ఘనంగా గాంధీ జయంతి | pledged on swacha india in offices | Sakshi
Sakshi News home page

ఘనంగా గాంధీ జయంతి

Published Fri, Oct 3 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

pledged on swacha india in offices

 ఇందూరు: ప్రభుత్వ కార్యాలయాలలో గురువారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ భారత్’ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

 జిల్లా పరిషత్‌లో
 జడ్‌పీ సమావేశ మందిరంలో, జిల్లా పంచాయ తీ కార్యాలయంలో డీపీఓ సురేశ్‌బాబు గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అ ర్పించారు. ఉద్యోగులందరిచే స్వచ్ఛ భారత్ ప్ర తిజ్ఞ చేయించి, గాంధీ జీవిత చరిత్రను వివరిం చారు. అనంతరం ఉద్యోగులు కార్యాలయ పరి సర ప్రాంతాలలో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కల ను, గడ్డిని శుభ్రం చేశారు. ఇందులో జడ్‌పీ ఉ ద్యోగులు సాయన్న, సాయిలు, డీపీఓ ఏఓ రా జేంద్రప్రసాద్, లక్ష్మారెడ్డి, ప్రభాకర్, సిద్ధిరాము లు, అరుణ్‌కుమార్, కృష్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.

 ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో
 గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయంలో ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి గాంధీ చిత్ర పటానికి పూ ల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని ఉద్యోగుల చే ప్రతిజ్ఞ చేయించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలలలో, అంగన్‌వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం, మురుగు కాలువలు, చెత్త ని ర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అ వగాహన కలిగించాలని ఉద్యోగులకు సూచిం చారు. 2019 నాటికి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కా ర్యాలయ ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.

 ఐసీడీఎస్ ఆధ్వర్యంలో
 గాంధీ జయంతిని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఐసీడీఎస్ ఆవిర్భావ ది నోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ రాములు గాంధీ చిత్ర ప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఉద్యోగులు కార్యాలయం పరిసరాలను శుభ్రం చేశారు.  

 టీడీపీ ఆధ్వర్యంలో
 తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ అరికె ల నర్సారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అ ర్పించారు. టీడీపీ నగర అధ్యక్షుడు రత్నాకర్, రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement