
సాక్షి, హైదరాబాద్ : దాదాపు 45 రోజుల తర్వాత రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోవడంతో.. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మద్యం కోసం చాలా మంది ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్‌సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్‌వేర్ యువతులు క్యూ కట్టారు. ఐటీ సెక్టార్‌లోని పలు షాపుల దగ్గర సైతం భారీ క్యూలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల వృద్ధ మహిళలు మద్యం కోసం వైన్ షాపుల వద్దకు వచ్చారు. (చదవండి : తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే..)
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్నాయి. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. మరోవైపు పోలీసులు, అధికారులు వైన్ షాపుల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment