నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి | 85 year old grandmother application for liquor shop | Sakshi
Sakshi News home page

నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి

Published Tue, Oct 8 2024 1:03 PM | Last Updated on Tue, Oct 8 2024 3:42 PM

85 year old grandmother application for liquor shop

నాకూ మద్యం షాపు కావాలి

దరఖాస్తు చేయడానికి వచ్చిన 85ఏళ్ల బామ్మ

ఆశ్యర్యపోయిన ఎక్సైజ్ అధికారులు

బొబ్బిలి: ఆకలిగొన్న పులుల్లా మద్యం షాపు దక్కించుకోవడానికి అర్రులు చాస్తున్న సిండికేట్‌ వ్యాపారుల మధ్యలోని ఓ బామ్మ వచ్చి తనకూ మద్యం షాపు కావాలంటూ దరఖాస్తు చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది. మద్యం షాపు కోసం దరఖాస్తు చేయడానికి కార్యాలయానికి వచ్చిన ఓ వృద్ధురాలిని చూసిన ఎక్సైజ్ అధికారులు ముసిముసి నవ్వులు నవ్వుతూ ముక్కున వేలేసుకున్నారు. 

బొబ్బిలి ఎక్సైజ్ సర్కిల్‌ కార్యాలయంలో టెండర్‌ బాక్స్‌లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఓ బామ్మ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దత్తిరాజేరు మండలం పి.లింగాలవలసకు చెందిన పప్పల అచ్చయ్యమ్మ(85) ఎకై ్సజ్‌ అధికారులు నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతూ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. బొబ్బిలి కార్యాలయానికి సోమవారం సాయంత్రం వచ్చిన ఆ బామ్మకు ఓ బల్ల ఇచ్చి స్నాక్స్‌ ఇచ్చి ఎక్సైజ్ అధికారులు  కూడా మర్యాద చేయడం విశేషం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement