Liquor shops
-
మద్యం షాపులపై... బార్ ఓనర్స్ వార్
నరసరావుపేటటౌన్: మద్యం దుకాణాల యజమానులు అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడంపై బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనబాట పట్టారు. అధికార కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్సైజ్ అధికారులు తమను నిండా ముంచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసి యజమానులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తాము బార్లు నిర్వహించలేమని తాళాలను అధికారులకు అప్పగించారు. ఇప్పటికే నరసరావుపేట పట్టణంలో 17 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం మరో 11 వైన్ షాపులకు అనుమతులు ఇచ్చింది. ఆ వైన్ షాపుల్లో అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటుచేసి బార్ అండ్ రెస్టారెంట్లకు దీటుగా నిర్వహిస్తున్నారు.మాంసం, బిర్యానీ, ఇతర తినుబండారాలను అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉండటం, మద్యం కూడా బార్ అండ్ రెస్టారెంట్ల కన్నా తక్కువ ధరకు వస్తుండటంతో ఎక్కువ మంది వైన్ షాపుల వద్దకే వెళుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఎక్సైజ్ శాఖ ఆడుతున్న ఆటలో తాము బలైపోతున్నామంటూ నరసరావుపేటలోని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేసి ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బార్ల తాళాలను ఎక్సైజ్ శాఖ సీఐ సోమయ్యకు అందజేసి తాము వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పారు. వైన్ షాపుల్లో అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకునేవరకు తాము బార్లు తెరవబోమని స్పష్టం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బార్లు ఏర్పాటు చేసుకుంటే తమకు నెలకు రూ.5లక్షల వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నామన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కూటమి నేతలకు మేలు చేసేలా అధికారుల తీరు ఉందని, ఇలాగైతే వ్యాపారం చేయలేం మహాప్ర¿ో... అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు ఆందోళనను విరమించి వెనుదిరిగారు. -
‘కల్లు గీత కులాల’ మద్యం షాపులపై టీడీపీ సిండికేట్ పడగ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలను గుప్పిట పట్టిన టీడీపీ లిక్కర్ సిండికేట్.. ఇప్పుడు కల్లుగీత కులాలకు కేటాయించిన దుకాణాలనూ చేజిక్కించుకొంటోంది. కల్లు గీత కులాల కుటుంబాలకు 10 శాతం మద్యం దుకాణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటని కూడా సొంత సిండికేట్‌కే అప్పగిస్తోంది. అధికార సిండికేట్ బహిరంగంగా సాగిస్తున్న ఈ దందా ఇదిగో ఇలా ఉంది... వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి మద్యం దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాచబాట వేసింది. రాష్ట్రంలో అనుమతించిన 3,396 ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఒక్కటి కూడా సామాన్యులకు దక్కకుండా బెదిరింపులకు దిగి, టీడీపీ సిండికేటే మొత్తం చేజిక్కించుకుంది. ఇక కల్లు గీత కులాలకు కేటాయించిన 335 దుకాణాలను కులాలవారీగా రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. వీటిని కూడా టీడీపీ సిండికేట్‌కే అప్పజెప్పాలని ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అంటే కల్లు గీత కులాల దుకాణాలు టీడీపీ సిండికేట్ అదనపు దోపిడీకి సాధనంగా చేశారు. టీడీపీ సిండికేట్ వీటికి కూడా బినామీ పేర్లతో దరఖాస్తు చేసింది. కల్లు గీత కులాలకు చెందిన సామాన్య వ్యాపారులు, రాజకీయ నేపథ్యంలేని వారు దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే వారిని బెదిరించి బెంబేలెత్తించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, సాంకేతిక సమస్యలు సృష్టించి ఆ విధానం పనిచేయకుండా చేసింది. ఎక్సైజ్ కార్యాలయాల వద్ద టీడీపీ సిండికేట్ ముఠాలు మకాం వేసి, దరఖాస్తు చేసేందుకు వచ్చేవారిని బహిరంగంగానే బెదిరించి వెనక్కి పంపేశాయి. ఇదిగో మచ్చుతునక.. టీడీపీ సిండికేట్‌దందాకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఉదంతం ఓ మచ్చుతునక. ఒక దుకాణానికి దరఖాస్తు చేసేందుకు బ్రహ్మం గౌడ్ యత్నిoచారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి అనుచరుడైన టీడీపీ నేత శ్రీనివాస రెడ్డి అతనికి ఫోన్ చేసి తీవ్రంగా దూషించారు. దరఖాస్తు చేస్తే చంపేస్తానని బెదిరించారు. దాంతో బ్రహ్మం గౌడ్ భయపడిపోయారు. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి బెదిరింపుల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా పోలీసులు, టెండర్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోలేదు.దుకాణానికి 3 దరఖాస్తులు కూడా రాలేదు టీడీపీ సిండికేట్‌కు భయపడి కల్లు గీత కులాలకు చెందిన వ్యాపారులు దరఖాస్తు చేసేందుకు కూడా సాహసించడం లేదు. టీడీపీ నేతలే బినామీల పేర్లతో ఈ దుకాణాలకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుల తొలి గడువు బుధవారంతో ముగిసింది. వచ్చిoది కేవలం 768 దరఖాస్తులే. అంటే ఒక్కో దుకాణానికి సగటున మూడు దరఖాస్తులు కూడా రాకుండా టీడీపీ సిండికేట్ అడ్డుకుందన్నది సుస్పష్టం. ఇప్పుడు లాటరీ వేసినా సిండికేట్‌కే దుకాణాలు వస్తాయి. వాస్తవానికి సాధారణ దుకాణాలకు లైసెన్సు ఫీజు రూ.6 లక్షలు. కల్లు గీత కులాలకు కేటాయించిన దుకాణాలకు లైసెన్సు ఫీజు 50 శాతం తగ్గించి రూ.3 లక్షలే చేశారు. అయినా అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కల్లు గీత కులాల ముసుగులో టీడీపీ సిండికేట్‌కు ప్రయోజనం కలిగించేందుకే లైసెన్సు ఫీజును ప్రభుత్వం 50 శాతం తగ్గించిందని కూడా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.పొడిగింపు పేరిట డ్రామా.. కల్లు గీత కులాల దుకాణాల కోసం టీడీపీ సిండికేట్ సాగిస్తు న్న దందాపై విమర్శలు రావడంతో ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని బుకాయిoచేందుకు ప్రభు త్వం కొత్త ఎత్తుగడ వేసింది. దరాఖాస్తుల గడువు తేదీని ఈ నెల 8 వరకు పొడిగిస్తున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ మూడు రోజుల్లోనూ టీడీపీ సిండికేట్ ఎవరినీ దరఖాస్తు చేయనివ్వబోదన్నది అందరికీ తెలిసిన విషయమే. -
సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై అవాస్తవ ఆరోపణలతో, అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. దాంతో బాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. తాము చెప్పింది చెప్పినట్టు చేసే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తెర వెనుక ఉంటూ పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. కాగా సిట్‌కు నేతృత్వం వహించనున్న రాజశేఖర్ బాబుపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం.కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టలేని సీఐడీవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో సీఐడీ అక్రమ కేసు కుట్ర బెడిసికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ ఆధారాలను సృష్టించాలని, అక్రమ కేసులు బిగుసుకునేలా చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అక్రమ కేసుల బనాయింపులో తాము చెప్పిన లక్ష్యాలు సాధిస్తే ఆయనకు డీజీపీ పోస్టు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆరు నెలలుగా చేయని హడావుడి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డితోసహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని పలుసార్లు విచారణ పేరిట వేధించారు. ఆయన్ను అక్రమంగా రోజుల తరబడి నిర్బంధించి తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని, లేకపోతే అంతు చూస్తామన్న హెచ్చరికలతో సీఐడీ అధికారులు బరితెగించారు. డిస్టిలరీల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. ఇంత చేసినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించ లేకపోయారు. అవాస్తవ ఆధారాలతో కనికట్టు చేసేందుకు చేసిన యత్నాలు ఫలించ లేదు.సీఐడీ చీఫ్‌పై చినబాబు ఆగ్రహం రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపుల కేసులను తాము చెప్పినట్టు చేయడం లేదని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. చినబాబే అందరి ముందు ఆయనపై పరుష పద జాలంతో విరుచుకు పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. కుట్రకు పదునుపెట్టేందుకే సిట్‌మద్యం అక్రమ కేసు పేరిట వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తకుట్రకు తెరతీసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్ విఫలమయ్యారని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ అధికారి రాజశేఖర్ బాబును తెరపైకి తెచ్చారు. ఆయన నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సిట్ వంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. అంటే డీజీపీ, సీఐడీ, ఏసీబీ తదితర విభాగాల్లోని ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లా పోలీసు యంత్రాంగాల బాధ్యతలు నిర్వర్తించే పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు సిట్ బాధ్యతలు అప్పగించరు. ఎందుకంటే వారికి వారి జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు చాలా ముఖ్యం. అయితే అందుకు విరుద్ధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా ఉన్న రాజశేఖర్‌బాబును సిట్ చీఫ్‌గా నియమించడం గమనార్హం. అంటే తాము చెప్పినట్టు చేసే అధికారి, ఎంతటి అక్రమ కేసునైనా పెట్టి వేధించే అధికారికే బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని స్పష్టమవుతోంది. రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ సిట్ తెరవెనుక పాత్ర పోషించనున్నారు. ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్‌బాబు దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడుతారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే అసలు రాజశేఖర్‌బాబు ట్రాక్ రికార్డు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. మద్యం దందాతోపాటు పలు వ్యవహారాల్లో ఆయన అవినీతి బాగోతాన్ని కేస్ స్టడీలతోసహా ఉటంకిస్తున్నాయి. అసలు మద్యం వ్యవహారంపై సిట్ సంగతి తర్వాత.. అసలు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న పోలీస్ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలవుతోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సిట్ సభ్యులు వీరే.. సిట్ చీఫ్: ఎస్వీ రాజశేఖర బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్సభ్యులు: ఎల్. సుబ్బారాయుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీ (చంద్రబాబుకు వీర విధేయ అధికారి. అందుకే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రభుత్వ వైఫల్యం.. భక్తుల తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు. అయినా సరే ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ప్రస్తుతం సిట్‌లో సభ్యునిగా నియమించింది.)– కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ, విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం– ఆర్.శ్రీహరి బాబు, అదనపు ఎస్పీ, సీఐడీ– పి.శ్రీనివాస్, డీఎస్పీ, డోన్– కె.శివాజీ, సీఐ– సీహెచ్.నాగ శ్రీనివాస్, సీఐ -
మద్యం దుకాణంలో కమీషన్ల కోసం టీడీపీ నాయకుల వేధింపులు
-
కూటమి ప్రభుత్వంలో జోరుగా కాలం చెల్లిన లిక్కర్ విక్రయం
-
‘చుక్క’ తెచ్చిన చిక్కు
కూటమి ప్రభుత్వం మద్యం విధానంతో ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు, అడుగడుగునా బెల్ట్ షాపులు, దీంతో తాగడానకి నీళ్లు దొరకవేమో కానీ రాష్ట్రంలో మద్యానికి మాత్రం కొరత లేకుండా పోయింది. ఇక బాబుగారు సూపర్ సిక్స్‌లో భాగంగా రూ. 99కి ఇస్తున్న క్వార్టర్ మద్యం నాణ్యతకి ఎక్కడ తాగినవాళ్లు అక్కడే పడిపోతున్నారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో మద్యం తాగి స్పృహలేని స్థితిలో ఓ మహిళ, అదే స్థితిలో మరోవ్యక్తి ట్రాలీ రిక్షాలో పడి ఉండగా, కాస్త మెరుగ్గా ఉన్న మరో వ్యక్తి ఆ ట్రాలీని లాక్కుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు అవాక్కయ్యారు. -
బాలయ్య ఇలాకాలో మామా ఏక్ పెగ్గులా..
-
3 క్వార్టర్లు, 6 ఫుల్లుల్లా కూటమి మద్యం దందా
-
కేరళ లిక్కర్ వ్యాపారులకు టీడీపీ నేతల వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:కేరళ మద్యం వ్యాపారులకు టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. నూతన మద్యం పాలసీలో భాగంగా విశాఖపట్నంలో లాటరీ ద్వారా ఇటీవల 9 మద్యం షాపులను కేరళ మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. కేరళ,టీడీపీ నేతల మద్యం షాపులు పక్కపక్కనే ఏర్పాటయ్యాయి. దీంతో ఆ షాపులతో తమ మద్యం షాపులకు నష్టం వస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహించారు.విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న కేరళ వ్యాపారుల షాపులను మూసివేయాలని హెచ్చరించారు. షాపులను మూసివేయాలంటూ ఎక్సైజ్ అధికారుల ద్వారా ఒత్తిడి చేశారు.వేరే ప్రాంతంలో షాపులు పెట్టుకోవాలని కేరళ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.కేరళ వ్యాపారులకు అద్దెకు ఇచ్చిన భవన యజమానులను కూడా టీడీపీ నేతలు బెదిరించారు.భవనాలు వెనక్కి తీసుకోకపోతే కూలగొట్టిస్తామని బెదిరిస్తామనే వరకు టీడీపీ నేతలు వెళ్లినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి -
దౌర్జన్యంగా అగ్రిమెంట్లు!
సాక్షి నెట్వర్క్: మద్యం దుకాణాల లాటరీ తంతు ముగియడంతో అక్కడక్కడా స్వల్పంగా షాపులు దక్కించుకున్న ఇతరులకు టీడీపీ సిండికేట్ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకుగానూ లాటరీ ముసుగులో 80 శాతం షాపులను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్ మిగిలిన 20 శాతం షాపుల లైసెన్సులు పొందిన వారిని నయాన భయాన దారికి తెచ్చుకుంటోంది. తమను ధిక్కరించి వ్యాపారం చేయలేరని.. వాటాలు చెల్లిస్తారో, దుకాణాలు అప్పగిస్తారో తేల్చుకోవాలని లేదంటే ఎక్సైజ్, పోలీసు దాడులు తప్పవని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా ముగిసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ ప్రక్రియ కొనసాగింది. మంత్రి జనార్ధన్‌రెడ్డి వర్గం బెదిరింపులు..⇒ బనగానపల్లె నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న ఇతరులు గుడ్‌విల్ తీసుకుని తమకు అప్పగించాలని లేదంటే 25 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమ మాట వినకుంటే అద్దెకు గదులు కూడా దక్కకుండా చేస్తామని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి వర్గం హెచ్చరిస్తోంది. ⇒ డోన్‌లో 16 దుకాణాలు ఉండగా ధర్మవరం సుబ్బారెడ్డికి 3, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ వర్గానికి 2, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వర్గానికి రెండు, ఎస్సీవై రెడ్డి కుమారైకు ఒకటి, మిగతా 8 దుకాణాలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గం దక్కించుకుంది. ⇒ కోడుమూరులో టీడీపీ ఇన్చార్జీ విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్‌గా ఏర్పడి తమ వర్గంలో చేరాలని ఇతరులను ఒత్తిడి చేస్తున్నారు. ⇒ నంద్యాలలో 30 శాతం కమీషన్ ఇవ్వాలని మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్ బెదిరిస్తున్నారు. దీంతో ఇద్దరు వ్యక్తులు దుకాణాలను టీడీపీకే గుడ్‌విల్‌కు ఇచ్చేశారు. ఒక్కో షాపు రూ.20 లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం. ⇒ శ్రీశైలంలో 25 శాతం వాటా లేదంటే గుడ్‌విల్‌కు దుకాణాలు తమకు ఇవ్వాలని ఎమ్మెల్యే బుడ్డా వర్గీయులు చెబుతున్నారు. ⇒ పత్తికొండలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వర్గీయులు ఫోన్ చేసి వాటిని తమకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే తమతో ఉండాలని చెబుతున్నారు. కప్పం కట్టలేక షాపు వదిలేసి..చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీకి చెందిన కల్లు బాల, కృష్ణారెడ్డి, కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్‌కు లక్కీడిప్‌లో మద్యం దుకాణాలు దక్కాయి. అయితే ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి సోదరుడు విష్ణువర్థన్‌రెడ్డి బెదిరించి వారి నుంచి వాటిని లాక్కున్నారు. కల్లు బాల సతీమణి ఎస్ భారతి పేరున బైరెడ్డిపల్లి మద్యం దుకాణం లాటరీ ద్వారా వచ్చింది. షాపును దక్కించుకున్న కల్లు బాలను ఎమ్మెల్యే సోదరుడు ఇంటికి పిలిపించుకుని అనుచరులతో దాడి చేశాడు. తమను కాదని మరెవరూ షాపు నడపటానికి వీల్లేదని, స్థలం ఎవరు ఇస్తారో చూస్తామంటూ హెచ్చరించాడు. రూ.కోటి కప్పం కట్టాలని ఆదేశించడంతో లాటరీ ద్వారా వచ్చిన దుకాణాన్ని కల్లు బాల వదులుకున్నారు. కృష్ణారెడ్డి తనకు లాటరీలో వచ్చిన మద్యం దుకాణాన్ని వదిలేసుకున్నారు. వారిని బెదిరించి మద్యం దుకాణం పర్మిట్ అమ్ముకున్నట్లు బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకున్నారు. కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్ ఆచూకీ తెలియరాలేదు. ⇒ పూతలపట్టులో ఎమ్మెల్యే మురళీమోహన్ వర్గీయులు స్థానిక సీఐ ద్వారా టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులతో మంతనాలు నెరిపారు. దుకాణాలను వదులు కోవాలని లేదంటే వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు లక్కీ డిప్ తీసే రోజు నేరుగా కలెక్టర్‌కే ఫోన్ చేసి తమ వారికే దుకాణాలు దక్కేలా చూడాలని కోరినట్లు తెలిసింది. కలెక్టర్ స్పందించకపోవటంతో టెండర్లు దక్కించుకున్న వారిని ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. ⇒ తిరుపతిలో 32 దుకాణాలకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బినామీ పేర్లతో 350 దరఖాస్తులు చేయగా ఆరు షాపులు దక్కాయి. దుకాణాలు నడవాలంటే తమకు వాటా ఇవ్వాల్సిందేనని ఇతరులను బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరులో దరఖాస్తు దారులను ముందే పిలిచి ఎమ్మెల్యేలు అడిగినంత వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కడపలో నేరుగా బేరసారాలు..⇒ వైఎస్సార్ కడప జిల్లాలో మద్యం షాపు సవ్యంగా నిర్వహించుకోవాలంటే 50 శాతం భాగస్వామ్యం ఇవ్వాలని కొందరు హెచ్చరిస్తుండగా పూర్తిగా తమకే అప్పగించాలని మరికొందరు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కడపలో టీడీపీయేతర వర్గీయులకు చెందిన మద్యం షాపులల్లో 50 శాతం వాటా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి బేరసారాలకు దిగారు. జనసేన వర్గీయులకు మూడు మద్యం దుకాణాలు లభించగా ఒక్కొక్కటి రూ.15 లక్షలు చొప్పున గుడ్‌విల్‌కు అప్పగించారని సమాచారం. జమ్మలమడుగులో ప్రతి షాపులో 30 శాతం వాటా ఇవ్వాలంటూ టీడీపీ ఇన్చార్జీ దేవగుడి భూపేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ముద్దనూరు షాపు పూర్తిగా తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. కమలాపురంలో పునీత్ బార్ అండ్ రెస్టారెంట్‌ను ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మూసివేయించారు. తాము వారించినా వినకుండా చెన్నూరు మద్యం షాపు కోసం దరఖాస్తు చేశారంటూ దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ధర్మవరంలో పరిటాల వర్గం పర్యవేక్షణ.. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న తటస్థులు కూటమి నాయకుల బెదిరింపులతో షాపులను అప్పగించినట్లు సమాచారం. ఈ సిండికేట్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాం ఆధ్వర్యంలో జరుగుతోంది. సోమందేపల్లిలో లైసెన్స్‌దారు దీక్షితను బెదిరించి గుడ్‌విల్‌కు షాపు దక్కించుకున్నారు. సీకే పల్లి స్టేషన్, కదిరి పరిధిలో దుకాణాలకు సంబంధించి పంచాయితీ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో షాపు దక్కించుకుని ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన రంగనాథ్ నుంచి దుకాణం లాక్కునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 127వ మద్యం షాపును దక్కించుకున్న హోటల్ నిర్వాహకుడు దినేష్ కుమార్ నాయుడు లొంగకపోవడంతో టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులను ఉసిగొల్పి హోటల్లో తనిఖీలు జరిపి నోటీసులు ఇప్పించారు. చేయి కలిపితేనే సహకారం..⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట, ముమ్మిడివరం పరిధిలో సిండికేట్ ప్రాబల్యం అధికంగా ఉంది. దుకాణాలు దక్కించుకున్నవారు ఇతరులు తమతో చేయి కలపాలని ఒత్తిడి చేస్తున్నారు. రావులపాలెం మండలం ఈతకోటలో మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఇతరులను సిండికేట్ ఒత్తిడితో స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. ముమ్మిడివరంలో దుకాణాలు పొందిన మిగిలినవారిని తమ సిండికేట్‌లోకి తెచ్చుకునేందుకు టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రదర్శిస్తున్నారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మండలాలకు గాను ఒక్కో చోట నాలుగు నుంచి తొమ్మిది వరకు షాపులు ఏర్పాటు అవుతున్నాయి. కొత్త పాలసీ ప్రకారం షాపులు దక్కినవారు మండలంలో ఎక్కడైనా షాపు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా జరిగే మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో షాపుల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ⇒ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గానికి 11 దుకాణాలు దక్కాయి. మిగిలిన షాపులు పొందిన వారు 25 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ వర్గం ఇతరుల నుంచి 25 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ⇒ కాకినాడ జిల్లాలో కొత్తగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన వారిని సిండికేట్ నయానా భయానా దారిలోకి తెచ్చుకుంటోంది. తొండంగి, కోటనందూరు, తునిలో ఏడు షాపులు దక్కించుకున్న వారు కౌన్సెలింగ్‌లో మాట వినకపోవడంతో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎక్సైజ్ పోలీసులు మీకు ఎలా సహకరిస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ఒక్కో షాపులో 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వెనిగండ్ల వర్గం వార్నింగ్‌లు⇒ కృష్ణా జిల్లా పామర్రులో 75 శాతం షాపులను దక్కించుకున్న టీడీపీ నేతలు మిగిలిన వారిని వాటాలు ఇవ్వాలని ఫోన్లు చేస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోదరుడు షాపులు దక్కించుకున్న వారిని తన అనుచరులతో కలసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. వంగవీటి రాధా, కాజ రాజ్‌కుమార్ వర్గీయులు గుడివాడలో ఐదు షాపులు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి వారు ఎదురు తిరిగినట్లు సమాచారం. ఉదయభాను వర్గం ఒప్పందాలు.. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సిండికేట్ 11 షాపులను దక్కించుకుంది. మిగిలిన 12 దుకాణాలను టీడీపీ నేతలు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులు దక్కించుకున్నారు. పెనుగంచిప్రోలులో విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దుకాణాన్ని దక్కించుకోగా గుడ్ విల్ కింద జనసేన నేత ఉదయభాను వర్గం రూ.90 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. జగ్గయ్యపేటలో దుకాణం పొందిన తెలంగాణ వాసితో ఎమ్మెల్యే సోదరుడు గుడ్‌విల్ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తిరువూరులో తెలంగాణ వ్యాపారులే ఎక్కువ షాపులు దక్కించుకున్నారు. మైలవరంలో 15 షాపులకుగానూ టీడీపీ సిండికేట్‌కే 14 దక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు కనుసన్నల్లో టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. నందిగామలో షాపులన్నీ ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. పల్నాడులో డబ్బులు కడితేనే..⇒ పల్నాడు జిల్లాలో తాము చెప్పిన మొత్తం తీసుకొని దుకాణాలు అప్పగించాలని లేదంటే 50 శాతం వాటా ఇవ్వాలని సిండికేట్ బెదిరిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గంలో మద్యం పంచాయితీ ఇంకా తేలలేదు. సత్తెనపల్లిలో రూ.30 లక్షలు కట్టిన తరువాతే దుకాణాలు తెరుచుకోవాలని ఓ టీడీపీ నేత అల్టిమేటం జారీ చేశారు. పెదకూరపాడులో ప్రతి దుకాణంలో 20 వాటా ఇవ్వాలని లెక్క తేల్చారు. ⇒ బాపట్ల జిల్లాలో టెండర్లకు ముందే రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో సిండికేట్ ఏర్పాటైంది. తమతో కలవకుంటే షాపులు నిర్వహించలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టెక్కలిలో ఏకఛత్రాధిపత్యం⇒ టెక్కలి నియోజకవర్గంలో ప్రత్యర్థులే లేకుండా పోవడంతో కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే షాపులన్నీ నడుస్తున్నాయి. ⇒ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో నాలుగు షాపులు దక్కించుకున్న ఇతరులకు ఫోన్ చేసిన ఓ ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.25 లక్షలు చొప్పున ఇస్తానంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ⇒ నరసన్నపేటలో 76వ నెంబర్ షాపు అప్పగించినందుకు ఏడాదికి రూ.20 లక్షలు చెల్లిస్తామన్న టీడీపీ ప్రజాప్రతినిధి ఆఫర్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది. ⇒ పాతపట్నంలో పలు దుకాణాలు ఒడిశాకు చెందిన వ్యాపారులకు దక్కడంతో వారికి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ చేసి గుడ్‌విల్‌కు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
మద్యంపై పన్నుల మోత
సాక్షి, అమరావతి: టీడీపీ సిండికేట్‌కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం ఇదే అదునుగా మద్యం మాఫియా దోపిడీకి అధికారికంగా తెరతీసింది. మద్యంపై భారీగా పన్నుల బాదుడుతోపాటు టీడీపీ నేతల డిస్టిలరీలు, మద్యం సిండికేట్లకు అడ్డగోలుగా భారీ లాభాలొచ్చేలా పన్నుల విధానాన్ని పునర్వ్యవస్థీకరించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం డిస్టిలరీలు, దుకాణదారులకు కలిపి 10 శాతం లాభాన్ని మార్జిన్‌గా విధించారు. తాజాగా ప్రభుత్వం డిస్టిలరీలు, మద్యం సిండికేట్లతో కుమ్మక్కై అధికారిక లాభాల మార్జిన్‌ను రెట్టింపు చేస్తూ 20 శాతానికి పెంచింది. ఆ మేరకు మద్యం ఉత్పత్తుల గరిష్ట ధర(ఎంఆర్పీ)ని నిర్ణయించనుంది. దాంతో ఓ వైపు మద్యం ధరల మోత మోగనుంది. మరోవైపు టీడీపీ సిండికేట్లకు కాసుల పంట పండనుంది. ఈ మేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను(ఏఆర్టీ)ను సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యసనాన్ని మాన్పించేందుకు డీ–అడిక్షన్ కేంద్రాల నిర్వహణ కోసం మద్యం ఉత్పత్తులపై 2 శాతం సెస్‌ను విధించింది. మత్తు వదిలించేందుకంటూ మద్యం ఉత్పత్తులపై పన్ను విధించి ఆదాయం ఆర్జించే ఎత్తుగడ వేయడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏకంగా 155 లిక్కర్ షాపులకు ఢిల్లీ వ్యాపారి దరఖాస్తులు.. ఇంతకీ లక్ తగిలిందా?
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వైన్‌షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా.. మరో వైపు ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఇక్కడి సిండికేట్లను మించి 155 వైన్‌షాపులకు దరఖాస్తులు చేశాడు. అమిత్ అగర్వాల్, నందినీ గోయల్, సారికా గోయల్, సౌరభ్ గోయల్ పేర్లతో దరఖాస్తులు సమర్పించాడు.ఒక్కో దుకాణ లాటరీకి దరఖాస్తు చేసిన 24 నుంచి 30 మంది మారుతున్నప్పటికీ ఆయన మాత్రం అక్కడి నుంచి కదలలేదు. వరుసగా అన్ని షాపుల లాటరీ నిర్వహణలోను పాల్గొనడంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎక్సైజ్ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. అతడిని ప్రశ్నించిన ఎక్సై జ్ అధికారులతో పాటు కలెక్టర్, జేసీ కూడా విస్తుపోయారు.155 షాపులకు దరఖాస్తు చేసినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో షాక్‌కు గురయ్యారు. అన్ని షాపులకు కలిపి దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లు అవుతుంది. అంత స్థాయిలో దరఖాస్తు ఫీజు చెల్లించి సదరు వ్యాపారికి లాటరీలో 6 షాపులు దక్కాయి. ఒడిశా నుంచి కూడా ఒక లిక్కర్ కింగ్ భారీగా దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. కేవలం 2 షాపులు మాత్రమే లభించాయి.ఇదీ చదవండి: ‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం -
కర్నూలులో కొనసాగుతున్న మద్యం షాపుల లాటరీ
-
ఏపీలో కాసేపట్లో మద్యం షాపుల లైసెన్సులకు లాటరీ
-
సర్కారు వారి కమీషన్ 30%
సర్కారు వారి కమీషన్ 30 శాతం.. ప్రస్తుతం ఇది ఏపీలో ట్రెండింగ్‌లో ఉన్న మాట.. ‘సర్కారు వారి పాట’ అంటే తెలుసు కానీ ‘సర్కారు వారి కమీషన్’ అంటే ఏంటనేది మీ సందేహమా? రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రతి మద్యం షాపు నుంచి అధికార పార్టీ నేతలకు అందే మామూళ్లన్న మాట.. నేడు నిర్వహించే మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియలో టీడీపీ సిండికేట్ కుట్ర ఇది.. ఇది తమను కాదని షాపులు దక్కించుకున్న వారు చెల్లించాల్సిన సొమ్ము గురించి హెచ్చరిక.. కమీషన్ ఇస్తారో.. లేక దుకాణాలు వదలుకుంటారో తేల్చుకోండని ఎమ్మెల్యే, ఎంపీల హుకుం..సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు దిగుతున్నారు. చాలా చోట్ల టీడీపీ సిండికేట్ సభ్యులు కానివారు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గుర్తించారు. వారిని బెదిరించి పోటీ నుంచి తప్పుకునేలా చేసేందుకు తమ మనుషులను వారి ఇళ్లపైకి పంపించారు. అప్పటికీ చాలా మంది దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో లాటరీ ప్రక్రియకు రెండు రోజుల ముందు నుంచి కొత్త ఎత్తుగడ వేశారు. లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ దక్కినా సరే.. వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు తమకు కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ‘అలా అయితేనే మద్యం దుకాణం నిర్వహించుకోగలరు.. లేదంటే మీ దుకాణం ఉండదు.. మీరూ ఉండరు’ అనే రీతిలో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మద్యం దుకాణాల లైసెన్సులన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారు మినహా ఇతరులను దరఖాస్తులు వేయనివ్వకుండా అడ్డుకుంది. అక్కడక్కడా ఎవరైనా దరఖాస్తులు వేసి ఉంటే.. వారినీ బెదిరించి తప్పుకునేలా చేసేందుకే తాజాగా కమీషన్ల పేరుతో బెదిరింపులకు బరి తెగించింది. తద్వారా భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడమే టీడీపీ సిండికేట్ ఎత్తుగడ. ఒక వేళ లాటరీలో లైసెన్స్ వస్తే.. ఆ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా పోటీ నుంచి తప్పుకునేలా చేయాలన్నది లక్ష్యం. దాంతో సహజంగానే ఆ మద్యం దుకాణం లైసెన్స్ టీడీపీ సిండికేట్‌కే కేటాయిస్తారు. అలా లాటరీ ద్వారా గానీ, ఇతరత్రాగానీ మొత్తం 3,396 మద్యం దుకాణాలన్నీ తమ గుప్పిట్లోనే ఉండేట్టు సిండికేట్ కుట్రను అమలు చేస్తోంది. నా కొ..ల్లారా.. కమీషన్ ఇవ్వాల్సిందే: జేసీ బూతుపురాణం ⇒ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో టీడీపీ మద్యం సిండికేట్ తరఫున టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనదైన శైలిలో మరోసారి పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలన్నీ తామే నిర్వహిస్తామన్నారు. అలా కాకుండా ఇతరులు ఎవరైనా సరే మద్యం, ఇసుక, ఇతర వ్యాపారాలు చేయాలంటే తమకు 15 శాతం కమీషన్ చెల్లించాలని, దాంతోపాటు తమకు 20 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ⇒ అసలు తమ నియోజకవర్గంలో మద్యం, ఇసుక దుకాణాల కోసం దరఖాస్తులు చేయడం ఏమిటని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహంతో చిందులు తొక్కారు. అలా దరఖాస్తు చేసిన వారి పేర్లను ప్రస్తావిస్తూ.. ‘నా కొ..ల్లారా.. అందర్నీ కాల్చి పార..’ అంటూ’ పచ్చి బూతులు తిట్టారు. ⇒ రామకృష్ణారెడ్డి.. దాచేపల్లి రామచంద్రారెడ్డి.. వేములపల్లి ప్రకాశ్‌రెడ్డి.. ఇలా పేర్లు చదువుతూ.. ముందు మీకు అవుతుంది. మిమ్మల్ని అసలు ఊర్లోకి రానివ్వను. అసలు ఎవడు సారా అంగడికి అప్లికేషన్ వేసిన నా కొ.. ఎవడు వాడు.. అని వీరంగం వేశారు. ‘ఎవరు సారా అంగడి పెట్టాలన్నా మండలానికి 15 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు తనకు (ప్రభాకర్ రెడ్డికి) 20 శాతం వాటా ఇవ్వాల్సిందే అని ఆదేశించారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాము చెప్పిందే జరుగుతుందన్నారు. అంతటా అవే బెదిరింపులు ⇒ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వర్గం మద్యం దుకాణాల ఆదాయంలో 30 శాతం కమీషన్ చెల్లించాలని హుకుం జారీ చేసింది. సమ్మతించకుంటే అసలు మద్యం దుకాణమే నిర్వహించలేరని హెచ్చరించింది. ⇒ నంద్యాల జిల్లా శ్రీశైలంలో టీడీపీ మద్యం సిండికేట్ తమ కమీషన్ రేటు 25 శాతం అని ప్రకటించింది. అందుకు సమ్మతిస్తేనే సోమవారం లాటరీ ప్రక్రియలో పాల్గొనాలని టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు హుకుం జారీ చేశారు. ⇒ ఉమ్మడి విశాఖలో మద్యం సిండికేట్ కింగ్‌గా గుర్తింపు పొందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మరోసారి తన దాదాగిరీ చూపిస్తున్నారు. విశాఖపట్నం– భీమిలి బీచ్‌రోడ్డుతోపాటు నగరంలోని ప్రధాన జంక్షన్లలో అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు తామే దక్కించుకునేలా బెదిరింపులకు దిగుతున్నారు. విశాఖలోని ఇతర ప్రాంతాలతో పాటు, అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తమ సిండికేట్ సభ్యులకేనని స్పష్టం చేస్తున్నారు. కాదని ఎవరైనా లైసెన్స్ దక్కించుకుంటే 30 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని సిండికేట్ స్పష్టం చేసింది. ⇒ శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్న వర్గం నేతృత్వంలోని టీడీపీ.. సిండికేట్‌కు నేతృత్వం వహిస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు మద్యం దుకాణాలన్నీ తమ సిండికేట్ గుత్తాధిపత్యంలో ఉండాల్సిందేనంది. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాఫురం నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఇతర వ్యాపారులను బెదిరించి బెంబేలెత్తించారు. ఇతరులకు లైసెన్స్ దక్కితే 25 శాతం కమీషన్ చెల్లించాలని రేటు ఫిక్స్ చేశారు. ⇒ విజయవాడలో ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కనుసన్నల్లోనే టీడీపీ మద్యం సిండికేట్ దందా సాగిస్తోంది. ఇతరులకు లైసెన్స్ దక్కితే 30 శాతం కమీషన్‌గా నిర్ణయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు లాటరీ ప్రక్రియలో పాల్గొనేందుకే బెంబేలెత్తాల్సిన అగత్యం కల్పించారు. ⇒ దెందులూరు, ఉండి నియోజకవర్గాలు మినహా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు ఏక మొత్తంగా 25 శాతం కమీషన్ ఖరారు చేశారు. ఆ మేరకు చెల్లిస్తేనే మద్యం దుకాణాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వర్గం మాత్రం తమకు 30 శాతం చెల్లించాలని చెప్పింది. దెందులూరు నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు తమ సిండికేట్‌కు దక్కాల్సిందేనని, ఇతరులకు లాటరీలో లైసెన్సులు దక్కినా దుకాణం ఏర్పాటు చేయనివ్వమని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం తేల్చి చెప్పింది. ⇒ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారిపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జా సు«దీర్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దరఖాస్తుదారులు డిపాజిట్ చేసేందుకు తెచ్చిన డీడీలనూ చింపి వారిని వెనక్కి పంపేశారు. ఇక లాటరీ ద్వారా ఇతరులకు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కితే.. నెలకు రూ.20 లక్షలు కమీషన్‌గా చెల్లించాలని ఎమ్మెల్యే వర్గం రేటు నిర్ణయించింది. అదీ రోజు వారీగా వసూలు చేస్తామంది. గూడూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్వర్గం మరో ఎత్తుగడ వేసింది. దరఖాస్తు చేసిన వారందరూ తమతోపాటు తమ వాహనాల్లోనే లాటరీ నిర్వహించే తిరుపతిలోని శిల్పారామం ప్రాంగణానికి రావాలని ఆదేశించింది. దుకాణానికి 26 దరఖాస్తులే..రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు మొత్తం 89,832 దరఖాస్తులొచ్చాయి. గడువు 11 సాయంత్రం 7 గంటలతో ముగిసింది. కానీ అప్పటికి క్యూలో ఉన్న వారికి కూడా అనుమతించామని చెబుతూ మొత్తం దరఖాస్తుల తాజా గణాంకాలను ఎక్సైజ్ శాఖ ఆదివారం విడుదల చేసింది. 11న మొత్తం దరఖాస్తులు 87,116గా పేర్కొనగా.. ఆదివారం మొత్తం దరఖాస్తులు 89,832 అని ప్రకటించింది. అయినా దుకాణానికి సగటున కేవలం 26.45 దరఖాస్తులే రావడం గమనార్హం. దరఖాస్తుల ద్వారా∙రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.‘లాటరీ’ అంతా వారి కనుసన్నల్లోనే..మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు సోమవారం లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ లాటరీ ప్రక్రియ కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాటరీ తతంగం అంతా తమకు అనుకూలంగా నిర్వహించేలా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. లాటరీ ప్రక్రియ నిర్వహించే కేంద్రం పూర్తిగా టీడీపీ సిండికేట్ సభ్యులతో కిక్కిరిసిపోయేట్టుగా చేయాలని ఆదేశించారు. ఇతరులు ఎవరొచ్చినా బెదిరించి వెనక్కి పంపాలని, అప్పటికీ ఎవరైనా వస్తే ఘర్షణకు దిగేందుకూ వెనుకాడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే అధికారులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయాలని, ఇతరులపై దాడులు చేయాలని చెప్పడం గమనార్హం. తమకు లైసెన్స్ రానప్పుడు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి లాటరీ ప్రక్రియను అడ్డుకోవాలని టీడీపీ సిండికేట్ కుట్ర. రెండు జిల్లాల్లో మంత్రి కొల్లు వర్గం వీరంగం ⇒ ఎక్సైజ్ శాఖ మంత్రిగా టీడీపీ మద్యం సిండికేట్‌లో తమదే సింహభాగం అని మంత్రి కొల్లు రవీంద్రవర్గం వీరంగం సృష్టిస్తోంది. అందుకే ఏకంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రధాన కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏక మొత్తంగా దక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. దరఖాస్తు చేసిన వారికి మంత్రి వర్గీయులు రెండు రోజులుగా ఫోన్లు చేసి మరీ తమదైన శైలిలో బెదిరిస్తుండటం గమనార్హం.⇒ మద్యం దుకాణాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలి.. లేదా మద్యం ఆదాయంలో 25 శాతం కమీషన్ అయినా ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 100 శాతం మద్యం దుకాణాలను మంత్రి వర్గీయులే ఏకపక్షంగా దక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. కాగా విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రుతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో దరఖాస్తులు చేసిన వారికి ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. ⇒ తాడేపల్లిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వారికి కూడా మంత్రి కొల్లు రవ్రీంద వర్గీయులు ఫోన్లు చేసి బెదిరించడం గమనార్హం. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వారిని కూడా బెదిరించడం ప్రాధాన్యం సంతరించుకుంంది. అంటే మంత్రి లోకేశ్ అండతోనే కొల్లు వర్గం రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది.భారీ దోపిడీకి పక్కా డీల్భారీ దోపిడీకి ప్రభుత్వ ముఖ్య నేతతో పక్కాగా డీల్ కుదరడం వల్లే టీడీపీ మద్యం సిండికేట్ బరితెగిస్తోంది. ప్రైవేటు మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరతో విక్రయించేందుకు ముఖ్య నేత ఇప్పటికే పచ్చ జెండా ఊపారు. ఒక్కో బాటిల్‌పై మద్యం దుకాణంలో రూ.15 అధికంగా.. బెల్ట్ షాపుల్లో అయితే రూ.25 అధికంగా విక్రయించేందుకు అనుమతించారు. అందులో ఒక్కో బాటిల్‌పై కరకట్ట బంగ్లాకు రూ.3 చొప్పున కప్పం కట్టాలన్నది డీల్‌లో ప్రధాన అంశం. మిగిలింది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి ఆధ్వర్యంలోని సిండికేట్ సభ్యులకు దక్కుతుంది. పక్కాగా డీల్ కుదరడంతో టీడీపీ సిండికేట్ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకునేందుకు అక్రమాలు, బెదిరింపులకు తెగించింది. -
