vijayawada tour
-
జగనన్న అభిమానంలో తడిసి ముద్దయిన చిన్నారి..
విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy).. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు. మంగళవారం విజయవాడ పర్యటనలో(Vijayawada Tour) భాగంగా వంశీని కలిసారు వైఎస్ జగన్. తన అభిమాన నాయకుడు విజయవాడ పర్యటనకు వచ్చిన సందర్భంలో అభిమాన సంద్రం ఎగిసిపడింది. అయితే ఓ చిన్నారి.. వైఎస్ జగన్‌ను కచ్చితంగా కలవాలనే అక్కడకు వచ్చింది.తాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు.. వైఎస్ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్ జగన్ సరే అనడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది. తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి. జగనన్నతో ఫోటోలు దిగిన క్రమంలో తెగ మురిసిపోయింది. ఇప్పడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. జగనన్న ఉన్నప్పుడు రూ. 15 వేలు వచ్చేవి: చిన్నారి‘జగనన్న నన్ను ఎత్తుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. జగనన్నను కలవడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. నన్ను ఎత్తుకుని ముద్దుపెట్టారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకైతే ఇది చాలు. జగనన్న సీఎంగా ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఎప్పుడైతే వీళ్లు(కూటమి ప్రభుత్వం) వచ్చారో ఇంట్లో ఇబ్బంది అవుతోంది. మాకు అమ్మ ఒడి రావడం లేదు. ఏదీ రావడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది. జగనన్న ఉన్నప్పుడు రూ. 15 వేలు వచ్చేవి. ఎటువంటి ఇబ్బందివ ఉండేది కాదు.. ఇప్పుడు అంతా ఇబ్బందిగానే ఉంది’ అని ఆ చిన్నారి తెలిపింది. -
రిటైనింగ్ వాల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
CM YS Jagan Vijayawada Official Visit Updates ►శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నాం: సీఎం జగన్ రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదు రూ.369కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్ నిర్మాణం 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదు గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ మొదటి దశ పనులకు ప్రారంభోత్సవం చేసిన సీఎం పార్కుకు కృష్ణమ్మ జలవిహార్‌గా నామకరణం చేసిన సీఎం జగన్ ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సీఎం 12.4 కోట్లతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ ను తీర్చిదిద్దిన మున్సిపల్ అధికారులు మోడ్రన్ ఎంట్రీ ప్లాజా , వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ , చిన్నారులకు ఆటస్థలం , గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దిన అధికారులు ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగించనున్న రివర్ వ్యూ పార్క్ రిటైనింగ్ వాల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం రిటైనింగ్ వాల్స్ నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.369.89 కోట్లతో 80 వేల మంది ప్రజలకు ముంపు నుంచి విముక్తి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కేశినేని నాని,మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసిపి ఇంఛార్జి దేవినేని అవినాష్,ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,వెలంపల్లి శ్రీనివాస్,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్,రుహుల్లా, కల్పలతా రెడ్డి ,వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు,కార్పొరేటర్లు విజయవాడ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో రిటైనింగ్ వాల్, పార్కులను ప్రారంభం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం జగన్ సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణదీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. ముస్తాబైన రివర్ ఫ్రంట్ పార్కు కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు. 👉: నేడు సీఎం జగన్ ప్రారంభించనున్న రివర్ ఫ్రంట్ పార్కు (ఫొటోలు) -
సెమీ క్రిస్మస్ వేడుకలకు భారీ ఏర్పాట్లు
-
రేపు విజయవాడకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం) విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో, సీపీ కాంతిరానా టాటా పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ, దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి ఆలయాన్ని తీర్చి దిద్దుతాం. అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ రేపు ఉదయం శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలుగదు. నాలుగంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిద్ధం చేస్తున్నాం. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కొండచరియలు పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. నిరుపయోగంగా వదిలేసిన క్యూలైన్లకు, ర్యాంపు నిర్మించి ఉపయోగంలోకి తెస్తామని తెలిపారు. ‘‘ఎన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రికి రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్ల నిధులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు దేవస్థాన నిధులతో మోడరన్ ఇంద్రకీలాద్రిగా మారుతుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి పనులు జరుగు తాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మళ్లీ కూల్చటాలు ఉండవు. అభివృద్ధి పనులు అయ్యాక పరిస్థితి బట్టి ఘాట్ రోడ్‌పై నిర్ణయం తీసుకుంటాం. రేపు శంకుస్థాపన తర్వాత 18 నెలల్లోపు పనులు పూర్తవుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్ రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు. ‘‘మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశాం. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇంద్రధనస్సులా అందరం కలిసే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు.. మనందరిది. ప్రతి అడుగులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుని వెళ్తున్నాం. వివిధ పథకాల ద్వారా రూ. 2.5 లక్షల కోట్లకు పైగా నగదు అందజేశాం. చంద్రబాబు హయాంలో మైనార్టీల సంక్షేమానికి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మన ప్రభుత్వంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశాం. విజయవాడ నుంచి హజ్‌యాత్రకు వెళ్తే అవకాశం కల్పించాం. అదనపు భారం పడకుండా రూ.14 కోట్లు మన ప్రభుత్వం చెల్లించింది. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనం అందిస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా.. -
రాజ్యాంగం అణగారిక వర్గాలకు అండగా నిలిచింది: సీఎం జగన్
-
క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి గవర్నర్, సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారన్నారు. ‘‘భారత రాజ్యాంగం ఎంతో గొప్పది. అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అనేక కులాలు, మతాలతో మిళితమైనది మన దేశం. 72 ఏళ్లుగా ఈ రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచింది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌కు అంజలి ఘటిస్తున్నాం. 2023 ఏప్రిలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది. గ్రామ సచివాలయ వ్యవస్థతో మార్పులు తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏపీ. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలకు 50 శాతం ఇస్తున్న ప్రభుత్వం మనదే. అక్కాచెల్లెమ్మల పేర్లతోనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలతో తారతమ్యాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి మండలిలో 70 శాతం బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలే. స్పీకర్‌గా బీసీని, మండలి ఛైర్మన్‌గా ఎస్సీని, మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మైనారిటీ వ్యక్తిని నియమించాం’’ అని సీఎం అన్నారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమిత్ షా వద్ద ఏపీ నేతల ఆవేదన
విజయవాడ: టీడీపీతో పొత్తు వల్ల నష్టం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్ద వాపోయినట్టు సమాచారం. గురువారం విజయవాడ వచ్చిన అమిత్ షా రాష్ట్ర బీజేపీ నాయకులతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులు, పొత్తు గురించి తమ అభిప్రాయాలను అధినేతకు ఏపీ నేతలు విన్నవించారు. టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ నష్టపోతుందని ఎక్కువమంది నాయకులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. తమపై టీడీపీ నేతలు చేస్తున్న అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. నామినేటెడ్ పదవుల్లో వివక్ష, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతల అవినీతిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, ఈ సాయంత్రం సిద్ధార్థ కాలేజీలో బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం కానున్నారు. -
ఏపీలో జోనల్ విధానాల రద్దుకు యోచన!
-
ఏపీలో జోనల్ విధానాల రద్దుకు యోచన!
హైదరాబాద్: విజయవాడ వెళ్లేటప్పుడు స్టార్ హోటళ్లలో బస చేయొద్దని మంత్రులకు సూచించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వీలైనంత వరకూ ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక రాజధానికి వీలైనంత త్వరగా తరలిస్తామని వెల్లడించారు. రాజధాని తరలింపునకు ఎంత ఖర్చయినా వెనుకాడబోమని పేర్కొన్నారు. సున్నితంగా ఉద్యోగులకు ఇబ్బందులు లేకున్నా తరలింపు చేపడతామన్నారు. అద్దె భవనాలకు ఎంత చెల్లించాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరపనున్నట్టు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ విధానాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 371 డి ఆర్టికల్ సవరించాలని కేంద్రాన్ని ప్రభుత్వం తరఫున కోరుతాం. కొత్త రాజధానిలో అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వచ్చేలా జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి రాష్ట్రానికి జోనల్ వ్యవస్థ వర్తిస్తుంది. రాష్ట్రం విడిపోయింది. కనుక దీనిపై మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే వారికి కొన్ని వెసులుబాటులు కల్పించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అందుకోసం జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి' అని యనమల రామకృష్ణుడు అన్నారు. -
నేడు విజయవాడకు అమిత్ షా
* రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యం * రేపు రాష్ట్ర నేతలకు బీజేపీ అధ్యక్షుడి దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం ఆయన తొలిసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన అమిత్ షా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలు ముగించుకున్న అనంతరం గురువారం రాత్రి విజయవాడ చేరుకుంటారు. శుక్రవారం ఉదయం రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలతో, సాయంత్రం జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జీలు, జిల్లా పరిశీలకులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీ కీలక శక్తిగా తీర్చిదిద్దడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండడం, రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండడాన్ని ఆసరా చేసుకొని.. వీలైనంత మంది పేరున్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించనున్నారు. అమిత్ షా రాక సందర్భంగా పార్టీలో చేరికలపై పార్టీ నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి పర్యటనలో ఇతర పార్టీ నేతల చేరికలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక ఖరారు కాలేదని రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు చెబుతున్నారు. బీజేపీలో చేరికకు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అలాంటి నేతలందరూ అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటనలో చేరికలపై అమిత్‌షా పెద్దగా దృష్టి సారించడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలతో సమావేశం అనంతరం అమిత్ షా శుక్రవారం సాయంత్రం ఢిల్లీ తిరిగి వెళతారు. -
కేసీఆర్ విజయవాడ వస్తే.. తాటతీస్తాం: టీజీ వెంకటేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వస్తే ఆయన తాట తీస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేశ్ అన్నారు. విజయవాడలో సభ నిర్వహించి.. చంద్రబాబు రైతులను మోసగిస్తున్న వైనాన్ని ఆంధ్ర రైతులకు వివరిస్తానని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. విజయవాడతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో సమ్మర్, వింటర్ రాజధానులను ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానులను ఏర్పాటుచేయాలని, అవి లేని పక్షంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలవుతుందని టీజీ వెంకటేశ్ అన్నారు. తెలంగాణలో కూడా హైదరాబాద్ నగరంతో పాటు మరో రాజధాని అవసరమని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేసేలా ఉద్యమం కొనసాగిస్తామన్నారు. రెండు ప్రాంతాల్లో రాజధానుల కోసం జనవరిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల పోరాట వేదికను ఏర్పాటు చేస్తామని టీజీ వెంకటేశ్ చెప్పారు.