యమంత్రి తెస్తున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాల మంజూరు ప్రక్రియ అంతా ఆన్లైన్లో 72 గంటల్లోనే పూర్తి కావాలని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా ఆన్లైన్ వ్యవస్థను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. అధికార వికేంద్రీకరణతోపాటు పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను కూడా తెస్తున్నారు. ఈ పథకాల మంజూరు అధికారాన్ని తహసీల్దారుకు అప్పగించనున్నారు. తహసీల్దారు 12 గంటల్లోగా మంజూరు లేదా తిరస్కరించడం చేయకుంటే ఆటోమెటిక్‌గా మంజూరు అయ్యేలా ఆన్లైన్ వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నారు. దరఖాస్తు నుంచి కార్డు దాకా... అంతా ఇంటి వద్దే – ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తారు. – గ్రామ వలంటీర్లు ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులను ప్రాథమికంగా గుర్తిస్తారు. – రేషన్‌కార్డులు / పింఛన్లకు అర్హుల నుంచి వలంటీర్లు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సచివాలయంలో సమర్పిస్తారు. – గ్రామ సచివాయలంలోని పది మంది ఉద్యోగుల్లో సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగి దరఖాస్తుదారుడికి అర్హత ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. – అనంతరం గ్రామ సచివాలయంలో ఉద్యోగి తగిన సిఫార్సుతో సెంట్రల్ సర్వర్‌కు ఆన్లైన్లో దరఖాస్తు పంపిస్తారు. – సెంట్రల్ సర్వర్‌లో సంబంధిత శాఖ అంటే రేషన్‌కార్డు అయితే పౌరసరఫరాల శాఖ, పింఛన్ అయితే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రజాసాధికార సర్వే, ఆధార్ నెంబర్ ఆధారంగా దరఖాస్తుదారుడి అర్హత వివరాలను మరోసారి పరిశీలిస్తారు. – ఆ తరువాత అర్హతలపై తగిన సిఫార్సులతో దరఖాస్తును సంబంధిత తహసీల్దారుకు ఆన్లైన్లో పంపిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ఆధారంగా అర్హులకు తహసీల్దారు 12 గంటల్లోగా రేషన్‌కార్డు లేదా పింఛన్ మంజూరు చేస్తారు. ఒకవేళ పని ఒత్తిడి లేదా అలసత్వం కారణంగా 12 గంటల్లోగా మంజూరు చేయకుంటే దరఖాస్తు ఆటోమెటిక్‌గా గ్రామ సచివాలయానికి ఆన్లైన్లో వెళుతుంది. అలా వెళ్లిన దరఖాస్తును మంజూరు చేసినట్లే భావిస్తారు. – ఆన్లైన్లో తిరిగి గ్రామ సచివాలయానికి అందిన వివరాల ఆధారంగా రేషన్‌కార్డును ప్రింట్ చేస్తారు. దీన్ని వలంటీర్ల చేతికి ఇస్తారు. – అనంతరం గ్రామ వలంటీర్ ఆ కార్డును దరఖాస్తుదారుడి ఇంటికి తీసుకెళ్లి అందజేస్తారు. – ఈ ప్రక్రియ అంతా 72 గంటల్లోనే పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. – ఒక్కోసారి 72 గంటల సమయం కూడా పట్టదని, ఇంకా తక్కువ వ్యవధిలోనే అర్హులకు ప్రయోజనాలు అందుతాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. – ఒకవేళ ఎవరైనా దరఖాస్తుదారుడికి అర్హత లేదని తేలితే నిర్థారించుకునేందుకు మూడో పార్టీ ద్వారా మరోసారి పరిశీలిస్తారు. అప్పుడు కూడా అనర్హుడని తేలితే కారణాలను తెలియచేస్తూ గ్రామ వలంటీర్ ద్వారా సమాచారం అందచేస్తారు. – ప్రభుత్వం నవరత్నాల ద్వారా అందించే అన్ని రకాల ప్రయోజనాలను వలంటీర్లు అర్హుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయనున్నారు. – నాణ్యతతో కూడిన బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార బ్యాగ్‌లను వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు పంపిణీ కార్యక్రమాన్ని తొలిదశలో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని దశలవారీగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు. – వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెడుతున్నప్పటికీ రేషన్ డీలర్లను తొలగించరు. రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా నియమిస్తారు. -
150 కి.మీ. పాదయాత్ర చేయాలి
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిలను పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీలందరూ అక్టోబర్ 2 నుంచి 31 వరకు వారి వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని అన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ప్రధాని మోదీ కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. అలాగే పార్టీ బలహీనంగా నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు పర్యటించాలని మోదీ సూచించారు. మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2, వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31లను పురస్కరించుకుని బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా ఈ పాదయాత్ర నిర్వహించాలని మోదీ తెలిపారు. పాదయాత్రలో ముఖ్యంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం పట్ల అభిప్రాయాన్ని ఎంపీలు తెలుసుకోవాలని, అలాగే ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో అడగాలని అన్నారు. యాత్రలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. -
గాంధీకి ‘కాంగ్రెషనల్ గోల్డ్‌మెడల్’
న్యూఢిల్లీ: శాంతి, సహనం, అహింసను బోధించిన మహాత్ముడి జయంతిని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంది. గాంధీ బోధనలను ఆచరించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా గాంధీ గొప్పదనాన్ని కీర్తిస్తూ ఆయన 149వ జయంత్యుత్సవాలు జరుపుకున్నారు. మహాత్ముని స్ఫూర్తిదాయక జీవితానికి గుర్తింపుగా ఆయనకు అమెరికా కాంగ్రెస్ అత్యున్నత పౌర పురస్కారం ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను ఇవ్వనుంది. ఈ దిశగా అమెరికా కాంగ్రెస్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. బ్రిటన్‌లో దౌత్యకార్యాలయం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గాంధీ బోధనలను గుర్తుచేసుకుంటూ ‘బాపుః150’ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఐరాస ప్రధాన కార్యదర్శి సహా ప్రముఖులు గాంధీకి పుష్పాంజలి ఘటించారు. గాంధీ బోధనలను అలవర్చుకుని దేశ సేవకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. గాంధీకి సరైన గుర్తింపు ప్రపంచశాంతికి మహాత్ముని బోధనల స్ఫూర్తిని, శాంతి, అహింసలను పాటించిన గాంధీ గొప్పదనాన్ని గుర్తిస్తూ.. ప్రతిష్టాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ ఇవ్వాలంటూ అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఉమెన్ కరోలిన్ మేలోనీ సెప్టెంబర్ 23న ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. భారత అమెరికన్ చట్టసభ్యులైన అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌లు మద్దతు తెలిపారు. భారత్, భారత అమెరికన్లపై అమెరికా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలైన తులసీ గబ్బార్డ్ కూడా ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చొరవ తీసుకున్నారు. అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను గాంధీకి ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కమిటీ, అత్యవసర చర్యల పరిపాలన కమిటీకి పంపించారు. దేశవ్యాప్తంగా.. భారతదేశవ్యాప్తంగా గాంధీ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలు, స్వచ్ఛత కార్యక్రమాల ద్వారా గాంధీకి యావద్భారతం ఘనంగా నివాళులర్పించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాజకీయ ప్రముఖులు వివిధ దేశాల దౌత్యవేత్తలు రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో మహాత్ముడిని స్మరించుకుంటూ 15 అడుగుల పొడవు, 9 అడుగుల ఎత్తయిన చరఖాను ప్రదర్శించారు. చైనా రాజధాని బీజింగ్‌లో, ఇజ్రాయెల్‌లోనూ గాంధీ జయంతిని నిర్వహించారు. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో భారత పోస్టల్ శాఖ రూపొందించిన గాంధీ స్మారక స్టాంపును విడుదల చేశారు. 124 మంది కళాకారులతో.. గాంధీ జయంతిని పురస్కరించు కుని భారత విదేశాంగ శాఖ ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలో జరిగిన మహాత్మా గాంధీ అంతర్జాతీయ పారిశుద్ధ్య సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాన మంత్రి మహాత్ముడిపై విదేశాంగ శాఖ రూపొందించిన ఓ సంగీత దృశ్యాన్ని విడుదల చేశారు. ఇందులో 40 దేశాలకు చెందిన 124 మంది కళాకారులు మహాత్ముని ప్రీతిపాత్రమైన భక్తి గీతం ‘వైష్ణవ జన్తో తేనె కహీయే’ను తమ తమ వాయిద్యాలతో ప్రదర్శించారు. ఐదు నిమిషాల నిడివితో అద్భుతంగా రూపొందించిన ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. రాజకీయ పార్టీలు, ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య లక్ష్యాలను చేరుకోవడం పెద్ద కష్టమేం కాదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మరో స్వాతంత్య్ర పోరాటం
సేవాగ్రామ్/వార్ధా (మహారాష్ట్ర): ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో హింస, ద్వేషాలను వ్యాప్తి చేస్తూ ప్రజలను విడగొడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వంపై రెండో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ఆ పార్టీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ 149వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధా జిల్లా సేవాగ్రామ్ ఆశ్రమంలోని మహాదేవ్ భవన్లో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ద్వేష, హింసా పూరిత సిద్ధాంతాలే మహాత్ముడిని బలిగొన్నాయనీ, ఇప్పుడు అవే సిద్ధాంతాలను బీజేపీ అవలంబిస్తూ పైకి మాత్రం తాము అహింసా మార్గంలో వెళ్తున్నామని బూటకపు మాటలు చెబుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. రైతుల ర్యాలీని కేంద్రం ఢిల్లీ సరిహద్దుల్లో అడ్డుకుని వారిపై పోలీసు బలగాన్ని ప్రయోగించడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామంది. 1942లో సేవాగ్రామ్‌లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం మహాత్మా గాంధీ అధ్యక్షతన జరగ్గా క్విట్ ఇండియా ఉద్యమంపై నాడు తీర్మానం చేశారు. మళ్లీ 1948లో రెండోసారి తర్వాత సీడబ్ల్యూసీ భేటీ సేవాగ్రామ్‌లో జరగడం ఇది మూడోసారి. మహాత్మా గాంధీ బతికున్నప్పుడు ఆయనను దూషించి, తిరస్కరించి, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ఆయన మరణానికి కారణమైన ఆరెస్సెస్ ఇప్పుడు తాము మహాత్ముడి అనుచరులమని సిగ్గులేకుండా చెప్పుకుంటోందంటూ చేసిన ఓ తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఢిల్లీకి ర్యాలీగా చేరుకుంటున్న రైతులపై పోలీసు బలగాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన మరో తీర్మానాన్ని కూడా సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఈ భేటీకి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర నేతలు హాజరయ్యారు. తమ ప్లేట్లు కడిగిన సోనియా, రాహుల్ సేవాగ్రామ్‌లో భోజనం అనంతరం సోనియా గాంధీ, రాహుల్‌లు తాము తిన్న ప్లేట్లను తామే కడిగారని పార్టీ నాయకుడొకరు చెప్పారు. గాంధీజీ నివాసంలో జరిగిన ప్రార్థనలకు రాహుల్ హాజరయ్యారన్నారు. రాహుల్‌తోపాటు సోనియా, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జయంతి సందర్భంగా జాతిపితకు నివాళులర్పించారు. ఆశ్రమంలో రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో ఓ మొక్క నాటగా ఇప్పుడది పెద్ద చెట్టు అయ్యింది. ఆ చెట్టు పక్కనే రాహుల్ గాంధీ కూడా మంగళవారం మరో మొక్క నాటారు. వారంతా గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకమే: రాహుల్ మహాత్మాగాంధీ సమాజంలో సామరస్యం, శాంతి కోసం తన ప్రాణాలను త్యాగం చేశారనీ, కేంద్ర ప్రభుత్వంలోని మోదీ, ఇతరులు మాత్రం మహాత్ముడి సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశాన్ని విడదీయడం, అబద్ధపు హామీలివ్వడమే పనిగా కేంద్రం పనిచేస్తోందని దుయ్యబట్టారు. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని వార్ధాలో ర్యాలీని రాహుల్ ప్రారంభించారు. ‘గాంధీజీ ఏ సిద్ధాంతాల కోసమైతే తన ప్రాణాలను అర్పించారో అవే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోదీ ప్రతిరోజు పనిచేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
‘ఓటును అమ్ముకోం..’
కొడిమ్యాల (చొప్పదండి): తాము ఎట్టి పరిస్థితుల్లో ఓటును అమ్ముకోబోమని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామస్తులు ప్రతినబూనారు. గాంధీ జయంతి సం దర్భంగా పార్టీలకతీతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రలోభాలకు లొంగకుండా సమర్థుడైన అభ్యర్థికి పట్టం కట్టినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటుకు నోటును వ్యతిరేకించాలని తీర్మానించారు. మంగళవారం సమావేశమైన గ్రామస్తులు.. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. -
ఓం..శాంతి పట్టు!
