retaining wall
-
విశాఖ: ఆర్కే బీచ్‌లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్‌లో రిటైనింగ్ వాల్ కుప్పకూలిపోయింది. వర్షాల నేపథ్యంలో రిటైనింగ్ వాల్‌పై ‘సాక్షి’ పలుమార్లు హెచ్చరించినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.వివరాల ప్రకారం.. విశాఖలో భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అలాగే, ఇందిరా గాంధీ చిల్డ్రన్ పార్క్ సైతం దెబ్బతిన్నంది. గడిచిన పది రోజులుగా పెద్ద సాగర తీరం పెద్ద ఎత్తున కోతతకు గురవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సాక్షి టీవీ హెచ్చరించినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. -
మీవల్లే మేం క్షేమం..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టకపోయి ఉంటే తమ జీవితాలు పూర్తిగా అతలాకుతలమయ్యేవని విజయవాడ కృష్ణలంక ప్రాంత ప్రజలు మాజీ సీఎం వైఎస్‌కు చెప్పుకున్నారు. పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించేందుకు అక్కడ ఆగారు. దీంతో కృష్ణలంక, రాణిగారితోట, వారధి ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని వైఎస్ జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. మీరు చేసిన మంచి పనుల కారణంగా మీం ఈరోజు క్షేమంగా ఉన్నామని, మాకు వరద ప్రమాదం తప్పిందని.. లేదంటే సింగ్‌నగర్ ప్రజల్లా తమ జీవితాలు అతలాకుతలం అయ్యేవని చెప్పారు. ఈ సందర్భంగా వారంతా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో అండగా ఉంటాయని జగన్ వారికి భరోసా ఇచ్చారు. -
కృష్ణలంకలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
Krishna Floods: వరదల నుంచి కోట వంటి రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో చినుకు పడితే విజయవాడ కృష్ణలంక వాసులు వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోయేవారు. మోయగలిగినన్ని సామాన్లు సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పింది.గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత వల్ల నేడు 8లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా.. ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారు. గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలితే చాలు... కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదివెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసానినగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భూపే‹Ùగుప్తానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ ప్రాంతాలు నీటమునిగేవి.వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు 80వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిరి్మంచారు. ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కలి్పంచడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. -
‘సుంకిశాల’ నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తాడు
సాక్షి, హైదరాబాద్/పెద్దవూర: జంటనగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల వద్ద చేపడుతున్న ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువైనా చాలా దురదృష్టకరమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. పనులు పూర్తి కావడానికి రెండు నెలలు ఆలస్యమవుతుందని, ఎంతటి నష్టమైనా కాంట్రాక్టరే భరిస్తాడని, ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును కాంట్రాక్టర్ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. నీట మునిగిన సుంకిశాల పంప్‌హౌస్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలతో కలిసి పరిశీలించారు.అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. సుంకిశాల ప్రాజెక్టుకు ఈ పరిస్థితి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. సుంకిశాల ప్రాజెక్టును డిజైన్ చేసింది, కాంట్రాక్ట్ ఇచ్చింది. నిర్మాణం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీనే అని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు మొత్తుకుంటున్నారో అర్థం కావడం లేదని, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఈ పనులను ప్రారంభించటంలో మతలబు ఏమిటో వారే చెప్పాలన్నారు. శ్రీశైలం సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందేదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తీరుతామని చెప్పారు. సీఎంపై ఆరోపణలు సరికావు : గుత్తా సుంకిశాల ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యుడని రాజకీయ ఆరోపణలు కేటీఆర్ చేయడం సరికాదని, ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నంత మాత్రాన ఈ ఘటనకు సీఎం బాధ్యుడని అంటే ఎలా అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లోనే ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, ఎవరి కోసం చేపట్టాల్సి వచ్చిందో కేసీఆర్, కేటీఆర్‌లలో ఎవరి మానసపుత్రికనో వారికే తెలియాలన్నారు. గ్రావిటీ ద్వారా తాగునీరు అందిస్తాం : తుమ్మలప్రభుత్వంపై ఎత్తిపోతల భారం లేకుండా మిగిలి పోయిన 9.5 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండజిల్లాకు సాగునీటితో పాటు జంట నగరాలకు గ్రావిటీ ద్వారా తాగునీరు ఇవ్వ టానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వరద ఉధృతి ని ఏజెన్సీ ఊహించకపోవడం, త్వరగా పూర్తి చేయా లన్న తపనో, త్వరగా నీరు ఇవ్వాలన్న తాపత్ర యమో దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందన్నారు. రిపోర్టు రాగానే ఏంచర్యలు తీసుకో వాలి.. బాధ్యులు ఎవరనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. సుంకిశాలను సందర్శించిన వారిలో జలమండలి ఎండీ ఆశోక్‌రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజనీర్ల బృందం కూడా ఉంది.పునర్నిర్మాణ వ్యయం రూ.20 కోట్లపైనేరిటైనింగ్ వాల్ నిర్మాణ ఖర్చు భరించేందుకు కాంట్రాక్టర్ సంస్థ అంగీకరించనట్టు తెలి సింది. అయితే ఈ పనులకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం తగ్గిన తర్వాతనే దెబ్బతిన్న భాగాన్ని తిరిగి నిర్మించే అవకాశాలున్నాయి. సుంకిశాల ‘ఘటన’. రిటైనింగ్ వాల్ కూలిన వ్యవహారంలో గోప్యత ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పనుల నాణ్యతపై కూడా ఆరా తీస్తోంది. -
నీట మునిగిన సుంకిశాల పంప్‌హౌస్
సాక్షి, హైదరబాద్ /పెద్దవూర : సుంకిశాల వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్ నీటమునిగింది. సొరంగంలోకి నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటైనింగ్‌వాల్ ఒక్క సారిగా కుప్పకూలడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టు మారే సమయంలో ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన ఉదయం 6.30 గంటలకు జరిగినా అధికారులు బయటకు పొక్కనీయలేదు. కృష్ణానదికి వరద వస్తుందని అంచనా వేయకపోవడంతోనే...డెడ్ స్టోరేజీలో ఉన్న నాగార్జునసాగర్ జలాశయంలోకి వరద నీరు ఇప్పట్లో రాదనే ఆలోచనతోనే రెండోదశ సొరంగం పూర్తిస్థాయిలో ఓపెన్ చేసి పనులు చేపట్టినట్టు తెలిసింది. ఇంజినీర్ల అంచనాలోపంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. సాగర్ జలాశయానికి లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరు తున్న ఈ సమయంలో సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకుండా ఉండాల్సిందని నిపుణులు పేర్కొంటున్నారు. సొరంగంలోకి నీరు రాకుండా ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్, సొరంగంలో చేప డుతున్న బ్లాస్టింగ్‌కు దెబ్బతినడంతో పగుళ్లు వచ్చి వరద తాకిడికి ఒక్కసారిగా కూలిపోయిందంటు న్నారు. మరోవైపు రెండోదశ టన్నెల్లో రక్షణ గోడ వెనుక గేటు అమర్చిన అధికారులు పంప్‌హౌస్ స్లాబ్ పూర్తయిన తర్వాత దాని నుంచి గేటుకు టైబీమ్స్ నిర్మించాల్సి ఉందని, ఆ పనులు పూర్త యిన తర్వాత సొరంగాన్ని ఓపెన్ చేస్తే ఈ ప్రమా దం జరిగేది కాదని మరికొందరు అంటున్నారు. ఘటనపై గోప్యత ఎందుకు?ఘటన జరిగి వారంరోజులు గడిచినా విషయం బయటకు పొక్కకుండా అధికారులు ఎందుకు గోప్యత పాటించారనే ప్రశ్న తలెత్తుతోంది. మూడు షిఫ్టుల వారీగా కూలీలచే పనులు చేయించాల్సి ఉన్నా, రెండు షిఫ్టుల్లోనే పనులు చేపడుతున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఒక షిఫ్టు, సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు వరకు మరో షిఫ్టు చేయిస్తున్నారు. షిఫ్టు మారే సమయంలో కూలీలు అంతా బయటకు వెళుతున్న వేళ నీటి ఉధృతికి రక్షణ గోడ కూలిపోయి, గేట్లు అమర్చేందుకు సుమారు 40 అడుగులకుపైగా ఎత్తులో చేపట్టిన నిర్మాణం అంతా కూలిపోయింది. దీంతో మరో షిఫ్టులో పనికి రావాల్సిన కూలీలు ఇది చూస్తూ భయంతో కేకలు వేసినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. పనుల నాణ్యతపై అనుమానాలుపనులు పూర్తికాకముందే కాంక్రీట్ పిల్లర్లతో కూడిన నిర్మాణం పేకమేడలా కూలిపోయింది. అదే నిర్మాణం పూర్తయి మోటార్లు బిగించిన తర్వాత కూలిపోతే రూ.