
దశల వారీగా మద్యం షాపులన్నీ బంద్
భోపాల్: దశల వారీగా మద్యం షాపులన్నింటినీ మూసివేయించి, రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నర్సింగ్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
'తొలి విడతలో నర్మద నదికి ఇరువైపులా 5 కిలో మీటర్ల పరిధిలోని షాపులన్నింటినీ మూసివేయిస్తాం. రెండో విడతలో నివాస ప్రాంతాల్లో, విద్యా సంస్థలు, ప్రార్థన స్థలాలకు సమీపంలో మద్యం షాపులను అనుమతించం. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తాం' అని చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మధ్యనిషేధం విధించాలని ఆందోళనలు చేస్తున్నారు.