గాంధీజీ 150 వ జయంతి రేపు. సమాజంలోని అణువణువులో ఆయన ప్రవచించిన అహింస.. ఓంకార నాదంలా ధ్వనిస్తోంది. శాంతి మార్గమై నడిపిస్తోంది. జ్యోతిరెడ్డి ఆ ధ్వనికి... ప్రతిధ్వని అయ్యారు. ఆ శాంతిమార్గంలో ఓ ‘పట్టు’ కొమ్మ అయ్యారు. పట్టుకు ఆయువు పట్టు అయిన పురుగు ప్రాణం తియ్యకుండా దారాన్ని సేకరించే ‘ఇంటెలిజెంట్ డిజైనర్’ అయ్యారు. ‘‘ప్రకృతి మనకు పత్తితోపాటు పట్టును కూడా ఇచ్చింది. పట్టు కోసం పట్టు పురుగును పెంచి, చంపడం అనే అమానుషానికి పాల్పడనక్కర్లేదు’’ అంటారు జ్యోతిరెడ్డి. అందంగా కనిపించడానికి చక్కటి పట్టు దుస్తులు ధరించాలనుకుంటాం. అందుకోసం పట్టు పురుగు మనకు అమూల్యమైన సేవలందిస్తోంది. దాని జీవితమంతా పట్టును పుట్టించడంలోనే గడుపుతుంది. పట్టు పురుగులు మల్బరీ ఆకులను తిని తమ చుట్టూ గూడు అల్లుకుంటాయి. అదే పట్టుగూడు. పురుగు గూడు లోపల ఉంటుంది. ఆ పట్టు గూళ్లను వేడి నీటిలో వేసినప్పుడు దారం వస్తుంది, కానీ పురుగు ప్రాణం పోతుంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న పట్టు సేకరణ విధానంలో పట్టు దారం కోసం పట్టు పురుగును నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అహింసాయుతంగా జీవించడానికి గాంధీజీ చెప్పినట్లు ‘విలువైనది మనిషి ప్రాణం మాత్రమే కాదు, అన్ని జీవుల ప్రాణమూ అంతే సమానమైనది’ అని జ్యోతిరెడ్డి నమ్ముతారు. నిజమే. మన మనుగడ కోసం ప్రాణుల్ని చంపాల్సి రావడాన్ని తప్పు పట్టలేం. కానీ మన అందం, ఆనందం కోసం ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. అహింస పట్టు ప్రకృతి మనకు జీవించడానికి అన్ని వనరులనూ ఇచ్చింది. అలాగే హింసకు తావులేని పట్టును కూడా ఇచ్చింది. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పెరిగే పట్టు పురుగులు స్వేచ్ఛాజీవులు. వాటికి ఆముదం ఆకులే ఆహారం. అక్కడ ఆముదం చెట్లు విస్తారంగా ఉంటాయి. ఆ పట్టుపురుగులు తమ చుట్టూ గూడు కట్టుకోవు. ఆకుల మీద పట్టు దారాలతో గూడు అల్లుతాయి. కొన్నాళ్లకు పాత గూడుని వదిలి మరో ఆకు మీదకు వెళ్లి కొత్త గూడు అల్లుతాయి. స్థానిక గిరిజనులు పురుగు వెళ్లిపోయిన ఆకును ఇట్టే గుర్తించగలుగుతారు. అలాంటి ఆకుల నుంచి మాత్రమే పట్టును సేకరిస్తారు. అంతే తప్ప పట్టు కోసం పురుగుకు హాని కలిగించరు. వారి జీవనం లాగానే వారి పట్టు వస్త్రాల తయారీ కూడా శాంతియుతంగానే ఉంటుంది. పట్టుదారం వడకడం, పట్టు వస్త్రాలను నేయడం అసోంలో కుటీరపరిశ్రమ. ఆ వస్త్రాలను పవిత్రంగా భావిస్తారు. పండుగలు, వేడుకలప్పుడు ధరిస్తారు. అహింసాయుత జీవితాన్ని ఆచరించే జైన, బౌద్ధులు ఈ వస్త్రాలను ధరిస్తారు. నేను వెదికింది అదే ‘ద వరల్డ్ నీడ్స్ ఇంటెలిజెంట్ ఫ్యాబ్రిక్ ’అన్న మాటలే తనను ఈ శాంతి పట్టు వైపు నడిపించాయంటారు జ్యోతి. ‘‘ఎక్స్పోర్ట్ వ్యాపారంలో అంతర్జాతీయ ట్రేడ్ షోలకు వెళ్లినప్పుడు ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ అన్న ఆ మాటకు అర్థం అప్పట్లో తెలియలేదు. ఇండియాకి వచ్చిన తర్వాత నా పనుల్లో నేను ఉన్నప్పటికీ వస్త్రరంగం మీద పరిశోధన మొదలు పెట్టాను. అంతకుముందు నేనే సొంతంగా డిజైన్ చేస్తూ బొటీక్ నడిపిన అనుభవాన్ని జోడించి రకరకాల వస్త్రరీతులను అధ్యయనం చేశాను. అందులో భాగంగా ముంబయిలో నాకు తెలిసిన డిజైనర్లతో కూడా మాట్లాడాను. అసోం గిరిజనులు పట్టు దారాన్ని సేకరించే విధానం, ఎరికల్చర్, ఎరి సిల్క్‌తో చేనేత గురించి తెలిసింది. ఓపెన్ కకూన్ని చూద్దామని వెళ్లాను. అక్కడ ఇది కుటీరపరిశ్రమ. ఇంట్లో అందరూ పని చేస్తారు. పట్టు దారం వడకడం నుంచి వస్త్రం నేయడం వరకు అన్నింటినీ స్వయంగా చేస్తారు. ప్రతి ఇంటి ముందు వెదురు కర్రల ఫ్రేమ్ ఉంటుంది. పట్టు వస్త్రం మీద కళాత్మకమైన డిజైన్‌తో నేసి ఆ ఫ్రేమ్‌కి తగిలిస్తారు. ఎవరి డిజైన్ వాళ్లదే. తల్లి నుంచి కూతురు నేర్చుకుంటుంది, ఆమె మరింత సృజనాత్మకత జోడించి కొత్త డిజైన్‌ను రూపొందిస్తుంది. అది ఆ కుటుంబానికే సొంతం. ఆ వస్త్రం చాలా అందంగా, ఒంటికి హాయిగా ఉంటుంది. రోజంతా ధరించినా ఒక్క ముడత కూడా పడదు. ఎన్ని రకాలుగా కట్టినా చక్కగా అమరిపోతుంది. ఆ పట్టు మీద మరెన్నో ప్రయోగాలు చేయవచ్చనిపించింది. ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ అన్న మాటల అర్థం అప్పుడు తెలిసింది. నిజంగా అది ఇంటెలిజెంట్ ఫ్యాబ్రికే. దీని మీద ఐదేళ్ల పాటు పరిశోధించాను. సురయ్యా హసన్ బోస్, ఉజ్రమ్మ, బీనారావు వంటి వాళ్ల అనుభవాలను తెలుసుకున్నాను. అసోం టు అమెరికా అసోం పట్టు దారాన్ని సన్నగా చేయగలిగితే విప్లవమే తీసుకురావచ్చనిపించింది. ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నాలు చేసేటప్పుడు.. ‘దీని మీద సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించరాదు, మీ ఆలోచనను నిరూపించాలనే తపన ఉంటే మాత్రం ముందుకెళ్లవచ్చు’ అని చెప్పారు ఆడిటర్. నా ప్యాషనే నన్ను ముందుకు నడిపించింది. నాలాగే ఆలోచించే మరికొందరం కలిసి చైనా మిషనరీతో కో ఆపరేటివ్ విధానంలో ఫ్యాక్టరీ పెట్టాం. నాలుగు వందల మంది చేనేతకారులు మాతో పని చేస్తున్నారు. మేము తయారు చేస్తున్న సన్నటి దారాన్ని ఇకత్, జామ్దాని, పైథాని, జకార్డ్ నేతలతో మిళితం చేస్తున్నాం. అందుకోసం వివిధ రాష్ట్రాల్లో నిపుణులైన చేనేతకారులను కలిశాను. పుట్టపాక, పోచంపల్లి, చౌటుప్పల్ నుంచి కోల్‌కతా, మిడ్నాపూర్ వరకు మొత్తం ఎనభై మంది మాస్టర్ వీవర్స్ మాతో పని చేస్తున్నారు. వాళ్ల సంప్రదాయ డిజైన్లకు కొత్త రీతులను జోడించి వైవిధ్యంగా తెస్తున్నాం. కలంకారీ అద్దకం చేస్తున్నాం. నా ప్రయత్నం అన్నింటిలోనూ విజయవంతమైంది. కానీ అడ్డంకి ఒక్క బాతిక్ దగ్గరే వచ్చింది. ఓపెన్ కకూన్లు ఆముదం ఆకును తింటాయి, కాబట్టి వాటి నుంచి వచ్చిన పట్టు కూడా చాలా స్మూత్‌గా జారుడుగా ఉంటుంది. దాంతో బాతిక్ ప్రింట్ కుదరలేదు. బాతిక్ కోసం పట్టులో ఆర్గానిక్ కాటన్ మిక్స్ చేసి ప్రయోగం చేస్తున్నాం. ఎరీనా బ్రాండ్ కోసం... ఎరి సిల్క్‌లో ప్రయోగాలతోపాటు ఇప్పుడు మా ఉత్పత్తుల బ్రాండింగ్ మీద దృష్టి పెట్టాను. జర్మనీలో సిల్క్ ప్రమోషన్ కౌన్సిల్ ట్రేడ్ ఫెయిర్‌లో మా పట్టు వస్త్రాలకు మంచి ఆదరణ వచ్చింది. స్థానిక మ్యాగజైన్లలో మంచి కథనాలు రాశారు. అమెరికాకీ పరిచయం చేశాను. మనదేశంలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసుకోవడంలో ఇప్పటికే చాలా వెనుకపడిపోయాం. దాంతో కొన్ని తరాల వెనుక మన చేనేతకారుల్లో ఉండిన కళ యథాతథంగా తర్వాతి తరాలకు కొనసాగలేదు. ఇప్పుడు అనేక ప్యాటర్న్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఉన్న వాటినైనా పరిరక్షించుకుంటే.. ఇండియా వేల ఏళ్ల కిందటే ఫ్యాషన్‌కు ప్రతీక అని ప్రపంచానికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరినీ నేను కోరేది ఒక్కటే. ‘బయటి దేశాలకు వెళ్లినప్పుడు మన వస్త్రాలను ధరిస్తే... మనదేశానికి మనమే బ్రాండ్ అంబాసిడర్లం అవుతాం’. అలాగని చీరలే కట్టాల్సిన పనిలేదు. కుర్తాలు, దుపట్టాలు, స్టోల్స్ ధరించినా చాలు. మన దగ్గర ఉన్న కళాత్మకతను గర్వంగా ప్రదర్శించవచ్చు’’. జర్మనీ ఫ్రెండ్ నుంచి ఫోన్ కాల్ నేను పుట్టింది, పెరిగింది ముంబయిలో. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లాను. ఎంబీఏ అక్కడే చేశాను. పిల్లలిద్దరూ అక్కడే పుట్టారు. నాకేమో ఇండియా అంటే చాలా ఇష్టం. మనదేశంలో లేననే బెంగ ఉండేది. మా వారు (చంద్రశేఖర్) హైదరాబాద్‌లో బిజినెస్ ప్లాన్ చేయడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇండియాకి వచ్చేటప్పటికి పిల్లలు కొంచెం పెద్దయ్యారు. నేను కూడా ఏదైనా చేయాలనే ఆలోచనతో షూషాప్, బొటీక్ పెట్టాను. అమెరికాలో ఉన్న జర్మన్ ఫ్రెండ్‌కి ఎంబ్రాయిడరీ దుస్తులు ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఎక్స్‌పోర్టర్ హటాత్తుగా సప్లయ్ ఆపేయడంతో ఆమె నాకు ఫోన్ చేసింది. ఆమెకు వస్త్రాలను ఎక్స్పోర్ట్ చేయడం కోసం 1996లో ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలైంది. ఆ బిజినెస్‌ని విస్తరించడం కోసం వెళ్లిన ఫ్రాన్స్, స్వీడన్లలో ట్రేడ్ ఫెయిర్లతో శాంతియుతమైన ఎరి సిల్క్ బాట పట్టాను. డిన్నర్ టేబుల్ స్టోరీలు మా అమ్మానాన్నల అనుభవాలే మాకు పాఠాలు. నాన్న వరంగల్‌లో చిన్న గ్రామం నుంచి ముంబయికి వెళ్లారు. అక్కడ షిప్పింగ్ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. రాత్రి భోజనాలప్పుడు అన్ని విషయాలనూ చెప్తుండేవారు. ఒక సమస్యను అధిగమించడానికి ఎంత చాకచక్యంగా వ్యవహరించాలనేది ఆయన ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ మాలో వ్యాపార నైపుణ్యాలు పెరగడానికి అవన్నీ ఉపకరించాయి. అమ్మ ప్రతి పనినీ చాలా క్రియేటివ్‌గా చేసేది. అప్పట్లో మాకు భోజనాలకు కేసరోల్స్ ఉండేవి కాదు, స్టీలు గిన్నెలనే టేబుల్ మీద చక్కగా అమర్చేది. పూలను ఒకసారి కట్టినట్లు మరోసారి కట్టేది కాదు. ముగ్గులు కూడా నేర్చుకున్న వాటిని నేర్చుకున్నట్లు యథాతథంగా వేసేది కాదు. తన సృజనను జోడించేది. వీటన్నింటినీ చూస్తూ పెరిగాను. కాబట్టే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినా ఈ రంగంలో విజయవంతం కాగలుగుతున్నాను. నా ఈ ప్రయత్నంలో ప్రత్యక్షంగా వందల కుటుంబాలకు ఉపాధి దొరకడంతోపాటు పరోక్షంగా వేలాది కుటుంబాలకు రాబడి పెరుగుతోంది. భారతీయ వస్త్ర కళ అంతర్జాతీయ వేదిక మీద మన్ననలు పొందేలా చేయాలనేది నా ఆకాంక్ష. నా రక్తంలో భారతీయత ఉంది. దేశగౌరవాన్ని పెంచడానికి నా వంతుగా ఏదైనా చేయాలి. నేను చేస్తున్న దేశసేవ ఇది. -
మహాప్తుడు
‘‘అహింస గురించి, సత్యవాక్పాలన గురించి నేను ప్రపంచానికి కొత్తగా బోధించ వలసినదంటూ ఏమీ లేదు. ఎందుకంటే, సత్యం, అహింస అనాదినుంచి వస్తున్నవే’’ అనేవారు మహాత్మాగాంధీ. అహింసే ఆయుదంగా, సత్యాన్వేషణే మార్గంగా శాంతియుత సమరం సాగించి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహాత్ముడు కలలుగన్న భారతావని ఒక కర్మభూమి, వేదభూమి, సత్యభూమి. అంతటా వ్యాపించి ఉన్న సత్యనారాయణుని సాక్షాత్కరించుకోవాలంటే, ప్రతిజీవిని, ప్రతిప్రాణినీ ఆత్మస్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం. అలాంటి అభిలాష నన్ను జీవన స్రవంతికి దగ్గర చేసింది. సత్యారాధనే నన్ను రాజనీతిలోకి దింపింది. ధర్మానికీ రాజనీతికీ సంబంధం లేదని చెప్పేవారికి ధర్మమంటే ఏమిటో తెలియదని నేను గట్టిగా చెబుతాను. ఆత్మశుద్ధి లేనిదే అహింసా ధర్మపాలన సాధ్యపడదు. అంతరాత్మ– పరమేశ్వరుని దర్శనం పొందలేదు. అందువల్ల జీవనయానంలో ప్రతిభాగమూ పరిశుద్ధంగా ఉండటం అవసరం. ఇది అందరికీ సాధ్యమే. శుద్ధికావడమాటే, మనోవాక్కాయ కర్మేణ నిర్వికారుడూ కావడమే. రాగద్వేష రహితుడు కావడమే ఇట్టి నిర్వికార ప్రవృత్తికి దారితీస్తుంది అంటూ మహాత్ముడు ఈ లోకానికి మహత్తర ఆధ్యాత్మిక సందేశాన్నందించాడు. మహాత్ముడు ఆంగ్లదేశంలో ఉన్న రెండవ చివరిభాగంలో దివ్యజ్ఞాన సమాజంతో పరిచయం ఏర్పడింది. వారు సంస్కృతంలో భగవద్గీతపై సర్ ఎడ్డిన్ ఆర్నాల్డ్ చేసిన ఆంగ్లానువాదాన్ని చదవడానికి– గాంధీజీని ఆహ్వానించారు. అయితే గాంధీ అంతవరకూ గీతను చూడలేదు. దాంతో ఆయన సిగ్గుపడ్డారు. వారికావిషయం సంకోచంతోనే చెప్పారు. అప్పటినుంచి గీత చదవడం ఆరంభించారు. ద్వితీయార్థంలో గాంధీజీని రెండుశ్లోకాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆయనలో భగవద్గీత ఒక అమూల్యగ్రంథం అన్న భావన కలిగింది. తత్వజ్ఞానంలో దానితో సమానమైన గ్రంథం మరొకటి లేదని గాంధీజీ నమ్మకం. అందుకేనేమో, తన మనస్సు చెదిరినప్పుడల్లా భగవద్గీత తనకెంతో సాయపడిందన్నారు. కొంతకాలం తర్వాత మహాత్మునికి అదొక నిత్యపారాయణ గ్రంథమయ్యింది. గాంధీజీకి అనీబీసెంట్ పరిచయం అయ్యాక దివ్యజ్ఞాన సమాజంలో చేరమంటూ ఆయనను ఆహ్వానించారు. కానీ గాంధీజీ ‘నా మతాన్ని గురించే నాకు సరిగా తెలియదు. అటువంటి స్థితిలో ఇతర మతాలలో ఎలా చేరడం’ అని చెప్పి వినమ్రంగా వారి ఆహ్వానాన్ని నిరాకరించారు. తర్వాత ‘కీ టు థియాసఫీ’ అన్న గ్రంథాన్ని చదివారు. అది చదివిన తర్వాత గాంధీజికి హిందూమతగ్రంథాలు చదవాలన్న కోరిక కలిగింది. హిందూమతం మూఢనమ్మకాలమయం అని ఇతర మతస్థుల ప్రచారం తప్పు అన్న నమ్మకం గాంధీజీకి కలిగింది. ఆపత్సమయంలో ఏ వస్తువు మనిషిని రక్షిస్తుందో ఆ వస్తువు మనిషికి కనపడదు. కొందరు వారి తపస్సు, వేదాంతాధ్యయనం, సాధన, నిష్ఠాబలం రక్షించిందనుకుంటారు. కానీ నిష్ఠాబలం ఆపత్సమయంలో ఎందుకూ పనికిరాదు. అట్టి సమయంలో అనుభవంలేని శాస్త్రజ్ఞానం వృథా అంటారు గాంధీ. ఇక్కట్ల సమయంలో దేవుడే తనను రక్షించాడని మాత్రం గాంధీజీ మహాత్ముడు గాఢంగా నమ్మారు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయత్నాలలోనూ లాయరు పనిలోనూ, వేర్వేరు సంస్థలను నడపడంలోనూ, రాజకీయ వ్యవహారంలోనూ అనేక విషమ సంఘటనలలోనూ భగవంతుడు తనను రక్షించాడని గాంధీజీ నమ్మారు. ఉపాయాలు తోచనప్పుడు, ఆశలు అడుగంటినప్పుడు, ఎటునుండో ఆ సహాయం అందిందని మహాత్ముడు తన అనుభవపూర్వకంగా తెలియజేశారు. స్తుతి, ఉపాసన, ప్రార్థన వంటివి గుడ్డినమ్మకాలు కావన్నారు. ఇవి ఆహార విహారాదులకంటే అధికమైన సత్యాలన్నారు. ఈ ఉపాసన, ప్రార్థనలకు మూలం హృదయం. అందువల్ల భక్తితో నింపి హృదయాన్ని నిర్మలం చేసుకుంటే మనం అనంతంలోకి ఎగిరిపోగలం. ప్రార్థనకు జిహ్వతో పనిలేదు. అది స్వభావానికి సంబంధించింది. హృదయ పూర్వకమైన ఉపాసన ఉత్తమ సాధనం. అయితే ఆ ఉపాసన నమ్రత భావంతో మాత్రమే సాగాలన్నారు మహాత్ముడు.గాంధీజీ ఉపవాసం గురించి విపులంగా తెలియజేశారు. విషయ వాంఛలు అణగి ఇంద్రియ నిగ్రహం కలగాలంటే అందుకు ప్రత్యేకించి ఉపవాసాలు అవసరం అన్నారు. మనస్సును అదుపులో పెట్టుకోకుండా శారీరకంగా ఎన్ని ఉపవాసాలు చేసినా వ్రతాలు ఆచరించినా ఫలితం ఉండదన్నారు. మనస్సు రీత్యా ఉపవాసం చేయకపోతే అది దంబానికి కారణభూతం అవుతుంది. అది హానికూడా కలిగించవచ్చునన్నారు మహాత్ముడు.అట్టడుగు వర్గాలవారిని ఈ సమాజం అగౌరవ పరుస్తున్న తీరుకు మహాత్ముడు చలించిపోయాడు. వారిని హరిజనులు అంటూ భవంతునికి అత్యంత సన్నిహితులుగా తీర్చిదిద్దారు. సర్వమానవ సమానత్వం ప్రాతిపదికగా కొల్లాయిగట్టుకుని, చేతిలో ఊతకర్రతో వడివడిగా సాగిపోయే గాంధీని చూసి భారతీయులంతా మురిసిపోయి ‘మహాత్మా’ అంటూ చేతులెత్తి నమస్కరించేవారు. వందల సంవత్సరాల దాస్యం నుండి విముక్తి కలిగించి, దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన ఒక మహోన్నత త్యాగమూర్తి ఆయన. ప్రాణాలు కోల్పోయే క్షణాల్లో కూడా ‘హేరామ్’ అని భగవంతుని నామాన్ని జపించిన మహాభక్తుడు. ఆయన నమ్మి, అనుసరించి, ఆచరించిన సత్యం, అహింస, దైవభక్తి, నిరాడంబరతలే ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి గుండెల్లోనూ మహాత్ముడిగా గుడికట్టాయి. మహా ఆప్తుడిగా తీర్చిదిద్దాయి. విశ్వాసం భగవంతుడే కాదు, ఎవరిపైనైనా, దేనిమీదనైనా విశ్వాసం కలిగి ఉండడం అనేది కొద్దిపాటి గాలికి కొట్టుకుపోయేది కాదు. అది అచంచలమైనది. అనిర్వచనీయమైనది. అమోఘమైనది. అందువల్ల విశ్వాసం ఎప్పుడూ దృఢంగానే ఉండాలి. ఎంతటి అవమానాన్ని అయినా, మరెంతటి క్రోధాన్నైనా అవలీలగా ఎదుర్కోగల ఒకే ఒక్క ఆయుధం చిరునవ్వు. బాధపడటం మినహా మానవదేహాన్ని సర్వనాశనం చేసే అంశం మరొకటి లేదు. ఎటువంటి క్లిష్టపరిస్థితులెదురైనా నిజంగా ఆ భగవంతునిపై నమ్మకం ఉంచితే బాధపడుతున్నందుకు సిగ్గుపడాలి. – డా. పులివర్తి కృష్ణమూర్తి -
మనలో మననంలో
ఔను! గాంధీ ఉన్నాడు.చరిత్ర పుటల్లో ఎక్కడో చిక్కుకుపోయి లేడు.మనలో ఉన్నాడు, మననంలో ఉన్నాడు.ప్రతి విప్లవాత్మక ఆలోచనలోనూ మహాత్ముడు ఉన్నాడు.ప్రపంచంలో భారతావనికి ఉన్న కీర్తి ప్రతిష్ఠల్లో ఇప్పటికీ ఉన్నాడు.హింసను అహింసతో ఎదుర్కొన్న శౌర్యంలో ఉన్నాడు.మరి ఈ మహాత్ముడు రేపటి తరంలోనూ ఉండాలి.తరతరానికీ ఇంకా ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం. కత్తితో ఛేదించనిది కరుణతో సాధించాలి అనే అహింసా సూత్రాన్ని ఆచరణాత్మకంగా పాటించిన తొలి జాతీయ నాయకుడు ఆయన. అసలు పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అయినా, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అహింసామార్గంలో పోరాటం సాగించి, మహాత్మాగాంధీగా ప్రసిద్ధుడయ్యాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిని కూడగట్టి, ఏకతాటిపై నడిపించి, దేశ స్వాతంత్య్ర సముపార్జనలో కీలక పాత్ర పోషించి జాతిపితగా చరిత్రకెక్కాడు. గాంధీ మార్గం తర్వాతి కాలంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. అమెరికాలో నల్లజాతి వారి హక్కుల కోసం పౌరహక్కుల ఉద్యమాన్ని సాగించిన మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటాన్ని సాగించిన నెల్సన్ మండేలా వంటి వారు గాంధీ స్ఫూర్తితోనే తమ ఉద్యమాలు సాగించారు. సమాజంలో హింస పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో అహింసను బోధించిన మహాత్ముని ఒకసారి మననం చేసుకోవడం అవసరం. రేపటి తరాలకు వెలుగు బాటలు చూపగల మహాత్ముని మాటలు మీ కోసం... ►నా జీవితమే నా సందేశం. ►పొరపాట్లు లేని స్వేచ్ఛే లేకుంటే ఆ స్వేచ్ఛకు అర్థమే లేదు. ►ప్రపంచంలో ఏ మార్పును చూడాలనుకుంటున్నారో మీరే ఆ మార్పుగా మారండి. ►సత్యం ఒక్కటే, దాని మార్గాలే అనేకం. ►అందరూ కంటికి కన్ను అనే సూత్రం పాటిస్తే, ప్రపంచమే గుడ్డిదైపోతుంది. ►సత్యాన్ని పలకాల్సిన సందర్భంలో, దానికి అనుగుణంగా ముందుకు కదలాల్సిన సందర్భంలో మౌనం పాటించడం పిరికితనమే అవుతుంది. ►మనంతట మనమే ఇవ్వకుంటే ఎవరూ మన ఆత్మగౌరవాన్ని తీసుకుపోలేరు. ►సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్నే వణికించగలరు. ►నా బుద్ధి మేరకు ఒక గొర్రె ప్రాణం ఒక మనిషి ప్రాణం కంటే తక్కువ విలువైనదేమీ కాదు. ► ఏ పని చేసినా ఆ పనిని ప్రేమతో చేయండి. లేకుంటే, ఆ పనిని చేయనే చేయవద్దు. ► వాళ్లు నా శరీరాన్ని హింసించవచ్చు, నా ఎముకలను విరిచేయవచ్చు, చివరకు వాళ్లు నన్ను చంపేయవచ్చు. వాళ్లు నా శవాన్ని పొందవచ్చు తప్ప నా లొంగుబాటును కాదు. ► నా అనుమతి లేకుండా ఇతరులెవ్వరూ నన్ను గాయపరచలేరు. ►‘శాంతిమార్గం’ అంటూ ఏదీ ఉండదు. ‘శాంతి’ మాత్రమే ఏకైక మార్గం. ►మన చర్యల పర్యవసానాల నుంచి పారిపోవాలనుకోవడం పొరపాటు మాత్రమే కాదు, అనైతికం కూడా. ►అహింస దృఢమనస్కుల ఆయు«ధం. ►మీ ప్రత్యర్థి ఎప్పుడు మీకు తారసపడినా, అతడిని ప్రేమతోనే జయించండి. ►నిర్భీకతే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. పిరికితనం నైతికతకు అవరోధం. ►న్యాయమైన ప్రయోజనాన్ని సత్యం ఏనాడూ దెబ్బతీయదు. ►బలహీనులు ఇతరులను క్షమించలేరు. క్షమాగుణం బలవంతులకు మాత్రమే సాధ్యమైన సుగుణం. ►మీరు భయాన్ని నిరాకరిస్తే, ప్రపంచంలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ ఉండదు. ►నిజాయితీతో కూడిన అభిప్రాయభేదాలు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సంకేతాలు. ►ప్రేమ ఎక్కడ ఉంటుందో, జీవం అక్కడే ఉంటుంది. ►కొండంత ప్రబోధం కంటే ఇసుమంత ఓరిమి చాలా విలువైనది. ►బలం అనేది శారీరక సామర్థ్యం నుంచి వచ్చేది కాదు, చెక్కుచెదరని సంకల్పం నుంచి వచ్చేది. ►నాకే గనుక హాస్యస్ఫూర్తి లేకుంటే, ఏనాడో నేను ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. ►పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి. ►మీరు ఈ రోజు చేసే చర్యలపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ►పిరికివాళ్లు ప్రేమను ప్రదర్శించలేరు, అది ధైర్యవంతుల లక్షణం. ►ఈ భూమి ప్రతి మనిషి అవసరాలు తీర్చడానికి తగినంత ఇస్తుంది. కానీ, ప్రతి మనిషి లోభానికి తగినంత కాదు. ►ప్రార్థన అనేది ఉదయానికి తాళం చెవిలాంటిది, రాత్రికి గడియలాంటిది. ►ఏ రోజు ప్రేమకు గల శక్తి అధికారంపై గల ప్రేమను జయిస్తుందో ఆ రోజే ప్రపంచశాంతి సిద్ధిస్తుంది. ►మితభాషి అయిన మనిషి అనాలోచితంగా ఏదీ మాట్లాడడు. ►కర్మ మాత్రమే మనిషి నియంత్రణలో ఉంటుంది కానీ, దాని ఫలితం కాదు. ►సత్యాన్ని మించిన దైవం లేదు. ►పేదరికం అత్యంత దారుణమైన హింసారూపం. ►మూసి ఉన్న పిడికిలితో కరచాలనం చేయలేం. ►ప్రేమ ఎక్కడ ఉంటుందో, దైవం అక్కడే ఉంటుంది. ►నీ పొరుగువానిలో దేవుడిని కనుగొనలేనప్పుడు, దేవుని గురించిన నీ అన్వేషణ వ్యర్థం. ►వినయంతో చేయని సేవ స్వార్థమూ, అహంభావమే అవుతుంది. ►మనం ఏమీ చేయలేని రోజులు రెండే రెండు. అవి: నిన్న, రేపు. ►భయమే శత్రువు. మనం దానిని ద్వేషం అనుకుంటాం. నిజానికది భయమే! ►ప్రవర్తన అద్దంలాంటిది. అందులో మనల్ని మనం స్పష్టంగా చూసుకోగలం. ►వ్యక్తుల మధ్య దృఢంగా గల ప్రేమ పునాదులపైనే దేశాల మధ్య శాంతి ఆధారపడి ఉండాలి. ►క్రోధం, అసహనం సరైన అవగాహనకు జంట శత్రువులు. ►భగవంతునికి మతం లేదు. ►మనిషి తన ఆలోచనలకు తానే ప్రతిరూపం. మీరు మీ ఆలోచనలకు అనుగుణంగానే తయారవుతారు. ►ఎలాంటి కష్టం లేకుండా సిసలైన జీవితాన్ని గడపడం సాధ్యం కాదు. ►భౌతిక అనుబంధం కంటే ఆధ్యాత్మిక అనుబంధం గొప్పది. ఆధ్యాత్మికత లేని జీవితం ఆత్మ లేని శరీరంలాంటిది. ►మనం ఇతరులకు ఎంత సత్వరంగా న్యాయం చేయగలిగితే మనమూ అంతే సత్వరంగా న్యాయాన్ని పొందగలం. ►భగవంతుడు మనతో ప్రతిరోజూ మాట్లాడుతూనే ఉంటాడు. మనకే ►ఆ మాటలను ఎలా వినాలో తెలియదు. ►150 దేశాల తపాలా బిళ్లలపై గాంధీ బొమ్మ మనదేశంలో తపాలా బిళ్లల మీద, కరెన్సీ నోట్ల మీద, నాణేల మీద మహాత్మాగాంధీ బొమ్మ ఉండటం విడ్డూరం కాదు గానీ, ఏకంగా 150 దేశాలు మహాత్ముని బొమ్మతో తపాలా బిళ్లలు ముద్రించడం మాత్రం నిజంగా విశేషం. మహాత్మాగాంధీకి ప్రపంచవ్యాప్తంగా గల ఆదరణకు ఇదొక నిదర్శనం. దాదాపు రెండు దశాబ్దాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్‌వారి నుంచి విముక్తి కోసం గాంధీజీ స్వాతంత్య్ర పోరాటం సాగించారు. తమ దేశానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన గాంధీజీ బొమ్మతో బ్రిటన్ కూడా తపాలా బిళ్లలు ముద్రించడం మరింత విశేషం. బ్రిటిష్ రాచ కుటుంబీకుల బొమ్మలు తప్ప ఇతరుల బొమ్మలతో తపాలా బిళ్లలు, కరెన్సీ ముద్రించని బ్రిటన్‌లో గాంధీజీకి మాత్రమే ఈ విషయంలో మినహాయింపు లభించింది. అలహాబాద్‌కు చెందిన పప్పుదినుసుల వ్యాపారి అనిల్ రస్తోగికి స్టాంపుల సేకరణ హాబీ. ఆయన ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీ బొమ్మతో ముద్రితమైన 800 స్టాంపులను సేకరించి, తపాలాశాఖ ద్వారా సత్కారాన్ని పొందారు. రస్తోగీ సేకరణలో గాంధీజీ బొమ్మతో భూటాన్ ముద్రించిన ప్లాస్టిక్ స్టాంపు, ‘లీడర్ ఆఫ్ ట్వెంటీయత్ సెంచురీ’ పేరిట మైక్రోనేసియా ముద్రించిన అరుదైన స్టాంపులు కూడా ఉండటం విశేషం. దక్షిణాఫ్రికా, మాల్టా, సమోవా వంటి కొన్ని దేశాలు గాంధీజీ బొమ్మతో నాణేలు కూడా ముద్రించాయి. ప్రపంచ దేశాల్లో గాంధీజీ గాంధీజీ పుట్టి పెరిగిన భారత్‌లోను, ఉన్నత చదువులు చదువుకున్న ఇంగ్లండ్‌లోను, న్యాయవాదిగా పనిచేసిన దక్షిణాఫ్రికాలోను మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో గాంధీజీ విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... ►భారత్‌కు ఇంకా స్వాతంత్య్రం రాకముందే అమెరికాలో స్థిరపడిన జర్మన్ కళాకారుడు ఫ్రిట్జ్ ఈషెన్బర్గ్ 1942లో ‘గాంధీ, ది గ్రేట్ సోల్’ పేరిట కలపపై చెక్కిన శిల్పం అమెరికాలో ఇప్పటికీ నిలిచి ఉంది. ►ఫ్రెడ్డా బ్రిలియంట్ అనే శిల్పి రూపొందించిన గాంధీజీ శిల్పాన్ని 1968లో లండన్‌లో నెలకొల్పారు. అప్పటి బ్రిటిష్ ప్రధాని హెరాల్డ్ విల్సన్ దానిని ఆవిష్కరించారు. ► భారత దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1984లో డెన్మార్క్‌కు బహూకరించిన గాంధీజీ విగ్రహాన్ని డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ నడిబొడ్డున నెలకొల్పారు. ►న్యూయార్క్‌లోని యూనియన్ స్క్వేర్ పార్కులో 1986 అక్టోబర్ 2న గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. భారతీయ శిల్పి కాంతిలాల్ పటేల్ ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో 1993 సంవత్సరంలో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. మొదటి తరగతి బోగీలో ప్రయాణిస్తున్న గాంధీని ఇదే చోట బలవంతంగా రైలు నుంచి తోసేసిన సంఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా నెలకొల్పిన ఈ విగ్రహాన్ని నోబెల్ బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా క్రైస్తవ మతబోధకుడు డెస్మండ్ టుటు ఆవిష్కరించారు.ఇవి మాత్రమే కాదు, దాదాపు యాభైకి పైగా దేశాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు, స్మారక కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలో మరే నాయకుని పేరిటా ఇన్ని స్మారక చిహ్నాలు లేవు. అహింసామార్గంలో ఆయన సాగించిన పోరాటానికి ప్రపంచ దేశాలు పలికిన నీరాజనాలు ఈ స్మారక చిహ్నాలు. -
బుక్ ఆఫ్ రికార్డుకు ‘నవయుగ’ శ్రీకారం
కాజీపేట అర్బన్ వరంగల్ : జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా హన్మకొండ హంటర్‌రోడ్డులోని నవయుగ హైస్కూల్ కరస్పాండెంట్ గోపు లింగారెడ్డి తన విద్యార్థులతో నూతన ఒరవడికి నాంది పలికేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డుల్లో పాఠశాల విద్యార్థులకు చోటు సాధించడానికి అరుదైన అవకాశాన్ని అందిస్తునే రికార్డు బ్రేక్‌కు కృషి చేస్తున్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ... గాంధీజీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఘన నివాళి అందించాలని సంకల్పించారు. విద్యార్థులకు జాతిపిత ఆశయాలను, విశిష్టతను, స్వాతంత్య్రం సాధనకు అందించిన సేవలను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు 184 మంది విద్యార్థులు గాంధీజీ వేషధారణలో దోతి, కండువా, శాలువ, చేతి కర్ర, కళ్లజోడ్లను ధరించి, గాంధీజీ చెప్పిన 184 సూక్తులను ఆలపిస్తారు. దీంతో తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందడంతో పాటు రికార్డు కూడా బ్రేక్ చేయనున్నారు. ప్రతి విద్యార్థి పేరు తెలంగాణ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదు కానుంది. నేడు అరుదైన రికార్డు కోసం ప్రదర్శన.. ఓరుగల్లు నగరంలో మరో చరిత్ర సృష్టించడానికి నవయుగ హైస్కూల్ విద్యార్ధులు బుధవారం తమ ప్రతిభను ప్రదర్శించడానికి సన్నద్ధమవుతున్నారు. పాఠశాలకు చెందిన ఎల్కేజీ నుంచి 10వ తరగతికి చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి, వరంగల్ కోఆర్డినేటర్ సీతం రఘువేందర్, యూత్వింగ్ ఇన్చార్జి గంగారపు అఖిల్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రదర్శనను హంటర్‌రోడ్డులోని అలకనంద గార్డెన్స్‌లో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి, జెడ్పీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరుతారు. అనంతరం జెడ్పీలో 184 మంది గాంధీజీ వేషధారణ విద్యార్థులు స్వచ్ఛభారత్‌ను నిర్వహిస్తారు. సాయంత్రం ఆరుగంటలకు తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసిన ధ్రువపత్రాలను అతిథుల ద్వారా అందుకోనున్నారు. కార్యక్రమంలో అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఆర్జేడీ రాజీవ్, డీడీ జగన్, ఎంఈఓ వీరభద్రునాయక్లు పాల్గొననున్నారు. గాంధీజీ ఆశయాలను తెలియజేయడమే లక్ష్యం విద్యార్థులకు గాంధీజీ ఆశయాలను తెలియజేయడమే లక్ష్యంతో 184 మంది విద్యార్థులకు సురభి కళాకారులతో మేకప్ చేయిస్తున్నాం. గాంధీజీ మెరుగైన సమాజ నిర్మాణం కోసం అందించిన 184 సుక్తులను విద్యార్థులతో పలికిస్తాం. విద్యార్థులను నెలరోజలుగా తీర్చిదిద్దుతున్నాం. తెలుగు,తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డుల్లో నవయుగ విద్యార్థులకు చోటు దక్కనుండటం ఆనందంగా ఉంది. – గోపు లింగారెడ్డి ,కరస్పాండెంట్ ,నవయుగ హైస్కూల్ -
స్త్రీలోక సంచారం
అమానుషమైన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నవారిని మినహాయించి, శిక్షా కాలంలో సగం సమయాన్ని పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను మూడు విడతలుగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా గాంధీ జయంతికి ఈ ఏడాది అక్టోబర్ 2న కొందరిని, తిరిగి ఏప్రిల్ 10న చారిత్రక చంపారన్ ఘటన రోజున కొందరిని, అనంతరం వచ్చే ఏడాది గాంధీ జయంతికి మరికొందరు మహిళల్ని.. వారితో పాటు సీనియర్ సిటిజన్, ట్రాన్స్‌జెండర్, వికలాంగులు, అనారోగ్యం పాలైన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ::: 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలు, యువతులు, మహిళలు కేరళ, శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవడంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రార్థనాలయాలను దర్శించుకునే రాజ్యాంగ హక్కు మహిళలకు ఉందని స్పష్టం చేస్తూ, మహిళల ఆలయ ప్రవేశంపై ‘ట్రాంకోవర్ దేవస్వమ్ బోర్డు’ విధించిన ఏళ్లనాటి నిషేధం సమర్థనీయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది ::: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది అసీమ్ సాహ్నీకి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పదోన్నతి కల్పించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 31 మంది న్యాయవాదులకు అడిషనల్, డిప్యూటీ అడ్వొకేట్ జనరళ్లుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం జమ్మూకశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ అడ్వొకేట్ జనరల్‌గా పని చేస్తున్న అసీమ్ సాహ్నీ పేరు కూడా ఉంది! 2009 జూలైలో వివాహమైన ఒక ముస్లిం మహిళ.. పిల్లలు కలగకపోవడంతో ఏడేళ్ల క్రితం తన భర్త తలాక్ చెప్పినప్పటి నుంచీ మామగారిని, మరిదులను పెళ్లి చేసుకోవాలని ఆ కుటుంబ సభ్యులంతా తనపై ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని, మామగారు పలుమార్లు తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చెయ్యడంతో యు.పి.పోలీసులు కేసు నమోదు చేశారు. 489 ఎ (వరకట్నం), 323 వేధింపులు, 328 (విష ప్రయోగం), 511 (శిక్షార్హమైన నేరాలు) సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేసి ఆ మహిళ భర్తను, అతడి తల్లిదండ్రులను, అతడి చెల్లెల్ని, అతడి ముగ్గురు తమ్ముళ్లను అరెస్టు చేసినట్లు క్విలా పోలీస్ స్టేషన్ అధికారి కె.కె.వర్మ తెలిపారు ::: బాల్య వివాహాల నిషేధ చట్టంలోని సెక్షన్ 3ని సవరించి బాల్యవివాహాలు చెల్లుబాటు కాని విధంగా చట్టంలో మార్పులు తేవాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ.. కేంద్ర మంత్రిమండలికి ప్రతిపాదనలు పంపింది. ఈ సవరణ జరిగి, చట్టం అమల్లోకి వస్తే ఆ తర్వాత జరిగే బాల్యవివాహాలకు చట్టబద్ధత ఉండదు ::: గత ఏడాది విడుదలైన తన ఆల్బమ్ ‘విట్నెస్’.. అనుకున్నంతగా ఆదరణ పొందకపోవడంతో తను అనేకసార్లు డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు ప్రముఖ అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నటి, టెలివిజన్ పర్సనాలిటీ కేటీ పెర్రీ వెల్లడించారు. ప్రాణం పెట్టి మరీ తను రూపొందించిన ‘విట్నెస్’ను మ్యూజిక్ లవర్స్ అంతే ప్రాణప్రదంగా స్వీకరించకపోవడం తన మనసును నొప్పించిందని ఆమె మనసు విప్పారు. రష్యాలో వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ పోటీలలో ఫ్రాన్స్ విజయం సాధించినప్పుడు స్టేడియం లోపల, బయట, వీధులలో మహిళలపై జరిగిన మూకుమ్మడి వేధింపులపై రష్యా ఆరా తీస్తోంది. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తక్షణం ఆ ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరిపించేందుకు రష్యా ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది ::: ట్రంప్ ఇటీవల బ్రిటన్ వెళ్లినప్పుడు క్వీన్ ఎలిజబెత్ 2 తో కలిసి సైనిక వదనం స్వీకరిస్తున్న సమయంలో కొన్ని మర్యాదలను విస్మరించారని విమర్శలు వస్తుండగా, ట్రంప్ తిరిగొచ్చాక, అమెరికా ప్రభుత్వ యంత్రాంగం వైట్ హౌస్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘రాణిగారు 70 ఏళ్ల తర్వాత తొలిసారి ట్రంప్ వచ్చిన సందర్భంగానే సైనిక వందనంలో పాల్గొన్నారు’ అని పేర్కొనడం ఆయన్ని అపహాస్యంపాలు చేసింది ::: -
గాంధీ, మోదీ.. ఓ కార్టూన్..!
ముంబై: మహత్మాగాంధీ జయంతి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీపై వినూత్న రీతిలో విమర్శలు సంధించారు. మాటల్లో కాకుండా.. కార్టూన్ రూపంలో మోదీని టార్గెట్ చేశారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీ పక్కపక్కనే నిల్చుని ఉన్న ఒక కార్టూన్‌ను తన ఫేస్బుక్ పేజ్‌లో అప్లోడ్ చేశారు. ఆ కార్టూన్లో గాంధీ చేతిలో ఆయన ప్రసిద్ధ ఆత్మకథ ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’(సత్యంతో నా ప్రయోగాలు) అని మరాఠీలో ఉన్న పుస్తకం ఉండగా.. మోదీ చేతిలో ‘మై ఎక్స్పరిమెంట్స్ విత్ లైస్(అసత్యాలతో నా ప్రయోగాలు) అనే పుస్తకం ఉంటుంది. కార్టూన్ పై భాగంలో ‘ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు’ అనే కాప్షన్ ఉంటుంది. గతంలో బాల్‌ఠాక్రే నేతృత్వంలో వచ్చిన మార్మిక్ పత్రికలో రాజ్ ఠాక్రే కార్టూన్లు విరివిగా వచ్చేవి. -
మద్యం ముట్టం
నర్సాపూర్ రూరల్: ఇక నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని, మద్యాన్ని తాగబోమని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మూసాపేట గ్రామస్తులు సోమవారం గాంధీజీ చిత్రపటం ముందు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో అనేక మంది మద్యానికి బానిసలై, పనులు చేయకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పూర్తిగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆసరాగా చేసుకొని కొంతమంది గ్రామంలో విచ్చలవిడిగా మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దసరా పండుగ సందర్భంగా సెలవులు రావడంతో పట్టణాలలో పనిచేసే ఉద్యోగులు, చదువుకునే యువకులు గ్రామానికి వచ్చారు. వారంతా కలసి గ్రామ పెద్దలతో చర్చించారు. వారంతా ముక్త కంఠంతో సై అనడంతో .. గ్రామంలో మద్యం అమ్మకాలను, మద్యపానాన్ని నిషేధిస్తూ మహాత్మాగాంధీ జయంతి రోజున తీర్మానం చేశారు. -
బర్రెల్ని పంపిణీ చేసిన సీఎం సతీమణి
నాగ్‌పూర్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పేదలకు బర్రెల్ని పంపిణీచేసి ఆదర్శంగా నిలిచారు అమృతా ఫడ్నవిస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణిగానే కాక బ్యాంకర్, సింగర్, సోషల్ వర్కర్‌గా బహుముఖ ప్రజ్ఞతో నిత్యం వార్తల్లో నిలిచే ఆమె మరోసారి తనదైన శైలిని కనబర్చారు. ‘శ్రీమంతుడు’ తరహాలో నాగ్‌పూర్ జిల్లాలోని కవ్దాస్ గ్రామాన్ని దత్తత తీసుకున్న అమృత ఫడ్నవిస్.. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం గ్రామంలో పర్యటించారు. భర్తలను కోల్పోయిన పలువురు పేద మహిళలకు బర్రెలను పంచారు. అనంతరం నీటిశుద్ధీకరణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అధికార బీజేపీ ప్రభుత్వం సైతం బర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సీఎం సతీమణి పంచిన బర్రెలు ప్రభుత్వ పథకంలో భాగంగానా లేక వ్యక్తిగతంగానా అనేది తెలియాల్సిఉంది. #GandhiJayanti wishes!Gave buffaloes to widows & poor women & inauguratd drinking water plant at my adopted village Kawdas @Dev_Fadnavis 🙏🙏 pic.twitter.com/vrvGRGFIQ1 — AMRUTA FADNAVIS (@fadnavis_amruta) 2 October 2017 -
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ 147 జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్టీ) ఆయనకు ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా డల్లాస్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా నుంచి గాంధీ పీస్ వాక్ ను నిర్వహించింది. శాంతికి సంకేతమైన తెలుపురంగు దుస్తులను ధరించి పిల్లలు, పెద్దలు పీస్ వాక్ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. పీస్ వాక్ పూర్తయిన అనంతరం ప్రవాసాంధ్రులందరూ గాంధీ విగ్రహం వద్ద పూలు ఉంచి ఘననివాళులు అర్పించారు. వేడుకలకు మహాత్మాగాంధీ ముని మనవరాలు అర్చనా ప్రసాద్, ఆమె భర్త హరి ప్రసాద్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఎంజీఎంఎన్టీ డైరెక్టర్ షబ్నమ్ మొద్గిల్ మాట్లాడుతూ.. గాంధీజీ పుట్టిన అక్టోబర్ 2వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంజీఎంఎన్టీ చైర్మన్ డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. గాంధీ తన జీవితం మొత్తం ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి పాటు పడ్డారని చెప్పారు. చాలా ప్రాంతాల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నా ఆహ్వానం మేరకు డల్లాస్ కు విచ్చేసిన అర్చనా ప్రసాద్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అద్భుత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అర్చనా ప్రసాద్ అభినందించారు. అమెరికాలోనే అతిపెద్ద అందమైన గాంధీ స్మారక స్ధూపాన్ని ఏర్పాటు చేసిన ఎంజీఎంఎన్టీకి అర్చనా ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం నిర్వహించిన గాంధీ బాంకెట్ కు మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరైన అర్చనా ప్రసాద్ గాంధీ మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ సమాజసేవ చేస్తున్నట్లు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఎంజీఎంఎన్టీ అర్చనా ప్రసాద్ ను సమాజసేవ అవార్డుతో సత్కరించింది. ఎంజీఎంఎన్టీ గురించి మరిన్ని వివరాల కోసం www.mgmnt.orgను చూడొచ్చు లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డా. తోటకూర ప్రసాద్, పీయూష్ పటేల్, ఇందు రెడ్డి మందాడి, రావు కాల్వల, సల్మాన్ ఫర్షోరి, తయ్యబ్ కుంద్వాలా, షబ్నమ్ మొద్గిల్, జాక్ గొద్వాని, జాన్ హమ్మండ్ లను సంప్రదించవచ్చు. -
మహాత్ముని మార్గం
గాంధీమనందరికీ ఒక ఒక రాజకీయనేతగా, అహింసావాదిగా, స్వాతంత్య్ర సమర యోధునిగా, న్యాయవాదిగా, సత్యాన్వేషకునిగా మాత్రమే తెలుసు. అయితే ఆయనను ఒక ఆధ్యాత్మికవేత్తగా కూడా పరిశీలిస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు అవగతమవుతాయి. మతం పట్లఆయన అభిప్రాయాలు నిజంగా ఎంత ఉన్నతమైనవో తెలుస్తుంది. ‘అసలైన మతం భౌతికమైనది కాదు, అది హృదయానికి సంబంధించినది. సత్యం, అహింసలపై శ్రద్ధకలిగించేది. దేవుడికి మాత్రమే కట్టుబడి ఉండేది. పరమాత్మకు, ఆత్మకు సంబంధించిన వ్యక్తిగత అంశం అంటూ తన దృష్టిలో మతం అంటే ఏమిటో చెబుతాడు మహాత్ముడు. చిన్ననాటే నాటుకున్న రామబీజం తనకు చిన్నతనంలో భూతాలు, ప్రేతాలు అంటే భయమని, ఆ భయం పోవాలంటే రామస్మరణే మందు అని దాసి రంభ చెప్పిన మాటల ప్రేరణ తనను జీవితాంతం వదలలేదని చెప్పేవారు. అలా చిన్ననాట హృదయంలో నాటుకున్న రామనామ బీజం తరువాత కూడా అలాగే నిలిచిపోయిందని, రామరక్షాస్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసేవాడినని ఆత్మకథలో చెప్పుకున్నారు. ఎప్పుడైనా నిరాశ, నిస్పృహ తనను ఆవరించినప్పుడు తాను భగవద్గీతను వల్లెవేసేవాడినని, క్షణాల్లో అవి మటుమాయమయ్యేవని ఆయన భగవద్గీత ఔన్నత్యాన్ని బోధించేవారు. భగవద్గీతను తల్లిలా భావించేవారు. ఒక్క భగవద్గీతనే కాదు, ఖురాన్, బైబిల్, బౌద్ధ సూత్రాలు అన్నీ ఆయన పఠించారు. వాటిలో దాగున్న ఔన్నత్యాన్ని గ్రహించారు. అన్ని మతాల సారం ఒక్కటేనని, ఈశ్వరుడిని కొలిచినా, అల్లాను వేడుకున్నా, జీసస్‌ను ప్రార్థించినా, అన్ని విధానాలు ఆయన్ని చేరుకునేందుకేనని గాంధీజీ చెప్పేవారు. ఎవరి హృదయం నిర్మలంగా ఉంటుందో, ఎవరు తమ లక్ష్యాన్ని దైవంగా భావిస్తారో వారివెంట దైవం ఉంటుంది. సత్యం, ప్రేమ, ధర్మం, నిజాయితీ, నిర్భయత... కలిగి ఉండే వారికి పరమాత్ముడు స్వయంగా తోడ్పాటు అందిస్తాడని ప్రబోధించేవారు. గాంధీగీత భగవద్గీతలో శ్రీకృష్ణుడు రథసారథి, అర్జునుడు రథికుడు. గాంధీ గీతలో ఆత్మ రథికుడు, తెలివితేటలు, మేధస్సు దానిని నడిపించే సారథి, మనస్సు ఆ రథచక్రాలు, జ్ఞానేంద్రియాలు గుర్రం. గాంధీజీ చెప్పిన ఈ ఒక్క వాక్యాన్ని బట్టే తెలుస్తుంది మనల్ని మనం నియంత్రణలో ఉంచుకోగలిగితే దేనినైనా సాధించవచ్చునని. సత్యమే గాంధీ దైవం సత్యాన్ని పరమాత్ముని రూపంగా, సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపంగా భావించారు మహాత్ముడు. సత్యంలో భగవంతుడిని ఆయన చూసినంత నిశితంగా మరొకరు పరికించి ఉండరు. సత్యానికి ఆయన ఇచ్చినంత ప్రాముఖ్యం వేరొకరు ఇవ్వలేదు. మనకు రుషులు, మతబోధకులు బోధించే భగవ త్ సాక్షాత్కార సూత్రాలన్నింటినీ సత్యాన్వేషణలో గాంధీజీ స్పష్టంగా సూచించారు. ప్రార్థన మానవత్వానికి పిలుపు. ఆత్మశుద్ధికి మార్గం. మనలోని బలహీనతలను గుర్తించే ప్రక్రియే ప్రార్థన అన్నది గాంధీజీ భావన. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు ప్రార్థన అంతే అంటారాయన. అయితే ప్రార్థన అంటే కేవలం పెదవులతో ఉచ్చరించేదే కాదు. ఎలాంటి భేదభావాలు, తారతమ్యాలకు తావివ్వకుండా హృదయ ప్రక్షాళన కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే కళ్లు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చోవడం కాదు. ప్రార్థనకు కావలసింది మనసులేని మాటలు కాదు, మాటలు లేని మనసు అన్నది మహాత్ముడి మార్గం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరేనామ్, సబ్కో సన్మతి దే భగవాన్... ఇది మహాత్ముడికి అత్యంత ప్రీతికరమైన ప్రార్థన. స్వచ్ఛగాంధీ ప్రస్తుతం ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు కోట్లాది రూపాయల వ్యయంతో చేస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గాంధీజీ ఏనాడో అమలు చేశారు. దళితవాడలకు, మురికివాడలకు వెళ్లి, వారికి పరిశుభ్రత గురించి ప్రబోధించారు. అలా మాటలు చెప్పి ఊరుకోకుండా, తానే స్వయంగా చీపురు పట్టి, వీధులను శుభ్రం చేశారు. మలాన్ని ఎత్తి పారబోశారు. తద్వారా పరిశుభ్రత అంటే ఏమిటో వారికి తెలిసేలా చేశారు. ఆత్మప్రక్షాళనే మార్గం మనిషి అటు మృగమూ కాదు, ఇటు పరమాత్మ కాదు. పరమాత్మ సృష్టించిన ప్రాణిగా తనలోని దైవత్వాన్ని గుర్తించే దిశగా నడవాలి. అందుకు పశ్చాత్తాపం, ఆత్మప్రక్షాళనే మార్గం. మన తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నంలో పరమాత్మను శరణువేడితే కొత్త జీవితానికి నాంది పలికినట్లవుతుంది. అహింస, శాంతి, సహనం, సత్యం, సమైక్యతలే ఆ మహాత్ముడు దేవుని అర్చించే పూజాపుష్పాలు. మనం ఆ పుష్పాలను అందుకుందాం. మాలిన్యం లేనటువంటి స్వచ్ఛమైన మనస్సుతో మనం ఆయన చూపిన మార్గంలో నడుద్దాం. - డి.వి.ఆర్. -
స్మృతి తీర్థం
నేడు గాంధీ జయంతి మహాత్మా గాంధీ! స్వతంత్ర పోరాటంలో ప్రజల నోట పలికిన తారకమంత్రం. విదేశీ దురాక్రమణకారుల పాలిట శరాఘాతం. ఆయన మాట కోట్లాది ప్రజలకు వేదవాక్కు. తారతమ్యాలను మరచి ప్రజలను ఏకతాటిపై నిలిపిన శిలా శాసనం. స్వాతంత్య్ర సమరాంగణంలో జాతీయ సేనను అహింసా పథంలో నడిపిన సేనాని. అలాంటి మహాత్ముడి ఆశయాలకు ఆకృతి దాల్చిన రూపంలా ‘గాంథీ తీర్థ్’ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తోంది. గాంధీ తీర్థ్ మహారాష్ట్రలోని జల్గావ్లో ఉంది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యాపారవేత్త, ప్రముఖ గాంధేయవాది భవర్లాల్ జైన్ గాంథీ తీర్థ్‌ను స్థాపించారు. మహాత్ముడి జీవితాన్ని, సిద్ధాంతాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఆయన దీని నిర్మాణానికి పూనుకున్నారు. 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. లోపలికి ప్రవేశించగానే 300 ఎకరాల్లో విస్తరించిన పచ్చని పచ్చిక బయళ్లు సందర్శకుల బడలికను పోగొట్టి ఆహ్లాదాన్ని పంచుతాయి. గాంధీ తీర్థ్‌లో ప్రధాన ఆకర్షణ మ్యూజియం. మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో నిర్మించిన మ్యూజియం ప్రపంచంలో ఇదొక్కటే. తెరతీయగానే... గాంధీ తీర్థ్‌లో పూర్తి ఎయిర్ కండిషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. లోపలికి ప్రవేశించగానే చిరునవ్వులు చిందిస్తూ చరఖా తిప్పుతున్న మహాత్ముడి ప్రతిమ జీవకళ ఉట్టిపడుతూ సాదరంగా ఆహ్వానిస్తుంది. మ్యూజియంలోని మొత్తం 30 కి పైగా విభాగాల్లో లక్షలాది స్మారక చిహ్నాలను భద్రపరచారు. మ్యూజియంలో ఏర్పాటుచేసిన టచ్ స్క్రీన్లు మహాత్ముడి జీవితంలోని కొన్ని మధుర ఘట్టాలను మన ముందుంచుతాయి. డిజిటల్ టచ్‌స్క్రీన్‌పై చేయి పడగానే వరుసగా వెలువడే సూక్తులు సందర్శకులకు గాంధీయిజాన్ని పరిచయం చేస్తాయి. గాంధీ బాల్యజీవితాన్ని చూపేందుకు ఏర్పాటు చేసిన బయోస్కోప్ సందర్శకులను కట్టిపడేస్తుంది. గాంధీ చిన్నతనంలో తిరిగిన ప్రదేశాలకు, పాఠశాలకు చేయిపట్టి తమవెంట నడిపిస్తాయి. ఆయన తోటి స్నేహితుల్లో ఒకరిగా చేస్తాయి. పఠనానికి... మ్యూజియంలో గాంధీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. గాంధీ జీవితాన్ని విభిన్న కోణాల్లో సృశించే 7 వేల పైచిలుకు పుస్తక రాశి ఈ గ్రంథాలయం సొంతం. 7 వేలకు పైగా ఉన్న మహాత్ముడి ఫోటోలు స్వాతంత్య్ర పోరాటంలోని వివిధ ఘట్టాల్లోని ఉద్వేగ స్మృతులను మనముందుంచుతాయి. వివిధ సందర్భాల్లో సభలు, సమావేశాలు, ఉద్యమాల్లోని మహాత్ముడి ప్రసంగాలను 150కు పైగా ఆడియో టేపుల్లో నిక్షిప్తం చేశారు. విభిన్న కోణాల్లో గాంధీజీ జీవితాన్ని చిత్రిక పట్టిన 70కు పైగా సినిమా ప్రింట్లను ఇక్కడ భద్రం చేశారు. గాంధీ జీవితంపై రూపొందించిన నాటకాలను ప్రదర్శించేందుకు 250 సీట్లతో ఒక నాటకశాలను ఇందులో నిర్మించారు. పరిశోధనకు... గాంధీ జీవితంపై పరిశోధన చేసేవారు ఉండేందుకు వసతి గృహాలను నిర్మించారు. వారు కావలసినన్ని రోజులు ఇక్కడ ఉండి గాంధీతత్వంపై తీరిగ్గా తమ పరిశోధనలు చేసుకోవచ్చు. సందర్శకులు వీలయినన్ని రోజులు ఉండి గాంధీ జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆధునిక హంగులతో అతిథి గృహాలు ఏర్పాటు చేశారు. విజ్ఞాన యాత్రలో భాగంగా గాంధీతీర్థ్‌ను సంద ర్శించే విద్యార్థి బృందాల కోసం, కార్పొరేట్ ఉద్యోగుల కోసం సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. ఈ నేలపై అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి జాతిపిత ఆశయాలను మదిలో నింపుకొని తిరుగు పయనమవాలనే భవర్లాల్ కల సాకారం చేస్తూ దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది గాంధీతీర్థ్‌ను సందర్శిస్తున్నారు. మహాత్ముడి తాత్వికధారలో తడిసిముద్దయి మనసులోని మాలిన్యాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. - దండేల కృష్ణ -
గ్రామ స్వరాజ్
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్ముడు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించారు. రక్తపుబొట్టు కారకుండా స్వరాజ్యాన్ని సంపాదించిన అహింసా తపస్వి గాంధీ. ప్రపంచానికి మనం మహాత్ములం కాలేకపోయినా, మన ప్రపంచంలో ‘ఆ’ ఆత్మను నాటితే బాగుంటుంది! గ్రామ స్వరాజ్య ఫలసాయం కోసం సేద్యం చేస్తున్న ప్రకాశ్ స్వరాజ్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ -రామ్ ఎడిటర్స్,ఫీచర్స్ ♦ ఇవాళ గాంధీ జయంతి. ఏం గుర్తొస్తుంది? గాంధీజీ అనగానే కరెన్సీ నోట్లలో చూసే బోసినవ్వుల తాత కాదు. గాంధీజీ మన దేశానికి కాన్షస్నెస్. ఆయన అహింస గురించే కాదు... వ్యవసాయం, గ్రామ స్వరాజ్యం, ఆర్థిక విధానం, కమ్యూనిటీ డెవలప్మెంట్ - ఇలా చాలా మాట్లాడారు. ఆయన విజన్ గొప్పది. ఆయన అలకలో, కోపంలో, ఉపవాసంలో - ప్రతి దానిలో ధర్మం ఉంది. కానీ, మనం గాంధీ గురించి పెద్దగా మాట్లాడం! నిజానికి, ఆయన సత్య శోధన జీవితాన్ని సమగ్రంగా చూడాలి. నాపై గాంధీ జీవిత ప్రభావం చాలా ఉంది. ♦ మీలోనూ జీవిత వేదాంతం పెరుగుతోందే! ఏ మనిషైనా కాలంతో పాటు ఎదగాలి. ప్రతిదీ ఆకలితో చూస్తూ, ఆకళింపు చేసుకుంటూ వెళ్ళాలి. జీవితానుభవాలు ఎక్కువవుతున్నకొద్దీ వ్యక్తిగా అవి మనకి అందమి వ్వాలి. లేకపోతే జీవితం వ్యర్థం. ఈ ప్రయాణంలో మనకిక చాలు అనాలి. ఇవ్వడం నేర్చుకోవాలి. ఇతరులతో పంచుకోవాలి. ♦ మీరూ మీ స్థాయిలో తిరిగి ఇస్తున్నట్లున్నారు యస్. ఏ మనిషీ తన వల్లే పెరగడు. పదిమందీ తనకిచ్చిన దాని వల్లే పెరుగుతాడు. 120 రూపాయలతో నటుణ్ణి కావాలని వస్తే నాకు ఇవాళ అందరి వల్ల ఇంత గుర్తింపు వచ్చింది. భోజనం కోసం కష్టపడాల్సిన పని లేదు! ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి, సమాజానికి తిరిగివ్వాలి. వెలగడం గొప్ప కాదు, వెలిగించడం గొప్ప! ఎదిగేకొద్దీ అన్ని రకాల బరువూ తగ్గించుకొని తేలిగ్గా మారితే బెటర్! ఆఖరికి పోయాక ఓ నలుగురు మనల్ని మోయాలిగా! (నవ్వు) ♦ సిన్మాచూసి గ్రామాన్ని దత్తత తీసుకున్నారని. (మధ్యలోనే) సిన్మా చూసి నేనెందుకు చేస్తా? నాకెక్కడో అనిపించింది, చేశానంతే. అయినా ఊరిని దత్తత తీసుకుని, వాళ్లకు అన్నం పెట్టగానే సరిపోదు. సమస్యలు తెలుసుకోవాలి, తీర్చాలి. ఊరి జనం తమ కాళ్ళపై నిలబడేలా చేయూతనివ్వాలి. ఊరిని దత్తత తీసుకోడానికి డబ్బు కన్నా మనసు, టైమ్, కమిట్మెంటే అవసరం! ♦ మీ ఊరు కాని ఊరిని దత్తు తీసుకొన్నారేం? నా ఊరు, నా జాతి ఏంటి? ఐ యామ్ ఎ వరల్డ్ సిటిజన్. నాకు మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో పొలం ఉంది. నేనక్కడికి వెళుతున్నప్పుడు ఆ ఊరి పరిస్థితి కనిపించింది. చదువుకోవాల్సిన పిల్లలు ఆడుకుంటున్నారు. అరే..నా కూతురు లండన్‌లో చదువుతోంది. తన ఏడాది ఫీజుతో ఇక్కడ వందమంది చదువుతారనిపించింది. ♦ మరి, మీ భార్య, పిల్లల మాటేమిటి? ఎవరి పిల్లలైనా తమకు తాము కష్టపడి సంపాదించుకోవాలి. కూర్చొని తినాలంటే కుదరదు. ‘నా సంపాదనలో మీ వాటా మీ ఇష్టం. నా వాటాలో కొంత వీటికి ఖర్చు పెడతా’ అని ఇంట్లో డిస్కస్ చేస్తా. నా పెద్ద కూతురు మేఘన లండన్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతోంది. మంచి పెయింటర్. సెలవుల్లో సోషల్సర్వీస్కి వివిధ ప్రాంతాలకెళుతుంది. ఆ మధ్య 15 రోజులు ట్రైబల్ ఏరియాకెళ్లొచ్చింది. తనకి నా గుణాలొచ్చాయి. ♦ ఊరి దత్తతపై ఇంట్లో ఎలా కన్విన్స్ చేశారు? ముందు మీకు మీరు కన్విన్స్ అవ్వాలి. మన నిర్ణయం వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా మాట్లాడండి వాళ్లతో! అది చాలు! పిల్లలకి మనమే ఆదర్శంగా ఉండాలి. అందుకే, వ్యక్తిగతంగానే కాదు, నేను తీస్తున్న సిన్మాలూ అలాగే ఉంటాయి. ‘ఇలాంటి చిత్రం తీశాడు’ అని వాళ్లు గర్వపడాలే తప్ప, సిగ్గుపడకూడదు. ♦ వచ్చే ‘మన ఊరి రామాయణం’ అంతేనా..? కచ్చితంగా. రాముడు, సీత, రావణా సురుడు ఇవన్నీ మనిషిలో ఉన్న గుణాలే. అందరూ మనలోనే ఉన్నారు. అందుకే ‘మన ఊరి రామాయణం’... మనలోని రామాయణం. ఓ చిన్న ఊరు. ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకుని, ‘అయ్యో తప్పు చేస్తున్నానే’ అనుకుంటాడు. కానీ, బయటకి రాలేని స్థితి. అలా ఓ కథ చెప్పాలని తీశా. ♦ అసలు దర్శకత్వం వైపు ఎందుకు వచ్చారు? నాకేదో తెలిసేసిందని దర్శకత్వం చేయ ట్లేదు. అంతా మంచి నటుడంటున్నారు. ఎక్కడో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయానేమో అనిపించింది. కొత్తగా ఉండాలంటే, మళ్ళీ పరీక్ష రాయాలనిపించింది. 200 మంది డెరైక్టర్లతో, ఎన్నో భాషల్లో, ఎన్నో క్యారెక్టర్లు చేశా. నాకూ కొన్ని విషయాలు చెప్పేందుకు న్నాయి. అవి పంచుకుందామనే డెరైక్షన్. ♦ కానీ, దర్శకుడిగా సక్సెస్ అయ్యారంటారా? ‘నాను నన్న కనసు’, ‘ధోని’, ‘ఉలవ చారు బిర్యానీ’, ‘మన ఊరి రామాయణం’ - అన్నీ చిన్న చిన్న విషయాల్ని స్పృశించేవే. ఇవన్నీ ప్రేక్షకుడికీ, నాకూ మధ్య ఉభయ కుశలోపరి. అది చాలు, నేను సక్సెసైనట్లే! ♦ నటనకి ఛాన్సల్లేక దర్శకత్వం చేస్తున్నారని! నటుడిగా ఒక్కరోజైనా ఖాళీగా లేను. తెలుగు, తమిళ, మలయాళ, హిందీల్లో నటిస్తున్నా. వ్యవసాయం చేస్తున్నా. దత్తత తీసుకున్న ఊరి వద్ద గడుపుతున్నా. కొడుకుతో ఆడుతున్నా. దేశాలు తిరుగుతున్నా. ‘సిల సమయంగళిళ్’ సినిమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కి వెళుతున్నా. టైమే లేదు! ఖాళీగా ఉన్నవాళ్లేదో అంటే, నాకేం! ♦ కొత్తవాళ్లొచ్చాక తెరపై కనపడ్డం తగ్గిందని.. (మధ్యలోనే) కూరగాయలు పెంచు తున్నా. విలేజ్‌లో స్కూల్ కడుతున్నా. నాకు సిన్మాలే జీవితం కాదు. నా జీవి తంలో సిన్మా కూడా ఉంది. ఎదుటివాళ్లకి సిన్మా ఒక్కటే కన్పిస్తే, నా తప్పు కాదు. ♦ ఎప్పుడైనా నటన ఇక చాలనిపించిందా? చాలు అని దేన్నీ అనను. కొంచెం ఎక్కువైన దాన్ని తగ్గిద్దామనుకుంటా. అంతే! కడుపునిండా తింటే లాభం లేదు. కొంచెం ఆకలితో ఉండాలి.అప్పుడే రుచితెలుస్తుంది. ♦ ఒకప్పుడు మీరంటే పడిచచ్చిన దర్శకులు, స్టార్స సినిమాల్లో మీరు కనిపించడం లేదేం? (నవ్వేస్తూ) నేను లేకపోతే సిన్మా తీయలేమనే అబద్ధాన్ని అప్పుడు వాళ్లు నమ్మారు. నేను లేకుండా కూడా సినిమా తీయొచ్చని ఇప్పుడు తెలుసుకున్నారు. బాగుంది కదా! నాతో సినిమాలు చేసినా, చేయకపోయినా నా జీవితం నేను బతుకుతూనే ఉన్నాను. ♦ ఇష్టపడ్డవాళ్లకి టైమివ్వచ్చుగా? జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే! మనం అర్థం కాకూడదు. జీవితం నదిలా ఉండాలి. మొదలు తుది తెలీకూడదు. ఇచ్చేదివ్వాలి. పొందేది పొం దాలి. వెళ్లిపోవాలి. అక్కడే నిల్చుంటే కష్టం. నది లోపలికెళ్తే కొట్టుకెళ్లిపోతాం. దూరమైతే దాహమేస్తుంది. తగు దూరంలో ఉండాలి. ♦ తామరాకుపై నీటి బొట్టు వ్యవహారమిది! ...అని మీరంటారు. నేను తామరాకు తామరాకే, నీటిబొట్టు నీటిబొట్టే అంటా. అంటుకొని ఉండకపోవడమే ఇంట్రెస్టింగ్. ♦ ఇన్ని విషయాలెలా నేర్చుకోగలిగారు? అంతా చుట్టూనే ఉంది. చూసే దృష్టి ఉండాలి. దృష్టి వేరు, చూపు వేరు. తీవ్ర తతో బతకాలి. బతుకుతూనే ఉండాలి. బతికుండీ చచ్చిపోకూడదు. పోయినప్పుడు నల్గురూ మంచిమాటలనుకొనేలా బతకాలి. ♦ అలా బతికే శక్తి, ఉత్సాహం ఎలా వస్తాయి? ఏదైనా, ఇష్టపడి పని చేయాలి. నచ్చినట్లు బతకాలి. ఇక ప్రతి క్షణం ఉత్సాహమే. ♦ ఇప్పటిదాకా మీరు ఇష్టపడే బతికానంటారా? యస్. నాకు నచ్చినట్టే బతికా. రాజీ పడడం వేరు, పరిస్థితులకు తగ్గట్లు ఎడాప్టింగ్ వేరు. కొంచెం ఎడ్జెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. కానీ ఆత్మగౌరవం కాపాడుకోవాలి. ♦ ఇంతకీ ఊరు అనగానే ఏం గుర్తొస్తుంది? ప్రతి ఊరికీ ఒక్కో జ్ఞాపకం. సెలవుల్లో ఊరికెళ్లేవాడిని. ఊళ్ళో పెద్దవారంటే విలువ, దేవుడు, భయముంటాయి. మనస్సాక్షి ఉన్న మనుషులుంటారు. కానీ, సిటీలో అలా కాదు! ఒంటరితనమే. ♦ కానీ, ఇప్పుడు అలాంటి ఊళ్ళున్నాయా? అలాంటి మనుషులుంటే, అలాంటి ఊళ్ళున్నాయి. ఎక్కడైనా రైతులు రైతులే. కానీ, మనం ప్రకృతిని కాపాడుతున్నామనే అహం వద్దు. ప్రకృతి మనకి అవసరం. దాన్ని కాపాడామనడానికి మనమెవరం? ♦ ఊరు దత్తత చూస్తే పాలిటిక్స్లోకేమైనా.. (సగంలోనే) నాకు తెలీనిదానికి నేనెప్పుడూ వెళ్ళను. ఈ క్షణంలో కచ్చితంగా వెళ్ళననే చెబుతా. కానీ, ప్రయాణంలో ఏ రోజున ఏ నిర్ణయం తీసుకుంటామో! ♦ ఇంతకీ ఇంకొన్నేళ్ళకి మీరెలా ఉండాలని? మరింత మంచిమనిషిగా ఉండాలని! రైతుగా, భూమిపుత్రుడిగా నిలబడతా. స్వాభిమానం... సంసారం... సమకాలీనం... ♦ ఇళయరాజా గారి తెలుగు కాన్సర్ట్కి అమెరికా వెళ్ళొచ్చిన విశేషాలు? రాజా గారి తొలి తెలుగు కాన్సర్ట్ అది. ఆడిటోరియం హౌస్‌ఫుల్. ఇక, ‘తెలుగుగడ్డపై మీరెప్పుడూ విభావరి చేయలేదు. నేను ఆర్గనైజ్ చేస్తా. చేయండి’ అని రాజా గారితో అన్నా. చేస్తానన్నారు. ♦ దర్శకుడిగా ఇళయరాజా లాంటి సంగీత జ్ఞాని వద్దకు సిన్మా కోసం వెళ్ళినప్పుడు మీకు ఛాయిస్ ఉండదేమో. కానీ మీకు కొన్ని ఊహలుంటాయి. మరి ఇద్దరికీ శ్రుతి కుదిరేదెలా? ఇసైజ్ఞాని దగ్గరకెళ్ళి ‘నాకిలాంటి మ్యూజిక్కే కావా’లంటే ఎలా ఉంటుంది? అలాగే నా దగ్గరకు వచ్చి, ‘మీరు ఇలా కాదు, అలా యాక్ట్ చేయండి’ అంటే నాకెలా ఉంటుంది? ఆయన వద్దకు వెళ్లి నా భావాలు చెబుతా. సందర్భానికి తగ్గ సంగీతం ఇస్తారు. మనకు ఏది తెలియదో తెలిసినప్పుడు, తెలిసినవాళ్ళ దగ్గరకి వినయంగా వెళ్లాలి. ♦ కానీ, మీ ఇద్దరికీ అహంకారమని టాక్! నా అంతటి వాడు లేడనే అహంకారం వేరు. పాండిత్యం ఉండడం వల్ల కలిగే ధిషణాహంకారం వేరు. ఆత్రేయ గారితో ‘ఏవండీ మీరు బాగా రాస్తారు కానీ రాత్రైతే తాగుతారట, అదంట, ఇదంట’ అని ఎవరో అన్నారట! దానికి ఆయన, ‘నాయనా! చెడు చూసినవాళ్లకి చెడు. మంచి చూసిన వాళ్లకి మంచి’ అన్నారట! రాజాగారూ మనిషేగా! పెద్దరికాన్ని గౌరవించాలి. జడ్జ్ చేస్తే ఎలా? ♦ ఈ వయసులో తండ్రి అవడమెలా ఉంది? ముప్ఫై ఏళ్ళప్పుడు తండ్రి అయిన అనుభూతి వేరు. యాభై ఏళ్ళకి ఇప్పుడు కొడుకు పుట్టిన అనుభూతి వేరు. దేనికదే బాగుంది. దీనివల్ల నాకూ, నా భార్య - కొరియోగ్రాఫర్ పోనీవర్మకూ బంధం స్ట్రాంగ్ అవుతుంది. నా త ల్లి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, ‘మాకు ఓ తమ్ముడు పుట్టాడు’ అంటూ ఇద్దరు కూతుళ్ళూ రాఖీ కడుతుంటే హ్యాపీ. ♦ మీపరిణతి మీ అబ్బాయి పేరు వేదాంత్లోనూ ఉందే! (నవ్వేస్తూ) వాడి పేరు నేను పెట్టలేదు. మా ఆవిడ పది పేర్లు రాసి, సెలక్ట్ చేయమంది. వేదాంత్ బావుందన్నా! ♦ ఇంతకీ, మీ అబ్బాయిని ఏం చదివిస్తారు? వాడు సాహిత్యం, జీవితం చదవాలి. దేశానికి తోడ్పడాలి. ♦ తాజా కావేరీవివాదంతో దహనాలు చూస్తే... బాధ అనిపించింది. ధర్నాలు చేయండి, దీక్షలు చేయండి. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని కాల్చడానికి ఎవరి డబ్బది? మనదే కదా! నీకు దహనం చేయాలనుంటే నీ కారు తీసుకొచ్చి దహనం చెయ్. ఎవరో రోడ్డుపై వెళుతుంటే ఆపి, వాడి కారు దహనం చేయడమేంటి? వాడూ మనిషేగా! ♦ అప్పట్లో వివాదంతో ప్రకాష్రై నుంచి రాజ్‌గా పేరు మార్చారట... బాలచందర్‌గారు మార్చారు. ‘నువ్వు విశ్వనరుడివి. నీ పేరు ఒక భాష, ప్రాంతంతో ముడిపడేలా కాదు... విశ్వజనీనంగా ఉండాలి’ అంటూ ప్రకాశ్‌రాజ్ అని పేరు పెట్టారు. ♦ కానీ, పాతికేళ్ళ నుంచి అదే సమస్య మళ్లీ మళ్ళీ వస్తుంటే... (అందుకొని) అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. కానీ, పరిష్కారం కానివ్వకపోతేనే కొందరికి లాభం ఉంటుంది. ♦ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మన మెరుపుదాడి పట్ల ఏమంటారు? ఇప్పటికైనా వీర జవాన్ల విలువ మనకి అర్థమైంది. వాళ్ళు దాడి చేసింది పాక్‌పై కాదు, తీవ్రవాదంపై! జై జవాన్! - రెంటాల జయదేవ -
నేడు మాంసం దుకాణాలు బంద్
సాక్షి,సిటీబ్యూరో: గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మాంసం దుకాణాలు మూసి ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మాంసం విక్రయాలకు పాల్పడే దుకాణాలు, వ్యక్తులపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
మంచి వినండి... మంచి చూడండి...మంచి చెప్పండి...
... మహాత్ముని గురించి కొన్ని మంచి మాటలు నీతో నువ్వు అబద్ధమాడకు! ‘‘గాంధీజీ అనగానే నాకు ఒకటి కాదు... ఎన్నో గుర్తుకొస్తాయి. మా నాన్న గారికి గాంధీజీ అంటే తీవ్రమైన ఇష్టం. నిజానికి సత్యవ్రతం, సత్యనిష్ఠ లాంటి మాటలు కొద్దిగా అస్పష్టమే. అసలీ ప్రపంచంలో ఏదీ యాబ్సొల్యూట్ ట్రూత్... నిరపేక్షమైన సత్యం కాదు. వాస్తవం (ఫినామినన్), నిజం (రియాలిటీ), సత్యం (ట్రూత్) అనే మూడు ఉంటాయని నా వర్గీకరణ. సత్యం మాట్లాడాలని తెలిసినా- అబద్ధం అవసరాల్ని అడ్డదారుల్లో తీరుస్తుంది కాబట్టి, సహజంగా అంతా అటు మొగ్గుతారు. చిన్న వయసులో నాకు ఇంట్లో నాన్న గారికి చెప్పకుండా, దొంగతనంగా సినిమాలు వెళ్ళి చూసి వచ్చే అలవాటుంది. మా నాన్న గారికి అబద్ధం చెబితే కోపం. తప్పు చేస్తే, తల దించుకొని తప్పు చేశానని నిజం చెబితే వెంటనే క్షమించేసేవారు. క్రమంగా నాకు కూడా అబద్ధం చెప్పే కన్నా, నిజం చెప్పి తలెత్తుకు నిలబడడమే కంఫర్టబుల్‌గా అనిపించింది. మా స్కూల్లో ఒక టీచర్ ఎప్పుడూ సినిమాలు చూసేవారు. బాగా మార్కులొచ్చే నేను ఆయన వెంటపడి, ఆయన తీసుకెళ్తే సినిమాకెళ్ళా. కానీ, ఆ రోజున నా లెక్క తప్పి, మా చుట్టాలెవరో రావడంతో, మా నాన్న గారు రోజూ కన్నా ముందే ఇంటికి వచ్చారు. నన్ను చూసి, ఎక్కడికెళ్ళావంటే మాస్టారితో సినిమాకు వెళ్ళానని చెప్పా. కానీ, నేను అబద్ధం చెప్పాననుకొని, నాన్న గారు లాగి లెంపకాయ కొట్టారు. నా జీవితంలో మా నాన్న గారు నన్ను కొట్టింది అదొక్కసారే. అబద్ధం చెప్పాననుకొన్న నాన్న గారు మరునాడు ఆదివారమైనా సరే, సైకిలెక్కి ఊరంతా తిరిగి, మాస్టార్ని వెతికి, కలిసి నేను చెప్పింది నిజమేనని తెలుసుకున్నారు. ఇంటికి రాగానే, చిన్నవాడినైన నాకు అంత పెద్దాయన ‘సారీ’ చెప్పారు. నిజం చెప్పడంలోని రుచి తెలిశాక, దాన్నెవరూ ఒదులుకోరు. ప్రాణ మాన విత్తాలకు భంగం కలిగేటప్పుడు అబద్ధమాడినా పాపం కాదని పెద్దలే చెప్పారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో ‘నీతో నువ్వు అబద్ధం ఆడకు. ఎవరి నుంచైనా తప్పిం చుకోగలవేమో కానీ, నీ నుంచి నువ్వు తప్పించు కోలేవు’. అదే నా సిద్ధాంతం. గాంధీజీ రాజకీయ ప్రయోగాల మాటెలా ఉన్నా, వ్యక్తిగా ఆయన నిబద్ధతపై ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. తాను చేసిన ప్రయోగాలూ, వాటిలో వైఫల్యాలు దాపరికం లేకుండా చెబుతూ, జీవితాంతం నమ్మినవాటికే కట్టుబడ్డ ఆయన వైయక్తిక నిష్ఠ నాకూ ఇష్టం. ఆయన తన పరిమి తుల్ని, తప్పుల్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. అందుకే, గాంధీ కన్నా గాంధీతత్వం నాకిష్టం. ‘మహాత్మ’లో ఎందరికో నచ్చిన నా పాట ‘ఇందిరమ్మ (కొంతమంది) ఇంటిపేరు కాదుర గాంధీ’లో ‘పదవులు కోరని పావనమూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి’ అనడంలో ప్రాచీన ఋషుల నుంచి గాంధీ దాకా అందరి తాత్త్వికత ఉంది. అలాంటి మంచి మాటలు కొందరినైనా ఆలోచింపజేయడం సంతోషం.’’ - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ప్రముఖ కవి - ఆలోచనాశీలి -
సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు కృషి
జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్ కరీంనగర్ అర్బన్ : జిల్లాను సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు అధికారులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని జెడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో ఎస్.సూరజ్‌కుమార్ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామపంచాయతీల్లో చేపట్టాల్సిన పారిశుధ్య పక్షోత్సవాలు, స్వచ్ఛభారత్ మిషన్‌పై శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూరజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రామసభలు నిర్వహించాలన్నారు. 3న గ్రామజ్యోతి కార్యాచరణ కమిటీలతో సమావేశం నిర్వహించి గ్రామాభివృద్ధి ప్రణాళికలపై చర్చించి ఆమోదించాలని చెప్పారు. 4న బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా కార్యాచరణ రూపొందించి మరుగుదొడ్డి లేని గృహాలను సర్వే ద్వారా గుర్తించి వంద శాతం నిర్మాణాలు చేపట్టాలని కోరారు. 5న రోడ్లను పరిశుభ్రం చేసి చెత్తాచెదారం, ముళ్ల పొదలు తొలగించాలన్నారు. 6న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 7న మురికి కాలువల పరిశుభ్రత, 8న ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, రక్షిత మంచినీటి పథకాల పరిశుభ్రత, 13న చేతుల పరిశుభ్రతపై పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటుచేయాలని సూచించారు. 14న మíß ళా ఆరోగ్య పారిశుధ్యంపై స్వశక్తి, గ్రామైక్య సంఘాలతో సమావేశాలు, అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 15న చేపట్టిన కార్యక్రమాలపై స్వచ్ పాఖ్వాడ సమీ„ý నిర్వహించి అందుకు సంబంధించిన రిపోర్టును జిల్లా పంచాయతీ అధికారికి పంపాలని సూచించారు. డివిజనల్ పంచాయతీ అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్, జిల్లా శిక్షణ మేనేజర్లు కోట సురేందర్, సంతోష్, విస్తరణాధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
జిల్లాలో 83 ‘స్వచ్ఛ’ గ్రామాలు
సెర్ప్ ప్రతినిధి బాలకృష్ణన్ జగదేవ్‌పూర్: రాష్ర్టంలో 2019 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి లోగా తెలంగాణలోని ప్రతి పల్లెను సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ(సెర్ప్) లక్ష్యమని సెర్ప్ ప్రతినిధి బాలకృష్ణన్, తెలంగాణ పల్లె ప్రగతి ప్రతినిధి సాయిలు అన్నారు. సోమవారం తెలంగాణ పల్లె ప్రగతిలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అమీర్‌తో కలిసి మండలంలోని రాయవరంలో మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో పర్యటిస్తూ మరుగుదొడ్ల నిర్మాణం, స్థితిగతులను ఆడిగి తెలుసుకున్నారు. మండల వెలుగు ఎపీఎం అనంద్, రాజులు వారికి పూర్తి వివరాలను వివరించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు. అనంతరం సెర్ప ప్రతినిధి బాలకృష్ణన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 150 మండలాల్లో 2,879 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 253 గ్రామ పంచాయతీల్లో వందశాతం సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించామని చెప్పారు. జిల్లాలో 17 మండలాల్లో 342 గ్రామాలను పల్లె ప్రగతి కింద ఎంపిక చేశామన్నారు. నేటి వరకు 83 గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించామని తెలిపారు. మిగతా గ్రామాలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయని చెప్పారు. మానవ అభివృద్ధే సెర్ప లక్ష్యమని, ఆ దిశగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పల్లె ప్రగతి పని విధానాలపై తెలుసుకొనేందుకే రాయవరం గ్రామానికి వచ్చామన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ ప్రతినిధి జంగంరెడ్డి, యంగ్ ప్రొపేసర్ వంశీకృష్ణ, సర్పంచ్ గణేశ్, ఎంపీటీసీ బాలమ్మ, కార్యదర్శి ప్రశాంత్, ఈజీఎస్ ఎపీఓ శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
హే రాం.. మందు.. మాంసం విందు!
