జగనన్న అభిమానంలో తడిసి ముద్దయిన చిన్నారి.. | Little Girl Selfie With YS Jagan At Vijayawada Tour | Sakshi
Sakshi News home page

జగనన్న అభిమానంలో తడిసి ముద్దయిన చిన్నారి..

Published Tue, Feb 18 2025 3:30 PM | Last Updated on Tue, Feb 18 2025 7:17 PM

Little Girl Selfie With YS Jagan At Vijayawada Tour

విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy)..  విజయవాడ సబ్‌ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్‌ అయ్యారు. మంగళవారం విజయవాడ పర్యటనలో(Vijayawada Tour) భాగంగా వంశీని కలిసారు వైఎస్‌ జగన్‌.  తన అభిమాన నాయకుడు విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంలో అభిమాన సంద్రం ఎగిసిపడింది.  అయితే  ఓ చిన్నారి.. వైఎస్‌ జగన్‌ను కచ్చితంగా కలవాలనే అక్కడకు వచ్చింది.

తాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వైఎస్‌ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్‌ జగన్‌ సరే అనడంతో ఆ  చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది.  తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి.  జగనన‍్నతో   ఫోటోలు దిగిన క్రమంలో తెగ మురిసిపోయింది. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. 

జగనన్న ఉన్నప్పుడు రూ. 15 వేలు వచ్చేవి: చిన్నారి

‘జగనన్న నన్ను ఎత్తుకున్నప్పుడు  చాలా హ్యాపీగా ఫీలయ్యాను. జగనన్నను కలవడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. నన్ను ఎత్తుకుని ముద్దుపెట్టారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకైతే ఇది చాలు. జగనన్న సీఎంగా ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఎప్పుడైతే వీళ్లు(కూటమి ప్రభుత్వం) వచ్చారో ఇంట్లో ఇబ్బంది అవుతోంది. మాకు అమ్మ ఒడి రావడం లేదు. ఏదీ రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది. జగనన్న ఉన్నప్పుడు రూ. 15 వేలు వచ్చేవి. ఎటువంటి ఇబ్బందివ ఉండేది కాదు.. ఇప్పుడు అంతా ఇబ్బందిగానే ఉంది’ అని ఆ చిన్నారి తెలిపింది.
 

Little Girl: కల నెరవేరిన వేళ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement