CM YS Jagan Vijayawada Official Visit Updates
►శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్
ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నాం: సీఎం జగన్
- రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదు
- రూ.369కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్ నిర్మాణం
- 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదు
- గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం
కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ మొదటి దశ పనులకు ప్రారంభోత్సవం చేసిన సీఎం
- పార్కుకు కృష్ణమ్మ జలవిహార్‌గా నామకరణం చేసిన సీఎం జగన్
- ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సీఎం
- 12.4 కోట్లతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ ను తీర్చిదిద్దిన మున్సిపల్ అధికారులు
- మోడ్రన్ ఎంట్రీ ప్లాజా , వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ , చిన్నారులకు ఆటస్థలం , గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దిన అధికారులు
- ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగించనున్న రివర్ వ్యూ పార్క్
రిటైనింగ్ వాల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
- కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం
- రిటైనింగ్ వాల్స్ నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- రూ.369.89 కోట్లతో 80 వేల మంది ప్రజలకు ముంపు నుంచి విముక్తి
- కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కేశినేని నాని,మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసిపి ఇంఛార్జి దేవినేని అవినాష్,ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,వెలంపల్లి శ్రీనివాస్,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్,రుహుల్లా, కల్పలతా రెడ్డి ,వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు,కార్పొరేటర్లు
విజయవాడ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
- కాసేపట్లో రిటైనింగ్ వాల్, పార్కులను ప్రారంభం
- పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్
- అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం జగన్
- సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది.
- కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణదీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్‌గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు.
- నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది.
ముస్తాబైన రివర్ ఫ్రంట్ పార్కు
కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు.
👉: నేడు సీఎం జగన్ ప్రారంభించనున్న రివర్ ఫ్రంట్ పార్కు (ఫొటోలు)
Comments
Please login to add a commentAdd a comment