గాంధీ జయంతి రోజున ఎక్సైజ్ అధికారుల నిర్వాకం నవాబుపేట: గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం వాడకాలు నిషిద్ధం. దీన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన వారే నిబంధనలు పక్కనబెట్టారు. మాంసం, మద్యంతో ఎక్సైజ్ అధికారులు విందు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో శుక్రవారం మద్యం అనర్థాలపై ఎక్సైజ్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ, సిబ్బంది.. తర్వాత నవాబుపేట దగ్గరలోని ఓ తోటలో మద్యం, మాంసంతో విందు చేసుకున్నారు. విషయం తెలుసుకుని మీడియా అక్కడికెళ్లగానే పలాయనం చిత్తగించారు. గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం ముట్టకూడదు కదా? అని ప్రశ్నించగా, మాంసం తినడం నేరమా? అని అధికారులు ప్రశ్నించారు. సదస్సులో మద్యం మానమని ప్రమాణం చేయించామని, మాంసం మానమని కాదంటూ వెళ్లిపోయారు. -
మద్యం విక్రయిస్తున్న షాపులపై దాడులు
అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గాంధీ జయంతి రోజు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. అనంతరం దుకాణాలను మూసి వేశారు. పట్టణంలో మద్యం దుకాణాల వద్ద అమ్మకలు జరుగుతున్నాయని ఎక్సైజ్ సీఐ అన్నపూర్ణకు సమాచారం అందింది. దీంతో ఆమె కళ్యాణదుర్గంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న షాపులను మూసివేశారు. ఇలాంటివి మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం దుకాణ వ్యాపారులను సీఐ అన్నపూర్ణ హెచ్చరించారు. -
కేతిరెడ్డి జీవిత సాఫల్యం
సినీ దర్శక -నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. నెల్లూరులో 25 కళా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కే తిరెడ్డి మాట్లాడుతూ- ‘‘నెల్లూరులో పుట్టడం నాకు ఆ దేవుడిచ్చిన వరం. తెలుగు భాషాపరిరక్షణ ఉద్యమ నాయకునిగా నెల్లూరు జిల్లా నన్ను నిలబెట్టింది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులో పాఠశాల స్థాయిలో తెలుగు భాషా బోధన రద్దుకు నిరసనగా ఉత్తరాల ద్వారా ఉద్యమం చేయనున్నాం. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
అందని ద్రాక్ష.. క్షమాభిక్ష
గాంధీ జయంతికి కనిపించని కదలిక - ఖైదీలకు క్షమాభిక్షపై సర్కారు మీమాంస - వెలువడని ఉత్తర్వులు సాక్షి, హన్మకొండ: చేసిన తప్పునకు పశ్చత్తాపపడి తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆశిస్తున్న ఖైదీలు, మరికొంత కాలం జైలుజీవితాన్ని గడపకతప్పదు. గాంధీజయంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున తీపి కబురు అందుతుందేమోనేని ఆశిం చిన ఖైదీలకు నిరాశే ఎదురైంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైళ్లో వెయ్యి మంది వరకు ఖైదీలు ఉండగా వీరిలో సత్ప్రవర్తన కలిగి ప్రభుత్వం ఇచ్చే క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలు 50 మంది వరకు ఉన్నారు. రెండోఏడు : శిక్షాకాలంలో సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర, గణతంత్ర, గాంధీజయంతి వంటి జాతీయపండుగల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తోంది. రాష్ట్రంలో చివరి సారిగా 2013 గాంధీజయంతి సందర్భంగా క్షమాభిక్షను ప్రసాదించారు. అప్పటి నుంచి 2014, 2015 సంవత్సరాల్లో గణతంత్ర, స్వాంత్రదినోత్సం, గాంధీజయంతిల సంధర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. క్షమాభిక్షకు ఎవరు అర్హులు : జైళ్లో శిక్ష కాలంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గించడాన్ని రెమిషన్ అంటారు. ఈ రెమిషన్లు సాధారణ, ప్రత్యేక, ప్రభుత్వ అని మూడు రకాలుగా ఉన్నాయి. జైళ్లశాఖ నిబంధనల ప్రకారం 1) సత్ప్రవర్తనతో మెలిగితే నెలకు రెండు రోజులు 2) రోజువారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తే నెలకు మూడు రోజులు 3) ఏడాది కాలంలో ఏ తప్పు చేయకుండా ఉంటే 20 రోజులు రెమిషన్ ఇస్తారు. దీన్ని సాధరణ రెమిషన్ అంటారు. ఇలా కాకుండా దుస్తులు ధరించడంలో పొదుపు, జైలు అధికారుల విధుల్లో సహాకారం అందించడం, చేతివృత్తులను బోధించడం, పరిశ్రమ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించడం, కొన్ని ప్రత్యేక సంధర్భాల్లో జైలు అధికారులకు సహాకరించడం, అధికారులను దాడుల నుంచి కాపాడటం వంటి పనులు చేసిన వారికి ఏడాదికి 30 నుంచి 60 రోజుల పాటు శిక్షాకాలంలో కోత విధిస్తారు. దీన్ని ప్రత్యేక రెమిషన్ అంటారు. సాధారణ, ప్రత్యేక రెమిషన్లు కలిపితే ఖైదీ శిక్షాకాలంలో మూడోవంతుకు మించకుండా ఉండాలి. అంటే ఒక ఖైదీకి పదేశ్లు శిక్షపడితే అందులో రెమిషన్ మూడేళ్లు మించకూడదు. అంటే సత్ప్రవర్తన కారణంగా మూడేళ్లకు మించి శిక్షాకాలాన్ని తగ్గించుకునే వీలులేదు. ప్రభుత్వ రెమిషన్ : ఖైదీల సత్ప్రవర్తనతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల స్థితి గతులను పరిగణలోకి తీసుకుని వారి శిక్షాకాలాన్ని తగ్గించడాన్ని ప్రభుత్వ రెమిషన్ అంటారు. ప్రభుత్వం రెమిషన్ ఇవ్వాలంటే విడుదల తేది నాటికి (గణతంత్ర, స్వాతంత్ర, గాంధీజయంతి) ఆ ఖైదీ ఏడేళ్ల వాస్తవ శిక్ష అనుభవించి రెమిషన్‌తో కలిపి పదేళ్ల శిక్ష పూర్తి చేయాలి. అదే మహిళలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల విషయంలో ఐదేళ్ల వాస్తవ శిక్షతో పాటు రెమిషన్‌తో కలిపి ఏడేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసి ఉండాలి. ఇలా చేసిన ఖైదీలను జాతీయ పండుగలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. క్షమాభిక్షకు అర్హులు కానీవారు : మత సంబంధమైన కేసులు, ఉరిశిక్ష నుంచి జీవితఖైదుగా మారడం, ప్రభుత్వ ఉద్యోగులకు హత్య చేయడం, నిత్యావసర వస్తువుల అక్రమరవాణా నిరోధక చట్టం, మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, మహిళలపై నేరాలకు సంబంధించి 354, 376, 498(ఏ) వంటి సెక్షన్ల కింద జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు, పెరోల్‌పై విడుదలై సకాలంలో రాని వారు, మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల కేసుల్లో శిక్షలు పడ్డవారు. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చట్టాల పరిధిలో శిక్షలు పడిన ఖైదీలు క్షమాభిక్షకు అర్హులు కారు. -
ఆ హక్కు రాష్ట్రాలకు లేదు...
న్యూఢిల్లీ: అక్టోబర్ 2 గాంధీ జయంతి జాతీయ సెలవు రోజును మార్చే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్ నాయక్ లేవనెత్తిన ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. అది ప్రింటింగ్ తప్పిదమని, దాని సరిచేస్తామని పేర్కొన్నారు. గోవాలోని బీజేపీ ప్రభుత్వం క్రిస్మస్, గుడ్ ఫ్రైడే పండుగలకు సెలవు ప్రకటించి, గాంధీ జయంతిని విస్మరించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
కల్యాణల క్ష్మి పట్టాలెక్కేనా ?
ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కల్యాణలక్ష్మి పథకం జిల్లాలో ఆరు నెలలుగా పట్టాలెక్కడం లేదు. జాతిపిత గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం వివరాలు ఇంకా లబ్ధిదారుల ముంగిటకు చేరడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 25 రోజుల్లో ముగియనుండగా లబ్ధిదారుల ఎంపిక అంశం ఇంకా కొలిక్కి రావడం లేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వార్షికాదాయం 2లక్షల రూపాయల లోపున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహానికి రూ.51వేలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఏడాది అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నుంచి పథకం అమల్లోకి వచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద అర్హులైన 3,550 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే పథకం నియమ నిబంధనలు, దరఖాస్తు విధానంపై లబ్ధిదారులకు అవగాహన కొరవడింది. మరోవైపు లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన కూడా పథకం పురోగతిపై అడ్డంకిగా మారింది. పథకం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా పథకం నియమ నిబంధనలకు సంబంధిత వర్గాలకు అవగాహన కొరవడింది. విస్తృత ప్రచారం కల్పించాల్సిన అధికార యంత్రాంగం నేటికీ దృష్టి సారించడం లేదు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కేవలం 387 దరఖాస్తులు మాత్రమే కల్యాణలక్ష్మి పథకం కింద సాయం చేయాలంటూ అందాయి. వీటిలో 215 దరఖాస్తులను పరిశీలించి, మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 172 దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. పథకం కోసం జిల్లాకు ఇటీవల రూ.6 కోట్లు మజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో రూ.1.09 కోట్ల మేర లబ్ధిదారులకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. కొరవడిన ప్రచారం ఇటీవల జిల్లాను సందర్శించిన ఎస్సీ అభివృద్ధి సంస్థ డెరైక్టర్ ఎంవీ రెడ్డి కల్యాణలక్ష్మి పథకం అమలు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకం అమలును వేగవంతం చేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. పోస్టర్లు, హోర్డింగులు, కళాజాతా వంటి కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలపై దృష్టి సారించి ప్రచార కార్యక్రమాలు రూపొందించాల్సిందిగా సూచించారు. మరోవైపు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గ్రామైఖ్య సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలను కూడా కల్యాణలక్ష్మి పథకం ప్రచారంలో భాగస్వాములను చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.