పెద్దల పండుగకు.. ​‘గాంధీ’ గండం | Gandhi Jayanti 2024 | Sakshi
Sakshi News home page

పెద్దల పండుగకు.. ​‘గాంధీ’ గండం

Published Mon, Sep 30 2024 8:27 AM | Last Updated on Mon, Sep 30 2024 9:09 AM

Gandhi Jayanti 2024

అటు గాంధీ జయంతి, ఇటు మహాలయ అమావాస్య  

మద్యం, మాంసంపై ఆ రోజు నిషేధం

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఓ విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ప్రతి ఏటా మహాలయ అమవాస్య రోజున పెద్దల పండుగ చేసుకుని శక్తికొద్దీ మాంసాహారాన్ని భుజించడం తరతరాల సంప్రదాయం. ఈసారి గాంధీ జయంతి అయిన అక్టోబరు 2వ తేదీన ఈ పర్వదినం రావడంతో ఆటంకం ఏర్పడింది. పెద్దల పండుగ అంటేనే మద్యం, మాంసం ఉంటాయి. స్వర్గస్తులైన పెద్దలకు అవి రెండూ నైవేద్యంగా సమరి్పంచి ఆపై తాము పుచ్చుకొంటారు. కానీ గాంధీ జయంతి రోజున మద్యం షాపులు, మాంసాహార విక్రయాలు నిషేధిస్తారు.  

అనుమతికి డిమాండ్‌  
ఈ నేపథ్యంలో గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పౌల్ట్రీ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ మనవి చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.  అనాదికాలంగా వస్తున్న సంప్రదాయానికి భంగపరచడం సబబు కాదని కొందరు పేర్కొన్నారు. ప్రజల డిమాండ్ల నేపథ్యంలో  ఏం చేయాలా? అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement