CM Shivraj Singh Chouhan
-
ఎన్నికల హామీలపై... మధ్యప్రదేశ్‌లో నేతల మాటల యుద్ధం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల హామీలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఉచిత విద్య, విద్యార్థులకు నగదు పురస్కారాలు వంటి కాంగ్రెస్, ప్రియాంకా గాంధీ ఇచి్చన ఎన్నికల హామీలపై సీఎం చౌహాన్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో గాంధీ కుటుంబం ప్రతి ఒక్కరినీ మోసం చేసింది. తాజాగా గాంధీ కుటుంబాన్ని సైతం పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ మోసం చేస్తున్నారు. తప్పుడు హామీలిచ్చేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు’అని ఆరోపణలు చేశారు. మాండ్లాలో ఈ నెల 12న జరిగిన ర్యాలీలో ప్రియాంకా గాంధీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందజేస్తామని ప్రకటించడం ఆ తర్వాత దానిని పలు మార్లు మార్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం విమర్శలపై కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై సీఎం చౌహాన్ అనుచిత భాషను వాడారని ఆరోపించారు. తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయదని స్పష్టం చేశారు. సీఎం చౌహాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రియాంకా గాంధీ సైతం విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీలో మాదిరిగా తమ పారీ్టలో నియంతృత్వానికి చోటులేదన్నారు. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఎందుకు నిలిపివేశారని సీఎం చౌహాన్‌ను ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ విద్య, చిన్నారులు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చౌహాన్ ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నారంటూ ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి విద్యారి్థకి ఉపకారవేతనం అందజేస్తుందని హామీ ఇచ్చారు.నవంబర్ 17వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. -
ఎస్సీ, ఎస్టీ చట్టం : విచారణ తర్వాతే అరెస్ట్‌లు
భోపాల్ : ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారణ లేకుండా రాష్ట్రంలో అరెస్ట్‌లు ఉండవని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం స్పష్టం చేశారు. పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో చెలరేగిన నిరసనల నేపథ్యంలో సీఎం ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం చేయడాన్ని మధ్యప్రదేశ్‌లో అనుమతించబోమని, విచారణ అనంతరమే అరెస్టులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. త్వరలోనే ఈ దిశగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 6న అగ్రవర్ణ సంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలో కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం వరకూ నిరసన ర్యాలీ చేపట్టామని బ్రహ్మ సమాగమ్ సవర్ణ జన్‌కళ్యాణ్ సమాజ్ కన్వీనర్ ప్రహ్లాద్ శుక్లా చెప్పారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకున్నారన్నారు. -
మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ
భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గ విస్తరణను చేపట్టారు. రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ బీజేపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ పాటీదార్, నారాయణ్ సింగ్ కుష్వాహా, జలమ్ సింగ్ పటేల్‌ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో కుష్వాహాకు కేబినెట్ హోదా కల్పించగా, మిగతా ఇద్దరినీ సహాయ మంత్రులుగా నియమించారు. వీరందరికి త్వరలోనే మంత్రిత్వ శాఖల్ని కేటాయించనున్నారు. అనంతరం సీఎం చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..‘మాతో కొత్త సహచరులు చేరారు. వీరి చేరికతో మా సామర్థ్యం మరింత మెరుగుకానుంది. రాష్ట్రాభివృద్ధిలో కొత్త మంత్రుల అనుభవాన్ని ఉపయోగించుకుంటాం. త్వరలోనే మరోసారి మంత్రివర్గాన్ని విస్తరిస్తాం’అని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 35 మంది మంత్రులు ఉండే అవకాశముండగా.. తాజా పెంపుతో సీఎం సహా మొత్తం మంత్రుల సంఖ్య 20కి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి బీజేపీ అధికారంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
సంతోషాన్ని కొలిచేందుకు రెడీ..
కోల్‌కతా: జనాభా లెక్కల సేకరణ చూశాం. బడ్జేట్ అంచనా వేయడం తెలుసు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ప్రజల సంతోషాన్ని, ఆరోగ్యాని కొలిచేందుకు సిద్ధమైంది. ఇందుకు ఖరగ్‌పూర్ రేఖీ సెంటర్‌తో ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారో కొలిచి, నివేదిక రూపంలో అందజేయడం కోసమే ఈ ఒప్పందం. దేశంలోనే తొలిసారిగా హ్యాపినెస్ డిపార్ట్మెంట్ను సర్కార్ ఇటీవల ప్రారంభించింది. ‘అయితే సంతోషాన్ని కొలవడం ఆషామాసీ వ్యవహారం కాదు. దీనికోసం ఎంతో కసరత్తు, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ బాధ్యతను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగించామని’ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన రాజ్య ఆనందం సంస్థాన్ ఓ ప్రకటనతో పేర్కొంది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. గణాంకాలను అందజేయడం మాత్రమే కాకుండా హ్యాపీనెస్ ఇండెక్స్‌ను మరింతగా పెంచేందుకు ఐఐటీ బృందం సూచనలు, సలహాలు కూడా ఇస్తుంది. -
దశల వారీగా మద్యం షాపులన్నీ బంద్
భోపాల్: దశల వారీగా మద్యం షాపులన్నింటినీ మూసివేయించి, రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేయనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నర్సింగ్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. 'తొలి విడతలో నర్మద నదికి ఇరువైపులా 5 కిలో మీటర్ల పరిధిలోని షాపులన్నింటినీ మూసివేయిస్తాం. రెండో విడతలో నివాస ప్రాంతాల్లో, విద్యా సంస్థలు, ప్రార్థన స్థలాలకు సమీపంలో మద్యం షాపులను అనుమతించం. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తాం' అని చౌహాన్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మధ్యనిషేధం విధించాలని ఆందోళనలు చేస్తున్నారు. -
యోగి బాటలో మరో సీఎం
భోపాల్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆకతాయిలకు బుద్ధి చెప్పేందుకు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. 'ఆకతాయి కుర్రాళ్లకు అమ్మాయిలను ఎలా గౌరవించాలో తెలియదు. ఇలాంటి వాళ్లు పౌర సమాజానికి శ్రేయస్కరం కాదు. ఇలాంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం' అని చౌహాన్ తెలిపారు. మహిళలు, అమ్మాయిల భద్రతకు భరోసా ఇవ్వడం, వారు సురక్షితంగా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ధైర్యసాహసాల్లో, విధులు నిర్వహించడంలో మహిళలు ఎవరికీ తక్కువ కాదని, వారు ఎలాంటి భయం లేకుండా స్వతంత్రంగా ఉండేలా పోలీసులు తగిన వాతావరణం కల్పించాలని, వారిని పీడించే నేరగాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే. యూపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగానే బీజేపీ అధికారంలోకి వచ్చాక యాంటీ రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. -
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే లోక్ మంథన్
-
డివిడెండ్ చెల్లించిన ఎన్‌హెచ్‌డీసీ
భోపాల్ : హైడ్రోపవర్ మేజర్ నర్మదా జలవిద్యుత్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ ) మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించింది. సుమారు రూ 195. 87 కోట్ల డివిడెండ్ ను శుక్రవారం చెల్లించింది. ఈ డివిడెండ్ చెక్కును చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధీమన్ పారిజ్ నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి అప్పగించారు, ఒక అధికారి ఒకరు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ చెక్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుకుందని ఎన్‌హెచ్‌డీసీ సంస్థ అధికారి తెలిపారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, ఎన్‌హెచ్‌పీసీ భాగస్వామ్య సంస్థే ఎన్‌హెచ్‌డీసీ. భోపాల్ కేంద్రంగా 2000 సం.రంలో స్థాపించిన ఈ జాయింట్ వెంచర్ సంస్థ రాష్ట్రంలో హడ్రో పవర్ (జలశక్తి) ఇతర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి దిశగా పనిచేస్తుంది. -
సీఎం గారూ.. మీరు చూపిన బాటలోనే
యథా రాజా.. తథా అధికారగణం అన్నట్టుంది మధ్యప్రదేశ్‌లో వ్యవహారశైలి. ఇటీవల ఆ రాష్ట్రంలో వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోకాళ్లలోతు నీళ్లలో తడవకుండా ఉండేందుకు భద్రత సిబ్బంది ఇద్దరు చేతులపై ఆయనను ఎత్తుకుని తీసుకెళ్లారు. ఈ ఫొటో మీడియాలో రావడంతో శివరాజ్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీర్ ఒకరు సీఎం మాదిరిగా అదే పనిచేశారు. పన్నా జిల్లాలోని ఓ గ్రామానికి అధికారులు వెళ్లారు. అధికారులు అక్కడి గ్రామస్తులకు మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిందిగా సూచించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. సబ్ ఇంజనీర్ అరవింద్ త్రిపాఠి చేసిన నిర్వాకం విమర్శలపాలైంది. గ్రామ పర్యటనలో ఆ ఇంజినీర్‌కు ఓ మురికికాలువ ఎదురైంది. ఆయనకు ఆ కాలువలో దిగి వెళ్లేందుకు ఇబ్బందిగా అనిపించింది. ఇంకేముంది ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు పాపం ఫ్యాంటును పైకి ముడుచుకుని ఇంజినీర్గారిని వీపుపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. గొప్ప పనిచేశానని భావించాడేమో కానీ ఆ ఇంజినీర్ ఈ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇంజినీర్ ఊహించనివిధంగా మీడియాలో వార్తలు రావడం, నెటిజెన్లు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. షూస్, ఫ్యాంటు తడిసిపోతాయని ఇంజినీరే తనకు సాయం చేయాల్సిందిగా ఓ యువకుడి కోరాడని గ్రామస్తులు చెప్పారు. -
దర్యాప్తు ఆలస్యానికి కారణం ముఖ్యమంత్రే
భోపాల్: 'వ్యాపం కుంభకోణాన్ని మొదట గుర్తించిందే నేను. అడ్మిషన్లు, రిక్రూట్మెంట్లలో అవకతవకలు జరిగాయని తెలిసిన వెంటనే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించా' అంటూ నిన్నటివరకు చెప్పుకొచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాటలు పూర్తిగా అవాస్తవాలని తేలింది. కుంభకోణం సంగతి ఆయనకు ముందే తెలుసని, ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తుకు ఆదేశించడంలో ఆలస్యం చేశారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2007 నుంచి 2010 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు ఆధారాలని నాటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, నేటి ఆప్ నేత సక్లేచా ఆదివారం మీడియాకు చెప్పారుజ 'వ్యాపం ద్వారా నిర్వహించిన ప్రీ మెడికల్ టెస్టులో అక్రమాలు చోటుచేసుకున్నాయని 2009లో అసెంబ్లీ సాక్షిగా నేను ప్రశ్నించాను. వైద్య విద్యా శాఖ కూడా ఆయన వద్దే ఉన్నందున సీఎం చౌహాన్ నా ప్రశ్నకు.. 'ఆ విషయంపై సమగ్ర సమాచారాన్ని తెప్పిస్తున్నాం' అని బదులిచ్చారు. రెండేళ్ల తర్వాత మరో సభ్యుడు కూడా సభలో ఇలాంటి ప్రశ్నే లేవనెత్తాడు. అందుకు సీఎం చౌహానే మళ్లీ సమాధానమిస్తూ 'అక్రమాలకు పాల్పడిన విద్యార్థులు ఎవరనేది గుర్తించలేకపోయాం' అని సమాధానమిచ్చారు. మరో రెండేళ్లు గడిచిన తర్వాత, అంటే 2011 నవంబర్ 29 మాత్రం సీఎం సభలో ఒక ప్రకటన చేశారు. 'మొత్తం 114 మంది విద్యార్థులు అక్రమంగా అడ్మిషన్లు పొందారు' అని. రకరకాల సందర్భాల్లో సీఎం మాటలను పరిశీలిస్తే ఆయన కావాలనే కుంభకోణం వివరాలను బయటికి రానీయకుండా అడ్డుకున్నారని అర్ధమవుతుంది. తద్వారా దర్యాప్తు ఆలస్యానికి కారణం కూడా ఆయనే' అని సక్లేచా వివరించారు.