సిండికేట్ కైవశం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేటే పైచేయి సాధించింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఆ ‘పచ్చ’ముఠా పూర్తిగా హైజాక్ చేసేసింది. ప్రభుత్వ ముఖ్య నేత పన్నాగం.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెండర్ల వైపు ఇతరులెవ్వరూ కన్నెత్తి చూడకుండా ఎప్పటికప్పుడు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ హడలెత్తించారు. తద్వారా.. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ దోపిడీకి మొదటి అంకాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 87,116 దరఖాస్తులు రాగా.. వాటిలో దాదాపు 99 శాతం టీడీపీ మద్యం సిండికేట్‌వే. సాధారణ వ్యాపారులు దరఖాస్తులు దాఖలు చేయకుండా.. అదే సమయంలో తమలో తామే పోటీపడినట్లు బిల్డప్ ఇస్తూ మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ఏకపక్షంగా పూర్తిచేశారు. ఇక లాటరీ ద్వారా టీడీపీ సిండికేట్ ఏకపక్షంగా మొత్తం 3,396 దుకాణాలను దక్కించుకోవడం.. ఆ తర్వాత యథేచ్ఛగా మద్యం ఏరులను పారిస్తూ భారీ దోపిడీకి తెగబడటమే తరువాయి.టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దందా..2014–19 కంటే రెట్టింపు స్థాయిలో మద్యం వ్యాపారం ద్వారా దోపిడీయే లక్ష్యంగా అధికార టీడీపీ కూటమి మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియను శాసించింది. ఎందుకంటే ఏకంగా ముఖ్యనేతే ఇందుకు పచ్చజెండా ఊపడంతో ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డూ అదుపులేకుండా చెలరేగిపోయారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ మద్యం సిండికేట్‌ను ఏర్పాటుచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినవారు తప్ప ఇతరులెవరూ దరఖాస్తులు చేయడానికి వీల్లేదని హెచ్చరికలు జారీచేశారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేసినా వారికి మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎవరూ షాపులు అద్దెకు ఇవ్వకూడదని బహిరంగంగానే ప్రకటించారు. ఇక ఇతరులు తమ సొంత దుకాణాల్లో ఏర్పాటుచేసుకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో తరచూ తనిఖీలు, దాడులతో వేధిస్తామని అల్టిమేటం జారీచేశారు. అయినా కొందరు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడి బెదరగొట్టారు. దీంతో అసలు టెండర్లు దాఖలు చేసేందుకు సాధారణ వ్యాపారులెవరూ సాహసించలేదు. నిజానికి.. టెండర్ల ప్రక్రియలో మొదటి వారం రోజులు ఒక్కో దుకాణానికి సగటున 10 కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో టీడీపీ సిండికేట్ వ్యవహారం బహిరంగ దందాగా మారింది. ఆ తర్వాత ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వ ముఖ్యనేత కొత్త ఎత్తుగడ వేశారు. దరఖాస్తుల సంఖ్య కొంత పెంచాలని.. కానీ, అవి కూడా టీడీపీ సిండికేట్ సభ్యులవే ఉండేలా చూడాలన్నారు. తద్వారా ఒక్కో మద్యం దరఖాస్తుకు రూ.2 లక్షల వరకు నాన్ రిఫండబుల్ డిపాజిట్ భరించాలన్నారు. ఎలాగూ మద్యం దందా ద్వారా విచ్చలవిడి దోపిడీకి పచ్చజెండా ఊపాం కదా అని అసలు లోగుట్టు చెప్పారు. ఫలితంగా.. టీడీపీ సిండకేట్ సభ్యులే ఒక్కొక్కరు వేర్వేరు పేర్లతో దరఖాస్తులు దాఖలు చేశారు.దాచినా దాగని దందా..ఇక టీడీపీ మద్యం సిండికేట్ దందాకు ఎంతగా కనికట్టు చేయాలని చూసినా కుదరలేదు. తెలంగాణతో పోల్చిచూస్తే రాష్ట్రంలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఎంత ఏకపక్షంగా సాగిందన్నది స్పష్టమవుతోంది. విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నదైన తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య కూడా తక్కువే. తెలంగాణలో గత ఏడాది మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు పిలవగాఏకంగా 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే.. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 57 దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అంతేకంటే అధికంగా 3,396 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు పిలిచారు. కానీ, దరఖాస్తులు మాత్రం కేవలం 87,116 మాత్రమే రావడం గమనార్హం.అంటే సగటున ఒక మద్యం దుకాణానికి 25 మాత్రమే వచ్చాయి. చివరికి..ఆ దరఖాస్తులుకూడా టీడీపీ సిండికేట్‌వే. ‘బెల్టు’లూ బార్లా..ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పంచాయతీలో రెండు నుంచి ఆరు వరకు బెల్టుషాపులను ఏర్పాటుచేసేందుకు కసరత్తు జరుగుతోంది. పట్టణాల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఇప్పటికే గత టీడీపీ హయాంలోని బెల్టు షాపుల నిర్వాహకులతో సిండికేట్ సభ్యులు మంతనాలు మొదలుపెట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బలంగా ఉన్న మద్యం సిండికేట్లే ఇప్పుడూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఈ సిండికేట్లను వెనకుండి నడిపిస్తున్నారు. ఒకవేళ లాటరీలో బయటివారికి షాపులు దక్కినా వారి వ్యాపారం సజావుగా సాగాలంటే తమ సిండికేట్లలో కలవాల్సిందేనని సంకేతాలిస్తున్నారు. ఇక ఒక్కో బెల్టుషాపు ఏర్పాటుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్టు చెల్లించాలని చెబుతున్నట్లు తెలిసింది. డిపాజిట్ చేసిన వారికే తమ షాపుల పరిధిలో బెల్టుషాపు ఏర్పాటుకు అనుమతించి అందుకు అవసరమైన సరుకు ఇస్తామంటున్నారు. లేనిపక్షంలో దాడులు చేయించి కేసులు పెట్టిస్తామని హెచ్చరిస్తున్నట్టు సమాచారం. కాగా.. షాపుల నిర్వహణ తగ్గించుకునేందుకే సిండికేట్లు బెల్టుషాపుల ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో మద్యం షాపు నిర్వహణకు నెలనెలా అన్ని రకాల ఖర్చులకు లక్షకు పైగానే వ్యయమవుతుందని వారి అంచనా. ఈ భారాన్ని తగ్గించుకునేందుకే వారు ‘బెల్టు’ వైపు మొగ్గుచూపుతున్నారు.చివరిరోజూ అరాచకమే..టెండర్ల చివరిరోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. టెండరు కేంద్రాల వద్ద సినీఫక్కీ మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు మాటువేశారు. ఉదయం నుంచి సాయంత్రం గడువు ముగిసే వరకూ అడుగడుగునా నిఘా ఏర్పాటుచేశారు. వేరే వ్యక్తి ఎవరైనా ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లినా.. టెండరు వేసేందుకు దరఖాస్తు తీసుకున్నా.. క్షణాల్లో వారిపై బెదిరింపులకు పాల్పడేలా మందీమార్బలాన్ని మోహరించారు. ‘ఏం మిస్టర్.. ఎక్సైజ్ ఆఫీస్‌కి వెళ్లావట. దరఖాస్తు చేద్దామనా? అప్లై చేసి చూడు.. మా వాళ్లను కాదని టెండరు వేస్తే తాటతీస్తా’.. అంటూ కృష్ణాజిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్యం షాపు దరఖాస్తు కోసం వెళ్లిన వ్యక్తిని బెదిరించారంటే అధికార పార్టీ సిండికేట్ల అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. అలాగే.. ఇదే జిల్లా గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో గతంలో షాపులు నిర్వహించుకున్న వారు లేదా స్థానికులు లేదా ఇతర పార్టీల వారు దరఖాస్తుకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు వార్నింగ్‌లు ఇచ్చి వెనక్కి పంపేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఒకవైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు.. సామ, దాన, భేద దండోపాయాలనూ పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రయోగించింది. చివరికి.. అధికార పార్టీ నేతలకూ ఈ హెచ్చరికలు తప్పలేదని భోగట్టా. -
బెదిరింపులు.. దౌర్జన్యాలు.. సర్కారు వారి సిండికేట్ పాలసీ
సాక్షి, విజయవాడ: మద్యాన్ని కూటమి సర్కార్ ఆదాయ వనరుగా మార్చుకుంది. రాష్ట్రంలో ఈ రోజు(శుక్రవారం) రాత్రి 7 గంటలతో మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు ముగియగా.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. 3,396 మద్యం దుకాణాలకు 87,508 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దరఖాస్తుల ద్వారా రూ.1700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు రాగా, ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపులకు 5,704 దరఖాస్తులు వచ్చాయి.నెల్లూరులో తమ అనుచరులకే మద్యం దుకాణాలు ఇప్పిస్తున్నట్లు మంత్రి నారాయణ ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల దందాతో మద్యం వ్యాపారులు భయపడుపోతున్నారు. దీంతో దరఖాస్తులు వేసేందుకు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. మద్యం షాపులకు ఇతరులు దరఖాస్తులు చేయకుండా కూటమి నేతలు బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతలు పేర్లు మీదే మంత్రులు, ఎమ్మెల్యేలు దరఖాస్తులు వేయించారు. టీడీపీ నేతలకు ఎక్సైజ్ అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతల డైరెక్షన్లో మద్యం మాఫియా చెలరేగిపోయింది. మద్యం షాపులు దక్కించుకునేందుకు బెదిరింపులకు దిగింది.కాగా, ఒకపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు పోలీసుల ద్వారా సామ, దాన, దండోపాయాలను కూటమి ప్రభుత్వం ప్రయోగిచింది. ‘‘అసలు మీరు ఈ టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు? సరే టెండర్లు దక్కించుకున్నారే అనుకోండి. టీడీపీ నేతలను కాదని అసలు మద్యం దుకాణాలను మీరు నిర్వహించగలరా? అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మీపై కేసులు నమోదవుతాయి. ఎక్సైజ్ దాడులూ జరుగుతాయి. ఏదో ఒక కేసు బుక్ చేసి మిమ్మల్ని మూసి వేయడం ఖాయం. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ? మద్యం టెండర్ల నుంచి మీకు మీరే మర్యాదగా తప్పుకోండి..!’’ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇతర పార్టీల నేతలకు స్థానిక ఎస్సై, సీఐల ద్వారా బెదిరింపులకు దిగినట్లు సమాచారం.ఇదీ చదవండి: మద్యం షాపులన్నీ నాకే కావాలి..!తాడిపత్రిలో 9 మద్యం షాపులు, రూరల్ పరిధిలో 3, యాడికిలో 4, పెద్దవడుగూరులో 3, పెద్దపప్పూరులో ఒక షాపు కలిసి మొత్తం 20 మద్యం దుకాణాలు తమ ఆదీనంలో ఉండాలని జేసీ ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన ఓ నేత 20 దుకాణాలకు దరఖాస్తు వేసేందుకు ప్రయత్నించగా ఆయన్ను విరమించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన ఇతర నేతలపై జేసీ వర్గం దౌర్జన్యాలకు తెగబడింది.వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను స్కార్పియోలో కిడ్నాప్ చేసి తరలించారు. ఎంపీపీ ఉమాదేవి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తేవడంతో యాడికి సీఐ ఈరన్న టీడీపీ శ్రేణుల నుంచి రామ్మోహన్‌ను విడిపించి తీసుకొచ్చారు. యాడికిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను టీడీపీ మూకలు గురువారం పగులగొట్టి బెదిరింపులకు దిగాయి. వైఎస్సార్ సీపీకి చెందిన మరో నాయకుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి దరఖాస్తు చేయవద్దని బెదిరించారు. -
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే టీడీపీ నేతలు,లిక్కర్ సిండికేట్ల కోసం ప్రభుత్వం గడువు పెంచినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు అవుతున్నాయి. వాటాలు ఇస్తునే మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని లేదంటే అంతు చూస్తామంటూ సిండికేట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే సాహసం చేయడం లేదు.రాష్ట్రంలో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు లేకపోవడం, అవి ఖాళీ ఉన్నాయి. ఈ తరుణంలో ఖజానా నింపుకునేందుకు మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. -
నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి
బొబ్బిలి: ఆకలిగొన్న పులుల్లా మద్యం షాపు దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్న సిండికేట్ వ్యాపారుల మధ్యలోని ఓ బామ్మ వచ్చి తనకూ మద్యం షాపు కావాలంటూ దరఖాస్తు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. మద్యం షాపు కోసం దరఖాస్తు చేయడానికి కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధురాలిని చూసిన ఎక్సైజ్ అధికారులు ముసిముసి నవ్వులు నవ్వుతూ ముక్కున వేలేసుకున్నారు. బొబ్బిలి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో టెండర్ బాక్స్‌లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఓ బామ్మ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దత్తిరాజేరు మండలం పి.లింగాలవలసకు చెందిన పప్పల అచ్చయ్యమ్మ(85) ఎకై ్సజ్ అధికారులు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతూ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. బొబ్బిలి కార్యాలయానికి సోమవారం సాయంత్రం వచ్చిన ఆ బామ్మకు ఓ బల్ల ఇచ్చి స్నాక్స్ ఇచ్చి ఎక్సైజ్ అధికారులు కూడా మర్యాద చేయడం విశేషం. -
టీడీపీ మద్యం కేటుగాళ్లకు ఎక్సైజ్ సహకారం
-
తప్పతాగండిక!.. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక
గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తూ ప్రజలకు ఉపయోగపడేలా గాంధీ జయంతి సందర్భంగా ఏదో ఒక కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టాల్సిందిపోయి.. తద్భిన్నంగా రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడలా బార్లు.. వెల్లివిరిసేలా చర్యలకు నడుం బిగించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు ‘సరికొత్త మద్యం’ కానుకను అందించనుంది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు ‘పచ్చ’ జెండా ఊపుతూ సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రత్యేక ఆర్డినెన్స్, ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టీడీపీ కూటమి సిండికేట్‌కు అనుకూలంగా పక్కాగా కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఈ పరంపరలో ఈ నెల 12 నుంచి అంటే దసరా రోజున ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా దోపిడీకి ‘పచ్చ’ ముఠా కొబ్బరి కాయ కొట్టనుంది.సాక్షి, అమరావతి : ‘తప్పతాగండి.. సమస్యలు మరచిపోండి.. ప్రశ్నించడం మానేయండి..’ అంటూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దశల వారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేయడంలో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా దశల వారీగా వాటిని 2,934కు తగ్గించింది. మద్యం దుకాణాల వేళలు కుదిస్తూ ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించింది. 4,380 పర్మిట్ రూమ్‌లు రద్దు చేయడంతో పాటు ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగించింది. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వడం ఆపేసింది. వీటన్నింటినీ కొనసాగించాల్సింది పోయి.. అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం.. మద్యం ప్రవాహానికి గేట్లు ఎత్తేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలు 2,934 ఉండగా.. వీటిని ప్రభుత్వ పరిధి నుంచి తగ్గించి.. మొదటి దశలోనే వాటి సంఖ్యను 3,396 దుకాణాలకు పెంచింది. వాటికి అదనంగా 12 స్మార్ట్ స్టోర్స్ ఏర్పాటు చేయనుంది. ఏడాదికి రూ.కోటి లైసెన్స్ ఫీజుగా ఈ స్మార్ట్ స్టోర్స్ కాల పరిమితి ఏకంగా ఐదేళ్లుగా నిర్ణయించింది. తర్వాతి దశల్లో మరిన్ని మద్యం దుకాణాలు, స్మార్ట్ స్టోర్స్‌ను అనుమతించాలని భావిస్తోంది. ఇక మద్యం దుకాణాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అధికారికంగా అనుమతించనుంది. అనధికారికంగా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించింది. పచ్చ సిండికేట్‌దే మద్యం దందా» ప్రైవేటు మద్యం దుకాణాల కేటాయింపు అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగనుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు పచ్చ సిండికేట్ ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఈసారి అంతకు మించి అన్న రీతిలో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేసింది. అందుకోసం ఆర్డినెన్స్ జారీ నుంచి లైసెన్సుల కేటాయింపు వరకు రాష్ట్ర ప్రభుత్వమే టీడీపీ కూటమి సిండికేట్‌కు అనుకూలంగా పక్కా పన్నాగంతో పావులు కదిపింది. » సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి.. దాంతోపాటే ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచే మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ నెల 11న లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని, 12 నుంచే అంటే దసరా రోజునే ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని వెల్లడించింది.» అంటే టీడీపీ మద్యం సిండికేట్‌కు అనుకూలంగా ప్రభుత్వం ఎంత పక్కా పన్నాగంతో వ్యవహరించిందన్నది స్పష్టమవుతోంది. పేరుకి లాటరీ విధానంలో కేటాయింపు అని ప్రకటించినప్పటికీ.. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులే బినామీ పేర్లతో మద్యం దుకాణాలను గుప్పిట పట్టేందుకు ఇప్పటికే సిండికేట్‌ను రూపొందించారు. » రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన జాబితా ప్రకారమే మద్యం దుకాణాల లైసెన్సులు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇప్పటికే మౌఖికంగా ఆదేశించారు. అందుకు తగ్గట్గునే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ ప్రజాప్రతినిధులు సిండికేట్లుగా ఏర్పడ్డారు. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకోవాలని.. ఎవరు టెండర్లు దాఖలు చేసినా సరే వారికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వడానికి వీల్లేదని, ఇచ్చినా ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా దాడులు చేసి వేధిస్తామని బెదిరించాలని హుకుం జారీ చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు కావడమే తరువాయి టీడీపీ సిండికేట్ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం ఖాయం.ఉద్యోగుల నిరసన.. తెరచుకోని దుకాణాలుప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసనతో రాష్ట్రంలో మంగళవారం మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. తమ ఉద్యోగాలను అర్ధంతరంగా తొలగించిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల మంది తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ మద్యం దుకాణాలను తెరవలేదు. మరోవైపు టీడీపీ అనుకూల సిండికేట్‌కు మద్యం దుకాణాలను కట్టబెట్టాలన్న ఆతృతలో ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి హడావుడిగా తీసుకువచ్చిన జీవోతో మరింత గందరగోళం నెలకొంది. మరోవైపు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను తెరవకూడదు. అంటే వరుసగా రెండు రోజులు మద్యం అమ్మకాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మంగళవారం సాయంత్రానికి దుకాణాలు తెరిపించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యం నిల్వలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. కానీ మంగళవారం (అక్టోబరు 1) నుంచి ఈ నెల 11 వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆర్డినెన్స్ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇక ఉనికిలో లేనట్టే. కాబట్టి వాటిని తెరవకూడదు.. మద్యం అమ్మకూడదు. దాంతో రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ అధికారులు మద్యం దుకాణాలను తెరవలేరు. ఈ విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తించిన ప్రభుత్వం కంగారు పడింది. ప్రైవేటు మద్యం దుకాణాలు వచ్చేంత వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలను కొనసాగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. దీంతో వారు ఆందోళన చేస్తున్న ఉద్యోగుల వద్దకు వెళ్లి అతి కష్టంగా కొంత మందికి నచ్చజెప్పి దుకాణాలు తెరిపించారు. చాలా మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. ఈ బెదిరింపులేంటి?శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మంగళవారం ఎక్సైజ్ పోలీసుల బెదిరింపుల నడుమ సూపర్వైజర్లు, సేల్స్మెన్లు మద్యం అమ్మకాలు సాగించారు. తమ ఉద్యోగానికి భద్రత చూపించని కూటమి ప్రభుత్వం.. కేసులు పెడతామంటూ బెదిరిస్తూ విక్రయాలు చేయించడంపై వారు ఎదురుతిరిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నాటికి పూర్తయిన లావా దేవీలన్నింటి గురించి లెక్కలు చెప్పి, ప్రభుత్వం కేటాయించిన కానిస్టేబుల్‌కు మంగళవారం తాళాలు, షాపు హ్యాండోవర్ చేశారు. అయితే తాము సూచించే తేదీ వరకు అమ్మకాలు జరపాలని ఎక్సైజ్ పోలీసు అధికారులు ఆదేశించడం పట్ల నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ ఉద్యోగాలు తీసేయడమే కాకుండా, ఇలా బెదిరించడం తగదని జిల్లా సేల్స్‌మెన్, సూపర్వైజర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కీర్తి ధర్మారావు, సంతోష్‌కుమార్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఉదయం నుంచి షాపులు మూత పడటంతో మద్యం విక్రయాలు దాదాపు రెట్టింపు ధరతో సాగాయి.నోటిఫికేషన్లో ప్రధానాంశాలు» మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తుల స్వీకరణ » ఈ నెల 11వ తేదీ లాటరీ ద్వారా లైసెన్సుదారుల ఎంపిక » ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభంలైసెన్స్ ఫీజు వివరాలు» 10 వేల లోపు జనాభా ఉంటే: రూ.50 లక్షలు» 10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.55 లక్షలు» 50,001 నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.65 లక్షలు» 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.85 లక్షలు -
పెద్దల పండుగకు.. ‘గాంధీ’ గండం
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఓ విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ప్రతి ఏటా మహాలయ అమవాస్య రోజున పెద్దల పండుగ చేసుకుని శక్తికొద్దీ మాంసాహారాన్ని భుజించడం తరతరాల సంప్రదాయం. ఈసారి గాంధీ జయంతి అయిన అక్టోబరు 2వ తేదీన ఈ పర్వదినం రావడంతో ఆటంకం ఏర్పడింది. పెద్దల పండుగ అంటేనే మద్యం, మాంసం ఉంటాయి. స్వర్గస్తులైన పెద్దలకు అవి రెండూ నైవేద్యంగా సమరి్పంచి ఆపై తాము పుచ్చుకొంటారు. కానీ గాంధీ జయంతి రోజున మద్యం షాపులు, మాంసాహార విక్రయాలు నిషేధిస్తారు. అనుమతికి డిమాండ్ ఈ నేపథ్యంలో గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ మనవి చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అనాదికాలంగా వస్తున్న సంప్రదాయానికి భంగపరచడం సబబు కాదని కొందరు పేర్కొన్నారు. ప్రజల డిమాండ్ల నేపథ్యంలో ఏం చేయాలా? అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. -
ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన మద్యం విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే..నూతన లిక్కర్ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. నూతన మద్యం పాలసీపై మహిళలు భగ్గుమంటున్నారు. గాంధీ జయంతి రోజున రోడ్లపై ధర్నాలు చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.అయితే, 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా మద్యంపై పెత్తనం ప్రైవేట్ వ్యక్తులదే ఉండేది. పేరుకు టెండర్లయినా.. కొంతమంది చేతుల్లోనే వైన్‌షాపులుండేవి. బార్లు, వైన్‌షాపులన్న తేడా లేకుండా.. అంతా సిండికేట్‌గా మారిపోయేవారు. వారు నిర్ణయించిందే ధరకే అధికంగా వసూలు చేసేవారు. దాడులు చేసి, అక్రమ దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. మామ్మూళ్లకు అలవాటుపడి, చోద్యం చూసేవారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే.. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి సిండికేటుగాళ్లకు చెక్ పెట్టింది. ప్రైవేట్ వ్యక్తులకే మద్యం దుకాణాలను కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు మళ్లీ పాత విధానమే అమలులోకి రానుంది.ఇదీ చదవండి: సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!! -
మద్యాన్ని ప్రైవేట్ పరం చేయనున్న సీఎం చంద్రబాబు
-
మద్యం అమ్మకాల్లో తగ్గేదే లే!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఉండేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ఇక నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెడతామని తెలిపింది. కొత్త మద్యం విధానాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్‌లు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. తమ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి ఆయనతో చర్చించారు. కొత్త మద్యం విధానంలో చేర్చాల్సిన పలు అంశాలను సీఎం వారికి సూచించారు. కొత్త మద్యం విధానంపై రూపొందించిన నివేదికను బుధవారం నిర్వహించనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణయించారు. కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం ఈ నెల 30తో ముగుస్తుందన్నారు. దాంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగుల కాల పరిమితి కూడా ముగుస్తుందని పరోక్షంగా వెల్లడించారు. నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలు ప్రైవేటు మద్యం దుకాణాలను జిల్లా కమిటీలు లాటరీ విధానంలో కేటాయిస్తాయని మంత్రి రవీంద్ర చెప్పారు. మద్యం దుకాణాల టెండర్లలో సిండికేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కమిటీలదేనని స్పష్టం చేశారు. గీత కారి్మకులకు 10 శాతం మద్యం దుకాణలను కేటాయిస్తామన్నారు. జనాభా ఎక్కువగా ఉండే నగరాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తామన్నారు. మద్యం ధరలను ఓ కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరలో ఒక బ్రాండును ప్రవేశపెడతామని వెల్లడించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వివిధ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త మద్యం విధానాన్ని రూపొందించామన్నారు. మద్యం విక్రయాల ద్వారా వ చ్చిన ఆదాయం నుంచే మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చేలా కొత్త మద్యం విధానం ఉంటుందన్నారు. నాణ్యమైన మద్యాన్ని అందిస్తూనే ఆదాయ సముపార్జనలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కొత్త మద్యం విధానం ఉంటుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఆరు రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించిన అనంతరమే కొత్త మద్యం విధానాన్ని రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి
సాక్షి, అమరావతి : మద్యం పాలసీని రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏమిటని మహిళా సంఘాల ఐక్య వేదిక (జేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేదిక నేతలు సుంకర పద్మశ్రీ, డి. రమాదేవి, పి.దుర్గాభవాని, పి. పద్మ, ఎన్. విష్ణు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సర్కారుకు 11 సూచనలు చేశారు. ప్రభుత్వం అక్టోబరు నుంచి అమలులోకి తెచ్చే మద్యం పాలసీని కేబినెట్ ఆమోదంతో త్వరలో ప్రకటించనున్నట్లు.. లైసెన్సింగ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులను ఇవ్వనున్నట్లు, లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రానున్నట్లు వార్తలు వస్తున్నాయని వారు తెలిపారు.అయితే, మద్యాన్ని నియంత్రించడం, నేరాలను అరికట్టడం, ప్రజల ఆరోగ్యం మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలపై హింసను అరికట్టడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అక్రమ అమ్మకాలు లేకుండా చేయడమా? లేక ఆదాయాన్ని పొందడమా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా టీడీపీ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా?.. మహిళలపై హింసకు కారణం కాదా?.. నేరాలు పెరగకుండా నిరోధిస్తుందా?.. అని వారు ప్రశ్నించారు. అధ్యయనంలో ఏం తేల్చారు..ఇక వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలపై అధ్యయనానికి వెళ్లిన బృందాలు తెలంగాణ విధానం బాగుందని రిపోర్టు ఇచ్చినట్లు మీడియాకు లీకేజీలిచ్చారని,.. కానీ, ఆ బృందాలు ఏం అధ్యయనం చేసి వచ్చాయో ఆ నివేదికను విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాలని, సాధారణ జనానికి నష్టంలేని విధానాన్ని రూపొందించాలని జేఏసీ నేతలు కోరారు. ఇక రాష్ట్రంలో వేళలతో నిమిత్తం లేకుండా మద్యం అక్రమ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టే బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. -
ఏపీలో లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు
-
ప్రైవేట్ చేతుల్లోకే ‘లిక్కర్’.. చంద్రబాబు సర్కార్ స్కెచ్ రెడీ
సాక్షి, గుంటూరు: మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో కూటమి సర్కార్ బండారం బట్టబయలైంది. లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు కేటాయింపునకు చంద్రబాబు ముందే నిర్ణయించినట్లు తేటతెల్లమైంది. ప్రైవేటు వ్యక్తులకే షాపులంటూ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.ప్రైవేటు షాపులే వస్తాయి..ప్రైవేటు వాళ్లకే ఇస్తామంటూ మద్యం షాపుల సిబ్బందితో కొల్లు రవీంద్ర చెప్పారు. నిర్ణయం తీసేసుకుని సబ్ కమిటీ ఏర్పాటు అంటూ చంద్రబాబు ప్రభుత్వం డ్రామాకు తెరతీస్తూ.. ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్ , సత్యకుమార్, గొట్టిపాటి రవితో కమిటీ ఏర్పాటైంది.ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేలా ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది. మళ్లీ పాత పద్దతిలో ఇష్టా రీతిన అమ్ముకునేందుకు చంద్రబాబు సర్కార్ రెడ్ కార్పెట్ సిద్ధం చేసింది. టీడీపీ నేతలకు, లిక్కర్ సిండికేట్లకు షాపులు ఇచ్చేందుకు స్కెచ్ రెడీ వేసింది. -
పుణే ఘటన: లంచాల మోజు.. పోలీసుల అక్రమాలు వెలుగులోకి!
రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్న పుణే పోర్షే హిట్ అండ్ రన్ కేసు.. రకరకాల కోణాల్లో చర్చకు దారి తీసింది. వాహనం నడిపింది ఓ మైనర్ కావడంతో పేరెంటింగ్ కోణంలో ప్రధాన చర్చ నడిచింది. మైనర్ బాలుడి తండ్రి తన పలుకుబడి ఉపయోగించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం.. ఆ ప్రయత్నంలో నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు, రక్త నమూనాలు తారుమారు చేయటంతో డాక్టర్ల అరెస్టు.. తండ్రి, తాతల అరెస్ట్.. పోర్షే కథలు రోజుకొకటి వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసు కారణంగానే.. నగరంలో అర్ధరాత్రుల దాకా అనుమతులు లేకుండా బార్లు, పబ్‌ల నిర్వహణ, వాటిల్లో డ్రగ్స్ వాడకం.. ఆ మొత్తం వెనుక అధికారుల అవినీతి బాగోతం బయటపడింది ఇప్పుడు.. పుణేలో అర్ధరాత్రి దాకా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించే పబ్‌లు, బార్లు.. పైగా డ్రగ్స్ కోణాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్.. ఈ హిట్ అండ్ రన్ కేసుపై ఇదివరకే నిరసన వ్యక్తం చేశారు. పబ్‌లు, బార్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన యెరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆయన ఇప్పుడు మరో సంచలన చర్చకు దారితీశారు.చదవండి: Pune Porsche Case: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!లంచాల మోజుతో పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్న పబ్ యజమానులు, డ్రగ్స్ ట్రేడర్ల వద్ద నెలకు లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారని రవీంద్ర ధంగేకర్ ఆరోపణులు చేశారు. పుణె ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రతినెలా లంచాలు తీసుకుంటున్నారని, లంచాల సేకరణకు కానిస్టేబుళ్లు, ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకున్నారని తెలిపారు.#Pune #Porsche Case: Ravindra Dhangekar Discloses Names Of Persons Involved In ' HAFTA 'From Pubs, Clubs and Liquor Shops In a major crackdown, the Kasba Peth MLA Ravindra Dhangekar revealed that police are collecting monthly bribes amounting to lakhs of rupees from the owners… pic.twitter.com/5ehtFFSuW8— Pune Pulse (@pulse_pune) May 27, 2024 విమాన్ నగర్, కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్, భుగావ్ భూకుమ్, బానేర్, హింజవాడి, పింప్రి చించ్వాడ్, లోనావాలా ప్రాంతాల్లో ఉండే అర్ధరాత్రి, రూఫ్‌టాప్‌లో నిర్వహించినే హోటళ్ల వద్ద లంచాలు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహరిస్తారని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు నెలకు వసూలు చేసే మొత్తం దాదాపు రూ. 78 లక్షలు ఉంటుందని లెక్కలతో సహా మీడియాకు తెలిపారు. లంచాలు తీసుకునే ప్రాంతాలు, వాటిని వసూలు చేసే పోలీసు కానిస్టేబుల్స్ పేర్లను ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టారు.కస్బా పేట్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టిన ఈ వివరాలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. అదేవిధంగా పుణె పోలీసు డిపార్టుమెంట్లో ఎప్పటి నుంచో ఉన్న అవినీతి వ్యవహారం తాజాగా బట్టబయలు అయింది. పుణె సిటీ కల్చర్, చట్టాల అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
నేటి అర్ధరాత్రి వరకు మద్యం
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31వ తేదీ అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చూసి ఉంటాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇక బార్లు, క్లబ్బులు, పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నూతన సంవత్సరానికి వీడుకోలు పలికే డిసెంబర్ 31 వేడుకలను పురస్కరించుకొని పలు ఆంక్షలు, మార్గదర్శకాలను జారీచేశారు. పోలీసులు నేటి రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు సిద్దం కాగా.. తాగి వాహనాలు నడిపితే బండిని సీజ్ చేయటంతో పాటు రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. -
గ్రామాల్లోని బెల్టు దుకాణల మూసివేతకు ఆదేశాలు వెలువడేనా?!
మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో బెల్టు దుకాణాలను మూసివేస్తామని ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి పల్లెల్లో ఉన్న బెల్టు దుకాణాలను మూసి వేయించాలని సంబంధిత ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు, 38 బార్లు ఉండగా.. వీటి ద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ నెల 1 నుంచి కొత్తగా లైసెన్స్‌లు పొందినవారు దుకాణాలను ప్రారంభించారు. గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉండటం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే నిత్యం పార్టీ కార్యకర్తలకు, ఇతరులకు మద్యం పంచడంతో గత రెండు నెలల నుంచి బెల్టు దుకాణాలను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్ల బెల్టు దుకాణాలు బహిరంగంగా తెరవకపోయినా రాత్రివేళలో రహస్యంగా విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందు ఒక్కో గ్రామంలో తక్కువగా మూడు వరకు బెల్టు దుకాణాలు ఉండేవి. అధికారుల పాత్ర.. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే మద్యం విక్రయించాలి. అంటే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మడం చట్టరీత్యా నేరం. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏకంగా వేల సంఖ్యలో బెల్టు దుకాణాల్లో విక్రయాలు సాగించారు. ఆ స్థాయిలో బెల్టు దుకాణాలు ఉన్నాయంటే సంబంధిత అధికారుల పాత్ర ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న 230 మద్యం దుకాణాల నుంచి బెల్టు షాపుల యజమానులు మద్యం పరిమాణం, బ్రాండ్‌ను బట్టి రూ.10– 20 వరకు ఎక్కువగా అమ్ముతుండగా.. పల్లెల్లో బెల్టు దుకాణాల నిర్వాహకులు దానిని రూ.70– 100 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కో మద్యం దుకాణానికి వీటి ద్వారా నెలకు రూ.1.50 లక్షల వరకు అదనంగా ఆదాయం వస్తోందని అనధికార అంచనా. ఇలా సుమారు 3 వేలకుపైగా బెల్టు దుకాణాల్లో విక్రయించే మద్యం విలువ నెలకు రూ.350 కోట్లపైమాటే. మరోవైపు దాబాల్లోనూ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాబాలు మూతపడినా.. కొన్నిచోట్ల రాత్రివేళలో నడుపుతున్నారు. కొత్త ప్రభుత్వ నిర్ణయంతో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి దాబాలతోపాటు పల్లెల్లో మద్యం పారిస్తున్న బెల్టు దుకాణాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. చర్యలు తీసుకుంటాం.. ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా దృష్టిపెడతాం. – దత్తురాజ్‌గౌడ్,డీసీ ఎక్సైజ్‌శాఖ, మహబూబ్‌నగర్ -
ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్: ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్య ఉత్తర్తులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నిషేధిత కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో సంచరించడం నిషేధమని, సంఖ్యలో గుంపులుగా ఐదుగురి కంటే ఎక్కువగా తిరగకూడదని, మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫొటోలు, సింబల్స్, ప్లకార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే ప్రసంగాలు చేయడంపై నిషేధా/æ్ఞలు విధించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలిటరీ, ఎన్నికల అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. -
కిక్కే కిక్కు.. తెలంగాణ అబ్కారీ శాఖకు కాసుల పంట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, వరంగల్, మహబూబ్ నగర్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి.. అత్యల్పంగా నిర్మల్ నుంచి దాఖలయ్యాయి. మొత్తం లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా.. రూ.2వేల కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. తద్వారా అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం సమకూరినట్లయ్యింది రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు టెండర్లు నిర్వహించగా, ఎక్సైజ్ శాఖ అంచనాలను మించి దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ రాత్రి 12 లేదా రాత్రి ఒంటి గంట వరకు పూర్తి స్థాయి లెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,03,489 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గత ఏడాది 79 వేల దరఖాస్తులు రాగా, గత ఏడాదితో పోలిస్తే 40 శాతం దరఖాస్తులు పెరిగాయి. చదవండి: కాంగ్రెస్ రూట్లో కమలం.. సర్ప్రైజ్ అందుకే! ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో మద్యం టెండర్ ప్రక్రియతో అబ్కారీ శాఖకు కాసుల పంట పడుతోంది. ఈ నెల 21న లక్కీ డ్రా నిర్వహించనున్నారు. అదే రోజు లైసెన్సులు జారీ చేయనున్నారు. డిసెంబర్ 1నుంచి కొత్త షాపులు ప్రారంభం కానున్నాయి. టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భూక్యా దేవా నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్స్ నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ పిటిషన్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మాణాలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీసుకోకుండా టెండర్ల ప్రక్రియ జారీ చేసిందని, వెంటనే టెండర్లు నిలిపి వేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ కోరారు. రేపటి వరకు ప్రభుత్వం సమయం కోరగా, తదుపరి విచారణను హైకోర్టు.. రేపటికి వాయిదా వేసింది. -
రామోజీ ‘రక్త’ కన్నీరు!
రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయాలో రామోజీ కంటిచూపుతో డిసైడ్ చేస్తాడు.. కాంట్రాక్టులు ఎవరికి కట్టబెట్టాలో ఆయనే శాసిస్తాడు.. విధానపరమైన నిర్ణయాలనూ రామోజీరావే నిర్దేశిస్తాడు.. ఇదంతా 2019 చంద్రబాబు హయాం వరకు ఉన్న పరిస్థితి. అప్పటి వరకు ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది.. చెల్లింది కూడా. ఆ తర్వాత సీన్ మారింది.. ఇప్పుడు నాలుగేళ్లుగా రాష్ట్రంలో రామోజీ ఆటలు సాగడంలేదు.. తన సమీప బంధువు నుంచి పోలవరం కాంట్రాక్టు మొదలుకుని నిన్నమొన్నటి మార్గదర్శి చిట్‌ఫండ్స్ వరకూ ఆయనకు తరచూ నోట్లో పచ్చివెలక్కాయలు పడుతున్నాయి. గొంతులో ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్నది జీ హుజూరంటూ తలూపే చంద్రబాబు సర్కారు కాదు కదా.. పుష్కలంగా ప్రజామద్దతు ఉన్న వైఎస్ జగన్ సర్కార్ ఇది. పైగా తన జేబులో మనిషి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు వైభవం మరోవైపు మిణుకుమిణుకుమంటోంది. దీంతో రామోజీకి దిక్కుతోచడంలేదు..సరికదా పిచ్చెక్కినట్లు ఉంటోంది. అంతే.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు వైఎస్ జగన్ సర్కారుపై అడ్డగోలుగా.. తన పాఠకులు విసుగెత్తిపోయారనే కనీస స్పృహ కూడా లేకుండా నిత్యం కలంకూట విషం చిమ్ముతున్నాడు. అందులో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఎప్పటిలాగే మరోసారి విషం కక్కాడు. ఈ విషబీజాలు మీకు కిక్కు ఇస్తాయేమోకానీ మీరనుకున్న లక్కు నెరవేరదు రామోజీ..! నిత్యం అబద్ధాలు అల్లుతూ రాసే విషపు రాతలోని పచ్చినిజం ‘ఏది నిజం’.. ఇదిగో... సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మద్య విధానంపై వాస్తవాలను వక్రీకరిస్తూ ‘రక్త మాంసాలతో వ్యాపారం’ అంటూ ఈనాడు మరోసారి విషం చిమ్మింది. చంద్రబాబు అధికారంలో లేడన్న బాధ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా విజయవంతంగా కొనసాగుతున్నారన్న అక్కసు అంతా కలగలిపి మరీ అక్షరాల్లో కూర్చి తన కరపత్రికలో కడుపుమంట తీర్చుకున్నాడు రామోజీ. కానీ, వాస్తవం ఏమిటంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న మద్యం విధానం అందిస్తున్న ఫలాలు ఏమిటో ప్రజలకు తెలుసు.. బెల్ట్ దుకాణాల్లేని పల్లెలకు తెలుసు.. పర్మిట్‌రూమ్‌లు లేని ఊర్లకు తెలుసు.. మద్యం రేట్లు అమాంతంగా పెరగడంతో ఆ వ్యసనానికి తమ భర్తలు, పిల్లలు క్రమంగా దూరమవుతుండటంతో ఊరట చెందుతున్న అక్కాచెల్లెమ్మలకు తెలుసు.. దశాబ్దాలుగా నాటుసారా తయారీ తప్ప మరో దిక్కులేని అగత్యం నుంచి బయటపడి, ప్రస్తుతం దర్జాగా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో సామాజిక గౌరవం పొందుతున్న కుటుంబాలకు తెలుసు.. సంక్షేమ పథకాలతో ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాలకూ తెలుసు. ప్రజలు అందరికీ వాస్తవాలు తెలుసు అన్నదే ఈనాడు రామోజీరావు దుగ్థ. ప్రజలు చంద్రబాబును ఏమాత్రం నమ్మడం లేదనే ఆయన ఆక్రోశం. వైఎస్ జగన్మోహన్రెడ్డిపట్ల జనాదరణ రోజురోజుకు మరింతగా పెరుగుతుండడమే ఆయన ఆందోళన. అందుకే తనకు అలవాటైన రీతిలో విష ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రామోజీ, చంద్రబాబు ద్వయానికి కష్టంగా ఉన్నా సరే వారు ఇప్పటికైనా గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే.. మీ టైమ్ అయిపోతోంది.. మీ కట్టుకథలకు కాలం చెల్లింది. తెలుస్తోందా రామోజీ.. అప్పట్లో మూడు పర్మిట్ రూమ్‌లు..ఆరు బెల్ట్ దుకాణాలు.. మద్యం విక్రయాలను దశల వారీగా నియంత్రిస్తామన్న మేనిఫెస్టోలోని హామీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోటీడీపీ నేతల మద్యం సిండికేట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పర్మిట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలుగా మద్యం ఏరులై పారిందన్న నిజం పాపం రామోజీరావుకు గుర్తుండి ఉండదు. అప్పట్లో మద్యం మాఫియా యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేసింది. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతల గుప్పెట్లోనే ఉండేవి. వేళాపాళా లేకుండా 24గంటలూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవి. ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం వరకు అధిక ధరలకు అమ్ముతున్నా సరే నాడు ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తూ ఉండాల్సి వచ్చేది. సీఎంగా జగన్ వచ్చాక.. కానీ, ఈ మద్యం మాఫియా అరాచకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. దాంతో రాష్ట్రంలో మద్యం మాఫియాను తుదముట్టించారు. అందుకోసం.. మద్యం దుకాణాల వేళలు కుదింపు ప్రైవేటు వ్యక్తులు అయితే ఎంతగా మద్యం విక్రయాలు పెంచితే తమకు అంతటి లాభం వస్తుందని అనుకుంటారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వానివే కాబట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించాల్సిన అవసరమేలేదు. ఇక మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉ. 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మద్యం దుకాణాల సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10గంటల నుంచి రాత్రి 9గంటల వరకే విక్రయాలను అనుమతించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల రద్దు అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. టీడీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతించారు. అంటే మద్యం దుకాణాలే అనధికారికంగా బార్లుగా కూడా చలామణి అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఇవీ రద్దయ్యాయి. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వ పరం చేసింది. అంతేకాదు.. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కాదనగలరా రామోజీరావుగారూ.. బార్ల సంఖ్య పెంచలేదు టీడీపీ ప్రభుత్వం ఏటా బార్ల సంఖ్యను పెంచేది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు ఇక దశలవారీగా మద్య నియంత్రణ విధానం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలను సగానికి పడిపోయాయి. అందుకు ఈ గణాంకాలే తార్కాణం.. మేనిఫెస్టోలో హామీ మేరకే షాక్ కొట్టేలా మద్యం ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనూ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా చెప్పారు. తద్వారా పేదలను మద్యం వ్యసనానికి దూరం చేయాలన్నది తమ విధానమన్నారు. అంతేగానీ, మద్యం విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని ఆయన స్పష్టంచేశారు. అదేమాటకు కట్టుబడుతూ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కిందామీదా పడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు మద్యం వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. పేదలు మద్యానికి దూరమవుతుండటం కూడా రామోజీరావుకు ఆవేదన కలిగిస్తుందంటే నిజంగా ఆయనకు మామూలు చికిత్స కాదు మానసిక చికిత్స అవసరమనిపిస్తోంది. డిస్టిలరీలన్నీ బాబు హయాంలోనివే.. ఇక రాష్ట్రంలో ఉన్న మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒక్క కొత్త డిస్టిలరీకీ అనుమతివ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో స్లైడ్లు ప్రదర్శించి మరీ వివరించారు. అయినా సరే.. కళ్లున్న కబోదిగా వ్యవహరిస్తున్న రామోజీని ఏమనాలి.. ఏం చేయాలి? సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ తప్పా రామోజీ.. రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎన్సీడీలు జారీచేసి ప్రభుత్వం నిధులు సమీకరించింది. వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని కూడా స్పష్టంచేసింది. పేదల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం తగినన్ని నిధులు సమీకరించడం కూడా రామోజీరావుకు కంటగింపుగా మారుతోంది. తాను, తన చంద్రబాబు తప్ప పేదలు బాగుపడకూడదని ఆయన భావన కావచ్చు. ఆ రోజులకు కాలం చెల్లింది. మీకు అర్ధమవుతోందా రామోజీ.. అక్రమ మద్యంపై ఎస్ఈబీ ఉక్కుపాదం అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్ఈబీ మూడు విధాలుగా అక్రమ మద్యం, నాటుసారాను అరికడుతోంది. ఎలాగంటే.. ► అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు నిర్వహిస్తోంది. ► గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాను అడ్డుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో కలిసి దాడులు నిర్వహిస్తోంది. సారా సిండికేట్‌కు గుండెల్లో రైళ్లు 2019 నుంచి 2023 మార్చి వరకు పోలీసు, ఎస్ఈబీ విభాగాలు నాటు సారా తయారీదారులపై 1,44,254 కేసులు నమోదు చేశాయి. మొత్తం 1,12,604 మందిని అరెస్టుచేశారు. 18.41లక్షల లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోవడంతోపాటు 5.34కోట్ల లీటర్ల సారా ఊటలను ధ్వంసం చేయడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. మొత్తం 14,556 వాహనాలను జప్తుచేశారు. బైండోవర్ కేసులు, పీడీ యాక్ట్‌లు.. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం, అక్రమంగా నల్లబెల్లం తయారీదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. వారిపై బైండోవర్ కేసులు నమోదుచేస్తోంది. 2020 జూన్ నుంచి 2023 మార్చి 14 వరకు మొత్తం 74,674 బైండోవర్ కేసులు నమోదు చేసింది. అలాగే, రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారా దందాకు అలవాటుగా మారిన నేరస్తులను గుర్తించి పీడీ యాక్ట్‌లను ప్రయోగిస్తున్నారు. 2020, మే 16 నుంచి 2023, మార్చి 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 206 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు నిదర్శనం. అక్రమ మద్యం దందాకు చెక్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అక్రమ మద్యం దందా యథేచ్ఛగా సాగింది. టీడీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేసి భారీగా దోపిడీకి పాల్పడ్డారు. ఆనాటి ప్రభుత్వం కూడా ఆ దందాపై ఉదాసీనంగా ఉండేది. రామోజీ కూడా ఏనాడు పెన్నెత్తి మాట్లాడలేదు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ మద్యం దందాకు సమర్థంగా చెక్‌పెట్టింది. ఎస్ఈబీ విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ మద్యం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తోంది. దీనిని కాదనగలరా రామోజీ.. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో ‘నవోదయం’ దశాబ్దాలుగా నాటుసారా తయారీయే జీవనోపాధిగా చేసుకున్న కుటుంబాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తెచ్చింది. నవోదయం పేరుతో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చింది. ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థికంగా దన్నును అందించడంతోపాటు సామాజికంగా గౌరవాన్ని పెంచింది. అందుకోసం ఎస్ఈబీ ప్రత్యేకంగా సర్వే నిర్వహించి అటువంటి గ్రామాలను గుర్తించి ఆయా జిల్లాల యంత్రాంగాల సహకారంతో పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి అందిస్తోంది. 2022 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 1,891 గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికే 1,552 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూ.11.46 కోట్ల మేర సహాయం చేసింది. మిగిలిన కుటుంబాలకు కూడా కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది రామోజీ.. చంద్రబాబు, రామోజీ మధ్య ఉన్నది మద్యం బంధమే రక్తమాంసాలతో వ్యాపారం వారిద్దరిదే వ్యాపార ప్రయోజనాల కోసం ఎంతటి కుట్రపూరిత రాజకీయాలు చేయాలో.. ప్రభుత్వ పాలనా వ్యవస్థను ఎంతగా దుర్వినియోగం చేయాలో ఈ ప్రపంచంలో చంద్రబాబు, రామోజీరావులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఆ విషయంలో పేటెంట్ వారిద్దరిదే. 1989–94లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం.. అప్పట్లో తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. వెంటనే రామోజీరావు ఏమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా ప్లేటు ఫిరాయించి సంపూర్ణ మద్య నిషేధం విధానానికి టాటా చెప్పారు. అంతే.. నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. ఎందుకంటే అప్పుడే రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్‌హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు నిజంగా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేశారు. ఇప్పుడు ఈయన శ్రీరంగ నీతులు చెబుతున్నాడు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు! జిల్లాల వారీగా పీడీ యాక్ట్ కేసులు.. జిల్లా కేసులు శ్రీకాకుళం 3 విజయనగరం 1 అల్లూరి సీతారామరాజు 5 పార్వతీపురం మన్యం 4 అనకాపల్లి 2 కాకినాడ 12 అంబేడ్కర్ కోనసీమ 6 తూర్పు గోదావరి 36 పశ్చిమ గోదావరి 8 ఏలూరు 12 కృష్ణా 6 ఎన్టీఆర్ 8 బాపట్ల 14 పల్నాడు 15 ప్రకాశం 7 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 3 చిత్తూరు 22 తిరుపతి 1 వైఎస్సార్ 5 కర్నూలు 6 నంద్యాల 19 అనంతపురం 6 శ్రీసత్యసాయి 4 అన్నమయ్య 1 మొత్తం 206 -
బీజేపీ ఉమాభారతి సంచలన ప్రకటన
బోఫాల్: బీజేపీ ఫైర్‌బ్రాండ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారామె. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌ను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఇకపై గో శాలల కింద మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టానంటూ ప్రకటించారామె. మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని బలంగా నమ్ముతున్నారామె. ఈ క్రమంలో బోఫాల్ అయోధ్య నగర్‌లోని ఓ ఆలయం వద్దకు చేరుకుని(సమీపంలోని లిక్కర్ షాప్ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్‌తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారామె. రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్ సర్కార్‌ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక.. పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇది చాలా విడ్డూరంగా ఉంది.. ఒక వర్గం ఇలా ప్రచారం చేయడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీ కోసం ఎదురు చూపులు ఉండబోవని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె ప్రకటించారు. అలాంటి దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన బృందానికి ఆదేశాలు జారీ చేశానని.. తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారామె. ఈమధ్యే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఉమాభారతి.. లిక్కర్ పాలసీలో కొన్ని సవరణలు సూచిస్తూ.. కొత్త విధానం తేవాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు కూడా. అయితే.. ఆచరణలోనే అది కనిపించలేదు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
మూడు రోజులు వైన్ షాప్‌లు బంద్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో నవంబర్ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్‌షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్‌షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్‌లను సీజ్ చేసి.. 48మందిని అరెస్టు చేసి మొత్తం 118 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.5,59,000 ఉన్నట్లు తెలిపారు. -
2,216 కాదు.. 2,620
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని వైన్ (ఏ4) షాపుల పరిధిని నిర్ధారిస్తూ జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న వైన్‌షాపుల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెరగనుంది. కాగా, ఈసారి మద్యం దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు ఇచ్చిన 30 శాతం రిజర్వేషన్ మేరకు ఆయా వర్గాలకు జిల్లాల వారీగా కేటాయించాల్సిన షాపులను ఎంపిక చేశారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ డ్రాలను పూర్తి చేసి రిజర్వ్డ్ దుకాణాలను నోటిఫై చేశారు. మొత్తం 2,620 షాపులకుగాను గౌడవర్గానికి 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల ను కేటాయించారు. మిగి లిన 1,834 షాపులకు ఓపెన్ కేటగిరీలో దరఖా స్తులు స్వీకరించనున్నారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. 20న డ్రా పద్ధతిలో విజేతలను ఎంపిక చేసి ప్రొవిజనల్ లైసెన్సులు ఇవ్వనున్నారు. అయితే, మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో దాఖలయిన కేసు తీర్పు మంగళవారం వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అన్ని కులాలు ఆత్మగౌరవంతో బతకాలి.. జడ్పీ సెంటర్, మహబూబ్‌నగర్: ప్రతి కులం వారు ఆత్మగౌరవంతో బతికేలా చూడటమే తమ లక్ష్య మని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల గౌడ, ఎస్సీ, ఎస్టీల మద్యం దుకాణాలను మంత్రి లక్కీడిప్ ద్వారా ఎంపిక చేశారు. -
మద్యం షాపులు పెరగవ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైన్‌షాపుల గడువు మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కొత్త విధానంపై ఎక్సైజ్ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. షాపుల సంఖ్యను పెంచాలా? ప్రస్తుతమున్న ఆయా షాపుల పరిధిని మార్చాలా? దరఖాస్తు ధర ఎలా ఉండాలి? శ్లాబుల్లో మార్పులు చేయాలా? ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా రాబడి ఎలా రాబట్టాలి అనే దానిపై ఎక్సైజ్ శాఖ అధికారుల్లో తర్జనభర్జనలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు (ఏ4 షాపులు) ఉన్నాయి. కొత్త ఎక్సైజ్ పాలసీపై ప్రాథమిక చర్చల అనంతరం ఈసారి కూడా పాత సంఖ్యలోనే దుకాణాలను కొనసాగించాలని అధికారులు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు, లైసెన్సు ఫీజు, ఏ4 షాపుల పరిధుల్లో మార్పులు చేసినా, షాపుల సంఖ్యను మాత్రం పెంచవద్దని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. 2019–21 ఎక్సైజ్ పాలసీ ఈ ఏడాది అక్టోబర్ 31తో ముగియనుంది. పరిశీలనలో రెండు అంశాలు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ వర్గాలు రెండు అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న లైసెన్సు ఫీజును కట్టించుకుని మరో ఏడాది పాటు లైసెన్సుల గడువు పొడిగించాలని, లేదంటే కనీసం రెండు లేదా మూడు నెలల పాటు ఎలాంటి ఫీజు లేకుండా పొడిగించాలనే ప్రతిపాదనలపై ఆ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. లేదంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయనే అంశాన్ని కూడా ఆ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31 తర్వాత రానున్న రెండేళ్ల పాటు రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ వస్తుందా? వాయిదా పడుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. మాకూ న్యాయం చేయండి... ప్రస్తుతం కరోనా వైరస్ గుబులు ఎక్సైజ్ శాఖను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలా లేక పాత షాపులనే మరికొన్నాళ్లు పొడగించాలా అనే చర్చ జరుగుతోంది. ఐదు నెలల క్రితం రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో 159 కొత్త బార్ షాపులను ప్రభుత్వం నోటిఫై చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 59 బార్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే బార్లను ఏర్పాటు చేశారని, మిగిలిన వారంతా లైసెన్సులు తీసుకుని ఎప్పుడు బార్లు పెట్టాలన్న దానిపై మీమాంసలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు కరోనా వైరస్ కారణంగా జరగని వ్యాపారమే కారణమని ఎౖMð్సజ్ వర్గాలంటున్నాయి. మరోవైపు కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని బార్లు, వైన్‌షాపులు, బీర్, లిక్కర్ తయారీ పరిశ్రమలు 2–3 నెలలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో బార్లు, బీర్ తయారీ పరిశ్రమలకు లైసెన్స్ ఫీజు, తయారీ గంటల విషయంలో మినహాయింపునిచ్చింది. తద్వారా బార్ల యజమానులు, డిస్టలరీలకు కొంత ఉపశమనం కలిగింది. కానీ 47 రోజుల సంపూర్ణ లాక్ డౌన్, కొన్ని రోజుల పాటు మధ్యాహ్నం నుంచి షాపులు మూసేయాల్సి రావడంతో తాము కూడా నష్టపోయామని వైన్‌షాపుల యజమానులంటున్నారు. తమకు కూడా ఈ విషయంలో న్యాయం చేయాలని, శాశ్వత లైసెన్సుదారులకు మినహాయింపు ఇచ్చినట్టే రెండేళ్ల వరకే ఉండే తమకు కూడా ఏదో ఒక రూపంలో ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. -
Lockdown ఎఫెక్ట్: రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా తాగేశారు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం తెలంగాణలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో మందు బాబులు బెంబెలేత్తారు. మద్యం దుకాణాల వద్దకు పరుగు తీశారు. పది రోజులకు సరిపడా మద్యాన్ని ఒక్కసారే కొనుగోలు చేశారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశారంటే.. పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఇక నేటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రాగా.. ఉదయం 6-10 గంటల వరకే అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చారు. ఇక ఇవాళ ఒక్కరోజు అది కూడా 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈనెల 1 నుంచి 12 వరకు అన్ని డిపోలలో 770 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా.. కేవలం నిన్న, ఈ రోజు(మే 11,12) ఏకంగా 219 కోట్ల రూపాయల అమ్మకాలు జరగడం గమనార్హం. ఇక తెలంగాణలో మొత్తం 2,200 మద్యం దుకాణాలు ఉన్నాయి. చదవండి: లాక్డౌన్: వైన్స్, మార్ట్‌ల్లో మద్యం ఖాళీ -
Telangana Lockdown: లిక్కర్ దొరుకుతుంది
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలంలోనూ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చిన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే వైన్ షాపులు, బార్, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయించే సమయంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అన్ని దుకాణాల ముందు భౌతికదూరం పాటించేలా రింగులు ఏర్పాటు చేసి వినియోగదారులు వాటిలో నిలబడి మద్యం కొనుగోలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. పర్మిట్ రూమ్స్ తెరిచేందుకు వీల్లేదని, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలను అదుపు చేసే బాధ్యత కూడా షాపు యజమాన్యమే తీసుకోవాలని తెలిపారు. చదవండి: (Telangana: బస్సులు, మెట్రో రైళ్లు తిరిగే సమయాలివే..) పొద్దున్నే ఎవరొస్తారు? ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఉదయాన్నే బార్లు ఎలా తెరవాలన్న దానిపై యజమానుల్లో సందిగ్ధత నెలకొంది. పొద్దున్నే బార్లలో కూర్చొని మద్యం తాగేందుకు ఎవరొస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటలకే రెస్టారెంట్లు మూసివేయడం ఎలా అని వాపోతున్నారు. గత లాక్‌డౌ సమయంలోనే తాము తీవ్రంగా నష్టపోయామని, లైసెన్సు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లామని, మళ్లీ ఇప్పుడు లాక్‌డౌన్‌కు వెళితే అసలు బార్లు నడిపే పరిస్థితి కూడా ఉండదంటున్నారు. దీంతో బార్ల నుంచి కూడా మద్యాన్ని రిటైల్‌గా అమ్ముకునే అవకాశం ఇవ్వాలని, లేదంటే వైన్ షాపులు బంద్ చేసిన తర్వాత బార్ల నుంచి డోర్ డెలివరీకి అనుమతివ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు. ‘మందు’చూపు ఒకపక్క రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుండగానే, లాక్డౌన్ విధిస్తున్నట్టుగా వార్తలు వెలువడడంతో మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూలు కట్టారు. మిగతా షాపుల మాట ఎలా ఉన్నా మద్యం దుకాణాలు మాత్రం కిక్కిరిసిపోయి కన్పించాయి. కరోనా నిబంధనలు మరిచిపోయి మద్యం కోసం ఎగబడ్డారు. కొన్నిచోట్ల పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి కర్ఫ్యూ సమయం వరకు ఇదే పరిస్థితి ఉంది. లాక్డౌన్ సమయంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో అన్న సందేహంతో చాలామంది 10 రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేయడం కన్పించింది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.120 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలలో 11 రోజులకు రూ.670 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, మంగళవారం ఒక్క రోజే సగటుకు రెండింతలు ఎక్కువగా అమ్ముడయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: (నేటి నుంచి 10 రోజుల లాక్డౌన్.. మినహాయింపు వాటికే!) రాజధాని వాటా రూ.50 కోట్లు! హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. చిన్నా..పెద్ద..మహిళలు..పురుషులు అన్న తేడా లేకుండా షాపుల ముందు బారులు తీరారు. నగర పరిధిలోని సుమారు 300 మద్యం దుకాణాల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. రద్దీని క్రమమద్ధీకరించేందుకు పలు చోట్ల పోలీసులు, పెట్రోలింగ్ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాసేపటికే పలు దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులు వెలిశాయి. నగరంలో రోజూ రూ.10 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. మంగళవారం ఒక్కరోజే అంతకు 5 రెట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగినట్లు ఆబ్కారీ అధికారులు అంచనా వేశారు. -
హైదరాబాద్: వైన్‌షాపుల వద్ద బారులు
-
లాక్డౌన్ ప్రకటనతో కిక్కిరిసిన మద్యం దుకాణాలు
సాక్షి, హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణలో లాక్డౌన్ అమల్లోకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం కోసం పలు వైన్‌షాపుల వద్ద తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వైన్ షాపులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. టోలిచౌకి, గోల్కొండ, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో లిక్కర్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుమికూడారు. కోవిడ్ రూల్స్ పాటించకుండా మద్యం కోసం ఎగబడుతున్నారు. ముందస్తుగానే మద్యం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొందరు పది రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కాగా, లాక్డౌన్ అమల్లోకి వస్తే మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వాల్సిందిగా లిక్కర్, బీర్ సప్లయర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. లిక్కర్ ఉత్పత్తిని కూడా ఆపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. చదవండి: తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ తెలంగాణలో లాక్డౌన్: హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
మహిళ వైరల్ వీడియో.. ‘పెగ్గు పడితే కరోనా పరారే’
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, మందుబాబులు మాత్రం కరోనా గిరోనా జాన్తా నై.. అంటున్నారు. లాక్డౌన్, కర్ఫ్యూలతో వైన్ షాప్‌లు మూసేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. పెగ్గు పడితే కరోనా పారిపోవాల్సిందే అంటూ మందు షాపులు తెరవాలని కోరుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన డాలీ అనే మహిళ వైన్ షాపులు తెరవాలని ఏకంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కే మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఆరు రోజుల లాక్డౌన్ విధించిన ఢిల్లీ సర్కార్ కేసుల్లో తగ్గుదల లేకపోవడంతో ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నిత్యావసర, అత్యవసర దుకాణాలు మినహా మిగతా అన్నీ మూతపడ్డాయి. దీంతో మందుబాబులు అల్లాడిపోయారు. అధిక ధర చెల్లించి బ్లాక్‌లో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఎక్కడా మందు దొరకలేదు. ఆ సమయంలో ఢిల్లీ శివపురి కాలనీకి చెందిన ఓ వైన్ షాప్ వద్దకు మద్యం కొనుగోలు చేసేందుకు డాలీ అనే మహిళ అక్కడికి వచ్చారు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ టీకా కూడా ఆల్కహాల్‌తో సరితూగలేదు. ఎందుకంటే ఆల్కహాల్ మాత్రమే నిజమైన మెడిసిన్. 35 ఏళ్లుగా మద్యం తాగడం వల్ల తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని అన్నారు. 'ఒక్క పెగ్గు పడితే కరోనా పారిపోతుంది. లాక్ డౌన్ ఎత్తేసి, మద్యం దుకాణాలకు అనుమతులివ్వాలి. అలా చేస్తే కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులన్నీ ఖాళీ అవుతాయి. ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ సమస్య నుంచి భయటపడుతుంది' అంటూ జోస్యం చెప్పారు. సదరు మహిళ మాట్లాడే సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తి.. మీకు లాక్ డౌన్ లో కూడా మందు ఎలా లభించింది? అని ప్రశ్నించగా.. ‘నేను స్టోర్ చేసుకున్న మందు అయిపోయింది. అందుకే మద్యం దుకాణాల్ని ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని జవాబిచ్చారు. Delhi wali Dolly aunty is back 🤣 pic.twitter.com/GsHNXNDaaf — varun goyal (@varunmaddy) April 25, 2021 -
కూలీ డబ్బులన్నీ ఇప్పుడు ఇంటికే
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ హయాంలో 535 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 425కి పరిమితమయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మరో 60 షాపులు తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక 3,000కిపైగా ఉన్న బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించారు. బార్లలో అమ్మకాలు నిలిపివేయడంతో మద్యం అమ్మకాలు 50 శాతం, బీరు విక్రయాలు 90 శాతం తగ్గాయి. విక్రయాల్లో సమయ పాలన పకడ్బందీగా అమలు చేయడం, పరిమితి విధించడంతో మద్యం రక్కసిని నియంత్రించగలిగారు. గడ్డు కాలం నుంచి గట్టెక్కాం.. ఇంటి యజమాని తాగుడుకు బానిస కావడంతో ఛిద్రమైన ఎన్నో కుటుంబాలను చూశా. ఆ గడ్డు పరిస్థితుల నుంచి ఇప్పుడు మేం పూర్తిగా కోలుకున్నాం. మా ఆయన సత్యన్నారాయణ తాగుడుకు స్వస్తి చెప్పడం తో కూలీ డబ్బులన్నీ ఇంటికి చేరుతున్నాయి. చేతి ఖర్చులకు రూ.10, 20 తీసుకొని మిగతావి మాకే ఇవ్వడంతో సంసారం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. – పొత్తూరి వెంకటలక్ష్మి (బూరుగపల్లి, రాజవొమ్మంగి మండలం) కొనలేక మానేశా.. ‘25 ఏళ్లుగా మందు తాగుతున్నా. గతంలో క్వార్టర్ బాటిల్ రూ.110కే దొరకడంతో కూలీ డబ్బుల్లో సగం ఖర్చు పెట్టి మద్యం తాగేవాడిని. బెల్టుషాపుల ద్వారా 24 గంటలు దొరికేది. ఇప్పుడు ధరలు భారీగా పెరగడంతో క్వార్టర్ బాటిల్ రూ.350 పెట్టి కొనలేక మద్యం మానేశా. నా కుమార్తె రాణికి గ్రామ వలంటీర్‌గా ఉద్యోగం కూడా వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలతో మా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది’– అండ్రు నాగేంద్రుడు (గోకవరం మండలం సంజీవయ్యనగర్) దూరం వెళ్లలేక మానుకుంటున్నాం.. మా ఊళ్లో మద్యం షాపు లేదు. మద్యం దుకాణానికి వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని వెల్ల గ్రామానికి వెళ్లాలి. గత ప్రభుత్వంలో బెల్టు షాపుల వల్ల మద్యం దొరికేది. వీలున్నప్పుడల్లా మద్యం తీసుకునే వాళ్లం. ప్రస్తుతం ప్రభుత్వం బెల్టు షాపులు కూడా లేకుండా చేయడంతో ఊర్లో చాలా మందిమి మద్యం అలవాటు మానుకున్నాం. నేను కల్లు గీత వృత్తి ద్వారా వచ్చిన ఆదాయంతో ఇద్దరు పిల్లలను చక్కగా పోషించుకుంటున్నాను. – వాసంశెట్టి నాగ ఆంజనేయులు,తాడిపల్లి, రామచంద్రపురం మండలం) -
తగ్గిన మద్యం షాపులు
-
తెలంగాణలో మందుబాబులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. అదనంగా మరో 2 గంటల పాటు మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఇటీవల తెలంగాణలో మద్యం షాపులు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా ఆంక్షల కారణంగా ఇప్పటివరకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పరిమితమైన మద్యం దుకాణాలను రాత్రి ఎనిమిది వరకు తెరిచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నం 72 ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు జరపొచ్చని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి : రాకపోకలకు గ్రీన్ సిగ్నల్) ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా రాత్రి 8 గంటల వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచనున్నారు. దీంతో అదనంగా మరో 2 గంటల పాటు మద్యం కొనుగోలుకు అవకాశం లభించడంతో.. మందుబాబులు సంబరపడుతున్నారు. ఈ నిర్ణయంతో మద్యం కొనుగోళ్లు కొద్దిమేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా.. అన్ని దుకాణాలు, వ్యాపార సదుపాయాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. -
కేరళలో రేపట్నుంచే.. బుకింగ్స్ ప్రారంభం
తిరువనంతపురం : దేశంలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి మూతబడ్డ మద్యం దుకాణాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాకుండా దుకాణాలకు వచ్చే వారు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రకటనలో పేర్కొంది. (మహమ్మారి కాలంలో రైల్వేస్ అరాచకం: కేరళ ) అంతేకాకుండా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దుకాణాల ముందు క్యూలైన్లను కట్టడి చేసే దిశగా ఆన్లైన్లో అమ్మకాలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి టిపి రామకృష్ణన్ పేర్కొన్నారు. దీని ద్వారా క్యై లైన్ల వద్ద రద్దీ తగ్గుతుందని తెలిపారు. 'బెవ్య్కూ' అనే మొబైల్ యాప్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఆన్లైన్లోనే బుకింగ్స్ చేసుకోవచ్చని వెల్లడించారు. బుకింగ్ చేసుకోగానే మీకు ఓ టోకెన్ నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబర్ ద్వారానే మద్యం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ప్రతీ నాలుగు రోజులుకు ఒకసారి మాత్రమే ఒక వ్యక్తి మద్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టోకెన్ ఆధారంగా మాత్రమే వారికి కేటాయించిన సమయాల్లోనే మద్యం కొనుగోలు చేయాలని అన్నారు. అంతేకాకుండా ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమందిని దుకాణాల ముందు అనుమతించరని రామకృష్ణన్ తెలిపారు. (ఆ వదంతులను తోసిపుచ్చిన హోంమంత్రి ) -
ఢిల్లీలో కళకళలాడుతున్న మద్యం షాపులు
-
మద్యంపై కీలక నిర్ణయం: రోజూ 500 టోకెన్లే..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో మద్యం షాపులు నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షాపులు తెరవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మే 17 దాకా లిక్కర్ షాపులు మూసివేయాలని గతంలో మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో తెల్లవారు జామునుంచే మద్యం షాపులు ముందు పాదరక్షలు, హెల్మెట్లు, గొడుగులు దర్శన మిచ్చాయి. భౌతిక దూరం పాటిస్తూ.. టోకన్ సిస్టమ్ అమలు చేయాలని సుప్రీం కోర్టు సూచించడంతో మద్యం దుకాణాల ముందు రద్దీ నెలకొంది. కాగా.. రోజుకు ఒక్కో షాపు కేవలం 500 టోకెన్లు జారీ చేసి వాటికి మాత్రమే మద్యం అమ్మేలా చూడాలని ఆదేశించింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టస్మాక్) ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడవనున్నాయి. వీటిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న చెన్నై, తిరువళ్లూర్, ఇతర కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగలిన ప్రాంతాల్లో మాత్రమే మద్యం షాపులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. చదవండి: కరోనా నుంచి కోలుకున్న డాక్టర్‌కు బెదిరింపులు మద్యం షాపులుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ.. షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10,108కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,599 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 71 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 7,435 యాక్టివ్ కేసులున్నాయి. అటు చెన్నైలో శుక్రవారం 309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5,947కి చేరింది. చదవండి: మద్యం అమ్మకాలు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే -
మద్యం దుకాణాలపై పిటిషన్.. రూ.లక్ష ఫైన్
ఢిల్లీ : కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మద్యం షాపులు తెరవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా పిటిషనర్‌పై లక్ష రూపాయల జరిమానా విధించింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం, మస్కులు ధరించడం లాంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున లిక్కర్ షాపులు తక్షణం మూసి వేయాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. గౌతమ్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయని, ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం షాపుల ముందు ప్రజలు బారులు తీరుతున్నందున ఆన్లైన్ ద్వారా మద్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ-టోకెన్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు కేజ్రివాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం..టోకెన్ నెంబర్ ఆధారంగా వారిచ్చిన సమయంలోనే మద్యం కొనాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ముందుగానే వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా టోకెన్ నెంబర్ ఇస్తారు. (మందుబాబుల కోసం సరికొత్త వ్యూహం ) -
బార్లు, హోటళ్లలో మద్యం అమ్మకాలు!
తిరువనంతపురం: లాక్డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో తమ రాష్ట్రంలో త్వరలోనే మద్యం అమ్మకాలు ప్రారంభమవుతాయని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖా మంత్రి టీపీ రామకృష్ణన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘బేవరేజ్ కార్పొరేషన్, కేరళ రాష్ట్ర వినియోగదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలోని 301 లిక్కర్ షాపులు త్వరలోనే తిరిగి ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన తేదీలు, విధివిధానాలు వెల్లడిస్తాం’’ అని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల సమయంలో సామాజిక ఎడబాటు నిబంధనకు విఘాతం కలిగే అవకాశం ఉన్న తరుణంలో... వెబ్‌పోర్టల్స్ ద్వారా బుకింగ్‌లు చేపట్టి.. టేక్ అవే ద్వారా మద్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. (మద్యం హోం డెలివరీకి అనుమతినిచ్చిన ‘మహా’ సర్కారు) అదే విధంగా బార్లు, హోటళ్లలో కూడా మద్యం అమ్మకాలకు అనుమతినిస్తున్నామని.. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాల్సి ఉంటుందని రామకృష్ణన్ స్పష్టం చేశారు. కేవలం పార్శిల్ కౌంటర్ల వద్దనే వినియోగదారులు చెల్లింపులు జరిపి.. మద్యం తీసుకువెళ్లాలని సూచించారు. కాగా మద్యం అమ్మకాలపై పన్ను పెంచుతూ కేరళ కేబినెట్ బుధవారం తీర్మానాన్ని ఆమోదించింది. బీర్, వైన్ అమ్మకాలపై 10 శాతం, ఇతర మద్యం ఉత్పత్తులపై 35 శాతం టాక్స్ పెంచింది. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిన నేపథ్యంలో.. ఆదాయ మార్గాన్వేషణలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. (ఆన్లైన్లో మద్యం విక్రయంపై ఆలోచించండి) -
ఆ బిల్లుల శాసన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నాం
సాక్షి, అమరావతి: కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు తరలించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల ఉపసంహరణ బిల్లులకు సంబంధించిన శాసనపరమైన ప్రక్రియ ముగింపు కోసం వేచి చూస్తున్నామని హైకోర్టుకు నివేదించింది. ఆ తరువాత తగిన సమయంలో చట్ట నిబంధనలకు లోబడి తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వీటిని అడ్డుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ఆందోళన ఆధారంగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. దశలవారీ అమలుకు కట్టుబడి ఉన్నాం హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దశల వారీగా మద్య నియంత్రణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. లాక్డౌన్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలను నిషేధించేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ధర్మాసనం ఎదుట ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపించారు. మద్య నిషేధం దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. తమిళనాడులో మద్యం షాపుల వద్ద అదుపు చేయలేని స్థాయిలో జనాలు ఉండటంతో మద్యం విక్రయాలను ఆపాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చిందని, అయితే రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఏపీలో తగ్గుతున్న మద్యం వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచడంతో మందు బాబులు తాగుడు తగ్గించేశారు. గత రెండు రోజుల నుంచి మద్యం వినియోగం బాగా తగ్గింది. సాధారణంగా వారాంతంలో మద్యం వినియోగం అధికంగా ఉంటుంది. రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. అలాంటిది శనివారం మద్యం షాపులు మూసే సమయానికి కేవలం రూ.40.77 కోట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మద్యం ధరల పెరుగుదల ప్రభావం మందు బాబులపై ఊహించిన దానికంటే ఎక్కువ పడింది. మద్యం కొనాలంటేనే మందు బాబులు భయపడుతున్నారు. మరోవైపు అక్రమ మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. నాటు సారా, సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్) అమ్మకాలు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పేరిట శనివారం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మద్యం షాపుల్ని ఈ నెలాఖరు నాటికి 13 శాతం తగ్గిస్తే మద్యం వినియోగం ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో తగ్గే 566 మద్యం షాపుల వివరాలపై ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఒక్క రోజులోనే రూ.2 కోట్లకు పైగా తగ్గిన అమ్మకాలు ► రాష్ట్రంలో ఈ నెల 8 (శుక్రవారం)న మద్యం, బీరు కలిపి 15.55 లక్షల బాటిళ్లు విక్రయించారు. అమ్మకాల విలువ రూ.42.72 కోట్ల వరకు ఉంది. ► శనివారం 15.40 లక్షల బాటిళ్లను మాత్రమే మద్యం ప్రియులు కొనుగోలు చేయగా, విక్రయాల విలువ రూ.40.77 కోట్లకు తగ్గిపోయింది. ► వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2020 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మద్యం అక్రమాలకు పాల్పడుతున్న వారిపై 7,812 కేసులు నమోదు చేసింది. 5,870 మందిని అరెస్టు చేసి, 97,482 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
సత్ఫలితాలు ఇస్తున్న సీఎం జగన్ నిర్ణయం
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో గణనీయంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేయడంతో గతానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. చదవండి: 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' తాజాగా ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు 75శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. మే 4న రూ.70 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా.. మే 9 నాటికి రూ. 40.77 కోట్లకు చేరుకున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో రూ. 30 కోట్లకు పైగా మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. తాజాగా మరో 13 శాతం మద్యం షాపుల తొలగింపు నిర్ణయంతో మద్యం విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టనున్నాయి. చదవండి: వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్ -
మద్యం అమ్మకాలపై రజనీ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల వద్ద కనీసం సామాజిక దూరం కూడా పాటించకుండా మందుబాబులు ఎగబడుతున్నారు. దీని ద్వారా వైరస్ వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మద్యం అమ్మకాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తమిళనాడులో మద్యం అమ్మకాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా క్లిష్ట కాలంలోనూ సామాన్యుల నుంచి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వాలు చూడటం సరికాదన్నారు. ఇకపై మద్యం అమ్మకాలను ఇలానే కొనసాగితే తిరిగి మరోసారి అధికారంలోకి రారన్న విషయం మర్చిపోవద్దని అన్నాడీఎంకే ప్రభుత్వానికి రజనీ చురకలు అంటించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా విమర్శించారు. (మద్యం అమ్మకాలకు నో.. సుప్రీంకు సర్కార్) ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. మద్యం అమ్మకాలను మాత్రం జోరుగా సాగుతున్నాయి. దీనిపై మద్రాస్ హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ న్యాయపోరాటం చేస్తోంది. కాగా మద్యం షాపులు తెరిచిన తొలిరోజే రూ.170 కోట్ల లిక్కర్ అమ్మకాలను జరిగిని విషయం తెలిసిందే. (ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్) -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దశలవారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం ఇప్పటికే 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం, ముందుగా బెల్ట్‌షాపులు ఎత్తివేస్తానంటూ పాదయాత్రలో హామీనిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను ఏటా కొంతమేర తగ్గించేలా కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
హైకోర్టు ఉత్తర్వులు : మద్యం షాపులు మూసివేత
చెన్నై : తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మద్యాన్ని కేవలం ఆన్లైన్లోనే విక్రయించాలని స్పష్టం చేసింది. మే 17 వరకే ఆన్లైన్లో లిక్కర్ విక్రయాలను అనుమతిస్తారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తమిళనాడులో తొలిరోజు మద్యం విక్రయాలు రికార్డు స్దాయిలో రూ 170 కోట్ల మేర సాగాయి. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 600 కోవిడ్-19 తాజా కేసులు వెలుగుచూశాయి. వీరిలో 399 మంది చెన్నై నగరానికి చెందిన వారేనని అధికారులు వెల్లడించారు. చదవండి : వైన్ షాపులో రకుల్: ఇందులో నిజమెంత? -
‘మద్యే మద్యే’ న్యాయం సమర్పయామి
కోవిడ్ 19 అంటురోగపు రోజుల్లో నిత్యావసరాలంటే తిండి, వైద్యం. మరి మందు (ఔషధం కాదండోయ్) సంగతేమిటి? ఉద్యోగం లేకపోయినా ఉపద్రవకాలంలో మద్యం అత్యవసర ద్రవమని అర్థం కాలేదా? జనం తాగకుండా 45 రోజులు బతికి ఉండగలరని నిరూపించుకుంటే ప్రభుత్వాలు 45 రోజు లకన్నా అమ్మకుండా ఉండలేమని చాటుకున్నాయి. పాఠాలు లేని పంతుళ్లకు బ్రాందీ షాపుల కాపలా డ్యూటీ. మగా, ఆడా, చిన్నా పెద్ద తేడా లేకుండా జనం బారులు తీరి ఎంతో ఓపికగా భౌతిక దూరాలలో నిలబడి ఉవ్విళ్లూరుతూ కొనడం మహోన్నత భారతీయ జనతా నాగరికత. దేశాన్ని ఆర్థికమాంద్యం నుంచి కాపాడే దేశభక్తులు ఒక్కరోజులోనే ఒక్కో చోట వందల కోట్ల రూపాయల మద్యం తాగేశారు. లాక్ డవున్ కాలంలో వేరే రోగాలు రాకపోవడానికి కారణాలు అమ్మచేతి వంట తినడం, మందు కొట్టకుండా ఉండడం అని కొందరు అమాయకులు సూత్రీకరించారు. కానీ వెంటనే మద్యప్రవాహం మొదలైంది. సరిగ్గా సాగని చదువులను వానాకాలపు చదువులు అనేవారు. ఇప్పుడు కరోనా కాలపు చదువులనాలి. విమానాలు, రైళ్లు, బస్సులు, హోటళ్లు, సినిమాలు తెరిచే రోజులు వచ్చిన తరువాత చివరకు, విద్యాలయాలు తెరవడం గురించి ఆలోచిస్తారు. ముందు తెరిచింది మద్యం సీసామూతలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే డబ్బు దక్కదు. వలస కూలీలను సొంతూర్లకు పంపడానికి రైళ్లు నడపాలనే చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని కేవలం 45 రోజుల ఆలస్యంగా తీసుకున్నారు. వందలాది మైళ్లు వేలాది జతల కాళ్లు నడిచిన తరువాత, కొన్ని ప్రాణాలు పోయిన తరువాత, అది అత్యవసర సేవ అని, ప్రజల చావుబతుకులకు సంబంధించిన సమస్య అనీ తెలుసుకున్నారు. మద్యం కన్నా అత్యవసర వస్తువు న్యాయం అని గుర్తురాకపోవడం ఒక విషాదం. మద్యం బార్ తెరిచినా న్యాయం బార్ మూసే ఉంది. తాలూకా, మండలం, జిల్లా స్థాయిల్లో న్యాయ వితరణ, న్యాయ విచారణ, వివాద పరిష్కారాలు లాక్ డవునైనాయి. హైకోర్టులు, సుప్రీంకోర్టు చాలా సీరియస్ అంశాలను పరిశీలించడానికి వీడియో సమావేశాల ద్వారా న్యాయాన్యాయ విచారణ సాగిస్తున్నాయి. హైకోర్టు మనసు గెలుచుకున్నవారికీ, సుప్రీంకోర్టు కంటికి కనపడిన వారికి న్యాయం అందుబాటులో ఉంటుంది. మిగతావారికి న్యాయం అరుదైన సరుకు, అందని ద్రాక్ష. మద్యం ముందు న్యాయం చివరకు. ఎంత సామాజిక న్యాయం ఇది? లాయర్లు ఈ విషయం ఆలోచించరు. వేసవికి వచ్చే సెలవులు కరోనా పుణ్యాన రావడంతో సంతోషించేవారు కొందరైతే, రెక్కాడితే తప్ప డొక్కాడదన్న రీతిలో బెయిల్ కోసం ఎవడైనా వస్తే తప్ప రెయిల్ నడవని లాయర్‌కే చాలా కష్టం. 40 కోట్ల మంది కూలీలు వలసవచ్చిన చోట పనిలేక, మరో రాష్ట్రంలో ఉన్న సొంతూరికి పోలేక, బతక లేక చావలేక ఉంటే వారికి న్యాయం అడిగే అవకాశం లేదు. సుప్రీంకోర్టులో పిల్ వేస్తే, ధర్మాత్ములు ఆశావిశ్వాస సిద్ధాంతమనే ఒక వినూత్న విధానాన్ని కనిపెట్టారు. ఇదేమిటని అడిగాడో మిత్రుడు. హోప్ అండ్ ట్రస్ట్ ఫిలాసఫీ అని ఇంగ్లిష్ మీడియంలో చెప్పాను. వెంటనే ఆ మిత్రుడు అర్థం అయిందన్నాడు. దాని అర్థం ఏమంటే ప్రభుత్వం వారు చేస్తానన్న పని చేస్తారని ఆశించడం, చేశారని విశ్వసించడం అని సుప్రీంకోర్టు న్యాయవాది వివరించారు. వలస కార్మికులకు ప్రభుత్వం ఆహారం ఇస్తున్నామని చెప్పితే నమ్మాలి. ఉన్నచోట ఉండక నడవడమెందుకు అని న్యాయం చెప్పారు. పిల్ కొట్టేశారు. పోలీసులు తన్నినా, లాకప్‌లో వేసినా, రాజద్రోహం కేసులతో విమర్శల గొంతు నులిమినా, తప్పుడు కేసులుపెట్టినా అడుక్కోవడానికి మన ఊళ్లో న్యాయస్థానం గేట్లు తెరవరు. అక్కడ సర్వోన్నత న్యాయస్థానాధీశులు కరోనా సంక్షోభ కాలంలో పాలక, శాసన, న్యాయవ్యవస్థలు సమన్వయంతో దేశసేవ చేయాలని సెలవిచ్చారు. పాలకుల ఘోర నిర్ణయాలు తీసుకున్నా న్యాయవ్యవస్థ సమన్వయంతో సర్దుకు పోవాలని రాజ్యాంగంలో అంతర్లీనంగా వారికి కనిపించింది. కరోనా అత్యయిక పరిస్థితుల కాలంలో ప్రాథమిక హక్కుల గురించి తపన పడడం ముఖ్యం కాదనీ సర్వోన్నతులు ప్రవచించారు. పాపం జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నాకు ఈ టెక్నిక్ తెలియక, ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులు ముఖ్యమని, వాటిని సస్పెండ్ చేయడానికి వీల్లేదనీ తీర్పుచెప్పి తను ప్రధాన న్యాయమూర్తి కాకుండా పోయారు. మొదట్లో ఈ న్యాయాన్ని అన్యాయంగా భావించినా ఇప్పుడు ఖన్నాదే న్యాయమని చాలామంది ఆమోదించారు. హోప్ అండ్ ట్రస్ట్ సిద్ధాంతం ఏమిటని బుర్ర బద్దలు కొట్టుకోకుండా వీధిలో ప్రభుత్వమే బ్లాక్ రేట్లో దగ్గరుండి మద్యాన్ని అమ్మిస్తుంటే మందుకొట్టి మత్తుగా పడిపో, లేకపోతే ఇప్పటికిదే న్యాయం అనే ప్రవచనాలు మాత్రమే మననం చేసుకో. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మద్యం కోసం బారులు తీరిన జనం..
