సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నూతన మద్యం విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే..
నూతన లిక్కర్ పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. నూతన మద్యం పాలసీపై మహిళలు భగ్గుమంటున్నారు. గాంధీ జయంతి రోజున రోడ్లపై ధర్నాలు చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
అయితే, 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా మద్యంపై పెత్తనం ప్రైవేట్ వ్యక్తులదే ఉండేది. పేరుకు టెండర్లయినా.. కొంతమంది చేతుల్లోనే వైన్‌షాపులుండేవి. బార్లు, వైన్‌షాపులన్న తేడా లేకుండా.. అంతా సిండికేట్‌గా మారిపోయేవారు. వారు నిర్ణయించిందే ధరకే అధికంగా వసూలు చేసేవారు. దాడులు చేసి, అక్రమ దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. మామ్మూళ్లకు అలవాటుపడి, చోద్యం చూసేవారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే.. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి సిండికేటుగాళ్లకు చెక్ పెట్టింది. ప్రైవేట్ వ్యక్తులకే మద్యం దుకాణాలను కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు మళ్లీ పాత విధానమే అమలులోకి రానుంది.
ఇదీ చదవండి: సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!
Comments
Please login to add a commentAdd a comment