
అమిత్ షా వద్ద ఏపీ నేతల ఆవేదన
విజయవాడ: టీడీపీతో పొత్తు వల్ల నష్టం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్ద వాపోయినట్టు సమాచారం. గురువారం విజయవాడ వచ్చిన అమిత్ షా రాష్ట్ర బీజేపీ నాయకులతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులు, పొత్తు గురించి తమ అభిప్రాయాలను అధినేతకు ఏపీ నేతలు విన్నవించారు.
టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ నష్టపోతుందని ఎక్కువమంది నాయకులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. తమపై టీడీపీ నేతలు చేస్తున్న అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. నామినేటెడ్ పదవుల్లో వివక్ష, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతల అవినీతిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, ఈ సాయంత్రం సిద్ధార్థ కాలేజీలో బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం కానున్నారు.