-
ఇంతలా.. గెంతాలా..?
సాక్షి, సిటీబ్యూరో: పొద్దున్నే 7 గంటలకు ఓ వ్యక్తి ఇందిరానగర్‌లోని సాయి వైన్స్ వద్దకు చేరుకున్నాడు.. వైన్స్ తెరవగానే తొలి కస్టమర్ కావడంతో అతడికి దండేసి మరీ మద్యం అందించారు.. సీన్ కట్‌చేస్తే.. సాయంత్రం ఆ వ్యక్తి ఇందిరానగర్‌లోనే ఫుల్లుగా మందేసి ఇలా అర్ధనగ్నంగా కనిపించాడు. ఫోటోలు -దయాకర్ తూనుగుంట్ల అబిడ్స్: బర్కత్‌పురకు చెందిన మహేష్(30) బుధవారం సాయంత్రం గౌలిగూడలోని ఓ వైన్‌షాప్‌లో మందు కొనుగోలు చేసి సమీపంలోనే సేవించాడు. తాగిన మైకంలో ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని అక్కడిక్కడే విద్యుదాఘాతంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు మహేష్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు. యాక్సాబ్లేడ్‌తో దాడి చాంద్రాయణగుట్ట: తాగిన మైకంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛత్రినాక పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పుగూడ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన పర్వతాలు అలియాస్ రాజు (58) మద్యం మత్తులో యాక్సాబ్లేడ్‌తో బుధవారం రాత్రి రాయుడు (48) అనే వ్యక్తిపై దాడికి దిగి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గేట్లెత్తిన గ్రేటర్.. ఫస్ట్ డే.. ఫెస్ట్
సాక్షి, సిటీబ్యూరో: మద్యంప్రియుల నలభై ఐదు రోజుల ఎదురుచూపులు ఫలించాయి. మహానగరంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మహానగరంలోని మద్యం దుకాణాల వద్ద బుధవారం మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది మద్యం ప్రియులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. కట్టుదిట్టమైన పోలీసు పహారా, బారికేడ్ల ఏర్పాటు మధ్య కొన్నిచోట్ల మాస్కులు, హెల్మెట్లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ మరీ మద్యం కొనుగోలు కోసం నిరీక్షించారు. మరికొన్ని చోట్ల మాస్కులు, భౌతిక దూరం పాటించకుండానే కిక్కు కోసం పడిగాపులు పడ్డారు. మహిళల కోసం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయడం గమనార్హం. మొత్తంగా మహానగరం పరిధిలోని సుమారు 300 మద్యం దుకాణాల వద్ద ఒక్కరోజు కిక్కు సేల్స్ రూ.50 కోట్లకు పైమాటేనని ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తుండటం విశేషం. సాధారణ రోజుల్లో నగరంలో సుమారు రూ.20 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయి. దసరా, సంక్రాంతి ఇతర పర్వదినాల్లో దీనికి రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరగడం పరిపాటి. కానీ దీనికి అదనంగా రికార్డు స్థాయిలో సేల్స్ జరగడం గమనార్హం. ఒక్కో మందుబాబు.. ఆరు బీర్లు.. మూడు ఫుల్ బాటిళ్లు అన్నచందంగా మద్యం కొనుగోలు చేశారు. రాజధాని రెడ్ జోన్లో ఉన్నప్పటికీ మందుబాబులజోష్.. ఛీర్స్ జోన్లను తలపించింది.(తెలంగాణలో మద్యం జాతర) అందినకాడికి దండుకున్న వ్యాపారులు.. మందుబాబుల బలహీనతను ఆసరా చేసుకొని పలుచోట్ల మద్యం వ్యాపారులు అందినకాడికి దండుకున్నారు. ప్రీమియం బ్రాండ్లపై 16 శాతం.. సాధారణ మద్యంపై 11 శాతం పెరుగుదలను సాకుగా చూపుతూ ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేశారు. ప్రీమియం బ్రాండ్లకు చెందిన ఫుల్ బాటిల్‌పై రూ.200 నుంచి రూ.300.. సాధారణ మద్యంపై రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేయడం గమనార్హం. పలు దుకాణాల వద్ద సవరించిన మద్యం ధరల బోర్డులను ప్రదర్శించకపోవడంతో మందుబాబులు చేసేది లేక వ్యాపారులు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించి జేబులు గుల్లచేసుకున్నారు. (కేసీఆర్ చిత్రపటానికి మందుబాబుల పాలాభిషేకం) పలు హై ఎండ్ బ్రాండ్ల కొరత.. మద్యం దుకాణాల్లో పలు హై ఎండ్ బ్రాండ్లకు చెందిన మద్యం కొరత స్పష్టంగా కనిపించింది. పలు మద్యం దుకాణాల్లో జానీవాకర్ రెడ్‌లేబుల్, బ్లాక్ లేబుల్, డబుల్ బ్లాక్, చివాస్ రీగల్, టీచర్స్ 50, టీచర్స్ ఆరిజిన్ వంటి హై ఎండ్ మద్యం దొరకలేదని మందుబాబులు వాపోయారు. మరో రెండురోజుల్లో డిపోల నుంచి సరుకు వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. నగరంలోని మద్యం దుకాణాలకు లిక్కర్ సరఫరా చేసే డిపోల్లో నెలరోజులకు సరిపడా స్టాకు నిల్వ ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. సాక్షి, నెట్వర్క్: నగరంలో వైన్స్‌కు ‘లాక్’ తెరిచారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విక్రయాలు కొనసాగుతాయని ప్రకటించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మాస్కులు తప్పని సరి అన్నారు. కానీ ఆ నిబంధనలను చాలామంది పట్టించుకోలేదు. ఉదయం 7 గంటల నుంచే వైన్ షాపుల వద్ద బారులు తీరారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఎగబడ్డారు. మరికొందరు అక్కడ.. ఇక్కడ అంటూ మందు కోసం ఊరంతా తిరిగారు. కొన్నిచోట్ల మహిళలు వైన్స్ షాపుల వద్ద కనిపించారు. మహిళల కోసం ప్రత్యేక క్యూ ఉండటంతో ఇళ్లలో పనిచేసే మహిళలను కొంతమంది బడాబాబులు కార్లో తీసుకొచ్చి వారితో మద్యం కొనుగోలు చేయించారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు మద్యం ప్రియులను అదుపు చేసేందుకు సాయంత్రం వరకు కష్టపడ్డారు. మద్యం షాపులు తెరవడంతో నగరంలో లాక్డౌన్ ఉందా.. అనే సందేహం కలిగింది. భార్యతో గొడవపడి.. బ్లేడుతో కోసుకొని.. బాలానగర్: బాలానగర్‌లోని పార్దీ బస్తీ(పిట్టల బస్తీ)కి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి భార్యతో గొడవపడి కోపంతో బ్లేడుతో తన శరీరంపై గాట్లు పెట్టుకున్నాడు. మద్యం అంతా నేలపాలు.. లంగర్‌హౌస్: లంగర్‌హౌస్‌లోని ఓ వైన్ షాపులో స్టాక్ లేదని.. బస్టాప్ వద్ద ఉన్న వైన్‌షాపు వద్ద దాదాపు గంటన్నర పాటు ఓ యువకుడు క్యూలో ఉండి బీర్లు, విస్కీ బాటిళ్లు కొనుగోలు చేసి ఆనందంతో రోడ్డు దాటేందుకు వెళ్తుండగా రాయి తగిలి కిందపడ్డాడు. 9 బీరు బాటిళ్లు, 6 విస్కీ బాటిళ్లు పగిలి నేలపాలయ్యాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణలో మద్యం జాతర
సాక్షి, హైదరాబాద్: మందుబాబులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన 45 రోజుల తర్వాత బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంకేముంది... మందుబాబులు పండుగ చేసుకున్నారు. మండే ఎండను, భారీ క్యూలను సైతం లెక్క చేయకుండా మద్యం కోసం ఆరాటపడ్డారు. చేతిలో బాటిల్ పడగానే పట్టరాని సంతోషంతో ఇంటికి వెళ్లిపోయి ఎంచక్కా లాగించేసి దూప తీర్చుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం విక్రయాలే. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం... ఆ జిల్లా... ఈ జిల్లా... ఆ ఊరు... ఈ ఊరు అనే తేడా లేకుండా ఎక్కడ వైన్‌షాపు ఉన్నా ఆ షాపు ముందు భారీ క్యూలే దర్శనమిచ్చాయి. మద్యం ప్రియులు కొన్నిచోట్ల మీటర్ల దూరం బారులు తీరి భౌతిక దూరం పాటిస్తూ మరీ కొనుక్కున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.90 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోందంటే ఏ స్థాయిలో మందు బాబులు జేబులు ఖాళీ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చదవండి: వైద్యానికి డబ్బుల్లేక మాజీ ఎమ్మెల్యే కొడుకు మృతి ఉదయం నుంచే బారులు... కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతపడ్డ వైన్‌షాపుల షట్టర్లు తెరుచుకున్నాయి. ఉదయం 10 గంటల నుంచి షాపులు తెరవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 8 గంటల నుంచే మందుబాబులు వైన్‌షాపుల దగ్గర చక్కర్లు ప్రారంభించారు. 9 గంటల సమయంలో ఎక్సైజ్, పోలీస్ సహకారంతో క్యూ కట్టడం ప్రారంభమయింది. యువకులు, మధ్య వయస్కులు, వయసు మీద పడ్డవారు, మహిళలు, యువతులు... అంతా లైన్లలోకి వచ్చేశారు. 10 గంటలు కాగానే షాపుల షట్టర్లు లేశాయి. మందుబాబులు తమకు ఇష్టమైన బ్రాండ్ లిక్కర్‌ను కొనుక్కుని తీసుకెళ్లారు. తొలిరోజు కావడంతో మద్యాన్ని భారీగా కొనుగోలు చేశారు రాష్ట్ర ప్రజలు. మళ్లీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో బుధవారమే చేతిలో ఉన్న డబ్బులకు తగినంత మందు కొనుక్కెళ్లారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో భౌతిక దూరం లేకుండా.. ధరలు పెరిగినా పట్టించుకోలేదు... మద్యం దుకాణాలు తెరిచారన్న ఆనందంతో మందు బాబులు మద్యం ధరలు పెరిగాయన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, ఇతర మద్యంపై 16 శాతం ప్రత్యేక సెస్ విధించడంతో బుధవారం రాష్ట్రంలోని అన్ని రకాల మద్యం ధరలూ పెరిగాయి. ఫుల్‌బాటిల్ చీప్ లిక్కర్‌పై రూ.40, మీడియం బ్రాండ్లపై రూ.80, ప్రీమియం బ్రాండ్లపై రూ.120 చొప్పున పెంచగా.. స్కాచ్, ఫారిన్ బ్రాండ్‌పై రూ.160, బీర్లపై రూ.30 అదనపు భారాన్ని ప్రభుత్వం మోపింది. అయితే పెరిగిన మద్యం ధరలు కొంత గందరగోళానికి కారణమయ్యాయి. బుధవారం ఉదయం షాపులు తెరిచే సమయానికి బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి పెరిగిన ధరలపై స్పష్టత రాకపోవడంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో బ్రాండ్‌ను ఒక్కో రేటుకు అమ్మాల్సి వచ్చింది. చదవండి: ఆసుపత్రుల్లో ఓపీ షురూ మధ్యాహ్నానికి కొంత స్పష్టత వచ్చినా ధరల గందరగోళం మాత్రం సాయంత్రం వరకు సాగింది. ప్రీమియం, మీడియం బ్రాండ్లపై రూ.100 నుంచి రూ.300 వరకు పెంచి అమ్మారు. ఎక్సైజ్ శాఖ అంచనా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో రూ.90 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. వాస్తవానికి, సాధారణ రోజుల్లో రోజుకు మద్యం విక్రయాలు రూ.35 కోట్ల మేర జరుగుతాయి. అయితే, బుధవారం మద్యం ప్రియులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడంతో ఈ విలువ రెండింతల కన్నా ఎక్కువ పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.50 కోట్ల వరకు విక్రయాలు జరిగి ఉంటాయని అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణం వినాయక్‌చౌక్‌లోని ఓ వైన్ షాప్ వద్ద.. డిపోలకు భారీగా ఇండెంట్లు... ఇటీవల సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మార్చి 22 నాటికి రూ.110 కోట్ల విలువైన మద్యం స్టాక్ అందుబాటులో ఉండగా, బుధవారం రూ.90 కోట్ల స్టాక్ అయిపోవడంతో డిపోల నుంచి సరుకు షాపులకు చేరుస్తున్నారు. వైన్స్ యాజమాన్యాలు కూడా తొలిరోజు నుంచే డిపోలకు భారీ ఇండెంట్లు పెట్టడంతో డిపోలకు కూడా సరుకును వేగవంతంగా చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిపోల నుంచి షాపులకు రాత్రి 7 గంటల తర్వాత సరుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని డిపోల సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, వైన్స్ యజమానులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెరిగిన రేట్ల ప్రకారం ప్రభుత్వానికి వైన్‌షాపు యజమానులు చెల్లించాల్సిన వ్యాట్‌ను నేడు కట్టించుకోనున్నారు. ఈ మేరకు గురువారం చలాన్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలని వైన్‌షాప్ యజమానులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దూరం దూరం.. సాయంత్రానికి మాయం... భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా తేడా వస్తే మళ్లీ మద్యం దుకాణాలు మూసేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దుకాణాలు ఎక్కడ మూసేస్తారో అనే ఆలోచనతో ఉదయం నుంచి మందుబాబులు భౌతిక దూరం నిబంధనను పాటించారు. మాస్క్ లేకపోతే మద్యం ఇవ్వరేమో అనే జాగ్రత్త కూడా తీసుకుని ఏదో రకమైన మాస్కు కట్టుకుని క్యూలో నిలబడ్డారు. అయితే సాయంత్రం 6 గంటలకు షాపులు మూసేస్తారన్న సమయంలో అప్పటి వరకు క్యూలో ఉన్న మందుబాబులు మందు దొరుకుతుందో.. లేదో అనే ఆదుర్దాతో భౌతిక దూరాన్ని మర్చిపోయారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కూడా ఆ సమయంలో చాలా చోట్ల ఏమీ చేయలేకపోయారు. -
ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్
ఛండీగర్ : కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో అనేక రాష్ర్టాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న నిబందనలు గాలికొదిలేసి మద్యం ప్రియులు అత్యుత్సాహం చూపిస్తున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని నిబంధనల మధ్య మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హామ్ డెలివరీకి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. అదే విధంగా మధ్యాహ్నం 1 నుంచి 6 గంటల వరకు డోర్ డెలివరీకి అనుమతిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. (మద్యంబాబులకు షాక్.. షాప్స్ క్లోజ్ ) నిబంధనలు పాటించకపోతే మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని తెలిపారు. చాలా ప్రాంతాల్లో అధిక రద్దీ కారణంగా, సామాజిక దూరం పాటించడం లేదని దీని ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున లిక్కర్ డోర్ డెలివరీకి అనుమతిస్తున్నమని వివరించారు. ఇక ఛత్తీస్‌ఘడ్‌లోనూ గ్రీన్జోన్లలో ఆన్లైన్ ద్వారా మద్యం పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గడ్ స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్ ) అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వొచ్చు. (మద్యం డోర్ డెలివరీ : అందుబాటులో యాప్ ) -
తెలంగాణ: మద్యం దుకాణాల వద్ద మందుబాబులు
-
హైదరాబాద్‌లో వైన్స్ ముందు మహిళల క్యూ..
సాక్షి, హైదరాబాద్ : దాదాపు 45 రోజుల తర్వాత రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోవడంతో.. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మద్యం కోసం చాలా మంది ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్‌సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్వేర్ యువతులు క్యూ కట్టారు. ఐటీ సెక్టార్‌లోని పలు షాపుల దగ్గర సైతం భారీ క్యూలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల వృద్ధ మహిళలు మద్యం కోసం వైన్ షాపుల వద్దకు వచ్చారు. (చదవండి : తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే..) మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్నాయి. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. మరోవైపు పోలీసులు, అధికారులు వైన్ షాపుల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వడగళ్ల వాన.. అయితేంటి మందు ముఖ్యం
డెహ్రడూన్ : లాక్‌డౌన్‌ను మే 17వరకు పొడిగించిన నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతివ్వడంతో చాలా రాష్ట్రాల్లో లిక్కర్ షాపులు పునః ప్రారంభమయ్యాయి. దీంతో వైన్ షాపుల మందుబాబులు క్యూ కట్టారు. దాదాపు 40 రోజుల తర్వాత మద్యం విక్రయాలు జరగడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఎండ, వానకు భరిస్తూ క్యూలైన్లలో వేచి ఉన్నారు. (మందుబాబులకు షాక్.. ఒక్కొక్కరికి రెండు బాటిళ్లు మాత్రమే) తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో భారీ వడగళ్ల వర్షం పడుతున్నా లెక్కచేయకుండా, భౌతిక దూరాన్ని పాటిస్తూ కిలోమీటర్ల మేర జనం మద్యం షాపు ముందు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి షేర్ చేస్తూ.. వీళ్లు నిజంగానే యోధులు. ఎంతో ఓపికగా కిలోమీటర్ల మేర నిల్చున్నారు అంటూ ట్వీట్ చేశారు. ఇది అచ్చం అమితాబ్ బచ్చన్ నటించిన ఓ సినిమా సన్నివేశంలా ఉంది. అందులో తండ్రి చనిపోతే ఆయన్ను చూడటానికి వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఊరంతా కదిలింది అంటూ ఓ క్యాప్షన్‌ను జోడించారు. ఈ వీడియా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. Agnipath.. Agnipath.. Agnipath. Outside a liquor shop. Today. Via Whatsapp. pic.twitter.com/sul4F5uIBt — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 5, 2020 -
పెన్షన్ డబ్బులు.. పెగ్గు కోసం
సాక్షి, నల్లగొండ: లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం అమ్మకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే దుకాణాల వద్ద మద్యంప్రియులు బారులు తీరారు. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పకుండా పాటించాలనే నిబంధనలను అనేక చోట్ల పాటిస్తున్నారు. ఈ సందర్భంగా తమ బాధ అర్థం చేసుకుని మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలోని ఓ మద్యం దుకాణం వద్ద లైన్లో నిల్చొని ఉన్న ఓ ముసాలావిడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘నాకు మందు తాగడం ఎప్పట్నుంచో అలవాటు ఉంది. లాక్‌డౌన్‌తో మందు దొరక్క కల్లు తాగడంతో కడుపు ఉబ్బుతోంది. ఈ రోజు నుంచి మందు అమ్ముతున్నారని తెలిసి పొద్దున్నే వచ్చాను. మొన్ననే బియ్యం, రూ.1500 అధికారులు ఇచ్చారు. వీటితో పాటు నా పెన్షన్ డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బుతోనే మందు కొనుకుందామని వచ్చాను. (పెన్షన్ డబ్బులతో మందు కొనుక్కొవడం కరెక్టేనా? అని అడగ్గా) మరేం చేస్తాం బిడ్డ. మందు కావాలి పైసలు లేవు’అని ఆ ముసలావిడ చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఇక ముసలావిడ రూ.530తో ఓసీ ఫుల్‌బాటిల్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లిపోయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే.. ఆ ప్రాంతాలు మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు -
వాటిలో మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచినందున ఇక్కడ తెరవకుంటే స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘గుడుంబాను రూపుమాపి సాంఘిక దురాచారాలు లేకుండా చేయాలని చూశాం. ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ.800 కోట్లు ఖర్చు చేశాం. కరోనా మూలంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు తదితరాలు బంద్ చేశాం. కేంద్రం మార్గదర్శకాలతో మన చుట్టూ ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచాయి. మన దగ్గర మద్యం దుకాణాలు మూసివేయడంతో గుడుంబా, సెకండ్స్ మద్యం విక్రయం ప్రారంభమైంది. మద్యం దుకాణాలు తెరవకుంటే స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డిస్టిలరీ కంపెనీలు కూడా గొడవ చేస్తున్నాయి. రాష్ట్రంలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన అన్నింటినీ తెరుస్తాం. రెడ్‌జోన్ సహా అన్నిచోట్లా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను బుధవారం నుంచి తెరుస్తాం. బార్లు, పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదు. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మద్యంపై 16శాతం ధర అదనంగా పెంచుతున్నాం. లాక్డౌన్ తొలగించిన తర్వాత కూడా ఈ ధరలను తగ్గించేది లేదు. అమ్మేవారు, కొనుగోలు చేసేవారు భౌతిక దూరం, ఇతర నిబంధనలు పాటించాలి. నిబంధనలు పాటించకున్నా, మాస్క్‌లు లేకుండా కొనుగోలు చేసినా లైసెన్సులు రద్దు చేస్తాం. నో మాస్క్ నో లిక్కర్.. నో మాస్క్ నో గూడ్స్’నినాదం అమలు చేస్తాం’అని సీఎం తెలిపారు. చదవండి: తెలంగాణలో 29 దాకా లాక్డౌన్ -
‘బాబు డబ్బులు ఇచ్చి మరీ లైన్లోకి పంపుతున్నారు’
సాక్షి, తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు. దేశ వ్యాప్తంగా లిక్కర్ షాపులకు ప్రధాని మోదీ మినహాయింపు ఇస్తే.. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసూయతో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ప్రజలను ఆందోళనలకు గురిచేసేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి వైన్ షాపులకు పంపించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. (చదవండి: ద్రోహం చేసింది చంద్రబాబే..!) లైన్లోకి టీడీపీ కార్యకర్తలను పంపి ఎల్లో మీడియా ద్వారా క్షుద్ర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చర్యలను లోకేష్ ఖండించకోవడం విచారకరమని అన్నారు. బ్రాందీ షాపులు తీయమన్నది మోదీ అయితే.. చంద్రబాబు ఏమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మోదీని చెప్పరాని మాటలతో తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు జైలులో వేస్తారనే భయంతో ప్రేమ సందేశాలు పంపిస్తున్నాని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు, ఈడీ కేసులతో చంద్రబాబు వణికిపోతున్నారని, అందుకే మోదీపై విమర్శలు చేయలేకపోతున్నారని పేర్ని నాని అన్నారు. -
ద్రోహం చేసింది చంద్రబాబే..!
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతల విమర్శలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మండిపడ్డారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలు చేసే ముందు స్థాయిని చూసి మాట్లాడాలని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో అత్యధికంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. మద్యం షాపులు తెరవడం కేంద్ర నిర్ణయం అని తెలుసుకోకుండా ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడంతో మీ బుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిందని టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. ద్రోహం చేసింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోకుండా విమర్శలు చేయడంపై మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే బాబురావు హితవు పలికారు. (ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..) -
మందుబాబులు ఎగబడ్డారు!
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇప్పటి వరకు క్రమశిక్షణతో గడిపిన జనం.. ఒక్కసారిగా కట్టు తప్పారు. భౌతిక దూరం నిబంధనలను పక్కనబెట్టారు. గుంపులుగా చేరి గొడవలకు దిగారు. వారిని దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం దుకాణాలు 40 రోజుల తర్వాత తిరిగి సోమవారం తెరుచు కోవడంతో చాలా రాష్ట్రాల్లో కనిపించిన దృశ్యాలివీ..! మూడో విడత లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించిన కేంద్రం మద్యం దుకాణాలు తదితరాలకు వెసులుబాటునిచ్చింది. షాపుల వద్ద కొనుగోలు దారులు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలనీ, ఐదుగురికి మించి ఉండరాదని నిబంధనలు పెట్టింది. ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల వద్ద ఉదయం నుంచే జనం కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టారు. మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకపోవడంతో నిర్వాహకులు దుకాణాలను మూసివేశారు. పోలీసులు లాఠీచార్జీ చేసి మందుబాబులను అదుపు చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని సుమారు 150 మద్యం దుకాణాలు సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేశాయి. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 26 వేల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు లిక్కర్ కోసం బాహాబాహీకి దిగారు. మొదటి రోజు విక్రయాలతో రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని యూపీ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌రెడ్డి తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాలుకాని చోట్ల మద్యం దుకాణాలను తెరుస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సోమవారం ముంబై, పుణేల్లోని షాపుల వద్ద కొనుగోలు దారులు క్యూ కట్టారు. కానీ, దుకాణాలను తెరవకపోవడంతో నిరాశచెందారు. షాపులను మూసి ఉంచాలంటూ తాము ఉత్తర్వులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో జనం భారీగా చేరడంతో నిర్వాహకులు దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది. రెడ్ జోన్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయాలకు తొందరపడి అనుమతివ్వడంపై కేంద్ర మంత్రి హర్షవర్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వ్యాప్తికి ఊతమిచ్చేలా జనం గుమికూడుతున్నందున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. ఢిల్లీలో మద్యం దుకాణం వద్ద గుమికూడిన జనంపైకి లాఠీ ఝళిపిస్తున్న పోలీస్ -
మందు బాబులపై పేలుతున్న జోకులు
సాక్షి, న్యూఢిల్లీ : లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోమవారం ఉదయం మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో దాదాపు 40 రోజులుగా నోట్లో చుక్క పడక ఆగమాగం అవుతున్న మందు బాబులు ఉదయాన్నే మద్యం దుకాణాల ముందు బారులు తీశారు. ఈ రోజు ఎలాగైనా నోట్లో చుక్క పడాల్సిందేనంటూ గంటల తరబడి లిక్కర్ షాపుల ముందు పడిగాపులు కాశారు. ఇక చాలా రోజుల తర్వాత లిక్కర్ షాపులు తెరచుకోవడంతో మందుబాబు పండగ చేసుకున్నారు.(చదవండి : మద్యం షాపులు ఇలా తెరిచారు.. అలా మూశారు!) కొన్ని చోట్ల వైన్ షాపులకు పూల దండలు వేసి పూజ చేసి చేశారు. మరికొందరు బ్యాండ్ బాజాతో మద్యం దుకాణాలకు తరలి వచ్చారు. కొన్ని చోట్ల భౌతిక దూరం పాటించక పోవడంతో మధ్యాహ్నమే వైన్ షాపులు మూసేశారు. ఢిల్లీలోని ఓ లిక్కర్ షాప్ వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో లిక్కర్ స్టోర్‌ను అధికారులు క్లోజ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పలు చోట్ల ముఖానికి మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పట్టించుకోకుండా మందు కోసం పోటీ పడ్డారు. దీంతో అక్కడక్కడ పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఇక మందు బాబుల విన్యాసాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మందుబాబుల తీరును నెటిజన్లు మీమ్స్ రూపంలో పంచుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. #LiquorShops People after hijacking the wine shop 😂 #LiquorShops pic.twitter.com/2X3ee5qNAR — ŤÃBÌŠH ÏBŘÃHÍM (@Ibhm_tabish) May 4, 2020 మద్యం దుకాణం తెరచిన తర్వాత మందు బాబులు పరిస్థితి Today situation..🍾#Covid_19india#LiquorShops pic.twitter.com/LIv7NWz4G2 — PALAKURI SHANKER (@PalakuriShanker) May 4, 2020 After standing for 4 hours in line and then asking for a Breezer.#LiquorShops pic.twitter.com/X6cvvwjIHS — Akkshay (@akkshayjain1995) May 4, 2020 Corona?? What Corona?? Its Marriage type celebration with Band Bajaa as #LiquorShops open 🎷🎺😂🍻 pic.twitter.com/45hoFLZPqB — Rosy (@rose_k01) May 4, 2020 Government after seeing long queues outside wine shops today#QuarantineLife #Memes #dailymemes #LiquorShops pic.twitter.com/gKevvsiMAg — Hrishikesh (@IndianBrownKid) May 4, 2020 #LiquorShops owners waiting for their customers be like: (Aa aa aaa aa aaa sound plays in background) pic.twitter.com/rDzpsa1D8W — The Steno Boi (@Thestenoboi) May 4, 2020 People after seeing liquor shop:#LiquorShops pic.twitter.com/HJeoV6vGpe — Oyeee_Sunnn♥️ (@Salehasiddique3) May 4, 2020 -
అందుకే మద్యం ధరలు పెంచారు: రోజా
సాక్షి, విజయవాడ: మద్యపాన నిషేదంలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం ధరలు పెంచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారని అమె అభిప్రాయపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మద్యం ధరలు పెంచితే టీడీపీ నేతలు ఎందుదకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఏరులై పారిస్తే.. సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధానికి శ్రీకారం చుట్టారని రోజా చెప్పారు. రాష్ట్రంలో 40 వేల బెల్టుషాపులు, 20 శాతం వైన్ షాపులు, 40 శాతం బార్లను తొలగించారని గుర్తు చేశారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. చంద్రబాబు,టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. -
ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మూడో దశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరి చేసింది. ఒకేసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపుల వద్ద అనుమతి ఇవ్వనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే కాసేపు షాపుల మూసివేయనున్నారు. మరోవైపు ఏపీలో నేటి నుంచి పెంచిన మద్యం ధరలు అమల్లోకి రానున్నాయి. మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.అయితే మాల్స్, బార్లు, క్లబ్‌లు తెరుచుకోవని స్పష్టం చేశారు. (చదవండి : మద్యం ధరలు మార్గదర్శకాలు) -
ఏపీలో రేపటి నుంచి తెరుచుకోనున్న మద్యం షాపులు
సాక్షి, అమరావతి: ఏపీలో రేపటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించామని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలను పంపించామని పేర్కొన్నారు. మద్యం షాపుల వద్ద తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలన్నారు. కేవలం ఐదుగురినే అనుమతిస్తామని పేర్కొన్నారు.షాపుల ముందు సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తామని.. మాస్క్ లేనిదే మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఆ షాపులను కొంత సమయం మూసేస్తామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్ల బయట మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలను తగ్గించేందుకే ధరలు పెంచామని రాజత్ భార్గవ్ వెల్లడించారు. -
మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మద్యం నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకేసింది. మద్యం ధరలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. (చదవండి : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ ) కాగా, కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 4 నుంచి మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. కోవిడ్ కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్ జోన్లలోని మాల్స్‌లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు. -
మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోవడంతో మే 4 నుంచి మే 17 వరకు దేశంలో లాక్డౌన్ 3.0 (మూడవ దశ)కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్ జోన్లలో సడలింపులు, నిబంధనలు కఠినంగా ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్ , గ్రీన్ జోన్లుగా విభజించింది. రెడ్ జోన్లు (అత్యధిక సంఖ్యలో కేసులు, రేటు) ఆరెంజ్ జోన్ (తక్కువ కేసులు) గ్రీన్ జోన్ ( గత 21 రోజులలో కేసులు లేకపోవడం) గా వర్గీకరించింది. తాజా సడలింపులు, మద్యం దుకాణాలు లేదా ఇ-కామర్స్ సేవలపై గందరగోళం నెలకొనడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఆంక్షలు, సడలింపులు ఈ విధంగా ఉండనున్నాయి. (ప్రధాని కీలక భేటీ : రెండో ప్యాకేజీ సిద్దం!) ఆరెంజ్ , గ్రీన్ జోన్లు రెండింటిలోనూ మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి వుంటుంది. అన్ని వస్తువులకు ఇ-కామర్స్ అనుమతి. ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతి వుండగా, తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంటి పనిమనుషులను అనుమతించాలా లేదా అనేది ఆయా రాష్ట్ర, లేదా యూటీ (కేంద్రపాలిత ప్రాంతాలు)ల నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. రెడ్ జోన్లు నాన్ కంటైన్ మెంట్ జోన్లలో మార్కెట్ కాంప్లెక్స్ లేదా మాల్లో భాగం కాని స్వతంత్ర మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి. అత్యవసరమైన వస్తువులకు మాత్రమే ఇ-కామర్స్ అనుమతి. అత్యవసరం కాని వస్తువుల విక్రయానికి అనుమతి లేదు. మాల్స్, అందులో ఉండే షాపులకు అనుమతి లేదు. అయితే సింగల్ విండో షాపులు, కాలనీల్లోని షాపులకు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు అనుమతి ఉంది. ఇక ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి. అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌వేర్, జూట్ మిల్లులకు అనుమతి ఉంది. అయితే ఇక్కడ పనిచేసే వారందరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ధరించాల్సి ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి. పట్టణాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉన్న కూలీలతో కొనసాగుతాయి. అంతేకాక అక్కడ పని చేసేందుకు వచ్చే కూలీలను బయట ప్రాంతాలకు తరలించకూడదు. ప్రైవేట్ ఆఫీసులు 33శాతం స్టాఫ్‌తో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. డిప్యూటీ సెక్రటరీ, ఆపైస్థాయి ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో.. అలాగే మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా 33 శాతం సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సడలింపులు, పరిమితులు రెడ్, ఆరెంజ్ జోన్లలో స్థానిక అధికారులు గుర్తించిన కంటైన్ మెంట్ ప్రాంతాలకు వర్తించవు. అనుమతించిన నిత్యావసరాల సరఫరాకు మించి కంటైన్ మెంట్ జోన్ ప్రాంతాలు తీవ్రమైన పరిమితులకు లోబడి వుంటాయి . (హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట) ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, లాక్డౌన్ ఆదేశాల ప్రకారం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఆంక్షలను సడలించడానికి వీల్లేదు. ఉదాహరణకు రెడ్ (స్వతంత్ర దుకాణాలు మాత్రమే), ఆరెంజ్, గ్రీన్ జోన్స్, జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం వుంది. కానీ కావాలనుకుంటే రాష్ట్రాలు, యూటీలు మద్యం షాపులను మూసి వుంచడానికి కేంద్రం అనుమతినిచ్చింది. అదే సందర్భంలో రెడ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల అమ్మకానికి ఇ-కామర్స్ సంస్థలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి వుండదు. ఈ నెల 3వ తేదీతో ముగియనున్నరెండవ దశ లాక్ డౌన్ ను పొడిగించి, అనేక ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ప్రభుత్వం గణనీయంగా సడలించింది. మార్చి చివరిలో అమల్లోకి వచ్చిన దేశవ్యాప్త లాక్డౌన్ విస్తరించడం ఇది రెండోసారి. (కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) -
కరోనా: ‘చుక్క పడితే.. వైరస్ చచ్చుడే’
జైపూర్: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మద్యం షాపులను తెరవాలని రాజస్తాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ స్పష్టం చేశారు. వైరస్ క్రిములను నిర్మూలించేందుకు ఆల్కహాల్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు గొంతులో తిష్టవేసే.. వైరస్ క్రిముల్ని చంపేందుకు మద్య వాడొచ్చుకదా అని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాసి మద్యం దుకాణాలను ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే, మద్యం షాపులను మూసేయడంతో.. మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే భరత్‌సింగ్ తన లేఖలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. (చదవండి: 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు) ‘మద్యం అమ్ముతూ స్వయం ఉపాధి పొందే వారికి, ప్రభుత్వానికి ఇదొక ఒక మంచి అవకాశం. మార్కెట్లో మద్యానికి చాలా డిమాండ్ ఉంది. లాక్డౌన్ నిషేధ సమయంలో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోంది. మద్యానికి బానిసైనవారి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది. మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతించదు. అందువల్ల దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది’అని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ కోట జిల్లాలోని సంగోడ్ అసెంబ్లీ సీటు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (చదవండి: 75 బస్సుల్లో స్వస్థలాలకు విద్యార్థులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
14 వరకు మద్యం దుకాణాలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 14 వరకు అన్ని మద్యం దుకా ణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 14 వరకు రాష్ట్రంలోని అన్ని వైన్‌షాపులు, బార్లు మూసి ఉంచాలని, ఈ విషయం లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి, గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా మ ద్యం దుకాణాల మూసివేత గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మళ్లీ మద్యం దుకాణాలు తెరుస్తారని, అమ్మకాలకు కొం త వెసులుబాటు కల్పిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈనెల 14 వరకు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసే ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో తొలిసారి మద్యం అమ్మకాలు 48 గంటల కన్నా ఎక్కువ సమయం నిలిచిపోయాయి. 1995–97లో మద్యనిషేధం అమల్లో ఉన్నప్పుడు మినహా రాష్ట్రంలో ఎప్పుడూ ఇన్ని రోజులు లిక్కర్ అమ్మకాలు జరగ కుండా ఉన్న సందర్భాల్లేవని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సందర్భాల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు వైన్ షాపులు, బార్లు బందయ్యేవి. కానీ, ఇప్పుడు ఆరోగ్య అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో గత 8 రోజులుగా బార్లు, మూడు రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మందుబాబులకు కరోనా ‘చుక్కలు’కనిపిస్తున్నాయి. వెసులుబాట్లు కూడా లేవు... అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు కల్లు, అనధికారికంగా గుడుంబా అందుబాటులో ఉండేవి. సరిహద్దు రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రానికి అరకొరగా మద్యం వచ్చేది. ఇప్పుడు అలాంటి వెసులుబాట్లు కూడా లేకుండాపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబాను దాదాపు నిర్మూలించగా, కల్లు దుకాణాలు కూడా కరోనా దెబ్బకు మూతపడ్డాయి. గ్రామాల్లో చెట్ల నుంచి తీసిన కల్లు మాత్రమే లభిస్తోంది. రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం వచ్చే అవకాశం లేకుండా పోయింది. పొరుగు రాష్ట్రాలు కూడా లాక్డౌన్ విధించడంతో అక్కడ కూడా మద్యం లభించడం లేదు. దీంతో రాష్ట్రంలో త్వరలోనే పూర్తిస్థాయిలో మద్యం కొరత ఏర్పడనుందని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పట్లో లాక్డౌన్ ఎత్తేసే అవకాశం లేదని, కనీసం మరో నెలైనా ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్‌లో ధర ‘చుక్కలే’... బార్లు, వైన్ షాపులు మూతపడటంతో బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. బ్లాక్‌లో కొని తాగాలనుకునే మందుబాబులకు వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ బ్రాండ్ మద్యం కూడా క్వార్టర్‌కు రూ.350 వరకు అమ్ముతున్నారు. ప్రీమియం బ్రాండ్ల మద్యమైతే ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. అంత ధర పెట్టి తాగేకన్నా మందు మానడమే ఉత్తమమని కొందరు సర్దుకుంటుండగా, మరికొందరు బేరాలాడి కొనుక్కొంటున్నారు. మద్యానికి బానిసలైన వారు మాత్రం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అయితే, ఈ పరిస్థితి కొంత మేలు చేస్తుందని, అనధికార మద్యనిషేధం వ్యసనపరులకు ఉపయోగపడుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను వ్యసనపరులు సద్వినియోగం చేసుకుని మద్యానికి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని, లేదంటే మద్యం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు సువర్ణావకాశమని అంటున్నారు. ఏదేమైనా తాగి అందరికీ చుక్కలు చూపించే మందుబాబులకు ‘కరోనా’నిజంగానే చుక్కలు చూపిస్తోంది. -
మందు.. మేమే అందిస్తాం..!
సాక్షి, ములుగు: జిల్లాలో మద్యం వాప్యారం యధేచ్ఛగా కొనసాగుతోంది. ఉన్నత అధికారులతో సంబంధం లేకుండా ప్రతి రోజూ విచ్ఛలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు నియమాలను అమలు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తులో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా ఏర్పాటైన వైన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. స్పందించాలి్సన అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులతో పోలిస్తే పోలీసు శాఖ జరిపే దాడుల్లోనే అధికంగా కేసులు నమోదు అవుతుండడం విశేషం. ప్రత్యేక వాహనాల్లో బెల్టు షాపులకు మద్యం..! గతంలో జిల్లాలోని వివిధ గ్రామాల బెల్టు షాపుల వ్యాపారులు మండల కేంద్రాల్లోని వైన్స్ నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు జరిపేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారయింది. ఉన్నత అధికారుల నిఘా లోపించడంతో వ్యాపారులు ఒకడుగు ముందుకు వేసి ఆయా మండలాల వారీగా సిండికేట్‌గా మారి ప్రత్యేక వాహనంలో గ్రామాలకు మద్యం తరలిస్తూ బహిరంగంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని తెలుస్తుంది. ఈ దందాను నిలవరించే వారే లేకపోవడంతో వైన్స్ వ్యాపారులు రోజు వారీగా బహిరంగ వ్యాపారాలు జరుపుకుంటూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన దందాను విస్తరిస్తున్నారు. ములుగు, వెంకటాపురం(ఎం), ఏటూరునాగారం, వెంకటాపురం(కే), వాజేడు, మంగపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలాల్లోని వైన్స్ వ్యాపారులు నిత్యం బెల్టు షాపుల నిర్వాహకులకు ఏదో ఒక సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు. మంగపేటలో ఇతర ప్రాంతాల నుంచి.. మంగపేట మండలంలోని రాజుపేట, చుంచుపల్లిలో 1/70 చట్టంలో భాగంగా వైన్స్ నిర్వహణ లేదు. ఈ పరిణామాన్ని ఆసరాగా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాటాపురం, ఏటూరునాగారం మండలకేంద్రం నుంచి ఆటోల ద్వారా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. కొంత మంది నేరుగా ద్విచక్ర వాహనాల ద్వారా బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో బాటిల్‌పై రూ.30 అధికం గ్రామాల్లోని »బెల్టు షాపులకు వైన్స్ వ్యాపారులు ఒక్కో బీరు, క్వార్టర్ బాటిల్‌ను రూ. 10 చొప్పున ఎక్కువకు సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్టు షాపుల వ్యాపారులు అదే బాటిల్‌పై రూ. 30 అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం ప్రియులు తమ జేబులను గుళ్ల చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో పలుమార్లు ఫిర్యాదులు అందినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఉంది. -
లక్కు..కిక్కు
సాక్షి, హైదరాబాద్: లక్కు కిక్కు కొందరిదైతే..అదృష్టం చిక్కలేదనే నిరాశ మరికొందరిది. లాటరీలో చేజారిన షాపును ఎలాగైనా వశం చేసుకోవాలనే ఆరాటం ఇంకొందరిది. దుకాణం దక్కించుకున్న అదృష్టజాతకుడితో బేరసారాలు, బుజ్జగింపుల ఉత్కంఠ మధ్య శుక్రవారం మద్యం దుకాణాల కేటాయింపుల పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం షాపులకు నిర్వహించిన లక్కీ డ్రాలో 34 దుకాణాలు మినహా మిగతావాటిని ఖరారు చేసినట్లు అబ్కారీవర్గాలు తెలిపాయి. కోర్టు కేసులు, ఐదుకంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపుల డ్రాను నిలిపివేశారు. సిండికేట్‌గా మారడంతోనే దరఖాస్తులు తక్కువగా నమోదైనట్లు భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ షాపులపై 48 గంటల్లో విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ విచారణ నివేదిక అనంతరం ఈ దుకాణాల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాగా, ఎంపికైన మద్యం దుకాణాలు 2019–21 వరకు కొనసాగనున్నాయి. నవంబరు ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీకి అమలులోకి రానుంది. ఈనెల 9 నుంచి 16 వరకు మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్రవ్యాప్తంగా 48,243 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజు రూపంలోనే రాష్ట్ర ఖజానాకు రూ.964 కోట్ల మేర ఆదాయం లభించింది. -
ఆఖరి మోఖా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రస్తుత(2017–19) ఆబ్కారీ సీజన్ కొద్ది రోజుల్లో ముగియనుంది. అయితే, ఇంకా కొత్త పాలసీపై ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. దీంతో ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాలో వైన్స్ నడుపుతున్న వ్యాపారులు కొందరు ఆఖరి మోఖాగా ధరలు పెంచేశారు. ఇంతకాలం ఎవరికి వారుగా ఉన్న వ్యాపారులు ఇప్పుడు ‘సిండికేట్’గా ఏర్పడి ఒక్కో విస్కీ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు... బీరు బాటిల్‌పై రూ.10 నుంచి రూ.15 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. మాకేం కాదు.. అన్నట్లుగా ధరల పెంచేయడంతో పాటు అర్ధరాత్రి వరకు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు నిర్వహిస్తున్నా ఆబ్కారీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇంతకాలం దూరం తొలినాళ్లలో ఏసీబీ దాడుల కారణంగా ఎక్సైజ్ అధికా>రులు, మద్యం సిండికేట్ల డొంక కదిలింది. దీంతో చాలాకాలం సిండకేట్ మాటెత్తలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ గడువు సమీపిస్తుండడంతో ‘ఇగ అయ్యేదేముంది.. పోతే దుకాణం, వస్తే డబ్బులు’ అన్న రీతిలో కొందరు వ్యాపారులు తెగబడి అధిక ధరలకు మద్యం విక్రయాలు చేస్తున్నారు. నెల రోజులుగా ఈ దందా సాగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ) నిబంధనలను విస్మరించి ధరలు పెంచడంతో మొదటి పెగ్గు పుచ్చుకోక ముందే మద్యపాన ప్రియులకు ధరలు కిక్కెక్కుతోంది. ధరల పెంపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల్లో సుమారు రూ.15 కోట్లకు పైగా అదనంగా వసూలు చేసినట్లు ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు ఎక్కువ ధరలపై విక్రయిస్తూ అధిక ధరలను ప్రోత్సహిస్తున్నారు. పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్, కాళేశ్వరం, ములుగు, గోవిందరావుపేట, వెంకటపురం(కే), ఏటూరు నాగారం, తాడ్వాయి, జనగామ, బచ్చన్నపేట, తరిగొప్పుల, రఘునాథపల్లి, కొడకండ్ల, తొర్రూరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ తదితర ప్రాంతాల్లో అధిక ధరలపై మద్యం విక్రయిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ దందా సాగుతున్నా ఆబ్కారీశాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కొన్నిచోట్ల వైన్స్ నిర్వాహకులు మద్యం దుకాణాలను ముందు ఎమ్మార్పీ పట్టిక ప్రదర్శిస్తూ... గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు తరలించే క్రమంలో 20 శాతం అధిక ధరలు వసూలు చేస్తున్నారు. బెల్టుషాపులను తాత్కాలికంగా అరికట్టినా... ‘సిండికేట్’ దందాకు మాత్రం తెరపడటం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో అక్రమ వ్యాపారాన్ని తాజా మాజీ సిండికేట్లు చాపకింది నీరులా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన మద్యం దుకాణాల వద్ద లూజ్ అమ్మకాలు చేయకూడదన్న నిబంధన కూడా ఉల్లంఘనకు గురవుతోంది. ఎలాంటి అనుమతి లేకుండానే పర్మిట్ రూంలు ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయంచిన సమయాన్ని కూడా చాలా మంది పాటించకపోవడం గమనార్హం. ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యాపారులు వీటిని కప్పి పుచ్చుకునేందుకు మామూళ్లు ముట్టజెబుతుండగా... అధికారులు చూసీచూడనట్లు ఊరుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లు అందజేయాల్సిందేనని ఎక్పైజ్ జిల్లాలో పట్టుబడుతుండటంతో వ్యాపారులు అక్రమాలకు తెగబడుతున్నారు. ప్రతీ దుకాణం ముందు ఖచ్చితంగా ధరల పట్టికను సూచించే బోర్డు ఏర్పాటుచేయాలని, ఎలక్ట్రానిక్ బిల్లు ఇవ్వాలనే నిబంధనలు పాలసీలో ఉన్నా ఎవరూ పాటించడం లేదు. తమ పరిధిలో ఎక్కడా బెల్ట్ దుకాణాలు లేవని, అక్రమ మద్యం అమ్మకాలు జరగట్లేదని పేర్కొంటూ ప్రతీ ఎస్హెచ్ఓ కూడా అఫిడవిట్లాగా సమర్పించాలన్న ఆదేశాలను ఎక్సైజ్ అధికారులే అమలు చేయడం లేదు. ఇవి కాకుండా ప్రతీ దుకాణం ముందు గ్రిల్స్ ఏర్పాటు చేయాలని నిబంధనను ఒకటి రెండు చోట్ల తప్ప ఎవరూ పాటించడం లేదు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రం, పట్టణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల యజమానులు దాబాలు, హోటళ్లను ఆసరాగా చేసుకుని బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కోల్‌బెల్ట్, తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో ముఠాలుగా ఏర్పడిన నిందితులు ఇథైల్ అల్కహాల్‌కు ‘క్యారమిల్’ అనే రసాయన పదార్థాన్ని కలిపి అనుమానం రాకుండా తయారు చేసిన నకిలీ మద్యం విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాసన, రంగు అసలైన మద్యం మాదిరే ఉండగా.. కిక్కు కాస్త ఎక్కువే ఇస్తుండడంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. జిల్లా వైన్స్ బార్లు ఎలైట్ బార్లు వరంగల్ అర్బన్ 59 88 11 వరంగల్ రూరల్ 58 03 04 జనగామ 42 03 01 భూపాలపల్లి 28 03 0 ములుగు 27 0 0 మహబూబాబాద్ 51 03 01 మొత్తం 265 100 17 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కంటే అధి క ధరలతో విక్రయిస్తే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తాం. ప్రొహిబిహిషన్, ఎక్సైజ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించి నా ఉపేక్షించేది లేదు. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు బాధ్యులకు జరిమానా విధించడంతో పాటు షాపులను తాత్కలికంగా మూసివేస్తాం. – బాలస్వామి, ఎక్సైజ్ సూపరింటెండెంట్, వరంగల్ అర్బన్ జిల్లా -
మందుబాబులకు కిక్కిచ్చే వార్త!
సాక్షి, నిజామాబాద్: అమ్మకాలు తక్కువగా నమోదైన మద్యం షాపులను అధిక విక్రయాలు జరుగుతున్న ప్రాంతాలకు తరలించాలని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది. ఈ మేరకు జిల్లాలో తక్కువ విక్రయాలు జరుగుతున్న షాపులను గుర్తించాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈనెలాఖరుతో మద్యం షాపుల లైసెన్సుల గడువు ముగుస్తుంది. దీంతో నూతన ఎక్సైజ్ విధానం అమలు కోసం ఆశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం షాపుల వారీగా మద్యం అమ్మకాల లెక్కలు తీస్తున్నారు. ఆయా షాపుల్లో నెల వారీగా ఎంత మొత్తంలో మద్యం విక్రయాలు జరిగాయనే నివేదికను సిద్ధం చేశారు. కాగా జిల్లాలో ఇలా తక్కువ మద్యం అమ్మకాలున్న షాపుల వివరాలు త్వరలో తేలనున్నాయి. త్వరలో నోటిఫికేషన్..? జిల్లాలో మొత్తం 95 మద్యం షాపులు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈనెల 31తో ముగుస్తుంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈలోగా కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈవారంలోగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో మద్యం షాపులకు వ్యాపారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి లైసెన్సులను మంజూరు చేశారు. లైసెన్సు ఫీజుతో పాటు, బ్యాంకు గ్యారెంటీలు తీసుకుని లైసెన్సులు ఇచ్చారు. ఏడాదికి రూ. 45 లక్షలు ఒక స్లాబ్‌గా, రూ. 55 లక్షలు మరో స్లాబుగా లైసెన్సు ఫీజు నిర్ధారించి షాపులను కేటాయించారు. జనాభా ప్రాతిపదికన నిజామాబాద్ నగరంతో పాటు, బోధన్ పట్టణాల పరిధిలోని 28 మద్యం షాపులకు రూ. 55 లక్షలుగా లైసెన్సు ఫీజు వసూలు చేయగా, మిగిలిన 67 షాపులకు రూ. 45 లక్షల లైసెన్స్ ఫీజు తీసుకున్నారు. ప్రభుత్వం అక్టోబర్ నుంచి అమలు చేయనున్న ఈ నూతన మద్యం విధానం ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మద్యం షాపుల కోసం దరఖాస్తు ఫీజును ఈసారి భారీగా పెంచే యోచనలో ఎక్సైజ్‌శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానానికి సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఇక్కడి ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. మద్యం షాపులకు డిమాండ్.. మద్యం షాపులకు ఈసారి భారీ డిమాండ్ ఉండే అవకాశాలున్నాయి. గత రెండేళ్లలో వ్యాపారులకు మద్యం షాపులు కాసుల వర్షం కురిపించడంతో ఈసారి ఎలాగైనా షాపులను దక్కించుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గుత్తేదార్లు ఈసారి మద్యం వ్యాపారం వైపు చూస్తున్నారు. చెరువులు, కుంటలు, ఫార్మేషన్ రోడ్లు, ఇతర భవనాలు వంటి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసే గుత్తేదార్లకు సరిగ్గా బిల్లులు రావడంలేదు. దీంతో ఆ పనులు చేసేందుకు ఆసక్తి చూపని వారంతా ఈసారి మద్యం షాపుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
మెదక్‌లో ఫుల్ కిక్కు!
వచ్చే నెలాఖరుతో మద్యం దుకాణాల కాలపరిమితి ముగియనుండడంతో నూతన మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటుతోపాటు వైన్స్ దుకాణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. లైసెన్స్ ఫీజులను సైతం పెంచే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైన్స్ షాపులను దక్కించుకోవాలనే కోటి ఆశలతో ఉవ్విళ్లూరుతున్న వారితోపాటు మద్యం ప్రియులకు ‘ఫుల్ కిక్కే’ అని చెప్పొచ్చు. సాక్షి, మెదక్: రాష్ట్ర ఖజానాకు ప్రధానంగా ఎక్సైజ్ శాఖ నుంచే ఆదాయం సమకూరుతోంది. ప్రతి రెండేళ్లకోసారి కొత్త పాలసీని రూపొందిస్తూ.. లైసెన్స్‌ల రూపేణా, మద్యం దుకాణాలు, బార్ల సంఖ్యను పెంచుతూ ఆదాయం పెంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 2017 అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితి వచ్చే నెల 30తో ముగియనుంది. ఈ మేరకు నూతన ఎక్సైజ్ పాలసీని రూపొందించేందుకు సర్కారు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆదాయం పెంచుకునే మార్గాలపై అన్వేషణ చేస్తున్న క్రమంలో జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సారి టెండర్ల లైసెన్స్ ఫీజులను పెంచేలా యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు కొత్త మద్యం దుకాణాలు, బార్లకు అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. జిల్లాలో గతంలో మెదక్ మున్సిపాలిటీ మాత్రమే ఉండగా.. గత ఏడాది మూడు మున్సిపాలిటీలు కొత్త మద్యం పాలసీపై కసరత్తు షురూ తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట కొత్తగా ఆవిర్భవించాయి. వీటి పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుతోపాటు మద్యం దుకాణాల సంఖ్య పెంచే దశగా కసరత్తు సాగుతున్నట్లు తెలిసింది. మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ మద్యం దుకాణాల కాలపరిమితి నెలన్నర మాత్రమే మిగిలి ఉంది. వీటి గడువు ముగియక ముందే కొత్త పాలసీని ప్రకటించి టెండర్లను ఆహ్వానించాలి. ఈ మేరకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఇప్పటినుంచే విధివిధానాలను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్తగా రానున్న ఎక్సైజ్ పాలసీపై మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. కాలపరిమితిని ఏడాదికి పరిమితం చేస్తారా.. రెండేళ్లకా.. లైసెన్స్ ఫీజు ఎంత పెంచుతారో వంటి అంశాలపై వ్యాపార వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. వేలమా.. లాటరీనా..? 2015లో వేలం పాటల ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు. ఎక్కవ మొత్తంలో పాట పాడిన వారికి ఆయా దుకాణాలను కేటాయించేవారు. కొన్ని అనివార్య కారణాలతో ఈ విధానాన్ని 2017లో ప్రభుత్వం రద్దు చేసింది. ఒకే మద్యం షాపునకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో షాపుల వారీగా లైసెన్స్ ఫీజును నిర్ధారించి.. లాటరీ పద్ధతిన మద్యం దుకాణాలు కేటాయించాలని పాలసీలో స్పష్టం చేసింది. ప్రస్తుతం వేలం పద్ధతిన కేటాయిస్తారా.. లక్కీ డ్రా అమలు చేస్తారా అనే అంశాలపై ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి మర్గదర్శకాల రూపకల్పనలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. పోటాపోటీ జిల్లాలో ప్రస్తుతం 37 వైన్స్ దుకాణాలు, రెండు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రెండేళ క్రితం నిర్వహించిన టెండర్లకు 301 అప్లికేషన్లు వచ్చాయి. వీటి చార్జీలు, లైసెన్స్ ఫీజుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జిల్లా నుంచి రూ.3.01 కోట్లు సమకూరాయి. 2015లో ఒక్క మద్యం దుకాణానికి దరఖాస్తు రుసుం రూ.50 వేలు ఉండగా.. 2017లో రూ.లక్షకు పెంచారు. అయినప్పటికీ దరఖాస్తులు భారీగానే వచ్చాయి. ఈ సారి మద్యం దుకాణాలను పెంచనుండడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజుతోపాటు టెండర్ రేటు పెంచే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నిర్వాహకులకు వరుస ఎన్నికలు ఆర్థికంగా కలిసొచ్చాయి. లాభాల పంట పండటంతో వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మద్యం వ్యాపారం లాభసాటిగా మారడంతో ఈ రంగంలోకి రావడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సారి పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు అధికారులతోపాటు మద్యం వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
తొలి ఏడాదిలోనే 20% మద్యం షాపులు తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ ఏడాది (2019–20)కి మద్యం పాలసీని ప్రకటించింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా.. దశలవారీ మద్యపాన నిషేధానికి అనుగుణంగా.. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,380 మద్యం షాపులుండగా తొలి ఏడాదే వీటిలో 880 తగ్గించి 3,500కి కుదించింది. వీటిని ప్రభుత్వమే నిర్వహించనుంది. షాపులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఏర్పాటు చేయనుంది. వీటికి ఏపీఎస్‌బీసీఎల్ రిటైల్ ఔట్‌లెట్‌గా నామకరణం చేస్తారు. వీటిపై షాపు నెంబర్ కూడా ఉంటుంది. జిల్లాలవారీగా షాపుల సంఖ్యపై ఎక్సైజ్ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. షాపుల ఏర్పాటుపై విధివిధానాలివే.. - మద్యం షాపులను ఎక్సైజ్ చట్టం–1968 రూల్స్ ప్రకారం ఏర్పాటు చేయాలి. ఒక్కో షాపు 150 చదరపు అడుగుల నుంచి 300 చదరపు అడుగుల లోపు ఉండాలి. పక్కా నిర్మాణంతో రోడ్డుకు అభిముఖంగా, ఒకే డోర్‌తో నిర్మించాలి. మొదటి అంతస్తులోనే షాపు ఉండాలి. ఎమ్మార్పీ ధరలను సూచించే బోర్డును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. - మద్యం షాపులో సీలింగ్ ఫ్యాన్లు, టేబుళ్లు, కుర్చీలు, ఐరన్ ర్యాక్‌లు, ఎలక్ట్రికల్ సబ్ మీటర్, దొంగ నోట్లను గుర్తించే డిటెక్టర్, సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్వేర్ ఉండాలి. - ఏడాదికి మాత్రమే షాపు అద్దె అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత టైమ్ టు టైమ్ పొడిగించుకోవాలి. - ప్రతి మద్యం షాపులో అర్బన్ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉంటారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రతి మద్యం షాపులో ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్, ఒక వాచ్మెన్, గ్రామీణ ప్రాంతాల్లోని షాపులో సూపర్వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్, ఒక వాచ్మెన్ ఉంటారు. - షాపు సూపర్వైజర్కు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండి, మద్యం షాపు ఎక్కడ ఏర్పాటవుతుందో ఆ మండలానికి చెందినవారై ఉండాలి. విద్యార్హత డిగ్రీ. బీకాం ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది. షాపు సేల్స్‌మెన్‌కు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు స్థానికులై ఉండాలి. సూపర్వైజర్కు నెలకు రూ.17,500 జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, సేల్స్‌మెన్‌కు నెలకు రూ.15 వేల జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తారు. కాంట్రాక్టు విధానంలో సిబ్బంది ఎంపిక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మొత్తం 15 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అర్హులైనవారు ఆన్లైన్లో ఏపీఎస్‌బీసీఎల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారికి కాంట్రాక్టు విధానంలో ఏడాది పాటు మద్యం షాపులో పనిచేసే అవకాశం ఉంటుంది. సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను ఆయా డిపో మేనేజర్ అనుమతితో ఇస్తారు. సూపర్వైజర్ లేదా సేల్స్‌మెన్ సేవలు సంతృప్తిగా ఉంటే వారిని రెండో ఏడాది కొనసాగించవచ్చు. రెండో ఏడాదిలో ఓ నెల రెమ్యునరేషన్‌ను బోనస్‌గా ఇస్తారు. మద్యం షాపులో రోజువారీ లావాదేవీలు, స్టాకు రిజిస్టర్ల నిర్వహణ, డిపో మేనేజర్ సూచించే పనులను సూపర్వైజర్ నిర్వహించాలి. వినియోగదారుల బిల్లింగ్, మద్యం బాటిళ్ల లోడింగ్, సూపర్వైజర్ సూచించే బాధ్యతలను సేల్స్‌మెన్ నిర్వహించాల్సి ఉంటుంది. మద్యం షాపును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడపాలి. మద్యం షాపులో ఏదైనా నష్టం సంభవిస్తే సిబ్బందిదే పూర్తి బాధ్యత. జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు మద్యం షాపుల ఏర్పాటు, రవాణా, సిబ్బంది ఎంపికలను పర్యవేక్షిస్తాయి. -
‘కిక్కు’రుమనడంలేదు
మహబూబ్‌నగర్ క్రైం : ఎన్నికల వేళ ఎవరు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా జిల్లా యంత్రాంగం గట్టి నిఘా పెట్టింది. ఈ మేరకు ఆబ్కారీ శాఖ పనితీరుపై ఉన్నత స్థాయిలో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు అప్రమత్తంగా విధుల్లో కొనసాగిస్తున్నారు. అయితే, ఈ పరిణామాలు ప్రలోభాలే ఆయుధంగా రంగంలోకి దిగిన అభ్యర్థులకు మింగుడు పడటం లేదు. ఏది ఎలా ఉన్నా ఎన్నికల తరుణంలో అభ్యర్థులు కొనుగోలు చేసే మద్యం ద్వారా నాలుగు డబ్బులు వెనకేసుకుందామనుకున్న వైన్స్ యాజమానుల వారి పాచికలు పారడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలని పథకం రచించిన వారు కూడా పటిష్ట నిఘాను దాటుకుని తీసుకురావడం ఎలా అన్న ఆలోచనతో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకొచ్చిన తంటా ఉమ్మడి జిల్లాలో సాధారణ మద్యం విక్రయాలు నెలకు రూ.వంద కోట్ల వరకు ఉంటాయి. గత ఎన్నికల సమయంలో విక్రయాలు 20శాతం అదనంగా జరిగాయి. ఇలా జరిగిన విక్రయాలకు లెక్కాపత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో మరో 10శాతం ఎక్కువగా అమ్మకాలు ఉంటాయని ఇన్నాళ్లు సంబరపడిన వైన్స్ యాజమానులు ఇప్పుడు తెగ బాధపడుతున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు బిగించిన ఉచ్చుతోఆందోళన చెందుతున్నారు. కొందరు మద్యం విక్రేతలు తమకు తెలిసిన నేతల వద్ద గోడు చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు ఏ సమస్యకైనా నేను ఉన్నా అని ధైర్యం చెప్పిన ఆ నాయకులు... మద్యం విషయానికొచ్చే సరికి ‘పరిస్థితులు బాగా లేవు.. నేను కూడా మద్యం జోలికి వెళ్లదలుచుకోవడం లేదు’ అంటూ సర్దిచెప్పి పంపుతున్నారు. ఈ సమయంలో తాను మద్యం జోలికి వెళ్లడంలేదు... మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెబుతుండడంతో వైన్స్ యాజమానుల ఆందోళనకు కారణమవుతోంది. ప్రత్యేక దృష్టి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు మద్యం అక్రమ నిల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక యాప్‌లు ఇప్పటికే సిద్ధం చేసి వాటితో ఫలితాలు రాబడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతీ మద్యం సీసాకు లెక్క తేల్చేలా ట్రాకింగ్ సిస్టం, కంప్యూటరీకరణను ఉపయోగిస్తున్నారు. ఐఎంఎల్ డిపో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏ షాపుకు వెళ్లింది.. అమ్మకాలు ఏ మేరకు సాగాయనే ఆరా తీస్తుండడం.. ఈ వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తుండడం గమనార్హం. ఇక గత ఏడాది నవంబర్‌లో ఎంత మద్యం విక్రయించారో అంతే స్థాయిలో విక్రయాలు ఉండేలా చూస్తుండడంతో ఇటు మద్యం వ్యాపారులు.. అటు పార్టీల అభ్యర్థులకు మింగుడు పడడం లేదు. -
మా మందు.. మా ఇష్టం..!
వరంగల్ క్రైం: మద్యం మత్తులో నిబంధనలు కొట్టుకుపోతున్నాయి. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల ఎదుట నడిరోడ్డుపై మందుబాబులు వాహనాలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడంతో పాటు గొడవలకు దిగుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న మద్యం షాపుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. సాయంత్రం 6 గంటల దాటితే మద్యం షాపుల ఎదుట నడిరోడ్డు వరకు వాహనాలను పార్కింగ్ చేయడంతో వాహనదారులు, ప్రజలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇటివల హన్మకొండ అమృత జంక్షన్ పరిధిలో అశ్విని బార్లో ఉదయం 7 గంటలకే మద్యం అమ్ముతుంటే స్థానిక ఇన్స్పెక్టర్ సంతప్రావు కేసు నమోదు చేశారు. వెలుగులోకి రాని ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. మందుబాబుల వీరంగం... మద్యంషాపుల ఎదుట మందు బాబుల వీరంగం సృష్టిస్తున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థిలు ఉన్నాయి. ఇటివల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ మద్యం షాపు ఎదుట మందుబాబుల వీరంగం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇక్కడ మద్యం బాటిళ్లను కోనుక్కొని పక్కనే ఉన్న డబ్బాల ముందు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. అటువైపు వెళ్లే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. (ఎన్ఐటీ సమీపంలోని ఓ మద్యం షాపు ఎదుట.. ) ప్రేక్షక పాత్రలో పోలీసులు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పార్కింగ్ స్థలాలు లేవు. గోపాలస్వామి గుడి సమీంలో ఉన్న మద్యం షాపులు, మిల్స్‌కాలనీ జంక్షన్, స్టేషన్ రోడ్డు, అండర్ బ్రిడ్జి, కాశిబుగ్గ జంక్షన్, హన్మకొండ చౌరస్తా, హన్మకొండ బస్టాండ్, లోకల్ డిపో, వడ్డేపల్లి క్రాస్, ఫాతిమా నుంచి కేయూ రోడ్డులోని వడ్డేపల్లి జంక్షన్, తదితర ప్రాంతాలలో ఉన్న షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకవడంలేదని విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు నగరంలో పార్కింగ్ లేని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మద్యం షాపులపై చంద్రబాబును ప్రశ్నించిన మహిళ
-
బెల్ట్ షాపుల నియంత్రణలో విఫలం
పొన్నూరు (చేబ్రోలు) : పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం బెల్టు షాపులను నియంత్రించటంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, పొన్నూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ విమర్శించారు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న మద్యం బెల్టు షాపులను నియంత్రించాలని కోరుతూ పొన్నూరు పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద ఆదివారం అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చని టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. బెల్టు షాపుల రద్దుకు సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని, అయితే ఎక్కడా బెల్టుషాపుల నియంత్రణ జరగలేదన్నారు. మద్యం మహమ్మారికి ఎందరి జీవితాలో గాలిలో కలిసిపోవటమే కాకుండా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో 600కు పైగా హమీలిచ్చిన బాబు ఏ ఒక్కదాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార టీడీపీ మద్యం తాగండి, తాగి ఊగండి అన్న నినాదంతో విచ్చలవిడిగా బెల్టు షాపులను నడుపుతోందన్నారు. టార్గెట్లు ఇచ్చి మద్యం విక్రయాలు సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మాట్లాడుతూ నవ్యాంధ్రను మద్యాంధ్రగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. పొన్నూరు జెడ్పీటీసీ, కాపు సంఘం నాయకుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచినీరు దొరకని ఊరు ఉందేమో కాని మద్యం దొరకని గ్రామమే లేదని ఎద్దేవా చేశారు. బెల్టు షాపుల వల్ల యువత పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు కేవీ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ జాతీయ రహదారులపై మద్యం షాపులకు అనుమతి ఇవ్వవద్దని జీవో జారీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వాటిని రాష్ట్ర రహదారులుగా మార్చి విచ్చలవిడిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయటం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు తన్నీరు కిషోర్, సీపీఐ ఎంఎల్ నాయకుడు పరశురామయ్య, ఆమ్ఆద్మీ నాయకులు గాజుల నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్.రూత్‌రాణి, కాపు సంఘం నాయకులు జి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు వడ్రాణం ప్రసాదరావు, బొనిగల వేణు ప్రసాద్, ఆకుల వెంకటేశ్వరరావు, బోయిన శివనాగరాజు తదితరులు ఉన్నారు. -
ఏపీలో పొంగిపొర్లనున్న మద్యం
సాక్షి, అమరావతి : న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పొంగిపొర్లనుంది. అర్థరాత్రి ఒంటి గంట వరకూ బార్లు, వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో ఎక్సైజ్ శాఖ నిర్ణయం అమలు కానుంది. కాగా, ఇప్పటికే ఏపీలోని మద్యం గోడౌన్లకు రూ. 314.65 కోట్ల లిక్కర్‌ను తరలించారు. న్యూ ఇయర్‌ను క్యాష్ చేసుకుని ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎక్సెజ్ శాఖ ఈ అనుమతులు జారీ చేసినట్లు అర్థం అవుతోంది. గతేడాది న్యూ ఇయర్‌కు సందడికి రూ. 252 కోట్లు విలువైన మద్యం దుకాణాలకు వెళ్లగా.. ఇప్పడు అది రూ.314.65కు పెరిగింది. ఓవరాల్‌గా 2017లో ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలు 24.85 శాతం పెరిగాయి. -
'మద్యం షాపుల్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు'
సాక్షి, అమరావతి : ‘‘మద్యం షాపుల్లో ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు. ఓపెన్ డ్రింకింగ్.. బ్రాండ్ మిక్సింగ్.. మాకు తెలియదనుకుంటున్నారా? పోలీసులను వచ్చి కలవడం కర్టసీ. ఇప్పటివరకు మామూళ్లు ఎలా ఇచ్చారో అలాగే నడవాలి. అది సిస్టం. కుదరదంటే రోజూ మా వెహికల్ మీ మద్యం దుకాణం ముందే ఉంటుంది. చట్టం ప్రకారం పోతాం.. ఆ తర్వాత మీ ఇష్టం..’’ అనంతపురం జిల్లాలో ఓ సీఐ మద్యం మామూళ్ల కోసం బరితెగించి చేసిన వ్యాఖ్యలివి. అక్కడి మద్యం వ్యాపారులకు, సీఐకి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. మద్యం అమ్మకాల్లో అక్రమాలు, ఉల్లంఘనలను నియంత్రించాల్సిన పోలీస్, ఎక్సైజ్ మామూళ్ల కోసం సిండికేట్లకు కొమ్ము కాస్తున్నారు. తమ ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దన్న స్థానికులను బెదిరిస్తూ.. మద్యం వ్యాపారానికి రక్షణ కవచంలా నిలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలో మద్యం దుకాణాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమంలో పాల్గొని గుండెపోటుతో ముదునూరి సుబ్బమ్మ అనే మహిళ మరణించినా.. పోలీసుల సహకారంతో గ్రామంలో మద్యం షాపు ఏర్పాటుకు ఇంకా ప్రయత్నించడమే ఇందుకు చక్కటి ఉదాహరణ. వేళాపాళా లేని మద్యం అమ్మకాలు, బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు గాను మద్యం సిండికేట్లు ఎక్సైజ్ అధికారులకు, పోలీసులకు ఠంఛనుగా నెలవారీ మామూళ్లు ముట్టజెప్పేవారు. ఎక్సైజ్ కమిషనర్‌గా లక్ష్మీ నరసింహం బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపారు. అప్పటివరకూ నెలకు రూ.లక్షల్లో ముడుపులు అందుకుంటున్న కొందరు ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. కమిషనర్ వ్యవహార శైలితో ఎక్సైజ్ అధికారుల తీరులో కొంత మార్పు వచ్చింది. కానీ, పోలీసులు మాత్రం సిండికేట్లకు ఇతోధిక సహకారం అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అడ్డూ, అదుపులేకుండా సాగుతున్నాయి. మామూళ్ల కోసం పోలీసులు సాగిస్తున్న దందాపై ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం డీజీపీ సాంబశివరావుకు కొద్దిరోజుల క్రితం లేఖ రాశారు కూడా. మద్యం సిండికేట్లతో జత కట్టిన పోలీసులను కట్టడి చేయాలని ఆ లేఖలో కోరారు. అయినా పరిస్థితిలో మార్పులేకపోగా.. పోలీసుల అండతో సిండికేట్లు రెచ్చిపోతున్నారు. చివరకు బార్ల నిర్వాహకులు పదుల సంఖ్యలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుపుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతంలో ఓ బార్ యజమాని స్థానిక పోలీసు అధికారి సహకారంతో ఏకంగా పది బెల్టు షాపులు నడుపుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్ల నుంచి మామూళ్ల కోసం అనంతపురం టౌన్‌లోని ఓ సీఐ మద్యం సిండికేట్ నేతకు ఫోన్‌చేసి బెదిరించడం ఇప్పుడు వైరల్‌గా మారింది. మామూళ్లు ఇవ్వకుంటే ప్రతిరోజూ మద్యం షాపు ఎదుట తన వాహనం పెడతానని, వ్యాపారం ఎలా చేస్తారో.. చూస్తానని సదరు సీఐ హెచ్చరించడం గమనార్హం. ఈ తరహా హెచ్చరికల కారణంగానే సిండికేట్లు మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా పెంచి అమ్ముతున్నారు. పర్మిట్ రూమ్‌లతో అమ్మకాలు, ఘర్షణలు వృద్ధి రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ఈ పర్మిట్ రూమ్లవల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నిబంధనల ప్రకారం వీటిని ఏర్పాటు చేయకుండా మినీ బార్లులా ఏర్పాటుచేయడంతో నవంబరు నెలలో రూ.1,400 కోట్ల అమ్మకాలను దాటిపోయాయి. మరోవైపు.. పర్మిట్ రూమ్‌లలో ఘర్షణలూ పెరుగుతున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే నవంబరులోనే పర్మిట్ రూమ్‌లలో మద్యం సేవించి ఘర్షణలు చోటుచేసుకున్న సంఘటనలు పదికి పైగా జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నెలనెలా రూ.87.60 కోట్ల ముడుపులు ఎమ్మార్పీ ఉల్లంఘనల ద్వారా రాష్ట్రంలో నెలకు రూ.87.60 కోట్ల మామూళ్లు అందుతున్నట్లు అంచనా. ఈ మామూళ్ల జాబితాలో అధికార పార్టీ నేతల నుంచి పోలీస్, ఎక్సైజ్ అధికారులున్న సంగతి బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో మొత్తం 4,380 మద్యం షాపులుంటే, ఎమ్మార్పీ ఉల్లంఘనలకుగాను షాపునకు రూ.లక్ష , బెల్టు షాపు నిర్వహిస్తే మరో రూ.లక్ష వసూలు చేస్తారని గతంలో ఎక్సైజ్ వర్గాలే పలు సందర్భాల్లో వెల్లడించాయి. ఎమ్మార్పీ ఉల్లంఘనల ద్వారా నెలకు రాష్ట్రవ్యాప్తంగా రూ.43.80 కోట్లు వసూలు అవుతాయని, బెల్టు షాపుల ద్వారా నెలకు మరో రూ.43.80 కోట్లు మొత్తం రూ.87.60 కోట్లు, అదే ఏడాదికి రూ. 1,050 కోట్లుకు పైగా వసూలు చేస్తున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. -
జాతీయ రహదారిపై మళ్లీ మద్యం
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ రహదారులపై మళ్లీ మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. నగర, పురపాలక సంస్థల పరి«ధిలో నుంచి వెళుతున్న జాతీయ రహదాలపై మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తరాది రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని మన రాష్ట్రంలో కూడా దుకాణాలు ఏర్పాటు చేసేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జాతీయ రహదారులు అధిక శాతం నగరాల మధ్య నుంచి వెళుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జాతీయ రహదారులకు 500 మీటర్లు, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన సుప్రీం ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే పలు కారణాల వల్ల ఆ గడువును మార్చి నెలాఖరుకు, ఆ తర్వాత జూన్ వరకు పొడిగించింది. రాష్ట్రంలో మద్యం నూతన పాలసీ జూలైలో ప్రారంభం కావడంతో అప్పటి నుంచి ఆ తీర్పును అమలు చేశారు. మద్యం వల్ల వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తన ఆ«ధీనంలో ఉన్న రాష్ట్ర రహదారులను నగరపాలక, పురపాలక, మండల కేంద్రాల పరిధి వరకు జిల్లా ప్రధాన రహదారులుగా మార్చివేసింది. తాజాగా ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన వెలుసుబాటును ఉపయోగించుకుని జాతీయ రహదారుల పక్కన కూడా మద్యం దుకాణాల ఏర్పాటు చేసుకోడానికి వ్యాపారులకు అనుమతిస్తోంది. ప్రాణాలు పోతే మాకేంటి..? రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గత మద్యం పాలసీలో 545 దుకాణాలకుగాను 499 దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారులపై 379 దుకాణాలున్నాయి. జాతీయ రహదారులపై 39 ఉండగా మిగిలిన 340 దుకాణాలు రాష్ట్ర రహదారులపై ఉన్నాయి. సుప్రీం తీర్పుతో ఈ దుకాణాలను రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే దుకాణాలు ఏర్పాటు చేసే పట్టణాల్లో రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేయడంతో ఎప్పటిలాగే 340 దుకాణాలు యథాతథంగా ఉన్నాయి. -
గ్రామసభ అనుమతితోనే మద్యం షాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతాల్లో మద్యం షాపులు పెట్టాలంటే ఆయా గ్రామసభల తీర్మానాలు తప్పక ఉండాలని, గ్రామసభ ఆమోదం లేకుండా మద్యం షాపులకు అనుమతివ్వడానికి వీల్లే దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖను ఆదేశిస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పెసా’ యాక్ట్ ప్రకారం ఆదివాసీ ప్రాంతా ల్లో మద్యం షాపుల ఏర్పాటుకు గ్రామసభ ఆమోదం తప్పనిసరని, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టంలో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కు కల్పిస్తూ ‘పెసా’ నిబంధనల్ని అమల్లోకి తెచ్చారన్న పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదివాసీ ప్రాంతాల్లోని 17 గ్రామాల్లో మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జారీచేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పోడెం రత్నం అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. మద్యం షాపుల ఏర్పా టుకు చట్ట నిబంధనల్ని అమలు చేయాలంటూ గతనెలలో సింగిల్ జడ్జి ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశారు. దీనిపై పిటిషనర్ పోడెం రత్నం అప్పీల్ చేయడంతో ధర్మాసనం గురువారం సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరిస్తూ తీర్పునిచ్చింది. మద్యం షాపుల ఏర్పాటుకు నోటీసులు జారీ చేసిన నెలరోజుల్లో గ్రామ పంచాయతీలు అంగీకరిస్తూ తీర్మానాలు వస్తాయనే ఆశాభావంతో ముందుగానే అనుమతులివ్వడం చెల్ల దని స్పష్టం చేసింది. జిల్లాలోని ఆదివాసీ ప్రాంతంలో 17 మద్యంషాపుల ఏర్పాటుకు ఇంతవరకు నోటీసు లు జారీ కాలేదని, గ్రామ సభలు అనుమతి కోరలేదని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామసభలుంటేనే మద్యం షాపులకు అనుమతి ఇవ్వాలని లేకుంటే వద్దని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. -
పుత్తూరులో రోడ్డెక్కిన మహిళలు
-
మద్యం షాపుల లీజు ఏడాదే
-
మద్యం షాపుల లీజు ఏడాదే
‘లైసెన్సు’ కాలాన్ని కుదించాలని ప్రభుత్వ నిర్ణయం ఆరు శ్లాబుల బదులు మూడు శ్లాబుల్లో లైసెన్సు ఫీజు తొలి రెండు శ్లాబుల్లోకి గ్రామీణ, పట్టణప్రాంత దుకాణాలు అందుకు అనుగుణంగా ఫీజు పెంచే యోచన ముఖ్యమంత్రి వద్దకు చేరిన నూతన ఎక్సైజ్ పాలసీ ఫైలు సాక్షి, హైదరాబాద్ మద్యం దుకాణాల లైసెన్సు లీజు కాలాన్ని ఏడాదికే కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత పాలసీలో రెండేళ్లుగా ఉన్న లీజు కాలాన్ని కొత్త ఎక్సైజ్ పాలసీలో ఏడాదికే పరిమితం చేయనుంది. అలాగే ఆరు శ్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును ఈసారి మూడు శ్లాబులకు కుదించాలని, మొదటి రెండు శ్లాబుల పరిధిలోకి గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణాలను తీసుకొచ్చి లైసెన్సు ఫీజు పెంచాలని యోచిస్తోంది. దుకాణం లైసెన్సుతోపాటే పర్మిట్ రూం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నూతన మద్యం పాలసీకి ఒక రూపాన్ని ఇచ్చి సంబంధిత ఫైల్‌ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు అధికారులు పంపారు. దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. డీనోటిఫై అవసరం లేకుండానే..: జాతీయ, రాష్ట్రీయ రహదారులకు 500 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు నిర్వహించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ప్రభావం నుంచి హైవేలపై ఉన్న మద్యం దుకాణాలను బయటపడేసేందుకు రాష్ట్రీయ రహదారులను డీనోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని రహదారులకు తమ తీర్పు వర్తించదంటూ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టతనిచ్చింది. ఈ తీర్పు వల్ల రాష్ట్ర హైవేలపై ఉన్న 561 మద్యం దుకాణాలకు ఇబ్బంది లేకుండా అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు, 852 బార్లు నడుస్తుండగా అందులో 1,184 మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఉన్నాయి. ఆన్లైన్లోనే దరఖాస్తులు.. మద్యం దుకాణాల కోసం ఈసారీ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి లాటరీ ద్వారా లైసెన్సు కేటాయించనున్నారు. అయితే గతంలో ముందుగా దుకాణం లైసెన్సు కేటాయించి తరువాత రూ. 2 లక్షల ఫీజుతో పర్మిట్ రూమ్‌ను అనుమతించే వాళ్లు. ఈసారి లైసెన్సుతోపాటే పర్మిట్ రూమ్‌కు అనుమతి ఇవ్వాలనుకుంటున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మద్యం దుకాణాలు 2,216 గతేడాది వేలంలో పోయినవి 2,144 జాతీయ రహదారులపై ఉన్నవి 623 రాష్ట్రీయ రహదారులపై ఉన్నవి 561 సుప్రీంకోర్టు స్పష్టతతో వెసులుబాటు పొందినవి 479 మొత్తం బార్లు 852 జాతీయ రహదారులపై ఉన్నవి 265 రాష్ట్రీయ రహదారులపై ఉన్నవి 155 సుప్రింకోర్టు స్పష్టతతో వెసులుబాటు పోందినవి 107 -
మద్యం షాపుల ఎదుట మహిళల ఆందోళన
-
చిత్తూరు కలెక్టర్‌కు చేదు అనుభవం!
తిరుపతి: చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలు శనివారం ఉదయం కలెక్టర్ ప్రద్యుమ్నను అడ్డుకున్నారు. తిరుపతి నగర శివార్లలోని మంగళం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న కలెక్టర్ ప్రద్యుమ్న వద్దకు మహిళలు భారీ సంఖ్యలో చేరుకొన్నారు. నివాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు. విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కలెక్టర్ ప్రద్యుమ్న ప్రకటనపై సంతృప్తి చెందని మహిళలు ముందుకు వెళ్లకుండా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఎక్సైజ్ అధికారులతో చర్చించి తీవ్ర ఇబ్బందికరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మరోసారి హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
మద్యం వ్యాపారులకు సర్కారు బాసట
- రాష్ట్ర రోడ్లను జిల్లా రోడ్లుగా డీనోటిఫై - సవరణపై జీఓ ఎంఎస్ నెం.28 విడుదల - జిల్లాలో 150 మంది వ్యాపారులకు ఊరట - లైసెన్సుల జారీలో కదలిక కర్నూలు(రాజ్‌విహార్) : సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం జాతీయ/రాష్ట్ర రహదారులపై మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. సదరు రహదారులను జిల్లా రహదారులుగా మార్పు చేస్తూ మంగళవారం రాత్రి జీఓ ఎంఎస్ నెం.28 విడుదల చేసింది. దీంతో జిల్లాలో రహదారుల పక్కన ఉన్న 150 మంది మద్యం వ్యాపారులకు ఊరట లభించింది. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లోనే అమ్మకాలను కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అటు వ్యాపారులు.. ఇటు ఎక్సైజ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో రోడ్ల పక్కన ఉన్న మద్యం షాపులను యజమానులు నివాస ప్రాంతాలకు తరలించడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళలు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 204 దుకాణాలు, 47 బార్లకు ప్రభుత్వం అనుమతించింది. కొత్త మద్యం పాలసీ ప్రారంభమై నాలుగు రోజులు గడిచినప్పటికీ కేవలం 74 దుకాణాలకు, రెండు బార్లకు మాత్రమే ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. నిబంధనలు తప్పించుకునేందుకు వ్యాపారులు రాజకీయ ప్రయత్నాలు కూడా చేశారు. జాతీయ/రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనతో లైసెన్సుల జారీలో గందరగోళం నెలకొని జాప్యం చోటు చేసుకుంది. సవరణ ఉత్తర్వులు వెలువడటంతో లైసెన్సుల జారీలో మళ్లీ కదలిక మొదలైంది. ఎక్సైజ్ కార్యాలయంలో వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి వరకు లైసెన్సులు జారీ ప్రక్రియ కొనసాగింది. మూడో రోజు రూ.3.50 కోట్ల మద్యం కొనుగోలు నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు మంగళవారం మూడో రోజు రూ.3.50 కోట్ల మద్యం కొనుగోలు చేశారు. 7,600 బాక్సుల లిక్కర్, 3,300 బాక్సుల బీరును కొనుగోలు చేసి దుకాణాలకు తరలించారు. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.8 కోట్ల మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. కల్లూరు శివారులోని హంద్రీ నది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపో మద్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. -
హైవే మందు బంద్
► సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ► రాష్ట్రంలో 3,515, బెంగళూరులో 852 బార్లు, షాపుల మూత ► సిటీలో ప్రధాన రోడ్లు, కూడళ్లలోని పానశాలలకు తాళాలు ► మందుబాబుల్లో టెన్షన్ హైవేల పక్కనే ఉన్న మద్యం అంగళ్లు, బార్ల వల్ల డ్రైవర్లు మత్తులో జోగుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అమలు ఊపందుకుంది. ఫలితంగా రాష్ట్రంలోను, ఐటీ సిటీలోనూ తీర్పు పరిధిలోకొచ్చే పానశాలలను మూసివేస్తున్నారు. ఎప్పుడూ తెరిచి ఉండే తమ ఆస్థాన మందు అంగడికి తాళాలు పడేసరికి మందుప్రియులు కొత్త షాపులను వెతుక్కుంటూ వెళ్తున్నారు. కొన్నిచోట్ల షాపుల్లో రద్దీల వల్ల గొడవలూ జరుగుతున్నాయి. ఏదేమైనా సుప్రీం తీర్పు అమలు వల్ల విలువైన ప్రాణాలకు భరోసా దక్కుతుంది. సాక్షి, బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పక్కనే ఉన్న మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ పరిణామం సామాజిక వేత్తలకు సంతోషం తీసువస్తే ప్రభుత్వంతో పాటు మందు బాబులకు కొంత ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. రోడ్డు ప్రమాదాలకు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలూ కారణమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర, జాతీయ రహదార్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను, బార్లను, పబ్‌లను తక్షణం మూసివేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆ మద్యం దుకాణాలకు తెరపడింది. కన్నడనాట 6,572 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 19,578 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల పొడవునా ఉన్న 3,515 మద్యం దుకాణాలు జులై 1 నుంచి మూతపడ్డాయి. శనివారం నుంచి అబ్కారీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ తెరిచి ఉన్న మందు దుకాణాల మూసివేతను ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,500 మద్యం దుకాణాలను మూసివేయగా కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను వేరే ప్రాంతానికి తరలించారు. బెంగళూరులో హడావుడి బెంగళూరు నగరంలో 94.89 కిలోమీటర్ల మేర ఆరు జాతీయ రహదారులు వెళుతున్నాయి. దీంతో బెంగళూరులో మొత్తం 852 బార్లు, మద్యం దుకాణాలకు తాళాలు వేశారు. దీంతో నగరంలో మిగతా మద్యం దుకాణాల్లో రద్దీ మరింత పెరిగింది. రహదారులపై మద్యం దుకాణాలు మూతపడడంతో మిగిలిన చోట్లకు మందుబాబులు పరుగులు తీసున్నారు. మిగతా చోట్ల మద్యం అంగళ్లకు క్యూలు కడుతుండగా, రద్దీ పెరిగి ఘర్షణలూ జరుగుతున్నాయి. అక్రమాలకు ఆరంభం మూత పడిన మద్యం షాపుల్లో ఇప్పటికీ 14.06 లక్షల బాక్స్‌ల మద్యం నిల్వలు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ పరిశీలనలో తేలింది. దీంతో దొడ్డిదారిన ఆ సరుకును అమ్ముకుంటున్నట్లు సమాచారం. మద్యం దుకాణ యజమానులు ఆ మద్యాన్ని మిగతా వైన్‌షాపులకు పంపిస్తున్నారు. కొందరు మద్యం దుకాణం పక్కనే పేరుకు ఒక టీ కొట్టు తెరిచి అందులో మద్యాన్ని అమ్ముతున్న ఫిర్యాదులూ ఎక్సైజ్ శాఖకు అందుతున్నాయి. ఎంఆర్పీ కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తున్నారు. -
మద్యం దుకాణాలపై మహిళల ఆగ్రహం
-
మద్యం రగడ
నెల్లూరు : జిల్లాలో మద్యం షాపులు, బార్ల ఏర్పాటుపై రగడ కొనసాగుతోంది. ప్రధాన రహదారుల వెంట మద్యం షాపులు నెలకొల్పి రూ.కోట్లు గడించిన లిక్కర్ సిండకేట్ల ప్రతినిధులు వాటిని వేరేచోటుకు మార్చడానికి ససేమిరా అంటున్నారు. తమ పంతం నెగ్గించుకునేందుకు మంత్రుల ద్వారా పైరవీలు నడుపుతున్నారు. ఇదికాస్తా కొలిక్కి వచ్చినట్టే కనిపించినా.. అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో ప్రధాన రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను శనివారం నాటికి 500 మీటర్ల దూరానికి మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సర్వత్రా ఉత్కంఠ మద్యం దుకాణాల లైసెన్స్ కాల పరిమితి ముగియగా.. కొత్త లైసెన్స్‌లు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందనే దానిపై వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తే జిల్లాలో 164 మద్యం షాపులు, 30 బార్లను తప్పనిసరిగా రోడ్లకు దూరంగా మార్చాల్సి వస్తుంది. జిల్లాలో మొత్తం 350 మద్యం షాపులు, 43 బార్లు ఉన్నాయి. వీటిద్వారా నెలకు సగటున రూ.95 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అధికార పార్టీలో కీలకంగా వ్యవహరించే నేతలే లిక్కర్ సిండికేట్‌లో ప్రధానమైన వ్యక్తులుగా ఉంటున్నారు. వాయిదా వేస్తూ.. రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలను 500 మీటర్ల అవతలకు మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. జూలై 1నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ క్రమంలోనే జాన్ చివరి వారంలో నిర్వహించాల్సిన మద్యం షాపుల లైసెన్స్‌ల కేటాయింపును మార్చి 31లోపే నిర్వహించి.. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా కొత్త లైసెన్స్‌లు కేటాయించింది. ఈ దృష్ట్యా శనివారం నుంచి మద్యం దుకాణాలను ప్రధాన రహదారులకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, కోర్టు ఆదేశాల నుంచి తప్పించుకునే యత్నాల్లో భాగంగా సర్కారు చేయూతతో మద్యం సిండికేట్లు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇందులో భాగంగానే రాష్ట్ర రహదారుల్ని ఢీనోటిఫై చేయించి.. వాటిని నగర, మున్సిపాలిటీ, పంచాయతీ రహదారులుగా మార్పిస్తే వ్యాపారానికి ఢోకా ఉండదన్న ఉద్దేశంతో పైరవీలు సాగించాయి. మంత్రుల సాయంతో ఆ దిశగా కసరత్తు కూడా చేయిం చాయి. 20 రోజులుగా ఈ వ్యవహారం నానుతున్నా ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులేవీ అందలేదు. గందరగోళం రోడ్ల ఢీ నోటిఫైకి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాకపోవటంతో షాపులు మార్చాలా లేక ఉన్నచోటే కొనసాగించాలనే అనే దానిపై గందరగోళం నెలకొంది. షాపులు మార్పు చేయకుండా ఉండేదుకు మద్యం సిండికేట్ సభ్యులు అన్ని షాపుల నుంచి కొంత మొత్తం వసూలు చేసి పెద్దలకు మట్టజెప్పినట్టు సమాచారం. మార్పు తప్పనిసరి అయితే నెల్లూరు డివిజన్ పరిధిలో అత్యధికంగా 118 షాపులను మార్చాల్సి వస్తుంది. గూడూరు డివిజన్లో 66 షాపులు మార్చాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 30 బార్ల మార్పు అనివార్యం. మరోవైపు ఇళ్లమధ్య మద్యం దుకాణాలు పెట్టొద్దంటూ ప్రజలు, ప్రజా సంఘాల నుంచి పెద్దఎత్తున అధికారులకు వినతులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్ల దుకాణాలు పెడితే నష్టపోతామనే అభిప్రాయం వ్యాపారుల్లో ఉంది. -
మూణ్నెళ్లు మద్యం షాపులు బంద్
చెన్నై: జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం షాపులను మూడు నెలల పాటు తెరవరాదని, అలాగే ఇతర ప్రాంతాలకు తరలించరాదని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఆ రాష్ట్రంలో 3300కు పైగా మద్యం షాపులు మూతపడనున్నాయి. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి, అడ్వకేట్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు కే బాలు వేసిన వేర్వేరు పిటిషన్లను కోర్టు విచారించింది. చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం సుందర్‌లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించారు. మూడు నెలల వరకు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలను తెరవరాదని, అలాగే మరో చోటకు తరలించరాదని తీర్పు చెప్పారు. ఏప్రిల్ నుంచి జాతీయ, రాష్ట్రాల హైవేల పక్కన మద్యం షాపులను నిర్వహించరాదని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేల పక్కన మద్యం అమ్మకాల వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా మద్యం షాపులను మూసివేయించాలని పేర్కొంది. ప్రస్తుతమున్న షాపుల లైసెన్సులను రెన్యువుల్ చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది. -
దశల వారీగా మద్యం షాపులన్నీ బంద్
భోపాల్: దశల వారీగా మద్యం షాపులన్నింటినీ మూసివేయించి, రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నర్సింగ్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 'తొలి విడతలో నర్మద నదికి ఇరువైపులా 5 కిలో మీటర్ల పరిధిలోని షాపులన్నింటినీ మూసివేయిస్తాం. రెండో విడతలో నివాస ప్రాంతాల్లో, విద్యా సంస్థలు, ప్రార్థన స్థలాలకు సమీపంలో మద్యం షాపులను అనుమతించం. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తాం' అని చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మధ్యనిషేధం విధించాలని ఆందోళనలు చేస్తున్నారు. -
యోగి ఎఫెక్ట్.. మద్యం షాపులపై మహిళల వార్!
లక్నో: మొత్తానికి ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా యోగి ఆధిత్యానాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిహార్ మాదిరిగా తమ రాష్ట్రంలో కూడా మద్యాన్ని నిషేధించాలంటూ గత కొంత కాలంగా చేస్తున్న డిమాండ్‌కు మరింత ఊపునిచ్చేలాగా అతివలంతా ఒక్కటయ్యారు. అనూహ్యంగా మంగళవారం రాత్రికి రాత్రే పలు లిక్కర్ షాపులపై దాడులకు దిగారు. ఈ దాడుల వెనుక ఏ ఒక్క సంస్థ లేకపోవడం గమనార్హం. లక్నో నుంచి హాపూర్, బులందేశ్వర్ నుంచి అంబేద్కర్ నగర్ వరకు ఉన్న మద్యం దుకాణాలన్నింటిపై మహిళలంతా కూడా తమకు తామే స్ఫూర్తిని పొంది దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో మధ్యం పూర్తిగా ఎత్తివేయాలన్నదే వారి డిమాండ్ అని మహిళా నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, కొంతమంది మాత్రం కొందరు మహిళలకు చేతులకు కొన్ని ప్రత్యేకమైన బ్యాండ్స్ ధరించి, ఓ మతపరమైన నినాదాలు చేస్తూ లిక్కర్ షాపులపై దాడులకు దిగుతున్నారని అంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నిమార్లు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదని, అక్రమాలు, అవినీతిని ఎక్కడ, ఎప్పుడు, ఎవరు బయటపెట్టినా వెంటనే అవి జరిగే చోటుపై చర్యలు తీసుకుంటామని కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి యోగి చెప్పిన నేపథ్యంలో ఆ మహిళలు ముందుకెళుతున్నారని అంటున్నారు. లక్నోలో మాత్రమే రాత్రికి రాత్రి అలాంటివి ఏడు సంఘటనలు చోటు చేసుకున్నాయని పోలీసులు చెబుతున్నారు. కొన్ని మద్యం షాపులకు నిప్పు కూడా పెట్టారంట. -
నెత్తుటి చరిత్రకు ముగింపు
దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడులని చెప్పుకునే జాతీయ రహదారులకు సమీపంలో బార్లు, రెస్టరెంట్లు ఉండటానికి వీల్లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టంగా చెప్పిన తీరు ఆ సమస్య తీవ్రతను చాటింది. నిరుడు విడుదల చేసిన 2015 నాటి రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం రహదారుల్లో జాతీయ రహదారుల వాటా 1.5 శాతం మాత్రమే. కానీ 28 శాతం ప్రమాదాలకు, 33 శాతం మరణాలకు జాతీయ రహదారులే కారణమవుతున్నాయి. వాహనాలను నిర్లక్ష్యంగా, వేగంగా నడపటం వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 2015లో రోడ్డు ప్రమా దాలు రెండున్నర శాతం పెరిగాయి. దాదాపు అయిదున్నర లక్షల రోడ్డు ప్రమా దాల్లో లక్షా 42 వేల మంది మరణిస్తే అందులో మద్యం సేవించడం పర్య వసానంగా జరిగిన ప్రమాదాలే ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై శాశ్వతంగా వికలాంగులవుతున్నవారు మరిన్ని లక్షలమంది ఉంటున్నారు. ఈ ప్రమాదాల కారణంగా లక్షలాది కుటుంబాలు ఆసరా కరువై చెప్పనలవికాని ఇబ్బం దులు పడుతున్నాయి. వీధిన పడుతున్నాయి. నాలుగు వరసలు, ఆరు వరసలుగా విస్తరించి కళ్లు చెదిరే స్థాయిలో కనబడే ఈ జాతీయ రహదారుల వెంబడే అనేక చోట్ల బార్లు, రెస్టరెంట్లు ధాబాలు కొలువుతీరుతున్నాయి. వచ్చే పోయే వాహ నాల్లోని డ్రైవర్లు వాటి దగ్గర ఆగి కావలసినంత కిక్కు ఎక్కించుకుని వెళ్తున్నారు. పర్యవసానంగా ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఏటా రూ. 60,000 కోట్లు నష్టపోతున్నామని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడి స్తున్నాయి. నిజానికి ఈ సమస్యపై ప్రభుత్వాలు తమంత తామే దృష్టిసారించి ఉండాలి. ఎందుకంటే సమస్య ఏర్పడినప్పుడు ప్రజలు ముందుగా ప్రభుత్వాలకు చెప్పు కుంటారు. తప్పక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తారు. వారు అడిగినా అడగక పోయినా విస్తృతమైన యంత్రాంగం ఉన్న ప్రభుత్వాలకు ఆ సమస్య గురించి తెలియాలి. దాన్ని తీర్చడానికి అమలు చేయాల్సిన విధానాన్ని రూపొందించాలి. కానీ మన దేశంలో జరుగుతున్నది వేరు. సమస్యకు ఎంతకీ పరిష్కారం లభించక పోవడం, అది సాధ్యమవుతుందన్న నమ్మకం కొరవడటం పర్యవసానంగా న్యాయ స్థానాలను ఆశ్రయించక తప్పనిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పుడు జాతీయ రహ దారుల పొడవునా మద్యం దుకాణాలనూ, బార్లనూ, రెస్టరెంట్లనూ మూసేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం కూడా ఆ విధంగా వచ్చిందే. పంజాబ్‌కు చెందిన హర్మాన్ సిద్ధూ పదేళ్లక్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్రమంలో అత్యవసర చికిత్స కోసం వచ్చే అధిక శాతంమంది రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నవారేనని అతను గ్రహించాడు. ఎంతో పరిశోధన తర్వాత వీటిని ఆపడానికి ప్రభుత్వాల పరంగా చర్యలేమీ ఉండటం లేదని తెలుసుకున్నాడు. ఆ తర్వాత న్యాయస్థానం తలుపుతట్టాడు. అతని పిటిషన్‌పై 2014 మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిస్తూ జాతీయ రహదారి సమీపంలో మద్యం దుకాణాలు ఉండరాదని చెప్పడం... దానిపై అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం పర్యవసానంగా తాజా ఆదేశాలు వెలువడ్డాయి. జాతీయ రహదారులపై మద్యం విక్రయాలు ఎంత విచ్చలవిడిగా సాగుతున్నాయో హర్మాన్ సేకరించిన సమాచారమే చెబుతుంది. పానిపట్–జలంధర్ మధ్య ఉన్న 290 కిలోమీటర్ల రహదారిపై 185 చోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయని సిద్ధూ కోర్టుకు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలు, బార్లలో 57 శాతం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల సమీపంలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు ఏ రాష్రమూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ కేసు విచారణ సందర్భంగా, ఆ తర్వాత సడలింపులు ఇవ్వాలంటూ కోరిన సమయంలోనూ సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాదనలు వింత గొలుపుతాయి. మద్యం దుకాణాలు, బార్లు వగైరాలవల్ల తమకు వేల కోట్ల ఆదాయం వస్తున్నదని, వాటిపై లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నారని ప్రభు త్వాలు లెక్కలు చెప్పాయి. ఈ నిషేధం వల్ల రూ. 50,000 కోట్ల ఆదాయం కోల్పోతామని, 10 లక్షలమంది ఉపాధి దెబ్బతింటుందని వివరించాయి. కానీ ప్రమాదాల కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో, ఎన్ని కుటుంబాలు అధోగతిపాలవుతున్నాయో... ఇందువల్ల ఎన్ని వేల కోట్లు నష్టపోవలసి వస్తున్నదో విస్మరించాయి. నిరుడు డిసెంబర్లో వెలువరించిన తీర్పులో జాతీయ రహదా రులు, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం విక్రయాలు ఉండరాదన్న ఆదేశాలకు వక్ర భాష్యం చెప్పుకుని ఆ తీర్పు చిల్లర మద్యం దుకాణాలకు మాత్రమే వర్తిస్తుందన్నవారికి తాజా ఆదేశాలు మరింత స్పష్టతనిచ్చాయి. జాతీయ రహ దారులపై ఉండే బార్లు, పబ్‌లు, రెస్టరెంట్లూ, ధాబాలకు సైతం తమ ఉత్తర్వులు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 20,000 వరకూ జనాభా ఉండే ప్రాంతాల్లో మద్యం విక్రయ జోన్ పరిధిని 500 మీటర్లనుంచి 220 మీటర్లకు తగ్గించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల వల్లనే అంతా సర వుతుందని భావించకూడదు. ఈ నిషేధంతో అక్రమ విక్రయాల జోరు పెరు గుతుంది. కొత్త కొత్త మాఫియా ముఠాలు పుట్టుకొస్తాయి. వీటిని అరికట్టాలంటే జాతీయ రహదారులపై ముమ్మరంగా తనిఖీలు జరిపే ప్రత్యేక బృందాలను ఏర్పరచవలసి ఉంటుంది. అవి పనిచేస్తున్న తీరుపై గట్టి పర్యవేక్షణ తప్పనిసరి. తాగి వాహనం నడిపినట్టు తేలితే లైసెన్స్ రద్దు చేయడంవంటి చర్యలు తీసు కోవాల్సి ఉంటుంది. మోటారు వాహనాల చట్టాన్ని కఠినం చేస్తూ కేంద్రం ఎటూ సవరణలు తీసుకురాబోతోంది. తాగి వాహనం నడిపి ఎవరి మరణానికైనా కారకు లైన పక్షంలో అలాంటివారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, పదేళ్లవరకూ కఠిన శిక్ష పడేలా చూడటం వాటిలో కొన్ని. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రయోజనం సంపూర్ణంగా నెరవేరేలా చూడటం, ప్రజల ప్రాణాలకు పూచీ పడటం ప్రభుత్వాల కర్తవ్యం. -
4,129 దరఖాస్తులు!
► మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బారులుతీరిన దరఖాస్తుదారులు ► ఒక్క దరఖాస్తు కూడా రాని దుకాణాలు 9 ► నేడు బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ► వివరాలు వెల్లడించిన డిప్యూటీ కమిషనర్ జోసెఫ్ ఒంగోలు క్రైం: మద్యం షాపులకు గురువారం చివరిరోజుతో కలుపుకొని మొత్తం 4,129 దరఖాస్తులు వచ్చాయి. వివరాలను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డిప్యూటీ కమిషనర్ గోళ్ల జోసెఫ్ వెల్లడించారు. ఒంగోలు, మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో మొత్తం 331 మద్యం షాపులకుగాను 322 దరఖాస్తులు వచ్చాయి. ఒంగోలు ఈఎస్ పరిధిలో 1,674 ధరఖాస్తులు రాగా, మార్కాపురం ఈఎస్ పరిధిలో 2,455 వచ్చాయి. జిల్లా మొత్తం మీద 9 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఒంగోలు ఈఎస్ పరిధిలో మొత్తం 154 మద్యం షాపులకు రావాల్సి ఉండగా ఏడు షాపులకు ఒకటి కూడా రాలేదు. ఒంగోలు నగరంలో 5, చీరాల పట్టణంలో రెండు షాపులున్నాయి. అదేవిదంగా మార్కాపురం ఈఎస్ పరిధిలో మొత్తం 177 మద్యం షాపులకుగాను రెండు షాపులకు రాలేదు. కందుకూరు పట్టణంలో ఒకటి, సింగరాయకొండలో మరొక షాపు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికులు రాత్రి పొద్దుపోయేవరకు స్థానిక ప్రకాశం భవన్‌లోని ఒంగోలు ఈఎస్ కార్యాలయంలో వాటి కాపీలను సమర్పిస్తున్నారు. అందుకు గాను చలానా ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజులను ఇస్తున్నారు. కలెక్టర్ సుజాతశర్మ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి లాటరీ ద్వారా షాపులకు లైసెన్స్‌లు కేటాయిస్తారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానున్నందున కొత్తగా మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి. -
మద్యం దుకాణాల ఏర్పాటుపై జనాగ్రహం
ఇళ్ల మధ్యలో వద్దంటూ ఆందోళనలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల మద్దతు ఉయ్యూరు :నివాసాల మధ్య మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రజాగ్రహం పెల్లుబికింది. మందు షాపులు మా మధ్యలో వద్దంటూ ప్రజాప్రతినిధులు, మహిళలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టాయి. ఈ అంశం ఎక్సైజ్ శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కొరకరానికొయ్యగా మారింది. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా.. జాతీయ రహదారుల వెంట మద్యం షాపులు తీసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మద్యం వ్యాపారులు తమ దుకాణాలను మార్చుకునే పనిలోకి దిగారు. ఈ క్రమంలోనే ప్రధాన సెంటర్లో ఉన్న రెండు మద్యం దుకాణాల వ్యాపారులు తమ దుకాణాలను 10, 12వ వార్డుల పరిధిలోకి వచ్చే కాలువకట్ల వెంట ఇళ్ల మధ్యలో పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ చర్యలను స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మద్దతుగా నిలిచాయి. తమ ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దం టూ శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీశ్రీనివాస విద్యాసంస్థల అధినేత డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు, 10, 12వ వార్డుల కౌన్సిలర్లు బొబ్బిలి నాగరాజు, అడపాక ఆదిలక్ష్మి, అడపాక రాంబాబు నేతృత్వంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మండలంలోని గండిగుంట గ్రామానికి చెందిన మహిళలూ ఇళ్ల మధ్యలో షాపు ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దంటూ ఎక్సైజ్ ఎస్ఐ మాధవిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సంతకాలు చేసి పాఠశాలలకు వెళ్లే రోడ్డుల్లో షాపుల ఏర్పాటుపై తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, ఇంకా షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలేదని ఎక్సైజ్ అధికారులు ప్రజలకు సర్దిచెప్పి వెనక్కి పంపుతున్నారు. మద్యం షాపులకు వ్యతిరేకం : వైవీబీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా మద్యం షాపుల ఏర్పాటుకు తాను పూర్తి వ్యతిరేకమని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కాలువకట్ట వాసులు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ను శుక్రవారం కలిసి తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం గా ఉండే చోట షాపులు ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది కలగని చోట షాపులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
మద్యం అమ్మకాలపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: రహదారుల పక్కన మద్యం షాపుల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జాతీయ, రాష్ట్రాల హైవేల పక్కన మద్యం షాపులను నిర్వహించరాదని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న షాపుల లైసెన్సులను రెన్యువుల్ చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది. జాతీయ, రాష్ట్రాల హైవేలకు మద్యం షాపులు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది. హైవేల పక్కన మద్యం అమ్మకాల వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా మద్యం షాపులను మూసివేయించాలని పేర్కొంది. -
మద్యం షాపుల్లో స్వైపింగ్ యంత్రాలు !
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. చిల్లర కొరతతో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ కౌంటర్లలో స్వైపింగ్ మెషిన్లు ఆర్టీసీలో టిక్కెట్ల రిజర్వేషన్‌కు ఈ-పోస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు కార్య నిర్వహణాధికారి ఎ.కోటేశ్వరరావు తెలిపారు. నగదు రహిత చెల్లింపులు ప్రోత్సహించేందుకు ఈ చర్యలు చేపట్టామని, తొలి దశలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బస్లాండ్లలో 50 స్వైపింగ్ యంత్రాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచే స్వైపింగ్ యంత్రాలను వినియోగించుకుని రిజర్వేషన్ చేయించుకోవచ్చని చెప్పారు. -
వేళలు పాటించకపోతే చర్యలు
ఏలూరు అర్బ¯ŒS: జిల్లాలో మద్యం దుకాణాలు నిర్ణీత వేళలు కచ్చితంగా పాటించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ వైబీ భాస్కరరావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలో ఆ శాఖ అధికారులు నిర్ణీతవేళలు పాటించని మద్యం దుకాణాలు, అనధికారికంగా మద్యం అమ్ముతున్న విక్రేతలపై దాడులు చేశారు. తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేష¯ŒS పరిధిలోని ఉత్తపాలెంలో అనధికారికంగా మద్యం అమ్ముతున్న దుకాణంపై దాడి చేశారు. నిందితుడి నుంచి క్వార్టర్ బాటిల్ మద్యం, 16 బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని డీసీ చెప్పారు. -
పుష్కరాల పనులు
అక్షర తూణీరం హైవే మీద మద్యం దుకాణాలను అనుమతించడం చాలా అన్యాయం. నడిరోడ్డు మీద మద్యాన్ని అందు బాటులోకి తెచ్చి ఎలాంటి సంకేతాలిస్తున్నారు? అసలే కృష్ణాతీరం నవ్యాంధ్ర క్యాపిటల్ నిర్మాణ పనుల్లో హడావుడిగా ఉంటే, ఆపైన పుష్కరా లొచ్చిపడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరుకి పూర్తి కాకపోతే పుష్కరాలకి మర్యాద దక్కదని మహానేత ఆదేశాలిచ్చారు. వేస్తున్నవి రోడ్లంటే రోడ్లుకాదు. తారుని నీళ్లకంటే పల్చగా చేసి, దాన్ని మంత్రోదకంలా చిలకరించి కొత్త రోడ్లని చాలా వేగంగా సిద్ధం చేస్తున్నారు. తారు నీళ్లు కల్లాపి జల్లుతున్నారని ఒక పల్లెటూరి ఇల్లాలు చమత్కరించింది. ఈ పుష్కర పనులు అస్మదీయులకు లాభసాటి పండగ. ఈ పుణ్య పర్వం సందర్భంగా - పుష్కరాల రోడ్లు, పుష్కరాల ఘాట్లు, పుష్కరాల గట్లు, పుష్కరాల దీపాలు ఇంకా చిత్ర విచిత్రమైన పనులకు టెండర్లు పడ తాయి. పాత తరం హడా వుడి పనులు అలాగే ఉంటాయి. ఇలాంటి వాటిపై వ్యాఖ్యానించేదేమీ లేదు. కాబోతున్న విశ్వనగరం మనది. మూడొంతులు అయిపోయిందనే ఏలిన వారి నమ్మకం. గట్టిగా నాలుగు చినుకులు పడితే చాలు అన్నీ వీధి గండాలే. ‘‘హమ్మయ్య! ఇవ్వాల్టికి అందరూ ప్రాణాలతో, కాళ్లూ, చేతులతో ఇంటికి చేరారు. దేవుడా! ధన్యవాదాలు’’ అని ఇల్లాండ్రు ప్రతినిత్యం దణ్ణం పెట్టుకుంటున్నారు. ఇది ఎక్కువచేసి చెప్పింది కాదు. పైగా మాట్లాడితే న్యూయార్క్ నగరంతో వంతు పెట్టడంవల్ల నగరవాసులకి మరింత దుఃఖం పెల్లుబుకుతోంది. నేను చరిత్ర పుస్తకంలో చదువుకున్న మొదటి నినాదం ‘‘స్వాతంత్య్రం నా జన్మహక్కు!’’. నేను స్వయంగా విన్నది ‘‘గరీబీ హఠావో!’’. ‘‘ఈ దేశం వెలిగిపోతోంది చూడండి’’ అంటూ ఫీల్‌గుడ్ తత్వాన్ని మంత్రించారు. రెండేళ్ల క్రితం సింహగర్జనలా ‘‘మేకినిండియా’’ వినిపించింది. మొద ట్నించీ గుర్తు చేసుకుంటే ఇది పదహారో జాతీయ నినాదం. కొత్త నోళ్లలో కొన్ని పాత నినాదాలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. పేదరికాన్ని, అవినీతిని పారదోలతాం. ఈ మధ్య పారదర్శక పాలన సాగిస్తామనే స్లోగన్ వినిపిస్తోంది. అంటే అద్దాల గదుల్లోంచి పాలన సాగించడమా? అమరావతి కోసం భూమి పోగొట్టుకున్న ఓ బక్క రైతు, ‘‘ఈ ప్రజల కోసం ప్రజల చేత... ఇదంతా పెద్ద అబద్ధం స్వామీ’’ అని అరిచాడు. నేను వివరాల్లోకి పోలేదు. ప్రస్తుతం కొత్త క్యాపిటల్‌లో బాగా చిక్కపడుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక కాలుష్యాలపై చర్యకిది సమ యం కాదు. సందర్భమూ కాదు. హైవే మీద మద్యం దుకాణాలను అనుమతించి, ప్రోత్సహించడం చాలా అన్యాయం. ఇప్పటికే హైవే ప్రమాదాలు భయంకరంగా జరుగు తున్నాయి. నడిరోడ్డు మీద మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ఎలాంటి సంకేతాలిస్తున్నారు? ఏమి సందేశమిస్తున్నారు? మునుపు బ్రిటీష్ హయాంలో రైల్వే స్టేషన్లలో లిక్కర్ షాపులుండేవి. ఇప్పుడు మనం మాత్రం ఎందుకు కూడదు? హైవేల మీద పెట్రోల్ బంకులలో టై అప్ పెట్టుకుంటే అందరికీ ఉభయతారకంగా ఉంటుంది. అటు ఆ ట్యాంక్‌ని, ఇటు ఈ ట్యాంక్‌ని ఒకేచోట నింపుకుని గాలిలో తేలుతూ పోతారు. అప్పుడు హైవే టోల్ గేట్లు కూడా పెంచవచ్చు. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సిండి‘కేటు’ దోపిడీ
మద్యం డాన్ల రహస్య సమావేశం? ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయం మామూళ్ల మత్తులో ఎక్సైజ్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు యథేచ్ఛగా కల్తీ మద్యం.. బెల్ట్‌షాపులు ఖమ్మం క్రైం: మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనలను పక్కనపెట్టి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్‌కు తలుపులు బార్లా తీస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన ఎక్సైజ్ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇష్టానుసారం ధరలు జిల్లాలో 148 మద్యం దుకాణాలు ఉన్నాయి. మొదట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు, మూడు నెలలపాటు దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా అమలు చేసింది. అప్పుడు ఎక్సైజ్ సిబ్బందికి పైసా మామూళ్లు ఇవ్వని వ్యాపారులు ఇప్పుడు మామూళ్లతో ముంచెత్తుతున్నారు. ‘మామూళ్లు ఇవ్వండి మీ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోండి’ అని ఎక్సైజ్ అధికారులు ఓపెన్‌గానే అంటున్నట్లు సమాచారం. వేసవికాలం కావడంతో మద్యం ప్రియులు బీర్లను ఎంచుకుంటున్నారు. ఇదే అదనుగా ఒక్కో బీరు బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. లిక్కర్ సీసాను రూ.10 నుంచి రూ.15 వరకు అధిక ధరకు అమ్ముతున్నారు. సిండికేట్ల పండగ సిండికేట్లు పండగ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఎక్సైజ్‌శాఖ డెరైక్టర్‌గా పనిచేసిన అకున్ సబర్వాల్ వేరేశాఖకు బదిలీ కావడంతో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ సిబ్బందికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా మద్యం సిండికేట్‌కు తలుపులు బార్లా తీయాలని కొంతమంది మద్యం డాన్లు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు రహస్య సమావేశం కూడా నిర్వహించారని సమాచారం. ఈ సిండికేట్ అమలుకావడానికి కొంతమంది ఎక్సైజ్ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. యథేచ్ఛగా పర్మిట్ రూమ్‌లు ఇష్టానుసారంగా పర్మిట్ రూమ్‌లు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకే మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. రాత్రి 10 గంటలకు మూయాల్సిన షాపులను అర్ధరాత్రి వరకూ కొనసాగిస్తున్నారు. ఖమ్మం త్రీటౌన్ టింబర్ డిపో రోడ్డులోని ఓ మద్యం షాప్ చుట్టూ పర్మిట్ దుకాణాలు ఏర్పాటైనా ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా ఎన్నో ఉన్నా పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం. కల్తీ విక్రయాలు జిల్లావ్యాప్తంగా 46 బార్లుండగా వాటిలో ఖమ్మంలోనే 42 ఉన్నాయి. మిగిలినవి ఇల్లెందు, కొత్తగూడెంలో ఉన్నాయి. కొన్ని బార్లలో కల్తీ మద్యం విక్రయిస్తూ దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఉదాహరణకు ఓ మద్యంప్రియుడు రూ.1500 బాటిల్ ఆర్డర్ చేస్తే మొదటి పెగ్గు వరకు అనుమానం రాకుండా తెచ్చి ఆ తర్వాత ఆ కాస్ట్లీ మద్యంలో చీప్‌లిక్కర్ కలిపి ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని బార్లలో నాణ్యతలేని తినుబండారాలను అమ్ముతూ మద్యం ప్రియుల ఆరోగ్యాన్నీ పాడు చేస్తున్నట్లు వినికిడి. గల్లీకో బెల్ట్‌షాప్ గల్లీకో బెల్ట్షాప్ను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నా..ఈ బెల్ట్‌షాప్‌ల వల్ల ప్రభుత్వాదాయానికి గండిపడుతున్నా ఎక్సైజ్‌శాఖ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయా ప్రాంతంలో ఉన్న వైన్‌షాప్‌ల యజమానులే బెల్ట్‌షాపులకు మద్యం పంపిస్తున్నట్లు సమాచారం. ఈ బెల్ట్‌షాపుల నుంచి ఎక్సైజ్ సిబ్బందికి భారీగానే ముడుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
మద్యం షాపులపై దాడులు
ఈపూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో మద్యం షాపులపై బుధవారం గ్రామస్తులు దాడులు చేశారు. గ్రామంలో మద్యాన్ని బహిష్కరిస్తూ గత గాంధీ జయంతి నాడు గామస్తులు తీర్మానం చేశారు. అయితే, దీనికి విరుద్ధంగా గ్రామంలోని మూడు షాపుల్లో మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీంతో ఈ రోజు ఉదయం స్థానికులు ఆయా షాపులపై దాడి చేసి సుమారు వెయ్యి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. -
'..లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తాం'
విశాఖ: ఎక్సైజ్ శాఖకు గత నెల జనవరి వరకు వ్యాట్ సహా రూ. 10, 270 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మార్చి నాటికి రూ. 12, 500 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలనేది తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. సోమవారం ముఖేష్ మీనా విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో నాటు సారా నియంత్రణలో ఉందని చెప్పారు. ఇంకా మూడు, నాలుగు జిల్లాల్లో నియంత్రణ కావాల్సి ఉందని అన్నారు. రెండు వేల మంది నాటుసారా అమ్మకందారులపై బైండోవర్లు కేసులు నమోదు చేశామన్నారు. మరో 2, 800 మందిపై బైండోవర్లు చేయాల్సి ఉందని తెలిపారు. 4 వేల దుకాణాలకు కంప్యూటీకరణ పూర్తియిందని చెప్పారు. వచ్చే నెల నాటికి మిగిలిన మద్యం దుకాణాలు కంప్యూటీకరణ చేసుకోవాలని సూచించారు. లేదంటే మద్యం సరఫరా నిలిపివేస్తామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. -
వసూల్ రాజా!
► బ్రాందీషాపులతో పిఠాపురం టీడీపీ నేత దందా ► రూ.55 వేల చొప్పున చెల్లించాలని హుకుం ► వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్ పోలీసులు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో బరితెగించిన అధికారపార్టీ ముఖ్యనేతకు అధికారులు అండగా నిలుస్తున్నారు. ఫలితంగా లక్షలు దండుకుని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాదాయానికి తీవ్రంగా గండి పడుతోంది. ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలకు ఖర్చయ్యిందంటూ.. వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.లక్షలు వసూలు చేసి ఇవ్వాలని హుకుం జారీ చేసిన సదరు నేత తాజాగా మద్యం షాపులపై పడ్డారు. ఒక్కో షాపు నుంచి రూ.55 వేలు వసూలు చేసి అర్జంటుగా పంపించాలని, ఇవ్వకపోతే షాపుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తానని హెచ్చరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. చేసేదిలేక షాపుల యజమానులు అడిగిన మొత్తం సదరు నేతకు సమర్పించుకున్నట్లు సమాచారం. 20 షాపుల నుంచి వసూలు నెలరోజుల క్రితం వరకు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు మామూలుగా జరిగేవి. చూసీచూడనట్లు వ్యవహరించిన అధికారులు హఠాత్తుగా సమయపాలన పాటించాలని, ఎమ్మార్పీకే అమ్మాలని, నిబంధనలు పాటించకపోతే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ మామూలే అనుకున్న షాపుల నిర్వాహకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికారులు జూలు విదిల్చారు. షాపుల వద్ద ఎమ్మార్పీ బోర్డులు పెట్టాలని, సమయానికి షాపులు మూసివేయాలని ఆదేశించారు. షాపుల నిర్వాహకులు గగ్గోలు పెట్టడంతో అధికారులు అసలు సంగతి చెప్పారు. ఒక నేత ఆదేశాల మేరకే ఇదంతా చేస్తున్నామని, ఆయనను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. షాపుల నిర్వాహకులు సదరు నేత అనుచరులను సంప్రదించగా ‘మీరు ఇష్టమొచ్చినట్లు అమ్ముకోవాలంటే రూ.55 వేల చొప్పున ఇవ్వా’లని ఆ నేత మాటగా చెప్పారు. ఇప్పటికే విజయవాడ కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో దాడులు పెరిగి, ముడుపుల బాధ ఎక్కువై, ఎమ్మార్పీకి అమ్ముతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పుడు అంత మొత్తం ఇవ్వలేమని మొర పెట్టుకోగా.. ఇవ్వక పోతే ఎలా అమ్ముతారో చూస్తానంటూ ఆ నేత కళ్లెర్రజేసినట్టు చెపుతున్నారు. చేసేదిలేక ఆ మొత్తం సమర్పించుకుంటుండడంతో ప్రసన్నుడైన ఆ నేత ఏ వేళనైనా, ఏ రేటుకైనా అమ్ముకోవచ్చని అభయమిచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో 22 మద్యం షాపులు, ఒక బార్ ఉండగా ఇప్పటివరకు 20 షాపులు అడిగిన ముడుపు చెల్లించినట్టు సమాచారం. కాగా ఈ విషయంపై పిఠాపురం ఎక్సైజ్ సీఐ రామసురేష్ను వివరణ కోరగా అలా వసూలు చేసినట్టు తమకు ఫిర్యాదులు రాలేదన్నారు. తాము మద్యం అమ్మకాలపై నిఘా ఉంచామని, సమయపాలన, ఎమ్మార్పీ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఎవరికీ కొమ్ము కాయడం లేదన్నారు. -
రాత్రి 12 వరకూ బార్లలో మద్యం విక్రయాలు!
* అదనంగా గంట సమయం పెంచేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ * కొత్త సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం * ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిన ఉత్తర్వులు * మద్యం దుకాణాలకు సమయం పొడిగింపునకు నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లలో మద్యం అమ్మకాల సమయాన్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్త సంవత్సరం నుంచే జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే రిటైల్ మద్యం దుకాణాలకు మాత్రం అమ్మకాల సమయాన్ని పొడిగించలేదు. పోలీస్ శాఖ అభ్యంతరం తెలపడంతో మద్యం దుకాణాల సమయాన్ని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం బార్లలో మద్యం అమ్మకాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుండగా... జనవరి ఒకటి నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు సాగుతాయి. మద్యం మినహా ఆహార పదార్థాల (రెస్టారెంట్) విక్రయాలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కొనసాగుతాయి. దేశంలో పారిశ్రామికంగా, పర్యాటకపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి వరకు మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గత ఫిబ్రవరిలోనే ఎక్సైజ్ శాఖ నుంచి నివేదిక కోరింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఆబ్కారీ మంత్రి పద్మారావు గౌడ్ కూడా మద్యం విక్రయాల సమయాన్ని పెంచాలని సీఎంకు సూచించారు. ఇతర మెట్రో నగరాల్లో అర్ధరాత్రి వరకు బార్లలో మద్యం అందుబాటులో ఉంటుండగా.. హైదరాబాద్‌లో స్టార్ హోటళ్లు మినహా ఇతర బార్లలో రాత్రి 11 గంటల వరకే మద్యం లభిస్తోంది. హైదరాబాద్, జిల్లా కేంద్రాలు మినహా మిగతా ప్రాంతాల్లో రాత్రి 10.30 గంటలకే బార్లను మూసేస్తున్నారు. రిటైల్ మద్యం దుకాణాలను రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలన్న ఉత్తర్వులు కూడా హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో అధికారికంగా మద్యం దుకాణాలు, బార్లు తెరిచి ఉంచే సమయాన్ని మరో గంట పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రెండు నెలల క్రితమే ఫైలును రూపొందించి ఆర్థిక శాఖతో పాటు ఎక్సైజ్ మంత్రి సంతకాలు చేసి సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపించారు. దీనిపై రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో చర్చించిన సీఎం... బార్ల నిర్వహణ సమయాన్ని మరో గంట పెంచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. రిటైల్ దుకాణాలకు పెంచితే సమస్యలు రాష్ట్రంలో మద్యం రిటైల్ దుకాణాలను రాత్రి 10 గంటల దాకా తెరిచి ఉంచవచ్చు. కానీ జిల్లాల్లో 9.30కే మూత పడుతున్నాయి. దీంతో మద్యం దుకాణాల సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పెంచాలన్న అంశంపై చర్చ జరిగింది. కానీ దీనిపై పోలీస్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాత్రి 10 గంటల వరకు దుకాణాలు ఉంటేనే రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో తాగి గొడవలకు పాల్పడుతున్నారని... 11 గంటల వరకు పెంచితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆ శాఖ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బార్లకు మాత్రమే సమయం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికలు ముగిశాక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
ఇక ఎంతకాలమైనా భూముల లీజు
-
ఇక ఎంతకాలమైనా భూముల లీజు
- 33 సంవత్సరాల గరిష్ట కాలపరిమితి ఎత్తివేత - ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఎన్నేళ్లకైనా లీజుకిచ్చేలా విధానంలో సవరణ - రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు - మినుము, పెసరకు అదనంగా రూ.వెయ్యి మద్దతు ధర - కరువు మండలాలపై పునఃపరిశీలన - ఇసుక, ఎర్రచందనం అక్రమరవాణా నిరోధానికి సీసీ కెమెరాలు - ప్రభుత్వ మద్యం షాపులూ ప్రైవేటు వ్యక్తులకే.. సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల లీజు విధానాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల లీజుకు సంబంధించి 33 సంవత్సరాల గరిష్ట కాల పరిమితిని ఎత్తివేయనుంది. ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు ఎలాంటి పరిమితి లేకుండా ఎంతకాలమైనా భూములను లీజుకు తీసుకునేందుకు (ఫ్రీ హోల్డింగ్) వీలుగా విధానాన్ని సవరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు సీఎం చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావులు మీడియాకు వెల్లడించారు. 33 సంవత్సరాల లీజు పరిమితి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా విధానాన్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఇతర నిర్ణయాలు.. ► నవంబర్ నెలలో కేజీ కందిపప్పును.. రూ.140 మార్కెట్ రేటులో మూడో వంతును సబ్సిడీగా ఇచ్చి సరఫరా చేయాలి. ► రూ.5,100 ఉన్న మినుము, రూ.5,850 పెసర పంటల మద్దతు ధరను మరో వెయ్యి రూపాయలు పెంచాలి. ► రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాల ఎంపికపై పునఃపరిశీలన జరపాలి. 13 జిల్లాల్లో ఇంకా ఎక్కడ వర్షాభావం ఉందో చూసి అవసరమైతే కరువు మండలాల సంఖ్యను పెంచి అక్కడ 150 రోజుల పని దినాలను కల్పించాలి. ► రెవెన్యూ శాఖ ఇప్పటివరకు జారీ చేస్తున్న 67 సర్టిఫికెట్లను గణనీయంగా త గ్గించాలి. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారికి ఇకపై ఆధార్, రేషన్ కార్డును బట్టి సర్టిఫికెట్లు మంజూరు చేయాలి. ► మార్చిలోపు సాధ్యమైనంతమంది ఉద్యోగులను రాజధానికి తీసుకురావాలి. జూన్‌లోపు అందరినీ తరలించాలి. మేథా టవర్స్‌లో కొన్ని కార్యాలయాలు, విజయవాడ బందరు రోడ్డులోని 1.5 ఎకరాల ఆర్ అండ్ బీ స్థలంలో నాలుగు నెలల్లో భవనాలు నిర్మించి కొన్ని శాఖలు తరలించాలి. ఉద్యోగులకు వసతిపై కేబినెట్ సబ్‌కమిటీ జూన్ లోపు నిర్ణయం తీసుకుంటుంది. ఏప్రిల్‌లోపు రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించాలి. ► ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించేందుకు శేషాచలం అడవుల్లో రూ.18 కోట్లతో 299 సీసీ కెమెరాల ఏర్పాటు. ► ఇసుక రీచ్‌లలో అక్రమాల నివారణకు 370 సీసీ కెమెరాల ఏర్పాటు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ఆర్డీఓ హైమావతిని ప్రత్యేక అధికారిగా నియమించాలి. ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలి. ► కార్తీకమాసం సందర్భంగా నవంబర్ 25న పది లక్షల మొక్కలు నాటాలి. ► 110 మున్సిపాల్టీల్లో అనధికారికంగా ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న అర్హులైన పేదలకు పట్టాలివ్వాలి. ► ఎక్సైజ్ విధానాన్ని మార్చాలి. ప్రభుత్వం నిర్వహించాలనుకున్న 438 షాపులకు కూడా వేలం నిర్వహించి ప్రైవేటు వారికి అప్పగించాలి. వారంలో వేలం నోటిఫికేషన్ విడుదలకు చర్యలు. 7వ తేదీలోగా కాపు కార్పొరేషన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఈ కమిషన్ సమగ్రంగా సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి సిఫారసులు ఇవ్వాలి. నవంబర్ ఏడో తేదీలోపు రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి. ► జలవనరుల యూనివర్సిటీ ఏర్పాటు గురించి సమగ్ర వివరాలను సేకరించాలి. వచ్చే సోమవారం దీనిపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి. ► 9, 10 తేదీల్లో హెచ్ఎంఎస్ ఫేజ్-2, గాలేరు-నగరి ప్రాజెక్టుల వద్ద సీఎం బస కార్యక్రమం. ► ఆత్మహత్య చేసుకున్న నాగార్జునవర్సిటీ విద్యార్థిని కుటుంబానికి మోరంపూడి శాటిలైట్ టౌన్షిప్లో రూ.500 గజాల స్థలం మంజూరు. ► మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు 183 ఎకరాల కేటాయింపు. ► చిత్తూరు రేణిగుంట సమీపంలోని కుకివాకం దగ్గర ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 1.5 ఎకరాలను ఎకరం రూ.80 లక్షల చొప్పున కేటాయింపు. -
మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
-
మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
హైదరాబాద్: తెలంగాణలో మద్యం షాపుల నిర్వహణ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. 2111 షాపులకు గాను 30987 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే మద్యం షాపుల కోసం వచ్చిన దరఖాస్తులు 30 శాతం పెరిగినట్టు చంద్రవదన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా తీస్తారని చెప్పారు. దరఖాస్తు ఫీజు కింద ప్రభుత్వానికి 155 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. కాగా తెలంగాణలో మరో 105 షాపులకు దరఖాస్తులు అందలేదని, వీటికోసం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రవదన్ తెలిపారు. -
మద్యం దుకాణాలను తరలించాలని ఆందోళన
చింతలపూడి (పశ్చిమగోదావరి) : విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సోమవారం చింతలపూడిలో ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజలు ముట్టడించారు. సిబ్బందిని వెలుపలికి పంపించి ఆందోళన కొనసాగిస్తున్నారు. -
తెలంగాణలో పెరుగనున్న బార్ల సంఖ్య
-
రెండు మద్యం షాపుల సీజ్
పొదలకూరు(నెల్లూరు): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు మద్యం షాపులు (గౌడ్ వైన్స్) సీజ్ చేశారు. రూ.లక్ష జరిమానా కూడా విధించినట్టు సీఐ శివకుమారి తెలిపారు. -
మద్యం మత్తులో ముంచి సంక్షేమం సాధిస్తారా?
ఆంధ్రప్రదేశ్‌లో జూలై 1 నుండి నూతన ఎక్సైజ్ పాలసీని అనుసరించి మ ద్యం షాపులు ప్రారంభ మవుతున్నాయి. ప్రతియే టా ప్రభుత్వాలు మద్యం తయారీ డిస్టలరీ కంపెనీ లు, మద్యం షాపులు, బా ర్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, పబ్‌లు, రిసార్టులను పెంచుతూ అనుమతులు ఇస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 నిబంధన ప్రకారం మద్యాన్ని నిషేధించాలి. ఈ నిబంధన అమలులో భాగంగానే ఎక్సైజ్‌శాఖను స్థాపించారు. కానీ ప్రస్తుతం ఎక్సైజ్‌శాఖ మద్యం అమ్మకాలను పెంచి ఆదాయాన్ని సమకూర్చే శాఖగా మారిపో యింది. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, ప్రభుత్వం నడవాలన్నా మ ద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానం అంటున్నారు. పేద ప్రజలారా! మీరు తాగితేనే మీ కుటుంబానికి బియ్యం, మీ ఊరికి రోడ్లు, మీ పిల్ల లకు స్కాలర్షిప్లు, మీరు తాగి చస్తేనే దేశానికి, రాష్ట్రానికి ఆదాయం అంటున్నారు పాలకులు. వాస్తవానికి మద్య నిషేధాన్ని అమలు చేస్తేనే ప్రజల దగ్గర కొంత డబ్బు మిగులుతుంది. అది పొ దుపు మొత్తాల ద్వారా, మార్కెట్ ద్వారా ప్రభుత్వం దగ్గరికే వస్తుంది. బడా పారిశ్రామికవేత్తలు, వర్తకు లు, సినీ తారలు ఎగ్గొట్టే పన్నులు వసూళ్లు చేస్తే, మంత్రులు చేసే స్కాములను నియంత్రిస్తే, మల్టీ నేషనల్ కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వడం మానేస్తే, విలువైన అటవీ సంపదను అతి తక్కువ ధరకు లీజు కు ఇవ్వటం నిలిపివేస్తే, స్విస్ బ్యాంకుల్లోని నల్లధ నాన్ని రప్పిస్తే... లక్షల కోట్ల ఆదాయం ఉంటుంది. ఇంకా చాలా రకాలుగా దేశ సంపద తరలిపోవడాన్ని అరికడితే మనమే ప్రపంచ బ్యాంకుకు అప్పు ఇవ్వ వచ్చు. ఇలాంటి చర్యలు మన పాలకులు చేయరు. ఎందుకంటే వీటన్నిటిలో వీరికి భాగం ఉంటుంది. బ్రిటిష్ వలసవాదులు మద్యపానాన్ని ఆదాయ వనరుగా మలిచారు. 1872లో మొదటిసారిగా దుకా ణాల వేలంపాటల పద్ధతిని ప్రవేశపెట్టారు. స్వాతం త్య్రోద్యమంలో మద్యనిషేధం కూడా ఒక నినాద మైంది. కానీ 1970 కల్లా దేశంలో అక్కడక్కడా ఉన్న మద్యనిషేధాన్ని కూడా ఎత్తివేశారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 1980 ప్రాంతంలో ఎన్.టి.ఆర్. వారుణి వాహిని పేరుతో సారాను విస్తృతంగా పారించాడు. అదే కాలంలో నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న కరీంనగర్, ఆది లాబాద్, నార్త్ తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మ కాలను నియంత్రించారు. చాలా మంది మద్యం వ్యాపారాన్ని మానుకున్నారు. దీంతో పోలీసు స్టేషన్లే సారా దుకాణాలయ్యాయి. 1991-94 మధ్య కాలం లో నెల్లూరు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రభంజనంలా ముందుకొచ్చింది. చీపురు, కారం పొడి, నిప్పు మూడు ప్రధాన ఆయుధాలతో ఉద్య మాన్ని మహిళలు ముందుండి నడిపారు. ప్రతిప క్షంలో ఉన్న ఎన్టీఆర్ తనకు ఓటేస్తే సారా నిషేధిస్తా నని హామీ ఇచ్చాడు. మహిళల ఓట్లతో గెలిచిన ఎన్టీఆర్ సంవత్సర కాలం మద్యనిషేధాన్ని అమ లు చేశాడు. 1995లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే సి గద్దెనెక్కిన చంద్రబాబు మద్యనిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడిందని, సంక్షేమ పథకాలు అమలుకు మద్యం అమ్మకాలు తప్పనిసరి అని విస్తృ తంగా ప్రచారం చేసి మద్యనిషేధాన్ని ఎత్తేశాడు. 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు బెల్టు షాపు లను రద్దు చేస్తానని హామీనిచ్చాడు. ప్రమాణ స్వీకా రం రోజు ఫైల్‌పై సంతకం కూడా చేశాడు. కానీ అదే నెలలో ప్రకటించిన ఎక్సైజ్ పాలసీలో రూ.10,000 కోట్ల ఆదాయాన్ని రూ.12,000 కోట్లకు పెంచాలని టార్గెట్ నిర్ణయించాడు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నేటివరకు తెలుగు సమాజం మద్యనిషేధా నికి అనుకూలంగా పోరాడుతూనే వచ్చింది. ప్రస్తు తం భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడుతున్న ప్రజలు.. జనతన సర్కార్లను ఏర్పాటు చేసుకున్న ప్రాంతాల్లో అక్కడి విప్లవ ప్రజాకమిటీలు సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బలమైన ఉద్యమాల ద్వారానే సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేసుకోగలుగుతాము. ఆ విధంగా ముందు తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందిద్దాం. -
మద్యంషాపుల లైసెన్స్ గడువు 3 నెలలు పొడిగింపు
- బార్ల లైసెన్సులు రెన్యూవల్ గడువు ఏడాది - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం ఖరారు కాని నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల (ఎ4 షాపులు) లైసెన్సుల గడువును మరో మూడు నెలలు పెంచుతూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో లైసెన్సు గడువు ముగుస్తున్నందున జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మద్యం దుకాణాల లైసెన్సులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాల యజమానులు హోలోగ్రామ్ లేబుల్స్‌ను రీడ్ చేసేందుకు అవసరమైన మిషనరీని కొనుగోలు చేయాలని సూచించారు. బార్లకు సంబంధించి 2బి బార్ల వార్షిక లైసెన్సు రెన్యూవల్ చేయించుకోవాలని సూచిస్తూ మరో జీవో జారీ చేశారు. 2015- 16 సంవత్సరం కోసం జులై ఒకటో తేదీ నుంచి లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోవాలని పేర్కొన్నారు. నాలుగు స్లాబుల్లో ఈ లైసెన్సులు ఉంటాయని, 50వేల జనాభా లోపు మునిసిపాలిటీ/ నగర పంచాయితీల్లో రూ. 25 లక్షలు, 50వేల పై నుంచి ఐదు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 35 లక్షలు, 20 ల క్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రూ. 38 లక్షలు , 20లక్షల జనాభా పైబడిన నగరాల్లో రూ. 35 లక్షలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా ఏపీ ఎక్సైజ్ రూల్స్- 2012ను తెలంగాణకు వర్తింజేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
ఇళ్ల మధ్య మద్యం షాపులు వద్దని ధర్నా
-
ఇళ్ల మధ్య మద్యం షాపులు వద్దని ధర్నా
కృష్ణా (కంచికచర్ల) : ఇళ్ల మధ్య మద్యం షాపులు వద్దని కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం గుజ్జూరు గ్రామ మహిళలు సోమవారం కంచికచర్ల ఎక్సైజ్‌పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఇటీవలే మద్యం దుకాణాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన విషయం తెలుసుకున్న మహిళలు వెంటనే వాటిని తొలగించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ, సీపీఎంలు మద్దతు తెలిపాయి. ఈ ధర్నాలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. -
ఏపీ సర్కార్ నిర్వహణలో మద్యం షాపులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేందకు మొగ్గు చూపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 రోజుల్లో కొత్త మద్యం పాలసీని ఖరారు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఏపీలో మద్యం షాపులకు నిర్వహణకు 15 నుంచి 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు అవసరమవుతారని అంచనా వేశారు. మద్యం అమ్మకానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంట్రాక్టు ఉద్యోగులను నియమించాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తోంది. -
’మద్యం ఆదాయం ’మత్తులా చంద్రబాబుని ఆకర్షిస్తోంది
-
తెరచుకోని మద్యం డిపోలు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ అటాచ్మెంట్ నోటీసులతో మూతపడ్డ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు మద్యం డిపోలు రెండో రోజూ తెరుచుకోలేదు. మంగళవారం ఎక్సైజ్ శాఖ పలు కారణాలతో హైకోర్టు లో లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేయలేదు. రాత్రి వరకు తెలంగాణ బ్రూవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంతోష్‌రెడ్డి, ఇతర అధికారులు కోర్టులోనే ఉన్నా ఫలితం లేకుండాపోయింది. బుధవారం ఎట్టిపరిస్థితుల్లో పిటిషన్ దాఖలు చేసి మద్యం డిపోలను తెరిపించాలనే ఆలోచనలో అధికారులున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మినహా మిగతా 8 జిల్లాల్లో మద్యం డిపోల్లో యథాతథంగా మద్యం అమ్మకాలు సాగాయి. రెండు జిల్లాల్లో మద్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఎక్సైజ్ శాఖకు రెండు రోజుల్లో రావల సిన సుమారు రూ.30 కోట్ల రెవెన్యూ రాకుండా పోయింది. కాగా ఆదాయపు పన్ను శాఖ 2012-13 బకాయిలకు సంబంధించే అటాచ్మెంట్ నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీబీసీఎల్ (ఉమ్మడి రాష్ట్రంలో) ఐటీ శాఖకు సుమారు రూ. 3 వేల కోట్లు బకాయి పడింది. వీటి వసూలుకే నోటీసులు ఇవ్వడంతో హైదరాబాద్‌లోని రెండు డిపోలు, రంగారెడ్డి జిల్లాలోని 4 డిపోలను అధికారులు మూసివేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. ఇక 2006-11 వరకు రావాల్సిన రూ. 8 వేల కోట్లకు సంబంధించి కోర్టులో వివాదం నడుస్తోంది. గ్రేటర్లో నిండుకున్న మద్యం దుకాణాలు మద్యం డిపోల నుంచి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 160 మద్యం దుకాణాలు, 225 బార్లలో సరుకు నిండుకుంది. సోమవారం సాయంత్రం నుంచే రిటైల్ దుకాణాల్లో కొరత కన్పించింది. డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఎంఆర్పీ ధరలను పట్టించుకోకుండా ఎక్కువ ధరకు అమ్మకాలు సాగాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచే అనేక దుకాణాల్లో స్టాక్ నిండుకోవడంతో కేవలం బీర్లను మాత్రమే విక్రయించారు. పలు మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే పక్క జిల్లాలు మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ నుంచి స్టాక్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మంత్రి టి.పద్మారావు గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, కమిషనర్ అహ్మద్ నదీంలు రోజంతా పరిస్థితిని సమీక్షించారు. కాగా, తాము ఏడాదికి రూ.90 లక్షలు లెసైన్సు ఫీజు చెల్లించి మద్యం వ్యాపారం చేస్తున్నా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.వె ంకటేశ్వరరావు చెప్పారు. -
ప్రతి బాటిల్‌కూ.. పక్కా లెక్క!
* మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు.. కంప్యూటర్లు * అక్రమ వ్యాపారానికి ఎక్సైజ్ ముకుతాడు * ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలుకు అధికారుల పట్టు * ఈ నెల చివరి వారంలో అమలుకు సన్నాహాలు * దీనిపై ఇప్పటికే ఓసారి కోర్టుకెళ్లిన వ్యాపారులు * ఈసారైనా అమలవుతుందా? సాక్షి, హైదరాబాద్: డిస్టిలరీల్లో మద్యం బాటిల్ తయారీ నుంచి అమ్మకం వరకు అన్ని దశల్లోనూ పర్యవేక్షణకు ప్రభుత్వం ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమల్లోకి తీసుకురానుంది. ఫలితంగా మద్యం అక్రమ అమ్మకాలకు చెక్ పెట్టవచ్చని, ప్రతి బాటిల్ మద్యం అమ్మకాలకు పక్కా లెక్కలు తెప్పించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాదే ఈ ఆన్లైన్ విధానాన్ని చేపట్టాలని మద్యం వ్యాపారులకు సూచించగా, వారు కోర్టులను ఆశ్రయించడంతో ఈ విధానం వాయిదా పడింది. మరోపక్క, ఆన్లైన్ అమ్మకాలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించడంలోనూ జాప్యం జరగడంతో ఈ విధానం పట్టాలెక్కలేదు. తాజాగా.. ఇప్పుడు మద్యం షాపులపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, కంప్యూటర్లు ఏర్పాటు చేయించి మద్యం అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టేందుకు సర్కారు రంగంలోకి దిగింది. జనవరి చివరి వారం నుంచి కచ్చితంగా ప్రతి దుకాణంలోనూ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు కంప్యూటర్‌కు నెట్ సౌకర్యం, టూ డీ స్కానర్ తదితర పరికరాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తైవాన్ నుంచి ఈ పరికరాలను తెప్పించి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానం అమల్లోకి తెచ్చేందుకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానం అమల్లోకి రావడం వల్ల మద్యం దుకాణాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఉన్నతాధికారులు తమ కార్యాలయాల నుంచే పర్యవేక్షించే అవకాశం లభించనుంది. అడెసివ్ లేబుళ్లను స్కాన్ చేసి రసీదును మద్యం బాటిల్ కొనుగోలు చేసిన వారికి ఇవ్వాలి. దీంతో ఎన్డీపీ(నాన్ డ్యూటీ పెయిడ్) లిక్కర్ అమ్మకాలు సాగించే వీలుండదు. మద్యం బాటిళ్లలో డైల్యూషన్‌కు అవకాశం ఉండదు. ఫలితంగా మద్యం అమ్మకాల్లో పారదర్శకత ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే, ఈ విధానంపై మద్యం సిండికేట్ల లాబీయింగ్, వ్యూహం ఎలా ఉంటుందోనని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడేం జరుగుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా రూ.700 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ) కంటే అధిక ధరకు మద్యాన్ని అమ్ముతున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా ఈ అక్రమ లావాదేవీల విలువ రూ.300 కోట్లకు పైనే ఉంటోందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సిండికేట్లకు ముకుతాడు వేసి, మద్యం అక్రమాలకు తెరదించాలని నిర్ణయించింది. తెరపైకి.. ట్రాక్ అండ్ ట్రేస్ మద్యం అక్రమాలకు తెరదించే క్రమంలో అధికారులు ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని అమలు చే సేందుకు సిద్ధమయ్యారు. ఈ విధానంలో ప్రతి దుకాణంలోనూ సీసీ కెమెరాలు, కంప్యూటర్, స్కానర్ తదితర పరికరాలను ఏర్పాటు చేయాలి. దీనికిగాను రూ. లక్ష ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత ఎక్సైజ్ ఏడాది మరో 6 మాసాల్లో ముగుస్తుండడం, వచ్చే ఏడాది నుంచి తమిళనాడు, కేరళ తరహా మద్యం విధానాలను అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కేవలం ఆరు మాసాల తంతుకు రూ. లక్ష ఖర్చు చేయబోమని దుకాణ దారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే, ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిన ఎక్సైజ్ శాఖ.. నెలవారీ చెల్లింపుల(ఈఎంఐ) కింద నెలకు రూ. 4 వేలు చెల్లించే పద్ధతిలో ఆయా పరికరాలను దుకాణాలకు అందించేందుకు సిద్ధమైంది. అయితే, ఇదింకా కార్యరూపం దాల్చలేదు. ఈ విధానం అమల్లోకి వచ్చి.. మద్యం అక్రమాలకు కళ్లెం పడడం ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
‘చుక్క’కు బిల్లు ?
సాక్షి, గుంటూరు: జిల్లాలోని మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానం అమలవుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని మద్యం దుకాణాల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలని మూడు నెలల కిందటే ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మద్యం దుకాణంలో బార్‌కోడింగ్ మిషన్ ఏర్పాటు చేసి అమ్మ కాలకు కంప్యూటర్ బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. దీని వల్ల ఎమ్మార్పీ ధరలకు అమ్మకాలు జరగడంతోపాటు, ఎంత వ్యాపారం జరిగిందనేది పక్కాగా తెలుస్తోంది. బె ల్టుషాపుల్లో మద్యం సీసాలు పట్టుబడితే అవి ఏ దుకాణం నుంచి వచ్చాయనేది కచ్చితంగా తెలిసిపోతుంది. మద్యం దుకాణాల నిర్వాహకులు బార్‌కోడింగ్ విధానం అమలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు గడుస్తున్నా తమ ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి బార్‌కోడింగ్ విధానం అమలు కానున్న నేపథ్యంలో గుంటూరులో కూడా దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. గుంటూరు ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో ఇటీవల జిల్లా మద్యం దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. బార్‌కోడింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మద్య కోల్డ్ వార్ మొదలైందని చెప్పవచ్చు. ఎమ్మార్పీ ధరలకు అమ్మాల్సివస్తుందనేనా..? బార్‌కోడింగ్ విధానాన్ని అమలుచేస్తే అధిక ధరలు అమ్మలేమని, ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని మద్యం వ్యాపారులు మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఐదు నెలల కాలంలో అధిక ధరలకు అమ్మకపోతే నష్టాలు చవి చూడాల్సి వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఒకపక్క బెల్టుషాపులపై ఆంక్షలు, మరోపక్క బార్‌కోడింగ్ అంటుండటంతో మద్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంత ఖర్చు చేసి కొనలేం... బార్‌కోడింగ్ విధానంపై మద్యం వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ దుకాణాల లెసైన్స్ గడువులో సగం కాలం పూర్తయిందని, మిగిలిన ఐదు నెలలకు ఇంత ఖర్చు చేసి బార్‌కోడింగ్ మి షన్లు కొనలేమని చెబుతున్నారు. మొదట్లో కంప్యూటర్, మెషిన్లు తాము కొనుక్కుంటే సాఫ్ట్వేర్ ఇస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్పారని, ఇప్పుడు మెషిన్ కూడా తాము చెప్పినచోటే కొనుగోలు చేయాలంటూ లింకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40 వేలు అయ్యే మెషిన్‌ను రూ. 90 వేలు పెట్టి కొనమంటే ఎలాగంటూ వాపోతున్నారు. మరోవైపు వచ్చే ఏడాది రాష్ట్రంలో తమిళనాడు మాదిరిగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరపనుందంటూ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ ఐదారు నెలలకు అంత ఖర్చు చేయాల్సిన అవసరమేమిటంటూ వారు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అద్దెకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం... బార్ కోడింగ్ మెషిన్లను ఇప్పటికే అన్ని ఐఎమ్ఎల్ డిపోల్లో ఇన్స్టాల్ చేశాం. జిల్లాలో ఎక్కువ శాతం మద్యం దుకాణదారులు బార్‌కోడింగ్ మెషిన్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కొనుగోలు చేయ లేని వారికి నెలకు రూ. 5వేల చొప్పున అద్దెకు ఇప్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తాం. లేనిపక్షంలో ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. - కుళ్లాయప్ప, ఎక్సైజ్ శాఖ డీసీ -
'లిక్కర్ షాపులను హైవేల నుంచి తొలగించండి'
కొచ్చి:జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను వేరే చోటుకి తరలించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులు హైవేలపై ఉండటం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయనే ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్)ను స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైవే మార్గంలో మద్యం షాపులు ఉండటం వల్ల వాహన డ్రైవర్లు సులువుగా మద్యాన్ని సేవించి ప్రమాదాలు కారణమతున్నారని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 169 లిక్కర్ షాపులను వేరే చోటకి తరలించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం రెండు వారాల్లో నివేదిక అందజేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కోల్డ్ వార్ !
సాక్షి, గుంటూరు : మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలనే ప్రభుత్వం ఆదేశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య కోల్డ్ వార్‌కు దారితీసింది. మూడు నెలల కిందట జారీ చేసిన ఆదేశాలను ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణ నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై ఆ శాఖ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు గుంటూరులో శుక్రవారం జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మిగిలిన జిల్లాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మద్యం దుకాణంలో బార్‌కోడింగ్ మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల అమ్మిన ప్రతి సీసాకు కంప్యూటర్ బిల్లు ఇవ్వాలి. తద్వారా ఎమ్మార్పీ ధరలకు అమ్మకాలు జరగడంతోపాటు, ఎంత వ్యాపారం జరిగిందనేది ఎక్సైజ్ శాఖకు పక్కాగా తెలిసిపోతోంది. అంతేకాక బె ల్టుషాపుల్లో మద్యం సీసాలు పట్టుబడితే అవి ఏ దుకాణం నుంచి వచ్చాయనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ నెల 15లోపు బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. దీనిపై మద్యం వ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేసి సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. వ్యాపారానికి లెసైన్స్ గడువు ఇంకా ఐదు నెలల మాత్రమే ఉన్న సమయంలో రూ. 90 వేలు ఖర్చు చేసి బార్‌కోడింగ్ మిషన్ కొనలేమని నిర్వాహకులు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 15లోగా ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఎక్సైజ్ అధికారులు కరాఖండీగా చెప్పడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్‌కు తెరలేచింది. ఎక్సైజ్ కమిషనర్, మంత్రిని కలిసి విన్నవిస్తాం... మద్యం వ్యాపారులు బార్‌కోడింగ్ విధానంపై మద్యం వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. మిగిలిన ఉన్న ఐదు నెలల కాలానికి మిషన్లు కొనలేమని చెబుతున్నారు. మొదట్లో కంప్యూటర్, మిషన్లు కొనుగోలు చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇస్తామని చెప్పిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఇప్పుడు మిషన్ కూడా తాము చెప్పినచోటే కొనుగోలు చేయాలంటూ మెలిక పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40 వేలు అయ్యే మిషన్‌ను రూ. 90 వేలు పెట్టి కొనమంటే ఎలాగంటూ వాపోతున్నారు. తమ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎక్సైజ్ కమిషనర్, మంత్రులకు తమ సమస్యను విన్నవించుకుంటామని అంటున్నారు. ఎమ్మార్పీ ధరలకు అమ్మాల్సి వస్తుందనేనా..? బార్‌కోడింగ్ విధానాన్ని అమలు చేస్తే ఇప్పటి మాదిరిగా అధిక ధరలు అమ్మలేమని, ఎమ్మార్పీ ధరలకు అమ్మాల్సి వస్తుందని మద్యం వ్యాపారులు మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చివరి ఐదు నెలల కాలంలో అధిక ధరలకు అమ్మకపోతే నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఓపక్క బెల్టుషాపులపై ఆంక్షలు, మరో వైపు బార్‌కోడింగ్ విధానంతో మద్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారపార్టీకి చెందిన మద్యం సిండికేట్లు ఈ విషయాన్ని మంత్రుల వద్ద పెట్టి ఈ విధానం అమలు కాకుండా చూడాలని కోరుతున్నట్టు సమాచారం. -
‘ఫుల్లు’గా తాగిద్దాం.. ‘లోటు’ పూరిద్దాం
* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం * ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 44 లక్షల లీటర్ల మద్యం ఉత్పత్తికి ఆదేశం * ఉన్న డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యం పెంపు.. కొత్త డిస్ట్టిలరీల ఏర్పాటు * బీరు ఉత్పత్తి పెంపుకూ ఆదేశాలు.. బీరు ధరలు పెంచాలని నిర్ణయం * బెల్టు షాపుల స్థానంలో మద్యం దుకాణాలకు అనుబంధ దుకాణాలు * ఏపీలోకి వచ్చే సరుకులపై చెక్‌పోస్టుల వద్ద 12% ప్రవేశ పన్ను వడ్డన * స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఫీజు నాలుగు నుంచి ఐదు శాతానికి పెంపు * ఆర్థిక, ఆదాయ వనరుల శాఖల అధికారులతో సమీక్షలో నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను ఇక మద్యం వరద ముంచెత్తనుంది. రాష్ట్రంలో మద్యానికి ‘లోటు’ అనేది లేకుండా పుష్కలంగా ప్రవహింపజేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రసుత్తం రాష్ట్రంలో 44 లక్షల లీటర్ల మద్యం కొరత ఉందని.. దీన్ని భర్తీ చేసేందుకు మద్యం ఉత్పత్తిని భారీగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. అందుకోసం.. ప్రస్తుతమున్న మద్యం డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. కొత్తగా డిస్టలరీల ఏర్పాటుకు అనుమతించాలనీ నిర్ణయించింది. ఇం దుకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశానికి పంపించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. బీర్లు కూడా వినియోగానికి ఉత్పత్తికి మధ్య ప్రతి మూడు నెలలకు పది లక్షల లీటర్ల కొరత ఉందని.. దీన్ని కూడా అధిగమించడానికి ఉత్పత్తిని కూడా పెంచేందుకు వీలుగా ప్రతిపాదనలను పంపాల్సింగా నిర్దేశించారు. మద్యం ప్రియులకు మద్యాన్ని మరింత చేరువ చేసేం దుకు బెల్టు షాపుల స్థానంలో ఊరూరా మద్యం దుకాణాలకు అనుబంధ దుకాణాల ఏర్పాటును అధికారికంగానే అనుమతించాలనీ నిర్ణయిం చారు. రాష్ట్రం విడిపోయాక రెండు త్రైమాసికాల్లో వచ్చిన ఆదాయ వివరాలపై సీఎం మంగళవారం సచివాలయంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక, ఆదాయ వనరుల శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మద్యం, బీరు ఉత్పత్తిని పెంచేందుకు అనుబంధ దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలను చంద్రబాబు జారీచేశారు. బీర్ల ధరలను పెంచే ప్రతిపాదనలను కూడా ఫైలు రూపంలో పంపించాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. సరకులపై ఇక ప్రవేశ పన్నుల వసూలు.. రాష్ట్రంలోకి సరఫరా చేసే సరుకులపై ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్టుల వద్ద ప్రవేశ పన్ను వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సిమెంట్, స్టీల్ వంటి సరుకులు ఏపీలో రవాణా అయితే సీఎస్టీ మాత్రమే చెల్లిస్తున్నారని, ఏపీలో ఉత్పత్తి అయ్యే సరుకులు విక్రయం సమయంలో 14.5 శాతం వ్యాట్ విధిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి సరుకులపై చెక్‌పోస్టుల వద్ద 12 శాతం వరకు ప్రవేశ పన్ను విధించాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ల ఫీజు 5 శాతానికి పెంపు.. పొరుగు రాష్ట్రాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఫీజు ఐదు శాతం ఉన్నందున రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెంచాలని నిర్ణయించారు. అలాగే భూ కానుకలు, సెటిల్మెంట్ డీడ్లపై ఫీజును రెండు శాతానికి పెంచాలని నిర్ణయించారు. చెక్‌పోస్టుల్లో తనిఖీకి త్వరలో ఆర్డినెన్స్.. చెక్ పోస్టుల్లో పన్నుల లీకేజీని అరికట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు మహారాష్ట్రలో అనుసరిస్తున్న ఎకనమిక్ ఇంటిలిజెన్స్ యూనిట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనిపై 30వ తేదీన జరిగే మంత్రివర్గంలో ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని నిర్ణయించారు. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్.. రాష్ట్రంలో తిరిగే వాహనాలనూ తనిఖీ చేయడానికి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రవాణా అధికారులను సీఎం ఆదేశించారు. వాహనాలన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయకపోవడం పట్ల రవాణా శాఖ అధికారులపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘అధికారిక’ బెల్ట్ షాపులు పెట్టొద్దు! వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ మద్యం దుకాణాల సామర్థ్యం పెంపు పేరుతో రాష్ట్రంలో అధికారిక బెల్టు షాపులు తెరిచే ప్రతి పాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాల ని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. హర్యానా రాష్ట్రం మోడల్ పేరుతో ఇప్పుడున్న ప్రతి దుకాణానికీ అనుబంధంగా మరో మూడు దుకాణాలను మం జూరు చేయాలనే కొత్తమాటను చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తేవడం శోచనీయమని ఆమె అన్నారు. మంగళవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మద్యం బెల్ట్ షాపులన్నింటినీ రద్దు చేస్తానని చంద్రబాబు ప్రతి సభలోనూ నొక్కి చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఖజానా నింపుకొనేం దుకు మద్యం షాపుల సామర్థ్యం పెంపు పేరు తో అధికారికంగా బెల్ట్ షాపులను నెలకొల్పడానికి సంకల్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం లో ప్రస్తుతం 4,600 మద్యం షాపులు ఉన్నాయని, ఒక్కొక్కదానికి అదనంగా మూడు షాపులు అనుమతినివ్వడం అంటే ఆ సంఖ్య ను 13,800కు పెంచడమేనని పద్మ అన్నారు. కొత్తగా డిస్టిలరీలను స్థాపించడంతో పాటుగా గ్రామాల వరకూ మద్యాన్ని తీసుకెళ్లడం వంటి చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద న్నారు. 1100 మాత్రమే ఉన్న బెల్ట్ షాపులను తొలి సంతకంతో రద్దు చేశామని చెప్పి ఆ సం ఖ్యను 13 రెట్లకు పెంచడం ఏ మాత్రం సరైన విధానం కాదని ఆమె దుయ్యబట్టారు. -
ఏపీలో మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నడుపుతుంది: బాబు
న్యూఢిల్లీ: రుణమాఫీ లెక్కల్ని తేల్చమని బ్యాంకులను కోరామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాకు తెలిపారు. ఢిల్లీ టూర్ ముగించుకున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. లక్షన్నర రూపాయల వరకూ రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరలో ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మోడీని కోరానని బాబు తెలిపారు. వచ్చే నవంబర్ చివరివారంలో జపాన్ పర్యటనకు వెళ్తున్నానని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ను కోరబోతున్నానని చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామని ఓ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు. అక్టోబరు మాసం నుంచి ఆంధ్రాలో రోజంతా కరెంట్ ఇస్తామని, ఆంధ్రలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతుందని చంద్రబాబు తెలిపారు. -
అసెంబ్లీలో ఎలుగెత్తిన ప్రజాగళం
సాక్షి , ఒంగోలు : ‘అధ్యక్షా.. జాతీయ రహదారులపై కనీసం 100 కిలోమీటర్లకైనా విశ్రాంతి ప్లాట్‌ఫాంలు లేవండీ.. కానీ, ప్రతీ కిలోమీటరుకు మద్యం దుకాణాలు (వైన్స్, బార్అండ్ రెస్టారెంట్) ఉండటం సిగ్గుచేటుగా భావించాలి అధ్యక్షా.. గుంటూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతోన్న ఐదోనంబర్ జాతీయ రహదారి, అటు అద్దంకి - నార్కెట్‌పల్లి హైవేల పరిస్థితి చూస్తే...రక్తంతో తడవని రోజంటూ ఉండదు.’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ శాసనసభలో గళం విప్పారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ రహదారుల్లో సగటున రోజుకు 41 మంది ప్రమాదాలబారినపడి చనిపోతున్నారని చెప్పారు. తుపాను విపత్తుల నేపథ్యంలో వాటిల్లే ప్రాణనష్టం కన్నా రోడ్డు ప్రమాదాల్లో గాల్లో కలుస్తోన్న ప్రాణాలే అధికమంటూ వివరించారు. దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల గణాంకాల్ని తీసుకుంటే మనరాష్ట్రంలో 8.9 శాతం ప్రాణనష్టం జరుగుతుందన్నారు. ఏటా రోడ్డుభద్రతా వారోత్సవాలు జరుపుతున్నా.. ప్రమాదాల నివారణలో ప్రభుత్వం వెనుకంజలో ఉండటానికి గల కారణాలపై సంబంధిత మంత్రి దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. వాహనాల డ్రైవర్ల లెసైన్స్‌ల జారీ ప్రక్రియను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ఏజెంట్ల వ్యవస్థకు మంగ ళం పాడి.. రోడ్‌ట్రాన్స్‌పోర్టు అధికారులు క్షేత్రస్థాయిలోకెళ్లి విధులు నిర్వర్తిస్తే మంచి ఫలితాలుంటాయని చెప్పారు. రోడ్‌ట్యాక్స్‌ను రోడ్ల మరమ్మతులు, రక్షణ ఏర్పాట్లకే వెచ్చించాలని సూచించారు. ‘హైవే’ పక్కనుండే గ్రామాలకు బ్రిడ్జి సౌకర్యమేదీ..? ‘ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని దొడ్డవరప్పాడు గ్రామం ప్రజలు ఐదో నంబర్ జాతీయరహదారిని దాటాలంటే నానా ప్రయాసలు పడుతున్నారు. రోడ్డుకు తూర్పు వైపు నుంచి పడమరకు మహిళలు, చిన్నారులు వెళ్లాలంటే అతివేగంతో వచ్చే వాహనాలతో ప్రమాదాలు జరుగుతాయని భయపడుతున్నారంటూ’ సంతనూతలపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తెచ్చారు. దొడ్డవరప్పాడు వద్ద హైలెవల్ బ్రిడ్జి కానీ అండర్బ్రిడ్జినైనా నిర్మించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదాల్లో ఆంధ్రరాష్ట్రం ఐదోస్థానంలో ఉండగా, మరణాలసంఖ్య ప్రతేటా పెరుగుతూనే ఉందన్నారు. ప్రతిఏడాది నమోదవుతోన్న రోడ్డుప్రమాదాల్లో 29 నుంచి 30 శాతం ఆటోరిక్షా ప్రమాదాలే చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 5,790 గ్రామాల(30శాతం)కు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం విచారకరమన్నారు. ప్రధానంగా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అంశాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండిషన్, రోడ్డు పరిస్థితులతో పాటు ట్రాఫిక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు అధిక జరిమానాతో పాటు కఠినచర్యలు చేపట్టడం, ఫాస్ట్‌ట్రాక్, మొబైల్కోర్టులు ఏర్పాటుచేయడం, అధునాతన ఫిట్నెస్ టెస్ట్ పరికరాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి విడుదలయ్యే రోడ్‌సేఫ్టీ ఫండ్స్‌ను కూడా సద్వినియోగం చేయాలన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రోడ్డుభద్రత చర్యలకు ఏమేరకు నిధులు కేటాయించారనేది తెలియపరచాలని ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రతిపక్ష సభ్యుల వద్ద రోడ్డుప్రమాదాలపై చాలా సమాచారం ఉన్నట్లుందని.. ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలన్నీ నిజమేనని అంగీకరించారు. రోడ్డుప్రమాదాల నియంత్రణపై దృష్టిపెడతామన్నారు. ఓవర్ లోడింగ్ ఆటోలపై చర్యలేవీ...? కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ నిబంధనలప్రకారం హైవేలపై రాకూడని ఆటోరిక్షాలు పాఠశాలల పిల్లల్ని ఎక్కించుకుని యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. చిన్నారులు, కూలీలు, కార్మికులతో ఓవర్లోడింగ్ ఆటోలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. దీనిపై రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సమాధానమిస్తూ ఆర్టీసీ ప్రాంగణాల వద్ద ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఇద్దరేసి చొప్పున మోటార్ ట్రాన్స్‌పోర్టు ఇన్స్పెక్టర్లను నియమిస్తామన్నారు. హైవే ప్రమాదాల నియంత్రణకు సైతం ట్రాన్స్‌పోర్టు కార్యాలయ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని సమాధానమిచ్చారు. -
అధికారులకు మామూళ్ల కిక్కు..ప్రజలకేదీ దిక్కు!
శ్రీకాకుళం క్రైం:ఈ ఫొటోలు చూశారా?.. రెండూ మద్యం దుకాణాలకు సంబంధించినవే. నిబంధనలకు విరుద్ధంగా, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూనో.. తప్పుదోవ పట్టించో ఏర్పాటు చేసినవే. వీటిలో ఒక జనావాస ప్రాంతాల మధ్యలో ఉంటే.. ఇంకొకటి 30 పడకల ప్రైవేట్ ఆస్పత్రి పక్కనే ఉంది. .. బడి, గుడి, ఆస్పత్రి, జనావాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు నిషిద్ధం. దుకాణాల ఏర్పాటు సమయంలోనే ఎక్సైజ్ అధికారులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే కొందరు ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో పడి.. దుకాణదారులకు లబ్ధి చేకూర్చేందుకు తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులనే తప్పుదోవ పట్టిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రెండు, సోంపేటలో పలు షాపుల ఏర్పాటులో జరిగిన తంతే దీనికి నిదర్శనం. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు జూన్ నెలలోనే పూర్తి అయ్యింది. మొత్తం 232 షాపులకుగాను ఐదు మినహా మిగతావన్నీ ఏర్పాటయ్యాయి. అయితే షాపుల ఏర్పాటులో పాటించాల్సిన నిబంధనలను కొందరు తుంగలో తొక్కారు. దీనిపై ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోయింది. కొంత మంది ఎక్సైజ్ అధికారులు ముడుపులు స్వీకరించి షాపుల నిర్వాహకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 30 పడకల ఆస్పత్రి పక్కనే.. శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ సమీపంలో ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే 30 పడకల ద్వారకామాయి ప్రైవేటు ఆస్పత్రి ఉంది. 30 పడకల ప్రైవేట్ ఆస్పత్రులకు వంద మీటర్ల దూరంలోపూ మద్యం షాపుల ఏర్పాటుకు నిబంధనలు అనుమతించవు. అయితే ఓ ఎక్సైజ్ అధికారి ద్వారకామాయి ఆస్పత్రి అసలు 30 పడకల ఆస్పత్రే కాదని తప్పుడు రికార్డులు సృష్టించి, దాని పక్కనే షాపు ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. కానీ అది 30 పడకల ఆస్పత్రేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. దీనిపై కొందరు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా, సాక్షాత్తు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. కలెక్టరు ఆదేశాలు బేఖాతరు కాగా శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంతం పూర్తిగా జనావాసాలతో నిండి ఉంది. అయినా ఇక్కడ మద్యం షాపు ఏర్పాటుకు సదరు ఎక్సైజ్ అధికారి అనుమతి ఇచ్చేశారు. మద్యం దుకాణం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకోలు కూడా చేసి గ్రీవెన్స్ సెల్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. రాత్రివేళల్లో మందుబాబుల ఆగడాలతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. పగటి వేళల్లో కూడా విద్యార్థినులను మద్యం సేవించిన ఆకతాయిలు వేధిస్తున్నారని, మద్యం సేవించిన కొందరు తనపై దాడికి పాల్పడ్డారని ఓ రిటైర్డ్ తహశీల్దార్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆ దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న దుకాణాలను వేరే చోటుకు మార్పించే అధికారం కలెక్టర్‌కు ఉంది. ఆయన ఆదేశాలనే ధిక్కరిస్తూ ఎక్సైజ్ అధికారులు రోజులు గడుస్తున్నా దుకాణం తరలింపునకు చర్యలు తీసుకోవడం లేదు. సోంపేటలో టాస్క్‌ఫోర్స్ విచారణ మరోవైపు సోంపేట పరిధిలో అడ్డదారిలో పలు దుకాణాలు కేటాయించారంటూ స్థానికులు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ వ్యవహారంపై రహస్య విచారణ సాగిస్తున్నారు. అసలు ఏయే దుకాణాలకు సింగల్ టెండర్లు పడ్డాయి, ఏవి బినామీల పేరుతో నడుస్తున్నాయన్నదానిపై విచారణ సాగిస్తున్నారు. రెండు రోజుల కిందట కాశీబుగ్గలోని ఓ హోటల్లో ఫిర్యాదుదారుల నుంచి ర హస్యంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది. శ్రీకాకుళంలోని దుకాణాల కేటాయింపుపైన కూడా రెండు మూడు రోజుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారణ జరుపనున్నట్టు ఎక్సైజ్ వర్గాలే చెబుతున్నాయి. మెమోలు జారీ చేశాం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన దుకాణాలను తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. శ్రీకాకుళం పట్టణంలో అంబేద్కర్ జంక్షన్, జిల్లా పరిషత్‌ల వద్ద ఉన్న మద్యం దుకాణాలను ఖాళీ చేయించాలని ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించాం. ఈ రెండింటికి సంబంధించి మెమోలు కూడా జారీ చేశాం. త్వరలోనే ఇవి అమలయ్యేలా చర్యలు చేపడతాం. -నాగలక్ష్మి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
మద్యం దుకాణాల్లోనూ ఉల్లిపాయలు
న్యూఢిల్లీ :నగరంలోని మద్యం దుకాణాల్లోనూ ఇక ఉల్లిపాయలు, ఆలుగడ్డలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర ధరలను స్థిరీకరించడం కోసం ఉల్లిపాయలు, ఆలుగడ్డలను మద్యం దుకాణాల్లో విక్రయించడానికి సంసిద్ధంగా ఉంది. ఢిల్లీ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(డీఎస్‌ఐఐడీసీ) చేసిన ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఢిల్లీవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై వినయ్‌కుమార్ అనే ఓ వ్యాపారవేత్త మాట్లాడుతూ ‘నేను రోజూ బజారుకు వెళ్లే ముందు ఆలు-ఉల్లిపాయలు అవసరమా అని ఇంట్లో అడుగుతా. ఇప్పుడు మద్యం దుకాణాల్లో ఆలుగడ్డల్ని అందుబాటులో ఉంచడం సంతోషంగా ఉంది. కూరగాయల మార్కె ట్లు రద్దీగా ఉంటాయి. దీంతో ఇబ్బంది కలిగేది. ఇప్పుడు క్యూలో నిలబడాల్సి పనిలేకుండా పోయింది’ అని అన్నాడు. ఇంజినీర్ రాహుల్‌సింగ్ అనే మరో నగరవాసి మాట్లాడుతూ ‘ ఇంటికి మద్యం తెచ్చుకోవడానికి భార్య అనుమతించదు. ఈ పద్ధతి అమలు చేస్తే.. మద్యం లేదా బీరు ఎంచక్కా ఇంటికి తెచ్చుకోవచ్చు. దీని అమలు చేస్తే మంచిదే’నని అన్నాడు. న్యాయవాది ఆశిష్ మాట్లాడుతూ ‘ఢిల్లీవాసులకు మంచి రోజులు వస్తున్నాయి. మద్యం దుకాణాల్లో ఉల్లిపాయలను విక్రయించే విధానాన్ని ప్రవేశపెడితే సౌకర్యంగా ఉంటుంది. ప్రతిసారి నేనే కూరగాయలు తీసుకొస్తాను. ఇప్పుడు కూరగాయలతోపాటు మద్యం కూడా తెచ్చుకోవచ్చు’ అని అన్నాడు. సుష్మ అనే గృహిణి మాట్లాడుతూ ‘ఉల్లిపాయలు, ఆలుగడ్డలు లేకుండా కూరలు వండుకోవడం కష్టమే. ఇప్పుడు మద్యం దుకాణాల్లో కూడా లభిస్తున్నాయి. ప్రతిసారి నా భర్త మద్యం దుకాణానికి వెళ్లే అవసరం లేదు. నేను కూడా వెళ్లి ఉల్లిపాయలతోపాటు మద్యం కూడా తీసుకు రావడానికి వీలు కలిగింది. కూరగాయల కోసం మరికొంత దూర వెళ్లాల్సిన పని తప్పుతుంది’ అని పేర్కొంది. -
‘అసలే కోతి.. పైగా కల్లు తాగింది’..
‘అసలే కోతి.. పైగా కల్లు తాగింది’.. అన్న సామెతను తలపిస్తోంది జిల్లాలో అబ్కారీ శాఖ తీరు. ప్రధాన ఆదాయం సమకూర్చే శాఖ కావడంతో సహజంగానే సర్కారు దీని విషయంలో చూసీచూడనట్లు పోతోంది. అసలే అవినీతి మత్తులో నిత్యం జోగుతుండే ఈ శాఖలోని కొందరు అధికారులు ఇదే అదనుగా మరింత దోపిడీకి తెగబడుతున్నారు. వర్గం, యూనియన్ ప్రతినిధులమన్న తోకలు తగిలించుకొని రెచ్చిపోతున్నారు. అడ్డుచెప్పిన ఉన్నతాధికారులనే ధిక్కరించేలా తోక జాడిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. చివరికి బెల్ట్‌షాపులు, సారా విక్రయాలను అరికట్టాలన్న సర్కారు లక్ష్యానికే తూట్లు పొడుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖలో అక్రమార్జనే ధేయయంగా కొందరు సీఐలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, మద్యం దుకాణాల కేటాయింపులు పూర్తి చేసి అత్యధిక ఆదాయాన్ని లక్ష్యం గా నిర్దేశించడాన్ని అనువుగా తీసుకున్న వీరు మరింత శ్రుతి మించి పోతున్నారు. వీరి ఆగడాలపై ఉన్నతాధికారులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో ఓ కన్నేసినట్టు తెలిసింది. అయితే సామాజికవర్గం పేరు చెప్పుకొని ఒకరు, ఉద్యో గ సంఘాల ప్రతిని దులమంటూ మరి కొందరు జిల్లా అధికారులనే సవాల్ చేస్తున్నారు. జీతం కంటే గీతానికే ప్రాధాన్యమిస్తూ దోపిడీపర్వం సాగిస్తున్నారు. జిల్లాలో ఇటీవలే 217 మద్యం దుకాణాలను ఇటీవలే లాటరీ పద్ధతిలో కేటాయించారు. రాజాం లోని నాలుగు బార్లు మినహా జిల్లాలోని మిగతా బార్ అండ్ రెస్టారెంట్లకూ రెన్యూవల్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా బెల్ట్ షాపులను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు దిశా నిర్దేశం చేయడంతో జిల్లా వ్యాప్తంగా 14 మంది సీఐలతో పాటు నాలుగు మొబైల్ పార్టీలు, ఎన్ఫోర్సుమెంట్ సిబ్బంది వాటి నియంత్రణకు పని చేయాల్సి ఉంది. కానీ మూడు సర్కిళ్లలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇచ్ఛాపురంలో ఇష్టారాజ్యం ఇచ్ఛాపురం సర్కిల్లో సిండికేట్లకు దన్నుగా నిలిచిన ఎక్సైజ్ అధికారులు కొత్తవారికి మద్యం దుకాణాలు దక్కకుండా దందా నడిపించారు. పైగా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముకోవచ్చని దుకాణదారులకు భరోసా ఇచ్చేశారు. తమ వాటాగా బాటిల్‌కు రూ.2 ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దాంతో వ్యాపారులు క్వార్టర్ బాటిల్‌పై రూ.5, ఫుల్ బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తూ అందులో రూ.8 అధికారులకు పంపిస్తున్నారని తెలిసింది. ఇందులో తమకూ కొంత మిగులుతుండటంతో అధికారులు చెప్పినదానికి తలూపుతున్నారు. కాగా తమ వాటా సొమ్ము సక్రమంగా అందుతుందో లేదో తెలుసుకోవడానికి ప్రతిరోజూ జరిగే అమ్మకాల రికార్డులను సర్కిల్ అధికారులు తెప్పించుకొని పరిశీలించి మరీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో 100 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ కేసుతో ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు అప్పగించాల్సిన ఆ కారును అక్కడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత పనులకు వాడుకుంటున్నా రు. ఇటీవల పలాసలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశానికి సైతం అదే కారులో వెళ్లారని కింది స్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో సారా బట్ట్టీలను ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఒక్కో బట్టీ యజమాని నుంచి నెలకు రూ.25 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. బెల్టు షాపుల వారికి కూడా ఇక్కడి అధికారి అభయహస్తమిచ్చారని తెలిసింది. ఒడిశా సారా వ్యాపారులను మద్యం వ్యాపార ంలోకి దించేందుకు కూడా అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ వ్యవహారాలన్నింటినీ సదరు అధికారి ఓ కానిస్టేబుల్ ద్వారా నడిపిస్తున్నారని తెలిసింది. ఆయన ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోం దని ఎక్సైజ్ సిబ్బందే గగ్గోలు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణ అధికారుల వ్యవహార శైలిపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. బెల్ట్ షాపుల నియంత్రణలో నిర్లక్ష్యం విహ స్తున్నారని ఇటీవల కలెక్టరేట్లో జరిగిన ఓ సమావేశంలో సాక్షాత్తూ మంత్రే ఒక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పట్టణ పరిధిలో ఉన్న 40 దుకాణాల్లో నెలవారీ మామూళ్లే రూ.లక్షల్లో ఉంటాయని సిబ్బందే చెబుతున్నారు. కాగా ఈ సర్కిల్ అధికారి ఒక మద్యం వ్యాపారి ద్వారా నెలవారీ మామూళ్లు వసూలు చేయించి విశాఖలో ఉన్న తన ఇంటికి గుట్టుచప్పుడు కాకుండా పంపిస్తున్నారని తెలుస్తోంది. అబ్కారీ శాఖకు ఆదాయానికే గండి పడే విధంగా వ్యవహరిస్తున్న ఈ అధికారి తనను అడ్డుకోవాలని చూస్తే.. అంతు చూస్తానన్న రీతిలో జిల్లా అధికారులపైనే బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే రీతిలో పాతపట్నం సర్కిల్ అధికారులపైనా అరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలిసింది. -
‘ఎక్సైజ్’కు లక్ష్మీ కటాక్షం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మద్యం దుకాణాల కోసం చేసుకున్న దరఖాస్తుల ద్వారా ఇతర జిల్లాలకంటే శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఆదాయాన్ని చూసి సంబంధిత శాఖ అధికారులే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మద్యం వినియోగంలోనే కాదు దుకాణాలు దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నంలోనూ జిల్లా వాసులు ముందున్నారు. జిల్లాలో 232 దుకాణాలకు ఏడాదికి సంబంధించి ఇటీవల నిర్వహించిన లాటరీ ప్రక్రియలో మొత్తం 217 దుకాణాలకు దరాఖస్తులు రావడం, లాటరీ తీయడం, కేటాయింపు కూడా జరిగిపోయింది. అయితే పొరుగున ఉన్న విజయనగరం, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలతో పోల్చి చూసుకుంటే దరఖాస్తుల స్వీకరణ ద్వారా ఇక్కడ గణనీయమైన ఆదాయం సమకూరింది. అంటే సిండికేట్ కొద్దిగా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగని పాత వ్యక్తులకు దుకాణాలు పెద్దగా దక్కలేదని భావించలేము. విజయనగరం జిల్లాలో సుమారు 202 దుకాణాలకు దరఖాస్తులు పిలిస్తే సుమారు 1500 మంది ఆసక్తి కనబర్చారు. కడపలో 269 దుకాణాలకు 1400 వచ్చాయి. కర్నూలులోనూ అదే పరిస్థితి. ఇక్కడ మాత్రం 232 దుకాణాలకు రికార్డు స్థాయిలో 2,564 దరఖాస్తులొచ్చాయి. ఒక్కో దరఖాస్తుకూ రూ.25 వేలు చొప్పున (నాన్ రిఫండబు ల్) సుమారు రూ.6 కోట్ల 42 లక్షల ఆదాయం సమకూరింది. తొలివిడత డిపాజిట్ ద్వారా.. దుకాణాలు దక్కిన మద్యం వ్యాపారులు తొలి విడతగా రూ.5 లక్షల చొప్పున (సరుకు కోసం) డీడీలు తీశారు. దీని ద్వారా మరో రూ. 25 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే జిల్లాలోని మొత్తం 16 బార్ అండ్ రెస్టారెంట్లకు రాజాం మినహా మిగతా చోట్ల దుకాణాలను రెన్యువల్ చేయడం ద్వారా మరో రూ.4 కోట్లు సమకూరింది. దరఖాస్తులు, తొలివిడత డీడీలు, బార్ల రెన్యువల్ ఇలా మొత్తం సుమారు 35 కోట్ల రూపాయల ఆదాయం నెలరోజుల వ్యవధిలో సమకూరడంతో అధికారులు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ ఏడాది లక్ష్యసాధన లో ఇది తొలిమెట్టుగా చెబుతున్నారు. రాజాం ‘బార్ల’పై హైకోర్టు దృష్టి జిల్లాలో మొత్తం 16 బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. ఇందులో రాజాం మున్సిపాలిటీలోనే నాలుగున్నాయి. అయితే పన్ను చెల్లింపు, సరుకు కొనుగోలుకు సంబంధించి జిల్లా అంతటా ఒకే విధానం అమలు చేసినా రాజాం వ్యాపారులు మాత్రం తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకెళ్లారు. తమది పేరుకే మున్సిపాలిటీ గానీ నగర పంచాయతీగానే పరిగణించాలని, పన్ను వసూలు, రెన్యూవల్ ప్రక్రియలో గ్రేడ్-3 మున్సిపాలిటీగానే లెక్కిం చాలని కోర్టుతూ పిటీషన్ దాఖలు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజాం మినహా జిల్లాలోని మిగతా బార్ అండ్ రెస్టారెంట్లకు ఏడాదికి సంబంధించి రెన్యువల్ ప్రక్రియను ముగించారు. రాజాం పరిస్థితిపై పూర్తిస్థాయిలో నివేదిక దాఖలు చేయాలని కోరుతూ హై కోర్టు నుంచి ఇటీవలే జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలందాయి. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షనే.. లాటరీ, దుకాణాల కేటాయింపు, రెన్యువల్ ముగియడంతో ఇక అధికారులు బెల్ట్ దుకాణాల నియంత్రణపైనే దృష్టిసారించారు. ఇప్పటికే జిల్లాలో పలు కేసులు నమోదు చేసిన అధికారులు..సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్‌కు కూడా వెనకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సుమారు 1100 బెల్ట్ దుకాణాలున్నట్టు అంచనా. అయితే కేవలం 40 శాతం దుకాణాలపైనే సిబ్బంది దృష్టిసారించి నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేశారు. మిగతా వాటిపై దృష్టిసారించేందుకు రాజకీయ నేతల ఒత్తిళ్లు, వ్యాపారుల పలుకుబడి అడ్డంకిగా మారింది. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ కూడా ఎక్సైజ్ సిబ్బందిపై గుర్రుగా ఉన్నారు. ‘బెల్ట్’ నియంత్రణలో 34 ఏ ఎక్సైజ్ యాక్ట్‌ను బేఖాతర్ చేస్తూ వ్యాపారులకు అండగా నిలుస్తున్న ఇద్దరు సీఐలపైనా అధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ‘టైం టూ టైం’ మెమోలజారీ తో పాటు సస్పెన్షన్ తప్పదని అధికారులు హెచ్చరించాల్సి వచ్చింది. జిల్లా సమాఖ్య కమి టీ, మహిళా సంఘాలు, స్థానిక పాలక సంఘా ల సభ్యులు, చైర్మన్లు, ఎస్ఐ, సీఐలు, గ్రామ కమిటీల సహకారంతో బెల్ట్ దుకాణాల నియంత్రణకు పాటుపడుతున్నామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. -
‘ఎక్సైజ్’లో రీలొకేషన్ దందా
ఎక్సైజ్ శాఖలో మరో అవినీతి పర్వం షాపు మార్చినందుకు లక్షల్లో వసూళ్లు జిల్లాలో 11 షాపులను మార్చిన అధికారులు నూతన షాపుల కేటాయింపులపై సర్వత్రా నిరసనలు సాక్షి, విజయవాడ : జిల్లా ఎక్సైజ్ శాఖలో మరో అవినీతిపర్వానికి తెరలేచింది. మద్యం షాపుల రీలొకేషన్ పేరుతో వ్యాపారులకు అనువైన ప్రాంతాలకు మార్చి అధికారులు లక్షలు దండుకుంటున్నారు. గుడి, బడి నిబంధనలను, చట్టంలోని లొసుగుల ద్వారా అనుకూలంగా మార్చుకొని వ్యాపారుల ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా షాపు రీలొకేషన్ పేరుతో జిల్లాలో పలు షాపుల స్థానాలు మార్చి లక్షలు దండుకున్నారు. స్థానికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా ఎక్సైజ్ అధికారులు అనుకున్నది పూర్తి చేశారు. జిల్లాలో 11 షాపులు మార్చటం ద్వారా సుమారు 20 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షాపు మార్చినందుకు విజయవాడ నగరంలో ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాల స్థాయికి అనుగుణంగా వసూళ్లు చేసినట్లు తెలిసింది. మరో ఆదాయ వనరుగా... ఒకవైపు బార్ రెన్యువల్స్ ద్వారా సాధారణ మామూళ్లు పొందుతున్న ఎక్సైజ్ అధికారులకు రీలొకేషన్ మరో ఆదాయ వనరుగా మారింది. స్థానిక సర్కిల్ ఎక్సైజ్ సీఐ సిఫార్సుల మేరకు, వివిధ రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు షాపులను మార్చారు. దీంతో వ్యాపారపరంగా సమస్యలు ఎదురు కావటంతో పాటు, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో కొన్ని షాపుల్లో వ్యాపారులు ఆశించిన మేరకు విక్రయాలు జరగలేదు. దీంతో పలు కారణాలను సాకుగా చూపి షాపును రిలొకేట్ చేయటానికి పలువురు వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు అందినదే తడవుగా ఎక్సైజ్ అధికారులు రిలొకేట్ పేరుతో అధికారులు వాటిని మార్చేశారు. వాస్తవానికి గుడికి, బడికి 100 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఎర్పాటు చేయాలని ఎక్సైజ్ చట్టం చెబుతోంది. అది కూడా దేవాదాయ శాఖ గుర్తించిన దేవాలయాలు, విద్యాశాఖ గుర్తింపు ఉన్న పాఠశాలలకు మాత్రమే చట్టం వర్తిస్తుంది. వాస్తవానికి అత్యధిక దేవాలయాలు, మందిరాలకు దేవాదాయ శాఖ గుర్తింపు ఉండదు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో దేవాలయాలు, మందిరాలు, చర్చిల సమీపంలోనే షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నారు. తాజాగా రీ లొకేట్లో కేటాయించిన షాపులు కొన్ని గుడికి, బడికి దగ్గరగా ఉన్నాయి. రీలోకేషన్ వసూళ్లు ఇలా... రీలొకేషన్ పేరుతో ఎక్సైజ్ శాఖలో సీఐ స్థాయి నుంచి అధికారుల వరకు భారీగా వసూళ్లు చేశారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఏడు షాపులను రీలొకేట్ చేశారు. దీనికి గాను ఒక్కో షాపు నుంచి రూ లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారు. విజయవాడ నగరంతో పాటు నందిగామలోని మాగల్లు, నూజివీడులోని అడవినెక్కలం, మచిలీపట్నం డివిజన్లోని అవనిగడ్డ, మచిలీపట్నంలో షాపులను రీలొకేట్ చేశారు. రోజుకు సగటున 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు విక్రయాలు జరిగే షాపునకు లక్ష రూపాయలు చొప్పున గ్రామీణ ప్రాంతంలో వసూళ్లు చేశారు. ఈ వ్యవహారమంతా స్థానిక సీఐలే నిర్వర్తించి వసూళ్లు పూర్తి చేసి, అధికారుల స్థాయి వరకు అందరికీ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. -
మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకుంటే...
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అందుకోసం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కొత్తగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో కొల్లు రవీంద్ర విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 730 మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాలేదని చెప్పారు. వాటి కోసం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. అప్పుడు కూడా దరఖాస్తులు రాకుంటే ప్రభుత్వమే ఆ దుకాణాలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు కొల్లు రవీంద్ర వెల్లడించారు. -
సిండి‘కేటు’కే కిక్కు!
శ్రీకాకుళం క్రైం: బెల్ట్ షాపులు మూసేస్తాం.. బెల్ట్ షాపులు నిర్వహించినా, వాటికి మద్యం సరఫరా చేసినా సంబంధిత మద్యం షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హడావుడి చేస్తున్నా.. అవన్నీ అమలవుతాయన్న నమ్మకం మాత్రం కలగడం లేదు. కొత్తగా షాపులు పొందినవారిలో అత్యధిక శాతం పాతవారే కావడంతో 2011 మాదిరిగా సిండికేట్ అవుదామన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసింది. జిల్లాలో మద్యం షాపులను శనివారం లాటరీ పద్ధతిలో దరఖాస్తుదారులకు కేటాయించారు. ఈ ప్రక్రియ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజాము 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 232 దుకాణాలకుగాను 203 షాపులకు 2,567 దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.6,41,75,000 ఆదాయం వచ్చింది. 29 దుకాణాలకు దరకాస్తులు దాఖలు కాకపోవడంతో వాటికి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. కాగా 203 దుకాణాలను కైవసం చేసుకున్న వారిలో చాలా వరకు పాత వ్యాపారులే కావడం గమనార్హం. కొంతమంది పాత వ్యాపారులు పెట్టుకున్న బినామీలకు కూడా పెద్ద సంఖ్యలోనేషాపులు దక్కాయి. పాతవారు, వారి బినామీలు కలిసి 150కి పైగా షాపులు చేజిక్కించుకున్నారని సమాచారం. పక్కా ప్రణాళికతో దరఖాస్తులు దాఖలు చేసి వారు ఈ విషయంలో విజయం సాధించారు. గత కొన్నేళ్లుగా మద్యం వ్యాపారంలో పాతుకుపోయిన వీరికి ఏ దుకాణానికి ఎంత ఆదాయం వస్తుంది.. అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయన్నదానపై పూర్తి అవగాహన ఉంది. ఆ అంచనాతోనే పక్కాగా వ్యూహం రూపొందించుకుని ఒక్కో మధ్యం వ్యాపారి 5 నుంచి 15 దుకాణాలకు దరఖాస్తు చేశారు. తమ బినామీల పేరుతో కూడా అదే స్థాయిలో దరఖాస్తు చేయించారు. సిండికేట్‌కు రంగం సిద్దం ఉహించిన విధంగానే పాత వ్యాపారులకే షాపులు దక్కడం, ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేస్తే లాభాలు రావని భావిస్తున్న వీరు సిండికేట్‌గా ఏర్పడేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బెల్ట్ దుకాణాల మూసివేస్తే అసలు ఆదాయం ఉండదని, అందువల్ల సిండికేట్ అయ్య మద్యం ధరలను తామే నిర్ణయించాలని దరఖాస్తు చేసిన సమయంలోనే కొందరు వ్యాపారులు మంతనాలు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుంగా పరస్పరం పోటీ పడకుండా ఒక అవగాహనతో దరఖాసులు దాఖలు చేశారు. అయితే సిండికేట్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో సిండికేట్ లీడర్‌గా వ్యవహరించిన ఓరుగంటి ఈశ్వరరావు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. దీంతో కొత్తవారు ముందుకొస్తున్నారు. ఆదివారం ఉదయం కొంత మంది వ్యాపారులు సమావేశమై చర్చించుకోగా.. రాజకీయ అండదండలు ఉన్న మరికొంత తాము లీడ్ చేస్తామంటూ ముందుకు వచ్చినట్టు తెలిసింది. బెదిరింపుల పర్వం మొదలు సిండికేట్ అయ్యేందుకు పాత మధ్యం వ్యాపారులు సన్నాహాలు చేస్తుండగా కొత్తగా దుకాణాలు కైవసం చేసుకున్న వారుదానితో ప్రమేయం లేకుండా షాపులు నడుపుకోవాలని భావిస్తున్నారు. అయితే వారిని నయానో.. భయానో ఒప్పించాలని సిండికేట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. దానికి రెండు మార్గాలు అనుసరిస్తున్నారు. షాపు పొందిన వ్యక్తికి గుడ్‌విల్ ఇచ్చి దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఒక పద్ధతి కాగా, అంగీకరించకుంటే బె దిరింపులకు దిగి తమ దారిలోకి తెచ్చుకోవాలని రెండో పద్ధతిగా అనుసరిస్తున్నారు. ఇప్పటికే కొందరు కొత్త వ్యాపారులను కలిసి మంతనాలు జరపడంతో ఎందుకొచ్చిన గొడవ.. గుడ్‌విల్ తీసుకుని తప్పుకుందామని కొందరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
పాతవారికే మద్యం కిక్కు!
శ్రీకాకుళం క్రైం : మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ శనివారం అర్ధరాత్రి దాటిన వరకు కొనసాగుతూ వచ్చింది. లాటరీ ఫలితాలు వెల్లడించిన పేర్లలో అధికమంది పాతవారే ఉండడం గమనార్హం. పక్కా ప్రణాళికతో ఒక్కో దుకాణానికి అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసి మద్యం దుకాణాలు కైవసం చేసుకున్నట్టు సమాచారం. జిల్లాలో 232 మద్యం దుకాణాల లెసైన్సులు పొందేందుకు ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియాల్సి ఉండగా అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకు కొనసాగింది. మొత్తం 232 దుకాణాల్లో 203 దుకాణాలకు 2,567 దరఖాస్తులు దాఖలయ్యాయి. 29 దుకాణాలకు దరఖాస్తులు దాఖలు కాలేదు. వచ్చిన దరఖాస్తుల్లో 35 దుకాణాలకు సింగల్ దరఖాస్తులు పడ్డాయి. అయితే, దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.6,41,75,000 ఆదాయం వచ్చింది. గతంలో సుమారు 2000 దరఖాస్తుల వరకు దాఖలుకాగా, ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 2567 వచ్చాయి. ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రభుత్వ రెవెన్యూ పెంచడంలో విజయం సాధించారు. వచ్చిన దరఖాస్తులను లాటరీ పద్ధతిలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు. లాటరీ తీసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసరికి సాయంత్రం అయ్యింది. లాటరీ విధానాన్ని జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా సహాయ కలెక్టర్ అధ్వైత్‌కుమార్ సింగ్, ఏజేసీ మహ్మద్ షరీఫ్‌లు పర్యవేక్షించారు. జేసీ టెండర్ బాక్సులకు ఉన్న సీల్‌లను కట్ చేసి దరఖాస్తులను బయటకు తీశారు. ఏజేసి మహ్మద్ షరీఫ్, ఎక్సైజ్ డీసీ టి.నాగలక్ష్మి దుకాణాల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి లాటరీ విధానాన్ని చివరి వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. అర్ధరాత్రి దాటినా... శనివారం అర్ధరాత్రి దాటిన వరకు దుకాణాల కేటాయింపు కొనసాగుతూనే ఉంది. లాటరీ ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లాటరీ ప్రక్రియలో జాప్యంతో దరఖాస్తుదారులు అంబేద్కర్ ఆడిటోరియంలోని కుర్చీల్లోనే నిరీక్షించారు. ఉత్కంఠతో ఎదురు చూశారు. మొత్తం 203 దుకాణాలకు సంబంధించిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దుకాణాలను కైవసం చేసుకున్న వారిలో చాలామంది పాత వ్యాపారులే ఉండ టం గమనార్హం. దుకాణాలు కైవసం చేసుకున్నవారిలో... శ్రీకాకుళం పట్టణంలోని కొన్ని దుకాణాలను కైవసం చేసుకున్నవారిలో గజెట్ నెంబరు వరు స క్రమం ప్రకారం ఎస్.నాగమణి, జి.భాస్కరరావు, ఎం.కనకమ్మ, ఎస్.గాంధీభరత్నాయు డు, పి.రాజారావు, పి.శ్రీరాములు, పి.బి. రామకృష్ణ, జి.రాజకుమారి, ఎస్.గోపాలరావు, సి.హెచ్.వెంకటకృష్ణారెడ్డి, ఎస్.అనూష, బి.వెం కటరావు, ఎం.సర్సింహమూర్తి, కె.అప్పారావు, ఓ.రాధ,ఆర్‌ఆర్‌డి.శ్వేత, బి.వి.రమణ, సిమ్మ వైకుంఠరావు, ఎం.శ్రీనివాసరావు, పైడి గోవిం దరావు, ఎస్.అప్పలరాజు, బి.ప్రవీణ్‌కుమార్, ఎం.నర్సింగరావు, వై.జగదీష్, కె.గోవింద్, బి.సాయిరాం, బి.అప్పలస్వామి, ఎం.రమణ, ఎం.మెహర్శంకర్ ఉన్నారు. -
మద్యం షాపు లైసెన్స్‌ల కోసం క్యూ
-
27 మద్యం దుకాణాలకు 37 దరఖాస్తులు
విజయనగరం రూరల్ : జిల్లాలో 27 మద్యం దుకాణాలకు 37 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ ఈఎస్ పి. శ్రీధర్ తెలిపారు. జిల్లాలో 2014-2015 సంవత్సరానికి సంబంధించి 202 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ ఈనెల 23న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 23వ తేదీ నుంచి అధికారులు దరఖాస్తు లు ఆహ్వానించగా గత రెండు రోజుల్లో ఒక్క దరఖా స్తు కూడా రాలేదు. బుధవారం మాత్రం విజయనగరం యూనిట్లో 21 మద్యం దుకాణాలకు 31 దరఖాస్తులు, పార్వతీపురం యూనిట్లో 6 మద్యం దు కాణాలకు ఆరు దరఖాస్తులు వచ్చారుు. ఇందులో విజయనగరం వన్ సర్కిల్లో మూడు దుకాణాలకు 9 దరఖాస్తులు, భోగాపురం సర్కిల్లో 4 దుకాణాలకు 5 దరఖాస్తులు, చీపురుపల్లి సర్కిల్లో 11 దుకాణాలకు 13, నెల్లిమర్ల సర్కిల్లో ఒక దుకాణానికి ఒకటి, గజపతినగరం సర్కిల్లో ఒక దుకాణానికి రెండు దరఖాస్తులు, ఎస్. కోటలో ఒక దుకాణానికి ఒక దరఖాస్తు వచ్చిందన్నారు. పార్వతీపురం యూ నిట్ పరిధిలోని కొర్లాంలో మూడు మద్యం దుకాణాలకు మూడు దరఖాస్తులు, సాలూరు సర్కిల్లో మూ డింటికి మూడు దరఖాస్తులు వచ్చారుు.ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ సారైనా పూర్తిస్థారుులో దరఖాస్తులు వచ్చేనా..? జిల్లాలోని మద్యం దుకాణాలకు ఈ సారైనా పూర్తిస్థారుులో దరఖాస్తులు అందుతాయూ అన్న ప్రశ్న తలెత్తుతోంది. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారంతో గడువు పూర్తి కానుంది. అయితే రెండేళ్ల కిందట వర కు మద్యం అమ్మకాల్లో లాభాలు చూసిన వ్యాపారు లు, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయాలు సాగించాలని గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో చాలామంది దరఖాస్తు చేయలేదు. ఒకప్పుడు మద్యం వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి వారు సూచించిన ధరలకే అమ్మకాలు సాగడంతో కో ట్లాది రూపాయల లాభాలు పొందేవారు. కానీ గత ప్రభుత్వం ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు సాగించాలన్న నిబంధన విధించడంతో వ్యాపారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎక్సైజ్ ఉన్నతాధికారు లు మద్యం దుకాణాలు లెసైన్స్ పొందడానికి సీఐల పై ఒత్తిడి తీసుకువచ్చారు. జిల్లాలోని 13 సర్కిల్ పరిధిలోని సీఐలు గతేడాది మద్యం దుకాణాలు లా టరీలో పొందేలా వ్యాపారులపై ఒత్తిడి చేశారు. అయినా 12 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. అరుుతే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో బెల్ట్ షాపులను నిషేధిస్తూ.. జీవో జారీ చేయడంతో మళ్లీ గత ఏడాది పరిస్థితే పునరావృతమైయ్యే అవకాశాలు ఉన్నారుు. వాస్తవానికి మద్యం వ్యాపారులకు బెల్ట్ షాపుల ద్వారానే అధిక ఆదాయం వస్తోంది.అరుుతే ప్రభుత్వం బెల్ట్ షాపులను రద్దు చేయడంతో ఈ ఏడాది కూడా మద్యం దుకాణాలకు దరఖాస్తులు అంతగా రావడం అనుమానమేనని అధికారులు చెబుతున్నారు. కాగా అన్ని దుకాణాలకు దరఖాస్తు లు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఆయా సర్కిల్ పరి ధిలోని సీఐలదేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గత లెసైన్స్దారులతో మాట్లాడి దరఖాస్తులు వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. -
మద్యం దుకాణాల కేటాయింపునకు రంగం సిద్ధం
శ్రీకాకుళం క్రైం: జిల్లాలోని 232 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి సర్వం సిద్ధం చేశామని ఎక్సైజ్‌శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుకాణాల ఏర్పాట్లు తదితర విషయాలపై ఆమె మాట్లాడారు. పదివేల లోపు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల లెసైన్సు ఫీజును రూ. 32.5 లక్షలుగా కేటాయించారు. పది వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలకు రూ. 36 లక్షలుగా, పట్టణ ప్రాంతంలోని దుకాణాలకు రూ. 45 లక్షలుగా లెసైన్సు ఫీజును నిర్ణయించినట్టు వివరించారు. గతంలో మాదిరిగానే లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు జరుగుతోందన్నారు. మొత్తం దుకాణాలకు సంబంధించి అసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను తమ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలన్నారు. 28వ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో అంబేద్కర్ అడిటోరియంలో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయిస్తామన్నారు. జిల్లాలో 14 సర్కిళ్లు ఉండగా, వాటిలో శ్రీకాకుళం, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఏడేసీ సర్కిళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో 134 , పలాస పరిధిలో 98 దుకాణాలు ఉన్నట్టు వివరించారు. మొత్తం 232 దుకాణాలకు సంబంధించి గతంలో రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఐదు దుకాణాలకు అసలు టెండర్లే పడలేదని, వాటిని ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో కేటాయించటం జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్‌కు సమీపంలో ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో రెండు, డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలో రెండు దుకాణాలను కేటాయించనున్నట్టు వెల్లడించారు. అసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఒక్కో దుకాణానికి రూ. 25 వేలు చలానా తీయాల్సి ఉంటుందని, అలాగే రూ. ఐదు లక్షలకు సంబంధించిన డీడీని దరఖాస్తుతో జత చేయాలన్నారు. ఏ-1, ఏ-2, ఏ-3 డిక్లరేషన్లతో పాటు ఆరు ఫొటోలను దరఖాస్తుకు జత చేయాలన్నా. జూలై ఒకటో తేదీ నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయన్నారు. కాగా బార్లకు సంబంధించి 50 వేల జనాభా దాటి ఉన్న ప్రాంతాల్లో లెసైన్సు ఫీజులు పెంచారు. శ్రీకాకుళం సమీపంలోని పది బార్లకు సంబంధించి గతంలో రూ. 35 లక్షల లెసెన్స్ ఫీజు ఉండగా ప్రస్తుతం మరో మూడు లక్షల రూపాయలు పెంచుతూ 38 లక్షల రూపాయలుగా నిర్ణయించామన్నారు. సమావేశంలో శ్రీకాకు ళం, పలాస ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె.ఏసుదాసు, ఎస్.సుకేష్లు పాల్గొన్నారు.