కోట్లలో నష్టం వాటిల్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. జలాశయ నీటిమట్టం 450 అడుగుల లోతుకు సమాన లోతులో తీసిన బావిచుట్టూ పెద్దరాయి ఉంది. నిర్మాణం చేసే సమయంలో కింది నుంచి పక్కనున్న రాయికి రంధ్రాలు చేసి కడ్డీలతో పిల్లర్లను జాయింట్ చేస్తూ నిర్మిస్తున్నారు. అయినా పనుల్లో నాణ్యత లేకపోవడంతోనే అంత ఎత్తులో ఉన్న నిర్మాణం వరద తాకిడికి కుప్పకూలిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారమైతే పనులు పూర్తయ్యేవి : ప్రాజెక్టు మేనేజర్ వారం రోజులైతే పనులు పూర్తయ్యేవని ప్రాజెక్టు మేనేజర్ నర్సిరెడ్డి తెలిపారు. జలాశయంలో నాలుగైదు మీటర్ల లోతు నీటిమట్టం తగ్గగానే రక్షణగోడ నిర్మించి పంప్‌హౌస్‌లో చేరిన నీటిని తొలగించే పనులు చేపడతామని చెప్పారు. విచారణకు కమిటీ ఏర్పాటు రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జలమండలిస్థాయిలో ఉన్నత ఇంజినీర్లతో ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా జలమండలి ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారు. కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ ప్రాజెక్టు ఉద్దేశం..నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీలో ఉన్నా జంట నగరాలకు భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు 2022 మే 14వ తేదీన నాటి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు శంకుస్థాపన చేశారు. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2035 నాటికి 47.71 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065నాటికి 67.71 టీఎంసీలు, సరిగ్గా 50 ఏళ్ల నాటికి 2072లో 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనాతో సుంకిశాల ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్‌ను ఎమర్జెన్సీ పంపింగ్ అనే సమస్య లేకుండా నిర్మిస్తున్నారు.. సుంకిశాల పాపం బీఆర్ఎస్దే: భట్టి విక్రమార్క‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంసహా కృష్ణా ప్రాజెక్టును వదల్లేదు. మేడిగడ్డ మాదిరే సుంకిశాలను మార్చేసింది. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గురువారం మింట్ కాంపౌండ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. జూలై 2023న టన్నెల్ సైడ్‌వాల్ పూర్తి చేసింది. ఇప్పటివరకు కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అని అనుకున్నాం. మిగిలినవి బాగా ఉన్నాయని భావించాం. తీరా సుంకిశాలను చూస్తే అన్నీ నాసిరకమైనవేనని అర్థమైంది. వారు గోదావరిని మాత్రమే కాదు కృష్ణాను కూడా వదిలిపెట్టలేదు. సుంకిశాల పాపం పూర్తిగా నాటి బీఆర్ఎస్దే. సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. దోషులు ఎవరో త్వరలోనే తేలుస్తాం’ అని డిప్యూటీ సీఎం అన్నారు.సుంకిశాల అవసరం లేదని ఆనాడే కేటీఆర్‌కు చెప్పా : గుత్తా హైదరాబాద్ జంట నగరాలకు నీరిచ్చేందుకు చేపట్టిన 1.5 టీఎంసీ సామర్థ్యం కలిగిన సుంకిశాల ప్రాజెక్టు అవసరం లేదని తాను ఆనాడే అనధికారికంగా కేటీఆర్‌కు చెప్పానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. -
కళ్లెదుటే అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కళ్లెదుటే ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా రాష్ట్రంలో కొంతమంది మాత్రం ఒప్పుకోవట్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. విజయవాడను గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఏకంగా రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కును మీ కళ్లెదుటే ప్రారంభించి పూర్తి చేశామని గుర్తు చేశారు. గత సర్కారు హయాంలో బెజవాడలో ఓ ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని దుస్థితి నెలకొనగా మనందరి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు నిర్మించామని చెప్పారు. మంగళవారం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, కృష్ణా రివర్ ఫ్రంట్ పార్కు (కృష్ణ జలవిహార్)లను ప్రారంభించారు. రూ.239 కోట్లతో నగరంలో ఐదు చోట్ల నిర్మించే మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. õవిజయవాడ పురపాలక సంస్థ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. కొందరు లబ్ధిదారులకు సీఎం జగన్ స్వయంగా వీటిని అందించారు. తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలను అందజేస్తున్న సీఎం జగన్, వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి 31,866 పట్టాల రెగ్యులరైజ్... ఈరోజు విజయవాడలో వివిధ కేటగిరీలకు సంబంధించి 31,866 పట్టాలను రెగ్యులరైజ్ చేసి ఆయా కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 22 ఏ కింద చేర్చడంతో హక్కులు లేక, రిజిస్ట్రేషన్ జరగక ఇబ్బంది పడుతున్న దాదాపు 21 వేల మంది వీరిలో ఉన్నారు. ఈ దుస్థితిని తొలగిస్తూ విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్‌లో 16 కాలనీల వాసులకు మంచి చేస్తున్నాం. భ్రమరాంబపురంలో ఇళ్లు కట్టుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు రెగ్యులరైజ్ కాకపోవడంతో అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్నట్లు అవినాష్ నా దృష్టికి తెచ్చాడు. వీటన్నింటికీ పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ జరుగుతోంది. ఎలాంటి వివాదాలు లేని 9,125 పట్టాలను కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కు విజయవాడలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేడ్కర్ పార్కుకు అందరి కళ్లెదుటే పునాది రాయి వేయడంతోపాటు ప్రారంభించటాన్ని కూడా చూశారు. గతంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి 58 నెలల వ్యవధిలో పెండింగ్ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో నిర్మించాం. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలిపితే ఇంకో ఫ్లై ఓవర్ కూడా సాకారమైంది. ఇవన్నీ మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. బెజవాడ ట్రాఫిక్ కష్టాలకు విముక్తి గుంటూరు నుంచి ట్రాఫిక్ విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కల్పిస్తూ కాజ నుంచి చిన్న అవుటపల్లి వైపు వెళ్లేలా చేపట్టిన ఔటర్ పనుల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. మరో రెండు నెలల్లో దీన్ని ప్రారంభించేలా పనులు జరుగుతున్నాయి. 58 నెలలుగా మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ ప్రతి అడుగూ అభివృద్ధి దిశగా వేస్తున్నాం. మనందరి ప్రభుత్వంలో స్కూళ్లు, హాస్పటళ్లు బాగుపడ్డాయి. గ్రామీణ స్థాయిలో వ్యవసాయం బాగుపడింది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా ఎప్పుడూ చూడని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క రూపాయి లంచం లేకుండా వివక్షకు తావులేకుండా అర్హులందరికీ పారదర్శకంగా మేలు చేస్తున్నాం. కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, కల్పలతారెడ్డి, మొండితోక అరుణకుమార్, రుహూల్లా ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి ఆసిఫ్, డీసీఎంఎస్ చైర్మన్ పడమట స్నిగ్థ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శశిభూషణ్, శ్రీలక్ష్మి, సీసీఎల్ఏ సాయిప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో భవాని శంకర్, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. రూ.500 కోట్లతో కరకట్ట గోడలు.. కృష్ణా నదికి వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా దాదాపు రూ.500 కోట్లతో కరకట్ట గోడలు నిర్మించాం. గతంలో వరద వస్తే కృష్ణలంక ప్రాంతం నీట మునిగేది. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు. ఇలా గోడ కట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. కృష్ణలంక ప్రాంతంలో అక్కచెల్లెమ్మలు, పిల్లలు, అవ్వలు, తాతలు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కు సుందరీకరణ పనులు చేపట్టాం. చిత్తశుద్ధితో నిర్మించారు వరద వచ్చినప్పుడల్లా మా ప్రాంతంలోని ఇళ్లు ముంపునకు గురయ్యేవి. దీన్ని పరిష్కరించేందుకు ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మించారు. వారధి దిగువనే కాకుండా, ఎగువన కూడా నిర్మించారు. ఎగువ ప్రాంతంలో పార్కు అభివృద్ధి చేస్తాననడం సంతోషంగా ఉంది. – కసగోని జ్యోతి, రణదివెనగర్ శాశ్వత పరిష్కారం లభించింది రాణిగారితోట తారకరామనగర్ కరకట్ట దిగువన కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాం. తుపానులు వచ్చినప్పుడల్లా తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లం. వరద ముంపునకు గురైన మా ప్రాంతాన్ని సీఎం జగన్ కళ్లారా చూసి చలించిపోయి గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోడ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించింది. – ఏలూరి వినయ్, తారకరామనగర్ సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం మేం 45 ఏళ్లుగా విజయవాడ నందమూరినగర్‌లో ఉంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఒక బీ–ఫారం పట్టా ఉన్న ఇల్లు కొనుక్కున్నాను. అయితే ఎప్పుడు ఎవరొచ్చి ఖాళీ చేయమంటారోనని నిత్యం భయంతో కాలం వెళ్లదీశాను. కంటి నిండా నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి తిండి ఉండేది కాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... పోయాయి. ఎప్పటి నుంచో అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ ఫలితం లేకుండా పోయింది. బీ–ఫారం పట్టాకు సంపూర్ణ భూ హక్కు పత్రాలను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – చోడవరపు దుర్గ, నందమూరినగర్, విజయవాడ -
విజయవాడలో సీఎం జగన్: కరకట్ట వాసుల చిరకాల కల సాకారం (ఫొటోలు)
-
ప్రతి అడుగులోనూ అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నానని, ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సీఎం ప్రారంభోత్సవం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ►ఈ రోజు విజయవాడలో మంచి కార్యక్రమాలు జరిగిస్తూ, మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ►ఈ రోజు విజయవాడలోనే 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. ►ఇందులో 22ఏ కింద పూర్తి హక్కులు లేక, రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపు 21వేల మంది.. విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్.. అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి ఇవన్నీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతోంది. ►అదేరకంగా 9,125 పట్టాలు అనబ్జెక్షబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి రెగ్యులరైజ్ జరుగుతోంది. ►దీనికి సంబంధించి అవినాశ్ చెబుతున్నాడు.. భ్రమరాంబపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఇబ్బందికర పరిస్థితుల్లో రెగ్యులరైజ్ కాక ఇళ్లు అక్కడే కట్టుకుని, దశాబ్దాలుగా ఉంటున్నపటికీ ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బందులు పడే పరిస్థితులను చెప్పాడు. ►అవన్నీ ఈరోజు పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ►మొత్తంగా దాదాపు 31866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ ఒకవైపు జరిగిస్తుండగా రూ.239 కోట్లకు సంబంధించిన రకరకాల ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. ►దీనివల్ల మురికినీళ్లు మన ఇంటి పక్కన రాకుండా వాటిని నీట్‌గా ట్రీట్ చేసేసి సీవేజ్ ట్రట్మెంట్ ప్లాన్స్ ను 5 ప్రాంతాల్లో తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్స్ రూ.239 కోట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ►ఇప్పుడు ఈ కరకట్ట వాల్‌ను మీరు చూస్తున్నారు. ఇటువైపున, అటువైపున ఈరెండు కరకట్ట గోడలు దాదాపు రూ.500 కోట్లతో గోడలుకట్టడమే కాకుండా కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతున్న పరిస్థితులు.. ►ఎప్పుడు వరదలు వచ్చినా ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పడమే కానీ, కచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలని అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోందని చెప్పడానికి సంతోషపడుతున్నా. ►కరకట్ట గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, తాతలు అందరూ ఆహ్లాదకరంగా సాయంత్రంపూట పార్కులో నడుచుకుని పోయేట్టుగా సుందరీకరణ చేస్తూ మంచి పార్కులు రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ►ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ల ఎదుటే ఫౌండేషన్ స్టోన్ వేయడం, ప్రారంభించడం కూడా చూశారు ►ఇంతకు ముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు పోవాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో కనిపిస్తాయి ►కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలుపుకొంటే ఇంకో ఫ్లై ఓవర్ ►ఇవన్నీ కూడా మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తాయి ►ఔటర్ రింగు రోడ్లు, కాజ నుంచి చిన్న ఔట్లపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా విజయవాడ నుంచి పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా అయిపోవచ్చింది. రెండు నెలల్లో ఓపెన్ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి ►ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నా ►ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేయిస్తున్నాం ►అటువైపున మన వ్యతిరేకులంతా ఏమీ చేయరుగానీ అభివృద్ధి అభివృద్ధి అంటారు ►ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్లు, మీ హాస్పటళ్లు బాగుపడ్డాయి ►గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ►వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇంటింటికీ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం, ఏ ఒక్క రూపాయీ లంచం లేకుండా జరిగిస్తున్న పాలన కేవలం ఈ 58 నెలల పాలనలోనే అని గమనించమని కోరుతున్నా ►వీటన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ కాస్త నేను రెండు మూడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను ►ఆ తర్వాత మీ ప్రాంతాలకు వచ్చి ఎవరెవరు పట్టాలివ్వాలో శ్రీను ఒక ఏరియాలోకి, అవినాశ్ ఒక ఏరియాలోకి, ఆసిఫ్ భాయ్ తన ఏరియాలోకి వచ్చి సచివాలయ పరిధిలో పంపిణీ చేసే కార్యక్రమం వాళ్లు దగ్గరుండి చేస్తారు ►దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా ►పార్కుకు కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెడదాం.. థ్యాంక్యూ ఇదీ చదవండి: రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని అడుగే ఇది -
రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కును సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు
-
ఇక వరద వచ్చినా భయం లేదు..!
-
వైఎస్సార్సీపీ నేతలతో సీఎం వైఎస్ జగన్ ఇంటరాక్షన్
-
రిటైనింగ్ వాల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
CM YS Jagan Vijayawada Official Visit Updates ►శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నాం: సీఎం జగన్ రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదు రూ.369కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్ నిర్మాణం 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదు గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ మొదటి దశ పనులకు ప్రారంభోత్సవం చేసిన సీఎం పార్కుకు కృష్ణమ్మ జలవిహార్‌గా నామకరణం చేసిన సీఎం జగన్ ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సీఎం 12.4 కోట్లతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ ను తీర్చిదిద్దిన మున్సిపల్ అధికారులు మోడ్రన్ ఎంట్రీ ప్లాజా , వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ , చిన్నారులకు ఆటస్థలం , గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దిన అధికారులు ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగించనున్న రివర్ వ్యూ పార్క్ రిటైనింగ్ వాల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం రిటైనింగ్ వాల్స్ నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.369.89 కోట్లతో 80 వేల మంది ప్రజలకు ముంపు నుంచి విముక్తి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కేశినేని నాని,మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసిపి ఇంఛార్జి దేవినేని అవినాష్,ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,వెలంపల్లి శ్రీనివాస్,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్,రుహుల్లా, కల్పలతా రెడ్డి ,వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు,కార్పొరేటర్లు విజయవాడ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో రిటైనింగ్ వాల్, పార్కులను ప్రారంభం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ అనంతరం పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం జగన్ సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణదీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. ముస్తాబైన రివర్ ఫ్రంట్ పార్కు కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు. 👉: నేడు సీఎం జగన్ ప్రారంభించనున్న రివర్ ఫ్రంట్ పార్కు (ఫొటోలు) -
ముంపు ప్రాంతానికి రక్షణ కవచం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మంగళవారం జాతికి అంకితం చేసి, రివర్‌ఫ్రంట్ పార్కును ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ముంపు సమస్య నగరంలో కృష్ణా నది దిగువన ఉన్న ఈ కాలనీలకు ముంపు సమస్య దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక రణ«దీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్ ప్రాంతాలు ముంపుకు గురయ్యేవి. వాటిలో తారకరామనగర్, రణ«దీర్‌నగర్, భూపేష్ గుప్తా కాలనీలు 3 లక్షల క్యూసెక్కులు వరదకే మునిగిపోయేవి. పోలీస్‌కాలనీ, రామలింగేశ్వర్‌నగర్ తదితర ప్రాంతాలు ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే ముంపునకు గురయ్యేవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా ఈ సమస్యపై దృష్టి సారించారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని తలంచారు. తొలి విడతగా రూ. 100 కోట్లు కూడా మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, తూతూమంత్రంగా నాసిరకంగా చేశారు. దీంతో చిన్నపాటి వరదకే కాలనీలన్నీ మునిగిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటిష్టమైన రక్షణ గోడ నిర్మించి, ఈ కాలనీలకు వరద నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో దశలో రూ. 134.43 కోట్లు వెచ్చించి కోటినగర్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రిటైనింగ్ వాల్ నిర్మించారు. అంతేకాకుండా కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతంలో పద్మావతి ఘాట్ నుంచి వారధి వరకు మూడో దశలో రూ.235.46 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించారు. ముస్తాబైన రివర్ ఫ్రంట్ పార్కు కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు. ముంపు సమస్యకు పరిష్కారం ఒకప్పుడు కృష్ణానదికి వరద వచ్చిందంటే కరకట్ట ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యేవారు. ఇళ్లను కాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది. ఎంతో మంది పాలకులు వచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రిటైనింగ్ వాల్‌ను చిత్తశుద్ధితో పూర్తి చేశారు. తొలుత వారధి దిగువన నిర్మాణం చేపట్టారు. హామీ ఇవ్వని ఎగువ ప్రాంతంలో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. అంతే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కును సైతం ఏర్పాటు చేశారు. – దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు ఇన్చార్జి వరద ప్రాంతాలకు రక్ష కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరద ముంపుకు గురికాకుండా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. రూ. 369.89 కోట్లతో రెండు దశల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాలైన రణధీర్‌నగర్, భూపేష్గుప్తా నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాలకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు కృష్ణా నదికి వరద వచ్చినా ముంపు సమస్య ఉండదు. అంతే కాకుండా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కును కూడా అభివృద్ధి చేశాం. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు.– ఎస్ డిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ -
విజయవాడ ప్రజలకు శుభవార్త కృష్ణానది ఒడ్డున రక్షణ గోడ
-
నాలుగు దశాబ్దాల కల సాకారం.. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివసించే వేలాది కుటుంబాల ముంపు కష్టాలు తొలగిపోయాయి. నాలుగు దశాబ్దాల చిరకాల కల సాకారమైది. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్ల వ్యయ అంచనాతో చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఆ ప్రాంత వాసులు వేలాది మంది శనివారం సంబరాలు జరుపుకున్నారు. కనకదుర్గ వారధి దిగువ శంకుస్థాపన ఫలకం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆకాశంలోకి బెలూన్లు ఎగురవేసి, కేక్ కోశారు. ముఖ్యఅతిథి వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి అవినాష్ మాట్లాడుతూ వరద ముంపు వాసుల కష్టాలు స్వయంగా చూసిన సీఎం వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి గొప్ప మనస్సు చాటుకున్నారన్నారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలా హామీలిచ్చి గాలికొదిలేయకుండా ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసి, పనులను గడువు కంటే ఆరు నెలల ముందే పూర్తి చేశారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో రామలింగేశ్వరనగర్, భూపేష్గుప్తానగర్ ప్రజల కష్టాలు తొలగిపోయాయన్నారు. (చదవండి: ఏం తమాషాగా ఉందా.. పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్ బాబు..) నాడు టీడీపీ.. నిధుల స్వాహా! నాటి టీడీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిటైనింగ్ వాల్ పేరుతో నిధులు స్వాహా చేసి, బినామీలతో నాసిరకం రిటైనింగ్ వాల్ నిర్మించారని ఆరోపించారు. దీంతో వరద ముంపు ఎక్కువైందన్నారు. వందలాది ఇళ్లను తొలగించేలా వారు ప్రణాళికలు సిద్ధం చేశారని అవినాష్ ఆరోపించారు. కానీ సీఎం జగన్ కేవలం నిర్మాణ ప్రాంతంలోని ఇళ్లను మాత్రమే తొలగించి, వారికి అన్ని సౌకర్యాలతో మరోచోట ఉచితంగా ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. రిటైనింగ్ వాల్ పనులు పూర్తికావడంతో సందడి చేస్తున్న స్థానికులు కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్లు తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వీఎంసీలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి , టి. కొండారెడ్డి, మెరకనపల్లి మాధురి, రెహానా నాహీద్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం, పార్టీ నాయకుడు దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు’.. అనురాగ్ ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి) -
ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం...
సాక్షి, నిజామాబాద్: ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ డ్రైనేజీ మరమ్మతులు చేస్తుండగా రైల్వే ప్రహరీ గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మట్టిలో మృత దేహాలు కూరుకుపోవడంతో జేసీబీ, ఫైర్ ఇంజన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మహారాష్ట్రలోని చంద్రపూర్‌క్ చెందిన కిషోర్, బాదల్‌గా గుర్తించారు. చదవండి: విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
విజయవాడ రిటైనింగ్ వాల్‌కు సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన
-
విజయవాడ రిటైనింగ్ వాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విజయవాడ : విజయవాడ తూర్పు నియోజకవర్గవాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. దీంతో కృష్ణా నది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. కాగా 125 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు, పేర్ని వెంకట్రామయ్య, అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, జే శ్యామలరావు, కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరిమున్నీసా, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, మొండితోక జగన్మోహనరావు, అబ్బాయి చౌదరి, కె.పార్థసారథి, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, సింహాద్రి రమేష్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎంపీ నందిగామ సురేష్, మహిళా కార్పొరేషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గౌతమ్ రెడ్డి,స్థానిక కార్పోరేటర్ పుప్పాల కుమారి, స్థానిక నేతలు దేవినేని అవినాష్, పీవీపీ, బొప్పన భవకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు రిటైనింగ్ వాల్ నిర్మాణం ఇలా.. ► విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు 1.5 కి.మీ పొడవునా ఫ్లడ్ ప్రొటెక్షన్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. ► నదికి భారీ వరదలు వచ్చినప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్‌కు రూపకల్పన చేశారు. ► ఇందులో భాగంగా మూడు అడుగుల వ్యాసంలో 18 మీటర్ల లోతుకు పైల్, రాఫ్ట్ పునాదులపై 8.9 మీటర్ల ఎత్తులో 1.5 కి.మీ పొడవునా కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నారు. వైఎస్సార్ సంకల్పమే.. కాగా, 2009లో కృష్ణా నదికి వరదలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విజయవాడ వచ్చి ఫ్లడ్ రిటైనింగ్ వాల్ మంజూరు చేశారు. అప్పట్లో యనమలకుదురు నుంచి కోటినగర్ వరకు ఈ వాల్ నిర్మించారు. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం కరకట్ట (వారధి) నుంచి కోటినగర్ వరకు ఫ్ల్లడ్ రిటైనింగ్ వాల్‌ను నిర్మించనున్నారు. చదవండి: మధ్య తరగతికి శుభవార్త.. సరసమైన ధరలకు ఇంటి స్థలాలు -
రేపు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గవాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రేపు(బుధవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను మంత్రులు పేర్నినాని, కొడాలి నాని పరిశీలించారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు రిటైనింగ్‌వాల్ నిర్మాణం మరో నిదర్శనమని పేర్కొన్నారు. నిర్వాసితులను ఇబ్బందిపెట్టకుండా రిటైనింగ్‌వాల్ నిర్మాణం జరగబోతోందన్నారు. కృష్ణలంకకు ఇక వరద కష్టం ఉండకూడదన్నదే సీఎం జగన్ ఉద్దేశమని పేర్ని నాని పేర్కొన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ -
తీరనున్న కృష్ణలంక వాసుల వరద కష్టాలు
సాక్షి, విజయవాడ: కృష్ణలంక వాసుల వరద కష్టాలు తీరనున్నాయి. రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ ఇంతియాజ్, సీపీ బత్తిన శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇరిగేషన్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కృష్ణలంక వాసుల ఇబ్బందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీరుస్తుందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. కరకట్ట వాసులకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, గత టీడీపీ చేయలేని పనిని తాము చేసి చూపిస్తామన్నారు. విజయవాడ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. దాదాపు రూ.125 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే విష్ణు తెలిపారు. చదవండి: సుంకరిపేట ప్రమాదంపై సీఎం జగన్ ఆరా బురిడీ మాష్టారు.. బండారం బట్టబయలు -
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ దుస్థితి: దేవినేని
సాక్షి, కృష్ణా: గత ప్రభుత్వం కట్టిన రిటైనింగ్ వాల్ నిరుపయోగంగా మారిందని, నిర్మాణం నాసిరకంగా కట్టడం వల్ల ఈ రోజు వాల్ ఉన్నా నీళ్లు లోపలకు వస్తున్నాయని వెఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలకు విజయవాడలో నీటమునిగిన కృష్ణలంక ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో నీటి మునిగిన 15వ డివిజన్లో పర్యటించిన దేవినేని మీడియోతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి చేరుతుందని, బ్యారేజ్ నుంచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారని తెలిపారు. క్రమంగా వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత పాలకులు నిర్లక్ష్యంతో రిటైనింగ్ వాల్ నిర్మాణం సగంలో ఆపేశారని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం సగంలో ఆపడం కారణంగానే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. స్థానిక ఎమ్యెల్యే మాటలు తప్ప ఎక్కడ చేతలు కనబడవని, రిటైనింగ్ వాల్ నిర్మాణం కచ్చితంగా ప్రభుత్వం చేసి తీరుతుందని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాల్ నిర్మాణానికి డబ్బులు కేటాయించారని గుర్తు చేశారు. త్వరలోనే వాల్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలను వరద కష్టాల నుంచి తప్పిస్తామని తెలిపారు. సహయక చర్యల్లో కార్యకర్తలు అందరూ ప్రజలకు తోడు ఉండాలని దేవినేని కోరారు. -
కృష్ణలంకలో రిటైనింగ్ వాల్‌కు రూ.126 కోట్లు కేటాయింపు
-
‘సీఎం జగన్ మాట ఇస్తే తప్పరు’
సాక్షి, విజయవాడ : వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే కృష్ణలంకలో రిటైనింగ్‌వాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.126 కోట్లు కేటాయించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాల్ నిర్మాణానికి ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.126 కోట్లు కేటాయించినందుకుగాను కృష్ణలంక ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ ‘కృతజ్ఞత’ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు కృష్ణలంక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ నగరాన్ని సీఎం జగన్ అన్ని విధాల ఆదుకుంటారని హామీ ఇచ్చారు. టీడీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తున్నామని, రాని వారు ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు : బొత్స ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలు సురక్షితంగా ఉండేందుకే రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి బారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. కృష్ణలంక ప్రజల ఇబ్బందిని గుర్తించిన సీఎం జగన్.. రిటైనింగ్ వాల్ కోసం వెంటనే రూ.126 కోట్లు కేటాయించారన్నారు. అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్‌కు ప్రజల అశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అమ్మఒడి ద్వారా ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలు వేశామన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం దశాబ్ధాలుగా కృష్ణ లంక లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నిధులు కేటాయించినందుకు సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణ లంక లోతట్టు ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రూ. 126 కోట్లు కేటాయించారు. ఆయనకు కృష్ణలంక ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. పింఛన్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయని అన్నారు. -
వర్షానికి కూలిన ఔటర్ రింగ్ రోడ్డు రిటెయినింగ్ వాల్
హైదరాబాద్ : భారీ వర్షానికి ఔటర్ రింగ్ రోడ్డు రిటెయినింగ్ వాల్ కూలిన సంఘటన కోకాపేట వద్ద జరిగింది. గురువారం సిటీలో కురిసిన భారీ వర్షానికి కోకాపేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డు రిటెయినింగ్ వాల్ కూలిపోయింది. అలాగే సిటీలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. గోల్కొండలో ఇరవై ఇళ్లల్లో వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.